Author Archives: కొల్లూరి సోమశంకర్

About కొల్లూరి సోమశంకర్

కొల్లూరి సోమ శంకర్ కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో చదువుకున్నారు. బి.ఎ. పూర్తయ్యాక, హ్యుమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసారు. 2001 నుంచి కథలు రాస్తున్నారు. సొంతంగా రాయడమే కాకుండా, మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదిస్తుంటారు. ఇతర భాషల కథలను తెలుగులోకి తేవడంతో పాటు, ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన కొన్ని మంచి కథలు హిందీలోకి అనువదించారు. కొన్ని దిన పత్రికలలో శీర్షికలు నిర్వహించారు, వ్యాసాలు రాసారు. ఈయన కథలు అనువాదాలు అన్ని ప్రముఖ పత్రికలలోను, వెబ్‌జైన్లలోను ప్రచురితమయ్యాయి.

2006లో ”మనీప్లాంట్” అనే అనువాద కథా సంకలనాన్ని, 2004లో ”4X5” అనే కథా సంకలనాన్ని వెలువరించారు.

వివిధ ప్రచురణ సంస్థల కోసం ఇంగ్లీషు, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. Carlo Collodi రాసిన, ’ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలని, అమార్త్య సేన్ రచన ”ది ఇడియా ఆఫ్ జస్టిస్”ని, ఎన్.సి.పండా రాసిన ”యోగనిద్ర”ని, Tejguru Sirshree Parkhi రాసిన ” ది మాజిక్ ఆఫ్ అవేకెనింగ్”ని తెలుగులోకి అనువదించారు.

సోమ శంకర్ కథలు, అనువాదాల కోసం www.kollurisomasankar.wordpress.com అనే బ్లాగు చూడచ్చు.
వెబ్‌సైట్: http://www.teluguanuvaadam.com

మనిషిలోపలే…

రాకేష్ లోపల ఉన్న మనిషి కొద్దికొద్దిగా బయటపడుతుండేసరికి అతనిలోని విలేఖరి గద్దించాడు. తను తీసుకున్న రగ్గుని నేపాలీ చేతిలో పెడుతూ, “మీవాడిపై కప్పండి” అన్నాడు. – ఇది మీడియానా, మ్యాడియానా అని అడుగుతున్నాడు కథకుడీ కథలో Continue reading

Posted in కథ | Tagged | 1 Comment

విద్వేషం

పశ్తో రచయిత్రి పర్వీన్ జైద్ జదాహ్ మలాల్ గారి కథకు కొల్లూరి సోమశంకర్ గారి ఆంధ్రానువాదం. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on విద్వేషం

ఇన్‌ఫార్మర్

ఇన్‌ఫార్మర్లందరిని వెతికి పట్టుకుని చంపుతున్నారనే పుకార్లతో ఊరంతా అలజడిగా ఉంది.  గత యాభై ఏళ్ళలో లోయలో ఎప్పుడూ ఇటువంటి మరణాలు లేవు, కానీ ఇప్పుడిక్కడ రోజుకో నాలుగు లేదా అయిదు చావులు మామూలయిపోయింది. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on ఇన్‌ఫార్మర్

నువ్వాదరిని… నేనీదరిని…

–కొల్లూరి సోమ శంకర్ కథ గురించి: కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నేపథ్యంలో సాగే “నువ్వా దరిని…… నేనీ దరిని” అనే ఈ కథ రెండు విభిన్న సమూహాల, రెండు రాష్ట్రాల, రెండు విభిన్న మతాల మధ్య సమైక్యతని చాటుతుంది. ఉత్తర దక్షిణ భారతదేశాల సాంస్కృతిక వైవిధ్యతని స్పృశించే ఈ కథ తనకంటూ ఏ రాష్ట్రమూ … Continue reading

Posted in కథ | 2 Comments

చేతులారా..

జాతకాలను పోల్చి వైవాహిక జీవిత మనుగడను అంచనా వెయ్యగల జ్యోతిష్యుడు, తన కుమార్తె జాతకాన్ని ఎలా అంచనా వేసాడు? Continue reading

Posted in కథ | Tagged , | 10 Comments

దెయ్యమంటే భయమన్నది…

దయ్యాలెలా ఉంటాయి? రక్త పిశాచాలు మామూలు మనుషులలానే కనబడతాయట, కానీ మనుషుల రక్తం తాగుతాయట. మరి వాటికి దాహమేస్తే అవి మనలను పిలుస్తాయా లేక వాటికో శరీరం అవసరమై పిలుస్తాయా? దయ్యం మనలను పేరుపెట్టి పిలిచినప్పుడు వెళ్ళాలా వద్దా? కొల్లూరి సోమ శంకర్ గారి అనువాదకథ దెయ్యమంటే భయమన్నది… చదివి తెలుసుకోండి. Continue reading

Posted in కథ | Tagged | 10 Comments

నిశ్శబ్దానికి మరోవైపు

“చూడు బాబు, 1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు. వాటిల్లో నీకు కావాల్సినవి ఏవైనా ఉంటే తీసుకుని చదువుకో” – గ్రంథాలయాల ప్రస్తుత స్థితికి దర్పణం పట్టే రచన. నేటి తెలుగు సాహితీసమాజంలో మంచి అనువాదకులుగా పేరుగాంచిన కొల్లూరి సోమశంకర్ గారి కలం నుండి. Continue reading

Posted in కథ | Tagged | 14 Comments

బ్లాగరుల నుండి బ్లాగరులకో లేఖ!

బ్లాగు పేర్లతో కూర్చి బ్లాగరులకు ఒక బ్లాగరి రాసిన లేఖ! Continue reading

Posted in వ్యాసం | Tagged | 25 Comments

తెల్ల కాగితం

డి. ఇ. ఓ గారు బడికి ఇన్‌స్పెక్షన్ కి వస్తున్నారని తెలిసినా ఒక తెల్లకాగితం తెచ్చుకోలేని విద్యార్థికి ఒకేసారి రెండు వందల పేజీల తెల్ల కాగితాల ఆరు లాంగ్ నోట్ బుక్స్ సొంతమైన వైనం చదవండి. Continue reading

Posted in కథ | Tagged | 29 Comments

అనువాద కథలు – నా అనుభవాలు

కతల్జెప్పినంత తేలిగ్గాదు కథలు అనువదించడం. మూలంలోని అర్థం పోకుండా, భావం చెడకుండా, “నేను మా ఆవిడ చేత కొట్టబడ్డాను” లాంటి అవకతవక మాటలు రానీకుండా ఇంపుగా సొంపుగా అనువాదం చెయ్యడమంటే మాటలు కాదు.అనువాదపు కిటుకులు తెలిసిన రచయిత కొల్లూరి సోమశంకర్. 44 అనువాద కథలు రచించిన అనుభవంతో అనువాదాలు చెయ్యడంలోని సాధక బాధకాలను వివరిస్తున్నారు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 8 Comments