అతిథి, సినిమా, గడి

తెలుగులో మొదటగా బ్లాగు సమీక్షలు రాయడం మొదలుపెట్టిన సి.బి.రావుగారు ఈసారి పుస్తక సమీక్షల గురించి రాయగా సరదా శీర్షికలో జ్యోతి గారు సరికొత్త ’గ్యాస్’ ఆఫర్ తో మీ ముందుకొచ్చారు. సిలిండర్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం.

ఇక పొద్దులో ఈమాసపు విశిష్ట అతిథి డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు. సంగీతం, సాహిత్యం, సైన్సు – ఇలా విభిన్నరంగాల్లో ప్రావీణ్యమున్న బహుముఖప్రజ్ఞాశాలి రోహిణీప్రసాద్ గారు చరిత్ర – విజ్ఞానశాస్త్రం గురించి వివరిస్తున్నారు.

గడిని ఎప్పుడూ శరవేగంతో నింపి పంపే ప్రొ. సత్యసాయి కొవ్వలి గారిని ఈసారి ఏమార్చి గడి కూర్పరిగా మార్చి ఆయనకు ఆ అవకాశం లేకుండా చేశాం. 🙂

సినిమా పట్ల విపరీతమైన అభిమానమే కాదు లోతైన అవగాహన, అనుభవం కూడా ఉన్న 24 ఫ్రేములు, 64 కళల బ్లాగరి వెంకట్ గారు పొద్దులో సినిమా శీర్షికను నిర్వహించనున్నారని తెలుపడానికి సంతోషిస్తున్నాం. తన ప్రారంభరచనలో ఆయన తెలుగు సినిమాలో నవతరంగం గురించి వివరిస్తున్నారు.

మరిన్ని విశేషాలు త్వరలో…

ఈ నెల రచనలు:

చరిత్ర – విజ్ఞానశాస్త్రం (అతిథి) నవతరంగం (సినిమా) గడి (గడి) పుస్తక సమీక్ష (వ్యాసం) ’గ్యాస్’ సిలిండర్ (సరదా)

మే నెల రచనలు:

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం (అతిథి: సురేశ్ కొలిచాల) తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం (అతిథి) బ్లాగరుల ప్రవర్తనా నియమావళి (వివిధ) సింధువు (కవిత) షరా మామూలే… (కథ) షడ్రుచుల సాహిత్యం (వ్యాసం) గడి (గడి) మారిషస్‍లో విశేషపూజ (కబుర్లు) బ్లాగ్బాధితుల సంఘం (సరదా) డా.హాస్యానందం నవ్వులు (సరదా)

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.

4 Responses to అతిథి, సినిమా, గడి

  1. ఎప్పుడో గత డిసెంబరులో చరసాల ప్రసాదు బ్లాగుని పరిచయం చేస్తూ మీరు చెప్పిన మాటలివి –
    “నెలనెలా వచ్చే బ్లాగు జాబుల్లోంచి అత్యుత్తమమైన మూడు జాబులను సమీక్షిస్తామని చెప్పాం. దానికి ముందు, మంచి బ్లాగులనే ఏకంగా సమీక్షించదలచాం. ఆ వరుసలో మొదటిది ఇది.మొదటగా ఏ బ్లాగును సమీక్షిద్దామని ఆలోచించినపుడు, పొద్దు సంపాదక వర్గం తలపుకు వచ్చింది అంతరంగమే! మా సమీక్షపై మీ సమీక్షలను ఆహ్వానిస్తున్నాం. ”

    ఆ తరవాత బ్లాగు పేరడీల గొడవలో పడి ఈ బ్లాగుల సమీక్ష సంగతే మర్చిపోయినట్టున్నారు. తెలుగు బ్లాగు గుంపులో చిరపరిచయస్తులే కాక కొత్తగా వింతగా బ్లాగుతున్న వారి సంఖ్య పెరిగింది. మీరు మళ్ళీ నెలనెలా ఒక బ్లాగు పరిచయం మొదలు పెడితే బావుంటుంది.

  2. అవును బ్లాగులెన్ని అయిపోయాయంటే కొత్తబ్లాగులను గురించి తెలుసుకునే సమయం సందర్భం కుదరటం లేదు. సమీక్షిస్తే ఆ వంకైనా ఆ బ్లాగులను నా లాంటి బద్దకిష్టులు దర్శిస్తారు.

  3. radhika says:

    ఈనాడులో “వెబ్ లో తెలుగు వెలుగులు” అంటూ వచ్చిన వ్యాసం లో పొద్దు గురించి కూడా వచ్చింది చూసారా?అది మీ బాధ్యతను పెంచింది అనుకుంటున్నాను.ఇక నుండి మీరు నెల నెలా అన్ని శీర్షికలను తప్పకుండా అందిస్తూ వుండాలి.

  4. ranganadh says:

    mee paper chaala aasakthiga vunnadi.ookadampudu ledu.

Comments are closed.