హార్ట్ బ్రేకింగ్

-పట్రాయని సుధారాణి

కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్న ప్రవీణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోవెల ఇప్పటివరకూ ఎంత ప్రశాంతంగా ఉంది! ఎక్కడిదీ ఘంటానాదం… ఎవరూ కనిపించరేం? వెనక్కి తిరిగి చూసింది.

ఫోన్ లో ఆశ చెప్పిన విషయం ప్రవీణ ని గాల్లో తేలుస్తోంది. ‘ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం! ఇన్నాళ్ళకు చేతికందొస్తోంది. ఎప్పుడూ పల్లవికే దొరికే ఛాన్స్… ఇవాళ నాదే…’

దేవుడి విగ్రహం రాయిలా నిలబడి ఉంది. రాయిలా ఉన్న తనను, తను సృష్టించిన మనిషి ఇంత అందమైన రూపంలో సృష్టించి నిలిపినందుకు గర్వపడుతూ ఒకింత దరహాసాన్ని తొణికిస్తూ ఉంది.

ఇంతకీ ఈ గంటనెవరు మ్రోగిస్తున్నట్టు?

దానికదే ఎలా మ్రోగుతోంది? ఆగదేం?

అబ్బ…బ్బ… ఎలా దీన్ని ఆపడం? చెవులు శబ్దాన్ని భరించలేక పోతున్నాయి. అంతకంతకూ ధ్వని పెరిగిపోతోంది. మెదడులో నాళాలు చిట్లిపోతాయా అన్నట్టుగా ఉందే… ఒద్దు… భరించలేను…

గట్టిగా చెవులు మూసేసుకుంది.

“ప్రవీణా, లే. టైమ్ చూడు, లేటయి పోతోందని హడావిడి పడతావ్.” పరిచయమైన గొంతు విని ధైర్యంగా కళ్ళు తెరిచి చూసింది. గెడ్డం గీసుకోడానికి సిద్ధ పడుతూ చేతిలో రేజర్, బుగ్గల నిండా సబ్బునురుగు… రవీంద్రని పోల్చుకున్నాక చటుక్కున లేచి మంచం దిగింది.

అనాలోచితంగానే గోడవేపు చూసి ‘ఏడయిపోయిందే’ అని పరుగుపెడుతున్న ప్రవీణని చూసి నవ్వుకున్నాడు రవీంద్ర.

రాత్రి రకరకాల ఆలోచనలతో పక్కమీద దొర్లగా దొర్లగా ఎప్పుడో ఏ తెల్లారుఝామునో నిద్రాదేవి కరుణించింది. ఇంతకీ ఆ కల ఏమిటి…కలలకి అర్థం ఉంటుందా ఉండదా? ఉంటే ఏమిటి ఆ కల? చెవులు రింగుమంటున్న ఆ నాదం ఇంకా మనసుని కలవరపెడుతూనే ఉంది. అసంకల్పితంగానే రోజూ చేసే పనులన్నీ చేసుకుంటోంది ప్రవీణ.

తన కన్నా ముందే నిద్రలేచిన అత్తగారు వంటింటి బాధ్యత నెత్తినేసుకున్నట్టున్నారు. కాఫీ కప్ అందుకుంటూ ప్రవీణ అడిగింది ఆవిడని. చిన్నత్తయ్యగారు వాళ్ళు ఎన్ని గంటలకి వస్తున్నారూ అని.

“ఏదీ వీడు తెమిలి వెళ్ళి తీసుకురావద్దూ? ఏ పదో పదకొండో అవుతుంది. ఏం తక్కువ దూరమా?” స్నానం చేసి వస్తున్న కొడుకునుద్దేశించి అందావిడ.

ఆవిడ చెల్లెలు, మరిది, కొడుకు, కోడలు ఏదో పెళ్లి కోసం ఈ ఊరొచ్చి ఆవిడని చూడడం కోసం ఇవాళ వస్తామన్నారు. అందుకే ఆవిడ హడావిడి. ప్రవీణకి కొత్త ఉద్యోగం. అప్పటికే పిల్లల కోసం రెండుసార్లు శలవలు వాడేసింది. మరి పెట్టడం కుదరదు. పిల్లలకి, రవీంద్ర కి శలవే కాబట్టి పని తొందరగా చెయ్యవలసిన అవసరం లేదు. అర్థం చేసుకొనే మనిషి కాబట్టి అత్తగారితో సమస్య లేదు.

రవీంద్ర వంటింట్లోకి తొంగి చూశాడు. “ప్రవీణా, నువ్వు నిద్రలో ఉండగా ఏదో ఫోన్ వచ్చింది. చూశావా? నేను బాత్రూంలో ఉన్నానప్పుడు.” చెప్పి వెళ్ళి పోయాడు.

తనని ఇంతసేపూ కలవర పరిచిన కలలోని గుడి గంటకీ, చెవి పక్కనే పెట్టుకొని పడుకున్న సెల్ ఫోన్ రింగ్ టోన్ కీ లంగరు అందింది ప్రవీణకి. మనసు తేలిక పడింది.

సెల్ తీసి మిస్డ్ కాల్స్ చూసింది. ఆశ చేసింది. ‘ఎందుకు చేసిందబ్బా?’ అనుకుంటూ ఆశ నంబరు డయల్ చేసింది.

అక్క గురించి ఏదో కంప్లైంట్ చేద్దామని వచ్చిన రాహుల్ క్షణ క్షణానికి అమ్మ మొహంలో మారుతున్న భావాలని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయాడు.

“నిజంగానా…. అవునా… ఓకే… నేను మళ్ళీ చేస్తాలే… బై…” అంటూ ఫోన్ కట్ చేసి రాహుల్ వేపు చూసింది ప్రవీణ. ఏమనుకున్నాడో మరి అమ్మతో ఏమీ చెప్పకుండానే వెళ్ళి పోయాడు, “పాలు తాగేవా నాన్నా” అన్న అమ్మ ప్రశ్నకి ఊ కొడుతూ.

ఫోన్ లో ఆశ చెప్పిన విషయం ప్రవీణని గాల్లో తేలుస్తోంది. ‘ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం! ఇన్నాళ్ళకు చేతికందొస్తోంది. ఎప్పుడూ పల్లవికే దొరికే ఛాన్స్… ఇవాళ నాదే…’

మనసులో పదే పదే అనుకుంటూ అద్దం ముందు నిల్చొని తనలో తనే మురిసి పోతోంది ప్రవీణ.

ఒత్తైన తలకట్టు, తీర్చిన పెదవులు, సూటిగా కోటేరేసిన ముక్కు, లేత మొహం… ఇవన్నీ ఒక ఎత్తు కాగా చక్కని పలువరుస, స్పష్టమైన ఉచ్చారణ, భావగర్భితమైన మాట తీరు మరో ఎత్తు. ప్రవీణని చూసిన వెంటనే, కొద్ది పరిచయం తోనే ఎదుటి వ్యక్తిని ఆకర్షించి ఆకట్టుకోగల లక్షణాలు. ఒకప్పుడు ‘ఆ వృత్తికి అవసరం లేదేమో మరి’ అని జనం టెలివిజన్ లో చూసే వాళ్ళని గురించి అనుకునే లక్షణాలన్నీ ప్రవీణలో మూర్తీభవించి ఉన్నాయి.

ప్రవీణకి న్యూస్ రీడర్ ఉద్యోగం అనుకోకుండా దొరికింది. ఇంటిపని, పిల్లల పెంపకంలో తలమునకలయి ఉద్యోగ ప్రయత్నమే మానుకుంది చాలాకాలం. పిల్లలు కొద్దిగా పెద్దయి అత్తగారు తమ దగ్గరే ఉండడానికి వచ్చిన తర్వాత బోలెడు తీరిక దొరికింది. న్యూస్ రీడర్స్ కావాలంటూ ఓ ఛానెల్ చేసిన ప్రకటన కళ్ళబడి, అప్లికేషన్ పంపించడం, ఎందరితోనో పోటీ పడి ఉద్యోగం సంపాదించుకోవడం అనుకోకుండానే జరిగిపోయాయి.

ఉద్యోగం ప్రవీణ జీవితంలో కొత్త ఉత్సాహం నింపింది. రోజు రోజుకీ ఛానెల్స్ మధ్య పెరుగుతున్న స్పర్థ వల్ల కొత్త కొత్త సంచలనాత్మక వార్తలెన్నో వెలుగు చూస్తున్నాయి. ప్రవీణ కి మాత్రం ఉద్యోగ జీవితంలో ఒక అసంతృప్తి ఉండిపోయింది. తను పనిచేసే ఛానెల్ లో ఇద్దరు కలిసి న్యూస్ చదువుతారు. ఒక సీనియర్ ని, ఒక జూనియర్ ని కలిపి వార్తలు ఇస్తారు. ముఖ్యమైన వార్తలన్నీ సీనియర్ కోటాలోకి వెళ్లిపోతున్నాయి. సాదా సీదా వార్తలు, షేర్ మార్కెట్ ధరలు, వాతావరణం తన ఖాతాలో పడుతున్నాయి. ఇష్టమైన వృత్తిలో ఉంటున్నా ముఖ్యమైన వార్తలని, జనం ఆసక్తిగా ఎదురుచూసే ముఖ్యాంశాలని తనే అందించాలన్న కోరిక తీరడంలేదు. ఇప్పట్లో తీరేది కూడా కాదని నిరాశ చేసుకుని ఉన్న ఈ సమయంలో వచ్చింది ఆశ ఫోన్.

ఈ రోజు తనతో పాటు వార్తలు చదవవలసిన పల్లవికి చాలా అర్జెంట్ పని వచ్చి పడిందని, సమయానికి మరెవరూ అందుబాటులో లేరు కనుక ఇద్దరి వార్తలూ ప్రవీణే చదవ వలసి ఉంటుందని చెప్పడానికే ఆశ ఫోన్ చేసింది. ప్రవీణ మనసులో ఆనంద కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడడానికి కారణం ఇంకోటి. వివరాలు ఇంకా పూర్తిగా తెలీక పోయినా చాలా ముఖ్యమైన వార్త బ్రేకింగ్ న్యూస్ గా రాబోతోందట. ఛైర్మన్ గారి కేబిన్ నుంచి అస్మదీయులు తస్కరించిన సమాచార మని ఆశ చెప్పిన మాట.

బ్రేకింగ్ న్యూస్ అంటే తమ ఛానెల్ ప్రయోజకత్వం వల్లనే వెలుగు చూసిన వార్తలు. వాటిని పదే పదే ప్రసారం చేస్తూ ఊదరగొడతాయి ఛానెల్స్. ఏ రాజకీయ నాయకుడు ఎన్నో కోట్లు వెనకేసుకున్నాడు అనో, ఏ సినిమా టాప్ హీరో కూతురు ఎవడితో లేచిపోయి ఎలా పెళ్ళి చేసుకుందో, ఏ మూల బాంబులు పేలి ఎన్ని జీవితాలు హతమారిపోయాయో అనో ‘ఇవేగా బ్రేకింగ్ న్యూస్ లు? ఇవాళ ఎవరికి మూడిందో?’ అనుకుంది ప్రవీణ.

ఒక్కసారిగా ప్రవీణ ఉలిక్కి పడింది.

అదేమిటి… అబ్బా… ఛీ…. అమ్మో…. బాబోయ్…

తెరమీద ప్రసారం అవుతున్న ఒక్కో దృశ్యం ప్రవీణని తీవ్రమైన ఉద్విగ్నతకు లోను చేస్తోంది.

ఏమయితేనేం, తన చిరకాలవాంఛ నెరవేరబోతోంది. పల్లవికి ఈ పూట అంత అర్జెంటు పని తగిలించిన దేవుడికి అభివాదాలు తెలుపుకుంటూ అద్దం ముందు నుంచి కదిలింది ప్రవీణ.

ప్రవీణ బయల్దేరుతుండగా అన్నారు అత్తగారు. “అందరం ఇంట్లోనే ఉంటాంగా? ఆదివారం తీరిగ్గా న్యూస్ లో నిన్ను చూడొచ్చు. నువ్వు న్యూస్ చదువుతుండగా చూడాలని మా మాలక్ష్మికి ఎప్పటినుంచో కోరిక. వాళ్ళ ఊళ్ళో మీ ఛానెల్ రాదు కదూ” అని.

ప్రవీణ గుండెల్లో ఎప్పటినుంచో ఉన్న కోరిక తెలిసిన రవీంద్ర అభినందించాడు. పని ఎక్కువగా ఉంటే లేట్ అవచ్చని, దెబ్బలాడుకొని నాయనమ్మని, రాబోయే చుట్టాలని అవస్థ పెట్టొద్దని పిల్లల్ని హెచ్చరించి వెళ్ళింది ప్రవీణ.

* * *

“ఏమిటింతకీ న్యూస్, తెలిసిందా?” అడిగింది ఆశని ప్రవీణ.

“పూర్తిగా వివరాలు తెలీదనుకో. కాని సినిమా వాళ్ళకు సంబంధించినదనుకుంటా.”

ఆశ మాటలు వినగానే ప్రవీణ మనసు గంతులు వేసింది. సినిమా వాళ్ళ న్యూస్ ఏదయినా సరే ఛానెల్స్ కి పండగే. జనానికి ఊపిరి బిగ పట్టి వినే ఆసక్తే. ఓ హీరో తల్లి తండ్రులని తన్ని తగలేసాడనో, ఓ హీరో మరో హీరోని చితక తన్నించాడనో న్యూస్ ఛానెల్స్ కి కొద్దిగా ఉప్పందితే చాలు… పోటీలు పడి మరీ మరీ ప్రసారం చేసేస్తారు. ప్రజలు సరే… విరగబడి చూస్తారు. ‘వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి వారి స్వంతం. పబ్లికున నిలబడితే ఏమేనా అంటాం’ అన్న మహాకవి వాక్యాలు సినీ జీవులకి మరీ అన్వయిస్తాయేమో.

అందుకే సినిమాకి సంబంధించిన సంచలన వార్తలను ఏ ఛానెల్ వదులుకోదు. ఎంత రసస్ఫోరకంగా, ఉత్తేజపరిచేదిగా ఆ వార్తను ప్రసారం చెయ్యాలా అనే పనిలోనే టివి ఛానెల్స్ అన్నీ తలమునకలవుతాయి.

ఈ మధ్య విడుదలయిన జగత్ కంత్రీ, బుజ్జిపండు, ఆటాపాటా సినిమాలకు సంబంధించినదే ఆ న్యూస్ అని తెలిసింది ప్రవీణకి. అందులో చాలా అశ్లీలమైన దృశ్యాలున్నాయని, హీరో హీరోయిన్లతో రొమాన్స్ పేరిట చేసిన విచ్చలవిడి శృంగార సన్నివేశాలు సెన్సారు కత్తెరకు బలి కాకుండా బయటపడ్డాయని, కుటుంబ సమేతంగా చూడవచ్చంటూ సర్టిఫికెట్ జారీ చేసిన బోర్డు వారిగురించి చాలా విశ్లేషణాత్మకమైన అంశాలతో వార్తా కథనాన్ని రాసాడు భరణి.

వార్త ప్రసారానికి ముందే బ్రేకింగ్ న్యూస్ అంటూ టివి తెర పై స్క్రోలింగ్ వార్త వెళ్ళింది. ముఖ్యమైన వార్త ప్రసారం కాబోతోందని, వార్తల కార్యక్రమం చూడమని ప్రేక్షకులకి పదే పదే సందేశాలు వెళ్ళాయి.

న్యూస్ చదవాల్సిన టైమ్ వచ్చింది. రికార్డింగ్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాతలు నిర్మించిన ఆ చిత్రాలలో అసభ్యంగా ఉన్న సన్నివేశాలు, ఆడదాన్ని అంగడిబొమ్మని చేసి ఆడిస్తున్న వాణిజ్య ప్రపంచ విధానాలని తీవ్రంగా నిరసిస్తూ రాసి ఉన్న వార్తలని ఎంతో స్పష్టంగా, భావయుక్తంగా చదివి రికార్డింగ్ ముగియగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ప్రవీణ.

డెస్క్ దగ్గర ఆ రోజు హాట్ టాపిక్ అదే. అక్కలు, అన్నలు, అమ్మా, నాన్న, పిల్లలతోనే కాదు, పెద్దగా పరిచయం లేని స్నేహితులతో కూడా కలిసి చూడలేనట్టుగా తయారయింది సినిమా వినోదం అని సుష్మ వాపోయింది.

సకుటుంబంగా చూడవలసిన గొప్ప సినిమా అన్న ప్రకటనకి పడిపోయి ఉద్యోగం వచ్చిన కొత్తలో అమ్మా నాన్నతో కలిసి వెళ్ళిన శాంత సినిమా నిండా బూతు జోకులు, అక్కర్లేని బెడ్రూం దృశ్యాలు మరి చూడలేక మధ్యలోనే వచ్చేసిందిట.

హీరో హీరోయిన్ల శృంగార వీర విహారాన్ని చూడలేక చేష్టలుడిగి కూర్చుండిపోయిన అమ్మమ్మని అతి కష్టం మీద లేవదీసి తీసుకొచ్చిందిట పావని. ఒక్కొక్కళ్ళది ఒక్కో విషాద భరితమైన అనుభవం.

ప్రవీణకి కూడా ఇలాటి అనుభవాలు పిల్లలు చిన్నగా ఉండగా ఎదురయ్యాయి. అందుకే పిల్లలు ఎదుగుతున్న వయసులో వారిమీద అనవసరమైన ప్రభావాలేం పడకూడదని ప్రయత్నిస్తోంది. శలవల్లోకూడా సినిమాలకు వద్దంటుంది. కార్టూన్, యానిమేషన్ సినిమాలంటే అందరికీ ఇష్టం కనుక అవే చూస్తారు.

“అమ్మా మా ఫ్రెండ్సందరూ అన్ని సినిమాలు చూసి కథ చెప్తారే. ఎప్పుడు వినడమేనా? మేం కూడా చూడొద్దా” అని తెలివిగా అడుగుతుంది పాప. ప్రవీణ సమాధానం మాత్రం “నో…”

టివి చూసినా రిమోట్ పక్కన పెట్టుకొని ఛానెల్స్ మారుస్తూ చూడడమే ప్రవీణ పాలసీ. ఏమాత్రం అసభ్యంగా అనిపించినా సెన్సారు చేసేస్తుందని రవీంద్ర తనని ముద్దుగా కత్తెర అని పిలుస్తాడని కూడా తెలుసు.

కేవలం తన మొహాన్నే చూపిస్తూ వార్తలు ప్రసారం చేస్తుంటే ఇంట్లో వాళ్లు, చుట్టాలు ఎలా స్పందిస్తూ ఉంటారో అని ఊహల పల్లకిలో ఊరేగి దిగుతూ ఉండగా… వార్తలు ప్రారంభం అయ్యాయి టివిలో.

ఒకేసారి అన్ని టివి తెరల మీద తన బొమ్మ కదులుతూ వార్తలు వినిపిస్తుంటే అందరూ ఒకేసారి “బ్రేకింగ్ న్యూస్” అని గట్టిగా అరిచారు ప్రవీణని ఉత్సాహ పరుస్తూ. ముసిముసిగా నవ్వుతూనే వార్తలని శ్రద్ధగా వినసాగింది ప్రవీణ ఎక్కడైనా తప్పు దొర్లలేదు కదా అని.

న్యూస్ రీడర్ ముఖం పైనుంచి ఆ సినిమాలను ప్రదర్శిస్తున్న థియేటర్ల ఫొటోలు, సినిమాలు చూసి వస్తున్న జనాల ప్రతిస్పందనలతో కూడిన వార్తలు వరుసగా వస్తున్నాయి. రోడ్లపైన పెద్దసైజులో తగిలించిన హోర్డింగులలో ఎలాంటి అశ్లీలమైన దృశ్యాలున్నాయో, పాదచారులకూ, వాహన చోదకులకూ అవి ప్రాణాంతకంగా ఎలా పరిణమించగలవో వివరిస్తూ, వారితోనే ఆ మాటలు చెప్పిస్తున్నారు న్యూస్ రిపోర్టర్లు. మధ్య మధ్య స్టూడియోలో ప్రవీణ ముఖం చూపిస్తూ, వార్తలు సాగుతున్నాయి.

సినిమాలలో సభ్యతను మరిచిపోయి, హద్దులు చెరిపేస్తూ, క్లాసిక్స్ తీస్తారన్న పేరున్న దర్శకులు కూడా కాసుకు బానిసలవుతూ ఎలాంటి చిత్రాలు తీస్తున్నారో, ఎంత నీచానికి ఒడిగడుతున్నారో, అందుకు కారణాలను విశ్లేషిస్తూ ఆసక్తికరంగా సాగిపోతున్నాయి వార్తలు.

ఒక్కసారిగా ప్రవీణ ఉలిక్కి పడింది.

అదేమిటి… అబ్బా… ఛీ… అమ్మో…. బాబోయ్…

తెరమీద ప్రసారం అవుతున్న ఒక్కో దృశ్యం ప్రవీణని తీవ్రమైన ఉద్విగ్నతకు లోను చేస్తోంది.

“సినిమాలలో అసభ్యమైన సన్నివేశాలను తొలగించడానికి సెన్సారు బోర్డు ఉందా లేదా? ఉంటే ఏం చేస్తోంది? క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చి ఉండకపోతే ఆ విషయం అందరికీ తెలిసేలా బోర్డులు తయారు చెయ్యక్కరలేదా?” అని విరుచుకు పడుతోంది మహిళాసమితి కన్వీనర్. అందరికీ నోటీసులు పంపించామని, తగిన చర్యలు తీసుకుంటామని, నిర్మాతలు, థియేటర్ యజమానులు ఎంత గొప్పవారైనా వదిలేది లేదని హామీలు గుప్పిస్తున్నారు ఎస్పీలు, డీ ఎస్పీలు.

కాని ప్రవీణ అవన్నీ గమనించే స్థితిలో లేదు.

తెరమీద క్షణక్షణానికి మారిపోతున్న సన్నివేశాలన్నీ ఆమె మస్తిష్కంలో అలజడి రేపుతున్నాయి. తెరమీదకి అనుమతించకూడనివి, సెన్సారు కత్తెరకి బలిఅయినవి, హీరో హీరోయిన్ల పై చిత్రించిన ఉద్రేకపూరితమైన దృశ్యాలు, ఐటమ్ సాంగ్ అనే కొత్త ప్రక్రియతో ఒంటిమీద రుమాలు సైజుకు మించని బట్టతో డాన్సు పేరిట గెంతులేస్తున్న నటీమణుల అర్థ నగ్న దేహ ప్రదర్శనలు ఒక్కొక్కటిగా తెర మీద ఆవిష్కరింపబడుతున్నాయి.

ఆడదాన్ని ఆటబొమ్మని చేసి ఆడిస్తున్న నేటి వ్యాపారమయ సమాజపు పోకళ్ళను నిరసిస్తూ వార్తా కథనాలు వెనక నుంచి వినిపిస్తున్నాయి. ఆ వార్తలు తమ గురించి కావేమోనన్నట్టుగా నవ్వుతూ, కవ్విస్తూ తమ అందాలను స్వేచ్ఛగా సంతోషంగా ప్రదర్శిస్తున్నారు ఆ భామలందరూ. పనిలో పనిగా అని దేశీయ చిత్రరంగం ఎంతగా చెడిపోయిందో చూపిస్తున్న దృశ్యాలతో పాటు ఏవో విదేశీ సినిమాల నుంచి సంపాదించిన క్లిప్పింగ్స్ కూడా వేయడం కనిపిస్తోంది.

ప్రవీణ బుర్ర పనిచేయడం మానేసింది. కళ్ళు మాత్రం రెప్ప అర్పకుండా ఎదుటి దృశ్యాలని చూపిస్తున్నాయి.

మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? అనాగరిక వ్యవస్థనుంచి నాగరికత నేర్చుకొని ఉన్నతమైన విలువలను సామాజిక జీవన వ్యవస్థలో నెలకొల్పుకున్నాం. భారత దేశంలో ఏ చెట్టునడిగినా పుట్టనడిగినా మన సంస్కృతి సంప్రదాయాలను గురించి తెలుస్తుందే.

యుగయుగాలుగా తరతరాలుగా భారత జీవనస్రవంతిలో అతి పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్న విలువలన్నీ డబ్బుకు అమ్ముడు పోవలసిందేనా? డబ్బు తప్ప ఈ ప్రపంచానికి కావలసినదేం లేదా? సభ్యత, సంస్కారం అనే పదాలకు అర్థాలు మారిపోయినట్టేనా? కొత్తతరానికి ఈ తరం నేర్పగలిగేదేమిటి? పడిపోతున్నామని కూడా స్పృహ లేకుండా పాతాళానికి జారిపోతోందే? ఏ కొత్తవిలువలకీ ప్రస్థానం? ఏం సాధించడానికి?

చూపు బుల్లి తెరనే చూస్తున్నా తలలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ మళ్ళీ చూసిన శృంగారమయ సన్నివేశాలనే వేర్వేరు వ్యాఖ్యానాలతో చూపుతూ వస్తున్నాయి దేశీ, విదేశీ చిత్ర భేదాలు లేకుండా. వాటినే చూపిస్తున్నాయి కళ్ళు.

మరి చూడలేక పోయింది ప్రవీణ. నిర్దాక్షిణ్యంగా సెన్సారు కత్తెరకి బలి కావలసిన ఫ్రేములన్నీ చకచకమని మన ఇంట్లోకి, మన డ్రాయింగ్ రూములోకి, కుంటుంబ సహితంగా కూర్చొని ఆసక్తిగా, పనులన్నీ మానుకొని మరీ చూసే వార్తల్లోకి వచ్చేస్తున్నాయి.

అక్కడ ఇంట్లో పిల్లలు, ఇంటికొచ్చిన అతిథులు అందరూ తను కనిపిస్తుందని తప్పనిసరిగా కూచొని చూసే వార్తలు! అందరూ ఇవన్నీ చూస్తున్నారా? అమ్మో! నా పిల్లలు!! నా పిల్లలు ఏవి చూడకూడదని తాపత్రయ పడతానో, ఆంక్షలు పెడతానో అవన్నీ చూస్తూ ఉన్నారా? వాళ్ళని సినిమాలు చూడనివ్వకుండా వార్తలు తెలుసుకోండిరా అని ఎప్పుడూ వార్తలే పెట్టేది కదా? ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ చూశారా? వాళ్ళ వయసుకి, వాళ్ళకి అక్కర్లేని విషయాలన్నీ తన మొహం మీదుగా, తన మాటల మీదుగా వాళ్ళ మనసులోకి ఇంకిపోతున్నాయా??

ఎక్కడో గంట మ్రోగుతోంది. టంగ్… టంగ్… గంటలు… ఒకటి… రెండు… వందలు… వేలు… టంగ్… టంగ్… అంతకంతకూ శబ్దం భరించలేకపోతోంది ప్రవీణ.

ట్రింగ్… ట్రింగ్… హాల్లో ఫోన్ మోగుతోంది. కరెంటు పోయిందని చిరాగ్గా పడుకొని ఉన్న రవీంద్ర ఫోన్ ఎత్తాడు.

“రవీంద్ర గారూ, కొంచెం త్వరగా వస్తారా? ప్రవీణగారు కళ్ళు తిరిగి పడిపోయారు. …………” రిసీవర్ మీద అతని చెయ్యి బిగుసుకుంది.

—————————

పంతుల (పట్రాయని) సుధారాణి గారి నివాసం హైదరాబాదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.కాం డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ డిగ్రీ, ముళ్ళపూడి వెంకట రమణ రచనలు – హాస్య పరికరంగా భాష అనే పరిశోధనాంశంతో ఎం.ఫిల్ డిగ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు – ఒక పరిశీలన అనే అంశంతో పరిశోధన చేసి పి.హెచ్ డి పట్టాలు పొందారు.

సాహిత్యంలో కథాప్రక్రియ అంటే విశేషమైన అభిమానం. కనిపించిన ప్రతి పుస్తకం, పత్రిక చదవడం, అప్పుడప్పుడు చిన్న చిన్న వ్యాసాలు, పుస్తక సమీక్షలు రాయడం ఆమె హాబీలు.

Posted in కథ | Tagged | 14 Comments

తెలుగు – పిల్లలు

-లలిత

తెలుగు నేర్పడం ఎలా?” అన్న పేరుతో రంగనాయకమ్మ గారు కొన్ని తెలుగు పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, కొన్ని సూచనలనూ జోడించి ఒక పుస్తకం వ్రాశారు. రంగనాయకమ్మగారే ఒక పాఠ్య పుస్తకం కూడా రాశారు. చదివిందీ, నేర్పిందీ మర్చిపోయిన తర్వాత మిగిలినదే విద్య అని ఆంగ్లంలో ఒక నానుడి. అది వాడుకుని, ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు మిగిలిన అనుభూతి, నా ఆలోచనలు ఇక్కడ పంచుకుంటున్నాను.

ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్లం ఉండగా ఆంధ్రం ఎందుకనే ధోరణి ప్రబలంగా ఉండడమే కాక, అవసరార్థం ఆంగ్లాన్ని ఆకర్షణీయంగా అందజేస్తున్న తల్లిదండ్రులు, తెలుగును మాత్రం అప్పచెప్పే పద్ధతిలో నేర్చుకోమనడం అన్యాయం కదూ? అసలే తెలుగు ఎందుకు అని అడిగే పరిస్థితులున్నప్పుడు, అది నేర్చుకుంటే తెలుస్తుందని చెప్పడానికైనా నేర్చుకునే పద్ధతులు మెరుగైతే, ఆకర్షణీయంగా తయారైతే, తెలుగులో ఆరోగ్యకరమైన వినోదం అందిస్తే భాషాభ్యుదయానికి అవకాశం లభిస్తుంది కదూ?

పెద్దబాలశిక్షలో ఉన్న అక్షరమాల కాక తెలుగు భాషా పరిచయంలో పిల్లలకు మనం ఇవ్వవలిసిన క్రొత్తదనం ఏదీ లేదని, వాడుకలో లేని కొన్ని అక్షరాలను తొలగించడము, మరీ తక్కువగా వాడే అక్షరాలను అక్షరమాల నుంచి తొలగించి అవసరమైనప్పుడు పరిచయం చెయ్యడము మాత్రమే అవసరం అని సూచించారు. అలాగే తను తయారు చేసిన పాఠ్యపుస్తకంలో అందించారు కూడా. అది అంతగా అభ్యంతరకరం కాదనిపించినా, నా అభిప్రాయంలో ఆ మార్పు కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. వర్ణమాలను యథాతథంగా పరిచయం చెయ్యడంలో తప్పు లేదని నాకనిపిస్తుంది. మనం ఇప్పుడు వాడే భాషలో కొన్ని అక్షరాలు అరుదుగా మాత్రమే ఉపయోగపడినా, భాష నేర్పడం అంటే ఆ భాషలోని సాహిత్యాన్ని ఆస్వాదించే స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సహించడం కూడా అని భావిస్తాను నేను – అందునా మాతృభాషను. కాబట్టి మన ప్రాచీన సాహిత్యాన్ని చదివేటప్పుడు ఈ అరుదైన అక్షరాలు అవసరం అవుతాయి. అంతే కాదు, 26 అక్షరాలు మాత్రమే ఉన్న ఆంగ్ల భాషలోనే ఒకే శబ్దాన్ని పలకడానికి వేరు వేరు సందర్భాలలో వేరు వేరు అక్షరాలు వాడతారు. ఉదాహరణకు k, c మరియు, g, j. ఇంకో ప్రక్క, స్వల్ప తేడాతో ఒకేలా ధ్వనించే “వ” శబ్దానికి రెండు వేరు వేరు అక్షరాలున్నాయి. మరి “ర”, “ఱ” లను ఒకే అక్షరంతో సూచించగలమనుకోవడం ఎందుకు?

అయితే, నాణానికి ఇంకో వైపు, అక్షరానికీ ధ్వనికీ సంబంధం పరిచయం చేసే స్థాయిలో ఈ విచక్షణ చూపించడం ఫరవాలేదనిపిస్తుంది. అంటే, అరుదుగా వాడబడే అక్షరాలతో పదాలు ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టక్కర లేదేమో. కుతూహలం కొద్దీ పిల్లలు అడిగితే జవాబులతో సిద్ధంగా ఉండగలిగేందుకు బోధించేవారికి ఆయా అక్షరాల గురించి కావలిసిన పరిజ్ఞానం ఉండడం మాత్రం అవసరం.

చూస్తున్న కొద్దీ అర్థమైనా కాకపోయినా గుర్తులు మనసులో ముద్రించుకుపోతాయి. తర్వాత నేర్చుకునేటప్పుడు అవి సులభంగా వచ్చేస్తాయి. మూడు నాలుగేళ్ళ పిల్లలకు అక్షరాలు అర్థం కాని పిచ్చి గీతల వంటివే అయినా అక్షరాలతో పాటు వాటి ధ్వనిని ఉపయోగిస్తూ బొమ్మలూ, వస్తువులూ పరిచయం చేస్తే అవి వారి ఎదిగే మెదడుపై ముద్ర వేస్తాయి. అక్షరాభ్యాసం కాని పిల్లలతో కూడా కలిసి కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉంటే వారు బొమ్మలనే కాదు అక్షరాలనూ తెలియకుండానే గుర్తించడం అలవాటు చేసుకుంటారు.

ఏ విషయం నేర్చుకోవడానికైనా ఎన్ని పద్ధతులున్నా, ఎన్ని పరికరాలున్నా, పరిశ్రమ, శ్రద్ధ, క్రమశిక్షణ లేకుండా ఏ విద్యా అలవడదు, ఉపయోగపడదు. పోతన వంటి మహానుభావులకు తప్పితే సామాన్యులకు గురువు ద్వారా కాని విద్య అబ్బదు, అందునా ప్రాథమిక విద్య. పెద్దబాలశిక్షను పద్ధతిగా అనుసరించి క్రమశిక్షణతో నేర్చుకుంటే తెలుగు భాష చక్కగా నేర్చుకోవచ్చు అనడానికి సందేహం లేదు. ఇక క్రొత్తదనం గానీ, ఆకర్షణ గానీ ఎందుకు అన్న ప్రశ్నకు బోలెడన్ని సమాధానాలు. సహజంగానే పిల్లలూ, మారామూ దగ్గిర స్నేహితులు. అత్యవసరమైనదైనప్పటికీ, ఆహారాన్ని కూడా ఆటపాటలతో అందిస్తే తప్ప అంటుకోరు చాలా మంది పిల్లలు. ఇక ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్లం ఉండగా ఆంధ్రం ఎందుకనే ధోరణి ప్రబలంగా ఉండడమే కాక, అవసరార్థం ఆంగ్లాన్ని ఆకర్షణీయంగా అందజేస్తున్న తల్లిదండ్రులు, తెలుగును మాత్రం అప్పచెప్పే పద్ధతిలో నేర్చుకోమనడం అన్యాయం కదూ? అసలే తెలుగు ఎందుకు అని అడిగే పరిస్థితులున్నప్పుడు, అది నేర్చుకుంటే తెలుస్తుందని చెప్పడానికైనా నేర్చుకునే పద్ధతులు మెరుగైతే, ఆకర్షణీయంగా తయారైతే, తెలుగులో ఆరోగ్యకరమైన వినోదం అందిస్తే భాషాభ్యుదయానికి అవకాశం లభిస్తుంది కదూ?

భాషే కాదు, ఏ విషయం నేర్చుకోవాలన్నా చదవడం అనే అలవాటు అవసరం. ఆంగ్లంలో ఎన్ని భారతాలు ఉన్నా ఆంధ్రమహాభారతం చదివితే కలిగే ఆనందం ఆంగ్ల భారతాలు ఎన్ని చదివితే వస్తుంది? చదవాలంటే అక్షర జ్ఞానం కావాలి. అక్షరాలు అలవాటు కావాలంటే కూడా చదవాలి, తల్లి దండ్రులు పిల్లలతో కలిసి పుస్తకాలు చదవాలి.

చదువు అనే నవలలో కొ.కు. గారు రాసినట్టు, చూసి చూసి అక్షరాలు నేర్చుకోవడం నాకు స్వానుభవం – నా విషయంలోను, మా పిల్లల విషయంలోనూ. ఐతే మా పిల్లలు ఆంగ్ల వాతావరణంలో ఉండి ఆంగ్లం నేర్చుకున్నారు. నా కాలంలో అప్పటికింకా టీవీ రాలేదు, ఆంగ్లం అంత అందుబాటులో లేదు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అందుకే ఇప్పుడు తెలుగు నేర్పే పద్ధతులు ఈ కాలానికి తగ్గట్టు ఏర్పరచుకోవాలి. చూస్తున్న కొద్దీ అర్థమైనా కాకపోయినా గుర్తులు మనసులో ముద్రించుకుపోతాయి. తర్వాత నేర్చుకునేటప్పుడు అవి సులభంగా వచ్చేస్తాయి. మూడు నాలుగేళ్ళ పిల్లలకు అక్షరాలు అర్థం కాని పిచ్చి గీతల వంటివే అయినా అక్షరాలతో పాటు వాటి ధ్వనిని ఉపయోగిస్తూ బొమ్మలూ, వస్తువులూ పరిచయం చేస్తే అవి వారి ఎదిగే మెదడుపై ముద్ర వేస్తాయి. అక్షరాభ్యాసం కాని పిల్లలతో కూడా కలిసి కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉంటే వారు బొమ్మలనే కాదు అక్షరాలనూ తెలియకుండానే గుర్తించడం అలవాటు చేసుకుంటారు. నేర్పేది అక్షరాలూ, గుణింతాలూ, వత్తులూ వంటి క్రమంలోనే అయినా.. చదువుతూ, పుస్తకాలూ, పటాలూ, సైను బోర్డులూ వంటి వాటి ద్వారా అన్ని అక్షరాలనూ, పదాలనూ చూపిస్తూ ఉండవచ్చు. అతి సర్వత్ర వర్జయేత్ అని నాణేనికి రెండో వైపున, అక్షరాలు నేర్వక ముందే అచ్చు పుస్తకాలు బొమ్మలు లేనివి, పెద్ద పెద్ద వాక్యాలూ, కఠినమైన పదాలూ, క్లిష్టమైన వాక్య నిర్మాణం, సంక్లిష్టమైన కథా వస్తువూ ఉన్న పుస్తకాలతో మొదలు పెడితే, అందునా ఈ కాలంలో, మొదటికే మోసం రావచ్చు.

తెలుగులో మాట్లాడడం అంటే ప్రతి పదమూ తెలుగే ఉండాలి అన్న అసాధ్యమైన ఆలోచన వల్ల కూడా తెలుగులో మాట్లాడడం అనేది ఒక పెద్ద పనిగా అనిపించడమూ అనుభవమే. తెలుగు నేర్చుకుని సగానికి పైగా ఆంగ్లం వాడటం ఎబ్బెట్టుగా అనిపించినట్టే మాటలు నేర్చే దశలో వాక్యం మొత్తం తెలుగు పదాలతోనే నిర్మించాలనుకోవడమూ దురాశే అనిపిస్తుంది.

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, పిల్లలకు ఆంగ్లం ఎన్ని రకాలుగా, ఎన్ని మాధ్యమాలలో పరిచయం చేస్తున్నామో దానితో పోటీ పడేలా తెలుగుని పరిచయం చేసి వారికి అసలు అభిరుచి ఏర్పడేందుకు దోహదం చెయ్యాల్సిన బాధ్యత తల్లి దండ్రులదే. ఇది భాషాభిమానం ఉన్నవారికీ, భాషతో తమ గుర్తింపు, అస్తిత్వం, వారసత్వం మొదలైనవి ముడిపడి ఉన్నాయనుకునే వారికీ వర్తిస్తుంది. తెలుగు చదవదం, రాయడం అవసరం లేదు, మాట్లాడితే చాలు అనుకునే వారికి ఈ వ్యాసం ద్వారా చెప్పదల్చుకున్నది ఏమీ లేదు. చెయ్యాలి అనుకునే వారే ఆలోచించాలి, తగు చర్యలను చేపట్టాలి కదా? తెలుగు నేర్చుకునే అవకాశం కల్పిస్తే అప్పుడు భాషతో అనుబంధం పెంచుకోవడం ఇక పిల్లల బాధ్యత అవుతుంది అని నా నమ్మకం. అంతేగాని తల్లిదండ్రులం కదా అని వారిదైన భాష నుండి వారిని వేరు చేసే అధికారం మాత్రం లేదనిపిస్తుంది.

తరచూ పిల్లలతో కూర్చుని నెమరు వేసుకుంటుంటే భాష పెరుగుతుంది. అలాగే బంధం కూడా – భాషతోనూ, పిల్లలతోనూ.

ఇక తెలుగులో మాట్లాడడం అనేది కూడా చాలా అవసరమైన విద్యే. సాంకేతికంగా ఎదుగుతూ అందువల్ల సంబంధిత ఆంగ్ల పదజాలాన్ని విరివిగా అరువు తెచ్చుకుంటున్నాము. తెలుగులో మాట్లాడడం అంటే ప్రతి పదమూ తెలుగే ఉండాలి అన్న అసాధ్యమైన ఆలోచన వల్ల కూడా తెలుగులో మాట్లాడడం అనేది ఒక పెద్ద పనిగా అనిపించడమూ అనుభవమే. తెలుగు నేర్చుకుని సగానికి పైగా ఆంగ్లం వాడటం ఎబ్బెట్టుగా అనిపించినట్టే మాటలు నేర్చే దశలో వాక్యం మొత్తం తెలుగు పదాలతోనే నిర్మించాలనుకోవడమూ దురాశే అనిపిస్తుంది. పద్యాలూ, పాటలూ వినడమూ, వినిపించడమూ, అనిపించడమూ కూడా నోరు తిరగడానికి కొంతలో కొంత ఉపయోగపడుతుంది. పద సంపద పెరిగేందుకూ దోహదం చేస్తుంది – ముఖ్యంగా ప్రవాసాంధ్రులకు. ఇక్కడ ఎదురయ్యే సమస్య పిల్లల వయసుకు, ఆలోచనలకు, వారికి ఈ రోజులలో ముఖ్యంగా దైవ, ధార్మిక విషయాలలో కలిగే అవగాహనకు సరిపోయే తెలుగు పద్యాలూ, పాటలూ తెలిసి ఉండడం, లేదా తెలుసుకునే మార్గాలు ఉండడం. అంతర్జాలంలో మాగంటి, ఆంధ్రభారతి, తెలుగుదనం, వంటి వారి సేకరణలు అమూల్యమైన నిధులు. కాస్త శ్రమపడి వెతికితే ఆణి ముత్యాలే దొరుకుతాయి. తరచూ పిల్లలతో కూర్చుని నెమరు వేసుకుంటుంటే భాష పెరుగుతుంది. అలాగే బంధం కూడా – భాషతోనూ, పిల్లలతోనూ.

అంతర్జాలంలో తెలుగు పిల్లల కోసం, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడే లంకెలు ఇక్కడ చూడవచ్చు. అక్కడ ఉండవచ్చనిపించిన లంకెలు తెలిస్తే తెలుగు4కిడ్స్ వారికి తెలియచేయవచ్చు. రంగనాయకమ్మ గారి “తెలుగు నేర్పడం ఎలా” వంటి తెలుగు పుస్తకాలతో సహా పిల్లల పుస్తకాల కోసం, AVKF వారిని సంప్రదించవచ్చు.

———————

ప్రవాసంలో తమ పిల్లలకు తెలుగు భాష పై మక్కువను పెంచుతూ పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తూ, భర్త ప్రోత్సాహ సహకారాలు, తమ పిల్లల ఉత్సాహమే పెట్టుబడిగా, తమ కుటుంబం నుంచి, తమలాంటి అనేక కుటుంబాలకు కానుకగా, తెలుగు4కిడ్స్ ను అందిస్తున్నారు లలిత. తెలుగులో పిల్లల కోసం ఆరోగ్యకరమైన వినోదాన్ని విస్తృతంగా అందించాలన్న తన ఉద్దేశానికి దగ్గరగా ఉన్న BookBox కథలను తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నారు. లలిత ఓనమాలు బ్లాగు రాస్తూంటారు.
Posted in వ్యాసం | 5 Comments

పిల్లీ, కుక్కల మధ్య వైరం ఎలా వచ్చింది?

-కొవ్వలి శ్రావ్య వరాళి

ఆనగనగా ఒక ఊళ్ళో “కు” అనే ఒక పళ్ళ రసం అమ్మే ఆయన ఉండేవాడు. తనకి ఎటువంటి ధనం లేకపోయినప్పటికీ, తనదగ్గర ఒక విశ్వాసపాత్రమైన కుక్కా, ఒక ప్రియమైన పిల్లీ ఉండేవి. అవి ఎంతో ప్రేమగా, పరస్పరం సఖ్యంగా ఉండేవి. అవంటే యజమానికి కూడా ఎంతో ఇష్టం.

అలా ఆలోచిస్తూనే, మరొక సారి గట్టిగా అడిగింది, “నాణెం జాగ్రత్త గానే ఉంది కదా?” కాసేపు ఆగి, “సమాధానం చెప్పు?” అని కసురుకుంది. దీనితో పిల్లి పిచ్చి కోపంతో, ” ఎందుకంత అనుమానం నీకు? నేను నాణాని గట్టిగానే పట్టుకున్నాను.” అంది.

ఒక శీతాకాలపు రాత్రి, ఊరంతా చలికి గడగడ వణుకుతున్నప్పుడు, “కు” దుకాణానికి ఒక ముసలాయన వచ్చి, కాస్తే కాస్త పళ్ళరసం కోసం అడిగాడు. కానీ శీతాకాలం అవ్వడంతో రసం అంతా గడ్డకట్టుకుపోయింది. అయినప్పటికీ కాస్త వెచ్చ చేసి ఆ ముసలాయనకి ఇచ్చాడు, “కు”. ఆ గుక్కెడు రసాన్ని ఎంతో ఆనందంగా తాగి, “కు” చేసిన సహాయానికి బహుమతిగా ఒక ఇత్తడి నాణాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ చిన్న బహుమతికే చాలా ఆనంద పడి, దానిని తన పళ్ళ రసం పోసే గిన్నెలో వేసాడు -తనకు అంతకంటే సురక్షితమైన చోటు ఇంకేముంటుంది?

మర్నాడు లేస్తూనే జనం కొట్టు బయట ఎదురుచూస్తూండటంతో “కు” లోపలికి వెళ్ళి పళ్ళరసం పోసే గిన్నె తెచ్చాడు. ఆశ్చర్యంగా తెరవగానే ఆ గిన్నె నిండుగా ఉంది. ఖాళీ గిన్నె కాస్తా ఎలా నిండిందో మొదట్లో “కు” కి ఏమీ అర్ధం కాలేదు. ఆరోజు రాత్రి పడుకుని ఆలోచిస్తున్నప్పుడు, “కు” కు ఓ ఆలోచన తట్టింది. ఆ ముసలాయన ఇచ్చిన నాణెం వల్ల ఏమైనా జరిగిందా అని ఆలోచించి, మర్నాడు దాన్ని పరీక్షించాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. ఆ నాణెం వేయటం వల్ల పానీయం ఊరుతూ వచ్చింది. దాంతో ఆ నాణేన్ని తనదగ్గర జాగ్రత్తగా ఉంచుకుని, ప్రతి రాత్రి దాన్ని గిన్నెలో వేసేవాడు. పొద్దున్నే పానీయం గిన్నె నిండా ఉండేది. ఇలా చేయటం అలవాటైన “కు” కు ఒకసారి అదృష్టం బాగాలేక, అక్కడకొచ్చిన వారికి, రసంతో పాటు, ఆ నాణాన్ని కూడా ఇచ్చేసాడు. ఎప్పట్లాగే ఆ రాత్రి నాణాన్ని వేద్దామనుకునేసరికి, కనిపించలేదు. ఎంత వెతికినా ఎక్కడా దొరకలేదు. దానితో “కు” బాధతో ఓ మూల కూర్చున్నాడు.

ఆ కుక్కా, పిల్లీ కూడా బాధతో బయట కూర్చుని ఆలోచించి, ఆ నాణేన్ని వెతకటానికి బయలుదేరాయి. అవి రెండూ ఒక గమ్యం లేకుండా అలా అలా వెళ్తూ ఉన్నాయి.

ఒక రోజు, అవి ఓ నది ఒడ్డున ప్రయాణం చేస్తూండగా కుక్కకు హటాత్తుగా ఆ నాణెం వాసన వచ్చింది. ఆ విషయం పిల్లికి చెప్పి, దానితో కలిసి నాణేన్ని వెతకసాగఇంది. కుక్క అటూ ఇటూ తిరుగుతూ నది వైపు వెళ్ళగానే వాసన బట్టి చూసి పిల్లితో “నాణెం నదిలోనే ఎక్కడో ఉంది.” అని చెప్పింది. అది వినగానే పిల్లి అక్కడకు వచ్చి, నదిలోకి వెళ్ళే మార్గం కోసం ఆలోచించ సాగింది. అదృష్టం కలిసి రావటం వల్ల, నది మీద మంచు పేరుకుని ఉంది. దాని మీద ఇద్దరు నడుచుకుంటూ, మధ్యలో ఉన్న పడవ దగ్గరకు చేరుకున్నారు.

పడవ లోకి దిగక ముందే, పిల్లి తన నిశిత దృష్టితో ఆ నాణెం కోసం వెతకడం మొదలెట్టింది. కుక్క నాణెం వాసన పసికట్టడానికి ప్రయత్నం చేస్తో ఉంది. చివరికి ఆ నాణం ఓ చెక్క పెట్టిలో ఉన్నట్లు కుక్క గ్రహించింది. కాని ఆ పెట్టికి తాళం వేసుంది.

ఉపాయం కోసం ఆలోచిస్తూంటే, కొన్ని ఎలుకలు అటువైపు నుండీ వెళ్తూ కనిపించాయి. సహాయం అవసరం గనక, వాటి కాళ్ళు పట్టుకుని సహాయం కోసం అడిగాయి. కానీ ఆ ఎలుకలు దానికి ఒప్పుకోలేదు. “మీరు మా శతృవులు. మేము మీ నుండి తప్పించుకోవటానికి ఎన్నో కష్టాలు పడ్డాం. మా చుట్టాలు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు.. ఒక్కొక్క సారి వారికి మీ నుండి తప్పించుకోవటం ఎంత కష్టం అవుతుందో. మమ్మల్ని ఇంత ఏడిపించే మీకు మేము సహాయం చెయ్యము గాక చెయ్యమ”ని తెగేసి చెప్పాయి. దీనికి ఎంతో బాధతో పిల్లి మరియు కుక్క ఏక కంఠంతో, ” మీరు గనక మాకు సహాయం చేస్తే మేము మళ్ళీ ఎప్పుడూ మీ వెంట పడి ఇబ్బంది పెట్టం” అని మాట ఇచ్చాయి. ఆ మాట విని ఎలుకలు సహాయం చెయ్యటానికి ఒప్పుకున్నాయి. అవి మెల్లగా ఆ చెక్క పెట్టెక్కి వాటి బలమైన పళ్ళతో దాన్ని కొరికి ఆ నాణాన్ని బయటకు తెచ్చాయి. ఎలుకల సహాయానికి కుక్క ఎంతో కృతజ్ఞతలు తెలియ జేసింది. పిల్లికి కూడా ఆనందమే కానీ, ఇంకెప్పటికీ ఎలుకలని తినలేకపోవడం రుచించలేదు.

అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. తన వెచ్చని కిరణాల వల్ల మంచంతా కరిగిపోయి, నది కనపడింది. వచ్చేటప్పుడు మంచు మీద చక్కగా నడుచుకుంటూ వచ్చేసిన పిల్లీ కుక్కకు వెనక్కెలా వెళ్ళాలో తోచలేదు. అప్పుడు కుక్కకు ఓ ఆలోచన తట్టింది. “నాకు కాస్తో కూస్తో ఈత వచ్చు గనక, నువ్వు నాణాన్ని నోటితో పట్టుకుని నా వీపు మీద ఎక్కు, నేను ఒడ్డు వైపు మెల్లగా ఈదుతా”. దీనికి పిల్లి కూడా ఒప్పుకుని, కుక్క వీపు మీద ఎక్కింది. వెంటనే కుక్క ఒడ్డువైపుకు మెల్లగా ఈదటం మొదలెట్టింది. కానీ దానికి దార్లో పిల్లి మీద అనుమానం వచ్చింది. “నాణాన్ని గట్టిగా పట్టుకున్నావా?” అని గట్టిగా అరిచింది. కుక్క ప్రశ్నకు పిల్లి ఎలా సమాధానం చెబుతుంది? దాని నోటిలో నాణెం ఉందిగా! అందుకనే ఏమీ సమాధానం చెప్పకుండా అలా కూర్చుంది. కానీ సమాధానం కోసం ఎదురుచూస్తున్న కుక్కకు మాత్రం అనుమానం పెరిగింది. ‘ఒకవేళ పిల్లి నాణాన్ని పాడేసిందా? లేకపోతే…’ అలా ఆలోచిస్తూనే, మరొక సారి గట్టిగా అడిగింది, “నాణెం జాగ్రత్త గానే ఉంది కదా?” కాసేపు ఆగి, “సమాధానం చెప్పు?” అని కసురుకుంది. దీనితో పిల్లి పిచ్చి కోపంతో, ” ఎందుకంత అనుమానం నీకు? నేను నాణాని గట్టిగానే పట్టుకున్నాను.” అంది. ఇలా అంటోండగా ఆ నాణం కాస్తా పిల్లి నోటిలో నుండి జారి కింద నీటిలో పడిపోయింది. కానీ అదృష్టం వల్ల అప్పటికే ఒడ్డు చేరుకున్నారు గనక పిల్లి వెంటనే నేల మీదకు దూకి పారిపోయింది. విషయం గ్రహించిన కుక్క బాధతో ఇంటికి తిరిగి వచ్చేసింది. దాన్ని చూసిన వెంటనే, “కు” ఆనందంతో, “తిరిగొచ్చేసావా!!! నువ్వు పారిపోయావేమోనని ఎంతో బాధపడ్డా. నాణెం దొరక్కపోతే పోనీలే. దాని గురించి వదిలేయ”మని రెండు మెత్తని మాటలు మాట్లాడాడు.

ఓరాత్రి పూట కుక్కకు, నది ఒడ్డున ఓ జాలరి కనబడ్డాడు. అప్పుడు దానికి ఓ ఆలోచన వచ్చింది. ఓ రెండు చేపలు తెస్తే తన యజమానికివ్వచ్చుగా అనుకుని ఆ జాలరి పట్టిన వాటిలో ఓ పెద్ద చేప తీసుకుని జోరుగా పరిగెట్టుకుంటూ ఇంటికి తిరిగొచ్చింది. ఆ చేపను “కు” తీసుకుని కొయ్యగానే దాని పొట్టలోనుండి నాణెం బయటపడింది. “ఏమిటీ విచిత్రం. నా నాణెం దొరికింది!!! ఆహాహా” అని ఆనందం తో “కు” ఎగిరి గంతులేసాడు. యజమమానిని అంత ఆనందంలో చూసి కుక్క కూడా ఎగరడం మొదలెట్టింది.

“కు” కుక్కకు కృతజ్ఞతలు తెలిపి ఎప్పటికీ తన దగ్గరే ఉంచుకుంటానని మాటిచ్చాడు.

ఈసారి నుండి జాగ్రత్త గా ఉండాలని తన విలువైన నాణేన్ని తీసుకెళ్ళి తన డబ్బులు పెట్టే డబ్బాలో వేసాడు. తను వేసినప్పుడు డబ్బాలో కొన్నే డబ్బులున్నప్పటికీ, మర్నాడు పొద్దున్న చూసినప్పుడు మాత్రం డబ్బా అంతా డబ్బులతో నిండిపోయింది. రహస్యం తెలుసుకున్న “కు”ఎంతో ధనవంతుడై బాగా పేరు తెచ్చుకున్నాడు. పారిపోయిన పిల్లి సంగతి కొస్తే, ఎలాగో నాణెం పోయిందిగా అని, ఎలుకల ఉపకారం మరచిపోయి, వాటి వెంటపడటం మొదలెట్టింది. కుక్క సంగతికొస్తే, పిల్లి చేసిన తప్పుకి దాన్ని వెంటాడటం మొదలెట్టింది. ఇప్పటికీ దాని కుక్క బుద్ధి పోనిచ్చుకుంది కాదు.

——————————————–

శ్రావ్య వరాళి

శ్రావ్య వరాళి

9 వ తరగతి చదువుతున్న శ్రావ్య వరాళి పిన్నవయసులోనే బ్లాగు రాయడం మొదలుపెట్టారు. అభిరుచులు కర్ణాటక సంగీత గాత్రం, కథలు చదవడం, రాయడం. మాగంటి.ఆర్గ్ వారు ప్రతిభ శీర్షికన నిర్వహించిన వ్యాసరచనపోటీకి ఆమె పంపిన వ్యాసం ప్రచురితమైంది. శ్రావ్య తండ్రి ప్రసిద్ధ బ్లాగరి కొవ్వలి సత్యసాయి.

Posted in కథ | Tagged , | 9 Comments

మృతజీవులు – 20

-కొడవటిగంటి కుటుంబరావు

“ఇంతకూ ఏమంటావు? చచ్చినవాళ్ళను పందెంలో గెల్చుకోవా?” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“ఆడనని చెప్పానుగదుటోయ్. కావలిస్తే డబ్బిచ్చి కొంటాను.”

“అదుగో ఆ పావును” అని అంటూండగానే, చిచీకవ్‌కు నేరుగా తన ముక్కు కిందనే రాజు కావడానికి సిద్ధంగా ఉన్న మరొక పావు కనిపించింది. అతను లేచి నిలబడుతూ, “లాభం లేదు, నీతో ఆడటం అసంభవం. ఒకేసారి మూడెత్తులు వేస్తావా?” అన్నాడు.

“అమ్మటం నాకిష్టం లేదు. అది స్నేహితుడు చేయవలసిన పని కాదు. అటువంటివాటి నుంచి తుచ్ఛమైన డబ్బు చేసుకోవటం నాకిష్టం లేదు. జూదమాడటం అంటే దాని దారివేరు. ఏమైనా ఒక్క ఆటవేద్దాం పట్టు.”

“అదివరకే చెప్పాను, నే నాడను.”

“ఆ ఉద్దేశం మార్చుకోవా?”

“మార్చుకోను.”

“పోనీ డ్రాఫ్ట్స్ ఒక ఆట వేద్దాం. గెలిచావా, వాళ్ళందరినీ తీసుకో. జనాభా లెక్కల్లోంచి కొట్టివెయ్యాలిసినవాళ్ళు నా దగ్గిర కొల్లలుగా ఉన్నారు తెలుసా? ఒరేయ్, పర్ఫీరి, ఆ డ్రాఫ్ట్స్ బోర్డు పట్రా.”

“ఎందుకు శ్రమ? నే నాడను.”

“ఇది పేకాట కాదుగా. ఇందులో అదృష్టానికి గాని, మోసానికి గాని అవకాశం లేదు. అంతా తెలివితేటల మీద ఆధారపడి ఉంది. ముందే చెబుతున్నాను, ఈ ఆట నాకు కొంచెం కూడా రాదు. నిజానికి నువు నాకు అదనపు అవకాశ మివ్వాలి.”

చిచీకవ్ తనలో, ‘ఆడితేనేం? వీడితో డ్రాఫ్ట్స్ ఆడతాను. నేను అంతో ఇంతో ఆడగలవాణ్ణే, ఈ ఆటలో వీడు నన్ను మోసగించలేడుగా’ అనుకున్నాడు.

“సరే పోనీ, డ్రాఫ్ట్స్ ఆడతాను” అన్నాడతను.

“నేను చచ్చిపోయినవాళ్ళను పందెం కాస్తాను. నువు నూరు రూబుళ్ళను కాయి.”

“ఎందుకూ? యాభై చాలు”

“కాదు, యాభై రూబుళ్ళు ఒక పందెమేనా? కావలిస్తే నా పందెంలో ఒక కుక్కపిల్లనో, నీ బంగారు గొలుసులు తగిలించటానికి ఒక బంగారు పతకాన్నో చేర్చుతానులే.”

“సరే” అన్నాడు చిచీకవ్.

“నా కేమవకాశం ఇస్తావు?” అని నజ్‌ద్ర్యోవ్ అడిగాడు.

“దేనికి? అదేమీ కుదరదు”

“కనీసం నాకు మొదటి రెండు ఎత్తులైనా ఇవ్వాలి.”

“ఇవ్వను. నేనైనా ఆటే ఆడగలవాణ్ణికాను.”

“నీ ఆడలేకపోవటం ఏమిటో నాకు తెలుసులే” అంటూ నజ్‌ద్ర్యోవ్ ఒక పావును కదిపాడు.

“నేను వీటిని తాకి ఎంతో కాలమయింది.” అంటూ చిచీకవ్ కూడా ఒక పావు జరిపాడు.

“నీ ఆడలేకపోవటం ఏమిటో నాకు తెలుసులే” అంటూ నజ్‌ద్ర్యోవ్ ఇంకో పావును జరుపుతూ చొక్కా చేతితో మరొక పావును ముందుకు నెట్టాడు.

“నేను వీటిని తాకి ఎంతో కాలమయింది…ఆఁ ఆఁ! అదేమిటి? దాన్ని వెనక్కు పెట్టు!” అన్నాడు చిచీకవ్.

“దేన్ని?”

“అదుగో ఆ పావును” అని అంటూండగానే, చిచీకవ్‌కు నేరుగా తన ముక్కు కిందనే రాజు కావడానికి సిద్ధంగా ఉన్న మరొక పావు కనిపించింది. అతను లేచి నిలబడుతూ, “లాభం లేదు, నీతో ఆడటం అసంభవం. ఒకేసారి మూడెత్తులు వేస్తావా?” అన్నాడు.

ఇలా చెయ్యటం మేలే అయింది, ఎందుకంటే నజ్‌ద్ర్యోవ్ చెయ్యి విసరనే విసిరాడు.. మన కథానాయకుడి అందమైన, పొంగే బుగ్గలకు తీరని అపచారం జరిగి ఉండేది, కాని అదృష్టవశాత్తూ అతను ఆ దెబ్బ తప్పించుకుని, నజ్‌ద్ర్యోవ్ చేతులను తన బలమైన రెండు చేతులా గట్టిగా పట్టేసుకున్నాడు.

“మూడేవీ? పొరపాటు, ఒకటి పొరపాటున జరిగింది. కావాలిస్తే వెనక్కు పెట్టేస్తాను.”

“ఆ ఇంకోటి ఎక్కణ్ణుంచి వచ్చింది?”

“ఏ ఇంకోటి?”

“రాజు కావడానికి సిద్ధంగా ఉన్నదే అదీ”

“అరె, అప్పుడే మరిచిపోయావా?”

“లేదు నాయనా. నేను ప్రతి ఎత్తూ లెక్కిస్తూనే ఉన్నాను, నాకన్నీ జ్ఞాపకం ఉన్నాయి. నువు ఇప్పుడే దాన్ని అక్కడ పెట్టావు. అది ఉండవలసింది ఇక్కడా!”

“ఏమిటి? ఎక్కడ? నువు భలే కల్పనలు చేస్తావే!” అన్నాడు నజ్‌ద్ర్యోవ్, కందగడ్డలాగా అయిపోతూ.

“లేదు నాయనా! కల్పనలు చేసేది నువ్వేనని తెలుస్తూనే ఉంది, అయితే నీకు నమ్మేలాగా చేసే తెలివి లేదు.”

“నేనంటే ఏమిటని నీ ఉద్దేశం? మోసపుచ్చుతానంటావా?”

“నువ్వంటే నాకే ఉద్దేశమూ లేదు. నీతో ఎన్నడూ ఆడను.”

“ఆట మధ్య ఎలా మానేస్తావ్?” అన్నాడు నజ్‌ద్ర్యోవ్, రోషం హెచ్చుతూ.

“నువు మర్యాదగా ఆడనప్పుడు అవశ్యం మానెయ్యగలను”

“అది అబద్ధం. నువ్వామాట అనకూడదు.”

“లేదు నువ్వే అబద్ధాలాడుతున్నావు”

“నేను మోసం చెయ్యలేదు. నువు ఆట మానటానికి వీల్లేదు. ఆట పూర్తి చెయ్యవలసిందే.”

చిచీకవ్ నిబ్బరంగా, “నువు నాచేత ఆడించలేవు!” అంటూ పావులన్నీ కలిపేశాడు.

నజ్‌ద్ర్యోవ్ మొహమంతా ఎర్రగా చేసుకొని ఎంతగా మీదికి వచ్చాడంటే, చిచీకవ్ రెండడుగులు వెనక్కు వేశాడు.

“నీచేత ఆడిస్తాను. పావులు కలిపేస్తే అయిపోయిందనుకున్నావా? నాకు ఎత్తులన్నీ జ్ఞాపకం ఉన్నాయి. ఎక్కడి పావులక్కడ పెట్టేస్తాం!”

“ఎందుకోయ్, అదంతా అయిపోయింది. నేను నీతో ఎన్నటికీ ఆడను.”

“అయితే ఆడవా?”

“నీతో ఆడటం ఎంత కష్టమో నీకు మాత్రం తెలియదా?”

“ఆడతావా లేదా? సూటిగా చెప్పెయ్యి.” అంటూ నజ్‌ద్ర్యోవ్ ఇంకా మీదికి వచ్చాడు.

“లేదు” అంటూ చిచీకవ్, ఎందుకైనా మంచిదని చేతులు మొహానికి అడ్డంగా పెట్టుకున్నాడు. చూడగా పరిస్థితి తనకు చాలా అపాయకరంగా కనబడింది. ఇలా చెయ్యటం మేలే అయింది, ఎందుకంటే నజ్‌ద్ర్యోవ్ చెయ్యి విసరనే విసిరాడు.. మన కథానాయకుడి అందమైన, పొంగే బుగ్గలకు తీరని అపచారం జరిగి ఉండేది, కాని అదృష్టవశాత్తూ అతను ఆ దెబ్బ తప్పించుకుని, నజ్‌ద్ర్యోవ్ చేతులను తన బలమైన రెండు చేతులా గట్టిగా పట్టేసుకున్నాడు.

నజ్‌ద్ర్యోవ్ పట్టు విడిపించుకునేటందుకు తీవ్రంగా పెనుగులాడుతూ “పర్ఫీరి, పవ్లూష్క!” అని కేకలు పెట్టాడు.

ఈ కేకలు వింటూనే చిచీకవ్ నజ్‌ద్ర్యోవ్ చేతులను వదిలి పెట్టేశాడు.

ఈ దృశ్యాన్ని నౌకర్లు చూసిపోతారనీ, అతన్ని పట్టుకున్నందువల్ల ప్రయోజనమేమీ లేదని తోచి అతను అలా చేశాడు. ఆ క్షణంలోనే పర్ఫీరి, వాడి వెనకగా పవ్లూష్కా ప్రవేశించారు. ఈ రెండోవాడు ఆజానుబాహువు, వాడితో దెబ్బలాట పెట్టుకోవటం కూడనిపని.

“ఆట పూర్తి చేస్తావా, చెయ్యవా? ఒక్కటే మాట చెప్పెయ్యి.” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“ఆట పూర్తి చెయ్యటం అసంభవం.” అంటూ చిచీకవ్ కిటికీలో నుంచి బయటికి చూశాడు. అతని బండి సిద్ధంగా ఉన్నది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు బండిని మెట్ల వద్దకు తెద్దామని సేలిఫాన్ ఎదురుచూస్తున్నాడు. కాని ఆ మొద్దుముండాకొడుకులు వాకిలికి అడ్డంగా ఉండగా ఈ గదిలో నుంచి తాను బయటపడే యోగం లేదు.

“అయితే ఆట పూర్తి చెయ్యవన్నమాట!” అన్నాడు నజ్‌ద్ర్యోవ్, అతని మొహం కుంపటిలాగా ఉన్నది.

“నువ్వు మర్యాదస్తుడిలాగా ఆడినట్టయితే ఏమోగాని, ఇలా నావల్ల కాదు.”

“వల్లకాదా, స్కౌండ్రల్! ఓడిపోతున్నాని తెలియగానే వల్లగాక పోయిందిగాదూ? కొట్టండ్రా!” అంటూ పర్ఫీరి, పవ్లూష్కల కేసి ఉద్రేకంతో అరచి, తన పైప్ చేతపట్టుకున్నాడు. చిచీకవ్ పారిపోయాడు. అతను ఏదో అనబోయి పెదవులు కదిల్చాడుగాని నోట శబ్దమేమీ రాలేదు.

“కొట్టండ్రా!” అంటూ దుర్భేద్యమైన కోటను పట్టుకునేవాడిలాగా, నజ్‌ద్ర్యోవ్ పైప్ చేతబట్టుకుని, అరుస్తూ ముందుకురికాడు; అతనికి ముచ్చెమటలు పోస్తున్నాయి. ఒళ్ళు తెలియని వీరావేశంలో కొందరు సైనికాధికారులు తమ కింది సైనికులను ఇలాగే, “పదండ్రా!” అని ఉత్తరువులిస్తారు; వాళ్ళ ఉత్తరువులను యుద్ధ పురోగమన సమయంలో పాటించవద్దని అదివరకే అధికారులు రహస్యపు హెచ్చరికలు జారీ చేసి ఉంటారు. అయితే ఆ సైనికాధికారికి వీరావేశం ఎక్కి ఉంటుంది, వాడి బుర్రంతా తిరిగిపోతూంటుంది. వాడికి సువోరవ్ కళ్ళలో మెదులుతూంటాడు, వాడికి వీరోచితమైన పనులు చేయాలని ఉంటుంది. దాడికి గాను తయారు చేసిన వ్యూహమంతా తాను పాడు చేస్తున్నట్టు గాని, దుర్భేద్యమైన కోటయొక్క ఆకాశమంత ఎత్తు గల గోడల వెనక అసంఖ్యాకమైన ఫిరంగులు బారులు తీర్చి ఉన్నాయని గాని, తన సైనికులు వట్టిపుణ్యానికి బూడిద అయిపోతారని గాని, తన ప్రాణాలను హరించనున్న తుపాకీ గుండు అదివరకే గాలిలో ఎగిరి రివ్వున వస్తున్నదని గాని గ్రహించకుండా వాడు “పదండ్రా!” అంటాడు. అయితే నజ్‌ద్ర్యోవ్ దుర్భేద్యమైన కోటమీద దాడి చెయ్యటానికి తన సైనికులను పంపే వీరావేశోద్రిక్తుడైన అధికారిలాగా ఉన్నాడన్న మాటేగాని, అతను దాడిచెయ్య సిద్ధపడే కోట మాత్రం దుర్భేద్యంగా లేదని అంగీకరించాలి. ఈ దాడికి గురికానున్న వ్యక్తి ఎంత భయగ్రస్తుడై పోయాడంటే అతని గుండె మడమల్లోకి దిగజారిపోయింది. అతను ఆత్మరక్షణకు గాను తీసుకున్న కుర్చీని నౌకర్లు లాగెయ్యటం కూడా అయిపోయింది; అతను దాదాపు చచ్చిపోయినట్టయిపోయి, కళ్ళు మూసుకుని, ఏ క్షణాన తనకు ఆతిథ్యం ఇచ్చినవాడి పైప్ తనను చుర్రున కాలుస్తుందో అనుకుంటున్నాడు; మరొక క్షణం అయితే అతనికి ఏమి మూడి ఉండేదో దేవుడికి ఎరుక; కాని విధి అతని పక్కలనూ, భుజాలనూ ఏపుగా పెరిగిన శరీరాన్నీ రక్షించ నిర్ణయించింది. అకస్మాత్తుగానూ, తలవని తలంపుగానూ, ఆకాశం నుంచి ఊడిపడ్డట్లుగా, చిరుగంటలు మోగించుకుంటూ ఒక బండీ వచ్చి చక్రాల చప్పుడుతో మెట్లవద్ద ఆగింది. శ్రమించిన గుర్రాలు ముక్కులతో చేసే శబ్దమూ, గాలిపీల్చే చప్పుడూ ఆ గదిలోకూడా ప్రతిధ్వనించింది. అందరూ అప్రయత్నంగా కిటికీలోనుంచి బయటికి చూశారు. ఒక మీసాలు గల వ్యక్తి అర్థసైనిక దుస్తులు ధరించి బండిలో నుంచి దిగాడు. ఆయన అవతలి హాలులో విచారించి లోపలికి ప్రవేశించే సమయానికి, చిచీకవ్ ఇంకా తనకు కలిగిన భీతినుంచి తెప్పరిల్లుకోలేదు. మానవమాత్రునికి దాపురించదగిన అత్యంత కరుణామయమైన స్థితిలో ఉన్నాడతను.

“ఇక్కడ ఉన్నవారిలో నజ్‌ద్ర్యోవ్ గారెవరో తెలుసుకోవచ్చునా?” అంటూ కొత్తవాడు, చేతిలో పైప్ పట్టుకుని నిలబడి ఉన్న నజ్‌ద్ర్యోవ్ కేసీ, అత్యంత దైన్యం నుంచి అప్పుడే బయటపడుతున్న చిచీకవ్ కేసీ అయోమయంగా చూశాడు.

“తమరెవరో నేను మొదట తెలుసుకోవచ్చునా?” అంటూ నజ్‌ద్ర్యోవ్ కొత్తమనిషిని సమీపించాడు.

“నేను పోలీసు అధిపతిని”

“మీకేం పని ఇక్కడ?”

“మీమీది ఫిర్యాదు పరిష్కారమయినదాక మిమ్మల్ని ఎరెస్టు చేస్తున్నానని చెప్పటానికి వచ్చాను.”

“ఏమిటిదంతా? ఏం ఫిర్యాదు?”

“తమరు నిషాలో ఉండి మక్సీమవ్ అనే పెద్దమనిషిని కొట్టారన్న ఫిర్యాదు.”

“అది అబద్ధం! నేను మక్సీమవ్ అనే పెద్దమనిషిని చూడనైనా లేదు.”

“అయ్యా! నేను ఆఫీసరునని మనవి చేస్తున్నాను. మీరు మీ నౌకర్ల దగ్గిర అలా మాట్లాడండి, నా దగ్గిర కాదు.”

ఇంతలో చిచీకవ్ నజ్‌ద్ర్యోవ్ ఏమనేది వినకుండానే, చప్పున తన టోపీ తీసుకుని పోలీసు అధిపతి వెనకగా బయటి మెట్లవద్దకు చేరుకుని, బండిలో ఎక్కికూచుని, సేలిఫాన్‌తో బండిని సాధ్యమైనంత వేగంగా తోలమన్నాడు.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 20

2008 ఆగస్టు గడిపై మీమాట

ఆగస్టు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 జూలై గడి, సమాధానాలు
2. 2008 జూన్ గడి, సమాధానాలు
3. 2008 మే గడి, సమాధానాలు
4. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
5. 2008 మార్చి గడి, సమాధానాలు
6. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
7. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
8. 2007 నవంబరు గడి, సమాధానాలు
9. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
10. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
11. 2007 జూలై గడి, సమాధానాలు
12. 2007 జూన్ గడి, సమాధానాలు
13. 2007 మే గడి, సమాధానాలు 4
14. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
15. 2007 మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 8 Comments

జూలై గడి సమాధానాలు, వివరణలు

గడి సులువుగా ఉండడం మూలాన కాబోలు, ఈసారి కాస్త ఎక్కువ పూరణలే వచ్చాయి. చాలామంది చాలా రోజులు ముందుగానే పూరించి, పంపించి మరో కొత్త గడి ఇచ్చెయ్యమని మారాం కూడా చేసారు 🙂 మొత్తం వచ్చిన పూరణలు 13. కానీ అన్నీ సరిగ్గా పూర్తిచేసిన వాళ్ళు ఒక్కరూ లేరు! చాలామంది “పంచాస్యచాపం” సరిగా ఎక్కుపెట్టలేక పోయారు. మరికొంతమంది మేడం గారిని గుర్తించడంలో పాదరసంలో బదులు పప్పులో కాలేసారు. ఒక తప్పుతో రాసి పంపిన వాళ్ళు స్వరూప్ కృష్ణ, సూర్య ప్రకాష్, ఆదిత్య. 2 తప్పుల వాళ్ళు జ్యోతి, చిట్టెళ్ళ కిరణ్, సుజాత (మనసులో మాట).

మిగతావాళ్ళ వివరాలు:

  1. సుగాత్రి – 3 తప్పులు
  2. మల్లంపల్లి – 4 తప్పులు
  3. సుధారాణి పట్రాయని – 5 తప్పులు
  4. రవి (బ్లాగాడిస్తా) – 4 తప్పులు
  5. స్నేహ – 10 తప్పులు
  6. కృష్ణుడు – 13 తప్పులు
  7. దైవానిక – 4 తప్పులు (చామ, చాట రెండు తప్పులుగా పరిగణించాను)

-కామేశ్వర రావు.

1

2

3గుం

4 రె

5

6 రా

7 దే

8

స్తి

9 నా

పు

10 రం

11 ట్టు

12

హి

13

14

మే

ణె

15

16

గో

విం

దం

ర్యా

17 తు

షా

ము

18 ని

రు

డు

ర్భు

19

యిం

చు

20తో

21

రా

జం

22 ని

23న్నా

24మిం

చు

25క్యూ

26చే

27కృ

ష్ణా

ము

28కుం

దా

ము

29 రా

రీ

న్న

30 బా

పా

తు

31

రీ

32సం

33చా

34 బూ

చా

డు

35 సీ

తి

36వా

ర్లీ

ర్య

37

యూ

ఖం

38పం

చా

స్య

చా

పం

39 కొ

40ర్మ

జా

41కో

లా

ప్లిన్

42మ్మ

43 కా

ము

ని

వై

రి

44ము

45నా


వివరణలు:

అడ్డం
======

1. One (1) – ఒ (45 అడ్డం చూడండి)

4. Two (1) – రె (45 అడ్డం చూడండి)

5. ఇదేరా మేరా ఉద్దేశాలు (3) – ఇరాదే. హిందీలో ఉద్దేశాలు ఇరాదే, “ఇదేరా” అనాగ్రాము.

8. నావూరేనుగు (5) – హస్తినాపురము.

12. ఎటుచూసినా ఒకలాగే ఉంది, ఏమిటీ మాహాత్మ్యం! (3) – మహిమ

14. వెంకటేశం చెగోడీలు కోరుకొనే మంత్రం (2) – చమే. కన్యాశుల్కంలో వెంకటేశం “చేగోడీ చమే, గడ్డ పెరుగూ చమే, కందిగుండా చమే” అంటూ చమక పారాయణం చేస్తాడు.

15. ముసలి వైయాకరణుని చూసి ఆచార్యులవారు పొంగించిన వైరాగ్య కవిత్వాన్ని యిది“గో విందాం”. (2,3) – భజ గోవిందం.

17. హుషారుగొలిపే మంచు (4) – తుషారము

18. పేదవాడికున్న ఒకే ఒక Title, అతడిని ఇంకా పేదవాణ్ణి చేస్తుంది ! (2) – నిరు.

19. 16 నిలువులోనే ఉంది గెలుపు (3) – జయించు. 16 నిలువు “జనియించు”లో ఉన్నది.

20. పాపం పసివాడు, ప్రథమా విభక్తులని కోల్పోయాడా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? (3) – తోటరా. పాతాళభైరవిలో ప్రేమకోసం వలలో పడిన పాపం పసివాడు తోటరాముడు. ప్రథమా విభక్తులు “డు ము వు లు” లలో “ముడు”లను కోల్పోయాడు.

22. నన్నూ రేపూ కాదు, మరి…? (2) – నిన్నా. నిన్ను+ఆ, నిన్న+ఆ

24. ఇంచుమించు సగం చూస్తే చాలదూ, ఆకాశంలో మెఱుపు కనపడ్డానికి (2) – మించు. మించంటే మెరుపు. “ఇంచుమించు”లో సగం.

26. ఈ కూర తింటే అర్జున చిరునామా గుర్తుకు రావలసిందే! (2) – చేమ. అర్జున చిరునామా “విజయ విలాసం”. దాన్ని రాసిన కవి చేమకూర వేంకటకవి.

27. కలియుగ వేంకటేశుని ఇన్ని పేర్లతో పిలవబోతున్నారా? అంతా ఆ పాండురంగని లీల! (2, 3, 3) – కృష్ణా ముకుందా మురారీ. ఈ పేరుతో వెంకటేష్ సినిమా రాబోతోందిట.

30. మధ్యలో సాగిన అదో తరహా (3) – బాపాతు. బాపతు అంటే తరహా. మధ్యలో సాగింది.

31. 19 నిలువును చుట్టుకున్న బంగారపు నూలుపోగు (2) – జరీ. 19 నిలువు మొదటి చివరి అక్షరాలు కలిపితే వస్తుంది.

32. అమ్ము(డు) పోయిన దీపావళి పటాసులు (2) – సంచా. బాణా సంచా అంటే దీపావళి పటాసులు. అమ్ము అంటే బాణం.

34. బుల్లిపెట్టెలో దాగిన బుచ్చీ దొరంటే, అమ్మో నాకు బయ్యం! (3) – బూచాడు. “బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో దాగాడు” బడిపంతులు సినిమాలో పాట. బూచాడన్న పదం “బుస్సీ” దొరనుంచి వచ్చిందంటారు.

35. కార్పెట్టునలా గడబిడగా చుట్టేసావేం? (3) – తివాచీ లేదా తివాసీ గడబిడ అయ్యింది.

37. యజ్ఞం మధ్యలోకి నువ్వు వేంచేస్తే కాంతి కిరణం ప్రసరించదూ! (3) – మయూఖం. మఖం అంటే యజ్ఞం, మధ్యలో “యూ” (నువ్వు) వస్తే మయూఖం, అంటే కిరణం.

38. శివధనుస్సుని ఎటునుంచి ఎక్కుపెట్టినా ఒకటేనట! (5) – పంచాస్యచాపం. అంటే శివధనుస్సు. ఎటునుంచి చూసినా ఒకటే పదం.

40. ప్రతివింధ్య జనకా, ఆ తడబాటేలనయ్యా ? 28 నిలువుని చూసేసరికి నువ్వాడిన అబద్ధం గుర్తుకు వచ్చిందా ! (3) – ర్మజాధ. ధర్మజా తడబడింది. ధర్మ రాజు కొడుకు పేరు ప్రతివింధ్యుడు. ధర్మ రాజు “అశ్వత్థామ హతః, కుంజరః” అని అబద్ధం కాని అబద్ధం చెప్ప్తాడు కదా.

41. శ్రీదేవి శారదనిలాగే పిలుస్తుంది, కైటభదైత్యమర్దనుని మీద ఒట్టు! (3) – కోడలా. లక్ష్మీ దేవికి సరస్వతి కోడలవుతుంది, బ్రహ్మ విష్ణుమూర్తి కొడుకు కాబట్టి. “కైటభదైత్య మర్దనుని గాదిలి కోడల” అని పోతనగారి “కాటుక కంటినీరు” పద్యంలో వస్తుంది.

42. నీ ఉత్తరం వెనక్కి తిరిగివచ్చిందని ఎందు“కమ్మ“ అంత విచారం! (2) – మ్మక. ఉత్తరానికి అచ్చ తెలుగు పదం కమ్మ. అది వెనక్కి తిరిగింది.

43. కందర్పదర్పహరునికి ఎందు “కా మునితో“ శత్రుత్వం? (3,2) – కాముని వైరి. కందర్పహరుడు శివుడు. కందర్పుడంటే మన్మథుడు. కాముడన్నా అతడే.

44. Three (1) – ము లేక మూ. 45 అడ్డం చూడండి.

45. Four. క్లుప్తంగా నాలుగంకెలు లెక్కబెట్టడానికి ఇంత చచ్చే “చావా”! “బ్లాగా”నే ఉంది సంబడం! (4) – న లేక నా. 1, 4, 44, 45 కలిపి నాలుగక్షరాల ఒకే పదం “ఒరెమున”. మన బ్లాగరు చావా కిరణ్ గారి బ్లాగు పేరు. అది “ఒకటి రెండు మూడు నాల్గు”కి abbreviation (అని అతనే చెప్పుకున్నారు). ఇలా కొన్ని ఆధారాలు కలిపి ఒకే పదం రావడం గడిలో చేసే విచిత్రాలలో ఒక రకం.

నిలువు
=====

2. దేవుడంటే నమ్మకమున్నవారి దగ్గరున్న సంపద (2) – ఆస్తి. దేవుడంటే నమ్మకమున్న వాళ్ళని ఆస్తికులు అంటారు.

3. 15 అడ్డంలో ఉన్నవాడు ఇందులో చేరితే ఊరూపేరూ లేకుండా పోతాడు! (2) – గుంపు. 15 అడ్డంలో ఉన్నవాడు గోవిందుడు. “గుంపులో గోవిందం” అన్నది ఊరూపేరూ లేనివాడిని సూచించే జాతీయం.

6. లంకపై దాడిచేసింది ఎవరితో? మురళీమోహన్ సరితా పిల్లలతోనా! (2,3) – రామ దండుతో. “రామ దండు” మురళీమోహన్ సరితా నటించిన సినిమా.

7. శరీరమున్నవాడు ఇలాగే అడుగుతాడు (2) – దేహి. శరీరమంటే దేహము. దేహి అంటే ఇమ్మని అడగడం.

8. మమ్మల్ని షాగారు వెంటాడుతునే ఉంటారెప్పుడూ (3) – హమేషా. “మమ్మల్ని” హిందీలో “హమే”. హమేషా అంటే ఎప్పుడూ అని కదా అర్థం.

9. అటూ ఇటూ బొమ్మా బొరుసూ (3) – నాణెము.

10. తాను ప్రేమించినది ప్రా“రంభ”ములోనే ఉందంటాడు మొండివాడు (2) – రంభ. “తా వలచినది రంభ” అని పట్టుపట్టేది మొండివాడు.

11. రోకటిపోటు తగిలి చెల్లాచెదరయిపోయింది! (4) – ట్టుగోరుచు. గోరుచుట్టు చెల్లాచెదరయ్యింది. “గోరుచుట్టుపై రోకటి పోటు” అన్నది సామెత.

13. రఘుకులేశుని బ్రదరు చాలా తెలివైనవాడు. హద్దులోనే ఉంటాడు (3,3) – మర్యాద రామన్న. మర్యాద అంటే హద్దు అని అర్థం. రామ+అన్న.

14. గణపతికీ రేఖా గణితానికీ లింకా! మరీ చతురులండీ మీరు! (4) – చతుర్భుజం. “శుక్లాంబరధరం” శ్లోకంలో వస్తుందని అందరికీ ఈపాటికి తెలిసే ఉంటుంది. Geometry (రేఖా గణితం)లో కూడా మనకి కనిపిస్తుంది కదా.

16. నిజముగ మా యింట ఉదయించుము (5) – జనియించు. ఉదయించు అంటే పుట్టడమని కూడా అర్థం. మొత్తం ఆధారంలో “జనియించు” అన్న అక్షరాలు ఉన్నాయి.

19. ఆ నేల రాస్తాని ఎంత సాగదీసినా ఏం లాభం లేదు. అదెప్పుడో రద్దయిపోయింది (4) – జమిందారీ. జమీన్ – నేల. దారి – రాస్తా.

21. ఇంతున్న వినాయకుడి చెవిని అలా మెలితిప్పేసారేమిటి! ఎందపరియం ఇంద… (2) – చేట. వినాయకుడిని “శూర్పకర్ణుడు” అంటారు. “శూర్పం” అంటే చేట అని అర్థం. సరే ఆధారంలో రెండో భాగం నాకన్నా పూరకులకే బాగా తెలుసు!

22. అంతో ఇంతో నిషాణాగల నేర్పరి! (4) – నిష్ణాతుడు.

23. బుజ్జిగాడలా పల్టీ కొట్టాడానికి కారణమే“మున్నా”ది చెప్మా? (2) – న్నాము. మున్నాయే బుజ్జిగాడని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా.

25. పాదరసంలో దాగిన మేడం (2) – క్యూరీ. “మెర్క్యూరీ”లో ఉన్నారు. “మేడం క్యూరీ” ప్రఖ్యాత శాస్త్రవేత్త. దీనికి కొందరు “మేరీ” అని రాసారు. మేరీని “మేడం మేరీ” అనరు కదా.

27. కుంభపౌత్రుడు ఇతని భాగినేయుడే ! దయగల గురువు (4) – కృపాచార్య. కుంభపౌత్రుడంటే అశ్వత్థామ (కుంభ పుత్రుడు ద్రోణుడు కాబట్టి). భాగినేయుడంటే మేనల్లుడు (భగిని – సోదరి. ఆమె కుమారుడు). “కుంభ పౌత్రా! కృపాచార్య భాగినేయా! కించిత్కాలమోపిక పట్టుము. అందరమూ పోవచ్చును” అని కృష్ణ రాయబారంలో డైలాగు.

28. ఈ ఏనుగుల గుంపులో అయిదే ఏనుగలు! తెలీకపోతే జర తెనాలివారినడగండి!(3,3) – కుంజర యూధము. “కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్” అన్న సమస్యకి తెనాలి రామకృష్ణుడు చేసిన పూరణలో పాండవులే కుంజర యూధము.

29. అతిగ రాగాలు పలికే ఫలవైరికి కార్టూన్లు వెయ్యడం కూడా వచ్చా ! (3,3) – రాగతి పండరి. కార్టూనిస్టు. “పండు + అరి” – “పండరి”.

30. నువ్విలా పిలిస్తే ఒక నాయకుడూ ఇద్దరు నటులూ పలుకుతారురా అబ్బాయీ (2) – బాబూ.

33. నవ్వుల చాచాని చూడ్డానికి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళుకూడా ఇష్టపడతారు (2,2) – “చా”ర్లీ “చా”ప్లిన్.

36. ఓరీ వాగుడుకాయా, నీతో ఎ“లా చావా”లిరా! (3) – వాచాలా. వాచాలుడంటే ఎక్కువ (అనవసరంగా) మాట్లాడే వాడు.

37. చిరంజీవి అల్లుడైతే తమాషా అనుకున్నారా! (3) – మజాకా.

39. తరుణీ, ఆ తరుశాఖను తీసుకొ అమ్మ (2) – కొమ్మ. కొమ్మ అంటే అమ్మాయి, తరుశాఖా, తీసుకో అన్న మూడర్థాలూ ఉన్నాయి.

41. పేరుమాటెలా ఉన్నా ఈవిడ గొంతు సరళంగా ఉంటుందంటే ఎవరూ ఒప్పుకోరు (2) – కోవై. కోవై సరళ గొంతు గురించి మరి చెప్పక్కరలేదు.

Posted in గడి | Tagged | 6 Comments

జాలంలో శ్రమదానం

-వీవెన్

ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చూడకుండా, మన (సామూహిక) అవసరాలను తీర్చుకోవడానికి కృషిచెయ్యడమే శ్రమదానం. ఈ శ్రమదానంలో ఓ ముఖ్య అంశమేమంటే, మన సమస్యలకు మనమే బాధ్యత వహించి, వాటి పరిష్కారానికి కార్యోన్ముఖులం కావడం.

మీ ఊరి రోడ్డు గతుకులుగా ఉంటే మీ ఊరి ప్రజలే పూనుకుని మొరం తోలి, రోడ్డుని చదును చేసుకునే కార్యక్రమం చూసే ఉంటారు. ఊరి చెరువులోనో, కాలువలోనో పూడిక తీసుకునే కార్యక్రమం కూడా గ్రామ ప్రజలే పూనుకుని చేయడం వినే ఉంటారు. వ్యక్తుల శ్రమదాన ప్రభావాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. చంద్రబాబు నాయుడు తన హయాంలో జన్మభూమి అని పేరు పెట్టి ఇలాంటి శ్రమదాన కార్యక్రమాలకు/పనులకు ప్రభుత్వ సహాయం కూడా అందించే పథకం అమలు పరిచాడు. ఎన్నో ఏళ్ళుగా పరిష్కారంకాని సమస్యలు కూడా ఈ శ్రమదానాల వల్ల ఇట్టే జరిగిపోయేవి. విపత్తులూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తోటి జనమంతా ఏకమై, నష్టపోయిన ప్రాంతాల్లో జన జీవనాన్ని పునరుద్దరించడానికి పాటుపడటం చూస్తూనే ఉన్నాం.

జాలంలో తీసుకుంటే, వికీపీడియా లాంటి మహా విజ్ఞానం సర్వస్వం కూడా ఇలాంటి సమిష్టి కృషితోనే సాధ్యమైంది. అలానే ఫైర్‌ఫాక్స్ విహారిణి లాంటి అనేకానేక ఓపెన్ సోర్సు మృదూపరకణాలు కూడా ఎందరో వికాసకుల శ్రమదాన ఫలితమే. కంప్యూటర్ని నడిపే క్లిష్టమైన నిర్వాహక వ్యవస్థలు కూడా ఇలా సమష్టి కృషితోనే రూపొందుతున్నాయి.

అంతిమ వాడుకరులుగా మనం ఉపయోగిస్తున్న చాలా ఉపకరణాలు, పనిముట్ల తయారీలో మనమూ పాలుపంచుకోవచ్చు. జాలం వల్ల సాధ్యపడినవాటిలో ఒకటి – భౌగోళిక హద్దులు చెరిగిపోయి, ఏ ప్రాంతం వారైనా వారున్నచోటినుండే పరస్పరం సంభాషించుకోగలిగే సౌలభ్యం. దీని వల్ల వివిధ ప్రాజెక్టులలో ఎవరైనా భాగస్వాములు కాగలిగే అవకాశం వచ్చింది.

కంప్యూటర్లలో మరియు జాలంలో తెలుగు వికాసాన్ని చూడాలనుకునే వారు చేయదగిన శ్రమదానం: పలు తెలుగు ప్రాజెక్టులలో పాలుపంచుకోవడం. తెలుగు వికీపీడియా దగ్గరనుండి వివిధ ఉపకరణాల స్థానికీకరణ వరకూ అందరూ పాలుపంచుకోవచ్చు.

కేవలం మనలాంటి వారి శ్రమదానం వల్లే, తెలుగు వికీపీడియాలో ఇప్పటికి 40 వేల పైబడి వ్యాసాలు పోగయ్యాయి. వ్యాసాలు రాసే స్థాయి లేదనుకుంటే, అచ్చుతప్పులను సరిదిద్దడమైనా చెయ్యవచ్చు.

మనమందరం వారానికి కనీసం ఓ గంట ఈ శ్రమదానానికి కేటాయించడం ద్వారా చాలా సాధించవచ్చు.

తాజాకరణ (అక్టోబర్ 1, 2008): వివిధ ఉపకరణాలని తెలుగులో స్థానికీకరించడానికి జాలంలోని గూళ్ళు.

Posted in సంపాదకీయం | 7 Comments

మనసుకు చూపుంటే…

–స్వాతీ శ్రీపాద

నిశ్శబ్ద సమరానికి సమాయత్త మవుతూ
భావాల బూజు దులిపి
అనుభవాల ఆక్రందనాలను
అక్షరాల్లోకి అనువదించే
మనసుకు చూపుంటే …

మాసిపోయిన మందహాసాల వెనక
జీవితం ఉరి కంబం మీద
బిక్కు బిక్కు మంటూ దిక్కులు చూసే
మధ్య తరగతి మరణ శాసనాలకు
నిలువెత్తు అద్దం పట్టే
ఆధునిక హింసా చిత్ర మయేది

గాజుగోడల సౌకుమార్యం మధ్య
అలమటించే సముద్ర ఘోష
అలలై ఎగసి పడే తామస ద్వేషాలు
నీ ఉనికిని శాసించే వేళ
ఊపిరందక ఉక్కిరి బిక్కిరయే
ఊహా గానమయేది

మొలవని రెక్కల్ను విదుల్చుకు
విహాయసంగా సుదూర తీరాలకు
వలస పోవాలని స్వప్న బాలికలు
నిర్మించే సైకత సౌధాలు

ఇంకా పుర్తిగా రూపం రాని కళ్ళ రెప్పలను చిదిమి
పదాల పెదవుల కతికించాలని
ఉబలాట పడే నిట్టూర్పులూ

తీరాన్ని మింగేసి అలలను ఆరబెట్టుకునే
సప్త సముద్రాల క్రౌర్యం

మనసుకు చూపుంటే
చరిత్ర కరపత్రాలయేవి

————————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

Posted in కవిత్వం | 12 Comments

స్వేచ్ఛా మృదుసామగ్రి — పరిచయం

-వీవెన్

మీరు కొన్న వస్తువును ఎందుకోసమైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉన్నట్టే, మీ కంప్యూటర్ ఉపకరణాలని కూడా ఏ ఉద్దేశంతోనైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉండాలి. వాణిజ్యపరంగా లభించే చాలా ఉపకరణాలలో అవి ఏయే ఉద్దేశాలకు ఉపయోగించవచ్చో కొన్ని సార్లు నియంత్రణలు పెడతారు.

మీరు స్వేచ్ఛా మరియు ఓపెన్ సోర్స్ మృదుసామగ్రి (free and open source software) గురించి వినేవుంటారు. వీటిని వాడమని ప్రబోధించే వారినీ చూసే ఉంటారు. ఈ మధ్య కాలంలో ప్రతీ అవసరానికీ ఓపెన్ సోర్స్ ఉపకరణాలు లభ్యమవుతున్నాయి. (ప్రఖ్యాత జాల విహారిణి తెలుగులో మనం అభిమానంగా మంటనక్కగా పిలుచుకునే ఫైర్‌ఫాక్స్ కూడా స్వేచ్ఛా మరియు ఓపెన్ సోర్స్ ఉపకరణమే.) వీటిని ఉపయోగించేవారూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వీటి వెనుకనున్న స్వేచ్ఛ అన్నదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

స్వేచ్ఛ మరియు ఓపెన్ సోర్స్ అనేవి రెండు భావనలు. రెంటి యొక్క అంతిమ ప్రభావం ఒకటే అయినా వీటి (దృక్పథాల) మధ్య భేదాలున్నాయి. ఓపెన్ సోర్సు అనే భావన ప్రకారం చూస్తే ఓ మృదు ఉపకరణం యొక్క అభివృద్ధికి అవలంబించే విధానంపై దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. స్వేచ్ఛ అనే భావనలో ఉపకరణవాడుకరులకి లభించే స్వేచ్ఛకి మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది.

స్వేచ్ఛా దృక్పథం నుండి చూసినప్పుడు, స్వేచ్ఛా మృదుసామగ్రి (free software) అని పిలుస్తారు. ఫ్రీ అంటే ఉచితం అన్న అర్థంలో కాకుండా స్వేచ్ఛ అన్న అర్థంలో అన్న మాట. అంటే వాడుకరి యొక్క స్వేచ్ఛకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. స్వేచ్ఛ అనేది మనం అనుభవించే స్థితి. దీన్ని వివరించడం గహనంగా ఉంటుంది కాబట్టి, కొన్ని ఉదాహరణలతో, మృదు ఉపకరణాలకు స్వేచ్ఛ అనే భావన ఎలా వర్తిస్తుంది అన్న దాన్ని పరిశీలిద్దాం.

ఓ స్వేచ్ఛా మృదు ఉపకరణాన్ని మీరు ఉపయోగిస్తుంటే, దానికి సంబంధించి మీకు ఈ క్రింది స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నట్టే:

  1. ఆ ఉపకరణాన్ని ఏ ఉద్దేశానికైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ
  2. ఆ ఉపకరణం ఎలా పనిచేస్తుందో తెలుసుకుని, అధ్యయనం చేసి, నేర్చుకొనగలిగే స్వేచ్ఛ (అందుకు ఆ ఉపకరణపు మూలసంకేతం (source code) కూడా మీకు అందుబాటులో ఉంటుంది.)
  3. ఆ ఉపకరణాన్ని పంపిణీ చేసే స్వేచ్ఛ (అంటే మీ స్నేహితులతో పంచుకోవచ్చు)
  4. మీ అవసరాలకు తగిన విధంగా ఆ ఉపకరణానికి మార్పుచేర్పులు చేసుకునే మరియు మీ మార్పుచేర్పులని ఇతరులతో పంచుకునే స్వేచ్ఛ

ఈ స్వాతంత్ర్యాలు చాలా మామూలువే అనిపించవచ్చు. వీటి గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే, మరియు స్వేచ్ఛారహిత ఉపకరణాలు మనకు మిగిల్చే స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకుంటే, ఈ స్వేచ్ఛల ఆవశ్యకత తెలుస్తుంది.

ఏ ఉద్దేశానికైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ
మీరు కొన్న వస్తువును ఎందుకోసమైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉన్నట్టే, మీ కంప్యూటర్ ఉపకరణాలని కూడా ఏ ఉద్దేశంతోనైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉండాలి. వాణిజ్యపరంగా లభించే చాలా ఉపకరణాలలో అవి ఏయే ఉద్దేశాలకు ఉపయోగించవచ్చో కొన్ని సార్లు నియంత్రణలు పెడతారు. మరికొన్నింటిలో మనం ఏయే ఉద్దేశాలకి (కార్యాలయంలోనా, ఇంట్లోనా, గట్రా) ఉపయోగిస్తున్నామో తయారీదారుకి చెప్పవలసివుంటుంది. ఉచితంగా లభించే స్వేచ్ఛారహిత మృదుపరికరాలని (వీటిని freeware అంటారు) వాణిజ్యావసరాలకు ఉపయోగించుకోడానికి సాధారణంగా వాటి లైసెన్సు అనుమతించదు.

స్వేచ్ఛా ఉపకరణాలనేవి ఇటువంటి నిబంధనలు లేకుండానే, మీరు వాటిని ఏ ఉద్దేశానికైనా ఉపయోగించుకునే వీలు కల్పిస్తాయి.

పరిశీలన మరియు అధ్యయన స్వేచ్ఛ
ఓ ఉపకరణం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం అనేది కొన్ని సందర్భాలలో అవసరమౌతుంది. మనకి కంప్యూటర్లంటే ఉండే ఆసక్తి వల్ల మృదూపకరణాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనుకోవచ్చు. కంప్యూటర్ రంగంలోని విద్యార్థులు బయటి ప్రపంచంలో వాడుకలో ఉన్న మృదుపరికరాలని అధ్యయనం చేయడం ద్వారా చాలా మెళకువలు (అకడమిక్‌గా నేర్చుకోలేనివి) నేర్చుకోవచ్చు. ఓ మృదు ఉపకరణాన్ని ఈ స్థాయిలో అధ్యయనం చేయాలంటే, దాని మూలసంకేతం అందుబాటులో ఉంటేనే సాధ్యం.

భద్రతాపరంగా ఓ ఉపకరణం సురక్షితమో కాదో తెలుసుకోవడానికి దాన్ని అధ్యయనం చేయాల్సిరావచ్చు. మీరు స్థాపించుకున్న ఉపకరణం మీ కంప్యూటరు నుండి మీ (లేదా మీ సంస్థ యొక్క) కలాపాలని దాని తయారీదారుకి చేరవేస్తుండవచ్చు (spyware), లేదా ఆ ఉపకరణం మీ కంప్యూటర్లో వినాశకర వైరస్సులని నడిపిస్తూండవచ్చు. లేదా ఆ ఉపకరణంలో అంతుచిక్కని లోపాలుండవచ్చు, అవి భవిష్యత్తులో మీ కంప్యూటర్ని దుష్ట హ్యాకర్ బారిన పడేయవచ్చు. ఓ ఉపకరణం భద్రతాపరంగా పూర్తి సంరక్షితం అని తేల్చకోడానికి దాని మూలసంకేతాన్ని చూడకుండా ధృవీకరించడం మేడిపండు చందంగా ఉంటుంది.

ఇప్పుడున్న పద్ధతులని సంపూర్ణంగా అధ్యయనం చేయడం ద్వారానే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా వినూత్న ఆలోచనలతో పరిష్కారాలను కనుగొనే వీలుంటుంది. చక్రం నుండి కారు వరకూ టైపుమిషన్ నుండి సూపర్ కంప్యూటర్ వరకూ ఆవిష్కరణలు పరిశీలన, పరిశోధన, మరియు అధ్యయనాల ద్వారానే సాధ్యమయ్యాయి. వైజ్ఞానిక పురోభివృద్ధికి ఈ స్వేచ్ఛ అత్యంత ఆవశ్యకం.

చాలా వరకు వాణిజ్య మృదుపరికరాలలో ఈ అవకాశం ఉండదు. ఒకవేళ ఉన్నా, అది ఎన్నో నిబంధనలతో కూడి ఉంటుంది.

పంచుకునే స్వేచ్ఛ

మనం ఉపయోగించే మృదు ఉపకరణాలు, నైతికంగా మరియు చట్టబద్ధంగా మనకి వాడుకరులుగా ఏయే హక్కులని అందిస్తున్నాయో, మనకున్న ఏయే స్వేచ్ఛలని మనకి మిగులుస్తున్నాయో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాటి పొరుగు వాడికి సహాయపడడం మన హక్కు మరియు నైతిక ధర్మం.

తోటివారికి సహాయపడటమనేది మానవుల సహజమైన లక్షణం. స్నేహితులతో, ఇరుగుపొరుగువారితో ఇచ్చిపుచ్చుకోవడాలు అనేది సర్వసాధారణం. పక్కింటాయన దగ్గరనుంచి ఓ పుస్తకాన్ని చదువుకోడానికి తీసుకున్నట్టే, లేదా మీ కారుని మీ స్నేహితుని అవసరానికి అరువిచ్చినట్టే, స్వేచ్ఛా మృదుపరికరాలని మన తోటివారితో పంచుకోవచ్చు.

చాలా వాణిజ్య మృదుపరికరాల లైసెన్సుల ప్రకారం ఇలా పంచుకోవడం నేరం. కొన్ని సందర్భాలలో మీరు ఆ మృదుపరికరాన్ని కేవలం ఒక్క కంప్యూటరులో మాత్రమే ఉపయోగించాలన్న నిబంధన ఉంటుంది. మరికొన్ని మృదుపరికరాలను, దాన్ని వాడే కంప్యూటరు స్వరూపణం (configuration) మారినా కూడా ఉపయోగించకూడదని నియంత్రణలు ఉంటాయి. ఒకవేళ సాంకేతికంగా మీరు చేయగలిగినా, చట్టబద్ధంగా నేరస్తులవుతారు.

మెరుగుపరుచుకునే స్వేచ్ఛ
ఎవరి అవసరాలు వారికుంటాయి. అవసరాలకు తగ్గట్టుగా ఉపకరణాలను మార్చుకునే స్వేచ్ఛ ఉండాలి. మామూలుగా కంప్యూటర్ ఉపకరణాలు కొద్దిపాటి స్థాయి ప్రత్యేకీకరణ (తయారీదారు ఎంత పరిమితిస్తే అంతే) సౌలభ్యంతో వస్తాయి. మీకున్న అన్ని అవసరాలకీ ఈ స్థాయి సరిపోకపోవచ్చు. మారుతున్న పరిస్థితుల వల్ల మీకు కొత్త అవసరాలు పుట్టుకురావచ్చు. మారిన పరిస్థితులను, కొత్త అవసరాలను సంభాళించడానికి ఉపకరణాలని మెరుగుపరచాల్సి ఉంటుంది. అందుకోసం తయారీదారు కొత్త సంచికను విడుదల చేసేవరకు వేచివుండాల్సివస్తుంది. ఒకవేళ ఆ అవసరాలు చాలా కొద్దిమందికి మాత్రమే పరిమితమైతే, తయారీదారు అసలు పట్టించుకోకపోవచ్చు. లేక ఈ మార్పులు తయారీదారు ప్రాధాన్యతలలో అట్టడుగున ఉండవచ్చు. మరికొన్ని సందర్భాలలో అసలా ఉపకరణ తయారీనే నిలిపివేసి వుండవచ్చు.

ఈ ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఉపకరణాల మూలసంకేతం అందుబాటులో ఉంటే.., చేయగలిగితే మనమే చేసుకోవచ్చు, లేదంటే నిపుణులను పెట్టుకుని చేయించుకోవచ్చు. (మోటారు సైకిల్ కంపెనీ సేవాకేంద్రం మన ప్రాంతంలో లేకపోతే, లేదా అది రద్దీగా ఉన్నప్పుడో స్థానిక మెకానిక్కు దగ్గరివెళ్తాం కదా. తయారీలోలేని పాత మోటారు సైకిళ్ళని స్థానిక మెకానిక్కుల సాయంతో నడిపిస్తూ ఉంటాం కదా.) స్వేచ్ఛా మృదూపకరణాలు మీకు ఈ వీలుని కల్పించడంతో బాటు, మీ మార్పుచేర్పులను కూడా ఇతరులతో పంచుకునే హక్కుతో వస్తాయి.

ఉపసంహారం

మనం ఉపయోగించే మృదు ఉపకరణాలు, నైతికంగా మరియు చట్టబద్ధంగా మనకి వాడుకరులుగా ఏయే హక్కులని అందిస్తున్నాయో, మనకున్న ఏయే స్వేచ్ఛలని మనకి మిగులుస్తున్నాయో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. పొరుగువాడికి సహాయపడడం మన హక్కు మరియు నైతిక ధర్మం. అలా అని లైసెన్సుని ఉల్లంఘించి వాణిజ్య ఉపకరణాలని పంచుకుంటే, చట్టపరంగా నేరస్తులవుతాం. వాడుకరులుగా మన స్వేచ్ఛకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే, స్వేచ్ఛా మృదు పరికరాలనే వాడడం అలవాటు చేసుకోవాలి.

ప్రభుత్వాలు స్వేచ్ఛా మృదూపకరణాలని వాడడం ద్వారా ఏదో ఒకటే వాణిజ్య సంస్థపై ఆధారపడకుండా ఉండవచ్చు. స్వేచ్ఛా ఉపకరణాలు ఉచితంగానే లభిస్తాయి కాబట్టి ప్రజాధనాన్ని పొదుపుగా వాడడానికి ఇది ఓ మార్గం. ఇటీవల చాలా దేశాల ప్రభుత్వాలు స్వేచ్ఛా ఉపకరణాలకి మారుతున్నాయి (సంబంధిత వార్తలు). కానీ మన రాష్ట్రంలో మాత్రం స్వేచ్ఛారహిత వాణిజ్య ఉపకరణాలు వాడడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

స్వేచ్ఛా మృదుసామగ్రిపై పూర్తి వివరాలకు ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ వారి వెబ్ సైటులో చూడండి. ముఖ్య స్వేచ్ఛారహిత ఉపకరణాలకు తగ్గ స్వేచ్ఛా ప్రత్యామ్నాయాలకై, osalt.com లో చూడండి.

————-

-వీవెన్ పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.

Posted in వ్యాసం | Tagged , | 5 Comments

జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు

-సిముర్గ్, వీవెన్, చదువరి

వెల్లువెత్తిన వ్యాఖ్యలు
ఈ నెల బ్లాగుల్లో వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. మామూలుగా జాబుకు పది పదిహేను వ్యాఖ్యలు ఉంటే బాగా ఉన్నట్టే! అలాంటిది, ముప్పై నలభై యాభై వ్యాఖ్యలు కూడా అందుకున్నాయి.

మీనాక్షి రాసిన నేను ఎందుకు ప్రేమించలేదంటే…..??? కు 51 వ్యాఖ్యలు వచ్చాయి. ఆమే రాసిన పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..) కు 40 కి పైగా వ్యాఖ్యలు వచ్చాయి.
సుజాత రాసిన నా జర్నలిస్టు ఉద్యోగం పరంపరకు మంచి స్పందన వచ్చింది. మొదటి భాగానికి 49 వ్యాఖ్యలు వచ్చాయి.
కత్తి మహేశ్ కుమార్ రాసిన కట్నానికి మరో వైపుకు 54 వ్యాఖ్యలు వచ్చాయి.

బ్లాగు వివాదాలు

జూలైలో బ్లాగుల్లో రేగిన వివాదాలు కొందరు బ్లాగరులకు కలత కలిగించాయి. కులం, మతం, బ్లాగు మర్యాద మొదలైనవాటిపై వివాదాస్పద జాబులు, వ్యాఖ్యలు కలకలం కలిగించాయి. ముందుగా.. కుల ఘర్షణల సమస్యపై తెగేదాకా లాగడం వరసలో తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం రాసిన నాలుగో జాబులో గట్టి చర్చే జరిగింది. ఈ విషయంపైనే కత్తి మహేష్ కుమార్ ఒక మెతుకు పట్టుకునిచూస్తే చాలా !?! అనే జాబు రాసారు.

కలగూరగంపలో జరిగిన ఆ చర్చల హోరు మతం గురించి రాస్తున్న మరో బ్లాగులో ప్రతిధ్వనించాయి. ఈ బ్లాగులో వివిధ మతాల ఆచారాలను పోలుస్తూ రాసిన జాబులు మరో కొత్త బ్లాగు సృష్టికి అంకురార్పణ చేసి ఆ రెండు బ్లాగుల మధ్య ఒక చిన్న బ్లాగు యుద్ధానికి దారి తీసాయి. ఆ తరువాత ఆ రెండు బ్లాగులనూ మూసివేయడంతో ఆ వివాదం సమసిపోయింది.

బ్లాగు మర్యాదలపై చెలరేగిన వివాదం తీవ్రమైన చర్చకు దారితీసింది. కూడలి కబుర్ల గదిలో కొత్తా పాతా బ్లాగరులు సమావేశమై చర్చ కూడా జరిపారు. బ్లాగరులు తమ జాబులను పదే పదే తాజాకరించడంతో కూడలిలో ఎల్లప్పుడూ పైనే ఉంటూ వచ్చిన వైనంపై తెలుగుబ్లాగు గూగుల్ గుంపులో జరిగిన చర్చతో వివాదం మొదలైంది. బ్లాగింగులో రాగింగు అంటూ సరస్వతీకుమార్ ఒక జాబు రాసారు. ఆదివారం నాడు కూడలి కబుర్లలో చర్చ కూడా జరిగింది. ఈలోగా.. టపాలు ఎన్ని రాయాలో, ఎలా రాయాలో కూడా మీరే చెప్పేస్తారాండీ అంటూ తెలుగువాడిని ఓ జాబు రాసారు. ఆ తరువాత రెండు రోజులకే వీవెన్ కూడలిలో తగుమార్పులు చెయ్యడంతో సమస్య పరిష్కారమైంది. దీనికి తోడు బ్లాగర్ల హక్కులేమిటి అంటూ కల్పనా రెంటాల రాసిన జాబులో కూడా చర్చ జరిగింది.

చర్చలు

రాజకీయాలు / సామాజికం

జ్ఞాపకాలు / ‘స్వ’గతాలు

హాస్యం / వ్యంగ్యం

ఇతరత్రా

బ్లాగుల గురించి

కొత్త బ్లాగులు


ఈ నెల జాబులు:

  • చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం బ్లాగరుల అభిమాన విషయం. చదువరుల గుండెలను తాకి, వారిని తన భావోద్వేగంలో లీనం చేసేసుకోగలగడం కొన్ని జాబుల ప్రత్యేకత. అలాంటి జాబు – శిలాక్షరాలైన క్షణాలు- 2. ఇది మా ఈనెల జాబుల్లో ఒకటి. ఇది రెండు జాబుల వరసలో రెండోది. మొదటి జాబు చదివి ఈ జాబుల నేపథ్యాన్ని తెలిసికొన్న తరవాత ఈ రెండో జాబు చదవండి.
  • అణుఒప్పందం గురించి సవివరంగా విశ్లేషించిన జాబు ఇది. ఒక పరిశోధనాపత్రం లాగా, తగు మూలాలను, అకరాలను ఉదహరిస్తూ పప్పు నాగరాజు రాసిన ఈ జాబు మా ఈనెల జాబుల్లో ఒకటి.

హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారి బ్లాగు చూస్తున్నారా? తాము ప్రచురించిన పుస్తకాల గురించి వారీ బ్లాగు రాస్తున్నారు. మన మంచి పుస్తకాలు అంటూ రాసిన జాబులో, తమ పుస్తకాలను పాఠకులెలా తెప్పించుకోవచ్చో వ్యాఖ్యల్లో రాసారు. ప్రస్తుతం ఆన్‌లైనులో అమ్మే సౌకర్యం వారింకా ఏర్పాటు చేసుకోలేదు. ఎవరైనా సాంకేతిక సాయం చేస్తే వారు అందుకు సుముఖంగానే ఉన్నట్టున్నారు.

జల్లెడ వారు ఉత్తమ తెలుగు బ్లాగు టపాల పోటీ పెట్టారు చూసారా? మీరు పాల్గొంటున్నారా?

ఆది బ్లాగరిగా మన్ననలందిన చావా కిరణ్, తన బ్లాగును మూసేసి, బ్లాగు సెలవు పుచ్చుకున్నారు. ఒక అధ్యాయం ముగిసింది.

——————–

జూలైలో బ్లాగు మొదలుపెట్టి ఏకంగా 47 జాబులు రాసి పారేసిన ఓ బ్లాగరి గురించి చెబుదామనుకున్నాం. అయితే వారు రాయడం సంగతేమోగానీ, ఇతర బ్లాగుల్లోంచి జాబుల్ని కొట్టెయ్యడంలో మాత్రం సిద్ధహస్తులని తెలిసాక, ఆ బ్లాగుకు ఈ ప్రత్యేక స్థానం కల్పిస్తున్నాం. వారి కళావైశిష్ట్యానికి మచ్చుతునకగా కింది లింకులను చూడండి. ఇలాంటివి ఆ బ్లాగులో మరిన్ని ఉన్నాయని తెలుస్తోంది. మీకు తెలిసినవి కూడా రాస్తే నికరంగా వారి స్వంత రచనలేవో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

  • వారి బ్లాగులోని ముక్క:http://aradhanaa.blogspot.com/2008/07/blog-post_8862.html
  • మూలం: http://vinnakanna.blogspot.com/2008/07/blog-post.html

———————-

-సిముర్గ్, వీవెన్, చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యులు

Posted in జాలవీక్షణం | Tagged , , | 15 Comments