Author Archives: వెంపటి హేమ

About వెంపటి హేమ

వెంపటి హేమ గారు కాలిఫోర్నియాలో వారి అబ్బాయి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. 1959 తో వారి కాలేజీ చదువు పూర్తయింది. ఫిజిక్సులో డిగ్రీ చేసారు. మాతృభాష మీద మక్కువ. గృహిణిగా స్థిరపడినా. 1970 వ దశకంలో, ”కలికి” అన్న కలం పేరుతో కథలు రాసారు. అవి ఆంధ్రప్రభ వీక్లీ, యువ లాంటి పత్రికల్లో ప్రచురించబడ్డాయి. కారణాంతరాలవల్ల రాయడం మానేసారు.

తరువాత చాలా కాలానికి, చెయ్యిజారిందనుకున్న కలాన్ని వెతికి పట్టుకుని సత్కాలక్షేపంగా మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. ”కలికి” పేరుతో ఆమె రాసిన నవలను, 2006 లో మొదలుపెట్టి సంవత్సరంన్నర పాటు ధారావాహికంగా ఆంధ్రభూమిలో ప్రచురించారు. విశాఖపట్నంలో జరిగిన ఏ.ఎన్.మూర్తి కథలపోటీలో ఆమె రాసిన కథ ”పారిజాతం”కి కన్సొలేషన్ బహుమతి వచ్చింది.

కొన్ని కథలు నవ్య, ఆంధ్రభూమి మొదలైన పత్రికల్లో, అలాగే కొన్ని కవితలు కూడా ప్రచురించబడ్డాయి.
అమెరికాలో స్థిరపడ్డాక, ఆమె కథలు కొన్ని ”సుజనరంజని” వెబ్జైన్‌లో వచ్చాయి.

దివ్య దీపావళి

నీ ఈవికి గుర్తుగా ఇలలోన గొప్ప పండుగ చేస్తారు. దీపావళి పేరున వెలిగింతురు దీపాల వరుసలెన్నో – నీ కన్నీటి చినుకులే దీప కళికలై వెలిగి ఇంటింట! చీకట్లు తొలగించి కాంతిని వెలయించును జగాన !! – దీపావళి కవిత, మీకోసం. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

వానా వానా వల్లప్పా!

-వెంపటి హేమ చుట్టూ ఉన్న నేల బంగన బయలు కావడంతో, ఎండపడి బొగులు బొగులుమంటూ నిప్పులు చెరుగుతోంది అప్పుడే! ఆ ఎండలో దూరాన ఏదో తెల్లగా మెరుస్తూ తన దృష్టిని ఆకర్షించడంతో తాత చెయ్యి విడిపించుకుని సిద్దూ ముందుకు పరుగెత్తాడు. అలవాటుగా చెయ్యి ఓరజేసుకుని, తల పైకెత్తి ఆకాశాన్ని పరికించి చూసి, గాఢంగా నిట్టూర్చాడు బంగారప్ప. … Continue reading

Posted in కథ | Tagged | 3 Comments

అత్తెసరు – పచ్చిపులుసు

బొత్తిగా అమ్మ చేతి వంటకి అలవాటు పడిన ఆదిత్య, అమెరికా గురించి “అది చాలా గొప్ప దేశమనీ, గాలి చల్లగా హాయిగా ఉంటుందనీ, అందరికీ కార్లు ఉంటాయనీ, అక్కడి వాళ్లకు అన్నీ మిషన్లే అమర్చి పెడతాయనీ చెప్పింది. అక్కడ పసిపిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడుతారుట! ఇక్కడ మనం ఒక్క డాలరు మార్చితే దోసిలి నిండా రూపాయిలు వస్తాయి కదా!” అనుకునే రవళి. వీళ్ళిద్దరూ కలిసి వండిన “అత్తెసరు పచ్చిపులుసు” Continue reading

Posted in కథ | Tagged | 10 Comments

రామ చిలుక

లేత ఆకుల, పూల మొగ్గల వర్ణ సమ్మేళనం వంటి మేని ఛాయతో, పంచదార పలుకులతో ముచ్చటగొలిపే రామచిలుక పై హేమ గారి కవిత పెద్దలూ, పిల్లల కోసం కూడా ప్రత్యేకం. Continue reading

Posted in కవిత్వం | Tagged , | Leave a comment