ఏప్రిల్ బ్లాగు విశేషాలు

-చదువరి

ఏప్రిల్‌లో బ్లాగుల్లో బాగా నలిగిన మాట జీవిత పరమార్థం. మూమెంట్ ఆఫ్ క్లారిటీ అంటూ కొత్తపాళీ రాసిన జాబు బ్లాగరుల్లో మేథోమథనాన్నే కలిగించింది. వ్యాఖ్యల పరంగా 40 వ్యాఖ్యలతో ఇదొక రికార్డు. స్పందన పూర్వక జాబుల పరంగా ఇదొక సంచలనం. దీనిపై వచ్చిన స్పందనల్లో కొన్ని:

  1. నాకు ఏమీ తెలియదని తెలుసుకోగలిగాను అంటూ విశాఖతీరాన మొదలైంది స్పందన.
  2. నేను నా వాళ్ళు, ఇదేనా జీవితం…” అంటూ డా. రామ్స్ రాసారు.
  3. అర్దం, పరమార్దం – అపార్దం అంటూ “..ఉబుసుపోక..” లో రాసారు
  4. జీవిత పరమార్థం ఏమిటి? అంటూ నాగరాజా తెలుగునేలలో తర్కించారు
  5. దైవానిక జోరుగా హుషారుగా రాసారు
  6. జి.ఎస్.నవీన్ ఆనందానికి 10 సూత్రాలు అంటూ రాసారు.

ప్రస్తుతం పత్రికా యుద్ధం జరుగుతోంది. గతంలో ఇలా యుద్ధాలు జరిగేవి కావు.. ఒకవేళ జరిగినా అవి ప్రచ్ఛన్న యుద్ధాలే. ఇప్పుడు మాత్రం ఒక దానిపై ఒకటి దుమ్మెత్తిపోసుకోవడం చూస్తున్నాం. ఇది ప్రత్యక్ష యుద్ధం. ఈ భాగోతంపై బ్లాగరుల స్పందనలు చూడండి:


సర్వధారి ఉగాది వేడుకలు:
భువన విజయం పేరిట పొద్దు చేసిన పద్యాల సందడితో పాటు బ్లాగరులు కూడా యథాశక్తి కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. ప్రవీణ్ బ్లాగు పుస్తకాన్ని విడుదల చేసి పండగ చేసారు. తెలుగు బ్లాగుల్లోని ఉత్తమమైన జాబులను ఒకచో చేర్చి, కుట్టిన ఈ పుస్తకం ప్రశంసనీయంగా ఉంది. దీనికి కర్త, కర్మ, క్రియ ఐన ప్రవీణ్‌కు అభినందనలు. సహకరించిన బ్లాగరులకు కూడా అభినందనలు. సాటి బ్లాగరులు ఆ పుస్తకాన్ని ఆనందంగా స్వాగతించారు.

తెలుగు బ్లాగులకు ఇది వివాదాలు, చర్చల నెల. చిన్నాచితకా తగువులు, టీకప్పులో తుపానులు, గాలిదుమారాలు, వ్యాఖ్యల వడగాడ్పులు, కొండొకచో తేలికపాటి వానలు, .. ఇలాగ వాతావరణం మారుతూ వచ్చింది. తెలుగు బ్లాగు చదువరులకు మంచి కాలక్షేపాన్నందించిందీ నెల. ఆ వివాదాల్లో కొన్ని:

  • పుస్తకాలు చదవకండి అంటూ నెటిజెన్ జాబు రాసారు. ఇది కొందరు బ్లాగరులకు కోపం తెప్పించింది. ఈ జాబుకు వ్యాఖ్య రాస్తూ సుజాత తన నిరసనను నేరుగానే తెలియజేసారు. పత్రికలూ బ్లాగులూ రచయితలూ అనే జాబులో కస్తూరి మురళీకృష్ణ తన వాదనను రాసారు.
  • గట్టిగా చర్చ జరిగిన బ్లాగు: ప్రేమ ఉన్మాదం అని కాలాస్త్రి బ్లాగులోని జాబుపై పెద్ద చర్చ జరిగింది. ప్రేమోన్మాదంతో చంపడానికి తెగబడిన సంఘటనలపై ఈ జాబును శ్రీ రాసారు. దీనిపై మంచి చర్చే జరిగింది. చర్చలో పాల్గొన్నవారందరూ వాదనలపై వాదనలు విసురుకున్నప్పటికీ… అందరి వాదనలూ సరైనవే కావటం ఈ చర్చలోని విశేషం.ఇదే విషయంపై వచ్చిన మరికొన్ని జాబులు:
  • వేరే బ్లాగులో రాసిన ఒక వ్యాఖ్యపై స్పందనగా చక్రవర్తి రాసిన ఒక జాబు ఓ చిన్నపాటి చర్చను లేవనెత్తింది.

మరికొన్ని బ్లాగు విశేషాలు:

  • ఇకపై బ్లాగరులు తమ బ్లాగు వీలునామాలు కూడా రాయవచ్చు. ఆ సంగతేంటో చూడండి.
  • తెలుగువాడి పత్రికా హక్కు గురించి అరుణ్ కుమార్ రాసారు.
  • కొత్తపాళీ కథాకేళిలో లేటుగా పాల్గొన్న రాయలు, తెల్లకాగితంపై ఓ కథ రాసారు.
  • “క్రేజీ కాంబినేషన”నేది, “డిఫరెంటు” లాంటి బబుల్‌గమ్ మాట. తెలుగు సినిమాజనం ఈ మాటలని బాగా అరగదీసేసి, ఇవంటేనే, ఈ మాటలు వింటేనే మనకు కంపరం కలిగేలా చేసారు. అయితే, క్రేజీ కాంబినేషన్లని పేరుపెట్టి జ్యోతి ఓ జాబు రాసి ఆ మాటచేత ఒక కొత్త పాత్ర వేయించి, దానికో విలువను ఆపాదించారు. అది చదివిన వారికి జఠరాగ్నిలో ఆజ్యం పోసినట్టైంది.
  • తేటగీతి అనే పేరు తన బ్లాగుకు పెట్టుకుని, పద్యాలు రాయకపోతే బాగుండదనుకున్నారేమో.. మురళి పద్యాలు వర్షించటం మొదలుపెట్టారు. ఛందో నియమాలకు పూర్తిగా లోబడనప్పటికీ, పద్యాల అర్థాలు అలరిస్తున్నాయి. కొత్తపాళీ వీటిని ప్రశంసించారు. ఇంకా ఇతర కవుల దృష్టి వీటిపై పడినట్టులేదు.
  • తెలుగు జాతి ఉన్నంత కాలం నిలిచివుండే చిరంజీవులు వీరు అంటూ తనకు నచ్చిన పదిమందిని మేటి దీవిటీలుగా ఎంచి, వారి గురించి పద్యాలని రాసే ప్రయత్నం చదువరి మొదలు పెట్టారు. ఆ వరసలో మొదటి దివిటీ వేమన.

హాస్యం, వ్యంగ్యం:

  • విహారి రాసిన అయాం నాటే లెజెండ్ చూడండి. జీవితం మన్మొహన్ సింగు లాగా నడుస్తోంది నా ప్రమేయమేమీ లేకుండా వంటి మెరుపులున్నాయి ఈ జాబులో.
  • ప్రవీణ్ మీరు సినిమాలు చూస్తారా.. మీదేటైపో అంటూ సినిమా ప్రేక్షకులను వర్గీకరించారు.
  • అన్వేషి రాసిన క్రికెట్టోపాఖ్యానంలో క్రికెట్ ప్రేక్షకులను వర్గీకరించారు. తెలుగు సినిమా దర్శకుడి లాగా ప్రవీణ్ బ్లాగును అనుకరిస్తున్నానని చెప్పుకున్నా.., ఈ జాబు ఎంతో సృజనాత్మకంగా ఉంది.

ఇతర సాహిత్య ప్రక్రియలు:

  • బుసాని పృథ్వీరాజ్‌వర్మ రాస్తున్న కవితల బ్లాగు చూసారా? కవితల బ్లాగుల్లో కవితకు జోడీగా బొమ్మలు పెట్టడం చూస్తూంటాం. ఈ బ్లాగులో ప్రత్యేకత ఏంటంటే ఆ బొమ్మల్ను బ్లాగరి స్వయంగా వేసినవే కావడం. బొమ్మలు చక్కగా వేస్తారు. ప్రముఖుల బొమ్మలు కూడా వేస్తారు. వాటి కంటే ఫిక్షను బొమ్మలే బాగుంటాయి, భావస్ఫోరకంగానూ ఉంటాయి. మచ్చుకు ప్రేమపిలుపు అనే జాబులో వేసిన బొమ్మ చూడండి. కవి బ్లాగరుల దృష్టికి ఇంకా ఈ బ్లాగు, ముఖ్యంగా ఈ జాబు వచ్చినట్టు లేదు.మామూలుగా కవులు విరహ తాపం గురించి రాస్తూంటారు. అయితే, ఈ కవితలో విరహ జల్లులున్నాయి!
  • నీతోనెట్టేటె పిల్లా.. అంటూ సాహితీఝరిలో అంటున్నారు భావకుడన్
  • రామ పదాబ్జముల్ అంటూ రానారె ఇచ్చిన ఒక సమస్యకు చక్కటి పూరణలు వచ్చాయి.

కొత్త బ్లాగులు:

  • చెన్నే కొత్తపల్లి బడి కబుర్లు చెబుతూ నారాయణశర్మ గారు బ్లాగు మొదలుపెట్టారు. ఆ బడి సంగతేంటో తెలుసుకోండి.
  • డా.రామ్‌స్ అంటూ డాలరు గుర్తుతో ఒక బ్లాగు దూసుకొచ్చింది ఈ నెల్లో. బ్లాగరులకు పావలా వడ్డీకే రుణాలు అంటూ వచ్చేసారీ డాక్టరు గారు.
  • యవ్వనపు డైరీ రాస్తున్నారు వెంకట్. ఆయన స్నేహితుడు, ఆయన -ఇద్దరూ బీర్‌బలులేనని తెలిసింది. వెంకట్ స్నేహితుడు గిరీష్ లోకం ఇది. ఈ బ్లాగు మార్చి ఆఖరులో మొదలైంది.
  • జంబలకిడిపంబ అంటూ బ్లాగరులపై విమర్శలతో వచ్చిందీ బ్లాగు; ఆనందం రాస్తున్నారు.
  • తెలుగు పోయెమ్స్ అంటూ విశ్వామిత్ర ఓ కవిత్వ బ్లాగు మొదలుపెట్టారు. ఒక్క రోజునే పాతిక దాకా కవితలను బ్లాగుకెక్కించారు. కారాలెక్కువైన వంటలు తిని ఇలా.. “కారం కలవని (నా) కడుపున చెరువైనా తవ్వరే” అంటూ వాపోయారు
  • సాహితీయానం చేస్తూ బొల్లోజు అహ్మదాలీ బాబా బ్లాగులోకంలోకి వచ్చేసారు. వీరు బ్లాగు రాయడమే గాక, అనేక బ్లాగులను పరిశీలనగా చదివి, సునిశిత వ్యాఖ్యలు కూడా చేసారు.
  • కలువరేకులతో శ్వేత బ్లాగు ప్రవేశం చేసారు.

—————

చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

Posted in జాలవీక్షణం | Tagged , , | 5 Comments

నా చిన్నప్పుడు – సత్యజిత్ రాయ్

-వి.బి.సౌమ్య

“చైల్డ్‌హుడ్ డేస్” అన్నది ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రాయ్ చిన్నప్పటి అనుభవాల సంకలనం. ఈ చిన్న పుస్తకంలో రెండుభాగాలు – మొదటిభాగం చిన్ననాటి రోజుల జ్ఞాపకాలు. రెండో భాగం ఆయన సినిమాలు తీస్తున్నప్పటి అనుభవాలు – మేకింగ్ మూవీస్. ఈ పుస్తకం – అభిమానులకైతే చదివి తీరవలసినదీ, ఇతరులకి – ‘చదివితే పోయేదేం లేదు..తెలిసేదే తప్ప’ అన్న తరహా పుస్తకం. దీన్ని సత్యజిత్ రాయ్ బెంగాలీ లో “సందేశ్” పత్రిక కోసం రాసారు. తానే ఆంగ్లానువాదం చేద్దాం అనుకున్నా కూడా, ఆరోగ్య కారణాల దృష్ట్యా చేయలేకపోయారు. దానితో ఆయన సతీమణి బిజొయా రాయ్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. పుస్తకం మధ్యలో అక్కడక్కడా ఉన్న బొమ్మలు సత్యజిత్ రాయ్ గీసినవే. పుస్తకానికి రాసిన పరిచయ వాక్యాల్లోనే బిజొయ తనకూ, సత్యజిత్ రాయ్ కి ఉన్న అనుబంధం గురించి చెబుతూ సత్యజిత్ రాయ్ వ్యక్తిత్వాన్ని కూడా కొంతవరకూ మనముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇంతకీ, నాకు కొత్తగా తెలిసిన విషయం ఏమిటీ అంటే -వీళ్ళిద్దరూ బాల్య స్నేహితులని. పరిచయంలోనే వీళ్ళిద్దరి మధ్యా చిన్నప్పుడు వాళ్ళ బంధువు ఒకావిడ (కనక్ బిశ్వాస్ అన్న గాయని – రాయ్ కి పిన్ని ఔతారు) బొమ్మలు గీసే పోటీ ఒకటి పెడతారు. రాయ్ బిజొయా కంటే మూడేళ్ళు చిన్న. ఆ పోటీ జరిగినప్పుడు ఐదేళ్ళు రాయ్ కి. కానీ, రాయ్ బొమ్మ ఎంతబాగా గీశారో బిజొయా వర్ణన వింటేనే అర్థమౌతుంది – పువ్వు పుట్టినరోజు నుండే పరిమళాలు వెదజల్లింది అని. నిజానికి బిజొయాకి అంతకు కొద్దిరోజుల ముందే చిత్రలేఖనంలో బహుమతి కూడా రావడంతో, గెలుపు తనదేననే ధీమా కూడా ఉంటుంది. కానీ, ఆ పోటీలో గెలిచేది మాత్రం సత్యజిత్ రాయ్. ఆ సంఘటన రాస్తున్నప్పుడు ఆవిడకి గతం గుర్తుకు వచ్చి ఏమనిపించిందో మరి!

“చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఏవి మనకు గుర్తుండిపోతాయో…ఏవి మనం మరిచిపోతామో అన్నది చెప్పడం కష్టం..” అన్న వాక్యంతో మొదలౌతుంది ఈ పుస్తకంలోని మొదటి ఛాప్టర్. అక్కడ్నుంచి సత్యజిత్ బాల్యంలోకి మన ప్రయాణం మొదలు. మొదట ఆయన ఆ ఊరు ఎంతలా మారిపోయిందో చెప్పడంతో మొదలుపెడతారు. పాతవి వెళ్ళడం-కొత్తవి రావడం గురించి చెబుతూ ఉంటారు… ఓపెన్ టాప్ బస్సులు, పాత మోడల్ కార్లు, గుర్రపు బళ్ళు వంటి వాటి గురించి చెబుతూ ఉంటే, వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ కాలంలోకి, చిన్నవాళ్ళు కొత్తలోకంలోకి వెళ్ళిపోతారు. కాస్తోకూస్తో ప్రపంచం చూసిన వారు ఎవరైనా కూడా తమ పరిధిలో మార్పుల్ని గమనిస్తూనే ఉంటారు అన్న నమ్మకంతో అంటున్నాను ఈ మాట. రోజూవారీ జీవితం ఎంతలా మారిందో అన్నది – నిజంగా ఎలా చెబుతారూ అంటే, మన తాతగారో అమ్మమ్మో నాయనమ్మో ఎవరో మన ముందు కూర్చుని కబుర్లు చెబుతున్నట్లే ఉంటుంది. రాయ్ కి రెండున్నరేళ్ళ వయసులో పితృవియోగం కలిగింది. తండ్రికి సంబంధించిన ఏకైక జ్ఞాపకాన్ని కూడా వర్ణిస్తారు మొదటి ఛాప్టర్ లో. రాయ్ కుటుంబం మొదట అతని తాత ఉపేంద్రకిశోర్ స్థాపించిన ప్రెస్సు – “యూ.రాయ్ అండ్ సన్స్” వెనుక భాగంలో ఉండేవారు. ఉపేంద్రకిశోర్ సత్యజిత్ పుట్టుకకు దాదాపు ఆరేళ్ళముందే చనిపోతే, సుకుమార్ రాయ్ (సత్యజిత్ తండ్రి) ప్రెస్సు బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన కూడా మరణించాక కొన్నాళ్ళకి రాయ్, అతని తల్లి -ఇద్దరూ ఈ బంగళా వదిలి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయారు. “ప్రెస్సు” ఉన్న బంగళా ని రాయ్ వర్ణించిన విధానం ఎలా ఉంటుంది అంటే, అది చదివేసరికి, మనకు ఓ మనోచిత్రం వచ్చేస్తుంది ఆ ఇల్లు ఎలా ఉంటుందా? అని. ఇందాక చెప్పినట్లు – ఆయన ఎదురుగ్గా కూర్చుని ఇదంతా చెబుతున్నట్లు ఉంటుంది. ఇందులో ఉన్న బొమ్మలు రాయ్ గీసినవే. తన చిన్నప్పుడు ఎవరో స్నేహితులు తయారుచేసిన వస్తువు ఎలా ఉందో చూపడానికి ఈ బొమ్మలు గీసారు. ఈ ఛాప్టర్ తో మనకి రాయ్ వంశవృక్షంలో “హూ ఈజ్ హూ” అన్నది, ఆయా మనుష్యుల జీవన విధానం, హాబీలతో సహా అర్థమైపోతుంది. పుస్తకం ఆదిలో వంశవృక్షాలు గీసారు – రాయ్ తండ్రి తరపుదీ,తల్లి తరపుదీ.

రాయ్ తండ్రి మరణం తరువాత కొద్దిరోజులకే ఆయనా,వాళ్ళమ్మా ఇద్దరూ గోర్పార్ లోని ఆ ఇల్లు వదిలేసి ఆమె పుట్టింటివైపు వారి వద్దకు భవానీపూర్ వెళ్ళిపోయారు. అదంతా ఓ కొత్త ప్రపంచం చిన్నారి రాయ్ కి. ఇక్కడ కూడా మనకు రాయ్ సాక్షిగా రెండు ఊళ్ళ మధ్యా ఉన్న తేడాలు అర్థమౌతాయి. అయితే, ఇది చిన్నపిల్లవాడు చెప్పే కథ కాదనీ…పెద్దాయన చిన్నప్పటి అనుభవాలు నెమరువేసుకోవడం అని గమనించాలి. ఈ ఇంట్లోనే రాయ్ ఫొటోగ్రఫీ గురించి తెలుసుకున్నాడు. సినిమాల గురించి తెలుసుకున్నాడు. పుస్తకాల మధ్య మునిగాడు.మ్యాజిక్ గురించి తెలుసుకున్నాడు. మాణిక్ అన్న బాలుడు మనకు తెలిసిన సత్యజిత్ రాయ్ గా ఎదగడానికి తొలి అడుగులు ఇక్కడే మొదలయ్యాయి అనుకోవచ్చనుకుంటా. ఆ పరంగా ఆలోచిస్తే, ఆ ఇల్లు ఎంత గొప్పదో అర్థమౌతుంది. (అసలే నా వీరాభిమానానికి అదో గుడి అనిపిస్తుంది నాకు!) ఇవన్నీ చెబుతున్నప్పుడే రాయ్ తనకు ఇంద్రజాల విద్యతో కల్గిన పరిచయం గురించి వివరిస్తూ రెండు మూడు సంఘటనలు చెబుతారు. అది చదువుతూ ‘ఇదంతా ఓ కథలో రాసారు కదా’…అనుకున్నాను. అంతా అయ్యాక చివర్లో ఆయనే – ఇదంతా ఓ కథలో వాడుకున్నాను అని రాసారు. నిజం చెప్పొద్దూ…ఆ చివరి వాక్యం చదివాక నాకు భలే ఆనందం కలిగింది… కనిపెట్టేశా…కనిపెట్టేశా! అని. ఆ కథ కి తెలుగు అనువాదం ఇక్కడ చూడవచ్చు.

(http://www.prajakala.org/mag/2007/12/iddaru_indrajalikulu)

అప్పటి రోడ్లపై తిరిగే వాహనాల గురించి, అప్పటి సినిమాల గురించీ, స్వదేశీ మేళా గురించీ, ఫొటోలు తీయడం గురించీ – అప్పటి జీవితం గురించి కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. కనక్ బిశ్వాస్ అన్న ఆవిడ బెంగాలీ లో ప్రఖ్యాత గాయని. ఆమె సత్యజిత్ రాయ్ కి పిన్ని. తొలి రికార్డింగ్ నాడు ఆమె ఎంత కంగారుగా ఉన్నారో… బిడియం వదలడానికి ఎంత అవస్థ పడ్డారో చదివితే ఆశ్చర్యంగా అనిపించింది. ఠాగోర్ తో రాయ్ తొలి పరిచయం, సందేశ్ కి రాసే రచయితల గురించీ, సత్యజిత్ రాయ్ అప్పట్లో కలిసిన ప్రముఖుల గురించి చదవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. ఇవన్నీ దాదాపు డెబ్భై ఏళ్ళ క్రితం నాటి కథలు.. అప్పటి వారు రాసిన పుస్తకాలు కాకుంటే ఏవి చెబుతాయి అప్పటి చరిత్రను? టీ రుచిని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చో రాయ్ వాళ్ళ చోటో కాకా రాసిన ఎంట్రీ చదివాకే అర్థమైంది. అది నవ్వుకి నవ్వూ, ఆశ్చర్యానికి ఆశ్చర్యమూ-రెండూ కలిగించింది నాకు. ఇక, తరువాత సెలవుల గురించి… రాయ్ సెలవు రోజుల్ని తాను ఎలా గడిపేవాడినో, ఎవరితో గడిపే వాడినో… ఏమి చేసేవాడినో వివరించారు. అది ఎంత సామాన్యమైన బాల్యమో ఈ భాగం చదివాక అర్థమౌతుంది. ఈ క్షణాన కాస్త ఓ నలభై ఏళ్ళు పైబడ్డ మనిషి ఎవరన్నా తన చిన్నప్పటి సెలవుల గురించి రాస్తే, దానికీ, దీనికీ చాలా పోలికలు కనిపిస్తాయి. అంత “స్టోరీ నెక్స్ట్ డోర్” తరహా బాల్యం రాయ్ ది. అలాంటి మనిషి ఇంత గొప్ప మనిషి అవడం వెనుక కథ మాత్రం ఈ పుస్తకంలో లేదు…. అస లేపుస్తకంలోనైనా ఉందో లేదో… రాయ్ జీవితచరిత్ర ఎవరన్నా రాసి ఉంటే అందులో ఉండి ఉండొచ్చు. తనతో ఆడుకున్న స్నేహితులూ… వారి ప్రస్తుత వ్యాపకాలు ఇవన్నీ చెబుతూ ఉంటే, మీరూ మీ జ్ఞాపకాల్లోకి వెళ్ళక మానరు. ఆ శైలి అటువంటిది. అతి సాధారణంగా ఉంటుంది. అలా చదివేకొద్దీ మనలో ఇంకుతుంది… నా మటుకు నాకైతే మళ్ళీ మళ్ళీ చదవాలని కూడా అనిపిస్తోంది. చివరి అంకం – స్కూలు రోజుల గురించి. రాయ్ లో సహజంగా ఉండే హాస్యం ఇక్కడ బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక చోట, తన టీచర్ ని వర్ణిస్తూ.. “ఆయన షర్టు కాలర్లు పెద్దగా ఉండేవి..ఎంతగా అంటే, అవి గాలికి ఎగిరినప్పుడల్లా ఆయన రెక్కలు తగిలించుకుని గాల్లోకి ఎగరబోతున్నట్లుగా..” – ఈ తరహా వర్ణనలు రాయ్ రచనల నిండా ఉంటాయి. అందుకే చదువుతున్నంతసేపూ పాఠకుల పెదాలపై సన్నని చిర్నవ్వు చెదరకుండా ఉంటుంది.

ఇక్కడితో చిన్ననాటి అనుభవాల భాగం ముగిసి, సినిమాల గురించిన భాగం మొదలౌతుంది పుస్తకంలో. నా ఈ వ్యాసం రాయడానికి కారణం ఈ పుస్తకాన్ని సమీక్షించడం కంటే కూడా…రాయ్ బాల్యం గురించి ఆయనే చెప్పిన కథ గురించి మీతో పంచుకోవడం. రాయ్ జ్ఞాపకాల దారుల్లో వదిలిన పాదాల ముద్రలని అనుసరించి ఆయన జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం..అంతే. సత్యజిత్ రాయ్ అన్న మనిషిని…సినిమా డైరెక్టర్ గానో…రచయిత గానో… లేక అనేకానేకమైన విద్యలున్న మేధావిగానో చూడకుండా మామూలు మనిషిగా కూడా చూడాలి అన్న ఆసక్తి ఉన్న వారు ఈ పుస్తకం ద్వారా కొంతవరకూ తెలుసుకోవచ్చనే అనిపిస్తోంది నాకు. సత్యజిత్ రాయ్ ఆయన కుటుంబం గురించి మాట్లాడిన ఏకైక పుస్తకం ఈ “Childhood days” కనుక, ఆ పరంగా చూస్తే ఇది చాలా విలువైన పుస్తకం.

Childhood Days: A memoir -Satyajit Ray
(Translated from bengali by Bijoya Ray)
Penguin publishers
Rs:250

—————–

vbsowmya.JPG
తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.

Posted in వ్యాసం | Tagged | 11 Comments

నీ రాక కోసం..

నిషిగంధ

చేతికంటిన ముళ్ళ గోరింట
రంగు వెలిసిపోతోంది
ఈసారైనా కాస్త ముందొస్తావనుకున్నా..

నువ్వొస్తేనే కదా
స్వప్నాలు నిద్రలేచేది
మనసు ఆదమరిచేది..

ఒక్కోసారి మంచు తడియారకుండానే
కళ్ళ ముందుంటావ్..
ఆ ఆకస్మిక ఆనందం మళ్ళీ ఎప్పుడో!?

కాలికింద నలిగిన
ఎండుటాకుల నిర్లిప్తత
రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..

ఇంకెన్నిరోజులిలా!?

దిగులుతో బాధేసి, కోపమొచ్చి
ఎదురుచూపుల్ని దుప్పట్లో కప్పేస్తుంటే
వినిపించింది నీ ఆగమన రాగం!

కిటికీ అవతల నిశాంతంలో
కొమ్మ కొమ్మకీ కొత్త ఆశల
చిగురులద్దుతూ నువ్వు!
నీ అడుగుల వెనక
అలుముకుంటున్న రంగుల్లోకి
జారిపోయేముందు
అందరికీ చెప్పిరానీ
నా ప్రియసఖి వసంతమొచ్చిందని!!

————-
నిషిగంధశ్రీవారికి ప్రేమలేఖతో సుప్రసిద్ధులైన నిషిగంధ విజయవాడలో పుట్టి, పెరిగారు. ప్రస్తుతం అమెరికాలో, మయామిలో సిస్టమ్స్ ఎనలిస్ట్ గా పనిచేస్తున్నారు. వదలకుండా పుస్తకాలు చదవడం, కదలకుండా సినిమాలు చూడటం, ఆపకుండా పాటలు వినడం, విడవకుండా స్నేహితులతో కబుర్లు చెప్పడం, అలవకుండా వంట చేయడం ఆమెకు ఇష్టమైన విషయాలు. సంతోషంగా ఉండటమే ఆమె జీవితాశయం.

Posted in కవిత్వం | 9 Comments

నా మదిలో … లిరిల్ తాజాదనం!

-రానారె

బ్లాగావరణంలో ఆబాలగోపాలానికీ పరిచితుడైన ప్రవీణ్ గార్లపాటిగారి బ్లాగును ఈ నెల మీ ముందుకు తెస్తున్నాం. చాలా చురుకుగా తరచుగా రాసే కొద్దిమంది బ్లాగర్లలో ప్రవీణ్ ఒకరు. ఈ వ్యాసం కోసం బ్లాగులోని అన్ని టపాలనూ చూడటం సాధ్యం కాలేదు – ముఖ్యంగా ఈ సంవత్సరారంభం నుండి యిటీవలివరకూ వచ్చినవాటిని.

బ్లాగన్నది బ్లాగరును ప్రతిఫలించాలన్న నిర్వచనాన్ని మీరు నమ్మేవారయితే, తెలుగు బ్లాగావరణం నుండి మీరుదహరించగల కొన్నిటిలో సిసలైన బ్లాగు – ఉపశీర్షికలో అన్నట్లుగానే తన ‘మదిలో రేగే ఎన్నో ఆలోచనలను మీతో పంచుకోవడానికి’ ప్రవీణ్ గార్లపాటి వ్రాస్తున్న ‘నా మదిలో…‘.

తెలుగుబ్లాగు గుంపులో చురుకైన సభ్యునిగానూ, తన బ్లాగు ద్వారానూ, అంతర్జాలంలో తెలుగుభాష వ్యాప్తికోసం జరిగే సాంకేతికాంశాల సహాయాల చర్చలలోనూ, ఇటీవలి బ్లాగుపుస్తక రూపకర్తగానూ పాఠకులు నేడెరిగిన ప్రవీణ్, యేడాదిన్నర క్రితం “నేనో గుంపులో గోవిందయ్యని” అంటూ బింకంగా బ్లాగావరణంలో ప్రవేశించారు. “నీ బ్లాగు 3 పోస్ట్‌లతో 6 వ్యాఖ్యలతో (comments) తో కళకళలాడాలి” అన్న ‘అన్నగారి’ ఆశీర్వాదంతో పాటు నెజ్జనుల స్వాగతాన్నీ అందుకున్నారు. ఇక్కడో చిన్న తమాషా వుంది. తెలుగుబ్లాగును ప్రారంభిస్తూ మొదటి టపాలో ఇతనుపయోగించిన తొలి పదం ఏమిటంటే… “ఆఖరికి”.

తొలి టపాకు అందిన వ్యాఖ్యల్లోని సూచనో, లేక అంతకుముందే తీసుకున్న నిర్ణయమో – సమాచార సాంకేతికాంశాలను తొలిసారిగా తెలుగులో చర్చిస్తూ వచ్చిన బ్లాగు ‘నా మదిలో …‘. ప్రవీణ్ వ్యక్తీకరించదలచిన సాంకేతికవిషయాలు వార్తాప్రకటనల్లా చప్పగా కాకుండా స్వీయానుభవంగానో, అభిప్రాయంగానో, జనాభిప్రాయాన్ని తెలుసుకోగోరుతున్నట్లుగానో వుండి, కాస్త చమత్కారాన్నీ మితిమీరని ఉత్ప్రేక్షనూ కలిగిన భాషలో పాఠకుల ముందుకు వస్తాయి. సాంకేతికాంశాల ప్రస్తావన, వాటి గురించిన వివరణ, చర్చల వంటివాటిని పాఠకులతో నేరుగా మాట్లాడుతున్నట్టు ఆసక్తికరంగా నడిపించడంలోని ఒక ప్రత్యేక శైలిని ఈ బ్లాగులో గమనించవచ్చు. “ఈరోజు ఎంత సంతోషంగా వుందో చెప్పలేను” అంటూ మొదలుపెట్టి ఈ కుబుంటు కుటుంబీకుడు చెప్పిన సంగతేమిటో చూచిరండి. “గూగుల్ అంటే నాకు తగని ఇష్టం, గౌరవం…” అనే మాటతో టెక్కీవీరులను స’మావేశ’ పరచిన వైనం కూడా ఈ కోవలోనిదే.

నా మదిలో ...

మైక్రోసాఫ్ట్, యాహూల సమీకరణం గురించి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వచ్చిన టపా, ఈ బ్లాగును నిశితంగా చదివే ఒక నెజ్జనుడన్నట్లు, తెలుగు బ్లాగులలో టెక్నికల్ జర్నలిజం మొదలయ్యిందనడానికి ఉదాహరణ. ఈ టపాను వెతికి పట్టుకుంటే పట్టుచీర లేక పట్టుపంచె యిచ్చేటటువంటి పోటీ పెట్టే వుద్దేశం వుందేమో! లేకపోతే పాతటపాల (ఆర్కైవుల)ను ప్రవీణ్ ఎందుకు దాచేసినట్లు? 🙂 “విహరిణుల విపణిలో అండర్ డాగ్” అంటూ ఒపెరాను, “ఇప్పుడు కొత్త జనరేషన్ టెక్నాలజీలకు అంకురార్పణ జరుగుతోంది” అంటూ డెస్క్‌టాప్ మీద వెబ్ అప్లికేషన్లని మాష్ చెయ్యగలిగే అవకాశాన్ని కల్పించే అడోబ్ వారి అపోలో, మైక్రోసాఫ్ట్ వారి సిల్వర్లైట్, JavaFX మొదలయినవాటిని పరిచయం చేయడం కూడా టెక్నికల్ జర్నలిజం కోవలోకే వస్తాయని చెప్పవచ్చు.

‘ఓపెన్ సోర్సు’ అభిమానిగా, ఉబుంటు కుటుంబీకునిగా (1 2 3), కంప్యూటర్లలో సమాచారభద్రతపై (1 2 3) ప్రవీణ్ రాసిన టపాలు ఈ విషయాలపై అతని ఆసక్తిని తెలుపుతాయి. ఇంకా చాలా వ్యాసాలే వున్నాయి. వీటన్నిటినీ ట్యాగుల ద్వారానో మరోవిధంగానో విషయానుగుణంగా వర్గీకరించి క్రమబద్ధీకరిస్తే ఈ బ్లాగు ఒక మంచి రిఫరెన్సులా పనికొస్తుంది, తెలుగు గీకువీరులంతా పిచ్చాపాటి మాట్లాడుకునే ‘చర్చబండ’గా మారుతుంది.

మాతృభాషాభిమానానికి సాంకేతికవిద్య, ఉత్సాహము తోడుగా కలిగిన ప్రవీణ్ కొన్ని మంచి ప్రయత్నాలు చేశాడు. బార్ కాంప్ లలో “కుదిరితే తెలుగుబ్లాగుల గురించి, స్థానికీకరణ గురించి మాట్లాడాల”నే ప్రయత్నం, ఉబుంటు స్థానికీకరణ యత్నం, తెలుగు ఎనేబులర్ తయారీ యత్నం వీటిలో కొన్ని. అంతర్జాలంలో తెలుగుకోసం, నేపథ్యంలో టూల్సు (పరికరాలు), సాంకేతిక వనరులు కూర్చటం వంటివాటిల్లో చాలా అంకిత భావంతో పనిచేస్తున్నాడు. ఈ వ్యాసం కేవలం అతని బ్లాగును గురించి కాబట్టి, మిగతా విషయాలను ఇక్కడ ప్రధానాంశాలుగా చూపించడం సందర్భం కాదేమో.

టెక్కు విషయాలనే కాదు, పెక్కు సరదా విషయాలను కూడా వాటి తాజాదనం ఏమాత్రం తగ్గనీయకుండా చెబుతూ వుంటాడు. రాసినవి రాసినట్టుగా కాదు, నేరుగా చెబుతూవున్నట్టు వుంటాయి. వీడియోలు ప్రతి విషయాన్నీ కళ్లకు కట్టలేవు. కొన్ని సంగతులు మాటల్లోనే వినాలి/చదవాలి. తన మొదటి స్టేజి ప్రదర్శన గురించి చెబుతూ, “మాంచి ఊపు మీద స్టెప్పులేసేస్తున్నాం. లెక్చరర్లందరూ ఆ అని నోళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు, వీళ్ళేసే సాంగులేంట్రా అని. ఇంతకూ మేము డాన్సులేసింది – మొదటి పాట …” ఏమిటి? ఆ నాట్యప్రదర్శనను మీరే తిలకించండి/ఆలకించండి. ఈ ప్రదర్శనకు రెండేళ్లముందరి తన పరిస్థితిని వినిపిస్తూ, “అదో గడ్డు కాలం. ఎందుకో నాకు సడన్ గా చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గింది. అందరూ IIT లకి ప్రిపేర్ అవుతుంటే నేను లైట్ గా తీసుకున్నాను. అందుకే ఎంసెట్ ఎగిరింది.” ఫక్తు ఇంజనీరింగ్ విద్యార్థుల తెలుగుమాటలతో తన క్రికెట్ కెరీర్ను వర్ణిస్తూ రాసిన ఈ టపాతో పాతజట్టు మళ్లీ తయారయినా ఆశ్చర్యంలేదనిపిస్తుంది.

తల్లి సాన్నిహిత్యంలో ప్రతివాళ్లూ చిన్నపిల్లలే కదా! అలాంటి పిల్లలు డైరీ రాస్తే, అందులో ఒక పేజీ ఎలావుంటుందో ఊహించండి. వీళ్ళు ఒకోసారి డైరీ రాయడం మానేస్తామని బెదిరిస్తారు కూడా! 🙂 ఒకోరోజు పనికి ఎగనామం పెట్టేస్తారు. ప్రయోజనకరమైన కవితాత్మకత తొంగిచూసే రచనలు చేసినా, యాభైయైదు మాటలతో కథ వంటి ప్రయోగాలు చేసినా, ఉత్కంఠభరిత కథనాలను నడిపించగలిగినా, చక్కని విశ్లేషణలతో పాఠకుల ప్రశంసలందుకొన్నా, ఆరోగ్యకరమైన విజ్ఞానదాయక చర్చలతో ఔత్సాహిక టెకీలను కూడగట్టినా, సరదాగా సినీనటుల డాన్సులపై విశ్లేషణ చేసినా, “నాకెదురయిన సిడ్నీ షెల్డన్, జెఫ్రీ ఆర్చర్, షెర్లాక్ హోంస్, రాబిన్ కుక్ ఏదీ వదిలిపెట్టను” అనే పాఠకునిగా పరిచయం చేసుకున్నా, సగటు అభిమానిగా చిరంజీవిని చిరంజీవిగా వర్ధిల్లమని దీవించినా, హ్యారీపోటర్ పుస్తకశృంఖల ఆగిపోయిందని చింతించే పాఠకునిగా “హారీ పాటర్ అండ్ ద డెత్లీ హాలోస్” ను పరిచయం చేసినా, ఒక జ్ఞాపకంవంటి చిన్న ట్రావెలాగ్ రాసినా… ‘లిరిల్ తాజాదనం’ లాంటి అనుభూతిలో బ్లాగులోకాన్ని అలవోకగా ముంచివేయగల సమర్థత ఈతని రచనల్లో కనిపిస్తుంది. మనసులోని అనుభూతిని మార్పేమీ లేకుండా మనకు చేరవేసే రచనా శక్తి ఈ బ్లాగులో పుష్కలంగా కనిపిస్తుంది దాదాపుగా అన్ని టపాల్లోనూ. “23 ఏళ్ళ జీవితాన్ని కేవలం 40 లైన్లలో చూపించడ”మంటే మాటలా? ఔను మాటలేనని మీరూ అంగీకరిస్తారు – పై లంకెలననుసరించి ఒక్కసారి అలా ఈ బ్లాగరు మదిలోనికి చూసిరండి.

విషయం సాంకేతికమైనా, సామాజికమైనా, వ్యక్తిగతమైనా వ్యాసాల నిడివి మాత్రం ఒకటి రెండు పుటలకు మించదు. వారానికి కనీసం ఒక కొత్త టపానయినా ఈ బ్లాగునుంచి ఆశించవచ్చు. ఇంతా చెప్పాక, విషయ వైవిధ్యానికి ఈ బ్లాగులో లోటేమీ వుండదని చెప్పడం పునరుక్తే అవుతుంది.
ప్రవీణ్ గార్లపాటి

ప్రవీణ్ రచనల్లో మంచి హాస్యంకూడా అంతర్లీనంగా వుంటుంది. “మా అమ్మ నాకు దిష్టి తీసింది. ఎప్పుడూ లేంది వీడు ఇంటికి రాగానే సుబ్బరంగా తిని కంప్యూటర్ తెరవకుండా పడుకుంటున్నాడేంటబ్బా? అని. తర్వాత చెప్పా డాన్సు చేస్తున్నా అని. ఆ.. అని కాసేపు నోరెళ్ళబెట్టి వీడింతే వీడినెప్పుడూ అంచనా వెయ్యలేము అనే లుక్కించింది.” ఇలా ఒకోసారి హాస్యం అంతర్లీనంగా వుండదు. నేరుగా కనిపించి నవ్విస్తుంది. అన్నట్టు ‘హాథీకా అండాలా’ అంటే యేమిటో మీకు తెలుసా? 🙂 తెలిస్తే చెప్పండి.

ఓపెన్ సోర్స్ ఉచితమా? అనే టపాకు ఒక పాఠకుడు స్పందిస్తూ “… ఇన్నాళ్లూ భ్రమలో వున్నాను. నా కళ్లు తెరిపించినందుకు…” అంటూ చేసిన వ్యాఖ్య, దానికి స్మైలీతో ప్రవీణ్ సమాధానం, ఆ సమాధానమిచ్చేటప్పుడు అతని మనః స్థితిని ఊహిస్తే మీకు చిరునవ్వు రాక మానదు. నాకు యాదృచ్ఛికంగా కంటబడిన మరో రెండు ఆరాధనాపూర్వక ప్రశంసలు ఇవి: (1 2). వంద టపాలు పూర్తయిన సందర్భంగా అందరూ కలిసి ఈ బ్లాగుకు శతటపోత్సవం నిర్వహించారు. అందులో చూడండి ఈ బ్లాగును ప్రారంభింపజేసిన నవీన్‌గారు మరియు క్రమంతప్పకుండా చదివిన పాఠకులూ ఏమన్నారో…!!

నేను నేనే! (1), ఈ జెనరేషన్ తప్పేంటి? (2), ఇంజినీరూ డాక్టరేనా? (3), నువ్వెంత? నేనెంత? (4), ఆయ్… మేమంటే అంత చులకనా!? (5), ఏమిటిది??? (6), రిజర్వేషన్ల వల్ల మంచి జరుగుతుంది అంటే నేను అసలు ఒప్పుకోను (7), ఐఐటీలూ మేథోవలసలూ (8), ఎప్పటికయినా రిజల్యూషను చేసుకోవాలని ఒక రిజల్యూషను చేసుకోవాలేమో 🙂 (9) …. ఇలా … ‘కుఱ్ఱతనం’ అని పెద్దలతో అనిపించే మాటలు, ప్రశ్నలు, సందేహాలు, ఒకింత పొగరున్నట్టు కనిపించే స్టేట్మెంట్లు, అభిప్రాయాలు, మనసులోని మధనాలు, జీవితానికి అర్థం వెతుక్కునే ప్రయత్నాలు ఇంకా చాలానే చూడవచ్చునిక్కడ. ‘యువత’ అనే మాటకు ఒక రూపం చూడాలంటే ఈ’ మదిలో‘నికి తరచిచూడండి. ఆఫ్టరాల్, బ్లాగన్నది వ్యక్తి తన వాణిని వినిపించడానికే కదా వున్నది!

తెలుగులో పేరొందిన మిగిలిన బ్లాగులనన్నిటినీ – సుమారుగా, ‘రచయితల బ్లాగులు’ అని వర్గీకరించవచ్చు. అవి వ్యక్తుల బ్లాగులు కావు. అంటే, వారు ఏదో ఒక ప్రత్యేకాంశానికి పరిమితమైపోయారు. బ్లాగన్నది బ్లాగరును ప్రతిఫలించాలన్న నిర్వచనాన్ని మీరు నమ్మేవారయితే, తెలుగు బ్లాగావరణం నుండి మీరుదహరించగల కొన్నిటిలో సిసలైన బ్లాగు – ఉపశీర్షికలో అన్నట్లుగానే తన ‘మదిలో రేగే ఎన్నో ఆలోచనలను మీతో పంచుకోవడానికి’ ప్రవీణ్ గార్లపాటి వ్రాస్తున్న ‘నా మదిలో…‘.

—————————–
రానారె పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

Posted in జాలవీక్షణం | Tagged , | 8 Comments

మృతజీవులు – 17

-కొడవటిగంటి కుటుంబరావు

ఆటలో అతను నమ్మదగినవాడు కాదని మనం మొదట్లోనే తెలుసుకున్నాం; అతను చాలా రకాల మోసాలు చేసేవాడు. అందుచేత తరచూ పేకాట ఇంకొక ఆటగా పరిణమించేది. అతన్ని మెత్తగా తన్నేవారు. లేకపోతే పుస్తీలు పట్టుకుని పీకేసేవారు. ఒక్కోసారి అతను ఒంటిపుస్తీతో, అదికూడా కొంత పోగొట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు. అయితే అతని దవడల ధర్మమా అంటూ కేశసమృద్ధి గలవి కావడం చేత, ఆ నష్టం త్వరలోనే పూడి అతని పుస్తీలు ఎప్పటికన్నా శోభగా తయారయ్యేవి. వీటన్నిటినీ మించిన వింత ఏమిటంటే ఇది రష్యాలో మాత్రమే సంభవం – త్వరలోనే అతనికి ఇంతా చేసిన మిత్రులు మళ్ళా తగిలేవారు; ఏమీ ఎరగనట్టుగా పలకరించుకునే వాళ్ళు; అతనిలోగాని, వాళ్ళలోగాని ఎలాటి వికారమూ కనిపించేది కాదు.

పెళ్ళిళ్ళనూ బేరాలనూ చెడగొట్టేవాడు. తాను ఆ మనిషిపట్ల శత్రువులా ప్రవర్తిస్తున్నానని ఐనా గ్రహించేవాడు కాదు. మీదుమిక్కిలి ఆ మనిషి కనిపించినప్పుడు మామూలుగానే పలుకరించి “ఎంత ఛండాలుడివి నన్ను చూడటానికి రావేం?” అని అడిగేవాడు.

ఒక విధంగా నజ్‌ద్ర్యోవ్ చారిత్రక పురుషుడు. అతను హాజరైన ఏ సమావేశమూ కొంత “చరిత్ర” సృష్టించకుండా ఉండటం జరగలేదు. ఏదో ఒక అప్రతిష్ట రానే వచ్చేది. నృత్యశాల నుంచి అతన్ని పోలీసులు అవతలికి పట్టుకుపోవటమైనా జరిగేది. అతని మిత్రులు స్వయంగా అతనిని బయటికి గెంటటమైనా జరిగేది. అలా జరగనప్పుడు మరెవ్వరికీ జరిగే అవకాశం లేనిదేదో ఒకటి అతనికి జరిగేది: తాగేచోటికి పోయి తప్పతాగి అచ్చగా నవ్వటమే చేసేవాడు, లేకపోతే ఘోరమైన కల్పనలన్నీ చేసి మాట్లాడి చివరకు తనను చూసి తానే సిగ్గుపడేవాడు. అతను ఉత్త పుణ్యానికి అబద్ధాలాడేవాడు; ఉన్నట్టుండి తనకు గులాబీ రంగు గుర్రమో, నీలం రంగు గుర్రమో ఉండేదని బుకాయించేవాడు. లేకపోతే ఇలాంటివే ఇంకేవో అనేవాడు. వినేవాళ్ళకు ఒళ్ళు మండిపోయి అతనితో మాట్లాడటం మానివేసి వెళ్ళిపోయేవారు, “కొయ్యరా బాబూ” అంటూ. ఇతరులను అకారణంగా “ఏడిపించటం” కొందరికి చాలా సరదా. మంచి హోదాలో ఉన్నవాడై ఉంటాడు, పెద్ద మనిషి లాగా కనబడతాడు. ఏవో పతకాలు తగిలించుకుని ఉంటాడు. మనకు షేక్‌హ్యాండు ఇచ్చి, ఎంతో లోతుగా ఆలోచిస్తే గాని అంతుబట్టని గంభీర విషయాలను గురించి మాట్లాడతాడు, మరుక్షణం మనం చూస్తూండగానే మనమీద ఏదో చిలిపితనం చేస్తాడు; అది ఎవరో పల్లెటూరి కాపీయిస్టు గుమాస్తాలు చెయ్యవలసిన పనిగా ఉంటుందిగాని, లోతుగా ఆలోచిస్తేగాని అంతుబట్టని గంభీర విషయాలు మాట్లాడేవాడు చెయ్యదగినదిగా ఉండదు. అందుచేత మనం విస్తుపోయి చూస్తాం. నజ్‌ద్ర్యోవ్‌కు ఇటువంటి జబ్బున్నది; అవతలివాడు ఎంతబాగా చనువున్నవాడైతే అంత ఉత్సాహంతో ఏడిపించేవాడు; ఎవడూ నమ్మటానికి వీల్లేని చౌకబారు అబద్ధాలు ప్రచారం చేసేవాడు. పెళ్ళిళ్ళనూ బేరాలనూ చెడగొట్టేవాడు. తాను ఆ మనిషిపట్ల శత్రువులా ప్రవర్తిస్తున్నానని ఐనా గ్రహించేవాడు కాదు. మీదుమిక్కిలి ఆ మనిషి కనిపించినప్పుడు మామూలుగానే పలుకరించి “ఎంత ఛండాలుడివి నన్ను చూడటానికి రావేం?” అని అడిగేవాడు. ఒక విధంగా నజ్‌ద్ర్యోవ్ బహుముఖ ప్రజ్ఞ కలవాడు, అంటే ఏదిబడితే అది చెయ్యటానికి సిద్ధమయేవాడు. ఒకేక్షణంలో అతను మనవెంట ప్రపంచంలో ఏమూలకైనా వస్తాననేవాడు. మనకు ఏ సహాయం కావాలన్నా చేసిపెడతాననేవాడు. మనతో ఏ వస్తువునైనా సరే మారకం వేసుకోవటానికి సిద్ధపడేవాడు. మార్చుకోవటానికి తుపాకులు, కుక్కలు, గుర్రాలు – ఏవైనా సరే, అతనికి లాభదృష్టి కూడా ఉండేది కాదు; అతని అంతస్సులో ఉండే చైతన్యమూ, అతని స్వభావమూ అతన్ని అలా ప్రేరేపించేవి. ఏ సంతలోనో పేకాట దగ్గర అతనికి అమాయకుడు తటస్థపడి డబ్బు గుంజుకోనిస్తే అతను దుకాణాల్లో తన కంటిని ఆకర్షించిన వస్తువులను కొల్లలుగా కొనేసేవాడు. గుర్రాల పట్టీలూ, ధూపం కొవ్వొత్తులూ, ఆయాకు రుమాళ్ళూ, మగగుర్రమూ, ఎండుద్రాక్షలూ, వెండితొట్టీ, హాలండు లినెనూ, తెల్లని గోధుమపిండీ, పొగాకూ, పిస్తోళ్ళూ, హెరింగ్ చేపలూ, చిత్తరువులూ, ఒక తరిమెణ యంత్రము, కుండలూ, బూట్లూ, పింగాణీ సరుకు – డబ్బు అయిపోయేదాకా కొనేవాడు. అయితే సాధారణంగా ఈ కొన్న సరుకంతా ఇంటికి చేరటమనేది ఉండేది కాదు; దాదాపు అదంతా ఆరోజే అదృష్టం గల మరో జూదగాడి చేతికి మారేది. ఒక్కొక్కప్పుడు అదనంగా అతని పైపూ, పొగాకు సంచీ, ఇంకొకప్పుడు అతని నాలుగు గుర్రాలూ, బండీ, బండీవాడు కూడా పోవటం జరిగేది; ఆ తరువాత అతను కట్టుబట్టలతో బయలుదేరి ఏ స్నేహితుని కాళ్ళో పట్టుకుని అతని బండిలో వచ్చేసేవాడు. నజ్‌ద్ర్యోవ్ అలాంటి మనిషి! ఇది కేవలం కల్పిత పాత్ర అనీ, ఈ రోజుల్లో నజ్‌ద్ర్యోవ్‌లు లేరనీ అనుకోగలరు. అది శుద్ధపొరపాటు. నజ్‌ద్ర్యోవ్‌లు నశించిపోవటానికి ఇంకా చాలా దీర్ఘకాలం పడుతుంది. వారు మనలో ఎక్కడబడితే అక్కడే ఉన్నారు; కాకపోతే వాళ్ళు ఇంకోమాదిరి కోటు వేసుకోవచ్చు; మనుషులు పరిశీలనగా చూసే అలవాటులేక ఇంకో కోటు వేసుకున్న మనిషిని చూసి ఇంకో మనిషి అనుకోవటం కద్దు.

ఇంతలో మూడుబళ్ళూ నజ్‌ద్ర్యోవ్ ఇంటిమెట్టు దగ్గరకు వచ్చి ఆగాయి. వీరికోసం లోపల ఎవరూ ఎదురుచూస్తున్నట్టు లేదు. భోజనాల నడిమధ్య ఇద్దరు కమతగాళ్ళు కర్రల మంచె మీద నిలబడి, అంతూ పొంతూ లేని పాట ఏదో పాడుతూ సున్నం కొడుతున్నారు.; నేల అంతటా సున్నం మరకలు. నజ్‌ద్ర్యోవ్ ఆ కమతగాళ్ళనూ, కర్రల మంచెలనూ తక్షణం బయటికి పొమ్మని ఆజ్ఞాపించి అవతలి గదిలోకి గబగబా వెళ్ళాడు. అతను వంటమనిషికి భోజనం గురించి హెచ్చరికలు చెయ్యటం అతిథులకు వినిపించింది. అప్పటికే కడుపులో ఆకలి రాచటం ప్రారంభించిన చిచీకవ్ మరి అయిదు గంటల దాకా తనకు భోజనప్రాప్తి లేదని తెలుసుకున్నాడు. నజ్‌ద్ర్యోవ్ తిరిగి వస్తూనే తన అతిథులను వెంటబెట్టుకుని తన కింద ఉన్న గ్రామమంతా తిప్పి, ప్రతిదీ చూపించి, రెండు గంటల చిల్లర కాలంలో వారు చూడవలసినది ఏదీ మిగలకుండా చేశాడు. ముందుగా వాళ్ళ గుర్రాలశాలకు వెళ్ళి రెండూ ఆడ గుర్రాలనూ, ఒక మగ గుర్రాన్నీ చూశారు. ఆడ గుర్రాలలో ఒకటి మచ్చలది, రెండవది బ్రౌను రంగుగా ఉన్నది. మగ గుర్రం చూడటానికి అంత ఇంపుగా లేదు, కాని నజ్‌ద్ర్యోవ్ దాన్ని పదివేల రూబుళ్ళు పోసి కొన్నానని ప్రమాణం చేశాడు.

“నువ్వు పదివేలు పోసి కొనలేదు. అది వెయ్యి కూడా చేయదు” అన్నాడు బావ.

“ప్రమాణపూర్తిగా పదివేలిచ్చి కొన్నాను” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“నువ్వు ఎన్ని ప్రమాణాలైనా చెయ్యి” అన్నాడు బావ.

“సరే పందెం వేస్తావా?” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

బావ పందెం వెయ్యటానికి ఇష్టపడలేదు.

తరవాత నజ్‌ద్ర్యోవ్ వాళ్ళకి గుర్రాలులేని ఖాళీ కొట్టాలు చూపించి అందులో మరికొన్ని గుర్రాలు ఉండేవని చెప్పాడు. అదే గుర్రపుశాలలో వారికి ఒక మేక కూడా కనిపించింది. గుర్రాల వెంబడి మేక ఉండటం మంచిదని పాత నమ్మకం. ఆ మేక గుర్రాలకు అలవాటు పడిపోయి, వాటి పొట్టల కిందుగా నడిచింది, స్వతంత్రంగా తరవాత నజ్‌ద్ర్యోవ్ వాళ్ళను తీసుకుపోయి కట్టేసి ఉన్న ఒక తోడేలు పిల్లను చూపించాడు. “ఇదుగో తోడేలు పిల్ల. అది పౌరుషంగా ఉండగలందులకు కావాలని దానికి పచ్చిమాంసం వేయిస్తాను.” అన్నాడతను. అక్కడినుంచి వారు చెరువును చూడబోయారు. నజ్‌ద్ర్యోవ్ చెప్పిన ప్రకారమైతే అందులో ఎంత పెద్ద చేపలున్నాయంటే ఇద్దరు మనుష్యులు పట్టుకుని లాగినా అవి సులువుగా బయటకు రావు. ఈ విషయం తాను నమ్మలేనని బావ అన్నాడు.

“చిచీకవ్ నీకు భలే కుక్కలను రెంటిని చూపించబోతున్నాను.వాటి బలం అద్భుతం. వాటి బొచ్చు సూదుల్లాగా ఉంటుంది” అంటూ అతను ఒక అందమైన ఇంటికేసి దారితీశాడు. ఆ ఇంటి చుట్టూ ఖాళీ ఆవరణ ఉండి, దానికి నలువైపులా కంచె ఉన్నది. వాళ్ళు ఆవరణలోకి పోగానే అనేకరకాల కుక్కలు కనిపించాయి, రకరకాల జాతులకు చెందిన తోడేలు కుక్కలు. వాటిలో అన్నివిధాల రంగులూ, కలగలుపులూ ఉన్నాయి – కాఫీ రంగువీ, నలుపూ గోధుమరంగు కలిసినవీ, నలుపూ-తెలుపువీ, తెలుపూ- గోధుమ రంగువీ, నల్ల చెవులవీ, బూడిదరంగు చెవులవీ.. వాటి పేర్లు కూడా చిత్రంగా ఆజ్ఞల్లాగా ఉన్నాయి: కొట్టెయ్యి, మూలిగెయ్యి, పరిగెత్తు, పీల్చు, మెల్లకన్ను, చూపుడుముల్లు, బాగామాడు, అగ్గి, మింగు, తొందర, నిధి, కాపలా. నజ్‌ద్ర్యోవ్ వాటిపట్ల కన్నతండ్రి కన్న ఎక్కువగా ఉన్నాడు. అవి శునక మర్యాదను అనుసరించి అతిథులను చూడగానే తోకలెత్తి ఆడిస్తూ ఎదురువచ్చాయి. ఒక డజను కుక్కలు తమ కాళ్ళను ఎత్తి నజ్‌ద్ర్యోవ్ భుజాల మీద పెట్టాయి. మూలిగెయ్యి చిచీకవ్ పైన చాలా ప్రేమ ప్రదర్శిస్తూ వెనక కాళ్ళపైన నిలబడి అతని మూతి నాకేసరికి, అతను పక్కకు తిరిగి ఉమ్మేశాడు. వాళ్ళు కుక్కలను చూశారు – మంచి కుక్కలే. తారవాత వాళ్ళు క్రిమియా దేశపు ఆడకుక్క నొకదాన్ని చూడబోయారు. అది గుడ్డిది. చావటానికి సిద్ధంగా ఉన్నదని నజ్‌ద్ర్యోవ్ చెప్పాడు. రెండేళ్ళ క్రితం అది మంచి కుక్కేనట. ఆడకుక్కను చూశారు; అది గుడ్డిదే. తరవాత వాళ్ళు నీటిమరను చూడబోయారు. అది ఇరుసుమీద తిరిగేటప్పుడు పైరాయి బరువుపడే రింగు కాస్తా పోయింది. “కమ్మరి కార్ఖానా దగ్గరే ఉంది” అన్నాడు నజ్‌ద్ర్యోవ్. కొద్ది దూరం ముందుకు వెళ్ళాక, కమ్మరం చేసే చోటు వచ్చింది. దాన్ని కూడా చూశారు.

“ఆ పొలం చూశారా? అందులో కుందేళ్ళు ఎన్ని ఉన్నాయంటే, నేల కనబడదు. నేను నా చేతులతో ఒకదాన్ని వెనకకాళ్ళు పట్టి పట్టుకున్నాను.” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“నయం; కుందేళ్ళను చేతులతో పట్టుకునేవు” అన్నాడు బావ.

“పట్టుకున్నానంటుంటేనే! కావాలని పట్టుకున్నాను. ఇప్పుడు మనం నా ఆస్తి సరిహద్దు దాకా వెళ్ళొద్దాం.” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

అతను తన అతిథులను వెంటబెట్టుకుని పొలాలకు అడ్డంగా తీసుకుపోయేవాడు. వాటిలో అక్కడక్కడా గుట్టలున్నాయి. అతిథులు ఎగుడుదిగుడు డొంకలకూ, దున్నిన పొలాలకూ మధ్యగా పోవాల్సి వచ్చింది. చిచీకవ్‌కు ఆయాసమనిపించసాగింది. చాలాచోట్ల కాళ్ళు నీళ్ళలోకి దిగబడ్డాయి. అది పల్లపు భూమి. మొదట్లో వాళ్ళు దారి చూసుకుంటూ జాగ్రత్తగా నడిచారు గాని, అందువల్ల లాభం లేదని తెలిశాక దారి చూడటం మానేశారు. చాలాసేపు నడవగా సరిహద్దు వచ్చింది. అక్కడ కర్రల కంచె, సన్నని కందకమూ ఉన్నాయి.

“ఇదే సరిహద్దు. దానికి ఇవతల ఉన్నదంతా నా భూమి. అవతల కూడా, ఆ దూరంగా కనిపించే అడవీ, దాని అవతల ఉన్నదంతా కూడా నాదే” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“అవునుగాని ఆ అడవి నీదెప్పుడయింది? ఇటీవల కొనలేదు గదా” అదివరకు అది నీది కాదే?” అన్నాడు బావ.

“అవును, ఈ మధ్యనే కొన్నాను.” అని నజ్‌ద్ర్యోవ్ జవాబు చెప్పాడు.

“ఇంతలో ఎప్పుడు కొనేశావు?”

“మొన్ననే కొన్నాను. చాలా ఖరీదుపెట్టి కొన్నానులే”

“మొన్న నువు సంత దగ్గర ఉంటివిగా?”

“మతిమాలినవాడా, సంత దగ్గర ఉంటే కొనటానికేం? నేను సంత దగ్గర ఉన్నాను. నేను లేని సమయంలో నా మేనేజరు కొనేశాడు.”

“మేనేజరు మటుకు ఎలా కొంటాడు?” అంటూ బావ అయోమయూంగా తల అడించాడు.

అతిథులు వెళ్ళిన దారినే తిరిగి వచ్చారు. నజ్‌ద్ర్యోవ్ వారిని తన చదువుకునే గదికి తీసుకుపోయాడు.ఆ గదిలో మామూలుగా వుండదగిన పుస్తకాలు గాని, పత్రికలు గాని లేవు. ఆ గది గోడలకు కత్తులూ, రెండు తుపాకులు వేళ్ళాడుతున్నాయి. వాటిలో ఒకదాని ఖరీదు మూడువందల రూబుళ్ళు, రెండవది ఎనిమిది వందలు. బావ వాటిని పరీక్షించి తల అడ్డంగా ఆడించాడు. తరవాత వాళ్ళు టర్కీ దేశపు బాకులు చూశారు. అందులో ఒకదాని మీద పొరపాటున ‘సవేలి సిబిర్యాకన్ తయారుచేసినది’ అని రాసివున్నది. తరవాత వాళ్ళు ఒక బేరల్ ఆర్గను చూశారు. నజ్‌ద్ర్యోవ్ పిడి పట్టుకుని తిప్పితే అది బాగానే మోగింది. కాని మధ్యలో ఏదో పొరపాటు జరిగి డాన్సు పాట కాస్తా ఇంకొక పాటలోకి మారి, మళ్ళీ అది ఇంకొక డాన్సుపాట అయి ఊరుకున్నది. నజ్‌ద్ర్యోవ్ పిడి తిప్పటం మానేశాడు. అయినా ఆర్గను గొట్టాలలో ఒకటి ఆగక చాలాసేపు మోత పెడుతూనే ఉంది.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 17

ఏప్రిల్ గడిపై మీమాట

మార్చి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 మార్చి గడి, సమాధానాలు
2. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
3. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
4. 2007 నవంబరు గడి, సమాధానాలు
5. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
6. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
7. 2007 జూలై గడి, సమాధానాలు
8. 2007 జూన్ గడి, సమాధానాలు
9. 2007 మే గడి, సమాధానాలు
10. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
11. 2007 మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 6 Comments

మార్చి గడి వివరణలు

– కొవ్వలి సత్యసాయి

మార్చి నెల గడి కష్టంగా ఉందని చాలామంది అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ అభిప్రాయానికి ఒక కారణం చాలా పదాలు jumble అవడం (కొత్తపాళీ గారి ఉవాచ). మొత్తం తొమ్మిది పూరణలు వచ్చాయి. ఎవ్వరూ పూర్తిగా సరిగా నింపలేదు. కేవలం 3 తప్పులతో నింపిన వారు కొత్తపాళీ గారు, శ్రీకాంత్ గార్లు. నింపిన వారందరికీ అభినందనలు.

1 సౌ

2 గం

3 ధ

మా

4 ద

5 న

6 ప

7 ర్వ

8 ము

9 నుం

10 డి

11 న

X

12 రి

రా

X

13 లు

తి

ప్ప

14 క

డు

X

15 బం

X

16 స

రి

గా

17 ప

X

X

X

18 డ

19 ద

డె

20గు

X

X

21 మ

రి

వే

22 రే

23 ది

24 ది

గం

డు

రు

X

X

25 ధ

చా

X

26 లు

క్కు

27 గ్గ

X

28 గు

హ్య

కే

శ్వ

రు

29 డు

X

X

జం

X

30 బ

31 ర

హా

X

X

X

32 డు

రు

దు

33 వి

XX

34 ఈ

X

35 నా

నా

టి

36 లై

37 ఫు

X

X

ష్ట

38 పెం

డ్లి

39 క

X

40 న

ల్లా

దొ

X

డే

X

స్తూ

X

X

41 ల

క్సు

X

X

42ము

43 అ

శ్ర

44 ర

45 గు

46 గు

X

47 లే

వాం

48 చ

X

X

49 ర్జు

వు

50ము

ఱ్ఱు

బా

లా

X

పా

X

51 వి

ష్వ

క్సే

ను

డు

వివరణలు

అడ్డం –
1. వంద ఈపర్వతంమీద నుండి ఈయన లంఘించాడు – రాంబంటుకదా, హిందీ అంకెలొచ్చు మరి.
సౌగంధమాదనపర్వతంనుండి. రాంబంటు అనగానే హనుమంతుడు, ఆయన లంఘించిన గంధమాదనపర్వతం గుర్తుకు వస్తాయి.. హిందీ అంకెలొచ్చు అనడం వల్ల వంద ని హిందీలో మార్చమని సంకేతం.
11. దీనర్ధం వాక్ అని కాదు- ప్రవర్తన అని
నడత. వాక్ అంటే నడక. ప్రవర్తన అంటే అలాగే అనిపించే నడత.
12. ర గుణింతం వల్లేయండి – అన్నీ అక్కర్లే- ఓ మూడు చాలు- రారమ్మంటే వచ్చేస్తాయి
రిరరార.
13. తిండికి ద్వందం- అమ్మో ఇంత వెనకముందులాడాలా
లుతిప్ప. తిండీ తిప్పలు ద్వంద్వాలు. అక్షరాలు ముందూవెనుకలోడాయి కదా!
14. చాలా. సంకీర్తనాచార్యుడా! హరినామం ఇంత ఆనందకరమా!
కడు. హరినామమే కడు ఆనందకరము అన్న కీర్తన ఆధారం.
16. మోహనంగా ఆరోహిస్తేనే కరక్టుగా పోగలమా?
సరిగపద. మోహనరాగం ఆరోహణలో వచ్చే స్వరాలు.
18. హృదయంలో ఉండాల్సిన చిల్లులేదే? దడ ఎలా వస్తోంది?. ఎందుకైనా మంచిది, వెనక్కి తిప్పి పడుకోపెట్టండి.
డదడెగు. చిల్లు పూర్ణానుసారం (0). గుండెదడ లో 0 తీసేసి తిరగేయమని సూచన.
21. వేరే గతెవ్వరని 23 లోని శాస్త్రిగారు ఆనందంగా భైరవి అమ్మనడగడానికి చివరాఖరికి ఓమెట్టు నిలువుగా కూడా దిగాడు.
మరివేరేది. మరివేరేగతి ఎవ్వరమ్మా అన్న శ్యామశాస్త్రిగారి ఆనందభైరవి కృతి ఆధారం. మెట్టునిలువుగా దిగడంఅన్నది మరివేరేగ తర్వాత నిలువు వరుస లో ది కింద క్కు వస్తుందని సూచన. గతి బదులు దిక్కు అని 26 అడ్డం కోసం మార్చడాన్ని క్షమించాలి.
24. 23ల్ని ధరిస్తాడు సరే. చివరలో బట్టలు సరిగావేసుకోలేదేంటో!
దిగంబడురు. 23 లో పదం దిక్కు. వాటిని బట్టలుగా వేసుకునేవాడు దిగంబరుడు. చివరలో బట్టలు సరిగా వేసుకోలేదంటే చివరి అక్షరాలు అటూనిటూ అయ్యాయని.
25. ఈనాస్తికముని ధర్మవరపు సుబ్రహ్యణ్యం కొడుకుగా తనపేరు పొడి అక్షరాలతో ఇలాగే రాసుకునేవాడేమో కదా!
ధచా. నాస్తిక ముని చార్వాకుడు. ఆయన ధర్మవరపు సుబ్రహ్యణ్యం కొడుకయితే ధర్మవరపు చార్వాకుడవుతాడుకదా.
26. 23 నిలువుని ఓచూపు చూడండి. గడన్నాకా కాస్త రైమింగుండాలి. గుడ్లక్.
లుక్కు. 23 నిలువు దిక్కుకి రైమింగు లుక్కు. గుడ్లక్ లుక్కుకి చిన్న హింట్.
27. పెద్ద దూరంలో లేదు. కానీ దారి అస్తవ్యస్తం.
గ్గరద. దూరంగా లేనిది దగ్గర. అస్తవ్యస్తం కదా – అందుకే ఇలా.
28. పేరులో ఈశ్వరుడున్నాడు కానీ ఆగర్భశ్రీమంతుడు. అందుకే దాక్కున్నాడు.
గుహ్యకేశ్వరుడు – కుబేరుడి ఇంకో పేరు.
30. తెలుగులో బ్లాగే వాళ్ళకి చవకగా దొరికిన పెన్నిధి. దీనికోసం ఎన్నివరహాలైనా ఇవ్వచ్చు.
బరహా మనందరికీ తెలిసిన మృదులాంత్రమే.
32. దాసీపుత్రుడు కాబట్టి వెనుతిరిగాల్సివచ్చింది. లేకపోతే ఈయనలా నీతికి నిలిచినవాడు మనభారతంలో ఎవరున్నారు
డురుదువి. తిరగేస్తే విదురుడు.
35. అన్నమయ్య మళ్ళీ ఈరోజుల్లో పుడితే …. బతుకు నాటకం ….అన్న పాటని రీమిక్స్ చేసి ఇలా పాడేవాడేమో
నానాటి బతుకు నాటకము అన్న పాటని నానాటి లైఫు అని పాండేవాడని ఊహ.
38. మెల్లగా నడిస్తే ఇలానే అంటారు. కానీ తిన్నగా నడవాలనేం లేదుగా.
మెల్లగా నడిస్తే పెండ్లినడక అంటారు. తిన్నగా లేదు కాబట్టి … పెండ్లికడన
40. కొళాయి దొంగ కాదు. పాపం దొరే. రొంబ మంచోడు.
కొళాయిని నల్లా అంటారుకదా.దొంగకాదు కదా అందుకని .. నల్లాదొర.
41. మంచి లుక్సున్న ఈపాప వాడే సబ్బేంటో?
లక్సు – లుక్సు తో రైమింగని సూచన.
42. కన్నీరే. కింద పడి చెదిరిపోయినట్లున్నాయి.
కన్నీరుకింకో పేరు అశ్రము. చెదిరిందికాబట్టి ముఅశ్ర.
44. గొంతులోంచి పందికూతా? గోంగూర ఏం కాదూ? ఏదైనా విక్స్ బిళ్ళ పోగొడ్తుందిలెండి.
గురగుర. అంటే పందికూత అని అర్ధం. సందర్భాన్ని బట్టి తిరగేసి రాయాలి. లోంచి అని అనడం దీనికి రవంత సూచన.
47. కోరికలే బాబూ! ఈ ఏంకర్లు వత్తులు పలక్క పోతే నాతప్పా. ఏంటీ.. ఈమధ్య అక్షరాలు కూడా గజిబిజి చేస్తున్నారా
కోరికలే అంటే వాంఛలు. వత్తులు లేకుండా, అక్షరాలు గజిబిజి చేసి రాస్తే లేవాంచ.
49. రిన్ ఏడ్ లో అన్నిటికీ పౄఫ్లడిగే ఆయన పంజాబీ ఏడ్ లో ఇలాగే అంటాడు. వాళ్ళు సపోర్ట్ ని స్పోర్ట్ అనడం వినలేదా.
పంజాబీలు ఉచ్ఛారణలో మొదటి రెండక్షరాలు కలిపేస్తారు. ఋజువుని ర్జువు అని పలకగలరు.
50. ఆవీనగానే వచ్చేవాటిని దూడకివ్వకుండా జున్ను చేసుకుని తినేయడమే? తప్పుఁగాదూ.
ముఱ్ఱుబాఁలు
51. తెలుగుమాష్టర్లు మన చిన్నప్పుడు తప్పనిసరిగా డిక్టేషన్ లో వ్రాయించిన పదం. అంత సేనేమీలేదా. ఇంతాచేస్తే విష్ణుమూర్తికింకో పేరేనా.
విష్వక్సేనుడు. ఈపదాన్ని చిన్నప్పుడు తరచూ తెలుగు డిక్టేషన్లో రాయించేవారు.

నిలువు –
1. మొదటి అక్షరం సరిగా రాసుంటే వశిష్ఠ, పరాశర, నారదుల సరసన ఉండాల్సిన వాడే పాపం.
పరమేశ, వశిష్ఠ, పరాశర, నారద,శౌనక, శుక, సురపతి,గౌతమ, లంబోదర,సనకాదులు … అని సీతమ్మమాయమ్మ కృతిలో వస్తుంది. శౌ బదులు సౌ అని రాయాలిక్కడ.
2. వెనకా ముందు అయిపోయాడుకానీ, వీడు మహా శూరుడే. అందుకేనేమో ఎల్లారీశ్వరి ….. సోగ్గాడివంటా అని వణుకుతూ పాడింది
గండడుడగంర. గండరగండడు సోగ్గాడివంటా అన్న ఎల్లారీశ్వరి పాట గుర్తుండే ఉంటుందిగా.
3. అట్లే అవుగాక అనే దేవతలు కిందనుండే దీవించగలరు.
తధా తిరగేసి రాయాలి. తధాస్తు దేవతలు అట్లే అవుగాక అనికదా దీవిస్తారు.
4. – – ని తెలుసుకుంటిని, Miss.త్రిపుర ని తెలుసుకుంటిని అని తెగ సంబరపడిపోయాడా త్యాగయ్య – ఇంతకీ ఒడ్డుకు చేరాడో లేదో
దారిని తెలుసుకుంటిని, త్రిపురసుందరిని తెలుసుకుంటిని అని కదా త్యాగయ్యగారి కృతి.
5. ఈ అంబ సరసమాంబ కాదు. ఆమాటకొస్తే ఎనీ రసం నల్. అందుకే చిక్కి సగమైంది
నరస. న కారం లేకపోవడాన్ని కదా సూచించేది.
6. చిట్ ఫండ్ మురారి డబ్బులు తీసుకొని పారిపోతే అయ్యేది ఇదే.
పరారి.
7. ఎంత స్వరగాంధర్వుడైతే మాత్రం గా,మ,ధ అని సాగదీసి బిరుదిచ్చుకోవాలా. దాని కన్నా ‘శ’ ని ‘స’ అని సరిగ్గా పలకడం నేర్వచ్చుగా.
స్వరగాంధర్వ అని కాక శ్వరగామధర్వ అని రాయాలి. సందర్భాన్ని బట్టి ర్వరగామధశ్వ అని వస్తుంది.
8. విష్ణుని పొగిడేవైతే మాత్రం తలక్రిందులై, అస్తవ్యస్తమై పోవాలా? ఇవేం ప్రామాణికాలసలు.
ములుదవే, విష్ణుని పొగడెడి వేదమ్ములు అన్న భావములోన బాహ్యమునందును అనే అన్నమయ్య కీర్తనలోని వాక్యం దీనికి ఆధారం.
9. మీకు పొగడ్తంటే ఇష్టం ఉండదుటగా. అందుకే తెలియకుండా మధ్యలో సున్నా పెట్టేం
నుతి అంటే పొగడ్త. సున్నా పెట్టాం కాబట్టి నుంతి అని రాయాలి.
10. మిలిటరీ వాళ్ళ జుట్టుకత్తిరించుకునే పద్ధతిదీ పేరే
డిప్ప కటింగని పేరు వినలేదా
15. ఎవడైనా దీనెడు అన్నం తినగలడా? భీముడేమో!
బండెడు.
17. సేవకుడేంకాదు. పరిశీలించగల చారుడు.
పరిచారుడు. పరిచారకుడు అంటే సేవకుడు.
19. అలా బాదేస్తే, వెనకనుండి నత్తివాడినోట్లో కూడా బదనామైపోతాం.
దబదబా బాదడం అంటారు కదా.
20. ముత్తుస్వామి గురూజీ. మీ అంకితముద్ర మొహంలో వంకరేంటి సార్
ముత్తుస్వామి దీక్షితులుగారి ముద్ర గురుగుహ. మొహం కలిపితే గురుగుహానన. సమాధానం – గురుగుహానాన
22. ఇంగ్లీషు కిరణం. బహువచనం వేరేభాష.
రే(ray)లు.
23. శ్యామశాస్త్రిగారు 21 అడ్డంలోంచే ఈదిశ కనిపెట్టేశారు
దిక్కు. మరివేరే దిక్కెవరని కదా ఆయన రాసింది.
24. పెద్దనగలవాళ్ళని దీంతో పోలుస్తారు. అలా అని ఈఏనుగు దిక్కులేనిదేంకాదు.
దిగ్గజం
29. నిలువులోని చిట్ ఫండ్ ఓనర్ ని తలక్రిందులుగా సాగదీస్తే ఇలాగే తెలుగువాడై పోతాడు.. డుమువులు ప్రథమా విభక్తి.
డురుహరము. 6 నిలువులోని ఓనరు మురారి.
31. భయపడొద్దు అని చెప్పడానికి ఇంత కిందా మీదా అయిపోవాలా – హిందీ రాకపోతే కదా
డనార. హిందీలో డరనా అంటే భయపడొద్దు అని కదా.
33. విష్ణుమూర్తే. ముందే విష్టా ఉన్నవాడు. తర్వాతే చెవి ఉన్నవాడు.
విష్టరశ్రవుడు అంటే విష్ణుమూర్తి.
34. జూ. వేణుమాధవ్ హోటల్ సర్వరైతే మినప పప్పూ, బియ్యంతో చేసిన కుడుముని ఇలాగే అంటాడు
ఆకుడుముని ఇడ్లీ అని మనం అంటాం. ఇడ్లీని ఈడ్లి అని అంటాడు వేణుమాధవ్.
36. విండోస్ కి ఉచితప్రత్యామ్నాయంకదా అని ఎక్కువగా వాడితే అజీర్తి చేస్తుంది. ఈ హోమియో మందేసుకోవాల్సి ఉంటుంది. అబద్దం కాదు.
విండోస్ కి ఉచితప్రత్యామ్నాయం లైనక్సు. అజీర్ణానికి వాడే హోమియో మందు నక్సు వాం (short form for Nux vomica)
37. క్వార్టర్ కాదు. హాఫ్ కూడా కాదా, ఉహుఁ . అలా ఎలా సరిపెట్టుకుంటాం.
ఫుల్లా. ఈరెండూ కాకపోతే ఇక ఫుల్లే కదా.
38. పెద్దన గారి కాలికి తొడిగారట. శూరత్వం లేకపోయినా కూడానా?
పెండేరం. గండడు అంటే శూరుడు. పెద్దనగారికి తొడిగింది గండపెండేరం. గండ లేకుండా రాస్తే సరి.
39. గాంధీగారి పెళ్ళమైతే మాత్రం రవంత అచ్చుతప్పు రాయకూడదా
కస్తూరబా. కస్తూరిబా అని కదా రాయాలి – అందుకే చిన్న తప్పు అని హింటు.
41. మిల్కెందుకూ .. శీర్షాసనానికా
లలేపా. మిల్కెందుకూ — పాలేల. శీర్షాసనం అంటే తిరగేయడమే కదా.
43. పాండవమధ్యముడైనా సరే 64 గళ్ళ గుర్రమెక్కితే ఇలాగే గెంతాలి మరి- కిందకీ, పక్కకి…… కిందకీ, పక్కకి,,… చల్ చల్…
చదరంగంలో గుర్రం రెండుగళ్ళు కిందకీ ఒక గడి పక్కకీ వెళ్తుంది. పాండవమధ్యముడు అర్జునుడు. అర్జును పైనించి కిందకి రాసి పక్కనున్న 51 అడ్డం – విష్వక్సేనుడు లోని డు తో కలిసి చదవండి.
45. నిద్రలో చాలామందికి వచ్చేదే – నేనేమన్నానని అదో గా చూస్తున్నారు
గుర్రు. గుర్రుగా చూడ్డం అంటే తెలుసుగా
46. దురదా… నిక్కరు తిరగేసి వేసుకుంటే రాదామరి.
లాగు తిరగేసుకుంటే గులా
48. తక్కువైనా సరే ఉప్పు కావాలనడగొద్దు. రాత్రి కదా. ఇంకోలా అడుగు.
చవి. రాత్రి పూట ఉప్పు అనకూడదంటారు కదా.

Posted in గడి | Tagged | 3 Comments

మురళి ఊదే పాపడు

-దాదా హయత్

ఆవులు ఆనందంగా గడ్డి మేస్తున్నాయి.

కొంతదూరంలో ఒక పిల్లవాడు చెట్టు కొమ్మమీద కూర్చొని పిల్లనగ్రోవి ఊదుతున్నాడు. ఆవులు పాట వింటూ తలూపుతున్నాయి. గాలిలో తేలిపోతున్న పిట్టలు ఎగరడం ఆపి ఆ చెట్టు కొమ్మల మీద వాలుతున్నాయి. ఆకాశంలో ప్రయాణం చేస్తున్న మేఘాలు పాట కోసం దిగొచ్చి, సన్నని చినుకులు రాలుస్తున్నాయి.

ఒక అమ్మాయి బండెక్కి వెళ్తున్నదల్లా అగి పరుగెత్తుకుంటూ వచ్చింది.

“నే నెక్కి కూర్చునే చెట్టు కూడా నిన్నటితో మీవాళ్ళు నరికిపారవేశారు. రాతి మిద్దెలు లేవబోయే ఈ చోట నాకూ, నా మురళికీ ఇంకేం పనిలేదు. అది చెప్పడానికే ఉన్నాను. ఇంక నేను వెళతాను” అన్నాడు మురళి ఊదే పాపడు.

పిల్లవాడు మురళి ఊదడం ఆపి ఆమెవంక చూశాడు.

“పాపడా, పాపడా నువ్వెవరివి?” అడిగిందా అమ్మాయి మెరిపించే కళ్ళతో.

“నేనీ ఆవులు కాసే పిల్లవాణ్ణి” కొమ్మమీంచి చెప్పాడు మురళి ఊదే పిల్లవాడు.

“పాపడా, పాపడా, ఆవుల పాపడా పాట ఎందుకు ఆపావు?” అందా అమ్మాయి.

“సూర్యుడు పడమట కుంగిపోతున్నాడు. ఆవులు మళ్ళించే వేళయింది”, అన్నాడు మురళి ఊదే పిల్లవాడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నా కోసం మళ్ళీ ఆ పాట పాడవూ?” అందా అమ్మాయి.

ఆవుల పాపడు మళ్ళీ మురళి పాట పాడాడు. ఆ అమ్మాయి పాట విన్న ఆనందంలో మైమరచి ఆడింది.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా రేపు మళ్ళీ వచ్చి పాట పాడతావా?” అడిగిందా అమ్మాయి.

“రోజూ ఇక్కడికొస్తాను. ఈ చెట్లలో పుట్టల్లో ఆడతాను. గడ్డి బయళ్ళలో ఆవుల్ని మేపుతాను. ఈ కొమ్మ నెక్కి మురళి పాట పాడతాను” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, అయితే రేపు మళ్ళీ వస్తాను” అందా అమ్మాయి.

మర్నాడు ఆ పిల్లవాడు అదే చెట్టు కొమ్మ మీద మురళి పాట పాడుతున్నాడు.

బండి మీద ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా కొత్తపాట పాడు” అంది.

మురళి ఊదే పాపడు ఆమె కోసం కొత్త పాట పాడాడు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి చెట్లలో, పుట్టల్లో ఆడుకున్నారు. పచ్చిక బయళ్ళలో పరుగులు తీశారు.

సాయంత్రం మురళి ఊదే పాపడు చెట్టు కొమ్మనెక్కి మళ్ళీ మురళి పాట పాడాడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నేను రోజూ వస్తాను. రోజూ నాకోసం నువ్వో కొత్త పాట పాడు” అందా అమ్మాయి.

ఆ రోజు నుంచీ ఆ అమ్మాయి మురళి పాట కోసం ప్రతిరోజూ అక్కడికొస్తోంది. మురళి ఊదే పాపడు రోజూ ఆమెకో పాట వినిపిస్తాడు. ఇద్దరూ చెట్లల్లో, పుట్టల్లో, పచ్చిక బయళ్ళలో మళ్ళీ మళ్ళీ ఆడ్తారు. మళ్ళీ మళ్ళీ మురళి ఊదే పాపడు అ అమ్మాయికి పాట పాడి వినిపిస్తాడు.

వసంతం వెళ్ళిపోయింది,. ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వెళ్ళిపోయింది. వానాకాలం వచ్చింది.

వానాకాలం వచ్చింది, వానలు మాత్రం రాలేదు.

ఆవులు ఆకాశం వంక చూశాయి. వానలు మాత్రం రాలేదు.

పచ్చికబయళ్ళు వట్టిపోయాయి.వానలు మాత్రం రాలేదు.

ఒకరోజు అమ్మాయి ఎప్పట్లాగే బండి మీద వెళ్ళింది.

మురళి ఊదే పాపడు గమ్మున కూర్చున్నాడు. అతని చేతుల్లో మురళి జాలిగా చూస్తోంది.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా, ఎందుకు ఊరికే కూర్చున్నావు?” అడిగిందా అమ్మాయి.

“గడ్డిబయళ్ళు వట్టిపోయాయి. ఆవుల డొక్కలు ఎండిపోయాయి. నే నింక పాడలేను” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా ఎందుకు గడ్డిబయళ్ళు వట్టిపోయాయి? ఎందుకు ఆవుల డొక్కలు ఎండిపోయాయి?” అడిగిందా అమ్మాయి.

“వానాకాలం వచ్చింది. వానలు మాత్రం రాలేదు. నేల నెర్రెలు చీలింది. వానలు మాత్రం రాలేదు. గడ్డిబయళ్ళు వట్టిపోయాయి. ఆవుల డొక్కలు ఎండిపోయాయి. నాచేతి మురళి మూగవోయింది. నాపాట కూడా ఆగిపోయింది.” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, గడ్డిబయళ్ళు వట్టిపోతే పోయాయి. ఆవుల డొక్కలు ఎండిపోతే పోయాయి. నువ్వు మాత్రం పాట ఆపకు” అందా అమ్మాయి.

“ఆవుల డొక్కలు ఎండిపోతే నా మురళి కూడా మూగవోయింది. నా పాట కూడా ఆగిపోయింది. నువ్వు మళ్ళీ రావద్దు. పాట పాడమని నన్నడగొద్దు.” అన్నాడు మురళి ఊదే పాపడు.

ఆ అమ్మాయి చిన్నిగుండె బాధతో నిండిపోయింది.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నేల ఎందుకు చీలింది? వాన ఎందుకు రాలేదు?” అని అడిగింది.

“చెట్లూ పుట్టలూ నరికేస్తున్నారు. మబ్బుకు అలక తెప్పిస్తున్నారు. వానలు అందుకు రామంటున్నాయి. నేలలు అందుకు చీలిపోతున్నాయి.” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా చెట్లూ పుట్టలూ ఎందుకు నరికేస్తున్నారు? మబ్బుకు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు?” అని అడిగిందా అమ్మాయి.

“అదేమో నాకేం తెలుసు? అది మీవాళ్ళనే అడుగు. చెట్లూ పుట్టలూ వాళ్ళే నరుకుతున్నారు. మబ్బుకు కోపం తెప్పిస్తున్నారు.” అన్నాడు మురళి ఊదే పాపడు.

“అయితే మరి వాళ్ళేనా పాపడా, పాపడా మరేం దిగులు పడకు. వాళ్ళంతా నావాళ్ళే. మా నాన్నగారు ఊళ్ళేలే నాన్నగారు. ఆయనతో చెప్పి చెట్లూ పుట్టలు నరకడం ఆపిస్తాను. నువ్వేం దిగులుపడకేం” అని చెప్పి అమ్మాయి తన ఊళ్ళేలే నాన్నగారి దగ్గరికి వెళ్ళింది.

“నాన్నగారూ, నాన్నగారూ, ఊళ్ళేలే నాన్నగారూ చెట్లూ పుట్టలు ఎందుకు నరికేస్తున్నారు? మబ్బుకు కోపం ఎందుకు తెప్పిస్తున్నారు?”అని అడిగింది.

“ఎందుకు చెట్లు? ఎందుకు పుట్టలు? భవనాలు కడితే బోలెడు డబ్బొస్తుంది. చిట్టితల్లికి వంటినిండా బంగారం వస్తుంది” అన్నారు ఊళ్ళేలే నాన్నగారు.

“నాన్నగారూ నాన్నగారూ ఊళ్ళేలే నాన్నగారూ నాకు భవనాలొద్దు. నాకు బంగారం వద్దు. చెట్లు నరకడం ఆపించండి. మళ్ళీ వానలు కురిపించండి.” అందా అమ్మాయి.

“ఇలాంటివి చిన్నపిల్లలకు తెలుస్తాయా?నాలుగు చెట్లు నరకనందుకే మబ్బులు మెచ్చి కురుస్తాయా? మబ్బుల విషయం ఆలోచించకు. వెళ్ళి ఆడుకో, ప్రశ్నలు వేయకు” అన్నారు ఊళ్ళేలే నాన్నగారు.

ఆ అమ్మాయి వెళ్ళి ఆడలేదు. విచారపడడం మానలేదు.

మర్నాడు ఆమె వెళ్ళేసరికి మురళి ఊదే పాపడు ఎక్కడికో బయలుదేరుతున్నాడు.

“పాపడా, పాపడా మురళి ఊదే పాపడా ఎక్కడికి నువ్వు వెళుతున్నావు” అనడిగిందా అమ్మాయి.

“నే నెక్కి కూర్చునే చెట్టు కూడా నిన్నటితో మీవాళ్ళు నరికిపారవేశారు. రాతి మిద్దెలు లేవబోయే ఈ చోట నాకూ, నా మురళికీ ఇంకేం పనిలేదు. అది చెప్పడానికే ఉన్నాను. ఇంక నేను వెళతాను” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నువ్వెక్కడికీ వెళ్ళకు. నువ్వు మరి వెళ్ళిపోతే నాతో ఆడేదెవరు? మురళి పాట పాడేదెవరు” అందా అమ్మాయి.

“చెట్లలో పుట్టల్లో పచ్చిక బయళ్ళలో గాలిమీద సాగుతూ తేలిపోయే నా పాట రాతి గోడలకేసి తలబాదుకోలేదు. నువ్వు నన్నాపకు” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు?” కన్నీళ్ళతో అడిగిందా అమ్మాయి.

ఆ అమ్మాయి ఆ రోజు పిల్లనగ్రోవిని దగ్గర పెట్టుకు పడుకుంది. మబ్బు తునక కోసం ఆకాశం కేసి చూసింది. చిత్రంగా ఆకాశం ఆమె కళ్ళముందు ఒక్కసారిగా తెరుచుకుంది. ఎక్కడో తారల దారుల వెంట ఆకాశానికెంతో అవతల ఒక సుందరవనం ఆమె కళ్ళకు కనిపించింది.

“చెట్లూ చేమలతో ఈ నేలంతా మురిసిపోవాలి. ఆకాశంలో సాగిపోయే మబ్బులు కిందికి దిగిరావాలి. వానజల్లుతో ఈ నేల తడిసి పునీతం కావాలి. అప్పుడే మళ్ళీ వస్తాను. నా పాట నీకు వినిపిస్తాను.” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా పాపడా నన్ను మాత్రం మరచిపోకు” చెయ్యి ఊపుతూ అందా అమ్మాయి.

నేలమీద చెట్లూ పుట్టలు అన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. ఏ వైపు చూసినా రాతిగోడలు వెలిశాయి. ఊళ్ళేలే నాన్నగారికి డబ్బులు చాలా వచ్చాయి. అమ్మాయికి వంటినిండా బంగారు నగలు తెచ్చాయి.

అమ్మాయి మాత్రం వాటిని తొడగలేదు. దూరంగా నగలు విసిరేసింది.

రోజూ ఆమె ఇంటి మేడమీద పడుకుని ఆకాశం వంక విప్పారిన కళ్ళతో చూస్తుంది. ఒక్క మబ్బు తునకైనా లేదు. ఒక్క వానచినుకైనా రాదు.

వానాకాలం వెళ్ళింది. మళ్ళీ వానాకాలం వచ్చింది. ఆ వానాకాలం వెళ్ళింది. ఇంకో వానాకాలం వచ్చింది. వానలు మాత్రం రాలేదు. మురళి ఊదే పాపడి జాడ లేదు.

ఒకరోజు ఊళ్ళేలే నాన్నగారు కూతురికి ఇష్టమని ఒక పిల్లనగ్రోవి పట్టుకొచ్చారు.

అది చూస్తూనే ఆ అమ్మాయి “వచ్చాడా?” అంటూ ఆత్రంగా గుమ్మంవైపు పరుగెత్తింది.

ఊళ్ళేలే నాన్నగారు ఆమెను పట్టుకున్నారు.

“ఎక్కడికలా పరిగెడతావ్? పరిగెడితే పడిపోతావ్. ఇదిగో పిల్లనగ్రోవి. ఇది చూసైనా దిగులు మానుకో. పారేసిన నగలు తీసి వంటి నిండా పెట్టుకో.” అన్నారు.

ఆ అమ్మాయి ఆ రోజు పిల్లనగ్రోవిని దగ్గర పెట్టుకు పడుకుంది. మబ్బు తునక కోసం ఆకాశం కేసి చూసింది. చిత్రంగా ఆకాశం ఆమె కళ్ళముందు ఒక్కసారిగా తెరుచుకుంది. ఎక్కడో తారల దారుల వెంట ఆకాశానికెంతో అవతల ఒక సుందరవనం ఆమె కళ్ళకు కనిపించింది.

ఆ నందనవనం నిండా ఎన్నో చెట్లు, ఎన్నో పూలు, ఎన్నో పక్షులు, మురళి ఊదే పాపడు ఒక చెట్టు కొమ్మమీద కూర్చుని మురళి ఊదుతున్నాడు. చుట్టూ కొన్ని వందల వేల ఆవులు పాటకు తలూపుతూ పచ్చిక మేస్తున్నాయి.

అది చూస్తూనే “పాపడా, మురళి ఊదే పాపడా” అని అమ్మాయి కేక వేసింది.

మురళి ఊదే పాపడు పాట ఆపి అమ్మాయి వంక చూశాడు. అతని పెదవుల మీద ఎంతో అందమైన చిరునవ్వు లాస్యం చేస్తోంది. దివ్య తేజస్సుతో అతను వెలిగిపోతున్నాడు. “పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా నువ్వక్కడ ఆకాశంలో ఏం చేస్తున్నావు” అని అడిగిందా అమ్మాయి.

“ఇది ఆకాశం కాదు. ఆకాశం కంటే ఇంకా ఎంతో దూరం. ఇక్కడ రాతిమేడలు లేవు. ఎటుచూసినా చెట్లు. ఎటు చూసినా పచ్చికబయళ్ళు. ఇక్కడ మబ్బులు అలగవు. రోజూ అమృతం కురుస్తూ ఉంటుంది. ఇదొక అద్భుతమైన చోటు” అన్నాడు మురళి ఊదే పాపడు.

“పాపడా, పాపడా, మురళి ఊదే పాపడా, అక్కడికి నువ్వెలా వెళ్ళావు?” అని అడిగిందా అమ్మాయి.

“రాతిగుండెల మనుషుల మధ్య ఎన్నో దేశాలు తిరిగాను. ఎటు చూసినా రాతిగోడలు లేవడం చూశాను. ఎవరూ కూల్చలేని గొప్ప గొప్ప రాతిగోడలు. మనుషులకూ మనుషులకూ మధ్య రాతి గోడలు. కొట్టుకు చావడంలో కొందరు, డబ్బు సంపాయించడంలో కొందరు మునిగి తేలుతున్నారు. ప్రకృతిని ప్రేమించలేనివాళ్ల మధ్య నాకూ, నా మురళికీ చోటు లేదు. అందుకే ఇక్కడికి వచ్చేశాను. ఇదే నా చోటు. ఇంకెప్పుడూ నేను మళ్ళీ అక్కడికి రాను. కలకాలం ఇక్కడే మురళి పాట పాడుకుంటాను” అంటూ మురళి ఊదే పాపడు మళ్ళీ పిల్లనగ్రోవి అందుకున్నాడు.

ఆ మధురమైన సంగీతానికి మళ్ళీ ఆవులు తలూప నారంభించాయి. మళ్ళీ పిట్టలు గంతులేస్తూ ఎగర నారంభించాయి. మబ్బులు అమృతం కురిపిస్తున్నాయి.

“పాపడా పాపడా నేనూ అక్కడికి వస్తాను” కేకేసిందా అమ్మాయి.

సరిగ్గా అదే సమయంలో ఆకాశం మళ్ళీ మూసుకుపోయింది. పాట మళ్ళీ ఆగిపోయింది.

“పాపడా” అని అరుస్తూ ఆ అమ్మాయి చేతులు చాచి ముందుకు పరుగెత్తింది.

ఆ మర్నాడు ఊళ్ళేలే నాన్నగారు చూసేసరికి ఆ అమ్మాయి రాతిగోడల మధ్య నిర్జీవంగా పడుంది.

ఆమె విసిరేసిన బంగారు నగలు వెలవెలబోయి చూస్తున్నాయి.

ఊళ్ళేలే నాన్నగారు నేల మీద కూలబడ్డారు. ఆ అమ్మాయిని సమాధి చేసిన చోటనే చిత్రంగా ఒక అందమైన చెట్టు మొలిచింది. వానకారు అవసరం లేని చెట్టు. అమృతంతో పెరిగే చెట్టు.

భూమండలం మీద మిగిలిన ఒకే ఒక చెట్టు.

ఆ చెట్టు నీడలో విశ్రమించడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూంటారు.

అలా విశ్రమించిన వారికి రహస్యంగా ఒక పిల్లనగ్రోవి పాట వినిపిస్తుందని చెబుతారు.

———————–
దాదా హయత్
దాదా హయత్ ప్రసిద్ధ తెలుగు కథారచయిత, అనువాదకుడు, సమీక్షకుడు మరియు కవి. 1960 అక్టోబరు 10 న కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన దాదాహయత్ విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల్లో సాగింది. ప్రస్తుతం ఆయన ప్రొద్దుటూరులోనే న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. “మొదట్లో రాయించింది రచనా కుతూహలం – ఇప్పుడు రాయిస్తున్నది మనిషి జీవితం” అనే దాదా హయత్ 1983లో ‘అహింస’ కథతో రచనావ్యాసంగం ప్రారంభించాడు. తొలి కథతోనే మంచి రచయితగా ప్రసిద్ధి పొందాడు. ఆ కథ ఇతరభాషల్లోకి కూడా అనువాదమైంది. సున్నితమైన భావవ్యక్తీకరణతో జీవితానుభవాలను కథలుగా మలచడంలో హయత్ సిద్ధహస్తుడు. ఇప్పటిదాకా 60 కథలు, 10 కవితలు, అనేక పుస్తక సమీక్షలు రాశాడు. 20కి పైగా కథలను అనువదించాడు. ఈయన రాసిన చాలా కథలు తెలుగులో వచ్చిన ప్రసిద్ధ కథాసంకలనాల్లో చోటుచేసుకున్నాయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అహింస, మసీదు పావురం, ఎల్లువ, ఏటిగట్టు చేపలు, సెగమంటలు వాటిలో కొన్ని. మురళి ఊదే పాపడు కథను పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన రచయితకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కథను అందిస్తున్నాం.

Posted in కథ | Tagged , , | 8 Comments

జీవితం

– స్వాతి శ్రీపాద

వెన్నెల జలపాతం ఒడిలో
నగ్నంగా స్నానాలాడుతూ
నర్తిస్తున్న రాత్రి
ఒళ్ళు మరచి పరవశిస్తూ…
క్షణక్షణానికీ మధు పాత్ర నింపుతున్నట్టు
చుక్కలు రాలి వెలుగులను వంపుతుంటే
ఒంటరిగా ఒక్కక్షణం
ఉనికిని కోల్పోయిన ఊహలా
అదృశ్యమయి పోదామనిపిస్తుంది

కలల తివాచీకి రంగులద్ది
సుఖాల పల్లకిలో ఊరేగుదామనిపిస్తుంది
అంతలోనే
మేకప్ చెరిపేసుకున్న నర్తకి మొహంలా
జిడ్డోడుతున్న వాస్తవం
సగం కరగి పోయిన కృత్రిమతా
చేతులు కలుపు కుంటూ
జీవితాన్ని పరిచయం చేస్తాయి
పెదవుల మీద తొణకని స్వప్నం
కనురెప్పలవెనుక నీటి చుక్కై
అదృశ్య సునామీలను అదిమిపెడుతూ
చూపు సారిస్తుంది

————————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

Posted in కవిత్వం | 10 Comments

అభినవ భువనవిజయము -9- సర్వధారికి సుస్వాగతము

(<< గత భాగము)

‹కొత్తపాళీ› విశ్వామిత్రా .. కొత్త సంవత్సరానికి స్వాగత పద్యం ఏమన్నా చెబుతారా?
* రాఘవ సాహిత్యంలో చేరారు
‹విశ్వామిత్ర› చిత్తగించండి

సీ. తెలుగింట తొలినాడు పలు రుచులను కల-
గలపు పచ్చడందు పులుపు నాది!
వనమంత తిరుగాడి తనగొంతు ఎలుగెత్తి
బులుపించు పాటకోయిలయు నాది!
మదికింపు గలిగించి మరులెన్నొ గురిపించి
మన్మధు మురిపించు మల్లె నాది!
తిమిరమ్ము తొలగించి దీపమ్ము వెలిగించి
నవ్య కాంతు లీను రవియు నాది!

ఆ.వె.

అనెడి ఆమనికిదె ఆహ్వానమనెదను
ఆరు ఋతువులకును ఆది;ఆశ
లకు పునాది, మా తెలుగువారి యుగాది
శాంతి సుఖములిమ్మ సర్వధారి.

‹నాగరాజు› వావ్..
‹కొత్తపాళీ› భలె భలె
‹రాకేశ్వరుఁడు› అద్భుతం
‹molla› భళీ
‹రాఘవ› భళీ
‹చదువరి› బ్రహ్మాండంగా ఉంది పద్యం!
‹నాగరాజు› మన్మధుడిని మురిపించే మల్లె – ఏం చమత్కారమండీ! ఆయన పంచబాణాల్లో అది కూడా ఒకటి కాదూ!?
‹భట్టుమూర్తి› విశ్వామిత్ర, ఇలాంటి సీసాలు విన్నప్పుడే … ఫుల్లు సీసా కొట్టినంత కంటే మాంచి కిక్కు వస్తుంది.
‹చదువరి› భట్టుమూర్తి, 🙂
‹విశ్వామిత్ర› భట్టుమూర్తి, 🙂 :0
‹కొత్తపాళీ› భట్టుమూర్తి, ఫుల్లులెందుకు నాయనా .. పుల్లసరోజనేత్రలను చూచుకొమ్ము
‹భట్టుమూర్తి› ‘ఫుల్లు’సరోజ నేత్ర … హహ్హహ్హ
‹భట్టుమూర్తి› ఎంత బాగుందీ పద్యం ! సీరియస్ గా చెబుతున్నా… చివర్లో శాంతిసౌఖ్యాలిమ్మని సర్వధారిని కోరుతూ ముగించడం గొప్పగా వుంది!
‹రాకేశ్వరుఁడు› నాకెక్కడో శ్రీశ్రీ కవితల్లోని దూకుడు కూడా కనిపిస్తుంది ఈ సీసంలో…
‹కొత్తపాళీ› రాకేశ్వరుఁడు, శ్రీ శ్రీ కవిత చాలా వరకూ రగడల్ని అనుసరించి రాశాడు. రగడలు సీసానికి దగ్గరి అక్కచెల్లెళ్ళే.
రాఘవ› ఓహో… నేను శ్రీశ్రీని అంతగా చదవలేదు
‹రాకేశ్వరుఁడు› కొత్తపాళీ, ఈ రగడలను ఓ పట్టు పట్టాలైతే…

‹విశ్వామిత్ర› అదే చమత్కారం, మళ్లీ ఉగాది చివరి పాదం ఒక్కటీ మార్చి వస్తా

‹molla› అడగొచ్చా, విశ్వామిత్రుడు ఎవరూ?
‹చదువరి› మొల్ల, మీరెవరో చెప్పకుండానే..!?
‹molla› నేను మొల్లనే!
‹విశ్వామిత్ర› విశ్వానికే మిత్రుడు. మిగతా వివరాలు పొద్దులో.
‹molla› సరే.

‹కొత్తపాళీ› రాఘవ కవీ మళ్ళీ వేంచేశారు .. మీ వంతు … పొద్దుపొడుపును వర్ణించండి
‹రాఘవ› తప్పకుండా. అవధరించండి.

త. తెలుపుచూ మన భాష కీర్తిని దేశదేశములందునూ
కలుపుకోలుతనమ్ముఁ జూపుచు, ఆంధ్రసాహితి వెల్లువన్
నిలుపువారికి నూతమిచ్చుచు నిర్మలోత్సుకతన్ మరో
మలుపు తిప్పెను పొద్దు పత్రిక పంచనెజ్జనపుత్రియై.

* బ్లాగేశ్వరుడు సాహిత్యంలో చేరారు (అంతవరకూ మౌన ప్రేక్షకులుగా పద్యాలను ఆలకిస్తూ వుండిన ఒరెమూనాగారు బ్లాగేశ్వరుని రాకను సభాధ్యక్షులకు తెలియజేశారు)
‹విశ్వామిత్ర› బ్లాగేశ్వరులకి వందనాలు,
‹రాకేశ్వరుఁడు› బ్లాగేశ్వరుడు, మీరు చాలా మిస్సయ్యారు … మఱి …
‹చదువరి› బ్లాగేశ్వరుడు, స్వాగతం!
‹బ్లాగేశ్వరుడు› అందరికి వందనాలు

‹కొత్తపాళీ› చదువరి, మీ ‘పొద్దు‘ని కూడ వెలయించండి
‹చదువరి›

జాల మహా సముద్రమున జాలరి వీరులు గూగిలించుచో
వేలకు వేలుగా పడును పెద్దవి చిన్నవి సైటులెన్నియో
తాలులు తప్పలన్ విడిచి నాణ్యత కల్గిన వాటినెంచినన్
పూలగు సైటులందొకటి పొద్దయి నిల్చిన ముద్దగున్ గదా

‹విశ్వామిత్ర› “గూగిలించుచో” బావుంది ప్రయోగం
‹కొత్తపాళీ› రూపకం మొదటి పాదంలో శోభించింది
‹రాఘవ› భలే… రంజుగా వుందీ పజ్జెం
‹రాకేశ్వరుఁడు› చదువరి, భావకవిత్వపు రూపకాల్ని బలే బంధించారు ఛందస్సులోఁ
‹భట్టుమూర్తి› నాలుగోపాదంలో … పూలగు … ఆంగ్లమేనా?
‹చదువరి› భట్టుమూర్తి, ఔను
‹బ్లాగేశ్వరుడు› చదువరి గారు భళి భళి
‹రాఘవ› నాకు ఇక్కడకి ఆ పూలవాసన తెలుస్తోంది

‹కొత్తపాళీ› కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మరి కొందరు కూడా రాశారు .. రాకేశ్వరా, నీదొక సీసం ఉన్నట్టుంది, కానివ్వు.
‹రాకేశ్వరుఁడు› నా సీసమా … తెరుస్తాను కాసుకోండి
‹రాకేశ్వరుఁడు› ఇది యుగాది గీతం.
సీ. కాలముతో నాయె కారులె తురఁగలు,
‹రాఘవ› గీతమా?
‹నాగరాజు› రాఘవ – రాకేశ్వరుడు చెపితే అది ‘గే’తము కదా?
‹రాఘవ› నాగరాజు, కేకకి నిర్వచనం చెప్పారు కదా
‹కొత్తపాళీ› తురకలా?
‹విశ్వామిత్ర› తురఁగలు. ఓహో గుఱ్ఱాలా!
‹రాకేశ్వరుఁడు› వినండి.

సీ. కాలముతో నాయె కారులె తురఁగలు,
యంత్రము లొచ్చెను యడ్ల బదులు
సూర్యుడు తారాయె సోముడు రాయాయె,
మాఱెను మా తిండ్లు మాఱెనిండ్లు
ఎన్ని మాఱిన యిల నన్ని మాఱిన గాని,
నీవు మాత్రము యిలా నెపమెఱుఁగక
శివమహా రాత్రికిఁ శ్రీరామ నవమికిన్
నడుమనే వత్తువు నడుమ మాకుఁ
తేగీ. ఆశనే నమ్మిన జనుల కాశ నమ్ము
కొను యో పబ్బరాజమా, గుఱుతు నీవు
మాఱు కాలానికే, మఱి మాఱుతువని
యునికి మాది నమ్ముటయెలా? యో యుగాది!

‹కొత్తపాళీ› పబ్బ రాజమా .. బాగుంది
‹విశ్వామిత్ర› పబ్బరాజమా బాగు
‹భట్టుమూర్తి› చాలా బాగుంది
‹నాగరాజు› చాలా బావుంది రాకేశ్వరా – నీ పద ప్రయోగాలు అన్నీ అదుర్సు.
‹రాఘవ› పాతదనం చెప్పడంలో మరీ పురాతనానికి వెళ్ళి అతిశయోక్తి ఛాయ కూడ తెచ్చారు కదా… భళా
‹కొత్తపాళీ› ఉగాది పండుగ శివరాత్రికీ శ్రీరామ నవమికీ మధ్య రావడం కూడా మంచి సందర్భోచితంగా ఉంది
‹భట్టుమూర్తి› ఔను… ఉగాదిని పబ్బరాజమనడం బాగుబాగు !

‹రాకేశ్వరుఁడు› నా మొదటి సీసము, మరియు తేటగీతము … యుగాదికి అర్పితం.
‹రాఘవ› ‘శకట’రేఫప్రయోగంలోనూ నీకు నీవే సాటి రాకేశా
(శకటము అంటే బండి కదా!)
‹రాకేశ్వరుఁడు› ఱాకేశా 😉
‹కొత్తపాళీ› రాఘవ, ఆయనకిది నల్లేరు మీద ‘బండి’ కదా 🙂
‹చదువరి› పద్యంలో ఎన్ని ఱ లో!
‹భట్టుమూర్తి› ఱాకేశ్వరుఁడా …
‹రాఘవ› శకటాలకూర్చి చెప్పేటప్పుడు శకటరేఫం… అదుర్స్

‹రాకేశ్వరుఁడు› రాఘవ, మీ అంత ఆలోచించలేదండి.. ఏవో అనుకోకుండా వచ్చిన బండి చక్రాలు ..
‹కొత్తపాళీ› ఱాకు ఈశ్వరుండు ఱాకు ఱాకు!
‹భట్టుమూర్తి› ఇకనుండి ఆంగ్ల పదాలకు, కొత్తపదాలకు ఱ వాడాలి.. 🙂
‹బ్లాగేశ్వరుడు› రాకేశ్వరా చాలా బాగున్నది.

‹రాకేశ్వరుఁడు› అన్నట్టు … ఆశను నమ్ముకునే జనాలకు పండగలు వచ్చి ఆశను అమ్ముతాయని … భావం
‹రాఘవ› రాకేశ్వరుఁడు, మొదటే అర్థమైంది. ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది.
‹కొత్తపాళీ› రాకేశ్వరుఁడు, ఆ భావం బహు గడుసైన భావం .. మిగతావన్నీ పద్యానికి అలంకారాలే అయినా ఇలాంటి భావాలే ప్రాణం పోసేది.
‹విశ్వామిత్ర› అవును.
‹రాఘవ› కొత్తపాళీ, చక్కగా చెప్పారు.
‹నాగరాజు› ఎలాగు పాతదనం పోతోందని వాపోతున్నప్పుడు, ఇప్పుడు వాడుకలోలేని బండి ర ప్రయోగం కూడా పద్యానికి ఓ లోతుని తెచ్చింది.
‹రాకేశ్వరుఁడు› నాగరాజు, బాగా చెప్పారు … నాకు కొత్త దనం లో లేని మోజును indirect గా అది కూడా సూచిస్తుంది…

‹కొత్తపాళీ› ఉగాది గురించి ఇంకెవరన్నా చెబుతారా? ఇంక దానితో ముగిద్దాము
‹విశ్వామిత్ర› అవును

‹కొత్తపాళీ› ఉగాది గురించి ఇంకెవరన్నా చెబుతారా?
‹రాఘవ› నేనెప్పుడో అంటే ఒక ఐదేళ్ళక్రితం రాసాను ఈ పద్యం. ఇప్పటికీ సరిపోతుంది.

కం. శుక పికముల రవములతో
వికసించిన హృదయమందు విడువక భక్తిన్
ఇక కొలిచెదమా రాముని
సకల శుభమ్ములు కలుగగ సతతము భువిలో.

‹కొత్తపాళీ› రాఘవ, మంచి మంగళాశాసనం చెప్పారు.
‹చదువరి› చక్కటి ముగింపు పద్యం!
‹రాఘవ› నవమికి వ్రాసాను. ఉగాది దగ్గరే కదా.

‹కొత్తపాళీ› ఇక దీనితో అధికారిక సభ ముగిస్తున్నాను. సభ్యులు ఇచ్ఛకొలదీ ముచ్చట్లాడుకోవచ్చు. ముగింపుగా నా వందన సమర్పణ ఇది…

ఆ.వె. కవులు పండితులును కావ్య పఠన జేసి
సభను రక్తి జేయ సరసముగను
కొత్త వత్సరమిది కోరిన వరమిచ్చు
సర్వ శుభములిచ్చు సర్వధారి

‹విశ్వామిత్ర› సభా సరస్వతికి, కెమ్మోవిపై చిరునవ్వు చెదరకుండా సాగింది సభ.
‹రాఘవ›

క్రొత్తపాళి మాకు కూరిమి రాయలై
సభను కనులవిందు సలిపె కనుక
నాకు తోచినట్టి నాల్గు మాటలెనీకు
భూషలనుచు నేఁ ప్రభు చదివింతు

(నాలుగో పాదాన్ని రాఘవ పూరించబోతుండగా…మిగతావారు ప్రయత్నించారిలా… )

‹చదువరి› విన్నవింతునయ్య (భువన)విజయ రాయ.
‹విశ్వామిత్ర› కానుకనెద నన్ను కవిని జేయ.
‹భట్టుమూర్తి› సమర్పింతును నేడు సన్నుతముగ.
‹రాకేశ్వరుఁడు› విశ్వామిత్ర, కానుకనెద నన్ను కవిని జేయ మాః బా జెప్పారు.
‹రాఘవ› అబ్బో… ఇంతమంది కవుల నడుమ వున్నానంటే అదో సంతృప్తి…. కాదు కాదు. తుత్తి.
‹రాకేశ్వరుఁడు› రాఘవ, అదీ ఈ యుగంలో … !

‹కొత్తపాళీ› తాడేపల్లిగారు ప్రత్యక్షంగా లేని లోటు లోటుగానే ఉండిపోయింది.
‹నాగరాజు› కొత్తపాళీ – నిజమే, ఆయన కూడా ఉంటే చాలా బాగుండేది. మళ్ళీ ఉగాదికి – తప్పకుండా వస్తారు లెండి.
‹కొత్తపాళీ› గ్లోబల్ వార్మింగ్ సమస్య మీద మంచి చమత్కారమైన పద్యం చెప్పారాయన. చెప్పనా?
‹నాగరాజు› చెప్పండి.
‹చదువరి› చెప్పండి.

కం. ఓబామా ప్రైమరులను
సాబాలునకంటె గెలువ సతికిఁ జెమర్చెన్
గాబరపడి క్లింటనడుగ
గ్లోబలు వార్మింగ్ అటంచు గోముగ బలికెన్.

‹రాకేశ్వరుఁడు› కొత్తపాళీ, నేను కందం తప్పక రాయాలి అని, ఇలాంటి ఉపాయం కోసం ఎంత వెతికిన నాకు తట్టలేదు…
‹నాగరాజు› కొత్తపాళీ – సూపర్. చాలా బావుంది.
‹కొత్తపాళీ› దాన్ని నేను మొదట ‘ఓ భామా’ అని చదివా
‹రాకేశ్వరుఁడు› సాబాలున కంటే అనగా … ?
(సాబాలు అంటే సగభాగము)
‹నాగరాజు› కొత్తపాళీ – కాని ఎప్పుడైనా గోముగా మాట్లాడిందా అని నా సందేహం!!
‹చదువరి› నాగరాజు, 🙂
‹కొత్తపాళీ› నాగరాజు, నిజమే 🙂

‹రాకేశ్వరుఁడు› గోముగ అంటే ఏఁవిటండి ఇంతకీ?
‹చదువరి› సాబాలునకంటె అంటే..?
‹రాకేశ్వరుఁడు› సగం కంటే ఎక్కవ.
‹భట్టుమూర్తి› గోముగ అంటే చెప్పండి …ఱాకేశ్ అడిగాడు 🙂 ఇక్కడ అది తెలిసిన పెద్దలు చాలామంది ఉన్నారుగా.
‹కొత్తపాళీ› గోముగ అంటే … నయా గారాన్ని అడుగు.
‹నాగరాజు› రాకేశ్వరా – “గోముగా అంటే ఏవిటండీ ఇంతకీ..” అని ఒక అందమైన అమ్మాయి రెచ్చగొట్టేటట్టు అడిగితే, అదే నీ ప్రశ్నకి సమాధానం.
‹రాకేశ్వరుఁడు› కోమలంగా అనా…
‹కొత్తపాళీ› రాకేశ్వరుఁడు, అర్ధం చేసుకోవూ … గారంగా …
‹రాకేశ్వరుఁడు› నాగరాజు, మీతో ముఖ పరిచయం లేని వారు మీ వయస్సు పదహారేమో అనుకుంటారు…
‹భట్టుమూర్తి› గారాలు పోతూ… అనునాసికంగా… ఇంకా కొంచెం ముందుకెళ్లొచ్చు…
‹చదువరి› ముద్దుగా, వయ్యారంగా, గారంగా, జాణతనంతో, … అలా ఇలా..
‹చదువరి› గోముగా!
‹రాకేశ్వరుఁడు› మొన్న నన్ను నవతరంగంలో ఒకతను … ‘ఓయ్ ముసలాడా నీకేమి అర్థమవుతాయి యూత్ ఆలోచనలు’ అని ఆడి పోసుకున్నాడు …
‹రాకేశ్వరుఁడు› నాగరాజు, మీలాంటి వారి దగ్గర నుండి నేర్చుకోవాలి .. కొన్ని యూత్ పాఠాలు…
‹చదువరి› 🙂
‹నాగరాజు›పగిలేటి పానపాత్రికలో మిగిలేటి కాస్త మధువుంటే అదియె సుమా ఉగాది, మన బతుకునకదియె పునాది“, అన్నాడు కృష్ణశాస్ట్ర్హి, పానపాత్రిక పగలలేదని, మధువులింకా ఊరుతున్నాయని మీరంతా ఋజువు చేసారు.

(సంభాషణ ఇలా ఉల్లాసంగా సాగుతూవుండగా భారతావనిలో బాగా పొద్దుపోవడంవల్లనూ, భూమికి మరోవైపున మధ్యాహ్నభోజనసమయం కావడంతోనూ మెల్లమెల్లగా ఒక్కొక్కరూ మిగతావారికి వీడ్కోలు చెప్పి నిష్క్రమించడంతో అభినవ భువనవిజయ సభ విజయవంతంగా ముగిసింది.)

——————-

సంకలనం: రానారె

Posted in కవిత్వం | Tagged | 10 Comments