Tag Archives: అతిథి

ఏటి ఒడ్డున కొన్ని మాటలు – మూలా సుబ్రహ్మణ్యంతో స్వాతి కుమారి కబుర్లు

-స్వాతి కుమారి కవిత్వమంటే ఏమిటి, అది నిర్వచనాలకు, సమీకరణాలకు కట్టుబడి ఉండేదేనా? పద్యమైనా వచనమైనా, అందులో ఎన్ని మార్పులు, కొత్త పద్ధతులూ వచ్చి చేరినా.. మూల పదార్ధాలైన రసమూ, ధ్వనీ – మరోలా చెప్పాలంటే భావమూ, భాష – వీటి ప్రాముఖ్యత ఎంత వరకూ నిలబడి ఉంది? కొద్దో గొప్పో కవిత్వం రాయటం మొదలెట్టిన వాళ్ళకి … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 8 Comments

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఒక మునుజూపు Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 20 Comments

మా సాకలైవోరులు

సాకలైవోర్లు, కోమటి పంతుళ్ళు, పొలిమేర బళ్ళు,… ఇవన్నీ పోయాయి. ఇప్పుడన్నీ కాన్వెంటులూ, నేషనల్, ఇంటర్నేషనల్, Teknoa స్కూళ్ళే! ఏడో తరగతి నుండే ఎమ్‌సెట్లు, ఆరో తరగతి నుండి ఐఐటీలు.

రాయలసీమలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఓ రైతు.. ఆదినారాయణరెడ్డి తాను ఎలా చదువుకున్నారో చెబుతున్నారు. రండి, ఆదినారాయణరెడ్డి గారి సాకలైవోరు చదువెలా చెప్పారో తెలుసుకుందురుగాని. Continue reading

Posted in వ్యాసం | Tagged , | 9 Comments

రాఘవ వాగ్విలాసము – పరిచయము

గద్యం రాసే అలవాటే లేదాయనకు! ఆయన బ్లాగు నిండా కమ్మటి ఛందోబద్ధ పద్యాలే. పద్యాలకు చిరునామా ఆయన బ్లాగు. అలాంటి ముక్కు శ్రీరాఘవ కిరణ్ చేత పంతం పట్టి గద్యం రాయించాం. ఓ పూర్తి నిడివి వ్యాసమే రాయించాం. మొత్తానికి అనుకున్నది సాధించాం గదా అనుకుని వ్యాసం చూద్దుం గదా.. ఆయన పద్య రచనాప్రస్థానమే ఆ వ్యాసం! Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 5 Comments

అహమ్!

-ఆదినారాయణరెడ్డి మనపెద్దలు మనకు పూజలు, సేవలు, జపాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, యోగాలు, ధ్యానాలు మొదలైన వెన్నో భగవత్ ప్రీత్యర్థం ఉపదేశించారు. కానీ భగవంతుడు ఏమిటి? ఆయనను ప్రసన్నం చేసుకునే మనం–అంటే వాటిని నిర్వహించే “నేను” అనుకొనే ఎవరికి వారైన మనమంతా ఏమిటి? అంటే మన సిసలైన ప్రామాణిక స్వరూపం ఏమిటి? ఈ”నేను”ను … Continue reading

Posted in వ్యాసం | Tagged | 18 Comments

కౌంతేయులు

-సుగాత్రి రామాయణంలోని పాత్రలతో పోలిస్తే మహాభారతంలోని పాత్రలు మరింత సంక్లిష్టమైనవి. అయినప్పటికీ అవే మనకు వాస్తవికంగా, సహజంగా, ఇప్పటి పరిస్థితులకు తగినవిగా తోస్తాయి. ఎందుకంటే రామాయణం ఏ పుణ్యకాలంలోనో నివసించిన ఆదర్శప్రాయమైన వ్యక్తులు, వారి జీవితాలను వర్ణిస్తే, మహాభారతం ఒక సంధికాలంలో ధర్మానికీ-అధర్మానికీ మధ్య గుంజాటనపడిన వ్యక్తుల గురించి వివరిస్తుంది. ఆ సంధికాలంలోని పరిస్థితులే కొంచెం … Continue reading

Posted in వ్యాసం | Tagged | 13 Comments

నెజ్జనులకు సూచనలు

కొండొకచో ఆ అభివ్యక్తిలో అనుచితమయిన వ్యక్తీకరణలూ, అసంపూర్ణ భావాలూ కూడ వస్తూ ఉండవచ్చును. కాని ఆ అభ్యంతరాలను మించి చూడవలసిన విషయమేమంటే, ఇంతకుముందువరకూ రచన తమకు సంబంధలేని వ్యవహారమని అనుకున్న వర్గాల నుంచి హఠాత్తుగా రచయితలు పుట్టుకొస్తున్నారు. అవి పూర్తి రచనలు కాకపోవచ్చును, కాని రచనా ప్రయత్నాలు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం

రవాణా సౌకర్యాలు లేని యుగంలో ప్రయాణాలకు పనికొచ్చిన నడక శారీరకంగా ఇప్పటికీ మనకెంతో సహజమైనది. నడక అనేది ఒకప్పుడు మనుగడకు పనికొచ్చిన చర్య. రోజువారీ జీవితాల్లో అదొక భాగంగా ఉండేది. ఈ రోజుల్లో అది తగ్గిపోయి మనుషులు కదలనవసరం లేని జీవితాలకు అలవాటు పడుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనం నడుస్తున్నప్పుడు మెదడుకు ప్రాణవాయువును అందిస్తాం. ఊపిరి తీసే ప్రక్రియ మెరుగవుతుంది. గుండె వేగం హెచ్చుతుంది; మెదడులోని రక్తనాళాలు పెద్దవవుతాయి. శక్తి పెరిగి, వ్యర్థాలు ఎక్కువగా విసర్జించబడతాయి. ఈ రోజుల్లో మనుష్యుల ఆరోగ్యం అవగాహన బాగా మెరుగుపడింది. టెస్ట్‌ట్యూబుల్లో శిశువులు రూపొందే రోజులొచ్చాయి. మనిషి శరీరనిర్మాణం మాత్రం ఆనాటి ప్రత్యేక పరిస్థితుల్లో రూపుదిద్దుకుందనేది మరిచిపోరాదు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 5 Comments

మన జాతీయ కళారూపాల సంరక్షణ

-తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం(http://kalagooragampa.blogspot.com/) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎయిర్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం ముంబాయి నుంచి న్యూయార్క్ వెళ్ళే విమానం మీద Andhra Pradesh అని రాస్తారు. విమానం లోపల కూడా మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్యాటక స్థలాల ఛాయాచిత్రాలూ సమాచార పొత్తాలూ (booklets) లభ్యమౌతాయి. మన రాష్ట్రాన్ని సందర్శించడానికి విదేశీయులు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 7 Comments

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా – 2

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net) (ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఒకటవ తేదీన ప్రచురించబడింది.) వెనుకబాటుతనం – లోపం ఎక్కడుంది? ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సామాజికాంశాల మీద తరాల తరబడి కృషి చేస్తున్నా ఆశించదగ్గ స్థాయిలో పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావడం లేదు? ఒక ఊరిని తీసుకుంటే, … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments