అమరావ్రతం

– మూలా సుబ్రహ్మణ్యం

దీపశిఖపై మృత్యువు నర్తిస్తోందా అన్నట్టు గదిలో దీపం వీస్తున్న గాలికి టప టపా కొట్టుకుంటోంది. మంచం మీద రంగాచారి చరమ దశలో ఉన్నాడు. భార్య సత్యవతి, కొడుకు రామాచారి కన్నీళ్ళతో చూస్తున్నారు. శాస్త్రులు గారు నాడి చూసి “ఇక లాభం లేదమ్మా సత్యవతీ” అని లేచారు.

ఒక వైపు దేహాన్ని మృత్యువు కబళించివేస్తున్నా, రంగాచారి మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. వాళ్ళ రాజ్యంలోనే కాదు చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా రంగాచారి పేరు తెలియని వారు అరుదు. అంతటి గొప్ప శిల్పి ఆయన. రామాచారిని మాత్రం ఉండమని సత్యవతిని కూడా బయటకి వెళ్ళమని సైగ చేసారు.
Continue reading

Posted in కథ | Tagged , , | 19 Comments

‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ

–స్వాతీ శ్రీపాద.

విస్తృతంగా కథలు రాస్తూ ఉన్నా తన్ను తాను అనుకరించుకోవాల్సిన అవసరంలేని వస్తువైవిధ్యం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. రాయలసీమను గురించీ, వ్యవసాయ జీవన పతనాన్ని గురించీ, దళిత జీవిత సమస్యలను గురించీ మళ్ళీ మళ్ళీ కథలు రాసినా అతని దృక్పథంలో ఉన్న కొత్తదనం ఆ కథలకు జీవం పోస్తుంది. బయటికి కనిపించని ఉద్విగ్నత ఇతని కథల్లో కుతకుతలాడుతుంది. ఆవేశపడకుండా ఆవేశాన్ని కలిగించే కథన చాతుర్యం ఉన్న రచయిత సన్నపురెడ్డి. అతడు రాసిన కొత్త దుప్పటి, తడి, గిరిగీయొద్దు, చనుబాలు, కన్నీటి కత్తి లాంటి కథలు అతని కథన చాతుర్యానికి, జీవిత దృక్పథానికి మంచి నిదర్శనాలు. ఇతడు తెలుగు కథకున్న భవిష్యత్ ఆశల్లో నిస్సందేహంగా ఒకడు. – కీ.శే. వల్లంపాటి వెంకటసుబ్బయ్య

తరాలు మారే కొద్దీ వెనక తరాల విలువలను నిర్లక్ష్యం చేయడం, ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలు పలుచనైపోవడం గమనిస్తున్నాం. శ్రమైక జీవన సౌందర్యాన్ని మరచి కృత్రిమ ఆడంబరాలకు దాసోహమనే ఆధునిక జీవనశైలిని సున్నితంగా విమర్శిస్తూనే వెనకతరాలవారి పని విలువలను గుర్తించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పే కథ గిరిగీయొద్దు. Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on ‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కి ఘనంగా “చాసో స్ఫూర్తి” పురస్కార ప్రదానం

“సంగీత సాహిత్యాల సంగమంగా దేదీప్యమానంగా విరాజిల్లిన చారిత్రాత్మక కేంద్రం, విజయనగరం. ఈ నగరం తనలో నిలుపుకున్న ప్రత్యేకతలూ, ప్రతీకలూ అన్నీ ఇన్నీ కావు. విజయనగరం… గురజాడ ఆనవాళ్ళను తన పొత్తిళ్ళలో ఇముడ్చుకున్న సారస్వత కేంద్రం. కన్యాశుల్కంలోని గిరీశం, మధురవాణి, రామప్పంతులూ, బుచ్చమ్మ పాత్రలనూ, ఆ నాటకంలోని బొంకులదిబ్బ, అయ్యకోనేరు లాంటి స్మృతి చిహ్నాలను తనలో నిక్షిప్తం చేసుకున్న రంగస్థలం. తెలుగు కథకు ఆద్యునిగా చెప్పుకుంటున్న గురజాడ స్మారక కేంద్రం, మహారాజావారి సంగీత కళాశాలలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమై వెలుగొందుతున్న రాచనగరం. ఆదిభట్ల నారాయణ దాసు, ఘంటసాల, ద్వారం వెంకటస్వామినాయుడు వంటి సంగీత చక్రవర్తుల, గాన గంధర్వుల మధుర స్వరాలు ప్రతిధ్వనిస్తున్న సుందర సౌధాల సమ్మేళనం. చాసో గా ప్రసిద్ధుడైన కథారచయిత చాగంటి సోమయాజులువిజయనగరం పేరు వినగానే చాసో కథలు వాయులీన తరంగాలై మన హృదయాల్లో ఆర్తినీ, ఆనందాన్నీ నింపుతాయి. రోణంకి అప్పలస్వామి, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబులు చాసోతో చాసో గారి హవేలీలో ఎడతెరిపిలేకుండా జరిపిన సాహితీ చర్చలు స్ఫురణకు వస్తాయి. వర్ధమాన రచయితల్లో చాసో స్ఫూర్తిని నింపేందుకు నెలకొల్పిన చాసో స్ఫూర్తి పురస్కారం గుర్తుకు వస్తుంది. ఆ స్ఫూర్తితోనే ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 2009 సంవత్సరానికి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కథా రచయిత్రి చాగంటి తులసి ఆధ్వర్యంలో ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగిన ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంపై ” పొద్దు” పాఠకులకు తవ్వా ఓబుల్ రెడ్డి అందిస్తున్న నివేదిక ఇది.”

-తవ్వా ఓబుల్ రెడ్డి
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డికి చాసో స్ఫూర్తి పురస్కారం
కడప జిల్లా కు చెందిన ప్రముఖ కథా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డికి 2009వ సంవత్సరపు ” చాసో ” స్ఫూర్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు. జిల్లా కేంద్రమయిన విజయనగరం లోని ఎం.ఆర్.లేడీస్ క్లబ్ ఆవరణంలో జనవరి 17వ తేదీ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు కింద 10 వేల రూపాయల నగదునూ, జ్ఞాపికనూ అందచేసి శాలువా తో సన్నపురెడ్డిని ఘనంగా సత్కరించారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఆవుల మంజులత మాట్లాడుతూ ప్రపంచ కథా సాహిత్యం లో ఏ భాషకూ తీసిపోని విధంగా తెలుగులో గొప్ప కథలు వెలువడ్డాయని పేర్కొన్నారు. తెలుగు ప్రజల సంస్కృతిని ప్రపంచానికి తెలియ చేసేందుకు మేధావులు కృషి చేయాలని ఆమె పిలుపిచ్చారు. ఆణిముత్యాల్లాంటి చాసో కథలకు శాశ్వతత్వాన్ని కల్పించడానికి అంతర్జాలంలో ఉంచాలని సూచించారు. (పొద్దు ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. -సం.) కేవలం కాలక్షేపం కోసం కాకుండా, సాహిత్యాన్ని ఆస్వాదించే రీతిలో చాసో కథలను పాఠకులు చదవాలనీ, చాసో కథలను సక్రమంగా అవగాహన చేసుకోవడం కష్టతరమని మంజులత అన్నారు. కథా రచనలో చాసో ఆచరించిన శైలీ, శిల్పాలు ఎంతో హృద్యంగా ఉంటాయని, చాసో రచించిన “ఏలూరెల్లాలి” కథను మంజులత ఉదహరించారు.

అనంతరం ప్రసంగిస్తున్న సన్నపురెడ్డిచాసో పురస్కార గ్రహీత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి కథలను కడప యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సమీక్షిస్తూ “గంపెడు గడ్డి” కథలో మానవ సంబంధాలను కరువు ఏ విధంగా ధ్వంసం చేస్తుందో సన్నపు రెడ్డి చక్కగా చిత్రీకరించారని వివరించారు. చనుబాలు, అంటు, పేడ దయ్యం, పాటలబండి కథలను రాచపాలెం ఈ సందర్భంగా ఉటంకించారు. సన్నపు రెడ్డి రచించిన చనుబాలు కథను తెలుగు కథా సాహిత్యంలోనే ఒక గొప్ప కథగా, సన్నపు రెడ్డిని రాయలసీమ కథకు తూర్పు దిక్కుగా ఆయన అభివర్ణించారు. ప్రకృతిలో మనిషిని అంతర్భాగంగా చిత్రీకరిస్తూ సన్నపురెడ్డి ఆహ్లాదకరంగా కథలను రాశారని ఆచార్య రాచపాలెం పేర్కొన్నారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి అచార్య కొలకలూరి ఇనాక్ చాసో కథలను సమీక్షిస్తూ చాసో స్త్రీ పాత్రలను వైవిధ్యభరితంగా చిత్రీకరించారనీ, సమాజ శ్రేయస్సును కోరుకున్నారని వివరించారు. పురుషుడు ఏం చేస్తే చెల్లుబాటవుతుందో స్త్రీ కూడా అదే పని చేస్తే చెల్లుబాటు కావాలనీ, స్త్రీకి లైంగిక స్వేచ్ఛ ఉండాలని చాసో ఆకాంక్షించారనీ ఆచార్య కొలకలూరి వివరించారు.

గురజాడ స్మారక కేంద్రంగా నిర్వహించబడుతున్న గురజాడ గారి స్వగృహాన్ని సందర్శించిన  రచయితలు తవ్వా ఓబుల్ రెడ్డి, సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి, కొలకలూరి ఇనాక్ ,రాచపాలెం చంద్ర శేఖర్ రెడ్డి, నూకా రాంప్రసాద్ రెడ్డి, దివాకర్, అల

గురజాడ స్మారక కేంద్రంగా నిర్వహించబడుతున్న గురజాడ గారి స్వగృహాన్ని సందర్శించిన రచయితలు
తవ్వా ఓబుల్ రెడ్డి, సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి, కొలకలూరి ఇనాక్ ,రాచపాలెం చంద్ర శేఖర్ రెడ్డి,
నూకా రాంప్రసాద్ రెడ్డి, దివాకర్, అల



పురస్కార గ్రహీత సన్నపు రెడ్డి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహితీ క్షేత్రాన్ని చాసో అరవాలు మరవాలుగా దున్ని, కథలనే గట్టి గింజలను పండించారని, తూర్పు కొండల్లో పుట్టిన చాసో కథా ప్రవాహం నల్లమల కొండల వరకూ సాగిందని పేర్కొన్నారు. చాసో కథలు వస్తు వైవిధ్యాన్నీ, ఆత్మసౌందర్యాన్నీ ఇనుమడింపచేసేవిగా ఉంటాయని, శ్రీశ్రీ, చలం, శ్రీపాద, కొడవటిగంటి, తిలక్, మధురాంతకం రాజారాం, చాసో, శంకరమంచి, కేతు విశ్వనాథ రెడ్డి, కొలకలూరి ఇనాక్ తనను ప్రభావితం చేసిన రచయితలని, తనకు తెలిసిన, తన చుట్టూ ఉన్న జీవితాలనే కథావస్తువులుగా ఎన్నుకొని కథలను రాస్తున్నానని సన్నపు రెడ్డి తెలిపారు.

చాసోతో తనకు ప్రత్యక్ష పరిచయం లేక పోయినా ఆయన సాహిత్యంతో మంచి పరిచయం ఉందనీ, తన దృష్టిలో రచయితలతో పరిచయం అంటే ఆయా రచయితలు రాసిన సాహిత్యంతో పరిచయమేనని సన్నపురెడ్డి అభిప్రాయపడ్డారు. తన తండ్రి నిత్యం పారాయణం చేస్తూ ఉండిన రంగనాథ రామాయణం వినడం ద్వారా సాహితీ అక్షరాలను దిద్దుకున్నాననీ, తనకు లభించిన ఈ పురస్కారం తన ప్రాంతమైన రాయలసీమకు దక్కిన పురస్కారంగా భావిస్తున్నట్లుగా సన్నపు రెడ్డి అభిప్రాయపడ్డారు. చాసో రచించిన “కొండగెడ్డ” కథను చాసో కుమార్తె చాగంటి తులసి సభికులకు చదివి వినిపించారు. ఆచార్య కొలకలూరి, ఆచార్య మంజులత చాసో చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రచయితలు వంగపండు, జి.యస్.చలం, తవ్వా ఓబుల్ రెడ్డి, కె. ఎన్. మల్లేశ్వరి, నూకా రాంప్రసాద్ రెడ్డి, ఎన్.కె. బాబు, అల, గంటేడ గౌరునాయుడు, మల్లిపురం జగదీశ్, చాగంటి కృష్ణకుమారి, చాగంటి ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
————
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన తవ్వా ఓబుల్ రెడ్డి ప్రవృత్తి రీత్యా కథారచయిత, ఫ్రీ లాన్స్ జర్నలిస్టు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఓబుల్ రెడ్డి కడప కథ కథాసంపుటికి, మైదుకూరు చరిత్ర, రాయలసీమ వైభవం గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. 20కి పైగా కథలు, 10 కవితలు, 200 వ్యాసాలు వివిధ పత్రికల్లో, ఆకాశవాణి ద్వారా ప్రచురితం, ప్రసారం అయ్యాయి. గ్రామీణ జనజీవన పరిస్థితులు, గ్రామీణ కళలు, గిరిజన జీవన విధానం, ప్రకృతి, అడవులపై అధ్యయనం అంటే చాలా ఇష్టం!
మైదుకూరు లో ” తెలుగు సాహితీ సాంస్కృతిక వేదిక” ద్వారా మిత్రులతో కలిసి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. kadapa.info వెబ్సైటు ద్వారా కడప జిల్లాకు సంబంధించిన సమస్త సమాచారంతోబాటు బ్రౌన్ లేఖలు, మధురాంతకం రాజారాం రచనల్లాంటి అరుదైన పుస్తకాలను అంతర్జాలంలో అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు.

Posted in వ్యాసం | 1 Comment

జనవరి ’09 గడిపై మీమాట

జనవరి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు

———————————-

Posted in గడి | Tagged | 12 Comments

డిసెంబరు ’08 గడి సమాధానాలు

-రానారె

1వి

2య

3వి

లా

4స

5ము

* 6పి

సి

7నా

రి

ప్రు *

8తి

రి

* 9ల


*

* * స్తి

*

10డు

తా

*

*

11త

లి

12గ

13అ

ట్టు

*

14చె
*

*

15కం

*

16ధ

*

17ము రి * 18తా

ళ్ల

19ప్రే మిం చు కుం దాం రా

*

* 20వా తా

పి

*

* కో *

21మ


*

22సు

23డి

* *

ళ్ల

*

24లం

*

25సు

ప్ర

భా


26ము

*

వేం

27లు

*

*

28త

ధా

*

*

*

29సి

30కా

శీ

యా 31త్ర *

32ర

33స

34పి

35పా

సి

*


*

*

36గ

డు

రి

ము *

శా

37క


38బ

డి

*

39సా


రు

*

*

40శా

స్త్రి


*

41కా

గా

రా

రం

*

42లు


*

స్తి

*

డిసెంబరు గడికి పూరణలను పరిశీలించాం.

ఆదిత్య- అన్నీ సరిగ్గా రాశారు.
కామేశ్వరరావు- అన్నీ సరిగా రాశారు. టైపాటు కాబోలు, ఒక పొరబాటుంది. (41 అడ్డం)
వెన్నెల – అన్నీ సరిగ్గారాశారనే పరిగణిస్తున్నాం. ఒకే ఒక పొరబాటుంది కానీ, తెలిసి చేశారనే అనుకుంటున్నాం. (1నిలువు)
శ్రీలు- రెండు తప్పులతో.
కృష్ణుడు- మూడుతప్పులతో.
ఎల్లంకి భాస్కరనాయుడు – మూడుకన్నా ఎక్కువ తప్పులు.

వీరికి మా కృతజ్ఞతాభినందనలు.
సమాధానాలు

అడ్డం:

1. విజయవిలాసము- అర్జునుని మరోపేరు విజయుడు, అడ్రసుకు తెలుగుపదం విలాసము.
6. పిసినారి- కంప్యూటర్ పి.సి., స్త్రీ నారి
8. తిరి- నులి, మెలి, పురిలకున్న అర్థమే తిరికి కూడా వుంది. తివిరి, తిరిగి లలో దాగుంది తిరి.
9. లన- గరిటె తిప్పిన చక్రవర్తులిద్దరే, ఎందువ-లన?
10.డేతా- విధివక్రిస్తే తాడే పామైకరుస్తుందని సామెత.కృష్ణాతీరంలోని పల్లి తాడేపల్లి. తాడే వక్రిస్తే డేతా.
11.తలివగఅట్టు- ఎచటికిపోతా వీ రాతిరి?అవతలిగట్టుకు – ఇవి శ్రీశ్రీ కవిత అవతలిగట్టులోని పంక్తులు.
16.ధత- దంత్యములకోసం చూడండి http://te.wikipedia.org/wiki/తెలుగు_అక్షరాలు
17.మురి- అరిమురి అంటే తొందరగా, వెంటవెంటనే అని.
18.తాళ్ల- తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క. సుభద్రాపరిణయం ఆమె రచనే.
19.ప్రేమించుకుందాంరా- ఈ ఆధారంలో ఇచ్చిన మూడు పెద్ద పదాలు ఈ సినిమాలోని ఒక పాటలోనివి.
20.వాతాపి- వీనికి కూరుకున్నరూపంలోకి మారే విద్య తెలుసు. తాపీగా అన్న పదం వాతాపిని స్ఫురింపజేయాలి.
21.మగ- నిదపమగరిస నుంచి మగ.
22.సుడి- సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోయ్… కుడియడమైతే పొరబాటులేదోయ్ పాటను విననివారెవరు?
24.లంటప- పరివారమే పటలం. దాన్నే కుడి నుండి యడమకు రాస్తే లంపట. అంటే ఆపద.
25.సుప్రభాతము
27.లుత- తలుగు, తలుపులలో తగులుకొనివున్నవి త లు. అక్రమంగా లు త.
28.తధా- ధాత అంటే బ్రహ్మ అని మాత్రమేకాక, బ్రోచువాడు అనే అర్థముంది. తధాగతుడు అంటే బుద్ధుడు కదా!
29.సిలక- నా పాట నీ నోట పలకాల సిలకా అనే పాటలో వచ్చే డైలాగ్ – యెహె..చి గాదూ..సి..సి..సిలకా… విననివారుంటారా?
30.కాశీయాత్ర- చెళ్లపిళ్లవేంకటశాస్త్రి రచన.
32.రసపిపాసి
36.గడుసరితనము- ఈ శబ్దం స్ఫురింపజేయడానికి సరిత్ప్రవాహములాంటి నడవడి అన్నాను.
37.కలబడి- స్వప్నము అంటే కల, పాఠశాల అంటే బడి.
39.సాసరు
40.శాస్త్రి- సైన్సు అంటే శాస్త్రము.
41.కాగారారం – ఆధారంలోని కారం, గారం, కటకటా వంటి శబ్దాలనుండి కారాగారం. అక్షరాలు తారుమారు.
42.లుఆ- ఆవులు అనడానికి బదులు ఆలు అనవచ్చుకదా, ఆలమంద లాగా. ఆలు తిరిగితే లుఆ.

నిలువు:

1. విప్రుడే – VIP విప్ హోదాకలిగిన బాపనయ్యే.
2. యతి
3. విరి- బోడిగుండుకు విరుల అలంకరణ కష్టంకదా!
4. సలలితరాగసుధారససారం- సలిలమనేపదాన్ని, అమృతము(సుధ)నూ ఆధారంలో కనుగొనవచ్చు. ఈ పాటొక రాగమాలిక.
5. మునవ- తోటను వనము అంటాం. అటునుంచీ మునవ. ఇందులో కొత్తదనం నవ.
7. నాస్తి- న+అస్తి. సంస్కృతంలో ఇదొక తమాషా ప్రయోగమనిపిస్తుంది. లేనిదైయున్నది అని అర్థమేమో.
11.తధదాంమ- మత్+అంధత సాగి మదమెక్కి మదాంధత అయి తిరగబడింది.
12.గమురసుభా- భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవుగదా… శంకరాభరణం చిత్రగీతాలు విన్నారా?
13.అరి- అరి అంటే శతృవు. అరికాలి మంట నెత్తికెక్కడమనేది శబ్దసూచన.
14.చెళ్లపిళ్లవేంకటశాస్త్రి- తిరుపతివేంకటకవులలో ఒకరు. అడ్డం 30 చూడండి.
15.కంచుకోట- ఈ సినిమాలోనిదే -లేదు లేదని యెందుకు నీలో వున్నది దాస్తావు- అనేపాట.
18.తాతా
23.డిత- ఆర్ధ్రతను పైకి చూపితే తడి. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారి కథ. చదివారా?
24.లంతశీ- చలువ అనగా శీతలం పైకెగసింది.
26.ముసిసిము- తామలోతాము నవ్వేనవ్వు ముసిముసినవ్వుకదా, అందుకే ముసిలోళ్లు, ఎదురెదురుగా అన్నాను.
27.లుకారకర- పలురీతులు అనగా రకరకాలు. ఇప్పుడు శీర్షాసనం వేయించండి.
31.త్రగడిగా- స్టాలినిస్టు చరిత్ర — సగము గాడిదగత్ర — చదువుకో ఇతరత్ర — ఓ కూనలమ్మా (ఈ ఆధారంలో ఆరుద్ర పేరు చెబితే సులువైపోతుందని చెప్పలేదు. స్టాలినిస్టు చరిత్ర, సగము, చదువుకో అనే పదాలతో స్ఫురిస్తుందిలెమ్మని …)
33.సరిస- ఇప్పుడు ఆధారం చూడండి మీకే అర్థమౌతుంది.
34.పితరులు- ఇప్పుడు ఆధారం చూడండి మీకే అర్థమౌతుంది.
35.పాన + ము = పానము = ప్రాణము
38.బకా- ‘కాబ’ట్టే అనే శబ్ద సహాయంతో అసురుని ఊ’బకా’యం నుండి మొండెం వేరు చేస్తే బకాసురుడు.
40.శాస్తి— మంత్రిగారి వియ్యంకుడు సినిమాలోని పాట.

Posted in గడి | Tagged | Comments Off on డిసెంబరు ’08 గడి సమాధానాలు

నాగమురళి బ్లాగు – సమీక్ష

-రవి

Cogito, ergo sum….
ఆ లాటిన్ వాక్యానికి అర్థం, “I think, therefore I am”. సుప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్త, భావవాద (idealism లేదా essentialism) ప్రముఖుడు, నిరూపక జ్యామితి, రేఖాగణితాల (co-ordinate geometry) రూపకర్త రెనీ దె కార్తె వ్యాఖ్య అది. సరిగ్గా అదే మకుటంతో దాదాపు ఓ సంవత్సరం క్రితం (2007, నవంబరు) ఓ బ్లాగు మొదలయ్యింది. ఆ బ్లాగు నాగమురళి గారిది. కేవలం ఆలోచింపజేయటమే కాక, ఓ చక్కటి అనుభూతిని అందించగలిగిన బ్లాగుల్లో నాగమురళి గారి బ్లాగు చెప్పుకోదగింది.

నాగమురళిబ్లాగు

ఓ చిన్న విషయం.

Our thoughts jump from one conclusion to another conclusion – అంటాడు కృష్ణాజీ. అయితే చాలా కొద్ది మంది మాత్రం తమ ఆలోచనలను పరిశీలనకు ప్రాతిపదికగా ఎన్నుకుంటారు. ఓ దృక్కోణంలో భావం గ్రహించాలంటే, fixed stance ఉండనవసరం లేదు. అనుభవం వల్ల, చర్చల వల్ల మాత్రమే జ్ఞానద్వారపు కపాట విపాటనా సాధనం ఉన్నది. ఇది మురళి గారి భావం. ఈ భావాలు ఈయన టపాలలో, టపాల ద్వారా సాగించిన చర్చల్లో, ఇతర బ్లాగుల్లో పాల్గొని వ్యాఖ్యల ద్వారా చేసిన అభివ్యక్తీకరణల్లో అద్భుతంగా ప్రతిఫలిస్తాయి.

ఆ టపాలు చదివిన తర్వాత మనకూ అలాంటి వ్యక్తులతో పరిచయమైతే ఎంత బావుణ్ణు అనో, మన జీవితంలో తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించో ఆలోచన మళ్ళుతుంది.

పొద్దు సంపాదకులు ఆయన బ్లాగు మీద సమీక్ష వ్రాయమన్నప్పుడు, ఓ పక్క కుతూహలపు డ్రం బీట్సూ, ఇంకో పక్క, “అంత సీను నీకు లేదులే”అన్న అంతరాత్మ సణుగుడు రెండూ కలిసి, డీటీయెస్ ఎఫెక్ట్ లో వినిపించాయ్. ధైర్యే సాహసే సమీక్షా అని మొదలుపెట్టా. ఇది నిజంగా సాహసమే.

బ్లాగుల్లో 2 రకాలు. మొదటి రకం – వీటి గురించి పరిచయం చేయాలంటే, ఆ బ్లాగు లంకె ఇస్తే చాలు. అక్కడకెళ్ళి, ఆ లంకె బిందెల్లో ముత్యాలు ఏరుకున్న తర్వాత అవసరమైతే ఆ లంకె బిందె కంచుదా, ఇత్తడిదా అని తీరిగ్గా ఆలోచించవచ్చు. ఇక రెండవ రకం – వీటి గురించి తెలుసుకోవాలంటే మొదట ఆ బ్లాగు తాలూకు రచయిత వివరాలు, ఆయన వృత్తి, వ్యాపకాలు తదితర వివరాలు తెలుసుకోవడంతో ఉపక్రమిస్తే బావుంటుంది. ఓ చక్కని కర్ణాటక సంగీతపు కృతిని ఆస్వాదించాలంటే, కూసింత స్వరజ్ఞానం, మరింత చ(చి)క్కటి అనుభూతికి దోహదం చేసినట్టుగా.

ఆ ఉద్దేశంతోనే ఈ బ్లాగరి గురించి ఆరా తీస్తే ఈ వివరాలు దొరుకుతాయి. ఓ సాఫ్ట్ వేర్ నిపుణుడు, గత కొన్నేళ్ళుగా విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ, అక్కడి సంస్కృతి, సంప్రదాయాల మధ్య జీవనం సాగిస్తున్న వాడు, పైగా 15 యేళ్ళ వరకు పాఠశాలలో సంస్కృత పరిచయం పెద్దగా లేక, హిందీని వెలగబెట్టిన ఓ వ్యక్తి, కాళిదాసు కుమార సంభవం, మేఘ దూతం , భవభూతి ఉత్తర రామచరితం, మాఘం ఉటంకిస్తూ వ్యాఖ్యానించడం, పైగా సొంతంగా సంస్కృత శ్లోకాలు రాయటం, కొండొకచో తెలుగు పద్యాలు అల్లడం, తెలుగు లాంటి సంస్కృతం మీద ఓ వ్యాసం, జ్యోతిష్యం మీద వివరణా, ఇంతలోనే సాల్మన్ రష్దీ గురించి ఓ వివరణా, తెలుగు సినిమాల మీద విసుర్లు, ….ఇన్ని ఒకే వ్యక్తి చేయగలడు, ఓ వ్యక్తిలో ఇన్ని పార్శ్వాలు ఉన్నాయి అని ఎవరైనా చెబితే, “సరేలే విన్నాం లెండి” అని కొట్టిపారెయ్యడం కద్దు.

ఏంటి, నమ్మట్లేదు కదూ? ఓ సారి ఇక్కడకు వెళ్ళి కైలాస శిఖర దర్శనం చేసి, వస్తూ వస్తూ వీలయితే, ఈ తామర తూడోపాఖ్యానం అనుభూతిలో మునిగి రండి. ఆ తర్వాత ఈయనెవరో అసాధ్యుడిలా ఉన్నాడే అని ఓ కొత్తపాళీ అనుకున్నట్టుగా మీరూ అనుకోకపోతే నా మీదొట్టు.

ఇక ఈ బ్లాగు, కేవలం సాహిత్య చర్చే కాక సున్నితమైన హాస్యం, బాల్యంలో అనుభూతులను రంగరించిన చిక్కటి కలబోత – అన్నం, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయతో కలిపి లాగించినట్లుగా. అంతలోనే, బ్లాగరి తన అనుభవాల్లోకి వెళ్ళి, తను కలుసుకున్న విశిష్ట వ్యక్తులను గురించి మరింత విశిష్టంగా చెప్పగలరు. ఆ టపాలు చదివిన తర్వాత మనకూ అలాంటి వ్యక్తులతో పరిచయమైతే ఎంత బావుణ్ణు అనో, మన జీవితంలో తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించో ఆలోచన మళ్ళుతుంది.

తెలుగు బ్లాగర్లు – కాదు కాదు, తెలుగు “చంపిలు” (చందమామ పిచ్చోళ్ళు) ఆనందంతో, ఆన్ లైన్ లోనే కావలించుకునేంతగా ఋణపడిపోయారీయనకు. ఎందుకంటే, నింగినున్న చందమామను నేలపైకి ఎవరో తీసుకొస్తే, ఆ జాబిల్లి చిరునామాను వెతికి, ఆ వెలుగులను నలుగురికీ పంచారీయన. బహుశా, ఈ ప్రోద్బలమే కాబోలు, మరో చంపి జాబిలమ్మ తాలూకు తోకచుక్కలను, మకర దేవతలనూ క్రోడీకరించి నెజ్జన సేవ చేశాడు. అదే జావాగ్రేసరుడు మరింత ముందుకెళ్ళి, జాబిలమ్మను మన ఇళ్ళకు రప్పించుకునే మార్గం సుగమం చేశాడు. అదే స్ఫూర్తితో బాల (బాలజ్యోతి లవర్) లకు కూడా ఎవరైనా వరద హస్తం చూపిస్తారేమో అని ఓ ఆశ.

బ్లాగ్లోకానికి ఈయన ఇంకో సమర్పణ శ్రీరమణ రచనల లంకె.

ఇంకో విషయం. మంచి టపాలు రాయటం ఓ గొప్ప విషయమైతే, ఆ టపా ద్వారా ఓ స్ఫూర్తిని కలిగించి, ఇంకొక మంచి టపా రాయడానికి ప్రేరేపించడం, లేదూ కనీసం ఆలోచింపజేసే వ్యాఖ్యలను రాసేలా ప్రేరేపించగలగటం ఓ గొప్ప విషయం. బ్లాగ్లోకంలో అలాంటి స్ఫూర్తిని అందిస్తున్న కొన్ని బ్లాగుల్లో ఈ బ్లాగు ఒకటి, ఇక్కడ ఈ టపా ద్వారా బ్లాగు సన్యాస దీక్ష పుచ్చుకున్న బ్లాగ్రాజులు కూడా స్పందించడం, చక్కటి స్పందన బ్లాగ్లోకానికి అందించటం ఓ గొప్ప …(“గొప్ప” అన్నది ఇబ్బందికరం అయినట్లయితే “మంచి”) సంఘటన.

నాణేనికి అటు వైపు పరిశీలిస్తే, ఈ బ్లాగరి అభిప్రాయాలకు విరుద్ధమైన టపాలు కూడా అప్పుడప్పుడూ బ్లాగ్లోకంలో కనిపిస్తుంటాయి. అక్కడ ఈ బ్లాగరి వ్యాఖ్య కూడా దీన్ని ప్రతిబింబించడం కద్దు. అయితే అలా జరిగిన చర్చలు అన్నీ కూడాను సుహృద్భావ వాతావరణంలో ముగియడం ఓ విశేషం. అలానే ఇంకొక్క ససందర్భ ప్రేలాపన: వివిధ సందర్భాల్లో నాగమురళి గారు చేసిన వ్యాఖ్యలు (వాటికి సమాధానాలు కూడా) కొన్ని కొండవీటి చేంతాళ్ళలా గహనంగా మారాయి. బహుశా అనేక విషయాలు స్పర్శించటం వల్ల, భావాలను సాధ్యమైనంత విశదంగా చెప్పాలనే ఆరాటం వల్ల వచ్చిన చిక్కేమో. ఈ మధ్య ఈ విషయం ఆయన కూడా గమనించారనిపిస్తున్నది.

ఏతావాతా ఓ ముక్కలో చెప్పాలంటే “నాగమురళి గారి బ్లాగు చదవటం మీ ఉత్తమాభిరుచికి నిదర్శనం”. ఈ వాక్యం నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా చెప్పవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం – చదవండి. అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండండి. ఆణిముత్యాలు కూడా దొరకవచ్చు.

ముగింపు:

Cogito ergo sum – ఈ వాక్యానికి ఇంకో అర్థం కూడా ఉందట.అది ” I doubt, therefore I am”. ఇది మాత్రం ఈ సమీక్షకుడికి నప్పుతుంది. ఎందుకో చెప్పాలంటే, ఈ చర్చ ఆసాంతం చదవాలి.

అయితే, భావాలు వేరైనా, మూల సూత్రం ఒకటే అయినట్టుగా, అంత చర్చా జరిగినా, మురళి గారి మీద గౌరవం ఎక్కువయ్యింది కాని తగ్గలేదు. బ్లాగు లోకంలో ఓ మంచి చర్చలో, ఆదర్శవంతమైన చర్చాపద్ధతిలో, నేనూ (సమీక్షకుడు) భాగస్వామి అవడం నా అదృష్టం.

అయితే నావరకు ఈయన మీద కొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి. మురళి గారు ఆయన ప్రతిభకు తగ్గ టపాలు ఇప్పటి వరకు musings లా రాశారు. అయితే ఈయనకున్న విస్తృత పరిశీలనాదృక్కోణం, పాశ్చాత్య జీవనవిధానంతో ఈయనకున్న పరిచయం, ఆంగ్ల సాహిత్య పఠనంలో ఉన్న అభినివేశం, మిత్రులు, వాళ్ళ అనుభవాలు – వీటి క్రోడీకరణతో చక్కటి టపాలు అటు సాహిత్యానికి సంబంధించి, ఇటు భౌతిక జగత్తుకు సంబంధించి, పరిశీలనా ప్రాతిపదికగా రాయాలని నా ఆకాంక్ష.

అలానే అంతర్జాలంలో జరిగే కవితా గోష్టుల్లో ఈయన పాల్గొంటే బావుంటుంది.

అలాగే, సంస్కృత కవుల రచనా చమత్కృతి, కవిహృదయం, అప్పటి వారి రచనల్లో సమాజ పరిశీలన – వీటి మీద కూడా ఓ కన్నేయాలి.

ఇంకా …. బోల్డన్ని అభ్యర్థించవచ్చు. అయితే, ఆయన తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇంతటితో ముగిస్తాను.

కొస మెరుపు : ఓ మంచి అభిరుచి గల బ్లాగరి మీద ఇంకో మంచి అభిరుచి గల బ్లాగరి స్పందిస్తే ఇలా ఉంటుంది.

******************************************

రవి

రాయలసీమలో పుట్టి, పెరిగిన రవి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. అభిరుచులు, ఆసక్తులు అనేకం ఉన్నా, సాధికారత, సమగ్రత, ఏ విషయంపైనా లేదనే రవి, ప్రతీ విషయాన్ని తరచి ప్రశ్నించే తెలుగు ‘వాడి ‘ పౌరుషానికేం తక్కువ లేదంటున్నారు. బ్లాగాడిస్తా పేరుతో బ్లాగుతూంటారు.

Posted in జాలవీక్షణం | Tagged , | 13 Comments

సంక్రాంతి శుభాకాంక్షలు

-శ్రీమతి పింగళి మోహిని

ఉ:

బంతులు బంతులై కనుల పండువు చేయగ, గోమయంబుచే
కాంతలు గొబ్బిళుల్ మిగుల కౌతుక మొప్పగ తీర్పరించగా
వింతగు బొమ్మలన్ కొలువు వేడుక మీరగ తీర్చి దిద్దు, సం
క్రాంతి శుభోదయంబు మనగావలె జాతికి భవ్యక్రాంతియై !

ఇంతలు ఇంతలై పుడమి యీవలె సస్యము మానవాళికిన్
చింత రవంత లేని సుఖ జీవన భాగ్యము కల్గజేయగా
శాంతి సమానతా సుగుణ సంపద తుష్టిని పుష్టి నిచ్చు, సం
క్రాంతి శుభోదయంబు మనగావలె జాతికి భవ్యక్రాంతియై !

లేతలిరాకు జొంపముల లీలగ తోచుచు పూచినట్టివౌ
పూతలు పిందెలై పెరిగి వేలఫలంబులొసంగునట్లు గా,
జాతి హృదంతరాశలను శాశ్వతరీతి ఫలింప చేయ, నీ
నూతన వత్సరంబునకనూన ముదావహ స్వాగతంబిదే !

———————-

శ్రీమతి పింగళి మోహిని, బి.ఏ,బి.ఇడి కృష్ణాజిల్లా చల్లపల్లిలో శ్రీమాన్ యస్.ఆర్.వైస్.ఆర్.పి.జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. పద్యరచన ఆమె ప్రవృత్తి.

Posted in కవిత్వం | Tagged | 7 Comments

కేతు విశ్వనాథరెడ్డితో ముఖాముఖి

— స్వాతీ శ్రీపాద

కార్యాలయంలో కేతు విశ్వనాథరెడ్డి

సుప్రసిద్ధ కథకులు, సంపాదకులు, కవితాప్రేమికులు, సాహితీ విశ్లేషకులు, ప్రాచార్యులు, మరియు విద్యావేత్త అయిన శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారిని పరిచయంచేసేందుకు ఈ విశేషణాలు సశేషాలే. జీవితాన్ని ఒక తపస్సుగా సాధనచేసి సాహితీసేవకు అంకితం చేసిన ఆయనను అజో-విభొ-కందాళంవారు 2009వ సంవత్సరానికిగాను ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం వారిని వారు గౌరవించుకోవడమే! విశ్వనాథరెడ్డిగారి దృక్పథం మానవ సంఘర్షణ. అందుకే జీవితపు దారి ఘర్షణల దారి అని నొక్కి వక్కాణించారు. అవార్డు గ్రహీతగా విశ్వనాథరెడ్డి గారితో సంభాషించినప్పుడు విశ్వైక విజ్ఞాన మనో భాండాగారంలోనికి ప్రవేశించిన అనుభూతి కలిగింది.

అవార్డు గురించి ప్రస్తావించగానే “అజో-విభొ-కందాళంవారు ఈ అవార్డుకు నన్ను ఎంపికచేసి సంప్రదించినపుడు, ‘జీవిత పర్యంతం కృషి చేసిన వారు ఎందరో ఉన్నారు, నాకంటే ఎందరో ప్రతిభావంతులు వున్నారు, వారెవరికైనా ఇవ్వ’మని సూచించాను. ఈసారి నన్నే ఎంపిక చేయటం జరిగింది. సంతోషం.” అంటూ ఆయన తన అనుభూతిని మాతో పంచుకున్నారు.

————————————–

*అజో విభొ కందాళం గురించి
ఈ సంస్థ సాంస్కృతిక రంగంలో విశేష కృషి చేస్తోంది. కథలను తీసుకుని వాటిని నాటకీకరించి ప్రదర్శించి, ఉత్తమమైనవాటికి బహుమతులందిస్తోంది. పుస్తకాలను అచ్చువేయటమే కాకుండా, విదేశాంధ్రులకు అందుబాటులో ఉంచటానికి ఒక వెబ్ సైటును నడుపుతోంది. ఇంత వరకు మరెవరూ గుర్తించని కృషిని ఈ సంస్థ వెలుగులోకి తెచ్చింది. నా కథలు కూడా నాటకీకరించి వాటిని ప్రదర్శిస్తామని అడిగారు. కాని వాటిని నాటకీకరించడం, నాటకీకరణకనుగుణంగా సంభాషణలు రాయటం, పాత్రలు అనుభవించే మానసిక ఘర్షణని రంగస్థలంమీద చూపడం, గ్రామీణ వాతావరణాన్ని ప్రదర్శించడం కష్టం. ఏమైనా వాళ్ళ ప్రయత్నాలను అభినందించాలి.

కేతు విశ్వనాథరెడ్డి

*కథల దృశ్యీకరణ గురించి మాట్లాడుతూ
లక్షల కథలు అందు బాటులో ఉన్నపుడు కనీసం వెయ్యి కథలైనా దృశ్యీకరణకి అనుగుణంగా ఉంటాయి. వాటిలో కొన్ని కథలను టీవీలు దృశ్యీకరించాయి. వాటిలో ఆర్.కె.నారాయణ్ మాల్గుడి కథలు, తెలుగులో అమరావతి కథలు, శ్రీపాదవారి కథలు వచ్చాయి. ఇక సినిమా రంగంలో వేల కథలు సినిమాలకనుగుణంగా వుంటాయి. వాస్తవికతకి సంబంధించిన కథలు వాళ్లు తీసుకోవడం లేదు. కృత్రిమత్వం వున్న వాటికి ప్రాముఖ్యం ఇస్తుంటారు. 1947 వరకు రామబ్రహ్మం గారు లాంటి వారు కొంత కొంత ఆ ప్రయత్నాలు చేశారు. నేటి సినిమాల్లో సహజత్వం ఉంటోందా? సినిమాకూ జీవితానికీ సంబంధం ఉండటం లేదు. జీవితం దారి వేరు, సినిమా దారి వేరు. జీవితాల్లో బాధలు, ఆరాటాలు, ఘర్షణల దారి వుంటుంది… సినిమాలది డబ్బుదారి. మనము మలయాళ తమిళ సినిమాలతో పోల్చుకుంటే తెలుగుసినిమా అధమస్థాయిలో వుంది.

*మీరు కవిత్వం మాట్లాడతారు, మరి కవితలెందుకు రాయరు?
(నవ్వుతూ) నేనూ సహజంగా కవిని కాను. కవితా ప్రేమికుణ్ణి. కవిత్వం వ్యక్తి అనుభూతులను ఆత్మీయంగా చెప్పేది. గాఢమైన సంవేదనతో విషయాన్ని చెప్పేది కవిత. సాహిత్యాన్ని, జీవితాన్ని ఒక తాత్విక పోరాట దృష్టితో విశ్లేషించడం నాకిష్టం. కవి మిత్రులతో సరదాగా ఘర్షణ పడేవాడ్ని. నీకు కవిత్వం నచ్చదనేవాళ్లు వాళ్లు. కాని నేను కవితా ప్రేమికుణ్ణని చెప్పేవాణ్ణి.

*సాహిత్యం పట్ల ఆసక్తి, అభిరుచి ఎప్పుడు మొదలైంది..?
నేను సాహిత్యపాఠకుడిగా మొదలైనపుడు చలం, బుచ్చిబాబు అపారమైన ఇష్టం. కాని వారికంటే గురజాడ, కుటుంబరావు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వారు జీవితాలను గురించి ఆలోచిస్తూ, జీవితాన్ని విశ్లేషించారు. మానవ సంబంధాలను గురించి చెప్పేవారు. రావిశాస్త్రి అంటే కూడా ఇష్టం. ఒక కోణంలోంచి చలం, ఒక కోణంలోంచి రావిశాస్త్రి ఇష్టం. నేను తీవ్రమైన భావనలు కలవాణ్ణి. కానీ నా ఉద్వేగాన్ని ఎప్పుడూ కూడా హద్దుల్లో ఉంచుకోవడానికే ప్రయత్నం చేస్తూవుంటాను. నా మిత్రుడు సొదుం జయరాం మీకు తెలుసనుకొంటాను. నా గురించి ఆయనో ఆయన గురించి నేనో గానీ అవసరానికి మించిన అనుభూతి మంచిది కాదని అనుకునే వాళ్ళం. అనుభూతి జీనితానికి తప్పనిసరిగా కావాలి. గాఢమైన అనుభూతులు కావాలి. కానీ ఆ ప్రవాహంలో కొట్టుకొనిపోతే మనిషి ఆలోచించడమనేది కొంచెం కష్టం.

*మీరు ఎప్పటినుంచి రచనలు చేస్తున్నారు?
ఇంటర్ చదువుతున్నప్పటినుంచి రాస్తున్నాను.ఆ రోజుల్లో రచయిత్రుల రొమాంటిక్ రచనల ఊహాగానాలమీద విరుచుకుపడుతూ ఒక వ్యాసం రాశాను.

*కథలు రాశారా చిన్నప్పుడు?
SSLC రోజుల్లో నుంచే పద్యాలు రాయడం లాంటి కొన్ని పనులు, తుంటరి పనులు చేశాను. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రొద్దుటూరు మొత్తం కవిత్వ వాతావరణమే, అందులోనూ ప్రాచీన కవిత్వ వాతావరణం ఉండేది. హైస్కూల్లో చదువు చెప్పిన గురువులు తెలుగులోను సంస్కృతంలోనూ పండితులు. వారి ప్రభావం వల్ల నేను కూడా కొంత రాసేవాణ్ని. గడియారం వెంకట శేషశాస్త్రిగారు శివభారతంలో ఒక భాగం చెప్పేవారు మా ఫిప్త్ ఫారంలో, అంటే ఇప్పటి పదోతరగతిలో అనుకోండి. అప్పుడు మాకు గొప్ప గురువు గార్లుండేవాళ్లు. వాళ్లు నాకు స్ఫూర్తి. గణితంలో మంచి ప్రావీణ్యం వుందనిపించుకున్నాను పాఠశాల రోజుల్లో.

*మీరు అనుకున్నారా జీవితంలో అధ్యాపక వృత్తిని చేపడతానని?
మానాన్న బలవంతంగా సైన్సులో చేర్పించి డాక్టర్ని చేయాలనుకున్నారు. కుదరలేదు. బొమ్మలు బాగా వేసేవాడిని. శాంతినికేతన్ లో చేరుదామనుకున్నా అదీ కుదరలేదు. చివరికి కడపలో చేరాను. తెలుగులో పిహెచ్ డి చేసి డాక్టరేట్ పొందాను.

*మీరు నందలూరిలో ఒకసారి అన్నారు, పల్లె నుంచి పట్నానికివచ్చి దారి తప్పిపోయిన భావన అనుభవించానని. ఆ తరువాత విదేశాలలో ఉన్నారు కదా, మరి మీకు అప్పుడెలా అనిపించింది?
ఎక్కడ వున్నా ఒకేలా అనిపించేది. ఒకరకంగా గుంపులో వున్నా ఒంటరి మనస్తత్వమే నాది. ఎక్కడ వున్నా ఒకేలా వుండేది.

*మీరు స్వచ్ఛమయిన పల్లె వాతావరణం నుండి పట్నం వచ్చి పల్లె జీవితాల గురించి రాస్తున్నారు. మళ్ళీ పల్లెకి వెళ్ళాలని అనుకోవడం లేదా..?
తిరిగి మా వూరికి వెళ్ళాలని వుంది. కాని నేను పట్నానికి బందీని. పల్లెలూ మారిపోయాయి. అక్కడ ఇమడగలమా అని అనిపిస్తుంది. అందులోనూ వయసు వల్ల వచ్చే ఇబ్బందులున్నాయి.

*మీకు ఉపాధ్యాయ వృత్తి నచ్చిందా లేక సంపాదకీయమూ రచనలూ మీకు సంతృప్తి నిస్తాయా?
అది నా బలమో లేక బలహీనతో తెలీదు కాని ఏ వృత్తి అయినా పనిలో నిమగ్నం కాలగను. ఎటువంటి పనినైనా చేయగలను. కాని అన్యాయం, పొరపాట్లను సహించలేని మనస్తత్వం. రెండింటిలో నేను చాలా ఇష్టపడింది ఉపాధ్యాయ వృత్తి. పిల్లలు చాలా అభిమానించేవారు. స్కూలు పిల్లల నుంచి పిహెచ్‌డి చేసేవారివరకు విద్యార్థులందరితో చాలా సాన్నిహిత్యం ఉండేది. ఎక్కడ వున్నా నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ అభిమానించడం నా అదృష్టంగా భావిస్తాను. సంపాదక వృత్తిలో రాసిన ఏ రచన ఐనా తీర్పు ఇవ్వాల్సింది పాఠకులే.

*కాళీపట్నం రామారావుగారి యజ్ఞం కథ తర్వాత, తుమ్మేటి రఘోత్తమరెడ్డి పని పిల్ల తర్వాత మీ అమ్మవారి చిరునవ్వు మీద విపరీతమైన విశ్లేషణలూ వాద వివాదాలు నడిచాయి కదా. దానిపై మీ స్పందన ఏమిటి?
ఏ వివాదమైనా సహేతుకమైనప్పుడు నాకు వాటి మీద గౌరవం వుంది. ఆ విమర్శలు ఏమీ నన్ను కదిలించలేదు. నేను ఏమీ పట్టించుకోలేదు. రచన విఫలత, సఫలత అనే తీర్పు పాఠకులకే వదిలేస్తాము. పాఠకులే లిట్మస్ టెస్ట్. సాహిత్యము విఫలత, సఫలత, వివాదాలు అనేవి కాంప్లెక్స్ ఫాక్టర్స్.

*కరికులం కమిటీలో చాలా కాలం పని చేశారు కదా. పాఠ్యాంశాలలో ఏమైనా మార్పులు ప్రవేశ పెట్టగలిగారా?
ఫస్ట్ నుంచి టెన్త్ స్టాండర్డ్ కమిటీలో, ఇంటర్మీడియట్ కమిటీలో, ఓపెన్ యూనివర్శిటీ కమిటీలో వున్నాను. చాలా మార్పులే తేగలిగాను. మౌలికంగా విద్యార్థులు ఆధునిక చైతన్యం మీద, వచన రచన మీద పట్టు సాధించాలని నా అభిప్రాయం. అందరూ కవిత్వం రాయలేరు కదా! వచనం అందరూ రాస్తారు. కవిత్వం రాసేవాళ్లు కూడా వచనం రాయాల్సిన అవసరం వుంటుంది. మంచి వచనం రాయగలగడమనేది ఎప్పుడూ అవసరం. అది సైన్సు విద్యార్థికి కావచ్చు, కామర్సు విద్యార్థికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. మేము తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యంగా స్త్రీలను అగౌరవపరిచే పాఠాలు, దళితులని కించపరిచే పాఠాలు ఉండకూడదని నిబంధన విధించాము. పాఠాల మూలంగా విద్యార్థులలో మార్పు రావాలని, కొన్ని నిబంధనలు ఉండకూడదని నిర్దాక్షిణ్యంగా ఖండించాను. నన్ను కమిటీనుంటి తొలగించినా ఇబ్బంది పడలేదు కాని కాంప్రమైజ్ కాలేదు. కరికులం కమిటీలో కొంతవరకూ మార్పు తేగలిగాం. మిత్రులు కూడా తోడ్పడ్డారులెండి. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామరావుగారు, కొత్తపల్లి వీరభద్రరావుగారు, కె.కె.రంగనాథాచార్యులు మొదలైన వారి అందరి సహకారం నాకు లభించింది. నేను చేస్తున్న ప్రతి పనిలోనూ నాకు చేదోడు వాదోడుగా వున్నవారి సహకారం గొప్పగావుంది.

*మీరు జ్ఞానపీఠ్ అవార్డు ఎంపిక కమిటీలో సభ్యులుగా పని చేశారు కదా! కన్నడ రచయితలు ఏడుగురికి జ్ఞాన్ పీఠ్ అవార్డు వచ్చింది కాని ఇద్దరు తెలుగు వారికే ఎందుకు వచ్చింది..?
ఎందరు గొప్ప రచయితలు మన తెలుగులో వున్నా వారిగురించీ వారి రచనలగురించీ ఇతరులకు తెలీదు. వారి రచనలు ఇతర భాషలలోనికి అనువదింపబడలేదు. మనవారి గురించి కమిటీలో తెలిసినపుడే వారికి అవార్డు ఇవ్వాలా లేదా అని తెలిసేది. అందుకే అనువాదానికి ప్రాముఖ్యత నివ్వాలి. ఇదివరకు కన్నా నేడు అనువాదకులు పెరిగారు.

*రచయితల లక్షణాల గురించి మాట్లాడుతూ –
రచయితలకు వినయం, నిగ్రహం అవసరం. కీర్తి తనంత తానుగా వచ్చినా గర్వమొందనివాడు ఉత్తముడు. కీర్తి వెంట పడేవాడు మధ్యముడు. కీర్తిని చెరబట్టినవాడు అధముడని పెద్దలన్నారు. తెలుగు కవులూ రచయితలూ ఎదుటి వారి గొప్పను ఒప్పుకోవడం నేర్చుకోవలసిన అవసరం వుంది.

*విద్య వల్ల, సాహిత్యం వల్ల సమాజంలో మార్పు వస్తుందనుకుంటున్నారా?
సాహిత్యం ఒక ఉపాంగం మాత్రమే. మార్పు అనేది అన్నిరంగాల్లో రావాలి.

*కథా రచయితలకు మీరిచ్చే సలహా ఏమిటి?
విస్తృతంగా చదవాలి – జీవితాన్నీ సాహిత్యాన్నీ కూడా. విస్తృతంగా పరిశీలించాలి.

————————–

స్వాతీ శ్రీపాదఅసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, ఐదు నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలుగా, హైదరాబాద్ ఆలిండియా రేడియో ప్యానెల్ అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో మానస సంచరరే శీర్షిక నిర్వహించారు.

Posted in వ్యాసం | Tagged | 20 Comments

చదువది యెంత గల్గిన..

-స్వాతి కుమారి

విద్య అంటే ఆనందించే శక్తిని వృద్ధిచేయడం, సౌందర్యానికి కళ్ళు తెరవడం, బాధల్నించీ, కష్టాల్నించీ తప్పించుకునే నేర్పునివ్వడం, ఇతరుల స్వేచ్ఛను అడ్డగించే స్వార్థపరత్వం నించీ, అంతా తనకే కావాలని దాచుకునే కాపీనం నుంచీ, భయాల నించీ తప్పించడం. – చలం

చదువు పరమార్థం విదేశీ ఉద్యోగాలు మాత్రమే అని మనసులో నాటుకున్నాక కరెన్సీ లో విలువ కట్టలేని నీతి సూత్రాల్ని, సుమతీ శతకాల్ని ఎందుకు తెలుసుకుంటారు?

పై నిర్వచనం విద్య యొక్క విస్తృతార్థాన్ని, ఎకడమిక్ పుస్తకాల్లో ఇమడని దాని పరిధి ని తెలియజేస్తుంది. విద్యంటే అక్షరాస్యత మాత్రమే కాదు. అలాగే పట్టభద్రులంతా విద్యావంతులు కాదు. మనిషి తనని తాను నిరంతరం మెరుగుపరుచుకుంటూ కొత్త విషయాలను నేర్చుకోవటమే విద్యార్జన.

విద్య అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు విద్య కానిదేది అనిపిస్తుంది. ఈ విశాల విశ్వం లో ఇంతటి సుధీర్ఘ జీవిత కాలం లో అమీబా, అంతరిక్షం, ఆర్థిక మాంద్యం ఇవన్నీ తెలుసుకోదగ్గవే. ఇన్ని వేల శాస్త్రాల్లో, సిద్ధాంతాల్లో, క్షణ క్షణానికీ కొత్త విషయాలను ఆవిష్కరించే కాల గమనం లో అందరూ అన్నీ నేర్చుకోలేరు. కానీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవలసినవి ఖచ్చితం గా కొన్ని ఉంటాయి. స్థూలం గా చెప్పాలంటే:

-> తన శరీరానికీ, ఆరోగ్యానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం.

-> తన సామాజిక , భాషా,సాంస్కృతిక నేపథ్యాన్ని అవగాహన చేసుకోవటం.

-> మానసిక వికాసం, సృజనాత్మక శక్తి ని పెంపొందించుకోవటం.

-> దైనందిన జీవితం లో కనీస అవసరాలకు తనపై తను ఆధారపడగల ఆత్మ విశ్వాసం. వేరే మార్గం దొరకనప్పుడు ఆకలి తీరడానికైనా వంట వచ్చి ఉండాలి కదా.

-> సమస్య స్థాయి ని దాటి పరిష్కారాన్ని ఆలోచించగల నేర్పు.

-> ఒంటరిగా సాధించగల సమర్థత తో పాటు ఇతరులతో కలిసి పనిచెయ్యటాన్ని అస్వాదించగల సుహృద్భావాన్ని పెంపొందించుకోవటం.

-> భావావేశాల్ని నియంత్రించుకోవటం, సమయానుకూలం గా ప్రదర్శించగల మానసిక సమతుల్యత.

-> ఆత్మ సౌందర్యాన్ని, శ్రమ విలువని గుర్తించి గౌరవించగల మానసిక పరిపక్వత.

-> పరస్పర అవగాహన, అభివృద్ధి సాధించగల కుటుంబ, మానవ సంబంధాలను పెంపొందించుకోవటం .

-> ఆర్థిక వృద్ధి తో పాటు సేవా దృక్పథం, సామాజిక బాధ్యతను గుర్తించగలగటం.

-> స్వయం నిర్దేశిత వ్యక్తిగత విలువలకు కట్టుబడి ఉండగల నైతిక నిబద్ధత.

-> లక్ష్య సాధనలో ఎదురయే సవాళ్ళను స్వీకరించగల ఆత్మ స్థైర్యం.

->తన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవటం తో పాటు ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపరచని విధం గా ప్రవర్తించటం.

-> ఏ విషయాన్నైనా తర్కించి అంత:శోధన ద్వారా అర్థం చేసుకునే తార్కిక, తాత్విక చింతన.

పిల్లల ప్రయోజకత్వాన్ని వాళ్ళకొచ్చిన మార్కుల ద్వారా మాత్రమే నిర్ణయించటం, కధల పుస్తకాలు కూడా చదవనివ్వకపోవటం ద్వారా వారిలో ఉన్న ఊహా శక్తి ని, సృజనాత్మకతని, ఇతర రంగాల్లో వాళ్ళ ఆసక్తి ని నిర్దాక్షిణ్యం గా చంపెయ్యటమే. ఇప్పటి మన చదువులు ఏం నేర్పుతున్నాయి.? పక్కవాణ్ణి తోసి ముందుకు పరిగెట్టటం. తన తోటి వారంతా తప్పులు చేసినప్పుడే తను మొదటి రాంక్ లో ఉంటాననే అభిప్రాయం కలిగాక అందరూ కలిసి ఎదగటమనే ఆలోచన ఎలా కలుగుతుంది? చదువు పరమార్థం విదేశీ ఉద్యోగాలు మాత్రమే అని మనసులో నాటుకున్నాక కరెన్సీ లో విలువ కట్టలేని నీతి సూత్రాల్ని, సుమతీ శతకాల్ని ఎందుకు తెలుసుకుంటారు? పెద్ద చదువులు చదివిన వారిలో సైతం నాటుకుపోయిన మూఢ నమ్మకాలను చూస్తే మన చదువులు ఏ మాత్రం తార్కిక దృష్టి ని ఇస్తున్నాయో అర్థమౌతుంది. బ్రతకటానికీ, బ్రతికించటానికీ ఎన్నో గౌరవనీయమైన మార్గాలుండగా, మనిషి సంతోషం గా ఉండటానికి కావల్సిన మనో వికాసం, సృజనాత్మకత గుర్తింపబడని సమాజం లోనే పరీక్షలు ఫెయిలైన విద్యార్థులు ఆత్మ హత్య లు చేసుకోవాల్సి వస్తుంది.

చదువుకోవటం, నేర్చుకోవటం లో మొదటి దశ లో పాఠశాల పాత్ర ముఖ్యమైనది. కాబట్టి విద్యా విధానం సమగ్రం గా ఉండాలి. వ్యక్తి సాంఘిక, ఆర్థిక సుస్థితి, శక్తి సామర్థ్యాలు, సృజనాత్మకత పట్ల శ్రద్ధ వహించే విద్యా వ్యవస్థ ప్రధాన లక్ష్యాలుగా జాతీయ విద్యా విధానం (NPE)లో పేర్కొన్నవి:

1. శారీరక, మానసిక పరిపూర్ణతతో బాటు సౌందర్యాత్మక దృష్టితో జీవించేటట్లుగా వ్యక్తిత్వం రూపొందించడం.

2. కొత్తవాటిని కనుగొనే ఉత్సుకతను పెంచి ఇదివరలో పరిచితం కాని అననుకూల పరిస్థితులను ఎదుర్కొనగల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం

3. భౌతిక, సాంఘిక, సాంకేతిక విజ్ఞాన, సాంస్కృతిక వాతావరణానికి సంబంధించిన అవగాహన కల్పించడం

4. కాయకష్టం పట్ల, ఒళ్ళు వంచి పనిచేయడం పట్ల గౌరవభావాన్ని కలిగించడం

5. లౌకిక దృక్పథం, సామాజిక న్యాయం పట్ల నిబద్ధత ఏర్పడేటట్లు చేయడం

6. దేశ పురోభివృద్ధికి పాటుపడేటట్లు దేశగౌరవం, దేశసమగ్రత కాపాడడానికి సర్వసన్నద్ధత కలిగించడం

7. అంతర్జాతీయ అవగాహన పెంచడం

ఇంతటి ఉన్నత లక్ష్యాలతో రూపొందింపబడిన విద్యా విధానం ఆచరణ లో పరిపూర్ణం గా అమలవ్వాలని ఆశిద్దాం.

Posted in సంపాదకీయం | 6 Comments

2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం

-చదువరి

తెలుగు బ్లాగుల్లో తెలుగులోనే రాయమంటున్నారు అబ్రకదబ్ర. “తెలుగు బ్లాగుల్లో రాసేటప్పుడు – అది టపాయైనా, వ్యాఖ్యైనా – వీలైనంత ఎక్కువగా తెలుగులో రాయటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.” -అవును, బావుంటుంది!

ప్రతీ సంవత్సరం డిసెంబరు రెండో ఆదివారం తెలుగు బ్లాగు దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు 2008 బ్లాగు దినోత్సవం డిసెంబరు 14న జరిగింది. ఈ సందర్భంగా బ్లాగరులు సమావేశాలు జరిపారు.

ఈ నెల్లోనే 23వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన జరిగింది. అక్కడ e-తెలుగు కూడా స్టాలు పెట్టి సందడి చేసింది. తెలుగు బ్లాగరులు ఈ స్టాలులో స్వచ్ఛంద సేవలందించారు. అక్కడి విశేషాలను తమ తమ బ్లాగుల్లో పంచుకున్నారు. ఆ వివరాలు:

  1. నల్లమోతు శ్రీధర్ ఏరోజు కారోజు అక్కడి విశేషాలను తన బ్లాగులో అక్షరబద్ధం చేసారు.
  2. ఆశించినంత స్పందన లేదన్నారు రవిగారు.
  3. దాట్ల శ్రీనివాసరాజు తన నివేదిక రాసారు.
  4. వలబోజు జ్యోతి భలే మంచి రోజూ అంటూ రాసారు
  5. సుజాత ఫోటోలు ప్రచురించారు
  6. రమణి ఇదో e-కుటుంబం అన్నారు
  7. వేద కూడా ఫోటోలు ప్రచురించారు
  8. పర్ణశాల నుండి e-తెలుగు స్టాలుకొస్తే ఏంజరిగిందో కత్తి మహేష్ కుమార్ రాసారు
  9. బ్లాగ్బంధువుల గురించి రాసారు సురుచిలో
  10. విరజాజి బ్లాగ్మిత్రుల పరిచయాలను నెమరువేసుకున్నారు
  11. స్టాలుకు వెళ్ళలేనివారు కలలు కన్నారు.


ఓరుగల్లు యాసిడు దాడి:
ఓరుగల్లులో తోటి విద్యార్థినిపై యాసిడ్ పోసి గాయపరచిన సంఘటన, ఆ తరవాత నిందితులు ఎన్‌కౌంటరులో హతులైన సంఘటనలపై బ్లాగరులు విశేషంగా స్పందించారు. బ్లాగరుల, వ్యాఖ్యాతల స్పందనలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. ఎన్‌కౌంటరు పట్ల సంతోషించినవారు, ఆడపిల్లల తప్పేమైనా ఉందేమో ఆలోచించాలన్నవారు, ఎన్‌కౌంటరు తప్పేమోగానీ, వాళ్ళకది తగిన శిక్షేనని అన్నవారు, ఈ తప్పుకు తల్లిదండ్రులదే బాధ్యత అన్నవారు, అసలు తప్పు మాధ్యమాలది అన్నవారు, .. ఇలా అనేక రకాలైన స్పందనలొచ్చాయి. కొన్నిటిని చూడండి.

  1. ఒకరి చావును విని సంతోషించడం మంచి పని కాకున్నా, వీళ్ళ ఎన్‌కౌంటరు మరణంతో సంతోషంగానే ఉన్నది అన్నారు నాగన్న
  2. మహదానందంగా ఉంది అన్నారు ఆంధ్రామృతంలో రామకృష్ణారావు
  3. సమస్యకు ఇదే పరిష్కారమా? ఇదే అంతిమ తీర్పా? అని అడుగుతున్నారు సిరిసిరిమువ్వ
  4. “ఒక సారి కాకపోతే ఒక సారైనా ఆడపిల్లల పాత్ర ఉంటుందా ఉండదా అని ప్రశ్నించుకోవాలని అనుకుంటున్నాను” అన్నారు మనసులో మాట సుజాత.
  5. యాసిడ్ పోయటం ఘోరమే! కాని ఎన్ కౌంటర్ చేయడమేంటి! అని ప్రశ్నిస్తున్నారు వెన్నెలరాజ్యంలో
  6. న్యాయమంటే ఇదేనా అని అడుగుతున్నారు స్నేహ
  7. పోలీసులకి కూడా కోర్టులపై నమ్మకం పోయిందేమోనన్నారు ఆరాధనలో
  8. బ్లాగరుల స్పందనను ప్రస్తావిస్తూ బ్లాగులు దారితప్పుతున్నాయా అని అడుగుతున్నారు ప్రదీప్
  9. ఇంట్లో ఎలుకలు దూరితే ఇంటికి నిప్పెట్టుకుంటామా అని అడుగుతున్నారు నరసింహారావు
  10. నాగమురళి పోలీసు న్యాయంలో మరో కోణాన్ని చూసారు.
  11. అసలు నేరస్తులు మాధ్యమాలంటున్నారు చదువరి
  12. ఇవి మీడియా చేయించిన హత్యలంటున్నారు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
  13. పోలీసులు చేసిన ఈ పనికి అభినందనలా అని ప్రశ్నిస్తున్నారు ప్రవీణ్
  14. మనిషిలా ఆలోచించమంటున్నారు దాట్ల శ్రీనివాసరాజు

    యాసిడ్ దాడి తరువాత, ఎన్‌కౌంటరుకు ముందూ వచ్చిన జాబులు

  15. యాసిడు పోసిన ఘటనపై ఆవేదన వెలిబుచ్చారు నేను? లో. ఇది ఈ నెలే కొత్తగా రంగ ప్రవేశం చేసిన బ్లాగు.
  16. ఎవరైనా దాడి చెయ్యాలంటే ముందు శిక్ష గుర్తుకు రావాలి…అంత కఠినంగా వుండాలి చట్టాలు” అని అన్నారు సన్నజాజి.
  17. వరంగల్ విషాదం- ఏం నేర్చుకుంటోంది మన యువత అంటున్నారు ఆలోచనలో
  18. అందం శాపమా ? లేక అమ్మాయా!!! ఏది? అని అడుగుతున్నారు భవదీయుడు

రాజకీయాలు

  1. మేధావుల గురించి మేధోమథనం చదవండి వికటకవి బ్లాగులో
  2. పవన్‌కల్యాణ్ ఇరగదీసారంటున్నారు ఎ2జెడ్ కలల్లో. ఇది ఈ నెలలో కొత్తగా ప్రవేశించిన బ్లాగు
  3. ఆవేశం సరే.., ఆలోచన సంగతేంటంటున్నారు శుద్ధాంధ్రలో
  4. తనకోపమె తన శత్రువంటున్నారు చాకిరేవులో

హాస్యం, వ్యంగ్యం

  1. జంబలకిడిపంబ వారి వార్తలు వినండి
  2. “Infy నారాయణ మూర్తి గా అవుదామని సాఫ్ట్ వేర్ లోకి వచ్చి “ఒరెయ్..నారిగా” గ మారిన ఒక యువకుడి క(వ్య)ధ” చదవండి
  3. రన్నింగ్ బస్సు ఎక్కరబాబూ మంచి చెణుకులతో అలరించింది.
  4. బట్టతల.. ముగిసింది
  5. ఓ విప్లవకారుని కథ తెలుసుకున్నారా?

సినిమా

  1. కొత్తపాళీ ఈమధ్య చూసిన సినిమాల కథా కమామిషూ చదవండి.
  2. నేనింతే సినిమాను సమీక్షించారు కాలాస్3
  3. ప్రవీణ్ గార్లపాటి చూడదగ్గ సినిమా గురించి రాసారు
  4. కింగ్ సమీక్ష రాసారు కన్నగాడు

స్వగతాలు స్వ గతాలు

  1. నాన్న నేర్పిన పాఠాలను గుర్తు చేసుకున్నారు వేణూ శ్రీకాంత్
  2. శీర్షిక పెట్టాలని లేదు శీర్షికతో వచ్చిన ఈ కవితా స్వగతం చూడండి.
  3. పుట్టినరోజు నాడు పాత సంగతులను నెమరువేసుకున్నారు డా.ఇస్మాయిల్
  4. ఎలుక కరిచిన భాగోతం విన్నారా?

ఇంద్ర ధనుస్సు

  1. ఆధునిక కణికుల, అందునా నకిలీ కణికుల, నీతి గురించి అమ్మవొడిలో వ్యాసాలు చదువుకున్నారా?
  2. చీర గురించిన ఈ టపా చూసారా?
  3. కూర్గు విహారయాత్ర చేసొచ్చిన మేధ చదువరులనూ యాత్రకు పంపించారు
  4. ప్రజాచైతన్యానికి నమూనా అనదగ్గ విషయాన్ని రాసారు రానారె
  5. పదికోట్ల మంది నిరుద్యోగులతో సైన్యాన్ని ఏర్పాటు చెయ్యాలంటున్నారు ఇండియన్ పొలిటికల్ క్లోజప్‌లో. ఈ బ్లాగు ఈనెలలోనే ప్రవేశించింది.
  6. బైకాలజీ చదివారా?
  7. నిడదవోలు మాలతి రచయితలకు తగిన గౌరవం ఇవ్వని సంపాదకులకు చురకలంటిస్తే వ్యాఖ్యాతలు కూడా తమ వంతు పోట్లు పొడిచారు. సంపాదకుల సమర్థకులూ కొందరున్నారు వ్యాఖ్యాతల్లో.
  8. రేడియో జాకీ జీవితానికి తన బ్లాగును ట్యూను చేసారు పూర్ణిమ
  9. భారతీయత, దేశభక్తి లాంటివి కొందరిలో పేరుకే ఉంటాయంటున్నారు అబ్రకదబ్ర
  10. పుస్తక ప్రదర్శనలో తన పుస్తకాల అమ్మకాల అనుభవాన్ని సీరియలించారు కస్తూరి మురళీకృష్ణ
  11. తేలికభాషలో తత్వశాస్త్రాన్ని వివరిస్తున్నారు, సరస్వతీకుమార్
  12. ఓ యువ విద్యార్థి, బ్లాగరి విషాదాంతం గురించి రాసారు దార్ల

కొత్త బ్లాగులు

  1. జాజిపూలు
  2. శ్రీ-పదములకు ఈ నెల్లోనే శ్రీకారం చుట్టారు.
  3. హిమకుసుమాలు కూడా ఈ నెల్లోనే పూచాయి
  4. శ్రీపద్మకస్తూరి బ్లాగు కూడా మొదలైంది.
  5. నరేష్ కార్టూన్లు కూడా డిసెంబరులోనే మొదలయ్యాయి.

ఈనెల జాబు
కారుచీకట్లు కమ్ముకుంటున్న ఆర్థిక పరిస్థితిలో దేవన హరిప్రసాదరెడ్డి దివిటీ పట్టి దారి చూపిస్తున్నారు. వ్యవసాయం ఫర్ డమ్మీస్ అనే పుస్తకం రాసారు. ఎన్నో విలువైన సలహాలతో కూడిన ఈ జాబు చదివి మీ పంట పండించుకునే అవకాశాన్ని జారవిడుచుకోకండి.

“దేవన” లో వచ్చిన ఈ ఆహ్లాదకరమైన టపా మా ఈనెల జాబు

—————————–

చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు

Posted in జాలవీక్షణం | Tagged , , | 15 Comments