జూలై గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.
పాత గడులు
1. జూన్ గడి, సమాధానాలు
2. మే గడి, సమాధానాలు
3. ఏప్రిల్ గడి, సమాధానాలు
4. మార్చి గడి, సమాధానాలు
జూలై గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.
పాత గడులు
1. జూన్ గడి, సమాధానాలు
2. మే గడి, సమాధానాలు
3. ఏప్రిల్ గడి, సమాధానాలు
4. మార్చి గడి, సమాధానాలు
చరిత్ర – విజ్ఞానశాస్త్రం (అతిథి: కొడవటిగంటి రోహిణీప్రసాద్)
మృతజీవులు-1 (మృతజీవులు)
న్యూవేవ్ సినిమా (సినిమా)
నవతరంగం (సినిమా)
గడి (గడి)
పుస్తక సమీక్ష (వ్యాసం)
‘గ్యాస్’ సిలిండర్ (సరదా)
అంకెలతో పద్య సంకెలలు (వ్యాసం)
మరో వనాన్ని స్వప్నిస్తాను (కవిత)
గతంలో మేము ప్రకటించినట్లుగానే కొడవటిగంటి కుటుంబరావు మృతజీవులు నవలను మొదలు పెడుతున్నాం. నికొలాయ్ గొగోల్ రాసిన “The Dead Souls” నవలను కొ.కు. గారు మృతజీవులు అనే పేరుతో అనువదించారు. అది 1960లో విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అచ్చయినప్పటికీ ప్రస్తుతం ఎక్కడా దొరకడం లేదు. గతంలో ఈ నవల ఈమాటలో నాలుగు భాగాలు వచ్చి ఆగిపోయింది. ఈ అనువాదాన్ని పొద్దులో కొనసాగిస్తామని కోరిన వెంటనే అంగీకరించి అనువాద ప్రతిని అందజేసిన కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో కొనసాగించడానికి అంగీకరించిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
సినిమా గురించి రాస్తున్న వ్యాసాల్లో భాగంగా, వెంకట్ ఈసారి న్యూవేవ్ సినిమా గురించి వివరిస్తున్నారు.
అవధరించండి.
మృతజీవులు-1
న్యూవేవ్ సినిమా
చరిత్ర – విజ్ఞానశాస్త్రం (అతిథి) నవతరంగం (సినిమా) గడి (గడి) పుస్తక సమీక్ష (వ్యాసం) ’గ్యాస్’ సిలిండర్ (సరదా) అంకెలతో పద్య సంకెలలు (వ్యాసం) మరో వనాన్ని స్వప్నిస్తాను (కవిత)
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం (అతిథి: సురేశ్ కొలిచాల) తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం (అతిథి) బ్లాగరుల ప్రవర్తనా నియమావళి (వివిధ) సింధువు (కవిత) షరా మామూలే… (కథ) షడ్రుచుల సాహిత్యం (వ్యాసం) గడి (గడి) మారిషస్‍లో విశేషపూజ (కబుర్లు) బ్లాగ్బాధితుల సంఘం (సరదా) డా.హాస్యానందం నవ్వులు (సరదా)
కొడవటిగంటి కుటుంబరావు |
[ప్రఖ్యాత రష్యన్ రచయత గొగోల్ (Nikolai Gogol)రాసిన డెడ్ సోల్స్ (Dead Souls) అనే నవలను మా నాన్నగారు (కొడవటిగంటి కుటుంబరావు) “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. దీనికి ఆయన పెట్టిన పేరు “మృతజీవాలు”. జీవాలు అంటే జంతువులు అనే అర్థాన్ని సూచిస్తాయనో ఏమో ప్రచురణకర్తలు “మృతజీవులు”గా మార్చారు. ఇది 1960లో విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అచ్చయింది. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్ ప్రచురణలూ, సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్ కోనన్ డాయల్ షెర్లాక్ హోమ్స్ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. – డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్]
………
![]() |
డెడ్ సోల్స్ పుస్తక ముఖచిత్రం |
ఒక సామాన్యపు బస్తీలోని హోటల్ గేట్ వద్ద అందంగా కనిపించే కమాను బండి, సాధారణంగా బ్రహ్మచారులూ, అర్థవేతనం పుచ్చుకునే అధికారులూ, చిల్లర సైనికోద్యోగులూ, సుమారు నూరుమంది కమత గాళ్ళు గల భూస్వాములూ — ఒక్క ముక్కలో చెప్పాలంటే “ఒక మాదిరి పెద్ద మనుషులు” ఎక్కి తిరిగేలాటిది, వచ్చి నిలబడింది. ఆ బండిలో ఒక పెద్దమనిషి కూచున్నాడు. అంత అందగాడూ కాదు, అంత అనాకారీ కాదు; లావుపాటివాడూ కాదు, బక్కపలచనివాడూ కాదు; ఆ మనిషి ముసలివాడనటానికీ లేదు, బొత్తిగా యువకుడనటానికీ లేదు.
ఆయన రాక ఆ బస్తీలో ఎలాటి సంచలనమూ కలిగించలేదు. అందువల్ల ఏమీ జరగలేదు కూడానూ. హోటలుకు ఎదురుగా ఉండే సారా అంగడి వాకిట నిలబడి ఉన్న ఇద్దరు రష్యన్ రైతులు కొద్దిగా వ్యాఖ్యానించిన మాట నిజమేగాని, ఆ వ్యాఖ్యానం బండిని గురించి తప్ప అందులో ఉన్న మనిషిని గురించి కాదు. “ఆర్‌రె, అదేం చక్రంరోయ్! నువ్వేమంటావ్? ఆ చక్రం అవసరమైతే మాస్కో దాకా పోతుందంటావా, పోలేదంటావా?” అని ఒకడు రెండోవాణ్ణి అడిగాడు. “పోతుంది” అన్నాడు రెండో వాడు. “అట్లా ఐతే కజాన్ దాకా పోలేదని నా ఉద్దేశ్యం” “కజాన్ దాకా పోలేకేం!” అన్నాడు రెండో వాడు. ఆ చర్చ అంతటితో ముగిసింది.
అదీగాక బండీ హోటలును సమీపించే సమయానికి ఒక యువకుడు ఆ బండిని సమీపించాడు. అతను చాలా పొట్టిగా, బిగుతుగా ఉన్న తెల్ల కాన్వాస్ లాగూ, కింద వేళ్ళాడే అంచులు, చాలా “ఫాషన్”గా కత్తిరించిన కోటూ, ఎదురు రొమ్మున షర్టుకు కంచు పిస్తోలు అలంకరించిన పిన్నూ ధరించి ఉన్నాడు. ఆ యువకుడు వెనక్కు తిరిగి బండీని తేరిపారజూసి, తన టోపీ గాలికి ఎగిరిపోకుండా చేత్తో పట్టుకుని తన దారిన తాను వెళ్ళాడు.
బండీ ఆవరణలోకి రాగానే హోటలు నౌకరొకడు పెద్దమనిషి వద్దకి వచ్చాడు – ఫలహార శాలల్లో ఈ నౌకర్లనే వెయిటర్లంటారు. వాడు ఎంత చురుకుగానూ, వేగంగానూ కదిలాడంటే వాడి మొహం ఆనవాలు తెలుసుకోవటం అసాధ్యమయ్యింది. వాడు చాలా పొడుగ్గా ఉండటమే గాక, నడుంపట్టీ మెడమీదికి వస్తున్న పొడుగుపాటి కోటు ధరించి, చేత్తో ఒక చేతిగుడ్డ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి తన జులపాలను విదిలించి, చప్పున ఆ పెద్దమనిషిని కాస్తా వెంటబెట్టుకుని పై అంతస్తుకు వెళ్ళి, ఒక పొడుగుపాటి చెక్క కూర్పు వరండా ఈ చివరనుండి ఆ చివరకు నడిపించి, ఈశ్వరానుగ్రహం వల్ల ఆ అతిథికి లభ్యమయినటువంటి గదిలో ప్రవేశపెట్టాడు.
అది మామూలు గదే, ఆ మాటకు వస్తే ఆ హోటలు కూడా మామూలు హోటలే – అంటే మామూలు బస్తీలలో ఉండే హోటళ్ళలాటిది; వాటిలో రోజుకు రెండు రూబుళ్ళ కిరాయి తీసుకుని ఒకగది ఇస్తారు; ప్రతి మూల నుండి నల్లటి బొద్దింకలు తొంగి చూస్తూంటాయి; అవతలి గదిలోకి వెళ్ళే ద్వారం ఒకటి ఉంటుంది; దానికి సొరుగుల పెట్టె అడ్డం పెట్టి ఉంటుంది; అవతలి గదిలో మాటా పలుకూ లేని ముభావం మనిషి ఒకడుంటాడు; అయితే ఆ మనిషికి కొత్తగా వచ్చిన వాడి ఆచోకీ అంతా కావాలి. ఈ హోటలు బయటి స్వరూపం లోపలి స్వరూపానికి అనుగుణంగానే ఉన్నది. అది నిడుపైన రెండంతస్తుల భవంతి కింది అంతస్తు గిలాబు* చెయ్యక ఎర్ర ఇటుకలు కనిపించేలాగా ఉంచారు. అది ఎండకు ఎండి, వానకు తడిసి, మురికి పట్టి మరింత నల్లగా అయింది. పై భాగానికి విధిగా పసుపు పచ్చ రంగు వేశారు.
భవనం అట్టడుగు మాళిగలో దుకాణాలున్నాయి. వాటిలో గుర్రాల పట్టెడలూ, మోకులూ, రొట్టెల చుట్టలూ ఉన్నాయి. ఈ దుకాణాల్లో ఒక దాని మూల, అంటే కిటికీ వద్ద, ఒక మనిషి నిలబడి వేడి పానీయాలు, మసాలా ఘాటువి అమ్ముతున్నారు. వాటి పక్కన ఎర్రని రాగితో చేసిన “సమవార్” (వేడి పానీయాలని కాచే బాయిలర్ లాటిది) ఉన్నది. వాడి మొహం కూడా వాడి సమవార్ లాగే ఎర్రగా ఉండటం చేత దూరంనుంచి చూస్తే రెండు సమవార్లు ఉన్నాయనిపించవలిసిందే – ఒక దానికి జీడినలుపు రంగు గడ్డం ఉండబట్టీ సరిపోయిందిగాని.
ఆగంతకుడు తన గదిని చూసుకుంటుండేంతలో అతని సామాన్లు పైకి వచ్చాయి. మొదటిది మధ్యకు తెరుచుకునే తోలుపెట్టె, తెల్ల తోలుతో చేసినది, అనేక ప్రయాణాలు చేసి మాసిపోయినది. తోలు పెట్టెను బండివాడు సేలిఫాన్ తెచ్చాడు. నౌకరు పెట్రుష్క సాయం పట్టాడు. బండివాడు చిన్న సైజు మనిషి. నౌకరుకు ముఫ్పై ఏళ్ళుంటాయి. వాడి మొహం మటమటలాడుతున్నది. వాడిపెదవులూ, ముక్కూ లావుగా ఉన్నాయి. వాడు వదులైన పొడుగుకోటు వేసుక్కున్నాడు. అది చాలా మాసిపోయి ఉన్నది, ఒకప్పుడు వాడి యజమానిదిలాగుంది. తోలుపెట్టె చేరినాక వాళ్ళు ఒక కొయ్య పెట్టే, బూట్లలో ఉంచే రెండు దిమ్మలూ, నీలం కాగితంలో చుట్టి ఒక కాల్చిన కోడీ తెచ్చారు.
ఇవన్నీ వచ్చి చేరాకా, బండివాడు సేలిఫాన్ తన గుర్రాల సంగతి చూడటానికి వెళ్ళాడు. నౌకరు పెట్రుష్క ఒక నల్లని చెక్కలగూడు లాటి అరలో తన వసతి ఏర్పాటు చేసుకున్నాడు. అందులో వాడు అప్పుడే తన పైకోటూ, తన వస్తువుల మూటా, వాటితో బాటు తన ప్రత్యేక మైన వాసనా పెట్టేశాడు. ఈ అరలోనే తన ముక్కాలి పడకను గోడకు చేర్చివేసి, దానిపైన ఒక చిన్న పరుపులాటిది పరిచాడు. అది పలుచగా, హోటలు యజమానివద్ద ముష్టెత్తిన రొట్టెలాగా, దాదాపు ఆ రొట్టె అంత జిడ్డు ఓడుతూ ఉన్నది. తన వస్తువులు సర్దే పని తన నౌకర్లకు వదిలిపెట్టి పెద్దమనిషి కూడలి గదికి వెళ్ళాడు.
ఈ కూడలి గదులు ఎలా ఉండేదీ ప్రతి ప్రయాణీకునికీ తెలుసు. రంగుకొట్టిన గోడల ఎగువభాగం పొగగొట్టం తాలూకు పొగతో మసిబారీ, కింది భాగం ప్రయాణీకుల వీపుల రాపిడికి నునుపెక్కీ ఉంటాయి. ఈ ప్రయాణీకులలో ముఖ్యంగా చెప్పుకోదగిన వాళ్ళు సంతరోజులలో ఆరేసి, ఏడేసి మంది కలిసి ఒక్కొక్క జట్టుగా వచ్చే వర్తకులు. వాళ్ళు విధిగా హోటలుకు వచ్చి తాము తాగే రెండేసి కప్పుల టీ తాగి తీరుతారు. పై కప్పు మాసిపోయి మట్టి కొట్టుకుని ఉంటుంది. దానికి షాండిలియర్ ఒకటి వేళ్ళాడుతూంటుంది. దానినిండా గాజు లస్టరు ఉండి, వెయిటరు పళ్ళెంనిండా పట్టినన్ని టీ కప్పులు గలగల లాడుతాయి.
గోడలనిండా సహజంగా తైలవర్ణ చిత్రాలుంటాయి. ఇవన్నీ ఎక్కడబడితే అక్కడే కనిపిస్తాయి. అయితే ఇక్కడి విశేషమేమంటే ఇక్కడ గల ఒక చిత్తరువులో ఒక సుందరికి ఎంత పెద్ద రొమ్ములున్నాయంటే అలాటివి పాఠకుడి కంట ఎన్నడూ పడి ఉండక పోవచ్చు. రష్యాలోకి దిగుమతి అయే చరిత్ర ప్రసిద్ధమైన చిత్తరువులను ఎవరు తెస్తారో, ఎప్పుడు తెస్తారో, ఎక్కడ తెస్తారో తెలియరాదు. కొన్నింటిని మటుకు అప్పుడప్పుడూ కళాప్రియులైన మా గొప్పవాళ్ళు తమ భృత్యుల సలహాపై ఇటలీలో కొని తీసుకురావటం కద్దు.
పెద్దమనిషి తన టోపీతీసి, తన మెడచుట్టూ ఉన్న పంచరంగుల శాలువా విప్పాడు. పెళ్ళయినవాళ్ళకు వారి భార్యలు అలాటి శాలువలు ఇవ్వటమేగాక వాటిని ఎట్లా కప్పుకోవాలో కూడా ఒకటికి పదిసార్లు చెబుతారు. బ్రహ్మచార్లకు ఈ సహాయం ఎవరు చేస్తారో నేను సరిగా చెప్పలేను, ఈశ్వరుడికే తెలియాలి.
అతను శాలువా విప్పుతూనే భోజనానికి ఆర్డరిచ్చాడు. భోజనశాలల్లో మామూలుగా వడ్డించే పదార్థాలు తెచ్చి వడ్డించారు – ఎన్నో వారాలు ముందే చేసి ఉంచిన పిండి రొట్టెముక్కలు వేసి కాబేజీ సూపూ, బటానీలతో మెదడు, కాబేజీలతో సాసేజీలు, కోడివేపు, ఉప్పువేసిన దోస ముక్కలూ, సర్వకాల సర్వావస్థలలోనూ ప్రత్యక్షమయే తీపిఉండలూ, ఇవన్నీ కొన్ని వేడిగానూ, కొన్ని చల్లగానూ తెచ్చి తనముందు పెడుతున్న వెయిటరును పెద్దమనిషి అర్థం లేని అడ్డమైన ప్రశ్నలు వేసి పనికిమాలిన విషయాలెన్నో తెలుసుకున్నాడు – ఈ హోటలు వెనుక ఎవరిది, ఇప్పుడు దీని కెవరు, ఇది లాభసాటిగా ఉంటున్నదా, దీని యజమాని దొంగముండా కొడుకేనా? దానికి జవాబుగా వెయిటరు, “భలే మోసగాడు, బాబూ!” అన్నాడు. నాగరికమైన యూరప్ లోనూ, రష్యాలోనూ కూడా ఈ కాలంలో అనేకమంది ఘరానా మనుషులు హోటళ్ళలో భోజనం చేస్తున్నంతసేపూ వెయిటర్లతో బాతాఖానీ కొట్టకుండానూ, మధ్య మధ్య వాళ్ళపైన హాస్యాలు విసరకుండానూ ఉండలేరు.
ప్రయాణీకుడు అడిగిన ప్రశ్నలన్నీ అర్థం లేనివనటానికి వీల్లేదు. అక్కడ గవర్నరు ఎవరో, న్యాయస్థానాధ్యక్షుడెవరో, పబ్లిక్ ప్రాసిక్యూటరెవరో, ప్రధాన స్థానికాధికారులెవరో, ఒక్కరు కూడా బీరుపోకుండా, వివరంగా అడిగి తెలుసుకున్నాడు. అంతకంటే కూడా ఆసక్తిగా ఆ ప్రాంతాల ఉండే ప్రముఖ వ్యక్తులందరిని గురించీ వివరాలు తెలుసుకున్నాడు: ఒక్కొకరికిందా ఎంతమంది కమతం చేస్తున్నారు, వాళ్ళ నివాసాలు బస్తీకి ఎంత దూరంలో ఉన్నాయి, ఎన్నిరోజులకొకసారి బస్తీకి వస్తుంటారు, ఆ ప్రాంతాలు ఏపాటి ఆరోగ్యవంతంగా ఉంటాయో, ఎక్కడైనా అంటువ్యాధులూ, జ్వరాలూ, మహమ్మారీ వగైరా ఉన్నాయా ఇత్యాది వివరాలు మహాశ్రద్ధగా విచారించాడు.
ఇవన్నీ ఊసుపోకకు అడిగే పశ్నలు కావు మరి. మనిషి వాలకంలో కొంత హుందా, పెద్దమనిషి తరహా ఉన్నాయి. ఆయన ముక్కు చీదుకుంటే బ్రహ్మాండమైన చప్పుడయింది. చీదినప్పుడల్లా ఆయన బాకా మోగినంత చప్పుడు చేశాడు, ఎలా చేశాడో మరి. ఈ చప్పుడు వినేసరికి వెయిటరుకు ఆ పెద్దమనిషి మీద గౌరవం లావయింది, అది చెవిని పడ్డప్పుడల్లా వాడు జులపాలు ఆడించి, మరింత నిటారుగా నిలబడి తలవంచి, ఇంకేమి సెలవు అని అడిగాడు. పెద్దమనిషి భోజనం పూర్తి చేసి, ఒక కప్పు కాఫీ తాగి, సోఫామీద చేరి, బాలీసుకు చేరగిలబడ్డాడు. ఇప్పుడాయన ఆవలిస్తూ వెయిటరుతో తనను గదికి తీసుకుపొమ్మని, అక్కడ రెండు గంటల పాటు పడుకుని నిద్రపోయాడు.
విశ్రాంతి అయినాక వెయిటరు కోరికపై ఆయన ఒక కాగితంపై తన ఉద్యోగమూ, హోదా, పేరూ, ఇంటిపేరు రాశాడు. ఈ వివరాలు కాలక్రమేణా పోలీసువారికి అందుతాయి. వెయిటరు కిందికి దిగి వెళ్ళిపోతూ ఈ విధంగా చదువుకున్నాడు:
“పావెల్ ఇవానవిచ్ చిచీకన్
చర్చి కౌన్సిల్ సభ్యుడు మరియు భూస్వామి
ప్రయాణం సొంత పని మీద”
(ఇంకా ఉంది)
*గిలాబు/గిలాబా = గచ్చు/సిమెంటు పూత వేయడం (plastering)
అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి?
నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. వీరి ఆలోచనలకు సరిగ్గా సరిపోయేలా ఒకాయన సినిమా పత్రికనొకదాన్ని నడిపేవాడు. ప్రపంచంలోని మంచి సినిమాలను ఫ్రాన్సు ప్రజల దగ్గరకు తేవాలని నిర్ణయించుకుని తన పత్రిక ద్వారా సినిమా సమీక్షలు, విశ్లేషణలు చేస్తుండేవాడాయన. మన దేశంలో మంచి సినిమాలెలాగూలేవు కనీసం ప్రపంచంలోని మంచి సినిమాల గురించైనా తెలుసుకున్నట్టవుతుందనే ఉద్దేశంతో ఈ పత్రికాఫీసుకి వచ్చి ఎలాగో వుద్యోగాలు సంపాదించారా కుర్రాళ్ళు. ఈ సినిమా పిచ్చోళ్ళ పనేంటంటే మంచి సినిమాలు చూడడం, వాటి గురించి విశ్లేషిస్తూ వ్యాసాలు రాయడం. ఇటలీ లోని neo-realism సినిమాలు, అమెరికాకు చెందిన Hitchcock, Howard Hawks లాంటి దర్శకుల చిత్రాలను చూసి విశ్లేషించే వారు ఈ కుర్రాళ్ళంతా! వీరితో పాటే రాస్తూ వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వుండేవాడా పత్రికా యజమాని.
అవేమో ఇప్పటి రోజులు కావాయే! DVDలు, CDలు, వీడియో టేపులు దొరకని రోజులవి. మరి అమెరికా, ఇటలీ లాంటి దేశాల సినిమాలు ఫ్రాన్సుకి తెప్పించుకుని చూడాలంటే అషామాషీ విషయం కాదు. ‘మరి వీరికి ప్రపంచపు సినిమాలన్నీ చూసే అవకాశం ఎలా కలిగిందబ్బా’, అనుకుంటున్నారా? ఆ కుర్రాళ్ళ అదృష్టవశాత్తూ వారికో పెద్ద మనిషితో పరిచయం ఏర్పడింది. వీళ్ళకే సినిమా పిచ్చనుకుంటే , వీళ్ళ పిచ్చికి వంద రెట్లు ఎక్కువ ఈ పెద్దాయన సినిమా పిచ్చి. ప్రపంచంలో ఎక్కడెక్కడో విడుదలయ్యే సినిమాలను తెచ్చి ఒక film club ఏర్పాటు చేసి అక్కడ ప్రదర్శించేవాడు. వీరందరూ రాత్రి ఇక్కడ సినిమాలు చూడడం, పగలు పత్రికాఫీసులో సమీక్షలు, విశ్లేషణలు రాయడంతో తమ సినీదాహాన్ని తీర్చుకునే వారు. ఇలా కొన్నాళ్ళు సాగాక ఒక రోజు “సినిమాల గురించి ఇంత తెలుసుకున్నాం కదా! మనమే ఎందుకు మంచి సినిమాలు తీయకూడదు” అని ఆలోచన కలిగింది వాళ్ళలో. వీరి ఆలోచనలను ఆ film club నడిపే అతను, సినిమా పత్రిక నడిపే అతను బాగా ప్రోత్సహించారు.
ఆ కుర్రాళ్ళందరూ ఒకరితో ఒకరు సహకరించుకుంటూ తమ సినిమాలు తీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల ఫలితంగా ఏడేళ్ళలో షుమారు 32 సినిమాలు తీసారీ కుర్రాళ్ళు. ఈ సినిమాల ద్వారా ఫ్రాన్సు దేశ సినీ పరిశ్రమలోనే కాక ప్రపంచ దేశాలన్నింటిలోనూ సినిమా తీసే విధానాలకు కొత్త మార్గాలు కల్పించి మార్గ దర్శకులయ్యారు. అందుకే వీరిని నవతరంగపు దర్శకులన్నారు. వీరు తీసిన సినిమాలను నవతరంగపు సినిమాలన్నారు.
![]() |
ట్రఫౌట్ సినిమా “జూల్స్ ఎట్ జిమ్” లో ఒక దృశ్యం (వికీపీడియా నుండి సేకరణ) |
ఎవ్వరీ కుర్రాళ్ళు? వీరిని ప్రోత్సహించిన ఆ పత్రిక యజమాని ఎవ్వరు? వీరికి సినీ జ్ఞానోదయం కలుగచేసిన ఆ film club వ్యవస్థాపకుడెవ్వరు? మొన్న మొన్నటి వరకూ నా సైటు http://24fps.co.in లోనూ, ఈ మధ్యనే ఇక్కడ పొద్దులోనూ నవతరంగమనీ, new wave అనీ నేను రాస్తూనే వున్నప్పటికీ అసలేంటీ నవతరంగం? ప్రస్తుత తెలుగు సినిమా వున్న పరిస్థితుల్లో ఈ ఉద్యమ ప్రస్తావన అవసరమా? మనకీ ఒక new wave వస్తుందా? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం.
సినిమా అంటే కేవలం ఒక వినోద సాధనంగా భావింపబడుతున్న రోజుల్లో ఒక వ్యక్తి తన జీవితాన్ని సినిమాకి అంకితం చేసి సినిమా కూడా ఒక కళే అని అందరినీ ఒప్పించే స్థాయికి తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. సినిమాలు తీయకుండా కేవలం సినిమాలు చూస్తూ, వాటిని విమర్శిస్తూ మరియు విశ్లేషిస్తూ ప్రజల్లో సినిమా అంటే ఒక గౌరవ భావాన్ని కలగ చేసిన వ్యక్తి Andre Bazin.
సినిమాపై తనకున్న విపరీత ప్రేమతో సినిమాలే జీవితంగా గడిపి తన ఆలోచనలను అందరికీ తెలిపే ఉద్దేశంతో Jacques Doniol-Valcroze మరియు Lo Duca లతో కలిసి Cahiers du Cinema అనే సినిమా పత్రిక ఏర్పాటు చేసి ఆ పత్రిక ద్వారా మంచి సినిమాల గురించి ప్రజలకు తెలియచేయడమే కాకుండా మంచి సినిమాలు తీయాలనుకున్న యువకులకు తన పత్రిక ఆఫీసునే సినిమా పాఠశాలగా మార్చివేసారు.
Jean Renoir, Howard Hawks, Hitchcock లాంటి దర్శకుల శైలిని ప్రపంచానికి తెలియచేసి, సినిమా దర్శకుడు కూడా ఒక పుస్తక రచయితతో సమానంగా తన భావాలను వెండితెరపై చిత్రరూపంలో లిఖించవచ్చని తన auteur theory లో సిధ్ధాంతపరిచి, సినిమాలో జీవమున్న నటుల ద్వారా మాత్రమే కాకుండా, నిర్జీవమైన వస్తువుల ఉపయోగం ద్వారా కూడా ప్రేక్షకులలో భావోద్వేగాన్ని కలుగచేయొచ్చని తన mise-en-scene ఆలోచన ద్వారా తెలియపరిచాడు.
ఈయనే లేకపోతే ఫ్రాన్సులో అసలు new wave ఉద్యమం వచ్చివుండేదా అని అనుమానం కలుగుతుంది. కొత్త తరహా సినిమాలు తీయాలన్న నవ యువ దర్శకులకు మార్గదర్శిగా నిలిచి, వారిని అనుక్షణం ప్రోత్సహిస్తూ new wave వుద్యమానికి పితామహునిగా నిల్చాడు Andre Bazin. కానీ మొదటి new wave సినిమా అయిన 400 blows సినిమా విడుదలకు ముందే, కేవలం 40 ఏళ్ళ వయసులో తను కన్న కలలు నిజమవడం కళ్ళారా చూడకుండానే మరణించాడు. Truffaut తీసిన 400 blows అనే సినిమా ఈయనకి అంకితం చేసారంటే new wave ఉద్యమంలో Andre bazin పాత్రను మనం అర్థం చేసుకోవచ్చు.
![]() |
బాజిన్ (వికీపీడియా నుండి సేకరణ) |
ఈయన తన వ్యాసాల ద్వారా సినిమా ప్రపంచానికి చేసిన సేవ అత్యున్నతమైనది. ప్రపంచ సినిమా చరిత్రలో Andre Bazin పేరును సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఈయన రాసిన విశ్లేషణా వ్యాసాలు ఎంత గొప్పవో చెప్పాలంటే ఫ్రెంచ్ సినిమా దర్శకుడైన Jean Renoir మాటలనొకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. Andre Bazin రాసిన సినీ వ్యాసమాలిక అయిన what is cinema అనే పుస్తకపు ముందుమాటలో Jean Renoir ఈ విధంగా అంటారు; “the essays of Bazin will survive even if the cinema does not.”
సినిమా తీయాలనుకునే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క సారయినా ఈయన రాసిన What is cinema అనే పుస్తకం చదివితే సినిమాకున్న గొప్పదనమేంటో తెలుస్తుంది. సినిమాలు తీసేవారే కాకుండా చూసే వాళ్ళు కూడా తప్పక చదవలసిన పుస్తకం What is cinema.
ప్రపంచంలో అతిపెద్ద సినిమా అభిమాని ఎవరంటే నిస్సందేహంగా Henri Langlois అని చెప్పొచ్చు. ఫ్రాన్సుదేశంలో 1914 లో జన్మించిన ఈయన చిన్ననాటినుండే సినిమాలపై విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించాడు. సినిమాలపై వున్న విపరీతమైన అభిమానంతో 22 ఏళ్ళ వయసులో స్నేహితులయిన Jean Mitry మరియు Georges Franju లతో కలిసి ప్యారిస్ లో Cinémathèque Française అనే సినిమా క్లబ్ మరియు మ్యూజియం ఏర్పాటు చేసి ప్రపంచంలోని అరుదైన సినిమాలను ప్రదర్శించడమే కాకుండా రెండో ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీల బారిన పడకుండా ఎన్నో అరుదైన సినిమాలను సంరక్షించి ప్రపంచ సినీ రంగానికి అరుదైన సేవ చేసాడు.
మొదట్లో ముగ్గురు వ్యక్తుల శ్రమ ఫలితంగా మొదలయిన ఈ సినిమా క్లబ్ రానురానూ ప్రపంచంలోని అత్యున్నత సినీ మ్యూజియం మరియు సినిమా క్లబ్ గా ఎంతో ఎత్తుకు ఎదిగింది. 1930లలో మొదలు పెట్టినప్పుడు కేవలం 10 సినిమాలతో మొదలయ్యి 1970 ల నాటికి 60000 ల సినిమాలను ఈ సినిమాలయం సేకరించి సంరక్షించిందంటే సామాన్యమైన విషయం కాదు. వీరి శ్రమను గుర్తించి ఫ్రెంచ్ ప్రభుత్వం నిధులు అందచేసి Cinémathèque Françaiseను అభివృధ్ధి చేయడంలో తోడ్పడింది.
సినీ జగత్తుకు Henri Langlois చేసిన సేవ ఎట్టిదంటే, 1968లో ఈయనను Cinémathèque Française అధ్యక్షునిగా దింపివేయడమే కాకుండా అప్పటి వరకూ అందుతున్న నిధులను కూడా ఆపేయమని అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి Andre Malraux ఉత్తర్వు జారీ చేసినప్పుడు Henri Langlois కు సినీ జగత్తులోని ఎంతో మంది అండగా నిలవడమే కాకుండా, ఫ్రాన్సులో ప్రతి ఏడు జరిగే Cannes సినిమా ఉత్సవాన్ని కూడా జరగకుండా ఆపేశారు. సినిమా తీసే ప్రక్రియతో ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికీ సినిమా ప్రదర్శన మరియు పరిరక్షణలకై ఈయన చేసిన సేవలకు గుర్తుగా ఆస్కారు అవార్డుకూడా ప్రదానం చేసారు.
మొదట్లో చిన్న సినిమా క్లబ్ గా మొదలయిన Cinémathèque Française రెండో ప్రపంచ యుధ్ధం తర్వాత సినీ అభిమానులకు మంచి సినిమాలు చూడడానికి, వాటిని గురించి చర్చించుకోవడానికి ఒక వేదికగా నిల్చింది. ఫ్రాన్సులోని సినిమా అభిమానులకు ప్రపంచ సినిమాపై ఆసక్తి కలిగించి వారిలో కొత్త ఆలోచనలు కలిగించి తద్వారా ఆ అభిమానులు సినీ విమర్శకులుగా మారడానికి, ఆ సినీ విమర్శకులు new wave దర్శకులు గా మారడానికి, Andre Bazin స్థాపించిన Cahiers du Cinema పాత్ర ఎంతుందో Henri Langlois స్థాపించిన Cinémathèque Française అంతే వుంది. అందుకే ఈ నవతరంగపు దర్శకులను children of cinematheque అని అనేవారంట.
1960ల నాటికి యూరోపు, మరియు అమెరికాలలో టెక్నాలజీ బాగా ఊపందుకుంది. అందులో భాగంగానే అప్పటివరకూ రాజ్యమేలుతున్న భారీ కెమెరాలు పోయి భుజంపై మోసుకెళ్ళగలిగేలా తక్కువ బరువు కలిగిన కెమెరాలు వాడుకలోకి వచ్చాయి. ఈ కెమెరాలను ఉపయోగించడం ద్వారా క్రేన్, డాలీ లాంటి పరికరాల అవసరం లేకుండానే కెమెరాను తమ ఇష్టానుసారం ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎటువైపు కావాలంటే అటువైపుకి తీసుకెళ్ళి సినిమాలను తీయడానికి అవకాశం కలిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే new wave దర్శకులు కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా zoom lens ద్వారా పాత్రలను ప్రేక్షకులకు దగ్గరగానూ, అవసరమైనప్పుడు దూరంగానూ చూపించడానికి అవకాశం కలిగింది. అప్పుడప్పుడే లబ్దిలోకి వచ్చిన portable sound recording యంత్రాలనుపయోగించి డైలాగులను అప్పటికప్పుడు రికార్డ్ చేయగలిగే అవకాశం కలగడంతో అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న డబ్బింగ్ ప్రక్రియ అవసరం లేకుండా చేసుకున్నారు. అలాగే స్టూడియోల్లో ఉపయోగించే భారీ లైట్ల అవసరం లేకుండా కొత్తరకమైన ఫిల్మ్ stock ఉపయోగించి సహజమైన వెలుతురులోనే సినిమాలు చిత్రీకరించి మంచి ఫలితాలు పొందగలిగారు. ఈ విధంగా టెక్నాలజీలో వచ్చిన విప్లవాన్ని తమకనుకూలంగా మలచుకున్నారు new wave దర్శకులు.
ఈ విధంగా కెమెరా, లైటింగ్, సౌండ్ విభాగాల్లో నవీన పోకడలు సృష్టించుకోవడంతో పాటు ఎడిటింగ్ విభాగంలో jump cut లాంటి అత్యంత నూతన ప్రక్రియలు తమ సినిమాల ద్వారా ఆవిష్కరించారు. ఇవన్నీ టెక్నాలజీ ద్వారా సులభతరమైన ప్రక్రియలు.
New-wave సినిమా దర్శకులలో ఒకరయిన Alain Resnais సినిమాలు తీసే విధానం ఎందుకు మారాలి అని చెప్తూ ఈ విధంగా అంటాడు. “A classic film cannot translate the real rhythm of modern life. Modern life is fragmented, everyone feels that. Painting, as well as literature, bears witness to it. So why should the cinema not do so as well, instead of clinging to the traditional linear narrative”. ఆయనన్నట్టుగానే రెండు ప్రపంచ యుధ్ధాల్లో నలిగిపోయిన జీవితాలు క్లాసికల్ సినిమాల్లో చూపించడం జరిగేది కాదు.
రెండు ప్రపంచ యుధ్ధాల్లో అర్థం లేకుండా కోల్పోయిన లక్షల మంది ప్రాణాలు, ఛిన్నాభిన్నమైన జీవితాలు యూరోపు దేశ ప్రజల మనస్తత్వాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చాయి. దేశాధిపత్యం కోసం జరిగిన యుధ్ధాలు ప్రజల బతుకుల్లో మిగిల్చేది కడగండ్లు మాత్రమే అని ప్రజలు తెలుసుకున్నారు. వైయక్తికతకు ప్రాముఖ్యత పెరిగింది. అంతా మన ఖర్మ అని భావించకుండా ఎవరి బాధలు, అనందాలకు వారే కారణమని భావించారు. ఈ భావనలో తప్పు – ఒప్పు తేడాలను పక్కనపెట్టారు. వ్యక్తి సుఖమే ముఖ్యం. ఆ సుఖం కోసం ఏమైనా చేయొచ్చు అని నిర్ణయించుకున్న ప్రజలు సాటి మనుషులతో సంబంధం లేకుండా self కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలయ్యింది. దాంతో ప్రజల్లో సంబంధ బాంధవ్యాలు లోపించాయి. ఎవరి బతుకు వాళ్ళదయింది. జీవితం గజిబిజిగా మారిపోయింది. ఆ గజిబిజి గందరగోళాన్ని సినిమాగా రూపొందించాలంటే తమ సినిమాలు జీవితంలాగానే చైతన్యవంతంగా వుండాలని new wave దర్శకులు కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వీరి సినిమాలో సీన్లెప్పుడూ డ్రామాలాగా కాకుండా నిజజీవితానికి దగ్గరగా వుంటాయి. వ్యక్తి స్వాతంత్ర్యం గురించి Jean Paul Sartre లాంటి తత్వవేత్తలు నిర్వచించిన అస్థిత్వవాదాన్ని తమ సినిమాల్లోకి తెచ్చారు అప్పటి దర్శకులు.
New wave సినిమాల ద్వారా దర్శకులు తాము నిర్దేశించిన సూత్రాలకు ఒక ఫిలాసఫీని కూడా సృష్టించడం ద్వారా తమ సినిమాలకొక వివేచనాత్మక హోదాను సంపాదించి పెట్టారు. ఫ్రాన్సులోని ప్రజల జీవితాల్లో కొరవడిన సృజనాత్మకత, రసాత్మకత మరియు వివేచనాత్మకతలను తమ సినిమాల ద్వారా పూడ్చారు నవ తరంగం దర్శకులు.
![]() |
జీన్-లక్ గోడార్డ్ (వికీపీడియా నుండి సేకరణ) |
1950-60 దశాబ్దపు చివరిరోజుల్లో ప్రపంచదేశాలెన్నింటిలోనో నవ్యత లోపించిన పాత తరహా సినిమాలకు గుడ్‍బై చెప్పేసి కొత్త తరహా సినిమాలను సృష్టించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రయత్నాలన్నింటిలోను అత్యంత ప్రఖ్యాతి గాంచినది “La Nouvell Vague”. New-wave లేదా నవతరంగం అని దీనర్థం. 1950లలో ఫ్రాన్స్ లో మొదటి సారిగా ఈ new wave (La Nouvelle Vague) అన్న పదం సృష్టించబడింది. అక్కడ ఎగిసిన ఈ నవతరంగం దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రపంచాన్ని తన సృజనాత్మక వెల్లువలో ముంచెత్తింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు పదిమంది నవ యువ కళకారులు కళపై, ప్రత్యేకించి సినిమాపై తమకున్న పిచ్చిని, ప్రేమను తమ తమ సినిమాల ద్వారా వ్యక్తపరచాలనే ప్రయత్నంలో ఎగిసిందీ తరంగం. అదే French New Wave. ఈ ఉద్యమానికి మూలకారకులలో ముఖ్యులు François Truffaut, Jean-Luc Godard, Claude Chabrol, Jacques Rivette మరియు Eric Rohmer.
ఫార్ములా సినిమాలు, రొటీన్ కథలు, స్టూడియో యజమానుల గుత్తాధిపత్యం లాంటి రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న French సినిమాకో కొత్త దిశని నిర్దేశించాలనే ఉద్దేశంతో Cahiers du cinema అనే పత్రికలో సినిమా విమర్శకులైన కొంతమంది యువకులు తమ సినిమాలతో ఫ్రెంచ్ సినీ పరిశ్రమలో కొత్త ఊపిరి నింపారు. ఈ నవతరంగపు దర్శకులు Cahiers Du Cinemaలో సినిమాలను విశ్లేషించడమే కాకుండా ప్యారిస్ లోని Cinémathèque Française అనే సినిమా క్లబ్బులో ప్రపంచ సినిమాలన్నీ ఏకధాటిగా చూసేవారు. ఇక్కడ పెరిగిన పరిచయాలు వారిని ఒక తాటిపై నడిపించాయి. సాటి వారి సహాయంతో ఇక్కడి దర్శకులందరూ కలిసికట్టుగా పనిచేసి ఒకరి సినిమాల్లో మరొకరు సహాయం చేసుకుంటూ ఫ్రాన్సు సినిమాలకే కాదు ప్రపంచపు సినిమాలన్నింటికీ కొత్త ఊపిరినిచ్చారు. సినీ ఉద్యమానికి కారకులయ్యారు.
పైన పేర్కొన్న దర్శకులే కాకుండా Agnes Varda, Alain Resnais, Alain Cavalier, Chris Marker, Louis Malle లాంటి దర్శకులు కూడా ఈ నవతరంగపు అలలకు శక్తినిచ్చారు.
ఫ్రెంచ్ new wave గురించి తెలుసుకోవాలనుకున్న వారెవరైనా ముందుగా Jean Luc Godard రూపొందించిన Breathless , Truffaut తీసిన 400 blows, Agnes Varda తీసిన Cleo from 5 to 7 మరియు Alain Resnais దర్శకత్వం వహించిన Hiroshima Mon’amour సినిమాలు చూడాల్సిందే!
షుమారు పది మంది నవతరంగం దర్శకులు దాదాపు పదేళ్ళపాటు 60 కి పైగా సినిమాలను తీసి ప్రపంచంలో ఎప్పుడూ లేనంతగా సంచలనాన్ని సృష్టించారు. కానీ దాదాపు పదేళ్ళపాటు సాగిన ఈ ఉద్యమం 1970 ల మధ్యలో చల్లబడింది. చాలా మంది ఈ ఉద్యమం కేవలం కొన్నాళ్ళపాటే సాగి ఆ తర్వాత విఫలమైందని విమర్శలు చేసినప్పటికీ new wave ఉద్యమం ద్వారా ప్రపంచ సినిమాలో జరిగిన మార్పులను గమనిస్తే ఈ ఉద్యమం విఫలమైందని అంగీకరించలేము.
మనం కొన్న కొత్త చొక్కాను కొన్నాళ్ళు మాత్రమే కొత్త చొక్కాగా భావిస్తాము కానీ ఆ చొక్కా వున్నన్నాళ్ళూ కొత్త చొక్కా అనుకోముగా! అలాగే పదేళ్ళపాటు సినిమాలో కొత్త ప్రక్రియలను సృష్టించిన నవ యువ దర్శకులు పదే పదే కొత్త పద్ధతులను సృష్టించడం కష్టమే, అలా వారు చేయాలనుకోవడమూ తప్పే! new wave సినిమాల ద్వారా బయటపడ్డ వినూత్న సినీ ప్రక్రియలు మరియు టెక్నిక్‍లు కాలక్రమంలో కమర్షియల్ main stream సినిమాలలో కూడా పొందుపరచడంతో new wave ఉద్యమం ద్వారా సాధించాల్సిన ఫలితాలు పొందినట్టయింది. ఈ విధంగా చూస్తే new wave ఉద్యమం నూటికి నూరుపాళ్ళు విజయం సాధించినట్టే!
అనగనగా ఒక భారత దేశం. ఆ దేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం. ఇక్కడి ప్రజలకు సినిమాల పిచ్చి. ఇక్కడి ప్రజలు ఖండాతరాలు దాటి వెళ్ళి వేర్వేరు రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్నప్పటికీ ఇక్కడి సినిమాలు మాత్రం రాష్ట్ర సరిహద్దులైనా దాటలేకపోతున్నాయి. ఇక్కడ నిత్యం మండే స్వార్ధపు మంటల్లో పడి సినిమా అనే కళ బూడిదయిపోయింది. ఆ విషయం గ్రహించిన వాళ్ళు తెలుగు సినిమాలు చూడడం మానేశారు. కొంతమంది ఆవేశపడిపోయి రోజూ సినీ పరిశ్రమను నిందిస్తున్నారు. కానీ ఇక్కడా ఎప్పుడోకప్పుడు ఒక నవతరంగం రాకపోదా? వాడిపోయిన సినీ పుష్పం మళ్ళీ వికసించకపోదా?
ఏమో కాలమే దీనికి సమాధానం చెప్పాలి!
నానాటికీ దిగజారిపోతున్న తెలుగు సినిమాకు పునరుజ్జీవం కల్పించాలని ప్రేక్షకులకు మంచి సినిమాల గురించి పరిజ్ఞానం కలుగచేసే ప్రయత్నంలో వ్యాసాలు రాస్తూ, తెలుగు సాహితీ ప్రపంచంలోని ఆణిముత్యాలను సినిమాలుగా తీసి తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో, మంచి సినిమా తీయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని కలలు గంటూ తన కలలను త్వరలో తెరకెక్కించే ప్రయత్నంలో వున్న వెంకట్ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే పొద్దులో సినిమా శీర్షిక నిర్వహిస్తూ మరియు తన సొంత వెబ్‌సైటు http://24fps.co.in లో కూడా సినిమాల గురించి రాస్తున్నారు.
కొడవటిగంటి కుటుంబరావు గారి కాల్పనిక, కాల్పనికేతర రచనలన్నీ పుస్తకాలుగా వచ్చాయి. కానీ ఆయన చేసిన అనువాదాలు మాత్రం పాఠకులకు అందుబాటులో లేవు. యాకొవ్ పెరెల్మాన్ రాసిన “నిత్యజీవితంలో భౌతికశాస్త్రం” పుస్తకానికి ఆయన చేసిన అనువాదం తెలుగువారెందరికో సైన్స్ పట్ల అమితాసక్తిని కలిగించింది. అది (అప్పటి) సోవియెట్ రష్యాలో ప్రచురితమైన తొలి తెలుగు అనువాదం కూడా అని కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు తెలియజేస్తున్నారు. నికొలాయ్ గొగోల్ రాసిన “The Dead Souls” నవలను కొ.కు. గారు మృతజీవులు అనే పేరుతో అనువదించారు. అది 1960లో విశాలాంధ్రలో వచ్చింది. తర్వాత అది పుస్తకంగా కూడా వచ్చినప్పటికీ ప్రస్తుతం ఎక్కడా దొరకడం లేదు.
ఆ అనువాదం ఈమాట లో నాలుగు భాగాలు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఆ అనువాదాన్ని 25/6/2007 నుంచి పొద్దులో ధారావాహికగా అందించనున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాం. ఈ అనువాదాన్ని పొద్దులో కొనసాగిస్తామని కోరిన వెంటనే అంగీకరించి అనువాద ప్రతిని అందజేసిన రోహిణీప్రసాద్ గారికి, పొద్దులో కొనసాగించడానికి అంగీకరించిన ఈమాట సంపాదకులు కొలిచాల సురేశ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
నికొలాయ్ గొగోల్ రాసిన ఓవర్ కోటు కథ, మృతజీవులు నవల, రివైజర్ నాటకం జగత్ప్రసిద్ధి పొందాయి. ఓవర్ కోటు (దాదా హయత్ చేసిన తెలుగు అనువాదం సాహిత్య నేత్రంలో వచ్చింది) రష్యన్ సాహిత్యాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే టాల్‍స్టాయ్, డోస్టొయేవ్ స్కీ, తుర్గేనెవ్ తదితరులు “మేమంతా గొగోల్ ఓవర్ కోటు లో నుంచి వచ్చినవాళ్ళమే” అనేవాళ్ళట!
“Gogol’s relaxed, decsriptive narrative gives us a good idea of mid-19th century Russia.” – కొడవటిగంటి రోహిణీప్రసాద్ (‘మృతజీవులు’ నవల గురించి)
(బొమ్మలు: ఎన్వికీ నుంచి)
రోజంతా శ్రమించి
కొంత స్థలాన్ని చదునుచేసి
విత్తనాలు చల్లాను
మొలకలకోసం నిరీక్షిస్తున్నా
పొటమరిస్తున్న ఉనికిని
స్వాగతించడానికి!
స్నేహితుల్లారా!
మిమ్మల్ని పిలవాలనివుంది
మొలకలు వస్తూ వస్తూ
సమయ సంకేతాన్నిచ్చి రావుకదా!
వేచివుండాలి!
ఏ అర్థరాత్రో అపరాత్రో
వెన్నెల లేనప్పుడు
వజ్రపుతునకల్లా బయటపడ్తే
నిరీక్షిస్తూ నిరీక్షిస్తూ
నిదుర కళ్ళతో జోగితే
మొలుచుకొచ్చిన రంగేదీ కనపడదు కదా!
పైగా ఎర్రబారిన కళ్ళను చూస్తే దిగులేస్తుంది
ఎదిగిన నారుమడుల్లో
కలుపుతీయడానికి పిలుస్తాను
ఒక్కణ్ణే ఎంతసేపని పనిచేయను?
ఆకును చూసో తొడిమను చూసో
పువ్వులొచ్చే జాడల్ని కనిపెట్టొచ్చు
కాయలొచ్చే తీరుల్ని చెప్పొచ్చు
నిండు పూలవనంలో
మీరు తిరుగాడుతూ
నేత్రాల్ని టప టపలాడిస్తుంటే
రేకల పరిమళాల్ని పీలిస్తూ
వనమాలిని మెచ్చుకుంటుంటే
చాటుగావిన్న మాటలైనా ఉత్తేజాన్నిస్తాయి
బీడు భూముల్లో
మరో వనాన్ని స్వప్నిస్తాను
వనాల్ని స్వప్నించడం
వడగాల్పుల ఎండల్లోనైనా
నడుమొంచడం కొత్త కాదుకదా!
వేపపువ్వుల్లోనో
విప్పపువ్వుల్లోనో దాగిన
తేనెను వెదకి తెచ్చేపని మీకప్పచెపుతున్నా
వేరే పువ్వులేవీ లేవా అని విసుక్కోవద్దు
వాటి మాధుర్యమేదో
పదేపదే లాగిపెడ్తుంది
తొలిపొద్దులో రాలే మంచుబిందువుల్ని
ముద్దాడేందుకు లేత అకుల్ని సిద్దంచేయాలి!
చదును చేయాల్సిన స్థలాలింకా మిగిలివున్నాయి సుమా!
వీరు రాసిన ‘హృదయాంజలి’ కవితాసంపుటి మార్చి 2004 లో శ్రీ మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన ‘హసీనా’ గురజాడ రాసిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి ‘అలలపై కలలతీగ’ కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది. వీరి గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని వీరి బ్లాగులో చూడవచ్చు.
అంకెలతో సాహిత్యానికి చాలా సంబంధం ఉంది. (ఈ మహా సృష్టిని అంకెల ఆధారంతోనే గుర్తిస్తాము.) జ్ఞానానికి సంఖ్య ఆధారం. కాని అంకెకు ప్రత్యేక అస్థిత్వమంటూ లేదు. అసలు అంకెల ఆధారిత పేర్లు, పదబంధాలు ఎన్నో ఉన్నాయి. ఏకావ్రతుడు, త్రివిక్రముడు,చతుర్ముఖుడు, పాంచాలి, సప్తాశ్వుడు, అష్టావక్రుడు, నవనాధుడు, దశకంఠుడు మొదలైనవి. మన కవులు కవితలల్లడానికి ఇదీ అని ఒక వస్తువు కాని, విషయం కాని ఆలోచించరు. కనపడ్డ ప్రతి దానిపై చమత్కార పద్యాలల్లగల ధీమంతులు.
ఆద్యుడున్న యప్పు డందరు పూజ్యులే
లెక్క మీద సున్న లెక్కినట్లు
అతడు పోవు వెనుక నంద రపూజ్యులే
లెక్కలేక సున్న లేగినట్లు!!
అని ఓ కవి గొప్పవాడిని అనుసరించే జనులను సున్నాతో పోల్చాడు. సున్నాకి ఏదైనా అంకెతో కూడినప్పుడే తప్ప ప్రత్యేకంగా విలువ లేదు కదా !
మేమేమి తక్కువ తిన్నాం అంటూ ఇంకో కవి హనుమత్సందేశాన్ని అంకెల్లో దాచి మరీ గంభీరంగా చెప్పాడు.
అంచిత చతుర్ధ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్
గాంచి తృతీయం బక్కడ
నుంచి ద్వితీయంబుదాటి యొప్పుగ వచ్చెన్!!
ఈ పద్యాన్ని పంచభూతములతో అన్వయించుకొని చెప్పుకోవాలి.1.భూమి 2. నీరు 3. అగ్ని 4. వాయువు 5. ఆకాశాలు .
చతుర్ధజాతుడు అనగా వాయుపుత్రుడైన హనుమంతుడు పంచమ మార్గమున(ఆకాశ మార్గాన ) వెళ్ళి, ప్రధమ తనూజను(భూమిపుత్రి సీత) చూసి , తృతీయంబు(అగ్ని)నక్కడ నుంచి అంటే లంకా దహనం చేసి ద్వితీయంబు( నీరు-సముద్రం) దాటి తిరిగొచ్చాడు అని అర్ధం. ఒప్పుకుంటారా కవి సామర్ధ్యాన్ని?
గద్వాల సోమరాజుని పొగడుతూ ఓ కవి ఎంత గమ్మత్తుగా ఆకాశానికెత్తేసాడో చూద్దామా!!
నలుగురు బలికిరి సరియని
నలుగురు బలి కిరి సురూప నయ దాన ధరా
వలయ ధురా చరణోన్నతి
పొలుపుగ గద్వాల సోమ భూపాల నకున్!!
గద్వాల రాజు (సురూప) అందంలో నలుడు , (నయ) బుద్ధిలో గురుడు అంటే బృహస్పతి, దానంలో ‘బలి’ చక్రవర్తి, ధరావలయాన్ని(భూమిని) మోయటంలో (కిరి) వరహావతారంగా అని అంటే నలు-గురు- బలి-కిరి ట.
ఇలాంటి వాళ్ళని చూసి ఒళ్ళు మండిన ఆడిదం సూరకవి దేవుడితో మొర పెట్టుకున్నాడంట..
దేవునాన మున్ను దేశాన కొకరుండు
ఇప్పుడూర నూర నింట నింట
నేడ్వు రార్వు రేడ్వు రెనమండ్రు తొమ్మండ్రు
పదువు రైరి కవులు పద్మనాభ!!
ఇదివరకు దేశానికొక్క కవి ఉంటే నేడు ఇంటికి పదిమంది తయారయ్యారు భగవంతుడా!!
భావ కవిత్వాన్ని అభావ కవిత్వంగా జమ కట్టి హేళన చేస్తూ అనంత పంతుల రామలింగస్వామిగారు ఇలా అన్నారు.
రెండు కాకులు కూర్చుంటె బండ మీద
నొండెగిరిపోయె నంత నందొండు మిగిలె
రెండవది పోయె పిదప నందొండు లేదు
బండ మాత్రము పాప మందుండి పోయె!!
కాని ఇది చూస్తూ ఊరకుండని కొందరు ప్రబుద్ధులు ఈ హేళనలోనుండి కూడా వేదాంత పరమైన అర్ధాన్ని చెప్పి భావ కవిత్వానికి కూడా ఒక అర్ధం ఉంటుందని ఋజువు చేశారు . ఇందులో జీవాత్మ, పరమాత్మ అనే కాకులు బండ అనే శరీరంలో ఉన్నాయి. జీవాత్మ ఎగిరిపోయి పరమాత్మలో కలియగానే పాపం బండ లాంటి శరీరం మిగిలిపోయిందంట .
ఇక ఈ కవులు సుందర సుకుమారి స్త్రీని కూడా వదలకుండా అంకెలతో ఆటలాడారు. ఎలా అంటారా ?? ఆమె ముఖం మీదే లెక్కలేసారు మన శృంగార ప్రియులు.
అనువై నెన్నుదు రొంటు గాఁ బదునొకండై బొమల్ జంటగా
ఘనతం బోల్పగ రెండు రెండు తొమ్ముదులునై కర్ణద్వయం బొప్పగా
ఘన పూర్ణస్థితి బర్వులీల నెసగంగా నింతయుంగూడ దా
దిన సంఖ్యం దిలకింప నిండు నెలగా దీపించు మో మింతికిన్!!
ఆమె నుదురు ఒకటిలా, కనుబొమలు పదకొండులా, చెవులు రెండు తొమ్మిదుల్లా వుండి పూర్ణిమ నాటి చంద్రునిలా ముఖం ప్రకాశిస్తుందని ఆయన గారి వెర్రి సంబరం. అర్ధం కాలేదు కదా!
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
౧ | ౨ | ౩ | ౪ | ౫ | ౬ | ౭ | ౮ | ౯ | ౧౦ |
ఆమె నుదురు ౧ , కనుబొమలు ౧౧ , చెవులు ౯౯ లా ఉన్నాయి .
1+11+9+9 = 30 అయి పూర్ణిమ నాటి చంద్రునిలా ఉందని కవి చమత్కారం .
పెళ్ళికాని యువకులకు కవి కస్తూరి రంగనాధుడు ఎటువంటి కన్యను చూసి వివాహం చేసుకోవాలో చెప్తున్నారు.
కన్యకునైదు జంఘలును కన్యకు నేడు విశాల నేత్రముల్
కన్యకు నాల్గు కన్బొమలు కన్యకు నారు కుచద్వయంబులున్
కన్యకు ద్వాదశంబరయగా వర మధ్యము గల్గినట్టి యా
కన్యకు నీకునుం బదియు గావలె కస్తూరి రంగ నాయకా!!
ఈ పద్యం ఖగోళశాస్త్ర పరిజ్ఞానంతో అర్ధం చేసుకోవాలి. ఖగోళంలో ౧౨ రాశులున్నాయి . ౧. మేషం ౨. వృషభం ౩. మిథునం ౪ . కర్కాటకం ౫. సింహం ౬. కన్య ౭. తుల ౮. వృశ్చికం ౯. ధనుస్సు ౧౦. మకరం ౧౧. కుంభం ౧౨ మీనం. ఇప్పుడు ‘కన్య’ రాశి నుండి మొదలుపెడితే ఐదో రాశి మకరం (మొసలి వంటి పిక్కలు), ఏడో రాశి మీనం ( చేపల్లాంటి కళ్ళు), నాలుగో రాశి ధనుస్సు( విల్లు వంటి కనుబొమలు), ఆరో రాశి కుంభం ( కుంభాల వంటి కుచాలు), పన్నెండో రాశి సింహం(నడుము), పదో రాశి మిథునం (జంట). ఈ లక్షణాలు కలిగిన కన్య నీకు జంట కావాలని కోరిన కవి ఇలా ‘రాశి’ పోశాడు.
మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ తిరుపతి వేంకట కవులు తమ ‘శ్రవణానందం’ కావ్యంలో ఒక స్త్రీకి ఎంత విలువ కట్టారో చూడండి.
పలుకొక్కటియే సేయు పదివందల వరాలు
వాలు చూపులు రెండు వేలు సేయు
నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు
విర్రవీగుట లారువేలు సేయు
పదమొక్కటియె సేయు పదివేల వరహాలు
లావణ్యమది యొక లక్ష సేయు
బలుసోయగమె సేయు పది లక్షల వరాలు
కులుకు నడక తీరు కోటి సేయు
ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు
నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు
నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు
నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!
సంఖ్యాగత శ్లోకాలు కొన్ని చూద్దాం!
లాల యేత్ పంచవర్షాణి – దశ వర్షాణి తాడయేత్
ప్రాప్తేత్తు షోడశే వర్షే – పుత్రం మిత్రవ దాచరేత్!!
కొడుకుని ఐదేళ్ళవరకు బుజ్జగించాలి. పదేళ్ళ వరకు కొట్టి బుద్ధి చెప్పాలి . పదహారో ఏటి నుండి స్నేహితునిలా చూడాలని పై శ్లోకం చెప్తుంది. ఎందుకంటే పుట్టినవాడు శూరుడో, పండితుడో , మహా వక్తో,దాతో కావాలి గాని పరమ శుంఠ కాకూడదు కదా! కాని అది కూడా దుర్లభమంటుంది ఈ శ్లోకం …..
శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః
వక్తా దశ సహస్రేషు దాతా భవతి వా నవాః
అంటే వందమందిలో ఒక పండితుడు, పదివేల మందిలో ఒక మహావక్త పుడతారేమో గాని దాత అనేవాడుంటాడో లేదో అని సందేహ పడుతున్నా అటువంటి కోవకు చెంది వుండాలంటే మనిషికి కొన్ని నియమాలు ఉండాలి .అవి ఏవంటే….
శత విహాయ భోక్తవ్యం – సహస్రం స్నాన మాచరేత్
లక్షం విహాయ దాతవ్యం – కోటిం త్యక్త్యా హరిం భజేత్!!
వంద పనులు విడిచిపెట్టయినా వేళకు భోజనం చేయాలి. వేయి పనులు విడిచి స్నానం చేయాలి . లక్ష పనులు విడిచి దానం చేయాలి. కోటి పనులు విడిచి దైవ ప్రార్ధన చేయాలి…
ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దులో సరదా శీర్షిక నిర్వహిస్తున్నారు.
తెలుగులో మొదటగా బ్లాగు సమీక్షలు రాయడం మొదలుపెట్టిన సి.బి.రావుగారు ఈసారి పుస్తక సమీక్షల గురించి రాయగా సరదా శీర్షికలో జ్యోతి గారు సరికొత్త ’గ్యాస్’ ఆఫర్ తో మీ ముందుకొచ్చారు. సిలిండర్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం.
ఇక పొద్దులో ఈమాసపు విశిష్ట అతిథి డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు. సంగీతం, సాహిత్యం, సైన్సు – ఇలా విభిన్నరంగాల్లో ప్రావీణ్యమున్న బహుముఖప్రజ్ఞాశాలి రోహిణీప్రసాద్ గారు చరిత్ర – విజ్ఞానశాస్త్రం గురించి వివరిస్తున్నారు.
గడిని ఎప్పుడూ శరవేగంతో నింపి పంపే ప్రొ. సత్యసాయి కొవ్వలి గారిని ఈసారి ఏమార్చి గడి కూర్పరిగా మార్చి ఆయనకు ఆ అవకాశం లేకుండా చేశాం. 🙂
సినిమా పట్ల విపరీతమైన అభిమానమే కాదు లోతైన అవగాహన, అనుభవం కూడా ఉన్న 24 ఫ్రేములు, 64 కళల బ్లాగరి వెంకట్ గారు పొద్దులో సినిమా శీర్షికను నిర్వహించనున్నారని తెలుపడానికి సంతోషిస్తున్నాం. తన ప్రారంభరచనలో ఆయన తెలుగు సినిమాలో నవతరంగం గురించి వివరిస్తున్నారు.
చరిత్ర – విజ్ఞానశాస్త్రం (అతిథి) నవతరంగం (సినిమా) గడి (గడి) పుస్తక సమీక్ష (వ్యాసం) ’గ్యాస్’ సిలిండర్ (సరదా)
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం (అతిథి: సురేశ్ కొలిచాల) తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం (అతిథి) బ్లాగరుల ప్రవర్తనా నియమావళి (వివిధ) సింధువు (కవిత) షరా మామూలే… (కథ) షడ్రుచుల సాహిత్యం (వ్యాసం) గడి (గడి) మారిషస్‍లో విశేషపూజ (కబుర్లు) బ్లాగ్బాధితుల సంఘం (సరదా) డా.హాస్యానందం నవ్వులు (సరదా)
సి.బి.రావు! తెలుగులో బ్లాగుసమీక్షలు రాయడం మొదలుపెట్టిందాయన. బ్లాగరుల సమావేశాలకు పెద్ద. తెలుగులో సశేష బ్లాగులు అశేషంగా రచించి, ఇంకా రచిస్తూ వస్తున్న సీరియల్ బ్లాగరి. ఆయన రాసే సచిత్ర సమావేశ నివేదికలు చదవడం కోసం తెలుగు బ్లాగరులు దీప్తిధార (రావుగారి బ్లాగు) వద్ద కాపు వేసి ఉంటారు. ఇప్పటికి ఎన్నో బ్లాగులను సమీక్షించిన సి.బి.రావుగారు ఈ వ్యాసంలో పుస్తకసమీక్షల గురించి వివరిస్తున్నారు. రావుగారు ఆంధ్రప్రదేశ్ పక్షివీక్షకుల సంస్థ (A.P. Birdwatchers’ Society) కార్యదర్శి కూడా.
దాదాపు అన్ని పత్రికల్లోనూ పుస్తక సమీక్షలు వస్తూ ఉంటాయి. ఒక కొత్త పుస్తకం మార్కెట్లోకి విడుదలైనప్పుడు ఆ పుస్తకంలోని విషయంపై ఆసక్తి, అభిరుచితో బాటు, దాని యొక్క మంచి-చెడులను బేరీజు వెయ్యగల సామర్థ్యమున్నవాళ్ళు ఆ పుస్తకాలపై సమీక్షలు రాస్తారు. కొందరు బ్లాగరులు సైతం తాము చదివిన పుస్తకాలపై తమ తమ బ్లాగుల్లో క్లుప్తంగానో, వివరంగానో తమ అభిప్రాయాలు రాస్తూ ఉంటారు.
ఐతే అవన్నీ పుస్తక సమీక్షలేనా? అసలు వేటిని పుస్తక సమీక్షలనవచ్చు? తమకు బాగా నచ్చిన/అసలు నచ్చని పుస్తకాలపై అందుకు గల కారణాలను సైతం వివరిస్తూ పత్రికల్లో సవివరమైన సమీక్షలు తామూ రాయవచ్చా? అని చదివేవాళ్ళకు సందేహాలొస్తూ ఉంటాయి. ఆ సందేహాలను తీర్చడంతోబాటు మంచి సమీక్షలెలా ఉండాలో తెలిపే ప్రయత్నమే ఈ చిరువ్యాసం.
ప్రచురణ కర్తలు లేక రచయితలు,తమ పుస్తకాలను సమీక్ష నిమిత్తం, 2 ప్రతులను పత్రికా సంపాదకులకు పంపిస్తారు. ఒక పుస్తక పాఠ్యాంశం, ఉదాహరణకు పక్షుల వలసపై ఉందను కోండి. సంపాదకులు అలాంటి పుస్తకాలను, పక్షి శాస్త్రజ్ఞులకో,కనీసం ఆ subject తెలిసినవారికో సమీక్షకు పంపుతారు. కొన్ని సార్లు అభిప్రాయాలు అడుగుతారు. ఒక subject పై authority కానవసరము లేదు, కనీస పరిచయము ఉంటే బాగుంటుందని సంపాదకుల అభిప్రాయం.
అలాగే నవలలను ఇతర రచయితలకు ఇచ్చి సమీక్ష చేయమంటారు. కథా శైలి, కథనం, భాష,కథాంశం కున్న ప్రాధాన్యత, ముగింపు ఇవన్నీ కథను ప్రభావితం చేస్తాయి. పుస్తక ముద్రణ, కాగితపు నాణ్యత, పుస్తక ధర, అచ్చు తప్పులు, ముఖ చిత్ర అలంకరణ వగైరాలు సమీక్షకుడు పరిగణలోకి తీసుకుంటాడు. సమీక్షకుడు తన సమీక్షలో కథా సారాంశాన్ని, క్లుప్తంగా ఇస్తూ, సాధ్యమైనంత వరకూ ముగింపు చెప్పక, పాఠకుడికి పుస్తకం చదవటానికి కావాలిసిన ఆసక్తిని చంపకండా, అందులోని విశేషాలు, బాగోగులు విశ్లేషణాత్మకంగా వివరిస్తాడు. అంతేకాక, కథలోని ఒకటో రెండో పారాగ్రాఫులను తన సమీక్షలో ఉటంకిస్తాడు. దీని ద్వారా పాఠకుడికి రచయిత శైలి తెలియపరచాలని సమీక్షకుడి అభిప్రాయం. కొన్ని పర్యాయాలు, పుస్తక ముఖ చిత్రాన్ని రంగులలో, తన సమీక్షలో భాగంగా ఇస్తాడు సమీక్షకుడు. దీనివలన పుస్తకం కొనకుండానే పాఠకుడు పుస్తకాన్ని అనుభూతి చెందే అవకాశం లభిస్తుంది.
సంజీవదేవ్ పారదర్శి అనే కలం పేరుతో సమీక్షలు చేసేవారు.ఆయన మానసిక శాస్త్రవేత్త కాదు,వైజ్ఞానికుడు కాదు,linguist కాదు, వైద్యుడు కాదు. దేవ్ ఈ అంశాలున్న పుస్తకాలనే కాకుండా పలు ఇతర అంశాలున్న గ్రంధాలను, బహుముఖ ప్రజ్ఞాశాలురపై వ్యాసాలు రాశారు. అవి రసరేఖలు, కాంతిమయి వగైరా వ్యాస సంపుటాలుగా ప్రచురితమయ్యాయి. Specialist కాకుండా generalist లు కూడా సమీక్ష చెయ్యవచ్చు అనేదానికి సంజీవదేవ్ ఒక మంచి ఉదాహరణ అవుతారు.
సమీక్షలో, కేవలం కథా సారాంశం సంక్షిప్తంగా ఇస్తే, అప్పుడు అవుతుందది సంక్షిప్త కథ. మరి, మీరు పలు బ్లాగులలో చదువుతున్నవి, సమీక్షలా లేక పరిచయాలా అన్న విషయం, ఈ సరికి విజ్ఞులయిన పాఠకులకు, అవగతమయ్యే వుంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలకు బలమివ్వక, రచయితపై అభిమానం ప్రదర్శించకుండా, నిష్పాక్షికంగా, తటస్థం గా రాసినప్పుడు సమీక్షలకు, సమీక్షకుడికి విలువ పెరుగుతుంది.