Author Archives: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

About కొడవటిగంటి రోహిణీ ప్రసాద్

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్, 1949లో, మద్రాసులో కొడవటిగంటి వరూధిని, కుటుంబరావు దంపతులకు జన్మించారు. మద్రాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం (ఎం.ఎస్‌సి న్యూక్లియర్ ఫిజిక్స్) తరువాత భాభా అణుకేంద్రం, బొంబాయిలో ఉద్యోగం చేసారు. ముంబయి విశ్వవిద్యాలయం లో పి.ఎచ్‌డి చేసారు. రోహిణీ ప్రసాద్ 2012 సెప్టెంబరు 8 న ముంబై లో మరణించారు.

వ్యాపకాలు:
హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం, సితార్ వాదన, ఆర్కెస్ట్రాతో లలిత సంగీత కార్యక్రమాల నిర్వహణ, సులభశైలిలో సంగీతం గురించిన సోదాహరణ ప్రసంగాలు, సంగీతం మీద మల్టీమీడియా వ్యాసాలు.
ఇండియాలో, అమెరికాలో (4పర్యటనలు, వంద కచేరీలు) సితార్ సోలో, సరోద్, వేణువులతో జుగల్‌బందీలు, కర్నాటక వీణతో జుగల్‌బందీ కచేరీలు. రాజేశ్వరరావు తదితరుల సినీ, ప్రైవేట్ రికార్డింగ్‌లలో సితార్ వాదన, పి.సుశీల, తదితరులతో మద్రాసులోనూ, అమెరికాలోనూ సితార్ వాదన.

కీబోర్డ్ సహాయంతో డజన్ల కొద్దీ లలిత సంగీతం ఆర్కెస్ట్రా ప్రోగ్రాముల నిర్వహణ, 1993 తానా ప్రపంచ తెలుగు మహాసభలకు (న్యూయార్క్), 1994 ఆటా, 2001 సిలికానాంధ్ర సభలకు ప్రారంభ సంగీత ప్రదర్శన, ఆధునిక తెలుగు కవుల గేయాల స్వరరచనతో ఆర్కెస్ట్రా ప్రదర్శనలు, కూచిపూడి శైలిలో కుమార సంభవం నృత్యనాటకానికి సంగీత నిర్వహణ, కృష్ణపారిజాతం నృత్యనాటికకు అదనపు అంకానికి సంగీతరచన.
Times of India తో సహా ఇంగ్లీష్, తెలుగు భాషల పత్రికల్లో, ఇంటర్నెట్ సైట్లలో శాస్త్ర విజ్ఞాన రచనలు, పాప్యులర్ సైన్సు వ్యాసాలు.

సైన్స్ వ్యాసాల సంపుటి:
జీవశాస్త్రవిజ్ఞానం, సమాజంజనసాహితిప్రచురించింది.
విశ్వాంతరాళం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
మానవపరిణామం(స్వేచ్ఛాసాహితి ప్రచురణ)
1995 నుంచి కాలనిర్ణయ్ తెలుగు ఎడిషన్ సంపాదకుడు.
1997లో ముంబయిలో జరిగిన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆలిండియా తెలుగు మహాసభల సావనీర్ సంపాదకత్వం
హిందీనుంచి తెలుగులోకి డబ్ చేసిన అనేక టివీ సీరియల్ ప్రోగ్రాములకు మాటలు, పాటల రచన, అనేక ఆడియో రికార్డింగ్‌ల డబ్బింగ్ రచనలు
మరాఠీ విజ్ఞాన పరిషత్తువారి సెంటర్ ఫర్ నేషనల్ సైన్స్ కమ్యూనికేటర్స్‌లో తెలుగుకు ప్రాతినిధ్యం

ఆరు దశాబ్దాల క్రితపు తెలుగు పత్రిక – 2

అలనాటి తెలుగు పత్రిక పేజీల చిత్రాలు. Continue reading

Posted in వ్యాసం | Comments Off on ఆరు దశాబ్దాల క్రితపు తెలుగు పత్రిక – 2

ఆరు దశాబ్దాల క్రితపు తెలుగు పత్రిక – 1

ఆరు దశాబ్ధాల క్రితపు తెలుగు పత్రికల తీరుతెన్నులపై ఒక చిత్రమాలిక – కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారిచే అందించబడిన ఆనాటి ఆంధ్రజ్యోతి పత్రిక చిత్రాలు. Continue reading

Posted in వ్యాసం | 1 Comment

‘మతిచెడిన’ మేధావులు

విజ్ఞానమూ, తత్వమూ, కవిత్వమూ ఇంకా మరెన్నో రంగాల్లో మేధావులైన వారు ఒకచోట చేరి చర్చలు మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది? వెన్నెల రాత్రులు గుర్రపు బగ్గీలలో వాళ్ళ ప్రయాణాలు ప్రపంచాన్ని ఏ దిశకు నడిపించాయి? Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

మతాల స్వరూపాలు

మనకు కనబడే ప్రపంచం గురించి వాస్తవిక, భౌతికవాదదృక్పథం అలవరుచుకోవటానికి ఎవరూ వేదాంతులు కానవసరంలేదు. మనం బడిలో చదువుకున్న విజ్ఞానాన్ని సరిగా అవగాహన చేసుకుంటే చాలు.

Continue reading

Posted in వ్యాసం | Tagged | 21 Comments

మతాలకు పాలకుల మద్దతు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్ నేటి పాశ్చాత్య దేశాల్లోని మతాధిపత్యం కేవలం కొన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలు సూచించడం తప్ప, ఏమీ చెయ్యటంలేదు. పైగా తమ మతాధికారుల్లోనే లైంగికహింసకూ, ఇతర నేరాలకూ పాల్పడేవారు పట్టుబడుతున్న నేపథ్యంలో మింగలేక, కక్కలేక అవస్థలు పడుతోంది. మతవిశ్వాసాలు కలిగినవారికి సామాన్యంగా వాటికి రాజకీయాలతో ప్రమేయం లేదని అనిపిస్తూ ఉంటుంది. స్వతహాగా మంచి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

సృష్టి ప్రతిపాదనలు

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కొంత అమాయకంగా, కొంత పరిమిత ఊహాశక్తితో, కొంత గుడ్డినమ్మకాలతో మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ ప్రతిపాదనలన్నీ అప్పటివారు తమ సమాజం ఒకటిగా ఉండి బాగుపడాలనే ఉద్దేశంతోనే అవలంబించి ఉంటారనేది గుర్తించాలి. Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on సృష్టి ప్రతిపాదనలు

ఈ తరానికి ప్రశ్నలు

“మీరిది చదువుతున్నారంటే మీకు ప్రత్యేకత ఉన్నట్టే. మొదటి విషయం మీకు తెలుగు చదవడం వచ్చు. రెండోది వెబ్ పత్రిక చదివేంత సాహిత్యాభిమానం ఉంది. మూడోది ఇదేమీ కథా కాకరకాయా, కవిత్వమూ కాదని తెలిసికూడా చదువుతున్నారంటే మీ ఆసక్తి చెప్పుకోదగినదే.” అంటూ కొడవటిగంటి రోహిణీప్రసాద్ ప్రత్యేకత గల పాఠకులకు చెప్తున్నదేమిటి? “పత్రికాముఖంగా మీరిచ్చే జవాబులు చాలా విలువైన స్పందనలవుతాయని నా ఉద్దేశం.” అంటూ అడుగుతున్న ప్రశ్నలేమిటి? Continue reading

Posted in వ్యాసం | Tagged | 40 Comments

మతవిశ్వాసాల పునాదులు

“ప్రాచీన కాలంలో సగటు ఆయుఃప్రమాణం చాలా తక్కువగా ఉండి, రోగాలూ, గాయాలూ, ప్రమాదాలూ బలి తీసుకున్నప్పుడల్లా జనాభా తగ్గుతూ ఉండేది. నలుగురూ కలిసి ఐకమత్యంతో బతికితేగాని పూట గడవని ఆ కాలంలో చావు అనేది చాలా అవాంఛనీయం అనిపించి ఉండాలి.” మతవిశ్వాసాల పునాదుల గురించి చదవండి. Continue reading

Posted in వ్యాసం | Tagged | 36 Comments

తొలి మానవులు, ప్రకృతి

ప్రకృతి కలిగించే ఇబ్బందుల ఒత్తిడివల్ల తొలిమానవులకు అలవడిన ప్రత్యేకతలే అతణ్ణి జంతువుల నుంచి వేరు చేశాయి తప్ప అందులో సృష్టికర్త ప్రమేయం ఏమీ లేదంటున్నారు కొడవటిగంటి రోహిణీప్రసాద్. Continue reading

Posted in వ్యాసం | 4 Comments

తొలి మానవుల మనోవికాసం

మానవజాతి ఆవిర్భవించిన తొలి దశలో మనిషి మెదడు ఎలా ఎదుగుతూ వచ్చిందో, దాని అభివృద్ధికి దేవుడి దయ, అదృష్టశక్తులు కాకుండా భౌతిక కారణాలే ఎలా ప్రేరణలుగా పనిచేశాయో వివరిస్తున్నారు కొడవటిగంటి రోహిణీప్రసాద్. Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments