అలికిడి

దోసపండ్ల తోటకు అడ్డువేసిన కంపకంచెను ఎవరో తీస్తున్న అలికిడి అయ్యింది. నిద్రలో ఉన్న నాకు మెలుకువ వచ్చింది. నిజమే! కంచె దగ్గరే ఆ అలికిడి స్పష్టంగా వినిపిస్తోంది. దీనితో మగత నిద్ర నించి బాగా మెలుకువలోకొచ్చాను.

గుడారంలాంటి గుడిసె ముందు ఈతచాపపై మా నాన్న గురకలు పోతూ మంచి నిద్రలో ఉన్నాడు.

అంతా చిమ్మచీకటి. గుడిసెలో పై కప్పునించి వేలాడుతున్న లాంతరు వెలిగీవెలగనట్లుంది. ఆ లాంతరు దింపి వత్తి కొద్దిగా పైకెత్తాను.

ఏవో పురుగులు కిర్‌ర్ అంటూ గీపెట్తున్నాయి. దోస చెట్లకు కాయలు ఊరి రంగు తేల్తున్నట్లుంది. చల్లటి సుగంధం గాలిలో అలలు అలలుగా వీస్తోంది.

తిరిగి కంచె దగ్గరే అలికిడి ఎక్కువైంది. పక్కనే ఉన్న దుడ్డుకర్ర చేతిలోకి తీసుకున్నాను. ఇంకో చేత్తో టార్చి లైటును పట్టుకుని గుడిసె బయటికి వచ్చి

“నాయనా! ఓ నాయనా!!” అంటూ నిద్రలేపాను.

“ఏరా.. ఏమైంది?” కంగారుగా లేస్తూ అన్నాడు.

“ఎవరో కంచె తీస్తున్నారు నాయనా” అని, వేగంగా కంచె దగ్గరికి నడుస్తూ టార్చిలైటు వేశాను. టార్చి వెలుగు కంచెపై సూటిగా పడింది. ఆ వెలుగులో చారలు చారలున్న ‘దుమ్ములగొండి’ (హైనా) నోటికి దోసపండు ఇరికించుకొని – అది కళ్ళకు అడ్డురావడంతో – దిక్కుతెలియక కంపల్లో చిక్కుకొని గింజుకుంటోంది.

ఆ దృశ్యం చూసి నాకు నవ్వు వచ్చింది. ఈ చావు ఎవరు చావమన్నారు దీన్ని? దొంగతిండి తినబోతే ఇదే గతి.

దగ్గరగా పోయి – కట్టెతో దాని కళ్ళకు అడ్డుగా ఉన్న దోసపండును కదిలించాను. జారి కిందపడింది. అడ్డు తొలగిపోవడంతో – దోకుకుంటూ పారిపోయింది దుమ్ములగొండి.

“ఏందిరా.. ఎవర్రా అది?” రొప్పుకుంటూ వచ్చి అడిగాడు నాన్న. జరిగింది చెప్పాను.

“దీనెమ్మ ……. ఊరికే పోనిచ్చినావా.. దుడ్డుకర్రతో నాలుగు ఇడ్సి వుంటే చచ్చి ఊరుకుండేది కదా” దోసపండు తినిపోయిందనే అక్కసుతో అన్నాడు – వెనుదిరిగి వస్తున్న నన్ను అనుసరిస్తూ.

“పోన్లే నాయనా! ఈరోజు అది పడిన పాట్లకు – ఈ మధ్యలకు ఇంకెప్పుడూ రాదు.” అంటూ గుడిసె దగ్గరికి నడిచాను.

గుడిసె ముందు ఆరిపోయిన నెగళ్ళను విదిలించి – ఒకదానిపై ఇంకొకటి పేర్చి – వాటి కింద చిత్తుకాగితాలను ఉండగా చుట్టి పెట్టి, అగ్గిపుల్ల గీచి మంట పెట్టాడు నాన్న. చిన్నగా అవి రాజుకోసాగాయి. మంట కనిపిస్తే – ఆ దరిదాపులకు అడవిజంతువులు వచ్చే సాహసం చేయవు.

ఆ మంట ముందు కూర్చొని – బీడీ తీసి నోట్లో పెట్టుకొని, మండే నెగళ్లలోంచి ఒకటి తీసి ముట్టించుకున్నాడు నాన్న. దమ్ము గట్టిగా పీల్చి – “ఒరే శీనూ! ఆకలిగా ఉందిరా. కళింగర సార్లలోకి పోయి ఓ మంచి కాయ తెంపుకొని రా పోరా – తిందాం గానీ” అన్నాడు.

రాత్రి భోజనాలప్పుడు మా ఇద్దరికి తిండి సరిగా దిగలేదు. ఊరిబిండి…. అన్నం ఏదో కంగాళీగా తిన్నామనిపించాం. అందుకేనేమో నాన్నకు ఆకలేస్తోంది.

తోటలోకి పోయి – కళింగర (పుచ్చకాయ) సార్లపై టార్చి వేశాను. గజం పొడవునా రెండు జానల వెడల్పునా ఉండే కళింగర కాయలు సార్ల తిన్నెలపై కనిపించాయ్. ప్రతి సారెకు పదికి పైగా ఉన్నాయి. వాటిని చూస్తూంటే మూడేళ్లలోపు న్యాదర పిల్లోళ్ళు చెంప కింద చేతులు పెట్టుకొని నిద్రపోతున్నట్లు అనిపించింది.

తోటలోకి పోయి – కళింగర (పుచ్చకాయ) సార్లపై టార్చి వేశాను. గజం పొడవునా రెండు జానల వెడల్పునా ఉండే కళింగర కాయలు సార్ల తిన్నెలపై కనిపించాయ్. ప్రతి సారెకు పదికి పైగా ఉన్నాయి. వాటిని చూస్తూంటే మూడేళ్లలోపు న్యాదర పిల్లోళ్ళు చెంప కింద చేతులు పెట్టుకొని నిద్రపోతున్నట్లు అనిపించింది.

ఆ కళింగర కాయల్లోంచి ఒకటి, తొడిమ నుంచి విడతీస్తామనుకున్నాను. కానీ – ముందు కాయ లోపల మాగిందో లేదో చూద్దామనుకున్నాను. కాయపై గోటితో పై పెచ్చు గీరి చూశాను. పసుపు పచ్చగా కనిపించింది. అలా కనిపించిందంటే – చాలు, లోపల కచ్చితంగా ఎర్రగా మాగి ఉంటుంది.చేత్తో తొడిమ దగ్గర ‘అలా’ అన్నానో లేదో సులువుగా విడిపోయింది.

కళింగర కాయను భుజంపై పెట్టుకొని వచ్చి నాన్న దగ్గర పెట్తూ…

“కత్తి ఎక్కడ పెట్టినావు నాయనా!” అని అడిగాను.

“కత్తి దేనికిరా … మోకాలి చిప్పపై పెట్టి కొట్తే రెండు వొప్పులుగా విడిపోదూ… చూడు ఎట్లా విచ్చుకుంటుందో” అని కాయను మసాలా నూరే బండను ఎత్తినట్టు ఎత్తి తన మోకాలి చిప్పపై వొడుపుగా కొట్టాడు.

డుప్‌ప్ … అంటూ రెండుగా విడిపోయింది – కళింగరకాయ.

“ఒక వొప్పు నువ్వూ తీసుకో… నాకు సగం చాలు!” అన్నాడు.

మంట ముందు ఎదురెదురుగా కూర్చోని – చెరిసగం కాయను తింటున్నాం.

తిన్నకాడికి తిని – దోనె మాదిరి అయ్యాక గుజ్జును పిసికి వెలివేసి – రసం గుటగుట లాగించేశాడు నాన్న. ఇదేదో మంచివాటంలా గుందే అని నేనూ ఆ పనే చేశాను.

చేతులు కళింగర కాయ జిడ్డుతో జిగటగా మారాయి. మంచి కళింగర కాయ కండ నూక నూకగా వుండి – రసం జిగురుగా ఉండటం సహజమే!

గుడిసెలోకి పోయి – కడవలోంచి గ్లాసుతో నీళ్ళు నాన్నకిచ్చి – నేనూ కడుక్కున్నాను.

కడుపులో చల్లగా – తేపు వచ్చినప్పుడంతా తియ్యగా ఉంది. కాసేపటికి ఆవులింతలు ఎక్కువైనాయి. కనురెప్పలు బరువై నిద్రపోక తప్పింది కాదు.

నాకంటే ముందే నాన్న గురకలు పోతూ నిద్రలోకి జారిపోయాడు.

గంట….. గంటన్నర నిద్రపోయానో లేదో మళ్ళీ ఏదో అలికిడి నా చెవులకు తాకడంతో మెలుకువ వచ్చేసింది. అవసరానికి మించి నా చెవులకు వినికిడి శక్తి వుందేమో – అల్లంత దూరంలో చిన్నపాటి శబ్దమైనా ఇట్టే వినిపించేస్తుంది నాకు.

“నీవి పాము చెవుల్రా” అనేవాడు నాన్న. నిజమేనేమో. ఈతచాపలోంచి … ఏదో ఎక్కడో జరజరా… జరజరా అనే జారుతున్న అలికిడే అది. ఈత చాపకు చెవి ఆనించి – శ్రద్ధగా విన్నాను. ఔను. ఏదో బరువు వస్తువు ఇసుకలో జరుగుతున్న ధ్వని అది. ఇసుకలో ఉండే గమ్మత్తు ఏమిటంటే – తన గర్భంలో కానీ, తనపై కానీ ఏదైనా జరిగితే దాని ప్రకంపనలు ప్రసారం చేస్తుంది. అయితే దాన్ని వినగలిగే నేర్పు మనలో ఉండాలి – అంతే.

“నీవి పాము చెవుల్రా” అనేవాడు నాన్న. నిజమేనేమో. ఇంతకూ ఇప్పుడు ఈ అలికిడి ఎక్కడి నించి, ఇటు తిరిగి పడుకుంటూ చెవులు రిక్కించాను.

ఈతచాపలోంచి … ఏదో ఎక్కడో జరజరా… జరజరా అనే జారుతున్న అలికిడే అది. ఈత చాపకు చెవి ఆనించి – శ్రద్ధగా విన్నాను. ఔను. ఏదో బరువు వస్తువు ఇసుకలో జరుగుతున్న ధ్వని అది. ఇసుకలో ఉండే గమ్మత్తు ఏమిటంటే – తన గర్భంలో కానీ, తనపై కానీ ఏదైనా జరిగితే దాని ప్రకంపనలు ప్రసారం చేస్తుంది. అయితే దాన్ని వినగలిగే నేర్పు మనలో ఉండాలి – అంతే.

కంప కంచె దగ్గరే మళ్ళీ అలికిడినేమో అనుకొన్నాను. కానీ నెగళ్ల మంట మండుతున్నంత వరకు అడవి జంతువులు ఆ సాహసం చేయవు. మంటను చూస్తే – వాటికి చచ్చేంత భయం.

అడవి జంతువులు కాకపోతే – ఈ పని ఇంకెవరిదై వుంటుంది? అడవి జంతువుల కంటే భయంకరమైన మానవ మృగాలదేమో … ఆ ఆలోచన రాగానే ఓ రకమైన భయం ప్రవేశించింది నాలో.

నా చెవికి వినిపిస్తున్న ఆ జరజరా అలికిడి – మేం తాత్కాలికంగా లేపిన ఈ గుడిసె దగ్గర్నుంచి అరఫర్లాంగు దూరంలోంచి వస్తోందనిపించింది. రాత్రి…. పైగా నిర్మానుష్యం కావడంచేత ఆ అలికిడి స్పష్టంగా వినిపిస్తోంది.

ఇంతకు ఈ జరజర జారే ఆ బరువు వస్తువు ఏమై ఉంటుందో ఆలోచనకు దొరకడం లేదు. అరఫర్లాంగు దూరంలో ఏముందబ్బా! మా దోస తోటకు హద్దుగా కంప కంచె – ఆ కంచెకు ఆవల రెండు మూడు అడుగుల లోతులో ప్రవహిస్తున్న ‘పెన్నమ్మ’ ఉంది.

ఇంకొంచెంగా నా ఆలోచన వడిగా సాగింది. ఆ ధ్వని వస్తున్న ప్రాంతంలో చిరోంజి, షరబత్, అనార్, బతాసా, హింగన్, బొప్పాయి రకం దోస చెట్లు ఉన్నాయనే విషయం గుర్తుకొచ్చింది. దీనితో నా గుండె వేగంగా కొట్టుకుంది.

“అనుమానం దేనికిరా! దోసచెట్లలో దొంగతనాలు యిట్లే జరుగుతాయి. పారా అబ్బీ! పా…. నాయనా!! అవతల ఆ దొంగనాకొడుకులు ఎంతగా కొంపముంచారో చూద్దాం” ఆందోళనగా ముందుకు అడుగులేస్తూ అన్నాడు నాన్న.

దొంగలు, గోనె సంచుల్లో దోస పండ్లు నింపి – ఇసుకలో ఈడ్చుకొంటూ పోతున్నారా – ఏమిటి!?

ఆ ఆలోచన రావడంతోనే – బయట గురకలు పోతూ నిద్రపోతున్న నాన్నను లేపి విషయం చెప్పాను.

“అనుమానం దేనికిరా! దోసచెట్లలో దొంగతనాలు యిట్లే జరుగుతాయి. పారా అబ్బీ! పా…. నాయనా!! అవతల ఆ దొంగనాకొడుకులు ఎంతగా కొంపముంచారో చూద్దాం” ఆందోళనగా ముందుకు అడుగులేస్తూ అన్నాడు నాన్న.

దుడ్డుకర్ర, టార్చిలైటుతో నేనూ వడివడిగా బయలుదేరాను. ఇసుకలో అడుగులు ఎంత వేగంగా వేసినా… అనుకున్నంత వేగంగా ముందుకు పోలేకపోతున్నాం.

కోపం, ఆవేశం… పైగా ఇసుకలో వడివడిగా నడుస్తుండడంతో నాన్నకు శ్వాస పీల్చడం కష్టంగా వున్నట్లుంది – రొప్పుతున్నాడు.

గత డెబ్బయ్ రోజులుగా చిన్న పిల్లల్ని సాకినట్లుగా – ఈ దోసచెట్లను సాక్కుంటున్నాం. ఆ చెట్ల కోసం ఇంట్లో మిగిలిన చివరి సొత్తు అమ్మ చెవులకున్న కమ్మలు కూడా తెగనమ్మితే కానీ, ఎరువులకు, పురుగుమందులకు సరిపోలేదు.

వరదల పేరుతో ఆ మైలవరం డ్యాం నుండి ఈ సారైనా నీళ్ళు వదలకపోతే ఈ దోసచెట్లలో లాభం కళ్ల చూసే వీలుంటుంది. మేం ఊహించినట్లుగా ఈ మారు దోసపండ్ల ధరలు మంచి రేటు పలుకుతున్నాయి. అన్నీ కలిసి వస్తే ఈ దోసపండ్ల సీజన్ తరువాత చెల్లెలు వెంకటలక్ష్మిని ఓ అయ్య చేతిలో పెట్టవచ్చనుకొన్నాం.

వరదల పేరుతో ఆ మైలవరం డ్యాం నుండి ఈ సారైనా నీళ్ళు వదలకపోతే ఈ దోసచెట్లలో లాభం కళ్ల చూసే వీలుంటుంది. మేం ఊహించినట్లుగా ఈ మారు దోసపండ్ల ధరలు మంచి రేటు పలుకుతున్నాయి. అన్నీ కలిసి వస్తే ఈ దోసపండ్ల సీజన్ తరువాత చెల్లెలు వెంకటలక్ష్మిని ఓ అయ్య చేతిలో పెట్టవచ్చనుకొన్నాం.

గబగబా అడుగులేస్తూనే, ఆలోచిస్తూనే – టార్చిలైటు ఫోకసింగ్‌ని దోసతోటపై అటూ ఇటూ వేస్తున్నాను. ఆరు సెల్లుల టార్చిలోంచి వెలుతురు కర్రలా వెలుగు, చెట్లపై తిరుగాడుతోంది.

టార్చి వెలుగులో దూరాన గోనె సంచి కనబడింది. మళ్ళీ గమనిస్తే – ఆ గోనె సంచి తనంతకు తానుగా ప్రాణం పోసుకొని ముందుకు పోతున్నట్లనిపించింది. దోసపండ్లతో ఉన్న ఆ సంచి – ఏదో మంత్రశక్తితో జరజరా సాగి పోతుందా……. మనిషి మాత్రం అగుపించడం లేదు. మాయాబజార్ సినిమాలోలా ఉంది.

నా చిన్నప్పుడు మా అవ్వ – పెన్నగట్టున ఉండే రుద్రమంటపం దగ్గర రాత్రుళ్ళు కొరివి దయ్యాలు గాల్లో తేలాడుతుంటాయని – తాను చూశానని చెప్పిన సంగతి గుర్తుకొస్తోంది.

మరి – కొరివి దయ్యాలే అయితే – మండే కొరివి ఒకటైనా కనిపించాలి కదా!? అటువంటి జాడ ఏం లేదే! ఇంటర్మీడియట్ వరకు చదువుకొన్న నాకు, దయ్యాల, భూతాల ఆలోచనలు రావడమే విచిత్రంగా అనిపించింది.

దోసపండ్ల గోనె సంచిపై టార్చి వెలుగు నిలకడగా వేస్తూ – “నాయనా! అదో గోనె సంచి! మనిషి మాత్రం కనిపించడం లేదే!?” కంగారుగా అన్నాను.

“ఎవర్రా అది… రేయ్! దొంగ నాకొడకల్లారా! మీరు దోచుకోడానికి మా తోటే దొరికిందేంరా..లం.. కొడుకల్లారా!” నోటికి ఎలా వస్తే అలా బూతులు పెట్టాడు నాన్న. మళ్ళీ తనే,

“రేయ్! శీనిగా! ఆ కనిపిస్తా వుందే సంచి – దానికి కొంచెం పైన వెయ్ లైటు” రొప్పుతూ అన్నాడు.

టార్చి ఫోకసింగ్ ని వెడల్పుగా పడేట్లు సరిచేసి – లైట్ వేశాను. నిజమే! ఎవరో బాగా బలంగా ఉన్నాడు. నల్లటి డ్రాయరు తప్ప – శరీరంపై ఇక ఏ బట్టా లేదు. అందుకే చీకట్లో కనిపించడం లేదు.

దోసపండ్ల సంచిని ఈడ్చుకొంటూ పోతున్న ఆ ఆకారాన్ని నాన్న కూడా గమనించాడు.

ఇందులో ఏదో మర్మం ఉంది. నాన్న ఎందుకో తెలిసి దాస్తున్నాడనిపించింది. గుడిసె ముందు ఆరిపోతున్న నెగళ్ళను – మరికొన్ని చేర్చి మంట పెట్టాడు. బీడి మీద బీడి కాలుస్తూ ఆలోచనల్లో గొంతు కూర్చున్నాడు. అప్పుడప్పుడు పైతువాలతో కళ్లలో ఉబికి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకోసాగాడు.

“రేయ్! శీను ఆ దుడ్డు కర్ర ఇటివ్వు” అని తీసుకున్నాడు. కర్రసాములో నాన్నకు మంచి అనుభవం ఉంది.

“నీయబ్బ! ఉండు నీ కథ చెప్తా” అంటూ కర్రను గాలిలో గిరగిరా తిప్పి విసురుగా గురి చూసి వదిలాడు.

అంతే ఆ కర్ర సరిగ్గా ఆ దొంగకు తగిలింది. దెబ్బ ఎక్కడ తగిలిందో ఏమో గానీ “ఓయమ్మా” అంటూ పెద్దగా బొబ్బ పెట్టాడా దొంగ.

పండ్ల గోనె సంచిని దార్లోనే వదిలేసినాడు. అది కదలకుండా ఉంది. ఇక నేను పరుగెత్తుకొని పోయి – దొంగను పట్టుకోబోయాను.

“ఓ నర్సయ్యా! నేనే లేరా.. నేనే లేరా…” అంటూ ఆ దొంగ కంచె దాటి – ఏటి నీళ్ళలోపడి చావు బతుకులుగా పారిపోతున్నాడు. తన పేరు….. ఆ గొంతుకను విన్నాడు నాన్న.

పారిపోతున్న ఆ దొంగను ఎలాగైనా పట్టుకొని కట్టెయాలన్న ఆవేశంతో ముందుకు దూసుకుపోతున్న నన్ను వారించాడు నాన్న.

“ఒరే అబ్బీ! కొంచెం ఉండరా!” నాన్న గొంతుకలో ఏదో మార్పు వినిపించింది.

“ఏం నాయనా! ఎందుకు నన్ను ఆపేసినావు?” అర్థం కాక ప్రశ్నించాను.

“అక్కర లేదులేరా! ఆ దొంగ ఎవరో నాకు తెలుసు” వెనుదిరిగి గుడిసె వైపు నడుస్తూ అన్నాడు నాన్న.

“ఏంది నాయనా! నూ ఏమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. చేతికి దొరకపోయినవాడ్ని పట్టుకోకుండా ఎందుకు వదిలేయమంటున్నావ్” అసహనంగా అన్నాను.

“ష్… అబ్బ! నీకు తెలియదు లేరా! పా… గుడిసె కాడికి పొదాం పాబ్బీ!” అన్నాడు.

ఇందులో ఏదో మర్మం ఉంది. నాన్న ఎందుకో తెలిసి దాస్తున్నాడనిపించింది. గుడిసె ముందు ఆరిపోతున్న నెగళ్ళను – మరికొన్ని చేర్చి మంట పెట్టాడు. బీడి మీద బీడి కాలుస్తూ ఆలోచనల్లో గొంతు కూర్చున్నాడు. అప్పుడప్పుడు పైతువాలతో కళ్లలో ఉబికి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకోసాగాడు.

అనుకోకుండా మా మధ్య వాతావరణం బరువైంది. దీనికి కారణమైన ఆ దొంగను గురించే నాన్న – ఈ విధంగా బాధపడుతున్నాడనేది స్పష్టమైంది.

ఇంతకూ ఆ దొంగ ఎవరో…… నాన్నకు బాగా తెలుసు.

“ఏంది నాయనా! ఎందుకు బాధపడుతున్నావ్. ఇంతకూ ఆ దొంగ ఎవరు” అనునయంగానే నిజం రాబట్టాలని అడిగాను.

“ఎవరో అయితే నేను ఎందుకు బాధపడుతాన్రా అబ్బీ! ఎవరో కాదురా, మన ఆసామి నేకనాపురం రామయ్య కొడుకు కిష్టప్ప!” రహస్యం విడదీస్తూ చెప్పాడు.

నెత్తి మీద పిడుగు పడినట్లయింది నాకు.

రానురాను వాళ్ల పరిస్థితి వరుస కరువు దెబ్బలతో అధ్వాన్నంగా మారింది. వాళ్ల పరిస్థితి దిగజారినా – నలుగురిలో నామోషీగా ఉంటుందని కూలికి పోలేక…… భూముల్లేని పేదోళ్ళ ఏటి సేద్యం అయిన ఈ దోసచెట్లేసుకొనే జోలికి రాలేక… వాళ్ల కుటుంబం ఆర్థికంగా ‘ఫైసలై’పోయింది.

పదేళ్ళ క్రితం వరకు నాన్న ఆయప్ప అంచున భూములు చేసుకొనే సేద్యగానిగా ఉండేవాడు. రానురాను వాళ్ల పరిస్థితి వరుస కరువు దెబ్బలతో అధ్వాన్నంగా మారింది. నాన్నను సేద్యగానిగా పెట్టుకోవడం వాళ్ల పాలికి అదనపు బరువు అయ్యింది. ఆ విషయం చెప్పలేక – వాళ్లు వెనకా ముందు అవుతుంటే – ఆరోగ్యం సరిగా ఉండటం లేదని నాయనే అబద్ధం చెప్పి పని మానుకొన్నాడు.

రెక్కల కష్టం చేసి బతికేవాళ్ళం. మా పరిస్థితి అప్పుడూ – ఇప్పుడూ రెక్కల మీద ఆధారపడింది కావడంతో మా కుటుంబం తలక్రిందులు అయ్యిందేమీ లేదు.

నిజం చెప్పాలంటే ఈ పదేళ్ళ నుండి వట్టిపోయిన పెన్నేట్లో స్వంతంగా దోసచెట్లు వేసుకోవడంతో… మా కుటుంబం కొంచెం ఊపిరి పోసుకుంటోంది.

కాకపోతే – రామయ్యప్ప వాళ్ల పరిస్థితి దిగజారినా – నలుగురిలో నామోషీగా ఉంటుందని కూలికి పోలేక…… భూముల్లేని పేదోళ్ళ ఏటి సేద్యం అయిన ఈ దోసచెట్లేసుకొనే జోలికి రాలేక… వాళ్ల కుటుంబం ఆర్థికంగా ‘ఫైసలై’పోయింది.

నలుగురికి సాయం చేసే స్థితిలో బతికి – ఇప్పుడు చెడిన రామయప్ప గానీ…. ఆయన కొడుకు ఈ కిష్టప్ప గానీ నాయనను గనుక ఒక్క మాట అడిగి ఉంటే చాలు. ఓ వెయ్యి దోస పండ్లు బండ్లకెత్తించి పంపేవాడు. నాన్నకు తన ఆసామి గారి కుటుంబం మీద అంత గౌరవం ఉందని తెలుసు నాకు. కానీ, తమ దగ్గర సేద్యగానిగా పనిచేసిన వ్యక్తి దగ్గర చెయ్యి సాచడం చిన్నతనం అనుకొన్నాడేమో!

ఆ రాత్రి ఆలోచనలతో, ఎప్పుడు నిద్రపోయామో గుర్తు లేదు. తెల్లవారింది. దోసతోటలు గుత్తకు తీసుకున్న ఆసామి కూలోళ్ళతో గట్టిగా ఏదో మాట్లాడుతున్నాడు. కాయలు కోస్తున్న కూలోళ్ళు… లారీకి గంపలనెత్తిస్తూ అనుకొంటున్నారు.

కిష్టప్ప పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడని – ఎగువపేట మిట్ట మింద శవం పడి ఉంటే – పొద్దున్నే ఎనమలను తోలుకపోయిన వాళ్ళు చూసి – ఊర్లో చెప్పారని.. ఏదేదో అంటున్నారు. ఒక గోనెసంచెడు దోసకాయలు వాళ్ళ ఇంటికి పంపుదామనుకున్న నాకు కూలోళ్ళు అనుకొంటున్న మాటలకు గుండెల్లో ఎక్కడో ఎదో ‘అలికిడి’ అయ్యింది.

నేను, నాయన చివరి చూపులకు పాసి మొహంతోనే ఊర్లోకి బయల్దేరినాం.

—————————

శశిశ్రీశశిశ్రీ అసలు పేరు షేక్ బేపారి రహంతుల్లా. జన్మస్థలం సిద్ధవటం, కార్యక్షేత్రం కడప. ఆశుకవిగా, జీవితాన్ని దృశ్యీకరించే రచయితగా, సీనియర్ జర్నలిస్టుగా, చక్కటి వాగ్ధాటి గల వక్తగా మంచిపేరున్నవారు. 1975 – 1980 లో మనోరంజని లిఖిత మాసపత్రికను నడిపారు. 1995 నుంచి సాహిత్యనేత్రం పత్రికను నడుపుతున్నారు. వంద కథలు రెండు వందల సాహిత్యవ్యాసాలు, 60 వరకు పాటలు, 50 వరకు సాహిత్యపరమైన ఇంటర్వ్యూలు, చాలా కవిత్వం రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారభాషాసంఘం వారిచే రెండు పర్యాయాలు భాషాపురస్కారాలు పొందారు. పల్లవి, శబ్దానికి స్వాగతం, జేబులో సూర్యుడు (2006) వీరి వచనకావ్యాలు. సీమగీతం పద్యకావ్యం. జేబులో సూర్యుడు ఉర్దూలో జేబ్ మే సూరజ్ పేరిట వెలువడింది. దహేజ్ వీరి కథాసంపుటి.
అక్టోబర్ 1998లో ప్రజాసాహితిలో ప్రచురించబడిన అలికిడి కథ వీరి దహేజ్ కథాసంపుటిలోనిది. ఈ కథను పొద్దులో ప్రచురించడానికి అనుమతించిన రచయితకు కృతజ్ఞతలు.

Posted in కథ | Tagged , , | 9 Comments

సామాన్య జీవితాలను అసామాన్యంగా చిత్రించిన “దహేజ్”

-త్రివిక్రమ్

కథలకు, ఆ మాటకొస్తే సాహిత్యానికి, ముడిసరుకు జీవితమే. జీవితాన్ని ఎంత నిశితంగా పరిశీలిస్తే అంత గొప్ప కథావస్తువులు దొరుకుతాయి. ఆ కథాంశాలకు చక్కటి కథారూపమివ్వాలంటే రచయితకు గొప్ప శిల్పదృష్టి, రాతపై అదుపు ఉండడం అత్యవసరం. తాము నిత్యం గమనించే జీవితాలు, పరిస్థితుల నుంచి విలక్షణమైన మంచి కథాంశాలను ఏరుకోగలిగే నేర్పు కొందరికే ఉంటుంది. అలా ఏరుకున్నాక ఆ కథాంశాలకు అలవోకగా అందమైన కథారూపమివ్వగలగడం అరుదుగా, కొందరికే అబ్బే కళ. అలాంటి కళాకారుల్లో ఒకరు శశిశ్రీ అని అర్థమౌతుంది దహేజ్ కథాసంపుటి చదివితే. పది కథలుండే ఈ సంపుటిలో ఒక్క షేక్ హ్యాండ్ తప్ప మిగిలిన కథలన్నీ పేద, మధ్యతరగతులకు చెందినవాళ్ళ, దిగువ కులాలకు చెందినవాళ్ళ గాథలు. ఇజ్జత్, వలిమా, దహేజ్, కంకర్, నదీకేపాల్ కథలు ముస్లిం కుటుంబాల గాధలు.

వియ్యంకుడు టీవీతో బాటు దహేజ్ లో చేర్చిన చివరి అంశం రెండు కఫన్ గుడ్డలు (శవాన్ని కప్పడానికి ఉపయోగించేవి)! వాటిని చూపిస్తూ ఆయన “నా బిడ్డ భర్త ఉండగా చచ్చిపోతే ఎర్ర కఫన్ గుడ్డా, భర్త పోయాక చచ్చిపోతే ఈ తెల్ల కఫన్ గుడ్డా దయచేసి వాడండి. ఇదే… నేను దహేజ్ లో మరచిపోయింది! ప్రతి ఆడబిడ్డ తండ్రీ గుర్తుంచుకోండి!! దహేజ్ లో బిడ్డకు కఫన్ కూడా ఇవ్వండి.. మరచిపోకుండా ఇవ్వండి” అంటూ సొమ్మసిల్లి కిందపడిపోతాడు.

ఈ కథలు చదువుతుంటే రచయిత మనతో మాట్లాడుతున్నట్లే అనిపింపజేస్తుంది ఆయన రచనాశైలి. కడపప్రాంత వ్యావహారిక భాషను తగుమాత్రం వాడుతూ, ఆ నుడికారపు సొబగులను తన రచనలకు అందంగా అద్దగలిగే సమర్థుడైన రచయిత శశిశ్రీ. ఇక కథల్లోకి వెళ్తే… దహేజ్ కథలో మొదట ‘సైతాన్ కా డబ్బా అది’ అని పెళ్లికొడుకు తండ్రి లాంఛనాల్లో టీవీ వద్దని చెప్పినా “ఆయనకేం తెలుసయ్యా రోజంతా బయట ఉండేవానికి? నాలుగు గోడల మధ్య బిక్కుబిక్కుమంటు బతికే మాకు” అది తప్పక కావాలి అని దహేజ్ (పెళ్లి లాంఛనాలు) లో టీవీ లేకపోవడం పెద్ద నేరంగా నిందించిగొడవ చేస్తుంది పెళ్లికొడుకు తల్లి రబియా బీ. దానికి సమాధానంగా వియ్యంకుడు టీవీతో బాటు దహేజ్ లో చేర్చిన చివరి అంశం రెండు కఫన్ గుడ్డలు (శవాన్ని కప్పడానికి ఉపయోగించేవి)! వాటిని చూపిస్తూ ఆయన “నా బిడ్డ భర్త ఉండగా చచ్చిపోతే ఎర్ర కఫన్ గుడ్డా, భర్త పోయాక చచ్చిపోతే ఈ తెల్ల కఫన్ గుడ్డా దయచేసి వాడండి. ఇదే… నేను దహేజ్ లో మరచిపోయింది! ప్రతి ఆడబిడ్డ తండ్రీ గుర్తుంచుకోండి!! దహేజ్ లో బిడ్డకు కఫన్ కూడా ఇవ్వండి.. మరచిపోకుండా ఇవ్వండి” అంటూ సొమ్మసిల్లి కిందపడిపోతాడు. ఆ మాటలు కట్నం కోసం పీడించబడే అందరు పెళ్ళికూతుళ్ళ తండ్రుల ఆవేదనకు అద్దం పడుతాయి. ఈరోజుల్లో కూతుర్ని కాపురానికి పంపడం కూడా కాటికి పంపడంలానే భావించవలసి వస్తోందన్న కఠోరవాస్తవానికి కథారూపం దహేజ్!
దహేజ్
“ఏటి ఇసుక సేద్యం పేదోళ్ళ సేద్యం”. ఏరు పొంగితే ఏటిపాలయేది ఒక్క పంట మాత్రమే కాదు.ఆ రైతుల జీవితాలు కూడా. నదికేపాల్ లో కథాంశం అదే. పెళ్లయీ అవగానే కట్నం డబ్బే పెట్టుబడిగా డబ్బుసంపాదించడానికి భర్త కువైట్ వెళ్ళగా పుట్టిల్లు చేరింది రమీజా. ఆమె నగలు కుదువ పెట్టి ఏటి ఒడ్డున దోసపంట వేస్తారు నాన్నా, తమ్ముడు. అత్తింటివాళ్ళు దౌర్జన్యంగా నగలు లాక్కోవాలని చూస్తే పుట్టింటివాళ్ళు ఆప్యాయంగా లాక్కున్నారు! భర్త తిరిగిరావడంతో రమీజా కాపురానికి వెళ్ళడానికి సిద్ధమౌతుంది. తను వెళ్ళేటప్పటికి పుట్టింటివారు తన నగలు తెచ్చిస్తారో లేక ఇంకో గొడవ చేసి తనను భర్తకు దూరం చేస్తారో, తను కఠినంగా నిలవకపోతే కాపురం నిలవదు అనుకుంటూ కష్టాలే మనిషికి తెలివితేటలు నేర్పిస్తాయి అంటే ఇదేనేమో అనుకుంటుంది రమీజా. ఈలోపే ఏరుపొంగుతుంది. ఆ ఏట్లో దోసపంటతో బాటు తన కూతురి కాపురం కూడా కొట్టుకునిపోతున్నట్లు భావించిన ఆమె తండ్రి ఆ ఏట్లోనే పడి కొట్టుకునిపోతాడు.ఆర్థికావసరాలు కుటుంబ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలో అద్భుతంగా చూపిస్తాడు రచయిత.

సంసారం అచ్చంగా ఒక చదరంగమే. తమ వంతు వచ్చినప్పుడు వెయ్యడానికి ఎత్తులు-పై ఎత్తులు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటారు ఆటగాళ్ళు. కంకర్ కథలో చెల్లెలి పెళ్ళిలో తేడా వచ్చిన రెండు తులాల బంగారు రాబట్టుకోవడం కోసం అన్న పెళ్ళప్పుడు చాకచక్యంగా కథ నడిపిన ఆమె అత్త గడుసుదనం చూసి విస్తుపోతాం.

సంసారం అచ్చంగా ఒక చదరంగమే. తమ వంతు వచ్చినప్పుడు వెయ్యడానికి ఎత్తులు-పై ఎత్తులు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటారు ఆటగాళ్ళు. కంకర్ కథలో చెల్లెలి పెళ్ళిలో తేడా వచ్చిన రెండు తులాల బంగారు రాబట్టుకోవడం కోసం అన్న పెళ్ళప్పుడు చాకచక్యంగా కథ నడిపిన ఆమె అత్త గడుసుదనం చూసి విస్తుపోతాం. అందులోనే బావ మంచితనం, మూఢనమ్మకాలపై నిరసన, మనుషులంతా ఒక్కటే అనే సందేశం సొగసుగా ఇమిడిపోయాయి. భార్యాపిల్లల ఇజ్జత్ ఇంటి యజమాని కాపాడితే అతడి ఇజ్జత్ ఆత్మబంధువులు కాపాడుతారనేది ఇజ్జత్ కథాంశం. ఇందులో దర్జీ మస్తాన్ సాబ్ సాటి మనిషి పట్ల చూపిన ఔదార్యం ప్రత్యేకించి చెప్పుకోదగినది.

తన పెళ్లికి వచ్చిన చదివింపుల డబ్బుతో పెళ్ళికోసం చేసిన అప్పులు తీర్చగలననుకుంటాడు వలిమా కథలో పెళ్ళికొడుకు సత్తార్. కటికవాడు కరీం వలిమా (పెళ్ళిభోజనం) కోసం మాంసం ఇచ్చేటప్పుడే ఖరాఖండిగా చెప్పేశాడు చదివింపులు తనే రాబట్టుకుని, తన అప్పుపోగా మిగిలిందే సత్తారుకిస్తానని. అన్నంతమాత్రాన తన మెడ మీద కత్తి పెట్టినట్లు కటికవాడు చదివింపులు రాబట్టుకోవడానికి స్వయంగా వచ్చి తన పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంటే ఇబ్బందే కదా? తీరా చూస్తే వచ్చిన చదివింపులు డెబ్భై రూపాయలు! అప్పెలా తీర్చగలనా అని మధన పడుతున్న పెళ్ళికొడుకు చివరకు కరీం చూపిన సౌహార్ద్రానికి కదిలిపోతాడు. ఆపత్సమయంలో సగటుమనిషి ఆలోచనలెలా సాగుతాయో రచయిత అత్యంత సహజంగా వర్ణిస్తాడు ఈ కథలో.

కథాప్రారంభంలోనే ‘దొంగతిండి తినబోతే ఇదే గతి’ అని హైనాను ఉద్దేశించి రాసినమాటల్లో భావి కథాంశాన్ని అన్యాపదేశంగా అతినేర్పుగా సూచించాడు రచయిత. చేలలో రాత్రి కాపలా ఉండేవాళ్ళు ఇంటి దగ్గర తినీతినకా హడావుడిగా బయలుదేరడమూ, చేలలో కాసినవాటినే కాయలో, పళ్ళో కోసుకుతినడమూ కూడా సహజంగా వర్ణించాడు.

అందివచ్చిన అవకాశాలను అందుకుని చకచకా పైకెగబాకడమే తెలిసినవాళ్లకు గతం గుర్తుండదు. రియల్ ఎస్టేట్లో లాభాలు ఊరిస్తుంటే అవసరంలో తనకు సాయం చేసినవారికి తాను చేయగలిగిన సాయం కూడా చెయ్యకుండా ఇంకా ఒత్తిడి పెంచి నిలువనీడ లేకుండా చేస్తాడు రాజు స్టేటస్ కథలో. అందుకు కారణం ఇద్దరి స్టేటస్ లలో వచ్చిన మార్పే. ఆత్మబంధువు కథలోని సుగాలి సీతమ్మ రాజు లాంటి నాగరికురాలు కాదు కాబట్టే తన కూతురి విషయంలో ఒకసారి మానవత్వం ప్రదర్శించిన సుబ్బరాయుడి మేలు మరచిపోక అతడికి ఆత్మబంధువుగా మారి ఎవరూ చేయనంత ప్రత్యుపకారం చేసిందేమో అనిపిస్తుంది ‘ఆత్మబంధువు ‘ కథ చదివితే.

ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం వరస కరువులతో చితికిపోయినా పేదవాళ్లలా అటు ఏటిగట్టుసేద్యం చెయ్యలేరు, ఇటు చూస్తే పూటగడవదు. ఒకప్పుడు తన కింద పనిచేసిన పాలేరు పండించిన దోసతోటలోనే దొంగతనం చేయబోయి, దొరికిపోయినంతపనై అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు కిష్టప్ప. కథాప్రారంభంలోనే ‘దొంగతిండి తినబోతే ఇదే గతి’ అని హైనాను ఉద్దేశించి రాసినమాటల్లో భావి కథాంశాన్ని అన్యాపదేశంగా అతినేర్పుగా సూచించాడు రచయిత. చేలలో రాత్రి కాపలా ఉండేవాళ్ళు ఇంటి దగ్గర తినీతినకా హడావుడిగా బయలుదేరడమూ, చేలలో కాసినవాటినే కాయలో, పళ్ళో కోసుకుతినడమూ కూడా సహజంగా వర్ణించాడు.

షేక్ హ్యాండ్ కథలో రచయితగా, బిసి కులస్థునిగా కాస్త గుర్తింపు రాగానే ‘గెలుపు నాకు గాక ఎవనికి దక్కుతుంది?’ అనుకుని ఎమ్మెల్సీ ఎలెక్షన్ బరిలో దిగిన శంకర్ నారాయణకు ‘దిగితేగానీ లోతు తెలియలేదు’. అలాగని పోటీ నుంచి విరమించుకోవడానికి మనసొప్పలేదు. అలాంటి సమయంలో ‘ఐన ఖర్చుకు రెట్టింపు ఇస్తాను. మీ మద్దతు నాకివ్వండి’ అని వచ్చిన పోటీదారుని ప్రతిపాదన తిరస్కరించినా వీడ్కోలుగా అతడికి ఇచ్చిన షేక్ హ్యాండ్ నే తన రాజకీయ బ్రహ్మాస్త్రంగా మలచుకున్న ప్రత్యర్థి దెబ్బకు మట్టికరుస్తాడు.

దహేజ్, కంకర్, నదీ కే పాల్ లాంటి కథల్లో సమస్యలకు వ్యక్తులను కాకుండా పరిస్థితులను బాధ్యులుగా చూపే గడుసుదనం ప్రదర్శించాడు రచయిత. రచయిత శశిశ్రీ తనకు తెలిసిన సమాజాన్ని నిశితంగా పరిశీలించి, నిజాయితీగా రాసిన కథలివి. చక్కటి మానవీయ దృష్టి, జీవనసంఘర్షణ ఉన్న ఈ కథలు అందరూ తప్పక చదవవలసినవి.

ప్రచురణ: నేత్రం పబ్లికేషన్స్, కడప. ప్రతులు విశాలాంధ్ర అన్ని శాఖలలోను లభ్యం. వెల 40 రూపాయలు. నేరుగా నేత్రం పబ్లికేషన్స్, 21/107, సెవెన్స్ రోడ్స్, కడప-1 లేదా శశిశ్రీ, 1-778(2ఎ), జర్నలిస్టుల కాలనీ, కడప-516004 నుంచి కూడా తెప్పించుకోవచ్చు.

——————-

త్రివిక్రమ్ పొద్దు సంపాదకవర్గ సభ్యుడు

Posted in వ్యాసం | Tagged | 6 Comments

|| ఇస్రో విశ్వస్య రాజతీ ||

ఇస్రో చిహ్నంఎర్రటి బాణం ఆకాశానికి గురిపెట్టి ఉంటుంది. అది ఆ సంస్థ చిహ్నం. అచ్చు ఆ బాణంలాగే లక్ష్యమ్మీదే దృష్టి కేంద్రీకరించి వారి రాకెట్ నిలబడి ఉంటుంది. అది ఎక్కుపెట్టిన రామబాణం. శ్రీహరికోటలోని లాంచ్‌ప్యాడే కోదండం. ధనుర్విముక్తశరం లాగా నభోమండలాన్ని చీల్చుకుంటూ అది దూసుకుపోతుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. మంత్రించిన బ్రహ్మాస్త్రం అది. చెప్పిన పనిని చెప్పినట్టుగా, చెప్పిన సమయానికి, ఏమాత్రం గురి తప్పకుండా పూర్తి చేసేస్తుంది. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగ మంత్రం ప్రయోక్తకు బాగా తెలుసు. ఆ ప్రయోక్తే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో!

స్వతంత్ర భారత దేశం సాధించిన విజయాలలో శాస్త్ర సాంకేతిక రంగం ప్రధానమైనది. ఈ రంగంలో పేరెన్నిక గన్న విజయగాథ ఇస్రో. అమెరికా చంద్రుడి మీదకు మనిషిని పంపించామని చెప్పుకున్ననాటికి ఇస్రో ఇంకా రూపే దాల్చలేదు. భారత అంతరిక్ష విజ్ఞానం సౌండింగు రాకెట్లతో ప్రయోగాలు చేస్తోంది -దీపావళి అవ్వాయి సువ్వాయిలు కాల్చుకుంటోందన్నమాట. నాలుగు దశాబ్దాలు గడిచాక, ఇవ్వాళ, ఇస్రో తలపెట్టిన చంద్రయానంలో మేమూ పాలుపంచుకుంటాం అని ఆ అమెరికాయే ముందుకొస్తోంది. అదీ ఇస్రో ఘనత!

పేదరికంతో అల్లాడిపోతున్న దేశానికి ఈ రాకెట్లూ, ఉపగ్రహాలూ ఎందుకు అని అన్నవారికి ఇస్రో రూపశిల్పి విక్రమ్ సారాభాయ్ దార్శనికతే సమాధానం. సారాభాయ్ ఇలా అన్నారు: “…జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలి.”

ఆ ఎవరికీ తీసిపోకుండా ఉండటమే ఇస్రో విజయాలకు మూల మంత్రం.

పీయెస్సెల్వీ

శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటరు లోని రెండో లాంచ్‌పాడు నుండి నింగికెగుస్తున్న పీయెస్సెల్వీ (ఇస్రో వెబ్‌సైటు నుండి)

ఇస్రో మనకు చాలా ఇచ్చింది.. ఇంటింటికీ టీవీ కార్యక్రమాలు, వాతావరణ పరిశీలన, పర్యావరణ పరిశీలన, దూరవిద్య,.. ఇలా ఎన్నెన్నో. ఒక లెక్క ప్రకారం ఇప్పటి వరకూ ఇస్రో మీద పెట్టిన పెట్టుబడికి ఒకటిన్నరరెట్ల విలువైన సేవలను అది భారతావనికి అందించింది. అయితే వీటన్నిటికీ మించి ఇస్రో జాతికి చేసిన గొప్ప సేవ – డబ్బుల్లో కొలవలేనిది – ఒకటుంది. అదే.. ఇస్రో మనకిచ్చిన స్ఫూర్తి. మనం చెయ్యగలమా అనే స్థాయి నుండి మనమూ చెయ్యగలము అనే స్థాయిని దాటి మనమే చెయ్యగలం అనే స్థాయికి మనలను చేర్చింది ఇస్రో! అవును మరి.. పదేసి ఉపగ్రహాలను – అంతటి బరువున్న, అన్ని ఉపగ్రహాలను – ఒక్ఖ ఊపులో తీసుకుపోగలిగినది మనమే!

ఇస్రో తయారు చేసిన రాకెట్లకు రెండు వైపులా పదునే! ఉపగ్రహాలను మోసుకుంటూ అంతరిక్షంలోకి దూసుకెళ్ళినపుడు అది ఎస్సెల్వీ. ఆయుధాలను నింపుకుని శత్రువును గురిచూసినపుడు అదే ఆగ్నేయాస్త్రం.

ఇస్రోది అసలు వైఫల్యమే లేని నిరంతర విజయగాథేమీ కాదు. క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఇస్రోకి ఇంకా కొరకరాని కొయ్యే! ఈ ఇంజన్లను స్వంతంగా తానే తయారుచెయ్యదలచి, సత్ఫలితాలు రాకపోవడం చేత రష్యా నుండి ఇంజన్లను, పరిజ్ఞానాన్ని కొనాలని తలపెట్టింది. కానీ అమెరికా సైంధవ పాత్ర కారణంగా ఆ పరిజ్ఞానాన్ని సంపాదించలేకపోయింది, కేవలం ఇంజన్లు మాత్రమే పొందింది. జీయెస్సెల్వీ ప్రయోగం వెనకబడడానికి ఇది ప్రధాన కారణం. ఇప్పుడు క్రయోజెనిక్ ఇంజన్లు కూడా తయారు చేసామని ఇస్రో చెబుతోంది. అయితే అది వివాదాస్పద అంశం. అలాగే ఇస్రో సంధించిన ప్రతీ రాకెట్టూ దూసుకుపోలేదు. కొన్ని నేలనూ పడ్డాయి. ప్రయోగాలు విఫలమయ్యాయే గానీ, ఇస్రో విఫలం కాలేదు. ప్రతీ వైఫల్యాన్నీ ఒక పాఠంగా, తరువాతి విజయానికి మెట్టుగా చేసుకుని సూటిగా అంతరిక్షంలోకి దూసుకుపోతోంది. ఈ దిగ్విజయగాథ వెనక ఎందరో భారతీయుల మేధోసంపద ఉంది. అనుకున్నది సాధించి తీరాలన్న వారి తపన, పట్టుదల ఉన్నాయి.

వైఫల్యాలను తలచినపుడు 2001 మార్చి లో జరిగిన జీయెస్సెల్వీ వైఫల్యాన్ని మననం చేసుకోవాలి. భూస్థిర కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలిగిన జీయెస్సెల్వీ మొదటి ప్రయోగమది. మొదటి దశలోని స్ట్రాప్-ఆన్ బూస్టర్లను మండించినపుడు నాలుగు స్ట్రాప్-ఆన్‌ల లో ఒక బూస్టరు మండలేదని ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న కంప్యూటర్లు పసిగట్టాయి. వెంటనే ఇంజన్లను ఆపివేసి, ప్రయోగాన్ని రద్దు చేసేసాయి. ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉపగ్రహంతో సహా వాహకనౌక పేలిపోవాల్సిన పరిస్థితిలో ప్రమాదాన్ని సమర్థవంతంగా నివారించారు. అంతేకాదు, నెల రోజుల లోపే, ఏప్రిల్ 18న అదే జీయెస్సెల్వీ డి1 ని విజయవంతంగా ప్రయోగించి జిశాట్-1 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టారు. 2003 లో బ్రెజిల్‌లో జరిగిన ఇటువంటి ప్రమాదంలోనే లాంచ్‌ప్యాడు మీద ఉంచిన వాహకనౌక ఇంజను ప్రమాదవశాత్తూ పేలిపోయి, 21 మంది మరణించారు. ఈ ప్రమాదం కారణంగా బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనలు అనేక సంవత్సరాలు వెనకబడ్డాయి.

ఇస్రో తయారు చేసానంటున్న క్రయోజెనిక్ ఇంజన్ల విషయం వివాదాస్పదమైనప్పటికీ, నిర్వివాదాంశమొకటుంది.. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన రాకెట్లలో పీయెస్సెల్వీ ఒకటి. మనకే గాదు, బయటి దేశాల ఉపగ్రహాలకు కూడా ఇది విశ్వసనీయమైనదే! అందుకే ఇజ్రాయిల్ నుండి ఇటలీ దాకా తమ ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రోనే నమ్మారు. కెనడా, జర్మనీ విశ్వవిద్యాలయాల నానో ఉపగ్రహాలకూ పీయెస్సెల్వీయే నమ్మకమైనది. ఆ పీయెస్సెల్వీ పరిజ్ఞానమే రేపు చంద్రయానానికి కూడా వాహనం కాబోతోంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, మేధ అంతరిక్ష స్థాయిలో ఉన్నా కాళ్ళు స్థిరంగా భూమ్మీదే ఉండటం బహుశా ఆ సంస్థకు సహజంగా అబ్బిన భారతీయ సంస్కృతి వలన కావచ్చు. కొన్ని సంస్థలలో ఓ మూణ్ణాలుగు నెలల ప్రాజెక్టు పూర్తి కాగానే పార్టీలు, హంగామాలు చెయ్యడం చూస్తూంటాం, కాని ఇస్రోలో అలాటి హంగామాలేవీ కనిపించవు. బహుశా విజయాలకు అలవాటు పడిపోవడం వల్ల కూడానేమో! ఇస్రో తన గురించి గొప్పలెప్పుడూ చెప్పుకోదు. గొప్ప గొప్ప పనులు చేసి చూపిస్తుంది. తన ఘన కార్యాలకు గర్వపడదు. ప్రతి భారతీయుణ్ణీ గర్వపడేలా చేస్తుంది. చంద్రుణ్ణి తీసికొస్తాము, తారకలను దూసి తెస్తాము అంటూ హోరెత్తించే నాయకులున్న దేశంలో, ఆ పనుల్ని చేసి చూపిస్తున్న మౌన ముని, ఇస్రో! అంతరిక్షాన్నంటే విజ్ఞానం తమ సొంతమైనా కూడా, ప్రతీ ప్రయోగానికీ ముందు, సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి ప్రార్థించడం ఇస్రో శాస్త్రవేత్తలకు ఆనవాయితీ.

శాస్త్ర , సాంకేతిక రంగాల్లో ముందంజ వేసి, అనేక విజయాలను అందించిన సంస్థలు పౌరులతో, ముఖ్యంగా విద్యార్థులతో నేరుగా సంపర్కం పెట్టుకుని ఆయా రంగాల గురించి మరింత అవగాహన, తద్వారా ఆసక్తినీ కలిగించవలసిన అవసరం ఉంది. మన దేశంలో అటువంటి ప్రయత్నం చేస్తున్న సంస్థలు తక్కువ. ఇస్రో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహణలో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, చిన్న తరగతుల విద్యార్థుల కోసం కార్యక్రమాలు చెయ్యవలసిన అవసరం ఉంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మన దేశంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తోంది.

ఇస్రో వాణిజ్యపరంగా ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతూ ఈ రంగంలో నిలదొక్కుకుని ఉన్న అతి కొద్ది దేశాలతో పోటీ పడగలిగే స్థాయికి చేరింది. త్వరలో జరపనున్న మొదటి చంద్రయానం తరువాత మానవ సహిత అంతరిక్ష యాత్ర చేసే ప్రణాళిక కూడా ఇస్రోకు ఉంది. ఈ ప్రయోగాలు, పరిశోధనలు, ప్రణాళికలు.. అన్నీ విజయవంతమై ఇస్రో, అంతరిక్ష పరిశోధనారంగంలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఇస్రో విశ్వస్య రాజతీ” అనిపించుకోవాలని ఆశిద్దాం.

———–

-తుమ్మల శిరీష్ కుమార్ (చదువరి)

Posted in సంపాదకీయం | 9 Comments

ఏటి ఒడ్డున కొన్ని మాటలు – మూలా సుబ్రహ్మణ్యంతో స్వాతి కుమారి కబుర్లు

-స్వాతి కుమారి

కవిత్వమంటే ఏమిటి, అది నిర్వచనాలకు, సమీకరణాలకు కట్టుబడి ఉండేదేనా? పద్యమైనా వచనమైనా, అందులో ఎన్ని మార్పులు, కొత్త పద్ధతులూ వచ్చి చేరినా.. మూల పదార్ధాలైన రసమూ, ధ్వనీ – మరోలా చెప్పాలంటే భావమూ, భాష – వీటి ప్రాముఖ్యత ఎంత వరకూ నిలబడి ఉంది?

కొద్దో గొప్పో కవిత్వం రాయటం మొదలెట్టిన వాళ్ళకి ఈ సందేహాలన్నీ ఎప్పటికప్పుడు ముసురుకుంటూ ఉండేవే. ఇవన్నీ పెద్దలందరూ వివరించిన విషయాలే ఐనా, రోజురోజుకి కవితా ధోరణులు చురుగ్గా మారిపోతున్న నేపథ్యంలో మనకి మనం చర్చించుకుని ఆత్మవిమర్శ చేసుకోవటం సమంజసం. ఈ విషయం మీద పిచ్చాపాటీ జరపటానికి పొద్దు తరఫున మూలా సుబ్రహ్మణ్యం గారిని అతిధిగా ఆహ్వానించాం. ఇక కబుర్ల లోకి..

~~~~

స్వాతి: ఇక మొదలెడదాం. పొద్దుకి నేను పాతేగానీ మీరు ఇంకా పరిచయం కాలేదు.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: ఒక వ్యక్తిగా, ఇంకా కవిత్వానికి సంబంధించీ మీ పరిచయం ఇవ్వగలరా
సుబ్రహ్మణ్యం: సొంత ఊరు : విశాఖపట్నం, ప్రస్తుత నివాసం బెంగుళూరు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వృత్తి, కవిత్వం ప్రవృత్తి. “ఏటి ఒడ్డున” అనే కవితా సంపుటి ప్రచురించాను. ఇది పరిచయం
స్వాతి: మరి ప్రేరణ మీరు సహజంగా యే భావానికి, ప్రేరణకి స్పందించి కవిత్వం రాస్తారు?
సుబ్రహ్మణ్యం: ఏ కళకైనా పునాది, ప్రేరణ జీవితమే అనిపిస్తుంది. ముగింపు ముందే తెలిసినా ఒక్కో మనిషి జీవితమూ ఒక్కో మహాకావ్యమే! అందుకని నా కవిత్వానికి కూడా జీవితమే ప్రేరణ.
సుబ్రహ్మణ్యం: మీ ప్రేరణ కూడా చెప్పండి
స్వాతి: మీరు చెప్పినట్టే విస్తృతార్ధంలో అందరికీ జీవితమే ప్రేరణ ఐనా. ఇంకొంచం సూక్ష్మంగా చెప్పాలంటే నాకు ఎక్కువ ప్రకృతి లోంచి ప్రేరణ దొరుకుతుంది. మనమంతా ఎంతో ప్రణాళికా బద్ధంగా ఒక రొటీన్ కి కట్టుబడి జీవిస్తూ ఉంటాం, సవ్యమైన మనుగడకి అది చాలా అవసరం కూడా. కానీ చాలాసార్లు ఇది యాంత్రికంగా విసుగు తెప్పించేలా పరిణమిస్తుంది.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: అలాంటప్పుడే అనుకోకుండా రాలిపడే ఒక వర్షపు చినుకో, చెప్పకుండా తాకే ఒక చిరుగాలో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది.
సుబ్రహ్మణ్యం: నా కవిత్వానికి ముందు మాట రాస్తూ విన్నకోట గారు ఇలా అన్నారు “కవిత్వం జీవితాన్ని వెలిగిస్తుంది.. కాంతి మయం చేస్తుంది” అని
స్వాతి: నిజం.
సుబ్రహ్మణ్యం: ప్రకృతిలో ప్రతి అంశం ఏవో రహస్యాల్ని దాచుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రహస్యాల శోధనే కవిత్వం అనుకోవచ్చేమో!
స్వాతి: ఒక పార్శ్వం నుంచి అంతే!
సుబ్రహ్మణ్యం: మరి ఇంకో పార్శ్వం?
స్వాతి: కానీ వింతేమిటంటే అవి అందరికీ తెలిసిన విషయాలే. ఒక కవి శోధించి చెప్పాక, ‘అవును కదా ఇన్నాళ్ళూ గమనించలేదు’ అనిపిస్తుంది.
సుబ్రహ్మణ్యం: చాలా నిజం. అయ్యో నేను ఇలా ఎందుకు రాయలేదు అనిపిస్తుంది. అదే గొప్ప కవిత్వం.
స్వాతి: అవును, ఎవరికోసం వారు రాసుకున్నదే అందరినీ తాకుతుంది. పాఠకులకిలా నచ్చుతుంది అనుకుని రాసినప్పుడు సార్వజనీన భావన ఉండదు కవితలో.
సుబ్రహ్మణ్యం: అవును Target audience ని దృష్టిలో పెట్టుకుని రాస్తే అది కవిత్వం కాదు.
స్వాతి: తిలక్ చెప్పినట్టు నువ్వు రాసేదేదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి. సరే.. మీ మిగతా ప్రేరణల మాటేమిటి? ప్రకృతి కాకుండా ఇంకా మీరు కవిత్వం ఎక్కువగా దేని గురించి రాస్తారు?
సుబ్రహ్మణ్యం: నేను మొదట్లో చిన్న చిన్న వస్తువులు తీసుకుని కవిత్వం రాసేవాడిని.. కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ అంటూ… అప్పుడు విన్నకోటగారు జీవితానుభవాలని కవితలుగా మలచమని సలహా ఇచ్చారు.. అలా ప్రాజెక్టు డెడ్ లైనులు, డీబగ్గింగ్ ఇలా చాలా విషయాల మీద కవిత్వం రాశాను. అదంతా ఒక సాధన అనుకోండి.
సుబ్రహ్మణ్యం: ఇవి కాక ప్రతి మనిషినీ “జీవితానికి అర్ధం ఉందా?” , ” కాల మరణాలేమిటి?” ” రాగద్వేషాలకి మూలాలేమిటి” , ” పరిపూర్ణమైన సౌందర్యం ఉందా?” వగైరా ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. వాటికి సమాధానాలు వెతుక్కునే ప్రయత్నంలో కూడా కవిత్వం రాస్తారనిపిస్తుంది. నావి కూడా కొన్ని కవితలు ఆ కోవలోనివే..
స్వాతి: ఆహా, ఒక తాత్విక చింతన ఉన్న కవిత్వం.. నిజమే.. ప్రతి రచయిత/ కవీ ఆ మాటకొస్తే ప్రతి మనిషికీ ఏదో ఒక దశ లో తప్పనిసరిగా కలిగే అలోచనే అది.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: ఐతే నాకో సందేహం..
సుబ్రహ్మణ్యం: చెప్పండి.
స్వాతి: ఈ తరహా కవిత్వం వల్ల కవి తనకి తాను కానీ పాఠకుడి నుండి గానీ ఆశించేదేమిటి?
సుబ్రహ్మణ్యం: రామకృష్ణ పరమహంసని ఎవరో అడిగారుట.. “ఏమయ్యా నువ్వేదో కొండల్లో కూచుని తపస్సు చేస్తే ప్రపంచానికేమిటి ప్రయోజనం” అని
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: దానికి ఆయన ‘నాలోంచి ఒక తరంగం లేచి ప్రపంచాన్ని చుట్టబెడుతుంది. అది ప్రపంచంలో ఉన్న అశాంతిని కాస్తైనా తగ్గిస్తుంది’ అని అన్నారట. కాబట్టి అన్నిటికీ లౌకికమైన ప్రయోజనాలు ఉంటాయనుకోకూడదు.
స్వాతి: అది నిజమే ఆ మాటకొస్తే ఏ కళనుంచైనా అలోచన నుంచైనా లౌకికమైన ప్రయోజనాన్ని ఆశించలేము.
సుబ్రహ్మణ్యం: కవిత్వం విముక్తి కూడా… బాగా అలజడిలో ఉన్నప్పుడు అది రాసేస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది.. కదా?
స్వాతి: తనలోని అంతర్గతమైన తపనని అనుభూతిని అలోచనని తనకి తాను వ్యక్తపరచుకోవటమే కళాకారుడి / కళ యొక్క మొదటి ఉద్దేశం అనిపిస్తుంది
సుబ్రహ్మణ్యం: అవును.
స్వాతి: నిజం ఆనందం కోసం ఎందరు రాస్తారో నాకు తెలీదు కాని. బాధ తీరటానికి చాలా మందే రాస్తారు
సుబ్రహ్మణ్యం: 🙂
స్వాతి: ఎప్పుడైతే ఇక ఇది రాయకుంటే ఇంకే పని మీదా ధ్యాస ఉండదు అనేంత desperate భావన కలుగుతుందో అప్పుడు మాత్రమే రాసే తరహా అన్నమాట ఇది.
సుబ్రహ్మణ్యం: అవును
స్వాతి: కవిత్వం – పద్యం నుంచి, చంధస్సు నుంచి దూరంగా వచ్చి వచన కవిత్వంగా మారటం పట్ల మీ అభిప్రాయం? నా ఉద్దేశంలో పద్యం లోని శాస్త్రీయత, చంధస్సులో నిగూఢమైన శబ్ద సౌందర్యం సాటి రానివి.
సుబ్రహ్మణ్యం: పద్యమైనా, గద్యమైనా నేను అందులో కవిత్వం కోసం చూస్తాను. వట్టి చమత్కార పూరిత పద్యాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో కవిత్వం ఉండదు. అలాగే వచన కవితల పేరిట వస్తున్న కొన్ని రచనలు శుద్ధ వచనం. కాబట్టి కవిత్వమే ముఖ్యం.
సుబ్రహ్మణ్యం: ఐతే చెప్పండి.. పద్య కవిత్వం, వచన కవిత్వంపై మీ అభిప్రాయం?
స్వాతి: పద్య కవిత్వం మన సంస్కృతికి, భాషా సంపదకు చిహ్నమే కాకుండా, ఒక క్రమశిక్షణాబద్ధమైన రచనా శైలి
సుబ్రహ్మణ్యం: అవును, ఐతే ఛందోబద్ధంగా రాసినదంతా కవిత్వమేనా?
స్వాతి: సరైన మాటే అన్నారు. పద్యం అనేది పదాల్ని ఒక పద్ధతిలో కూర్చోబెట్టగలిగే సాధనం మాత్రమే!
సుబ్రహ్మణ్యం: అవును..
స్వాతి: ఇక దానిలోని కవితాత్మ కవి తపనని బట్టీ..
సుబ్రహ్మణ్యం: ఒక ఉపమానం తీసుకుని చెప్పినట్లైతే
స్వాతి: ఊ
సుబ్రహ్మణ్యం: ఛందస్సు ఒక పాత్ర లాంటిది.. ద్రవానికి చక్కని ఆకృతిని ఇస్తుంది.. ఐతే ఆ పాత్రలో పోసేది అమృతమా, ఉట్టి నీరా అన్నది వేరే విషయం.
స్వాతి: right, ఐతే తమ పాలని గానీ నీటిని గాని తెలిసీ తెలీక ఎక్కడో ఒలకబోసుకోకుండా ఒక చక్కటి పాత్రలో పెట్టుకునేందుకు ఇదో మంచి ఏర్పాటు.
సుబ్రహ్మణ్యం: 🙂

తరువాతి పేజీ >>

Posted in వ్యాసం | Tagged , | 8 Comments

అంతర్జాలంలో వ్యాపారీకరణ

-గార్లపాటి ప్రవీణ్

అంతర్జాలంలో వ్యాపారీకరణ మొదలై చాలా రోజులయింది. దానిని విశ్లేషించడమే ఈ వ్యాస ఉద్దేశ్యం.

మరి ఈ ప్రకటనల ఇంజనునే మన తెలుగు వారు స్థాపించగలిగితే!?
ఓ గూగుల్ యాడ్‌సెన్స్ లాంటి సాఫ్టువేరునే తెలుగు వెబ్‌సైట్ల కోసం తయారు చేసుకోగలిగితే, అప్పుడు తెలుగు అంతర్జాల మార్కెటుకి ఉపయోగం కదా. ఎలా పని చేస్తుందంటే..

మొదట్లో వెబ్ పేజీలను సమాచార ప్రచురణ కోసమే మొదలుపెట్టారు. తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలన్నదే ముఖ్య ధ్యేయంగా ఉండేది. అలాగే తమ గురించి పది మందికీ చెప్పుకోవాలనేది కూడా ఒక కారణం. మొదట్లో స్థావరంగా (స్టాటిక్) ఉన్న అంతర్జాలం నెమ్మదిగా చలనశీలంగా (డైనమిక్) మారడం మొదలుపెట్టింది. స్థావరం అంటే ఎక్కువగా మారని, వాడుకరులతో ఇంటరాక్షన్ లేని వెబ్ పేజీలని అర్థం.

పోగా పోగా అంతర్జాలం కోసం DHTML, జావా, జావాస్క్రిప్టు మొదలయిన లాంగ్వేజీలు/స్క్రిప్టుల రాకతో అంతర్జాలం చలనశీలంగా మారడం మొదలుపెట్టింది. అంటే ప్రజలు తమ వెబ్‌పేజీలను వాడుకరితో ఇంటరాక్టివ్‌గా తయారు చెయ్యగలిగారు.

పై రెండిటికీ ఉదాహరణలు చెప్పుకోవాలంటే – మీరొక వ్యక్తిగత వెబ్‌సైటు మొదలుపెట్టారనుకోండి మీ రెస్యూమే, మీ ప్రాజెక్టులు మొదలయిన వివరాలను అక్కడ పెట్టుకుంటారు. దానిని స్థావర వెబ్‌సైటుగా అనుకోవచ్చు. అదే ఓ ఫోరం, ఫ్లికర్ లాంటి ఫోటో అప్‌లోడ్, యూట్యూబ్ లాంటి వీడియో అప్‌లోడ్, ఆర్కుట్ లాంటి సోషల్ నెట్వర్కింగు లాంటి వాటిని చలనశీల వెబ్‌సైటు లని అనుకోవచ్చు.

ఇక ఈ రెండిటికీ మధ్యలో ఉన్నవి బ్లాగులనుకోవచ్చు. ఎందుకంటే వీటిలో బ్లాగరి రాసే కంటెంటూ ఉంటుంది, అలాగే వ్యాఖ్యల ద్వారా డైనమిక్ గానూ సాగడానికి ఆస్కారం ఉంది.

ఇక అంతర్జాలం అభివృద్ఢి చెందుతున్న కొద్దీ అందులో వ్యాపార అవకాశాలు పెరిగాయి. ఆ ప్రస్థానం పలు విధానాలుగా సాగింది. కోట్లాది డాలర్ల వ్యాపారంగా ఎదిగింది. ఆ విధానాలను కొంత మేరకు విశ్లేషించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

స్థూలంగా చూస్తే అంతర్జాల వ్యాపారీకరణలో రెండు రకాలు కనిపిస్తాయి.

  1. మొదటిది సాఫ్ట్‌వేర్/కంటెంటు/సర్వీసుల వ్యాపారీకరణ
  2. రెండో రకం -మనందరికీ తెలిసిన ఉచిత కంటెంటు ఇవ్వడంతో పాటు వ్యాపార ప్రకటనలని ఉంచడం.

రెండిటి గురించీ విశ్లేషిద్దాము.

సాఫ్ట్‌వేర్/కంటెంటు/సర్వీసులని వ్యాపారీకరించడం:

ఈ పద్ధతిని అన్ని వెబ్‌సైట్లూ పాటించలేవు. తమ సైటులో తప్ప మరెక్కడా దొరకని కంటెంటును కలిగి ఉన్న వెబ్‌సైట్లు మాత్రమే ఈ పద్ధతిని అనుసరించగలవు. ఎందుకంటే.. అంతర్జాలం ఇప్పుడు ఎంతగా విస్తరించిందంటే ఒక చోట దొరకని సమాచారం వెంటనే వేరే చోట దొరుకుతుంది. ఒకరు సమాచారాన్ని దాచివేసినా, అది వేరేచోట్ల చటుక్కున దొరుకుతుంది. అలాగే ఒక సాఫ్ట్‌వేర్ గానీ సేవగానీ డబ్బు వసూలు చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఉచితమయినది ఇంకోటి వెంటనే పుట్టుకొస్తుంది. ఈ పద్ధతి సఫలం కావాలంటే ఆయా సైట్లకు ప్రత్యామ్నాయం ఉండకూడదు. అంటే వాటి ఖాళీని ఎవరూ పూరించలేని విధంగా ఉండాలి.

ఉదా:
ఐఈఈఈ (IEEE): ఈ సైటులోని వ్యాసాలను చదవాలంటే మీరు ఆ సంస్థ సభ్యత్వం తీసుకోవాలి. ఆ తర్వాతే అందులోని వ్యాసాలు చదవచ్చు. దీనికి ప్రజలు డబ్బులెందుకు కడతారంటే ఇందులోని కంటెంటు ఇంకెక్కడా దొరకదు కనుక. (niche content) అందుకనే వ్యాపారీకరించడం సాధ్యపడింది.

అలాగే సాఫ్ట్‌వేర్/సేవ వ్యాపారీకరణ తీసుకుంటే..

గూగుల్ యాప్స్ (Google Apps): గూగుల్ దీని ద్వారా సర్వీసుని, సాఫ్ట్‌వేర్ ని వ్యాపారీకరిస్తుంది. మనం వాడే జీమెయిల్, టాక్, డాక్స్ మొదలయిన వాటిని సంస్థలు తమ డొమెయిను పేరుతో వాడుకోవచ్చు. తమకనుగుణంగా మార్చుకోవచ్చు. ఈ సేవలోని ఒక ప్రత్యేకత ఏమిటంటే.. చిన్న చిన్న సంస్థలకు ఒక గుర్తింపు కావాలి. దానికి సరసమైన ధరలో ఒక విధానం కావాలి. అది గూగుల్ యాప్స్ ద్వారా సాధ్యం. ఇలా ఏదో ఒక ప్రత్యేకత ఉంటే గానీ వ్యాపారీకరించడం కుదరదు.

ఇక రెండో‌విధానం –

ఉచిత కంటెంటు + వ్యాపార ప్రకటనలు (అడ్వర్టైజింగు):

వ్యాపారీకరణతో వచ్చే మొదటి సమస్య డబ్బు. అవును, డబ్బే! అంత వరకూ కంటెంటు మీద ప్రాధాన్యం ఉంచిన సైట్లు హఠాత్తుగా డబ్బు కోసం పాఠకుల గురించి ఆలోచించడం మొదలుపెడతారు.

దీనిని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది గూగులే. యాడ్‌సెన్స్ సహాయంతో గూగుల్ అన్ని అప్లికేషన్లకీ అడ్వర్టైజింగుని జోడిస్తుంది. సాఫ్ట్‌వేర్ ని ఉచితంగా ఇస్తుంది. దీని వల్ల రెండు లాభాలు. వాడుకరులు విపరీతంగా పెరుగుతారు. ఎందుకంటే డబ్బు కట్టక్కర్లేదు కనుక. కంపెనీకి డబ్బూ చేకూరుతుంది, ప్రకటనల వల్ల. కాబట్టి ఇద్దరికీ లాభదాయకమే. ఈ పద్ధతి అంతర్జాలంలో విపరీతంగా ఆదరణ పొందింది. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ పద్ధతినే ఆచరిస్తున్నాయి.

ఉదా:
జీమెయిల్: జీమెయిలు రాక ముందు ఎన్నో మెయిలు అప్లికేషన్‌ లు అంతర్జాలంలో ఉన్నాయి. కానీ అవి అందించే అంశాలు పరిమితం. చిన్న సైజు మెయిలు బాక్సులు ఇస్తాయి. POP వంటి సౌలభ్యాలు ఉండవు. మరి జీమెయిలు మార్కెటుని ఎలా సంపాదించుకుంది?
-1జీబీ సామర్థ్యం గల మెయిలు బాక్సులని కల్పించింది.
-ఉచిత POP సర్వీసుని అందించింది.
-అద్భుతమయిన ఇంటర్ఫేసుని తయారు చేసింది.
-ఆహ్వానపు పద్ధతిని అవలంబించి, లేని డిమాండుని సృష్టించింది.

తర్వాత దాని ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఇప్పుడు జీమెయిలు అడ్రసు లేని వారు అరుదే. జీమెయిలు ద్వారా డబ్బుచేసుకోవటానికి కూడా గూగుల్ ఈ ప్రకటనల పద్ధతినే అవలంబించింది. మెయిలు పక్కనే సందర్భోచిత ప్రకటనలు అలాంటివే.

ఇక ఈ వ్యాపారీకరణను తెలుగు సైట్లకి ఎలా ఆపాదించుకోవచ్చు ?

పైన పేర్కొన్న పద్ధతులు కొంత మేరకు మాత్రమే స్థానిక సైట్లకు వర్తిస్తాయి. ఎక్కువగా గ్లోబల్ వెబ్‌సైట్లకే బాగా పనిచేస్తాయి. అదీకాక పెద్ద తరహా వెబ్‌సైట్లకి మాత్రమే. మరి.. చిన్న వెబ్‌సైట్లు గానీ బ్లాగరులవంటివారు గానీ మానెటైజు చేసుకోవడం ఎలా?

  • ఇక్కడ ఒక సూత్రం ఉంది.. మీ వెబ్సైట్లకు, బ్లాగుకూ వేలకొద్దీ సందర్శకులు ఉంటే తప్ప, యాడ్‌సెన్స్ (అలాంటి ఇతర) ప్రకటనలు సత్ఫలితాల నివ్వవు. దీనికి ప్రత్యామ్నాయం దాదాపు లేదు.
  • టెక్ క్రంచ్, లైఫ్ హాకర్ వంటి బ్లాగులని చూస్తే అవి ప్రకటనల ద్వారా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే వారికి నెలకి దాదాపు మిలియన్‌ల కొద్దీ హిట్లు ఉన్నాయి కనుక. అదీ కాక
  • వేల కొద్దీ ఉండే చిన్న సైట్ల మానెటైజేషను ప్రకటనల ద్వారా కుదరదు.. సింపుల్!

(ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఇంగ్లీషులో కూడా మిలియన్ల బ్లాగులలో కొన్ని మాత్రమే సమర్థవంతంగా మానెటైజ్ చెయ్యగలుగుతున్నాయి.)

అయితే సైట్లు ఇక్కడ కొంత సృజనాత్మకంగా ఉండాలి; కొత్త పద్ధతులు అన్వేషించాలి. అలాంటి కొన్ని పద్ధతులు ఈ కింద గమనించగలరు.

  • తెలుగు పుస్తకాలు అమ్మే avkf వంటి సైట్ల గురించి వింటూ ఉంటాము.
ఇప్పుడు ఏ బ్లాగరో లేదా పొద్దో ఓ పుస్తక సమీక్ష ప్రచురించింది. దానికి పక్కనే avkf నుంచి పుస్తకం లంకె ఉంచామనుకోండి.. పుస్తకం నచ్చిన వారు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే avkf వారికి వ్యాపారమూ పెరుగుతుంది. ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవచ్చు.
  • అలాగే ఇంగ్లీషులో పెద్ద బ్లాగులు (టెక్‌క్రంచ్ వంటివి) చూస్తే అవి రిఫరల్స్ ని ఒక విధానంగా ఎంచుకుంటున్నట్లుగా గమనించవచ్చు. కొన్ని పెద్ద సైట్లైతే ప్రకటనల కంటే రిఫరల్సుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
కారణం.. ప్రజలకు ప్రకటనలు చూడగానే చిరాకు పుడుతుంది. ముఖ్యంగా పాపప్ ప్రకటనలు, బ్యానర్లు.
అదీగాక, ఇప్పుడు మంటనక్కలాంటి విహరిణులు పాపప్ లను ఆటోమేటిగ్గా నిరోధిస్తాయి. దానికి అనుబంధంగా యాడ్‌బ్లాక్ ప్లస్ లాంటి పొడగింతలు వాడే వారికి ప్రకటనలు కనిపించకుండా అరికట్టే సౌకర్యం ఉంది.

అలాగే ఇతర వాణిజ్యపరమైన తెలుగు సైట్లకు గానీ, ఇతర సైట్లకు గానీ లంకెలు ఉంచవచ్చు. అవి బ్లాగులోని అసలు విషయానికి అడ్డుపడకుండా, ఎబ్బెట్టుగా ఉండకుండా ఈ లంకెలను ఉంచడం ఒక కళ.

  • అలాగే నవతరంగం లాంటి ఒక సినిమా సైటును తీసుకుంటే.. దానికి అనుబంధంగా ఐఎండీబీ లాంటి ఒక సినిమా రేటింగు సాఫ్టువేరుని జత చేసారనుకోండి. నెమ్మదిగా సినిమాకు సంబంధించిన ప్రకటనలని దాంట్లో చూపించవచ్చు. సినిమా వారితో ఒప్పందాలూ కుదుర్చుకోవచ్చు.

ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే, ఏకంగా ఈ ప్రకటనలనే తెలుగువారికి అనుగుణంగా మార్చుకోవడం ఇంకో ఎత్తు. ఇప్పటి ప్రకటనలతో చిక్కేమిటంటే ప్రకటనల మార్కెటు స్థానికం కాదు. అంటే మీరు ఒక తెలుగు సైటులో ఏ బెస్ట్ బయ్ ప్రకటననో చూసారనుకోండి.. మీరు దానిని నొక్కుతారా? అలాగే తెలుగు సైట్లకి ఆంగ్లంలో ప్రకటనలు ఉంచితే (గూగుల్ యాడ్సెన్స్ లాగా) ఎవరూ పెద్దగా వాటి జోలికి పోరు.

మరి ఈ ప్రకటనల ఇంజనునే మన తెలుగు వారు స్థాపించగలిగితే!?
ఓ గూగుల్ యాడ్‌సెన్స్ లాంటి సాఫ్టువేరునే తెలుగు వెబ్‌సైట్ల కోసం తయారు చేసుకోగలిగితే, అప్పుడు తెలుగు అంతర్జాల మార్కెటుకి ఉపయోగం కదా. ఇదెలా పని చేస్తుందంటే..

బ్లాగులు తీసుకుంటే ఏ పెద్ద బ్లాగు అగ్రిగేటరు సైటో ఈ ప్రకటనల ప్రొవైడరు అవుతుంది. బ్లాగరులు దానికి అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీలు తమ ప్రకటనల కోసం ఈ సైటును సంప్రదిస్తారు. ఈ సైటు ఇతర బ్లాగులకి ఈ ప్రకటనలని అందిస్తుంది. వచ్చిన ఆదాయాన్ని ఇద్దరూ పంచుకుంటారు ఏదో ఒక నిష్పత్తిలో. ఇది ఇప్పుడు గూగుల్ మొదలయిన కంపెనీలు చేసేదే కానీ ఆ స్థాయి వేరు, ఇది వేరు. అవి ఇంకా స్థానిక మార్కెట్లకి చేరువకాలేదు. ఆ లోటుని వీటితో పూడ్చవచ్చు.

ఇవి కొన్ని ఆలోచనలు మాత్రమే. ఈ వ్యాసం రాయడం వెనుక ఉద్దేశం కూడా ఇలాంటి ఆలోచనలని మొదలు పెట్టించాలనే.

అయితే ఇక్కడ వ్యాపారీకరణతో వచ్చే ఇతర ప్రభావాలనూ, చిక్కులనూ కూడా చెప్పుకోవాలి.

వ్యాపారీకరణతో వచ్చే మొదటి సమస్య డబ్బు. అవును, డబ్బే! అంత వరకూ కంటెంటు మీద ప్రాధాన్యం ఉంచిన సైట్లు హఠాత్తుగా డబ్బు కోసం పాఠకుల గురించి ఆలోచించడం మొదలుపెడతారు. వారికి ఎలాంటి కంటెంటు నచ్చుతుంది, ఏది ఎక్కువ వివాదాలు, వాగ్వాదాలను సృష్టిస్తాయి, ఎక్కువ హిట్లు సంపాదించి పెడతాయి.. ఇలా అన్నమాట.

ఉదాహరణకు సినిమాల ఆధారితమయిన కొన్ని తెలుగు సైట్లు. వాటిలో ప్రకటనలు ఎక్కువ, కంటెంటు తక్కువ. మొదట మంచి కంటెంటుతో ఆకట్టుకున్న ఈ వెబ్‌సైట్లకు ఇప్పుడు ప్రజలను తమ సైటుకి రప్పించడమే ధ్యేయం. దానికోసం నిజాయితీకి నీళ్ళొదిలేసి, బ్రేకింగ్ హెడ్‌లైన్‌లతో ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాసాలు ప్రచురించడం వంటి పెడదోవలు తొక్కుతున్నాయి.

ఈ మధ్యే వెబ్‌జైన్ గా చెప్పుకునే ఒక సైటులో వ్యక్తిగత బ్లాగుల చర్చలలోంచి దూషణలను తమ వెబ్‌జైన్ లో ప్రచురించింది. బ్లాగరుల గురించీ, బ్లాగుల గురించీ పనికిరాని చర్చ జరపడానికి అది వేదికగా నిలిచింది. ఇవన్నీ చవకబారు ఎత్తుగడలు. ప్రస్తుతం ప్రజలను ఆకట్టుకోవడానికి ఉపయోగపడగలవేమో కానీ వారిని నిలుపుకోలేవు.

అలాగని డబ్బు చేసుకోవడం తప్పు కాదు; అది కూడా కావాలి. ఎందుకంటే.. ఏపనైనా, లాభం ఉంటే ఎక్కువ మంది దాని మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది -ఆ పెట్టుబడి శ్రమ రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు. తెలుగు అంతర్జాల పరిశ్రమ మంచి ఆలోచనలను అమలుపరచి, తెలుగు వెబ్‌సైట్లు వ్యాపారీకరణ దిశగా అడుగులు వేస్తాయని ఆశిద్దాం.

—————–

ప్రవీణ్ గార్లపాటి బ్లాగావరణంలో ఆబాలగోపాలానికీ పరిచితుడైన బ్లాగరి, గార్లపాటి ప్రవీణ్. చురుకుగాను, తరచుగాను రాసే కొద్దిమంది బ్లాగరులలో ప్రవీణ్ ఒకరు. తెలుగుబ్లాగు గుంపులోనూ, అంతర్జాలంలో తెలుగుభాష వ్యాప్తికోసం జరిగే సాంకేతికాంశాల సహాయాల చర్చలలోనూ ప్రవీణ్ చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. తెలుగు బ్లాగుల్లోని అత్యుత్తమ టపాలను ఎంచి ఒక eపుస్తకంగా ఇటీవలే వెలువరించారు.

Posted in వ్యాసం | Tagged , | 10 Comments

2008 మే గడిపై మీమాట

మే గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
2. 2008 మార్చి గడి, సమాధానాలు
3. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
4. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
5. 2007 నవంబరు గడి, సమాధానాలు
6. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
7. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
8. 2007 జూలై గడి, సమాధానాలు
9. 2007 జూన్ గడి, సమాధానాలు
10. 2007 మే గడి, సమాధానాలు
11. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
12. 2007 మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 8 Comments

2008 ఏప్రిల్ గడి సమాధానాలు, వివరణలు

1సి

రప్

2సృ

3ష్టి

4

5

కు

తూ

6

క్కా

7

గా

ది

8

చ్చ

డి

లం

9

లి

లం

10యా

జ్ఞ

11సే

ని

12

లా

పి

13పా

శు

రా

లు

సో

14జా

15కా

రి

16

రా

17

18కో

వా

19

20పి

ల్ల

21

22ర్రి

23బా

ర్బ

రస్

మర్

ట్ట

త్తు

24వె

25ళ్ళు

మా

26పా

27

28

29

30ల్లి

31

జో

32

కు

33యా

డి

కి

34

35తొ

36పా

37ము

కి

38

39పా

లి

40

దు

ర్ణ

41యు

డు

42చె

43రా

44కో

రి

45

46చై

న్య

స్ర

వం

47డి

కొం

48

————

ఏప్రిల్ గడికి జవాబులు పంపినవారు మొత్తం ఆరుగురు. అంతా సరిగా నింపినవారు ఎవరూ లేరు.
జవాబులు పంపినవారు: కొత్తపాళీ, సుజాత శ్రీనివాస్, దైవానిక, జ్యోతి వలబోజు, మరోమాటచెప్పు, వికటకవి
1 నిలువు “సిక్కా” అన్నది సరైన సమాధానమైనా, “సిక్కు” కూడా సరైనదిగానే పరిగణించబడింది.
ఒకే ఒక తప్పుతో (“యాజ్ఞసేని”కి బదులు “యాజ్ఞసేన” అని) పంపినవారు “మరో మాట చెప్పు” అన్న మారుపేరుతో ఎవరో. ఎక్కువమంది “ఉగాదిపచ్చడి”లోనూ “చైతన్యస్రవం”లోనూ తప్పులో కాలేసారు!

ఆధారాల వివరణలు:

అడ్డం:
1. ఇంకెత్తుకుంటే ఎంచక్కా మందుకొట్టొచ్చు (2)
జవాబు: సిరప్ (సిర + అప్ (up – ఇంగ్లీషులో ఎత్తు) = సిరప్ (మందు). చాలామంది సిరా దగ్గర ఆగిపోయారు!)

2. పొక్కిలిపాపడి పనే ఇది (2)
జవాబు: సృష్టి (పొక్కిలిపాడడంటే బ్రహ్మ)

4. కవిత్వపు తోటని దున్నడంలో అబ్బూరివారి కెంత తహతహో. అందుకే కాబోలు నాగలి కాస్తా వంగి పోయింది! (3, 3)
జవాబు: కవనకుతూహ (కవిత్వపు తోట – క”వన”. తహతహ – కుతూహలం, అబ్బూరి వరదరాజేశ్వర రావుగారి పుస్తకం. హలం వంగి, చివరి అక్షరం, నిలువుతో కలిసిపోయింది)

7. ఆంధ్ర శాకంబరీ దేవి ప్రసాదమే ఇదీను. ఒక్కసారి తింటే ఏడదిపాటు తిన్నట్టే (3, 3)
జవాబు: ఉగాది పచ్చడి (ఇది గోంగూరా, మాగాయ పచ్చడి కూడా అవ్వొచ్చు. కానీ ఒక్కసారి తింటే ఏడాదిపాటు తిన్నట్టే అన్నది ఉగాది పచ్చడికి మాత్రమే వర్తించేది)

9. ఆ! సలికాలంలో నీళ్ళు గావాల్నా? (3)
జవాబు: సలిలం

10. ఏ సతి వహ్నిలోన జనియించెను జన్నమొనర్చు వేళ? (4)
జవాబు: యాజ్ఞసేని (ద్రౌపదికి మరో పేరు. ఇచ్చిన ఆధారం తిరుపతివేంకటకవుల పద్యం)

12. Dreamని stop చేసి చూడండి. ప్రవరుడు అటజని కాంచినది కనిపిస్తుంది. (3)
జవాబు: కలాపి (నెమలి అని అర్థం. “అటజనికాంచె…” పద్యంలో వస్తుంది, “కలాప కలాపిజాలముల్”)

13. ఆండాళ్ళూ… ఆండాళ్ళూ… మార్గశిరంలో పాడుకుందాం ఈ పాటలు. (4)
జవాబు: పాశురాలు (ఆండాళ్ రాసిన తిరుప్పావైలోని పాటలని పాశురాలంటారు. ధనుర్మాసంలో చదువుతారు)

15. వేటూరి I love you చెప్పిన మందగమన (3)
జవాబు: హారిక

18. గిరిజ, అందాల అక్కినేనికి అందిచే మిఠాయి (2)
జవాబు: కోవా (అందమైనా బావా ఆవు పాలకోవా పాటలోది)

20. పేరుకి చిన్నపిల్లాడిలా ఊడలు పట్టుకుని ఊగుతాడు కానీ, మాంచి శృంగార
కవితలల్లుతాడు. (5)
జవాబు: పిల్లలమఱ్ఱి (శృంగార శాకుంతలం రాసిన కవి – పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు)

23. వెంకటేశం ఇంట్లోవాళ్ళు ఇలాటి పీపులని గిరీశం అనుమానిస్తాడు. (3)
జవాబు: బార్బరస్

24. పోరా అని ఇంత మర్యాదగా చెప్పాలా! (3)
జవాబు: వెళ్ళుమా

26. దువ్వూరి వారు నిర్..మింషిన… షాల… (2)
జవాబు: పాన (పానశాల దువ్వూరి రామిరెడ్డివారి పద్యకావ్యం. ఒమర్ ఖయాము రుబాయిత్ లకి అనువాదం)

28. ఈ రాజు విష్ణుమూర్తి ఆజ్ఞ వినలేదేమోనని మరో రాజు గారి సందేహం (2)
జవాబు: ఖగ (“ఖగరాజు నీయానతి విని వేగ చనలేదో” త్యాగరాజు కీర్తన “నగుమోము…”లో వస్తుంది)

30. అల్లసానివారిది గజిబిజిగా చేసారుట! (3)
జవాబు: ల్లి క అ (అల్లిక గజిబిజి అయ్యింది. “అల్లసానివారి అల్లిక జిగిబిగి”)

32. అచ్చటకు ఇంకా short-cutలో వెళ్ళొచ్చు (3)
జవాబు: అటకు (“అచ్చటకు”లో “చ్చ” cut చేస్తే “అటకు”. అచ్చటకు, అటకు రెండూ ఒకటే అర్థం)

33. ఎక్కడికి, రాయలసీమకా? (3)
జవాబు: యాడికి

34. 10 అడ్డంలో సతిని అవమానించిన వాడి ఆయువుపట్టు. అటూ ఇటూ అయ్యింది (2)
జవాబు: డతొ (10 అడ్డంలో సతి ద్రౌపది. ఆమెని అవమానించినది దుర్యోధనుడు. అతని ఆయువుపట్టు తొడ)

36. ఈ పిల్లని మనం కళ్ళలోపెట్టుకు కాపాడుకుంటాం (2)
జవాబు: పాప (పాప అంటే పిల్ల, కంటిపాప అని కూడా అర్థం)

37. నిప్పురాయి మొహం చెక్కుకు పోయింది (2)
జవాబు: ముకి (నిప్పురాయి – చెకుముకి రాయి. ముందుభాగం “చెకు” పోయింది)

39. శిశుపాల్ ఇతడు. దుష్ట నిర్ణయుడు, బాలుడు అని భీష్మ ఉవాచ (3, 4)
జవాబు: పాలితదుర్ణయుడు (“పాలితదుర్ణయుండు శిశుపాలుడు బాలుడు” అన్న భారతంలో పద్యంనుంచి)

42. నీ మొహానికి హిందీ కూడానా! (3)
జవాబు: చెహరా

44. చీర చుట్టుకున్న ఆకాంక్ష (3)
జవాబు: కోరిక (“కోక” – చీర)

45. 34 అడ్డాన్ని భగ్నం చేసింది ఇదేగదా (2)
జవాబు: గద (34 అడ్డం తొడ. “ఇదేగదా”లో కూడా “గద” ఉంది)

46. నవీనమైన ఆంతరంగిక ఆలోచనా ధార. అనంతంగా కారుతూనే ఉంటుంది (5)
జవాబు: చైతన్యస్రవం (చైతన్యస్ర్వంతి అంటే ఆలోచనాధార. ఈ సాహిత్యశైలిని తెలుగులో ప్రవేశపెట్టింది అంపశయ్య నవీన్. అనంతంగా – చివరి అక్షరం లేకుండా. కారుతుంది – స్రవం అంటే కారేది)

47. జాగ్రత్త, చూసుకోండి! తేలు తోకతో వెనకనుంచే కుడుతుంది. (2)
జవాబు: డికొం (కొండి – తేలు తోక. చూసు”కోండి” కూడా ఒక క్లూయే)

48. మొత్తం ఇవెన్నున్నా, చంద్రునికున్నవి మాత్రం అందులో పావువంతే (2)
జవాబు: కళ (చతుష్షష్టి కళలు 64. అందులో పావువంతు 16. చంద్రునికి 16 కళలు)

నిలువు:
1. ఈ పంజాబీ ఆయనకి హెల్తు బాలేదా? (2)
జవాబు: సిక్కా (ఆధారంలో ప్రశ్నార్థకం ఉంది కాబట్టి “సిక్కా” అన్నదే సరైన జవాబు. కానీ, “సిక్కు” కూడా సరైనదిగానే పరిగణించబడింది)
2. జిత్తులమారి నక్క, వల్లో పడదు. గాలానికి మాత్రం చిక్కుకుంది (3)
జవాబు: సృగాలం
3. ఏంటలా కిందనుంచి మీదకి చూస్తావ్, వికృతపు చూపు! (2)
జవాబు: ష్టిది (చూపు – దృష్టి. దానికి వికృతి దిష్టి.)
4. తెలుగులో కుబేరాక్షి అచ్చముగ ఈ కాయేనట. కాకపోతే కాస్త పరుషంగా మారింది. (2)
జవాబు: కచ్చ (కుబేరాక్షి – గచ్చకాయ. “గ” పరుషంగా మారి “క” అయ్యింది)
5. జోరుమీదున్న భార్యని వేయించుకు తింటే, వరేవ క్యా బాత్ హై! (4)
జవాబు: వడియాలు (వడి (జోరు) + ఆలు (భార్య) )
6. మిగతా సగం ఏది బాలా? శివుడు మింగేసాడు హలా! (2)
జవాబు: హలం (హలాహలం – శివుడుమింగిన విషం)
7. ఉలికి పడే పిరికి పక్షి. ఊరికెందుకో దూరం? (4, 2)
జవాబు: ఉలిపిరిపిట్ట (“ఉలి”కి పడే “పిరి”కి పక్షి. ఉలిపిరిపిట్ట ఊరంతటికీ దూరం అన్నది సామెత)
8. అగ్గిపాలు చెయ్యడం ఇతనికెందుకంత ప్రీతిపాత్రమో? (5)
జవాబు: పరశురామ (పరశురామ ప్రీతి అయిపోవటం అంటే అగ్నిలో కాలిపోడం)
9. ఖర్చు లేకుండా దొరికేది. మధ్యలో అలా సాగదియ్యాలా? (3)
జవాబు: సలాహా (“ఉచిత” సలహా)
11. చాసోలా ఎంగ్లీషులో అలా చెప్పు (2)
జవాబు: సేసో (“అలా చెప్పు” – ఇంగ్లీషులో “సే సో”. “చాసో”తో rhyming)
14. ముందు వెళ్ళమంటావ్, తరవాత రమ్మంటావ్. నీ సాంకేతిక భాష నాకేం అర్థం కావటం లేదు! (2)
జవాబు: జావా (“జా” – హిందీలో వెళ్ళు. “వా” – తమిళంలో రా. జావా సాంకేతిక భాషే కదా!)
16. కన్నెపిల్ల చెప్పే అబద్ధం (2)
జవాబు: కల్ల
17. ఓ భామా! ఇతణ్ణి గెలవడం కష్టమే సుమా! బహు పరాక్! (3)
జవాబు: ఒబామా (ఇక్కడ భామెవరో తెలుసుకదా! “బహు పరాక్” లో “బరాక్” కూడా ఉన్నాడు)
18. కో అంటూ పాడే వంత సాంగు (3, 2)
జవాబు: కోరస్ పాట
19. 26 అడ్డం అసలు ఓనర్ (2, 3)
జవాబు: ఒమర్ ఖయాము (ఉమర్ ఖయాము, ఉమ్ర ఖయాము కూడా రైటే)
21. కత్తులని తిరగేసి దూసితే వచ్చేది రక్తం కాదు. కానీ అలాగే ఎర్రగా ఉంటుంది (3)
జవాబు: లత్తుక (“కత్తుల”ని తిరగేస్తే వచ్చేది. లాక్షారసం ఎర్రగా ఉంటుంది)
22. పిచ్చి మళ్ళీ తిరగబెట్టిందిరోయ్! (2)
జవాబు: ఱ్ఱివె
25. 36 నిలువులోవే. నిజానికి ఇవెప్పుడూ జంటగానే ఉంటాయి, తిరగేసి మరగేసినా (2)
జవాబు: ళ్ళుజో (36 నిలువులోది పాదుక. “జోడు” అంటే “జంట” అని కూడా అర్థం)
27. అసలు కరటకశాస్త్రి అన్నదమ్ముడు. తోడు లేక తడబడినట్లున్నాడు (5)
జవాబు: నకుమడుద (దమనకుడు anagram. కరటక దమనకులు పంచతంతంలో అన్నదమ్ములు, నక్కలు)
29. ఘడియ ఘడియకీ ఇక్కడికి వస్తున్నారే మీరు! (3)
జవాబు: గడికి
31. అప్పుడప్పుడూ సగంలో ఆగిపోయి దడ పడకండి (3)
జవాబు: అడపా (అడపాదడపా – అప్పుడప్పుడు.)
32. ఆకులైనా తినకుండా ఆ తపస్సేమిటమ్మా! (3)
జవాబు: అపర్ణ (పర్ణము – ఆకు. ఆకులుకూడా తినకుండా శివునిగురించి తపస్సు చేసింది కాబట్టి పార్వతి అపర్ణ అయ్యింది)
35. పొద్దెక్కకుండా కుయ్యాల్సింది, ఈ ప్రపంచంలో పొద్దెక్కాక కూస్తుందేమిటి చెప్మ? (2,2)
జవాబు: తొలికోడి (ఇది పొద్దు పాఠకులందరికీ తెలిసిందే!)
36. కనకపు సింహాసనమున కూర్చోడమే కాదు రాజ్యం కూడా ఏలింది (..ఏలాయి) (3)
జవాబు: పాదుక
38. శ్రీ శ్రీ చేసిన ప్రతిజ్ఞలో వృత్తుల లెక్క (3)
జవాబు: సహస్ర (“సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు” – శ్రీశ్రీ)
40. మంధరగిరి, చిలికి చిలికి చివర అరిగిపోయిందా వెంకమాంబ గారూ! (3)
జవాబు: తరికొం (తరికొండ – మంధరగిరి. తరికొండ వెంగమాంబ తెలుగు రచయిత్రి)
41. నువ్వు గొంతుకలిపితే, ఈ గీతం పాడగలం (3)
జవాబు: యుగళ (“యు” – నువ్వు. “గళ” – గొంతు కలిపితే “యుగళ”)
42. రష్యాలో రగులుతున్న చిచ్చుకి మొదలేది?
జవాబు: చెన్య (చెచెన్య – రష్యాలో గొడవలవుతున్న దేశం)
43. రాధామాధవం ఎంత చక్కని జంట. మధ్యలో స్వరహీనమైతే మాత్రం మిగిలేది పెద్ద అరుపే! (2)
జవాబు: రావం (“రా” “ధా మా ధ” “వం”. “ధా మ ధ” తీసేస్తే “రావం”)

Posted in గడి | Tagged | Comments Off on 2008 ఏప్రిల్ గడి సమాధానాలు, వివరణలు

ఈ చిరునామా వెతికి పెట్టండి

– జోగధేను స్వరూప్‌కృష్ణ

ఈ చిరునామా వెతికి పెట్టండి
శతాబ్ధాలుగా తిరుగుతున్నా
సందుల్లో, గొందుల్లో, చెట్లకిందా, పుట్టల్లో
కొండల్లో, లోయల్లో, నదులు, పర్వతాలు,
వీధులు, చౌరస్తాలు, కూడళ్ళు,
మనిషి గుండెల్లో పెనులోతుల్లో
మనసుల్లో, మష్తిష్కాలలో
ఎంతని వెతికినా, ఎక్కడ వెతికినా
మచ్చుకైనా ఆచూకీ తెలియకుండా
కొన్ని సార్లు దొరికినట్టే దొరికి తప్పించుకుపోయింది
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి.

నిప్పులాంటి నిజం చెప్పిన పాపానికి
చైతన్యం నూరిపోసే ప్రయత్నం చేసినందుకు
జైలు గోడల్లో బంధించి
విషాన్ని గొంతులోతుల్లో నింపి
నిజాన్ని సమాధి చేసినప్పుడే
శోకంతో కుమిలిన సోక్రటీస్
గొంతెత్తి అరిచాడు ఈ చిరునామా వెతికి పెట్టండని
అప్పుడు దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి.

అహింస పరమ ధర్మమని
మనిషే దేవుడని
కొత్త రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నంలో
రక్తాన్ని చిందించిన ప్రభువును
ముళ్ళ కిరీటం, శిలువలతో సత్కరించినపుడు
అమాయకులంతా అరిచారు
ఈ చిరునామా వెతికి పెట్టండని
వాళ్ళతో గొంతు కలిపి అప్పట్నుంచి అరుస్తూనే ఉన్నా
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి.

కత్తికి పూలు కట్టి
వేటుకో తలనరికి
రక్తపు పూల సువాసన మరిగిన
అశోకుడు కళింగ యుద్దంలో పారించిన
రక్తపు టద్దంలో చరిత్ర హీనంగా కనిపించినప్పుడు
ఆ ప్రతిబింబాల్లో కనిపించిన వికృతం
వినిపించిన వికటాట్టహాసం
చరిత్ర పుటలను నలుపు చేస్తున్నప్పుడు
బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి
అన్న శబ్దాల్లో కనీ కనిపించినట్టు
కనిపించి మాయమై పోయింది
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

దేవాలయం మెట్లమీద కత్తికో కండగా
హైందవుల ప్రాణాలను తీసి
పిలక మీద పన్ను, జుట్టు మీద పన్ను
నడిస్తే పన్ను, ఏడిస్తే పన్ను
జన జీవనాన్ని అతలాకుతలం చేసి
సంస్కృతి ని ఛిన్నాభిన్నం చేసినప్పుడు
ఈ చిరునామా వెతికి పెట్టండి అన్న
నిర్భాగ్యుల ఆక్రందనలు విని
ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నా
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

ఒక్కడు పూనుకొని
దరిద్ర నారాయణులకు తోడై నిలిచి
సత్యం, అహింసల తోడుగా యుద్ధం చేసి
జాతి శృంఖలా ఛిన్నం చేస్తే
ప్రార్థన చప్పుళ్ళలో తుపాకీ చప్పుళ్ళు
హే రాం……….
మహాత్ముడెక్కిన మరణ శయ్యలో
వెతికినప్పుడు
ఎక్కడో దాక్కుంది మళ్ళీ కనిపించలేదు
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

మితి మీరిన సామ్రాజ్య దాహం
ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుందామని
రాక్షసత్వానికి పరాకాష్ఠ
హిరోషిమా నాగసాకి
ఊళ్ళకి ఊళ్ళే ధ్వంసం చేసే
మారణకాండలో మగ్గిన జనం
గొంతెత్తి అరిచారు ఈ చిరునామా వెతికి పెట్టండని
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

స్వర్ణాలయంలో సిక్కుల ఊచకోత
మసీదుల్లో ప్రార్థనల మధ్య పేలిన
టిఫిన్ బాంబులు
పేలిన శరీరాలు
పవిత్ర వాక్యాల మధ్యలో
ఈ చిరునామా వెతకండన్న అరుపులు
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

మొన్నామధ్య గాంధి చౌరస్తాలో
తెగిన తలలు
రక్తం కక్కిన కొడవళ్ళు
ముఠా కక్షల్లో భూమికి రక్త తర్పణం
చుట్టూ మూగిన జనం గుసగుసల్లో
ఈ చిరునామా కోసం ఆరాటం
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

సున్నితమైన ప్రేమ భావనకు
విలువనియ్యక
కత్తి మెడమీద పెట్టి
ప్రేమిస్తావా చస్తావా అంటూ
చదువుల తల్లి నిలయంలో
యాసిడ్‌తో, కత్తితో దాడి
అప్పుడే వికసిస్తున్న మొగ్గలను
నేలరాచినప్పుడు
లోకం గొంతెత్తి ఈ చిరునామా కోసం వెతికితే
అప్పుడూ దారి తప్పింది
మళ్ళీ ఇప్పటి దాకా వెతుకుతూనే ఉన్నాను
దయచేసి ఈ చిరునామా కాస్త వెతికిపెట్టండి

కళ్ళు మూసుకుపోయి కామంతో
పసి మొగ్గలని కూడా చూడకుండా
ఒక్కసారిగా కబళించి
పసి జీవితాలతో ఆడుకున్న వైనం
పేపర్లో చదివి టీ కొట్టు దగ్గర
గుంపులు గుంపులుగా చర్చించుకుంటూ
ముక్కు మీద వేలేసుకున్నప్పుడు
ఈ చిరునామా వెతికి పెట్టండని అరిచా
దొరకలేదు.,…
దయచేసి ఈ చిరునామా వెతికి పెట్టండి…

కనీ పెంచిన కన్నపేగు
కొన్నేళ్ళుగా పడిన బాధలను
మొక్కకు అంటుకట్టిన వైనాన్ని
పాదులు తీసి ఎరువులు వేసి పెంచిన వైనాన్ని
పట్టించుకోకుండా
రెక్కలు రాగానే గుండెలమీద తన్నిన
తాపులను చూస్తూ, పున్నామో నరక త్రాయతి ఇతి పుత్ర ఒకప్పుడు
పుట్టినప్పుడే నరకం చూపించే పుత్రులు ఇప్పుడు…
బతకలేక వీధులపాలైన తల్లిదండ్రుల ఆక్రందనల్లో
ఈ చిరునామా కోసం అరుపులు వినిపించాయి…

నిజాన్ని సమాధి చేసే సంస్కృతి
బాల్యం గుండెల్లో తూట్లు పొడిచే వికృతత్వం
కామంతో పసిమొగ్గలను చిదిమేసే వికారత్వం
ప్రాణం విలువ తెలిసీ గొంతు నులిమే రాక్షసత్వం
నవ్వుతూనే విషం చిమ్మగలిగే బహు నాటకత్వం
ముఖానికి మాస్క్ వేసుకుని
అసలు రంగు కనిపించనీయకుండా మసలే మూర్ఖత్వం
బంధాలు మరచిపోయి
అనుబంధాల ఊసే లేని
ప్రేమలకు చోటు లేని
విలువలు లేని జీవితాలు
నిజానికి ప్రపంచం పేలిపోతోంది
నాగరికత ముసుగులో అనాగరికత తాండవం
చూడలేక పారిపోయింది….
ఎక్కడుందని వెతకాలి

ఎక్కడా కనిపించని ఈ చిరునామా
మరేమీ కాదు….
నేను వెతుకుతున్నది
మానవత్వం కేరాఫ్ ప్రపంచం,
మనిషి పుట్టినప్పుడే సహజ లక్షణం
మానవత్వం కోల్పోయిన దశలో
తరతరాల చరిత్ర పుటల్లో
ప్రతి పేజీలో
మరకలే, మానవత్వం మరుగున పడిన సందర్భాలే
ఇప్పుడు జనారణ్యాలలో తిరుగుతున్న కౄర మృగాలను
వేటాడ్డానికి ఎవరో రావాలి
మానవత్వం పంచే ఒక మదర్
అహింసను బోధించే ఒక జీసస్
సత్యాన్ని నేర్పే ఒక మహాత్ముడు
విలువల్ని కాపాడే ఒక రాముడు
మళ్ళీ వస్తే చిరునామా దొరికినట్టే
ఈ చిరునామా దొరకాలి…..

————

స్వరూప్ కృష్ణమూర్తి

డా. జోగధేను స్వరూప్ కృష్ణ, ఎం.ఏ., ఎం.ఫిల్, పి.హెచ్.డి, కడప జిల్లా ప్రొద్దటూరు లోని ఎస్. సి. ఎన్. ఆర్. కళాశాలలో తెలుగు శాఖలో రీడర్ గా పని చేస్తున్నారు. ఇప్పుడో నది కావాలి ( కవిత సంపుటి), Intangible cultural heritage of folk arts of Rayalaseema లను ప్రచురించారు. వీరి స్వంత వెబ్ సైటు – http://renatisuryachandrulu.com. 24fps.co.in లో కూడా రాస్తూంటారు. సుజనరంజనిలో కళా జానపదం శీర్షికను నిర్వహిస్తున్నారు. రేడియో ప్రసంగాలు, తెవికీలో రాయడం, కవితలు రాయడం వీరి ఇతర వ్యాసంగాలు.

Posted in కవిత్వం | 8 Comments

బ్లాగరుల నుండి బ్లాగరులకో లేఖ!

– కొల్లూరి సోమశంకర్

తెలుగు నేస్తమా,

బావున్నారా? చాలా రోజులయ్యింది మనం మాట్లాడుకుని కదూ! అందుకే ఈ తెలుగు లేఖ.

తియ్యని తెనుగులో కొత్తపాళీతో రాస్తున్నా! తెలుగులో కబుర్లు చెప్పాలని ఉంది.

వెన్నెలలో విశాఖ తీరాన విహరించి, తెలుగులో విశేషాలు చెప్పాలని ఉంది. వికటకవి రాసిన తేటగీతి మీరు చదివారా?

గోదావరితీరంలో వాగ్దేవి ఒడిలో ఓనమాలు దిద్దుకుని, అక్షరవనంలో కదలాడి ఆర్మూరు చేరి జాను తెనుగు సొగసులు ప్రదర్శిస్తున్న అభినయని అంతరంగం తెలిసిందా?

మనలోని మాట-మనసులోని మాట అంటూ గుండెచప్పుడు వినిపించే కళా స్పూర్తీ, పంచవటిలో పూలవాన కురిసిందట! జాబిల్లి సాక్షి గా పిచ్చుకలు గడ్డిపూలు ఏరుకుంటున్నాయట!

గోదావరి అంతర్వాహిని అయ్యేచోట కూర్చుని తెలుగు సాహిత్యం గురించి నా మాట చెప్పనా? . తెలుగుమాట-తేనె ఊట కదూ!
నేను ఏమనుకుంటున్నానంటే , మానసవీణ ని శృతి చేస్తూ, పడమటి గోదావరి రాగం పాడుతూ పాటల పల్లకి లో ఊరేగుదాం.
అప్పుడు ఏం జరిగిందంటే అంటూ సేకరించిన ఆలోచనలు-అందుకున్న అనుభూతులు పంచుకుందాం.

కొత్తబంగారు లోకం లో బొమ్మలాట ఆడుకుందామా లేక కంప్యూటర్ మాయాజాలం తిలకిద్దామా? పూతరేక్స్, రేగొడియాలు, మరమరాలు తింటూ సాలభంజికలు పాడే సరిగమలు విందాం. దీప్తిధారలా ప్రవహించే కల్హార కవితలు చదువుకుందాం. రెండు రెళ్ళు ఆరు అనుకునే విహారి కలం కలలు నీకు పరిచయమేనా?

ఇంకా ఏమిటి సంగతులు? నా మదిలో బోలెడు ఊసులు సుమా!

నా ప్రపంచంలో హరివిల్లు విరిసింది. నేను విన్నవి-కన్నవి చెబుతాను. ఏది నిజం అని అడగకు. తెలుగునేలలో ఖ్యాతి గాంచి
ఆంధ్రా నుంచి అమెరికావరకు పాకిన వీవెనుడి టెక్కునిక్కులు తెలుసా?

కాలాస్త్రిలో ఆణిముత్యాలు దొరుకుతున్నాయట! నేను సైతం తెలుగువాడిని అంటూ శ్రీకృష్ణదేవరాయలు చేసే, శోధన సత్య శోధన తెలుసుకుందాం. భువన విజయం సభలో నవ్వు నవ్వించు

చదువరి గారి సోది గురించి భాగ్యనగరంలో చర్చావేదికపై చర్చిద్దాం. రాతలు-కోతలు ఎప్పుడూ ఉండేవే కదా!

నా మనసు నీకు తెలుసు. నా స్వగతం మరల తెలుపనా?

పొద్దు పొడవగానే తెలుగుదనం ఉట్టిపడే మనిషి , నారాయణీయం పఠిస్తూ దీపారాధన చేసి నివేదన చేస్తే దేవుడు వరమీయడూ?

స్నేహమా, అవీ- ఇవీ అంటూ కథలు-కబుర్లు చెప్పుకుంటూ కడలితరగ కి పోదామా? తెరచాటు చందమామ సిరివెన్నెల కురిపించే సమయంలో నువ్వు అమృతవీణ మీటితే, నేను కాసేపు తెలుగు పద్యం చదువుకుంటాను.

సంగతులూ-సందర్భాలు ఇంకోసారా? నువ్వు మా ఇంటికి వచ్చి కలగూరగంప లోంచి ఏరిన కూరలతో నీకోసం వండే షడ్రుచులు తినాలి మరి!

ఏంటీ ఈ జగన్నాటకం అంటున్నావా?

అయితే ఓకె, తొందర్లోనే నేను, కూడలి లో బ్లాగాడిస్తా!

ఇట్లు
ఎల్లవేళలా నీ

పదహారణాల తెలుగబ్బాయి

—————

కొల్లూరి సోమశంకర్

అనువాద రచయితగా కొల్లూరి సోమశంకర్ సుపరిచితులే! 52 అనువాద రచనలు, 30 దాకా స్వంత రచనలూ (10 పిల్లల కథలతో సహా) చేసిన అనుభవం ఆయనది. 2004 లో మిత్రులతో కలసి 4 x 5 అనే కథా సంకలనం వెలువరించారు. 2006 లో, మనీ ప్లాంట్ అనే అనువాద కథా సంకలనం వెలువరించారు.

ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు.

సోమశంకర్ రచనల పూర్తి జాబితా కోసం ఆయన బ్లాగు చూడవచ్చు

Posted in వ్యాసం | Tagged | 25 Comments

ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం

-కొణతం దిలీప్

“అభివృద్ధిని అర్థం చేసుకోవడం చాలా తేలిక. అదే సమయంలో చాలా కష్టం కూడా. అభివృద్ధి చాలా బలంగా కనపడుతుంది కాబట్టి దానిని అర్థం చేసుకోవడం సుళువు. అదే సమయంలో అభివృద్ధిని అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే మిరుమిట్లు గొలిపే అభివృద్ధి వెలుగుల మధ్య అది సృష్టించే నల్లని చారలు మన కంటికి కనపడవు”

ఆర్. ఎస్. రావు (ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త)

మేం ప్రయాణిస్తున్న ఏసీ ఇండికా కారు ముంబై హైవేపై పరుగులు తీస్తోంది. సిటీకి దాదాపు పాతిక కిలోమీటర్ల దూరంలో కొత్తగా వెలసిన ఒక రిసార్టుకు ఆఫీసు నుండి మా టీం సభ్యులమంతా పిక్నిక్ కొరకు బయలుదేరాం. అప్పటి దాకా వాతావరణం గురించీ, హైదరాబాద్ ట్రాఫిక్ గురించీ జరిగిన మా కబుర్లు హఠాత్తుగా రాజకీయాలపైకి మళ్లాయి. వెనుక సీట్లో ఉన్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన కొలీగ్ అన్నాడు – “You guys from Andhra are really lucky, man. You have a great leader like Chandra Babu Naidu”. ఆ మాట నేను వినడం అది మొదటిసారి కాదు. రాష్ట్రం వెలుపలి నుండి వచ్చిన వారెవరైనా చంద్రబాబును పొగడకుండా ఉండటం అరుదు. అందులో యువత మరీను. అన్న ఎన్.టి.ఆర్. తెలుగు వాడి ఖ్యాతిని డిల్లీ దాకా తీసుకువెళ్తే మన బాబుగారేమో ఆ ఖ్యాతిని దేశ తీరాలను దాటించి న్యూయార్క్, వాషింగ్టన్ దాకా వ్యాపింపజేశాడు. ఇంత పేరు సంపాదించడానికి మీడియా కన్సల్టెంట్లకు తగలేసిన ప్రభుత్వ సొమ్మెంత అనేది వేరే విషయం.

మన రాష్ట్రానికి ఉన్న అప్పు దాదాపు లక్షకోట్లు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో దాదాపు 50 వేల కోట్ల పై చిలుకు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మింది. అప్పులు తెచ్చుకుని, ఆస్తులు అమ్ముకుని సాధించే అభివృద్ధికి ఏమైనా అర్థం ఉందా?

నేను చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కొంచెం మాత్రమేనని, ఆ సమయంలోనే రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ అప్పుల విషవలయంలో చిక్కుకు పోయిందని చెప్పానా అబ్బాయికి.

“వరల్డ్ బ్యాంక్?” ప్రశ్నార్ధకంగా మారిందా అబ్బాయి ముఖం.

“Is it some bank like Citi Bank?” అని అడిగాడా యువకుడు.

నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. రాజకీయార్ధిక విషయాలపై మన దేశపు యువతలో ఉన్న విషయపరిజ్ఞానానికి ఆ కుర్రాడు ఒక ఉదాహరణ మాత్రమే.

మనదేశంలో సంస్కరణలకు ఆద్యుడిగా, ఒక పోస్టర్ బాయ్ గా నిలిచినవాడు చంద్రబాబు. అటువంటి వ్యక్తి ఇటీవలి కాలంలో మండుటెండల్లో ఉరూరా తిరుగుతూ వ్యవసాయానికి 12 గంటల ఉచిత కరెంటు ఇస్తానని తిరగడం ప్రపంచీకరణ సమర్థకులకు ఒక చెంపపెట్టు వంటిది. ఒక విధంగా ఇది ప్రజల విజయం. చంద్రబాబు నాయుడిని 2004 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తే గానీ.., ఈ దేశప్రభువులకు సంస్కరణలు దారి తప్పుతున్నాయని తెలియ రాలేదు. ఎన్ని హైటెక్కులొచ్చినా బువ్వపెట్టే వాడు రైతన్నేనని, అతనికి మేలు చేయని ఏ విధానమూ దేశానికి మేలు చేయదనీ మత్తు వదిలేలా చేసినవాడు మన తెలుగు రైతన్నే. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం ఎలా ఉందో, సమీప భవిష్యత్తులో అది ఎలా ఉండబోతుందో అన్నది రేఖామాత్రంగా చర్చించడమే ఈ వ్యాసోద్దేశం.


రాష్ట్ర ఆర్ధిక రంగం- ప్రస్తుత స్థితి

పోయిన సంవత్సరం రాష్ట్రంలో స్థూల వార్షికోత్పత్తి (GSDP) దాదాపు పది శాతం పెరిగి 2,29,461 కోట్లకు చేరుకుంది. అన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లాగే మన రాష్ట్ర ఆర్ధిక రంగం కూడా మెల్లగా ప్రాథమిక రంగమైన వ్యవసాయం నుండి తృతీయ రంగం అయిన సేవల వైపు మళ్లింది. ఒకప్పుడు మన రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 65 శాతాన్ని సమకూర్చిన వ్యవసాయ రంగం వాటా ఇప్పుడు 26 శాతానికి పడిపోయింది. ద్వితీయ రంగమైన పరిశ్రమల వాటా 9 శాతం నుండి 21 శాతానికి చేరగా, సేవల (ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హోటల్స్, ఇన్స్యూరెన్స్ వంటివి) వాటా 27 శాతం నుండి 52 శాతానికి పెరిగింది.

ఈ యేడు మన రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు దాటింది. ఇది బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాల బడ్జెట్ల కన్నా ఎక్కువని మన ఆర్థిక మంత్రి చెప్పారు కూడా. మన వ్యవసాయ వృద్ధి రేటు 8.38 శాతం. జాతీయ స్థాయిలో ఇది 2.59 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ప్రస్తుత సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 180 లక్షల టన్నులు ఉండగలదని అంచనా; ఇదొక రికార్డు. తలసరి ఆదాయ వృద్ది రేటు జాతీయ స్థాయిలో 7.55 శాతం ఉంటే మన రాష్ట్రానిది 9.35 శాతం ఉంది. ఇవన్నీ సంతోషించాల్సిన విషయాలే. అయితే ఈ మెరుపుల వెనుక కనపడని మరకల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ అభివృద్ధికి సరైన కారణాలు, దీనికి చోదక శక్తిగా పనిచేస్తున్న వ్యక్తులు, శక్తులు, విధానాల గురించి మనం అలోచించాలి. కొన్ని గణాంకాలు వాటికవే కథ మొత్తాన్నీ చెప్పవు. దాని వెనుకున్న ఇంకొక గణాంకం తెలిస్తే కానీ దాని రెలెవెన్స్ అర్థం కాదు.

ఒక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. దేశంలో ఎక్కడా జరగనంత మెరుగ్గా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన రాష్ట్రంలో అమలవుతుంది. లబ్దిదారులకు జాబ్ కార్డులు ఇచ్చి, పోస్టాఫీసు ద్వారా చెల్లింపులు జరిపి మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలిచింది. కొన్ని లక్షల మంది పేదలు ఈ పథకం వల్ల లబ్ది పొందారు.

ఒకసారి ఈ గణాంకాలు కూడా చూడండి. స్థూల రాష్ట్రోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా గత నాలుగు దశాబ్దాల్లో సగానికి సగం తగ్గగా ఆ రంగంపై ఆధారపడి జీవించే వారి సంఖ్య మాత్రం 8 శాతమే తగ్గింది. దీనర్ధం ఏమిటంటే తక్కువ మంది ఆధారపడ్డ రంగం ఎక్కువ సంపాదిస్తుంటే, ఎక్కువమంది ఆధారపడ్డ రంగం తక్కువ సంపాదిస్తున్నది. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగడం రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం సర్వీసుల రంగంపై ఆధారపడి మనవంటి రాష్ట్రం అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. వ్యవసాయ వృద్ధి రేటు పడిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సకాలంలో రుతుపవనాలు రావడం వల్ల నీటి లభ్యత పెరగడం, ఉచిత విద్యుత్తు మూలంగా ఇప్పుడు వ్యవసాయ రంగం పరిస్థితి ఫర్వాలేదు.కానీ ఈ రెండిట్లో ఏది లేకపోయినా మళ్ళీ కథ మొదటికొస్తుంది.

మన రాష్ట్రానికి ఉన్న అప్పు దాదాపు లక్షకోట్లు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో దాదాపు 50 వేల కోట్ల పై చిలుకు ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మింది. అప్పులు తెచ్చుకుని, ఆస్తులు అమ్ముకుని సాధించే అభివృద్ధికి ఏమైనా అర్థం ఉందా?

అభివృద్ధికి అసలైన కొలమానంగా భావించే మానవాభివృద్ధి సూచిక (Human Development Index)లో ఆంధ్ర ప్రదేశ్ 1991 సంవత్సరంలో 9వ స్థానంలో ఉంటే 2001 నాటికి 10వ స్థానానికి దిగజారింది. ఇక కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మానవాభివృద్ధి నివేదిక (Human Development Report) ను తయారుచేస్తానని చెప్పి ఆ మేరకు నిధులు కూడా పొందిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రిపోర్ట్ తయారయినా బయట పెట్టట్లేదు. ఆ నివేదిక బయటికి వస్తే ఈ అభివృద్ధి బండారం బయటపడుతుందని భయం.

పేరుకు పెద్ద బడ్జెట్ అని ఇప్పుడు ఢంకా బజాయించినా అనేక రంగాలకు ఘనమైన కేటాయింపులు జరిపి యేడాది చివరకు అందులో చాలా నిధులు ఖర్చు చేయకపోవడం, చేసినా ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో ఆదరా బాదరాగా ఖర్చు చేసి వృధా చేయడం గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం వంటి రంగాలకు కోతపెట్టి డబ్బు ఆదా చేసే పద్ధతి ఏ మాత్రం సమర్ధనీయం కాదు.

రెండు రూపాయలకు కిలో బియ్యం పధకానికి ఈ బడ్జెట్లో 1980 కోట్లు కేటాయించారు. పేదవారికి తక్కువ ధరలో బుక్కెడు బువ్వ పెట్టాలనుకోవడం సంతోషమే కానీ అదే సమయంలో ఆ పథకం అమలుకు అవసరమైన డబ్బులు ఆబ్కారీ ఆదాయం పెంచుకోవడం ద్వారా సమకూర్చుకోవాలనుకోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. పేదల కుటుంబాలను గుల్లచేసేటట్టు మద్యం పారించి ఆ డబ్బుతోనే వారికి సబ్సిడీ బియ్యం ఇవ్వడం ఏ విధంగా సంక్షేమ రాజ్యం అవుతుందో ఏలికలే చెప్పాలి.

ఒక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. దేశంలో ఎక్కడా జరగనంత మెరుగ్గా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన రాష్ట్రంలో అమలవుతుంది. లబ్ది దారులకు జాబ్ కార్డులు ఇచ్చి, పోస్టాఫీసు ద్వారా చెల్లింపులు జరిపి మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనాగా నిలిచింది. కొన్ని లక్షల మంది పేదలు ఈ పథకం వల్ల లబ్ది పొందారు.

ఇక బడ్జెట్లో అన్ని ప్రాంతాల మధ్య సమతులనం పాటించడం ప్రభుత్వ బాధ్యత. తెలంగాణా ప్రాంతంలో వచ్చిన రాబడిని ఆంధ్ర ప్రాంతానికి వినియోగిస్తున్నారని ముప్ఫై యేళ్ల కిందటే లలిత్ కమిటీ తేల్చి చెప్పినా, గత సంవత్సరం కూడా రాష్ట్ర శాసనసభలో ఆర్ధిక మంత్రి ఈనాటికీ అలాగే జరుగుతున్నదని ఒప్పుకోవడం ప్రాంతీయ భావాలు ఇంకా రెచ్చగొట్టే అంశమే.

ప్రపంచ బ్యాంకు – చంద్రబాబు – వైయెస్

భారత్ వంటి ఫెడరల్ దేశాల్లో రాష్ట్రాల ఆర్ధిక రంగాలు అనేక విషయాల్లో కేంద్ర నిర్ణయాలను బట్టి ఉంటాయి. 1991 తరువాత మన దేశంలో సరళీకరణ పేరిట జరిగే అనేక విధాన నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం పెద్దగా లేదు. అయితే రాష్ట్ర స్థాయిలో జరిగే అనేక విధాన నిర్ణయాల్లో ఎటువంటి దారిలో వెళ్లాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంది.

ఇక ప్రపంచ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వాన్ని బైపాస్ చేసి నేరుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనే వ్యవహారాలు నడపడం, రాష్ట్ర ఆర్ధిక రంగంలో నేరుగా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది ఆంధ్ర ప్రదేశ్ లోనే. ఒక విధంగా మన రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ఒక Lab Rat గా, ఒక Guinea Pig గా వాడుకుంది.

చంద్రబాబు నాయుడు హయాంలో మన రాష్ట్రం సంస్కరణల అమలులో దేశానికే ఒక దిశా నిర్దేశం చేసే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి అయితే అవకాశం దొరికినప్పుడల్లా చంద్ర బాబును ఆకాశానికెత్తేవాడు. విద్యుత్ రంగంలో బాబు మొదలు పెట్టిన ప్రైవేటీకరణ ఘోరంగా విఫలమయ్యాక ఇప్పుడు ఆ మాటెత్తే ధైర్యం చేయట్లేదెవరూ. నాయుడుగారు మరొకసారి గెలిచి ఉంటే ఈ పాటికి సింగరేణి, ఆర్టీసి, హైదరాబాద్ మంచి నీటి సరఫరా ప్రైవేటుపరం అయ్యేవి. విద్యుత్ బోర్డులో అర్ధాంతరంగా ఆగిన ప్రైవేటీకరణ పూర్తి అయ్యేది.

ఇంకొన్నేళ్ల దాకా మన రాజకీయాలన్నీ వ్యవసాయ రంగం చుట్టే తిరుగుతాయనడంలో సందేహం లేదు. అయితే పరిస్థితి రాత్రికి రాత్రే వ్యవసాయానికి అనుకూలంగా మారలేదు. ఉచిత విద్యుత్తు ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన చంద్రబాబు మెడలు వంచి ఇప్పుడు నేను కూడా ఉచిత విద్యుత్తు ఇస్తాననే వరకూ తేగలిగింది ప్రజల చైతన్యమే.

చంద్రబాబు హయాంలో ప్రపంచ బ్యాంకు నేతృత్వంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణల యజ్ఞం వికటించింది. ఇప్పటి ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకు వద్ద అప్పులు చేస్తూనే ఉన్నా, బ్యాంకు షరతుల విషయంలో కొంచెం జాగరూకతతో వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తున్నది.

నాయుడు ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్ధిక వ్యవహారాలు చాలా అధ్వాన్నంగా ఉండేవి. ఏ పూటకు ఆ పూట అప్పుచేస్తే కానీ బండి నడవని పరిస్థితి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేసేది రాష్ట్ర ప్రభుత్వం. 2000-01 సంవత్సరంలోనయితే కొత్తగా తీసుకున్న అప్పులో 71% పాత అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఆ అప్పుల భారం నేటికీ అలా పెరుగుతూనే ఉంది.

తాకట్టుపెట్టే వాడు పోయి అమ్మేవాడొచ్చాడు

ఏ హైదరాబాద్ చుట్టు పక్కలనయితే ఇంత అన్యాయంగా ప్రభుత్వం భూములు అమ్ముకుంటోందో అదే హైదరాబాద్ లో ఉన్న 800 గవర్నమెంటు స్కూళ్లలో 200 పైచిలుకు స్కూళ్ళు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయంటే మన అభివృద్ధి ఎంత డొల్లనో అర్థం అవుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త అప్పులు చేయడం కాస్త తగ్గినట్టే కనిపిస్తున్నా ఆర్ధిక వనరులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం మరొక ప్రమాదకర పద్ధతి ఎంచుకుంది. సాక్షాత్తూ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దళారీగా అవతారమెత్తింది. హుడా, హౌసింగ్ బోర్డ్, ఎ.పి.ఐ.ఐ.సి. వంటి సంస్థల వద్ద ఉన్న భూములను అందినకాడికి తెగనమ్మేస్తోంది. ప్రభుత్వశాఖలకు నెలవారీ టార్గెట్లు పెట్టి మరీ భూములు అమ్మడం ప్రపంచ చరిత్రలో ఇదివరకు ఎవరూ చేసి ఉండని పిచ్చిపని. ఎ.పి.ఐ.ఐ.సి అయితే తన వద్ద ఉన్న భూములే కాక యేటా కొన్ని వేల ఎకరాల భూములను రైతులనుంచి బలవంతంగా తక్కువ ధరలకు సేకరించి ప్రైవేటు కంపెనీలకు, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ఎక్కువ రేటుకు అమ్ముకుంటోంది.

తాజాగా భూముల వ్యాపారం చేయడానికి డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించి పబ్లిక్ గా తాను దళారీ వ్యాపారం చేయాలనుకుంటున్నానని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటోంది మన రాష్ట్ర ప్రభుత్వం.

ఏ హైదరాబాద్ చుట్టు పక్కలనయితే ఇంత అన్యాయంగా ప్రభుత్వం భూములు అమ్ముకుంటోందో అదే హైదరాబాద్ లో ఉన్న 800 గవర్నమెంటు స్కూళ్లలో 200 పైచిలుకు స్కూళ్ళు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయంటే మన అభివృద్ధి ఎంత డొల్లనో అర్థం అవుతుంది.

భవిష్యత్తేమిటి?

రాష్ట్ర భవిష్యత్తే ప్రశ్నార్ధకమైన రోజులివి. ఆర్థిక రంగ భవిష్యత్తు చెప్పడం కొంచెం కష్టమే. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు కొత్త జలవనరులు ఏర్పాటు చేయడం, రుణాలు ఇప్పించడం, మార్కెటింగ్ సౌకర్యం మెరుగుపరచడం వంటి చర్యలు చేపడితే వ్యవసాయరంగం మనల్ని పదికాలాల పాటు చల్లగా ఉంచుతుంది. జల యజ్ఞం పనుల్లో జరుగుతున్న భారీ అవినీతిని అరికడితే గానీ అటువంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడవు.

సాఫ్ట్ వేర్ రంగంపై అమెరికా మాంద్యం నీలి నీడలు కమ్ముకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మాంద్యం ప్రభావం ఎక్కువైతే మనకు ఇక్కడ రాష్ట్రంలో ఉద్యోగావకాశాలపై దెబ్బపడటమే కాక అమెరికా నుండి మనవాళ్ళు పంపుతున్న డబ్బు (Remittances) కూడా తగ్గుముఖం పడుతుంది. సాఫ్ట్ వేర్ రంగం నుండి వచ్చే డబ్బులు తగ్గితే రాష్ట్ర ఆర్థిక రంగంపై కూడా స్వల్ప ప్రభావం ఉండక తప్పదు. ఏదేమైనా ఈ రంగం నుండి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంతో ఖచ్చితంగా అంచనా వేయాల్సిన సమయం వచ్చింది. పరిశ్రమ వృద్ధి దెబ్బతినకుండా ఈ రంగం నుండి ఆదాయం వచ్చే మార్గాలు అన్వేషించాలి.

ఇప్పటికే స్పెక్యులేషన్ తో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన రియల్ ఎస్టేట్ ధరలు నేల వైపు దిగి రావడం మొదలైంది. కొన్నాళ్లైతే రియల్ ఎస్టేట్ భూముల ధరలు స్థిరీకరణ పొందుతాయి. ఈ రంగంలో విచ్చలవిడిగా చలామణి అవుతున్న నల్లడబ్బుకు కళ్లెం వేయాలి. అప్పుడే రాష్ట్ర ఖజానాకు ఏమైనా లాభం వస్తుంది. రిజిస్ట్రేషన్ విలువలను హేతుబద్ధం చేయడం ఇందులో తొలిమెట్టు కాగలదు.

కొత్త ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నిస్తే మనకు రాబడి మార్గాలు చాలానే ఉన్నాయి. అప్పులు, ఆస్తుల అమ్మకం చేయకుండా కూడా ఈ రాష్ట్రాన్ని చక్కగా నడపొచ్చు. ఇనుము, బాక్సైట్, సహజ వాయువు, చమురు, బొగ్గు వంటి సహజ వనరులను ప్రభుత్వమే వెలికితీసి అమ్ముకుంటే యేటా వేలకోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. (ఒక్క సింగరేణి బొగ్గు అమ్మకం ద్వారానే 350 కోట్ల ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి)

ఇక సేల్స్ ట్యాక్స్, ఇతర వాణిజ్య పన్నులను సరిగ్గా వసూలు చేయడం ద్వారా ఇంకొన్ని వేలకోట్ల రూపాయలు సంపాదించవచ్చు.

ఇవన్నీ జరగాలంటే చిత్తశుద్ధి ఉండాలి. మరి రేపు వచ్చే కథానాయకులకు అది ఉన్నదా? కాలమే జవాబు చెప్పాలి.

——————-

కొణతం దిలీప్ కొణతం దిలీప్ తెలుగు జాల పాఠకులకే కాక, పుస్తక పాఠకులకు కూడా పరిచితులే. 2006లో ఇంగ్లీషులో ప్రచురితమయిన కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్ ను ఒక దళారీ పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించారు. ఆ అనువాద పుస్తకం రెండేళ్లలో ఆరు ముద్రణలు పొందింది. అదొక రికార్డు.

దిలీప్ నల్గొండ జిల్లా మోత్కూరు పక్కనే ఉన్న ఆరెగూడెం గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. వీ.వీ కాలేజిలో బీయస్సీ, వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి యెంబీఏ (మార్కెటింగ్) చదివి, ప్రస్తుతం హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో నాన్-సాఫ్టువేరు ఉద్యోగం చేస్తున్నారు.

దిలీప్ మొదటి రచన “సహస్రాబ్దికి స్వాగతం” అనే సీరియల్ 2000 సంవత్సరంలో స్వాతి వారపత్రికలో ప్రచురితమయ్యింది. ఆ పత్రిక నిర్వహించిన పోటీలో 25,000 రూపాయల నగదు బహుమతి గెల్చుకుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపట్ల తన అభిప్రాయాలను తన బ్లాగు – hridayam.wordpress.com – లో వెల్లడిస్తూంటారు. వీక్షణం పత్రికలో కూడా వ్యాసాలు రాస్తూంటారు.

Posted in వ్యాసం | Tagged , , | 20 Comments