తాజా ప్రచురణలు
జులై 28
కవికృతి పదకండవ భాగంలో కొన్ని కబుర్లు.
జులై 19
కొల్లూరి సోమశంకర్ అనువాద రచయితగా సుప్రసిద్ధులు, సుపరిచితులు. వీరు సమర్పిస్తున్న తాజా కథ “నువ్వాదరిని..నేనీదరిని…“. ఉత్తర దక్షిణ భారతదేశాల సాంస్కృతిక వైవిధ్యతని స్పృశించే ఈ కథ తనకంటూ ఏ రాష్ట్రమూ లేని ఓ సింధీ యువకుడి ఆవేదనకి అద్దం పడుతుంది. అన్ని రాజకీయ సరిహద్దులు మానవ తప్పిదాల్లా అనిపిస్తాయతనికి. ఇక చవదండి… నువ్వాదరిని…నేనీదరిని…
—————–
జులై 15
పదాల పాదాల గుర్తుల్ని పదిలంగా దాచుకున్న కవితలతో కవికృతి పదవ భాగాన్ని సమర్పిస్తున్నాం.
—————–
జులై 13
కవిత్వపు వానొచ్చి తలుపు తడితే.. తీస్తూనే అక్షరాల జల్లు అనుభూతులతో తడుపుతుంది. కొండూరు ఆత్రేయ గారి కవిత మీకోసం.
—————–
జులై 8
2010 ఏప్రిల్ గడి ఫలితాలు ప్రకటించాం. ఫలితాల ప్రచురణలో జరిగిన ఆలస్యానికి చింతిస్తున్నాం. పొద్దుకు కొత్త రూపును సమకూర్చడంలో భాగంగా గడి సాంకేతికాలను సమూలంగా మారుస్తున్నాం. ఈ పనిలో కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవడం చేత గత రెండు నెలలుగా గడిని ప్రకటించనూ లేకపోయాం. ఈ నెలాఖరుకల్లా తదుపరి గడితో తిరిగి మీ ముందుకు వస్తాం.
—————–
జులై 7
నవరస భరితమైన కవితలతో కవికృతి తొమ్మిదవ భాగాన్ని ప్రచురించాము, అస్వాదించండి.
ఏ వీధిలోనో, గదిలోనో.. విధి లేక ఏ మదిలోనో ఆదమరచి ఉన్న అంతరంగం అట్టుడికిపోయేలా ఎప్పుడే మందుపాతర పేల్తుందో ద్వీపరాగ గారి కవితల్లో..
జులై 2
“నాకు మా అమ్మలాగా ఎప్పుడేం కావాలో చూసుకోవాలి. మావాళ్ళతో గౌరవంగా, కలుపుగోలుగా ఉండాలి, వంట బాగా రాకపోయినా పర్లేదులే.. మరి నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావ్?”
‘రసమయం జగతి‘ కథతో ఈ నెల ప్రచురణలను ప్రారంభిస్తున్నాం, చదవండి. స్వాతికుమారిగారి రచన.

