Monthly Archives: May 2009

విరోధి ఉగాది పద్యకవితాసమ్మేళనము – మూడవ అంకము

{కొత్తపాళీ}: ఈ తడవ, మామూలుగా అవధానాల్లో ఉండే సమస్య, వర్ణన, దత్తపదులే కాక, ఒక కొత్త అంశాన్ని చవి చూద్దాం .. అది అనువాదం. రెండు సంస్కృత పద్యాలు, రెండు ఆంగ్ల పద్యాలూ ఇచ్చాను అనువాదానికి. మొదటిది, తెలుగు వారికి అత్యంత పరిచయమైన శ్లోకం, పెళ్ళి శుభలేఖల్లో తరచూ ప్రచురిస్తుంటారు. వాల్మీకి రామాయణంలో జనక మహారాజు … Continue reading

Posted in కవిత్వం | Tagged | 5 Comments

మంచినీళ్ళ బావి

-అరిపిరాల సత్యప్రసాద్ తెల్లగా తెల్లారాక చివరగా నీళ్ళు తోడుకున్నవాళ్ళు ఎవరైనా సరే ఒక చేద నీళ్ళు తోడి గట్టుమీద పెట్టి వెళ్ళేవాళ్ళు. ఆ పక్కగా పోతున్నవాళ్ళెవరైనా దాహం వేస్తే అక్కడికి వెళ్ళి నాలుగు దోసిళ్ళు ముఖాన కొట్టుకోని, చేద ఎత్తి గడ గడా నీళ్ళు తాగేవాళ్ళు. మళ్ళీ మర్చిపోకుండా నీళ్ళు తోడి గట్టు మీద పెట్టి … Continue reading

Posted in కథ | 30 Comments

తామస విరోధి – ఆరవ భాగం

కిరణ్ కుమార్ చావా : ఆ ఒడ్డు నుండి నువ్ నన్ను, ఈ ఒడ్డు నుండి నే నిన్ను, పరికిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ, ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం. ఎప్పుడో కుదుళ్లు వేరైపోయినా, ఎప్పటికప్పుడు గాయాల కాలవలకు పూడికలు తీస్తూ, గట్లు కడుతూ, ఇన్ని వసంతాలూ రక్తం పారించాం. నీ వైపు పూలు, నా వైపు … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

వర్డ్‌ క్యాన్సర్‌

మేఘమథనం చేస్తే వానొస్తుంది. మరి పదమథనం చేస్తే ఏమొస్తుంది? మురిపించడానికి ముందేదో ఒక స్పెల్‌బీ అవార్డూ, కొన్ని ఆహాఓహోలూ, ఆక్స్‌ఫర్డ్‌ సర్టిఫికెట్టూ రావొచ్చు. తర్వాత…??? Continue reading

Posted in కథ | 24 Comments

ఈ తరానికి ప్రశ్నలు

“మీరిది చదువుతున్నారంటే మీకు ప్రత్యేకత ఉన్నట్టే. మొదటి విషయం మీకు తెలుగు చదవడం వచ్చు. రెండోది వెబ్ పత్రిక చదివేంత సాహిత్యాభిమానం ఉంది. మూడోది ఇదేమీ కథా కాకరకాయా, కవిత్వమూ కాదని తెలిసికూడా చదువుతున్నారంటే మీ ఆసక్తి చెప్పుకోదగినదే.” అంటూ కొడవటిగంటి రోహిణీప్రసాద్ ప్రత్యేకత గల పాఠకులకు చెప్తున్నదేమిటి? “పత్రికాముఖంగా మీరిచ్చే జవాబులు చాలా విలువైన స్పందనలవుతాయని నా ఉద్దేశం.” అంటూ అడుగుతున్న ప్రశ్నలేమిటి? Continue reading

Posted in వ్యాసం | Tagged | 40 Comments

రాజశేఖర విజయం

కాంగ్రెసేతర పార్టీలు గత ఐదేళ్ల ప్రభుత్వపాలనలోని లోపాలను సరిచేస్తామనిగానీ, అ ఆ ఇ లను తగ్గించేస్తామనిగానీ భరోసా ఇవ్వలేదు. ఇన్నాళ్లూ కాంగ్రెసోళ్లు తిన్నారుగదా ఇక మేమూ తింటాం మీకూ నాలుగు మెతుకులు రాలుస్తాం మాకూ అవకాశమివ్వండి అని అర్థంవచ్చే మాటలతో ప్రజలను ఓట్లడగడానికి వచ్చినాయి. ఈ ఎన్నికల్లో నగదుబదిలీ పథకానికి పెద్దఎత్తున జనం ఆకర్షితులవకపోవడానికి కారణం ప్రస్తుతప్రభుత్వపు పనితీరు గొప్పగా ఉందనికాదు, గుడ్డిలో మెల్ల అని మాత్రమే. Continue reading

Posted in సంపాదకీయం | 6 Comments

2009 ఏప్రిల్ గడి ఫలితాలు

గడి సులువుగా ఉందో లేకపోతే స్లిప్పుల ప్రభావమోగానీ.. ఈసారి చాలామంది మొత్తం సరైన సమాధానాలు పంపారు. మొత్తం పంపినవారు పదహారు మంది. అందులో అన్నీ సరిగ్గా పంపినవారు వెన్నెల_డిబి, రాజు పావులూరి, ఆదిత్య, వెంకట్ దశిక, ఊకదంపుడు, కంది శంకరయ్య, రాధిక, రాఘవ, పింగళి విజయ కుమార లక్ష్మీనారాయణ రావు. వీరిలో కొంతమంది సమాధానాల్లో కొంత … Continue reading

Posted in గడి | Tagged | 1 Comment

2009 మే గడిపై మీమాట

2009 మే గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి పాత గడులు 2009 ఏప్రిల్ గడి, సమాధానాలు 2009 మార్చి గడి, సమాధానాలు 2009 ఫిబ్రవరి గడి, సమాధానాలు 2009 జనవరి గడి, సమాధానాలు 2008 డిసెంబరు గడి, సమాధానాలు 2008 నవంబరు గడి, సమాధానాలు 2008 అక్టోబరు గడి, సమాధానాలు 2008 సెప్టెంబరు మెరుపు … Continue reading

Posted in గడి | Tagged | 16 Comments

మతవిశ్వాసాల పునాదులు

“ప్రాచీన కాలంలో సగటు ఆయుఃప్రమాణం చాలా తక్కువగా ఉండి, రోగాలూ, గాయాలూ, ప్రమాదాలూ బలి తీసుకున్నప్పుడల్లా జనాభా తగ్గుతూ ఉండేది. నలుగురూ కలిసి ఐకమత్యంతో బతికితేగాని పూట గడవని ఆ కాలంలో చావు అనేది చాలా అవాంఛనీయం అనిపించి ఉండాలి.” మతవిశ్వాసాల పునాదుల గురించి చదవండి. Continue reading

Posted in వ్యాసం | Tagged | 36 Comments

తనెళ్ళిపోయింది..

తనెళ్ళిపోయింది… వెళ్ళిపోతూ తన గుర్తుగా ఏం మిగిల్చింది? Continue reading

Posted in కవిత్వం | Tagged | 15 Comments