Author Archives: స్వాతీ శ్రీపాద

About స్వాతీ శ్రీపాద

అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో 'మానస సంచరరే' శీర్షిక నిర్వహించారు.

ఇప్పుడైనా..

గరళాన్ని తాగి అమృతాన్ని ఆవిష్కరిస్తూ.. దినుసులకు ఊపిరి పోస్తుందా, విశ్వసమాజం అణువణువూ పరోపకారాన్నలదుకుంటుందా? Continue reading

Posted in కవిత్వం | 5 Comments

తోలుబొమ్మలు

— స్వాతీ శ్రీపాద “ఎవరు? ” “………” “ఎవరది?” కళ్ళు బాగానే కనిపిస్తాయంటుంది కాని కనిపించడం లేదని అర్ధమవుతూనేవుంది. గొంతువిని గుర్తు పడుతుంది. లేదూ చాలా దగ్గరగావుంటే చూడగలదనుకుంటా.. “అమ్మా! బ్రేక్ ఫాస్ట్ తిన్నావా ?” “నువ్వా? ఇప్పుడా అడిగేది? అన్నాలవేళ కూడా అయినట్టుంది ” “ఏం చెయ్యను చెప్పు ? నీకు తెలీనిదేఁవుంది … … Continue reading

Posted in కథ | 12 Comments

తడి

-స్వాతీ శ్రీపాద రాయలసీమ ప్రాకృతిక లక్షణం కరవు. ఇక్కడి మనుషుల స్వాభావిక లక్షణం కరకుదనం. ఈ రెండింటి మధ్య గల కార్య కారణ సంబంధం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన “తడి” కథలో స్పష్టమౌతుంది. ఇది కొత్త దుప్పటి కథాసంపుటిలోని ఆరవ కథ. కుటుంబ కలహాలు, తిండి కోసం పాడి పశువుల అవస్థలు, ఎండిపోయి వానకు కుళ్ళి … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 8 Comments

రాలిన చింతపండు – కొత్త దుప్పటి

– స్వాతీ శ్రీపాద మామూలు గ్రామీణ వాతావరణంలో ప్రతిచిన్న విషయానికీ ప్రాముఖ్యత వుంది. గ్రామీణులు చిన్నచిన్న విషయాలలో కూడా ఎంత జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తారో; అది వారికి ఎందుకు అవసరమో ఇదే రచయిత తన చినుకుల సవ్వడి నవలలో అద్భుతంగా చూపాడు.

Posted in వ్యాసం | Tagged | Comments Off on రాలిన చింతపండు – కొత్త దుప్పటి

ఒక్కవానచాలు

అచ్చ రాయలసీమ నుడికారంతో మొదలవుతుంది – ‘రాత్రి పదిగంటలు దాటినా మా యవ్వారం ఆగలేదు’ అంటూ. కథలు పురి విప్పడం, పద్యాలు గొంతుసవరించుకోడం, ఆకాశాన్ని ఎండిపోయి గవ్వలు బైటపడిన చెరువుతో పోల్చడం, దుప్పటి పొడవున్న నల్లటి మేఘపు తునక చందమామ వెన్నెల నవ్వుల్తో బయటకు రావడం లాంటి మాటల్లో రచయిత భావుకత్వం వెల్లడౌతుంది. Continue reading

Posted in వ్యాసం | 3 Comments

అభ్యుదయం

“ఉద్యమాలంటారు, విప్లవమంటారు, వల్లకాడంటారు – కాని వాస్తవానికొచ్చేసరికి ఏ కాస్త సడలింపునూ సరిపెట్టుకోలేరు. బలం కొద్దీ వ్రాసి పారేస్తే సమాజం మారుతుందా – ముందు మార్పు అనేది ఎవరికి వారు తెచ్చుకోవద్దూ!” అంటూ నిలదీస్తున్నారు స్వాతీ శ్రీపాద “అభ్యుదయం” కథలో. Continue reading

Posted in కథ | 8 Comments

‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ

–స్వాతీ శ్రీపాద. విస్తృతంగా కథలు రాస్తూ ఉన్నా తన్ను తాను అనుకరించుకోవాల్సిన అవసరంలేని వస్తువైవిధ్యం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. రాయలసీమను గురించీ, వ్యవసాయ జీవన పతనాన్ని గురించీ, దళిత జీవిత సమస్యలను గురించీ మళ్ళీ మళ్ళీ కథలు రాసినా అతని దృక్పథంలో ఉన్న కొత్తదనం ఆ కథలకు జీవం పోస్తుంది. బయటికి కనిపించని ఉద్విగ్నత … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on ‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ

కేతు విశ్వనాథరెడ్డితో ముఖాముఖి

— స్వాతీ శ్రీపాద సుప్రసిద్ధ కథకులు, సంపాదకులు, కవితాప్రేమికులు, సాహితీ విశ్లేషకులు, ప్రాచార్యులు, మరియు విద్యావేత్త అయిన శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారిని పరిచయంచేసేందుకు ఈ విశేషణాలు సశేషాలే. జీవితాన్ని ఒక తపస్సుగా సాధనచేసి సాహితీసేవకు అంకితం చేసిన ఆయనను అజో-విభొ-కందాళంవారు 2009వ సంవత్సరానికిగాను ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం వారిని వారు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 20 Comments

“నేర్చుకో” కథపై విశ్లేషణ

-స్వాతీ శ్రీపాద “సన్నపురెడ్డి అనగానే మనకి చనుబాలు, కొత్తదుప్పటి, కన్నీటి కత్తి, పాటల బండి, ప్రతిమల మంచం వంటి కొన్ని మైలురాళ్ళు గుర్తుకొస్తాయి. ఈ సంపుటి చదివాక అన్పించింది అతడి ప్రతి కథా ఒక మైలురాయేనని.” – వి.ప్రతిమ, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కథాసాహిత్యంలో చేసిన కృషికి గాను కేతు కథాపురస్కారం -2006 గ్రహీత. కొత్తదుప్పటి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

కొత్తదుప్పటి – విశ్లేషణ

-స్వాతీ శ్రీపాద ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ప్రస్తావన: సాధారణంగా ఏ కథాసంపుటిలో ఐనా చాలావరకు మంచి కథలు, కొన్ని సాదా సీదా కథలు, ఒకటో రెండో గొప్ప కథలు ఉంటాయి. కానీ కొత్త దుప్పటిలో మాత్రం అన్నీ గొప్ప కథలే. నా ఒక్కడికే ఇలా అనిపించిందా లేక నిజంగా ఇవన్నీ గొప్ప కథలేనా అని సందేహమొచ్చి ప్రతిమకు ఫోన్ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments