2009 మార్చి గడిపై మీమాట

2009 మార్చి గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి

పాత గడులు

———————————-

Posted in గడి | Tagged | 24 Comments

2009 ఫిబ్రవరి గడి ఫలితాలు

– కొవ్వలి సత్యసాయి

ఈనెల గడికి 17 మంది నుండి 24 సమాధానాలు రావడం ఆనందకరంగా ఉంది. సాధారణంగా అక్టోబరు – డిసెంబరుల మధ్య 9-10 మంది పంపించారు. జనవరి గడికి 13 మంది పంపించారు. స్లిప్పుల సర్వీసు బాగా ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తోస్తోంది. ఈవిషయంలో సుగాత్రి గారికీ, జ్యోతి గారికీ కృతజ్ఞతాభినందనలు. గడి నింపి పంపిన వారికి అభినందనలు. నేను గమనించినదేమిటంటే స్లిప్పుల సర్వీసు లో అత్యుత్సాహంగా పాల్గొన్నవాళ్లందరూ గడి నింపి పంపట్లేదు. అలా పంపితే గడిచ్చేవాళ్ళకి మరికాస్త ఉత్సాహంగా ఉంటుంది. పూరించిన గడిని యధాతథంగా భద్రపరచుకోగలిగితే ఎక్కువమంది పాల్గొంటారేమో. ఈ సందర్భంలో మన పొద్దు గడి ఆన్లైను లో ఉన్న ఏకైక గడి అని అందరికీ గుర్తు చేస్తూ, దీని గురించి పదిమందికీ తెలిపితే బాగుంటుందనుకుంటున్నా. ఈగడి సంస్కృతి గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. .

గడిని నింపి పంపినవారు: సర్వశ్రీ
నేస్తం, రాఘవ, వికటకవి, అలకనంద, ఆదిత్య, ఎల్లంకి భాస్కరనాయుడు,
కంది శంకరయ్య, కామేశ్వర రావు, కృష్ణుడు, జ్యోతి, దైవానిక, పంతుల సుధారాణి,
పరిమళం, మురళీ మోహన్ కోడిహళ్లి, శ్రీలు, వెన్నెల మరియు సుధాంశు.

ఇందులో కామేశ్వర రావు గారు, ఆదిత్యగారూ కేవలం ఒక్క తప్పుతో పూరించారు. కామేశ్వరరావు గారిది తప్పు అనే కన్నా వర్ణక్రమ దోషమనచ్చు (స్పెల్లింగు దోషం). కానీ మా దగ్గరనున్న సమాధానాలతో సరిపోలినవే సరియైన సమాధానాలుగా పరిగణించడం వల్ల మాత్రమే అది తప్పుగా భావించాం. మిగిలిన వారిలో కూడా, తప్పయిన సమాధానాలలో స్పెల్లింగు దోషాలే ఎక్కువ.

1 దన్

2 శ

కం

3 బై

4 ఠా

యిం

5 పు

6 బా

7 రా

8 నం

జు

కు

9 క

ర్రా

వు

10 ట్రా

11 వె

లా

గు

త్రా

ని

12 మో

జు

13 లు

14 త

ర్క

లు

మి

15 మా

16 మా

17 రా

18 మ

సే

19 న

బిం

20 సు

గ్రీ

వా

21 మ

నో

22 బం

23 దం

లిం

24 వ

లు

25 వ

26 దే

27 వ

ప్ర

28 యా

29 పా

30 రా

31 స

నా

రా

32 కు

కు

33 ద్రో

34 జా

35 తి

త్నం

జు

36 తృ

ణం

37 ర

సం

38 అం

39 శ్యా

కృ

ష్ణ

40 భా

41 వి

కా

42 జ

43 ద

ర్గ

44 సు

రం

ప్ర

తా

రె

డ్డి

వి

అడ్డం

2 శకం. జమానా అంటే శకం అని. విక్రమార్క శకం, శాలివాహన శకం అంటాం కదా. ఎవరిదైనా ఒకటే అంటే ఎవరి పేరు తర్వాత పెట్టినా ఓకేయని.

3 బైఠాయింపు. ఎవరైనా పనయ్యేదాకా మన ముందే కూర్చుని హఠం చేస్తే బైఠాయించారంటాం. హఠం అని వాడి ఠ అన్న అక్షరం (ట కాదు) అని సూచించాం.

6 బారా. వేంకటమఖి రాగాలని 72 మేళకర్తలు (జనక రాగాలు) గా వర్గీకరించాడు. వీటిని 12 చక్రాలుగా విభజించాడు. మిగిలిన రాగాలన్నీ వీటినుండి వచ్చినవి లేదా జన్య రాగాలు. హిందీ పదాలు వాడి హిందీ సంఖ్య రాయాలని సూచించాం.

8 నంజుకు. పప్పులో ఊరు మిరపకాయే కాదు, ఏదైనా సరే, ఒక ఆహార పదార్థంలో అన్య పదార్థం కొద్ది మొత్తం కలిపి తినడాన్ని నంజుకు తినడమంటారు.

9 కర్రావు. నల్ల ఆవులని కఱ్ఱియావులంటారని ఆవువ్యాసం బట్టీ కొట్టిన మనందరికీ తెలిసినదే కదా. కాస్త కుసంధిచేసి కర్రి, రావులని కలిపాం.

10 ట్రావెలాగు. ఈలాగు ట్రావెలాగు అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా.

12 మోజు. పెళ్ళాం మీద పోతుందా మోజు. మోజెస్ అన్న పేరు వాడి తిన్నగా సూచించాం.

14 తర్కలు. టీ ఇవ్వగానే తాగకుండా కాసేపుంచితే దానిమీద తరకలు కడతాయి. తాగ్కపోతే అని వాడి తరకలు ని కుదించాలని సూచించాం.

15 మామా. తల్లిపుట్టుక మేనమామకి ఎరుక అని వినే ఉంటారుగా

17 రామసేన. రామసేన అంటే వానరులే కదా. మంగళూరులో పబ్బులో అమ్మాయిలని కొట్టింది రామసేన వాళ్ళేకదా.

20 సుగ్రీవాన. సుగ్రీవుని ఆజ్ఞ తిరుగులేనిదంటారు.

21 మనోరమ. మనసులని రంజింప చేసేది మనోరమ.

22 బందం. ఇద్దరు మనుషుల మధ్య ఉండేది బంధం ఈమధ్య బందం అని కాకుండా వత్తులతో ఎవరైనా పలుకుతున్నారా?

24 వలువ. విలువ లాగే అనిపించే వలువ (బట్ట) సమాధానం.

26 దేవప్రయాగ. మందాకినీ భాగీరథుల సమాగమప్రదేశం దేవప్రయాగ. ప్రయాగ అంటే నదీ సంగమ స్థానం.

29 పాట. వేలం వేయడాన్ని పాట అంటాం కదా.

31 సయనారా. సయనారా అన్న పాట లవ్ ఇన్ టోక్యో సినిమాలోది. గుడ్ బై అని అర్థం.

32 కుకు. కుకు పక్షి పేరు వినే ఉంటారు. కొంతమంది కకూ అని కూడా అంటారు. కానీ కూతని బట్టి కుకు అని రాసా.

34 జాతిరత్నం. మేలైన రాయి అంటే జాతి రత్నం అంటారు.

36 తృణం. సీత రావణుడితో తిన్నగా కాక, మధ్యలో గడ్డి పోచని పెట్టుకుని మాట్లాడిందట. “తృణముకన్న రావణుడే హీనమన” అని సుందరదాసు ఎమ్మెస్ రామారావు గారి పాదం.

37 రరసం. రచయితల సంఘాలు పొట్టి పేర్లు పెట్టుకోవడం ఒకప్పటి రివాజు – విరసం, ఇరసం వగైరా…

39 శ్యామకృష్ణ. శ్యామకృష్ణ సోదరి అన్న అంకిత ముద్ర శ్యామశాస్త్రి గారిది.

41 వికా. వికా ని సరిగ్గా చూస్తే కావి. అదొక రంగు.

42 జత. పక్షులు కట్టేది. గూడు కడతాయి కానీ, అది కట్టడం జత కట్టాకే.

43 దర్గ. చంద్రముఖి సినిమాలో రజనీ కాంత్ (సినిమాలో ఈశ్వర్) నయనతారని దర్గా అని పిలుస్తాడు.

44 సురవరం ప్రతాపరెడ్డి. దేవతల (సుర) వరం వల్ల ప్రతాపవంతుడయ్యాడీ గోలకొండ పత్రికని నడిపినాయన – సురవరం ప్రతాపరెడ్డి

నిలువు

1 దన్ నం త్రామిసు. సుమిత్రానందన్ పంత్ హిందీ కవి – వెనక్కి తిరిగి అంటే కిందనుంచి పైకి రాయాలని తెలుసుగా

2 శకునిమావా. దుర్యోధనుడి మామ శకుని. ఆధారంలో మాఁవ అని ఇచ్చాం కాబట్టి – శకునిమావా అని రాయాలి.

3 బైర్రాజు రామలింగరాజు. బైర్రాజు రామలింగరాజు గారి గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆయన పేరులో లింగం, రెండు సార్లు రాజు అని వస్తుంది.

4 ఠావు. మాకు ఏ 4 సైజు తెలిసేది కాదు. మాకు ఎప్పుడూ ఠావు సైజు కాగితాలే. ఠావుల్ తప్పెన్, ధైర్యము విలోలంబయెన్ అన్న పోతన పద్యం నుంచి.

5 పుట్రా. పులి తోడిదే – ఇందులో కుట్రేమీలేదు (2)

6 బాలార్కబింబం. “బాలార్క బింబము ఫలమని తలచిన ఆరడి చేష్టల హనుమంతా” అని అన్నమయ్య కీర్తించినది ఆంజనేయుడి గురించే.

7 రాగులు. బైరాగులు – ఈ పదంలోనే తినే ధాన్యం పేరుందిగా.

9 . కమో. ఎంత మోకరిల్లినా మొలక పైకే పెరుగుతుంది (2)

11 వెత. వెతకడంలో వెతఉంది గమనించండి.

13 లుసేరవ. వరి పొలాలని వరిసేలు అంటారు. వరలు కూడా ఓరకం ధాన్యమే. వరసేలు అని కిందినుంచి రాయాలి.

16 మానవ ప్రయత్నం. మనిషి తనవంతు చేసేది మానవ ప్రయత్నం

18 మనో. మనో – పాట గాడు, నటుడు, 21 అడ్డంలో ఉన్న మనోరమ తో పేరు లోమాత్రం సంబంధం ఉన్నవాడు

19 నమలుపాకు. తమలపాకుని నమలుతాం కదా – అందుకని నమలుపాకు అన్నాం.

23 దందన. దందన అంటే మాయ. దందన దందన అన్న శబ్దాలని తానంలో వాడతాం.

25 వట. శేషశాయి వటపత్ర శాయి కాదా.

27 వసరసం. వస పోస్తే వాగుడు వస్తుందంటారు

28 యానా. చనిపోయిన డయానా ప్రిన్స్ ఛార్లెస్ భార్య. యానా సినీ నటి పేరు.

30 రాజారవి. రాజా రవివర్మ గారు గొప్ప చిత్రకారుడని తెలుసుగా

32 కురమడప. సూర్యుడు పడమరకు ఉదయించడు. పైకి అన్నాం కాబట్టి తిరగేసాం.

33 ద్రోణం. పాండవుల గురువు ద్రోణుడు కుండ (ద్రోణం) లోంచి పుట్టాడు కాబట్టి ఆ పేరొచ్చిందిట.

35 తిరకాసు. తిరక మరకగా చేస్తే తిరకాసంటాం కదా

36 తృష్ణ. ఎడారిలో ఎండమావులు దాహం తీర్చేవి కావు. మృగం అని ఇచ్చి సూచనిచ్చాం.

38 అంతరం. మొత్తం తేడా అంతా అంతరంగనాధుడిలోనేనా ..(3)

40 భార్గవి. జన్మతః కన్నడిగ అయిన భార్గవీరావు గారు కన్నడనుండి తెలుగుకి అనువాద సాహిత్యానికి చాలా సేవ చేసారు. ఆంగ్లభాషాచార్యులుగా చేసేవారు. ఈమధ్యనే పరమపదించారు.

42 జవ. నెహ్రూగారికీ, క్రికెటర్ శ్రీనాథ్ కీ తమ పేర్లలో ఉమ్మడిగా ఉన్నది ‘జవ’ అంటే వడీ, వేగం అని అర్థం.

Posted in గడి | Tagged | 2 Comments

ఫిబ్రవరి నెల బ్లాగు వీక్షణం

చూడలేక కళ్ళు మూసుకొన్నాం

Posted in జాలవీక్షణం | Tagged , | 24 Comments

రామ చిలుక

-వెంపటి హేమ

చిగురాకు జొంపాల చక్కగా ఇముడుచూ
కాయ కసరులు తింటూ కాలము గడిపేటి
శుద్ధ సాత్వికమూర్తివి కీరమా నీవు !

తోటివారల గూడి తోటలందాడుచూ
గుంపులుగ చేరి కిల కిలలాడేటి
రామచిలుకా, నీతోటి రగడ ఎవ్వరికే
పట్టి బంధించి నీతో పంతాలుపోగా !

ఆకాశ వీధిలో ఆటలాడుచు ఎపుడు
మధురాతి మధురమౌ మామిడి పళ్ళు,
దోరజామి పళ్ళ తీపి రుచుల నాని
గోధూళి వేళకు గూటికి జేరుకొని
ఆదమరచి హాయిని నిదురపోయెదవు.

శుక వతంసమా ! చూడగా నిను వెతకి
పట్టి బందీని చేసేటి పాపి ఎవరొకో !

చిగురుటాకును బోలు మేని ఛాయయు,
కెంపులను గేలిచేసేటి ఒంపుముక్కును,
తేనె లొలికించు తీయని గళపు పటిమతో
మమ్ము మురిపించు ప్రతిభయే ముప్పాయె !
నీ లోని సొగసులే నీకయ్యె శత్రువులు,
నీ ప్రజ్ఞలే నీకు శాపములాయె !

అనుకరణలో అంత నేర్పరితనమేల ?
మనిషిలా నీవు మాట్లాడు టెందుకు ?

నీపలుకు నీ సొగసు లాసించి జనులు
పట్టి నిను పంజరాన ఉంచి పెంచి,
స్వేచ్ఛ నడచి సదా నిను వేధింతురు కదా !
అభము శుభమూ తెలియని పక్షి జన్మే ఐనా
అనుభవించక తప్పదమ్మా నుదుటి వ్రాత !

రచయిత్రి పరిచయం: వెంపటి హేమ గారు ప్రస్తుతం కాలిఫోర్నియా లో ఉంటున్నారు. ఫిజిక్స్ లో డిగ్రీ  పూర్తి చేసి కలికి అన్న కలం పేరు తో ఈవిడ రాసిన కథలు ఆంద్ర ప్రభ, యువ వంటి పత్రికలలో 1970 వ దశకం లో ప్రచురించబడ్డాయి. కారణాంతరాల వల్ల రాయడం మానేసినా మళ్ళీ 2006 నుండి రచనా ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభించి పత్రికల్లో, పోటీల్లో పాల్గొంటున్నారు.

Posted in కవిత్వం | Tagged , | Comments Off on రామ చిలుక

అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం

– డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

అతీంద్రియ శక్తుల గురించిన భావనల్లో ప్రతివారికీ భౌతిక శరీరంతోబాటుగా, దానికి భిన్నమైన ఒక ఆత్మ వంటిది ఉంటుందన్న నమ్మకం ప్రధానమైనది. శరీరం భౌతికంగా నశించిపోయిన తరవాత కూడా ఆత్మకు అస్తిత్వం ఉంటుందని చాలామంది నమ్ముతారు. మానవచరిత్రను పరిశీలిస్తే ఇటువంటి నమ్మకాలు ఆటవికదశలోనే రూపొందినట్టు తెలుస్తుంది. నిద్రలో కలలు కంటున్నప్పుడు ఆత్మ శరీరం నుంచి వేరయి, లోకమంతా కలయదిరుగుతున్నట్టు అనిపిస్తుంది. చావుకూ, నిద్రకూ పోలికలున్నట్టు ఆదిమానవులు భావించారంటే విడ్డూరం లేదు. “దీర్ఘనిద్ర” తరవాతకూడా ఆత్మ స్వేచ్ఛగా తిరుగుతూనే ఉండాలి. దానికి చావు ఉండదు. Continue reading

Posted in వ్యాసం | 17 Comments

దెయ్యమంటే భయమన్నది…

ఆంగ్ల మూలం: డా. శృతి మొహాపాత్ర
అనువాదం: కొల్లూరి సోమ శంకర్

నేను ఆవిడని బస్‌లో కలిసాను. బస్ నిండిపోయి ఉంది. ప్రయాణీకులందరినీ ఓ చిన్న పెట్టెలో ఉంచి మూతపెట్టేసినట్లుగా ఉంది. సీటు కోసం వెదుకుతున్న నా నిస్సహాయమైన చూపులను పట్టించుకోకుండా, ఆమె కాసేపు అటూ ఇటూ చూసింది. మళ్ళీ ఏమనుకుందో ఏమో, ఇద్దరికి సరిపోయే ఆ సీటులో కొంత ఖాళీ వదిలి ఎడమవైపుకి జరిగింది. అదే సీటులో ఉన్న ఇంకో ఆవిడ కోర చూపులను పట్టించుకోకుండా నేను వెంటనే ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాను. Continue reading

Posted in కథ | Tagged | 10 Comments

గుండెచప్పుడు విందాం..

-చదువరి

అమెరికాతో అణు ఒప్పందం మనకు తగునో కాదో మనకు తెలీదు. ఇదిగో ఈ కారణాల వలన అది మనకు మంచిది అని ఎవరైనా చెబితే.., ఓహో కాబోలనుకుంటాం. ఇదిగో ఇందుకని ఇది మంచిది కాదు అని మరొకరు చెబితే ఔన్నిజమే కదా అనిపిస్తుంది. వివరాలు సరిగ్గా తెలీనప్పుడు వాదనలన్నీ సరియనే అనిపించే అవకాశం ఉంది. కానీ ఆ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసికోవాలని ఉందా.. ఈ బ్లాగరి ఏమైనా రాసారేమో చూడండి.

తెలంగాణాకు అన్యాయం జరిగిందని అందరూ చెప్పేవారే.. ఆ అన్యాయం ఎలా జరిగిందో వివరించేవారు మాత్రం అరుదు. ఆ సంగతులు తెలుసుకోవాలనుకుంటే ఈ బ్లాగు చూడండి.

సరళీకృత ఆర్థిక వ్యవస్థలో సామాన్యుడి జీవితం ఏ విధంగా ఉంది, ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఎలా కంటకంగా తయారయ్యాయి వంటి అంశాలపై వివరణాత్మక వ్యాసాల కోసం ఈ బ్లాగును పలకరించండి.
gumdecappudu
బ్లాగుల్లో అనేకానేక విషయాలపై స్పందిస్తూ, విశ్లేషిస్తూ, విమర్శిస్తూ, ప్రజలు, సమాజం, రాజకీయ నాయకులు ఏం చెయ్యాలో దిశానిర్దేశం చేస్తూ జాబులు చూస్తూంటాం. తాము రాసినవాటిని నిజజీవితంలో ఎంతమంది పాటిస్తూంటారో చెప్పలేం. సామాజిక విషయాల పట్ల తన గుండె చప్పుడును బ్లాగులో వినిపిస్తూ నిజజీవితంలోనూ ఆచరించి చూపిన వ్యక్తి దిల్, ఆయన గుండెచప్పుడే ఆ బ్లాగు.

ఒక దళారీ పశ్చాత్తాపం పుస్తకాన్ని చదివే ఉంటారు. అనువాద పుస్తకాల్లో అంతగా ప్రాచుర్యం పొందిన పుస్తకాలు మరిన్ని లేవు. ఆ పుస్తకాన్ని చక్కగా అనువదించిన కొణతం దిలీపే గుండెచప్పుడు బ్లాగును కూడా రాస్తున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయారు నెజ్జనులనేకులు. వారి ఆశ్చర్యం -కొణతం దిలీప్ బ్లాగు రాస్తున్నందుకు కాదు, దిల్‌గా అందరికీ తెలిసిన ఆ గుండెచప్పుడు బ్లాగరే కొణతం దిలీపని పదిహేను నెలల వరకు ఎవరికీ తెలీకపోవడం, (ఆ సంగతి కూడా వేరేవారి ద్వారా తెలిసింది). దళారీ పశ్చాత్తాపం ద్వారా అయన ఎంత ప్రసిద్ధుడయ్యారో అంతకంటే ఎక్కువగా గుండెచప్పుడు దిలీప్‌గా బ్లాగులోకంలో ప్రసిద్ధుడయ్యారు. స్వతహాగా రచయిత అవడమే కాకుండా సామాజిక రాజకీయ, ఆర్థిక విషయాలపై లోతైన పరిజ్ఞానం ఉంది కాబట్టి అందులో అసహజమేమీ లేదు.

గుండెచప్పుడు, విషయ పరిజ్ఞానం కోసం చదవాల్సిన బ్లాగు. గుండెచప్పుడుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి.

  • తెలంగాణ అంశానికి అనుకూలంగా విస్తారంగా రాస్తారు. ఒక ప్రత్యేకత ఏంటంటే.. తెలంగాణా పట్ల దురభిమానం కాక, వాస్తవాలు తెలియజేసే ధోరణిలో ఉంటుంది. తెలంగాణా వ్యతిరేకులకు తన వాదనను చెప్పి, ఒప్పించి, మెప్పించాలని చూస్తారు.
  • తన పరిజ్ఞానాన్ని సందర్భోచితంగా వాడి, చదువరికి అనేక విషయాలను తెలియజేస్తారు. 610 జీవో గురించి చక్కటి సమాచారం ఇచ్చే ఈ టపా చూసినా, చరిత్ర లేని జాతిగా మిగిలిపోనున్నామా అనే ఈ టపా చూసినా ఈ బ్లాగులోని టపాల విలువ తెలుస్తుంది.
  • సామాజిక, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు.

పర్యావరణం దిలీప్ అభిమాన విషయాల్లో ఒకటి. అభివృద్ధి పేరిట ప్రజలకు, పర్యావరణానికీ, సంస్కృతికీ జరుగుతున్న కీడుపట్ల దిలీప్ హృదయం బాధతోను, కోపంతోను కొట్టుకుంటుంది. అరకులోయ అందాలను ఆస్వాదిస్తూనే అక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎదురౌతున్న ముప్పు గురించి హెచ్చరిస్తారు. కొత్త సంవత్సరం, పాత జ్ఞాపకాలు జాబులో మొబైలు ఫోను వచ్చి గ్రీటింగు కార్డులను ఎలా మాయం చేస్తోందో రాస్తూ నిట్టూర్చారు.

బ్లాగుల్లో రాసినదాన్ని ఆచరించడంలో కూడా దిలీప్ విలక్షణ వ్యక్తే! ప్రజల వ్యతిరేకతను పట్టించుకోకుండా తన సొంత ఊరి వద్ద స్థాపించతలపెట్టిన స్పాంజి ఐరను కర్మాగారానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారు. ఆ వివరాలను బ్లాగులో పెట్టి సాటి బ్లాగరులకు స్ఫూర్తినిచ్చారు. పోలేపల్లి సెజ్‌కు వ్యతిరేకంగా నడుపుతున్న పోరాటంలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

దిలీప్ శైలి మృదువుగా, నచ్చజెప్పే ధోరణిలో, ఆలోచింపజేసేదిగా ఉంటుంది. అయితే ఘాటుగా ఉండే జాబులూ కొన్ని లేకపోలేదు. 2007 మేలో “తల్లి” అనే అంశంపై రేగిన బ్లాగు దుమారం సమయంలో గుండెచప్పుడులో ఓ జాబొచ్చింది. అప్పటి చర్చలో దురహంకారపు ప్రేలాపన! అనే ఆ జాబు కూడా ప్రముఖంగా పాల్గొంది. ఈ పనికిరాని “జాతీయవాదం” ఎవరికి కావాలి?, భాషా ప్రయుక్త రాష్ట్రమా గాడిద గుడ్డా! వంటి జాబులూ రాసారు. “కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా మన్మోహన్” అని అడిగిన టపా చూడండి.

తన బ్లాగులో అర్థవంతమైన చర్చకోసం దిలీప్ సిద్ధంగా ఉంటారు. రెండో ఎస్సార్సీ గురించి రాసిన టపాలో జరిగిన చర్చకు సమాధానంగా సమైక్యాంధ్రలో రెండు ప్రాజెక్టుల కథ అంటూ ఒక టపా రాసారు. చర్చను పెడధోరణి పట్టించే ప్రయత్నం జరిగినపుడు చురకేసేందుకు వెనకాడరు.

అయితే తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ చేసే కొన్ని అనుచిత వాదనల్లాగానే ఉన్న ఒక వాదనను గుండెచప్పుడులోనూ చూస్తాం..బాసరకో న్యాయం బందరుకో న్యాయం అనే జాబులో తెలంగాణ ప్రజల మనోభావాలకు విలువ లేదనే అంశాన్ని ప్రస్తావించడం కొంత మితిమీరిన ఆక్రోశంలా అనిపించే అవకాశం ఉంది. ఈ టపాకు మరో ప్రాముఖ్యత ఉంది.. ప్రస్తుతం బ్లాగులనుండి తప్పుకున్న ఒకప్పటి ప్రముఖ బ్లాగరి, చాలా అరుదుగా ఇతర బ్లాగుల్లో వ్యాఖ్యానించే అంబానాథ్ ఈ జాబులో రాసిన వ్యాఖ్య, ఆయన భావజాలం తెలియని పాఠకులను ఆశ్చర్యపరుస్తుంది. తెలుగుజాతీయవాది బ్లాగు గురించి తెలియని వారు, ఇప్పుడా బ్లాగు ఎలాగూ లేదు కాబట్టి పొద్దులో వచ్చిన ఆ బ్లాగుసమీక్షను చూడవచ్చు.

కొణతం దిలీప్ గుండెచప్పుడు వినాలంటే గుండెచప్పుడు బ్లాగును చదవాలి. బ్లాగరి వామపక్ష దృక్పథం బ్లాగులోని అభిప్రాయాల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది. గుండె ఎడమవైపునేగదా ఉండేది అనే మాట ఈ సందర్భంలో గుర్తుకు రాకమానదు. తన బ్లాగు ముఖచిత్రంగా ఎంచుకునే బొమ్మలు బ్లాగరి దృక్పథాన్ని తెలుపుతూ ఉంటాయి. తాను ఇప్పటివరకూ వాడిన ముఖచిత్రాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ఒక పేజీ రాసారు కూడాను.

బ్లాగులోని పాత టపాలను వెతకడం చాలా శ్రమతో కూడుకున్న పని. వర్గాలను పట్టుకుని టపాలను వెతుక్కుంటూ పోవడమొక్కటే మార్గం. నెలవారీగా టపాలను వెతుక్కునే లింకు లేకపోవడం, వెతుకు పెట్టె లేకపోవడం ఈ బ్లాగులోని లోటు. లేదా, వర్డ్‌ప్రెస్సు ప్రామాణిక URL పద్ధతిని అనుసరించి తేదీవారీ, నెలవారీ, సంవత్సరం వారీ టపాలను వెతుక్కోవాలి.

ముగించే ముందు, ఈ బ్లాగులోని ఉత్తమమైన ఒక టపా గురించి చెప్పుకుందాం.. దాదాపు స్వయంసమృద్ధ స్థితి నుండి బియ్యంకూడా కొనుక్కునే స్థాయికి అభివృద్ధి చెందిన తన స్వంత ఊరి గురించి దిలీప్ రాసిన ఈ టపా స్వగతాన్ని చెప్పుకునే మేటి టపాల్లో ఒకటి. ఈ టపా అచ్చు పత్రికల్లో పునర్ముద్రింపబడింది.

గత కొంత కాలంగా కాస్త మందగించిన గుండెచప్పుడు, మళ్ళీ పూర్తిస్థాయిలో వినిపించాలని బ్లాగరులు ఆశిస్తున్నారు.

—————

-చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు

Posted in జాలవీక్షణం | Tagged | 7 Comments

ఫిబ్రవరి గడిపై మీమాట

2009 ఫిబ్రవరి గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి

పాత గడులు

———————————-

Posted in గడి | Tagged | 11 Comments

జనవరి గడి సమాధానాలు

ఈసారి కొంచెం కష్టంగానే ఇచ్చాననుకున్నాను కాని చాలామంది బాగానే ప్రయత్నించారు. గడిని నింపి పంపించినవారు మొత్తం పన్నెండు మంది. అందరికీ అభినందనలు. -భైరవభట్ల కామేశ్వరరావు

  • అన్నీ సరిగ్గా రాసి పంపినవారు: రాధిక (మహార్ణవం) గారు. వారికి ప్రత్యేక అభినందనలు.
  • ఒకే ఒక తప్పుతో పంపినవారు: మనసులో మాట సుజాతగారు. ద్వాదశి వీరికి అచ్చిరాలేదు 🙂
  • రెండు తప్పులతో పంపినవారు: నాగమురళిగారు, ఆదిత్యగారు.
  • మూడు తప్పులతో పంపినవారు: జ్యోతిగారు.
  • గడి నింపి పంపిన ఇతరులు: వెన్నెల, సుధారాణి పట్రాయని, కృష్ణుడు, కామేశ్, రాఘవ, పిచ్చోడు, కోడిహళ్ళి మురళీ మోహన్, శ్రీలు.
1ద్వా 2 యు 3గం 4 రి 5వే 6పా కు
7బే రం 8జా వు 9
జా 10 యి 11నం 12కం
13రు చి 14ము 15తి త్తు 16లు 17సం కు
18 19వా 20లా 21
22కొ 23 24దా ము 25 ట్టు
త్త 26రా వా 27పీ తాం 28ము
29బం 30ధు వు లు 31 లి తం 32సం దు 33
34గా 35పు ట్టు క్ర
రు 36బె త్తం 37 గ్ర హం
38లో 39గు ట్టు 40మా ర్గ 41శి రం ణం
42కం 43జ్వా లా ము ఖి 44శి 45పూ లు

అడ్డం
======
1 కృష్ణుడు నల్లవాడే అయినా, విష్ణుమూర్తి పసుపుపచ్చగా ఉంటాడట ఈ కాలంలో! (3, 2) – ద్వాపర యుగం – ఒకో యుగంలో విష్ణుమూర్తికి ఒకో రంగు ఉంటుందట. ద్వాపరంలో విష్ణువు రంగు పసుపని అంటారు. కృష్ణావతారం ద్వాపరయుగంలోనే కదా.
4 ఏనుగు నమిలే తిక్తపత్రాన్ని అలా తీసిపారేయకండి! (5) – కరివేపాకు. తిక్త పత్రం అంటే చేదుగా ఉండే ఆకు. వేపాకు. ఏనుగు – కరి. కరివేపాకులా తీసిపారెయ్యడం అంటాం కదా. Continue reading

Posted in గడి | Tagged | 7 Comments

జనవరి బ్లాగావరణం

-చదువరి

బ్లాగుల్లో వివాదాలు కొత్తేం కాదు. కాని వివాదాల కారణంగా కొన్ని బ్లాగుల్లో సార్వజనిక ప్రవేశాన్ని తీసేసి కేవలం ఎంపిక చేసుకున్న కొందరు బ్లాగరులకే ప్రవేశం కల్పించారు. వ్యక్తిగత కారణాల వలన మూతపడిన బ్లాగులూ ఉన్నాయి. కారణాలేమైనప్పటికీ కొన్ని మంచి బ్లాగులకు ప్రవేశం లేకపోవడం లేదా మూత పడటం విచారకరం. త్వరలో ఈ బ్లాగులు మళ్ళీ చదువరులకు ఆహ్వాన వచనాలు పలుకుతాయని ఆశిద్దాం.

సత్యం కంప్యూటర్స్ సంస్థ ఒక మేడిపండని స్వయానా దాని సంస్థాపక చైర్మనే చెప్పాక యావజ్జాతి లాగానే తెలుగు బ్లాగరులూ ఆశ్చర్యపోయారు. వారి స్పందనలు కొన్ని ఇక్కడ:

  1. అ’సత్యమ’న్నారు పులిపాటి నిరంజన్
  2. నిజానికి పాకినాడులోని లజ్జరి తోయిబా గాడు చేసిన దానికన్న పెద్ద ద్రోహం ఇది” అన్నారు నాగన్న
  3. నా హీరో రామలింగరాజు అన్నారు కశ్యప్. ఈ బ్లాగులో బాగా చర్చ జరిగింది
  4. సత్యం వధ అన్నారు అబ్రకదబ్ర
  5. మేటాస్ నిజాలు రాసారు జయప్రకాశ్
  6. ఓడలు బళ్ళయ్యాయి అన్నరు సన్నజాజి
  7. సత్యం గురించి మాట్లాడే హక్కు రాజకీయులకు, పత్రికలకు లేదన్నారు, అరుణాంక్
  8. సత్యం కుంభకోణం నేపథ్యంలో తెలుగు దిగ్గజాల భవిష్యత్తు ఏమటని ప్రశ్నించారు, తాడేపల్లి.
  9. కార్పొరేటు కాశి మజిలీ కథల్లో సత్యం కథ కూడా చేరింది
  10. సత్యాసత్యాల మాటెలా ఉన్నా, రాజు పట్ల తమ సానుభూతిని చూపిన టపాల్లో పద్మకళ రాసిన ఈ జాబు అత్యంత ఉద్వేగభరితమైంది.

రాజకీయాలు

  1. భారత రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర గురించి రాస్తున్నారు అమ్మ ఒడిలో
  2. పోలింగు బూతుల గురించి చెబుతున్నారు ఫణి మాధవ్
  3. ఏమారిన మనిషి గురించి రాసారు అబ్రకదబ్ర

కలగూరగంప

  1. కత్తి మహేష్ కుమార్‌ను ఇంటర్వ్యూ చేసారు వలబోజు జ్యోతి.
  2. ఎప్పుడో యాభై యేళ్ళ కిందట ఎన్.ఇన్నయ్య విశ్వనాథ సత్యనారాయణపై రాసిన విమర్శను దీప్తిధారలో ప్రచురించారు. సభ్యుల స్పందనతో ఆసక్తికరమైన చర్చ జరిగింది.
  3. విజయవాడ పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ప్రదర్శన గురించిన టపాలు:
    1. జాగృతిలో
    2. మురళీగానంలో
    3. యువకుడి బ్లాగులో
  4. నిడదవోలు మాలతి చాతకపక్షులు అనే నవలను సీరియలిస్తున్నారు.
  5. హై. పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు నిర్వహణ పట్ల భవదీయుని విభిన్న స్వరం విన్నారా?
  6. సొంత డబ్బా కొంతమానుకు పక్కబ్లాగును చూడమంటున్నారు జయభారత్
  7. ఉగ్రవాదులు మావాళ్ళు కాదంటున్న పాకిస్తానుపై కన్నెర్ర జేసారు ఫణి ప్రసన్న కుమార్. వీరు కార్టూన్లు కూడా వేస్తూంటారు.
  8. ప్రభల తీర్థం గురించి రాసి, ఫణి చదువరుల జ్ఞాపకాలను తట్టిలేపారు.
  9. అంతరించిపోతున్న పిచ్చుకలకు తన ఆవేదనను వెలిబుచ్చారు బొల్లోజు బాబా
  10. కిక్ సినిమా చూసారా? లప్పంగిరిగిరి చూడండి, తెలుస్తుంది.
  11. కాలసర్పయోగం గురించి సత్య రాసారు
  12. బోర్న్‌విటాను తొందరపడి వాడొద్దంటున్నారు తెలుగబ్బాయి.
  13. “కందం రాసినవాడు కవేగాని అంతింతో కందపద్య మల్లగలవాడెల్లా ఎంతమాత్రమూ కవికాడు.” శ్రీశ్రీ, ఆరుద్రల సంవాదం చదవండి.
  14. లేటుగానైనా సంక్రాంతి పండగను లేటెస్టుగా చేసుకున్నారు అరిపిరాల సత్యప్రసాదు గారు
  15. శ్రీపతిశర్మ నవ్వు నాలుగు విధాలంటున్నారు.
  16. గరికపాటివారి అవధానం గురించి భైరవభట్ల కామేశ్వరరావు రాసారు.
  17. ఆమనిలో తెలుగెందుకు చదవాలి అనే జాబు రాసారు. వేరే బ్లాగులో వచ్చిన ఇంగ్లీషు జాబుకు ఇది స్పందన.
  18. డావించీ చేతిలో కాగితం, యూనివర్సిటీ ఒడిలో విద్యార్థి – ఈ పోలికను అసంఖ్య మాటల్లో చదివి, వీడియోలో చూడండి.
  19. శ్రీశ్రీ లేకున్ననేమి సిరిసిరిమువ్వా! అంటున్నారు రాఘవకిరణ్. మరి సిరిసిరిమువ్వ ఏమన్నదో తప్పకుండా కనుక్కోవలసిందే.

సినిమా

  1. రవిగారు మస్కా సమీక్ష రాసారు
  2. కాలాస్3 కూడా మస్కాను సమీక్షించారు
  3. స్లమ్‌డాగ్ మిలియనీర్ గురించిన సమీక్ష రేరాజ్ మాటల్లో చదవండి.

హాస్యం

  1. గిరీష్, లోపలి మనిషిల సంవాదం చదవండి.
  2. ఫణి ప్రసన్న కుమార్ గిరీశం ది గ్రేట్ కార్టూన్లు చూస్తున్నారా?
  3. నవ్వులాటే ఇది

జ్ఞాపకాలు

  1. మంచు కురిసినరాత్రి ఉమాశంకర్ అనుభవాలు చదివారా?
  2. తన ఊరెంత మారిందో నని వేదన చెందారు అస్థికలులో
  3. మా ఊరూ మారిపోయిందంటున్నారు లక్ష్మి
  4. రానారె పారిగోడ పడిపోయిన కత విన్నారా?

సాంకేతికం

  1. సమాచార సేకరణ ఎలా చెయ్యవచ్చో చెబుతున్నారు గార్లపాటి ప్రవీణ్
  2. ఆన్ లైన్ వీడియోలను fast forward చేయడం ఇలా!

కొత్త బ్లాగులు

  1. e-కలం పేరుతో కొత్త బ్లాగు వచ్చింది.
  2. తెవికీలోని మంచి వ్యాసాలను ఎంపిక చేసి క్లుప్తంగా ప్రచురిస్తున్నారు జీడిపప్పు బ్లాగులో
  3. సంగతులు చెబుతూ ప్రవేశించింది సంకీర్తన బ్లాగు
  4. నాలోనేను అంటూ శివ బ్లాగులోకంలోకి వచ్చారు
  5. మంచి పుస్తకం” ప్రచురణ సంస్థవారు బ్లాగు మొదలుపెట్టారు.
  6. ఉల్లి లేని వంటలంటూ వంటల బ్లాగు వచ్చింది.
  7. ఓపెన్ జగత్‌ను కూడా ఈ నెల్లోనే తెరిచారు
  8. సాయినాథ్ బ్లాగులోకంలోకి ప్రవేశించారు
  9. ఈ నెల్లోనే నెమలి కన్ను తెరిచింది.

———-

-చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు

Posted in జాలవీక్షణం | Tagged , , | 4 Comments