Tag Archives: విశ్లేషణ

సమస్యాపూరణములో అర్థశక్త్యుద్భవధ్వని చర్చ

“ధ్వని సిద్ధాంతములో అవివక్షితవాచ్యధ్వని అని ఒకటి ఉన్నది. వాచ్యార్థముచేత మాత్రమే కాక లక్ష్యార్థము వల్ల అర్థాంతర స్ఫూర్తి కలిగితే అది అవివక్షితవాచ్యధ్వని అంటారు(ట). అది రెండు విధాలు…” -అంతర్జాల కవిసమ్మేళనం నేపథ్యంలో ’ధ్వని’ మీద జరిగిన ఒక అర్థవంతమైన చర్చను పొద్దు పాఠకులకోసం సమర్పిస్తున్నాం. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

మీ కందం

కందం గురించి తెలుఁగు పద్యకవులకు చెప్పడమంటే తెలుగువాడికి గోంగూరపచ్చడి గురించి చెప్పడమన్నంత దోషం. తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన కందపద్యం ఒకదాని గురించి చెప్పి, ఆ పద్యం ఎందుకు నచ్చింది? ఆ వెనుక కథాక్రమంబెట్టిది? మొదలైన వివరాలను అందించండి. మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం చదవండి. Continue reading

Posted in వ్యాసం | Tagged , | 2 Comments

పోతన కవిత్వ పటుత్వము

__ శ్రీ తాపీ ధర్మారావు (పరిశోధన, 1954) “ముక్కుతిమ్మనార్యు ముద్దుపలు”కన్నట్లే పోతన్నది సహజ పాండిత్యమనీ అతను రామభక్తి పరాయణుడనీ సహృదయులు తమ అభిప్రాయాన్ని ‘గుళిగారూపం’గా ప్రకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర పోతరాజూ, యెడ్ల రామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారంభించారు. సహజ పాండిత్యం కాబట్టి పోతన్న ఆంధ్ర శబ్దచింతామణిగానీ కనీసం చిన్నయసూరి … Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 4 Comments

‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ

–స్వాతీ శ్రీపాద. విస్తృతంగా కథలు రాస్తూ ఉన్నా తన్ను తాను అనుకరించుకోవాల్సిన అవసరంలేని వస్తువైవిధ్యం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. రాయలసీమను గురించీ, వ్యవసాయ జీవన పతనాన్ని గురించీ, దళిత జీవిత సమస్యలను గురించీ మళ్ళీ మళ్ళీ కథలు రాసినా అతని దృక్పథంలో ఉన్న కొత్తదనం ఆ కథలకు జీవం పోస్తుంది. బయటికి కనిపించని ఉద్విగ్నత … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on ‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ