కథానిలయం వార్షికోత్సవం

శ్రీకాకుళంలో కారామాస్టారు నెలకొల్పిన కథానిలయం పద్నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే ఈ ఉత్సవానికి ఆహ్వానం పలుకుతూ నిర్వాహకులు వివినమూర్తి గారు పంపిన ఆహ్వాన పత్రాన్ని ఇక్కడ జోడించాం. కింద ఉన్న లింకును నొక్కి ఆహ్వాన పత్రాన్ని దించుకోవచ్చు.

కథానిలయం వార్షికోత్సవానికి ఆహ్వానం

Posted in ఇతరత్రా | Comments Off on కథానిలయం వార్షికోత్సవం

కథాకథనం – 2

కథ

కొత్త కథకులకి కథ రాయడం గురించి తెలియాలంటే ముందుగా కథంటే ఏమిటో తెలియాలి. జరిగిన ఒక బలమైన సంఘటనను యథాతథంగా రాసినా, మార్పులవసరమైతే సహజత్వం చెడకుండా మార్చినా కథ అవుతుందనుకుంటారు కొందరు. జరిగింది రాసినా, కల్పించి రాసినా, రచనలో ఏం ఉంటే అది కథ కాగలదో, ఎప్పుడది కాలేదో తెలియాలి. ఉత్తరోత్తరా ఏమోగానీ, ఆరంభదశలో చిత్రరచనకూ, కథారచనకూ కొన్ని దగ్గర పోలికలున్నాయి. తద్వారా కథంటే ఏమిటో కొంత తెలుసుకోవచ్చు.


చిత్రాలలో కనిపించే కొన్ని తిన్నని గీతలూ, రెండు మూడు సున్నలూ, మరికొన్ని చుక్కలూ – ఇలాంటివన్నీ ఏ పిల్లవాడో అస్తవ్యస్తంగా ఒక కాగితంమీద గీసేశాడనుకోండి. ఏమౌతుందీ, ఏమీ కాదు. అలాగే కొన్ని పాత్రలూ, కొన్ని వర్ణనలూ, ఆ పాత్రల మధ్య సంభాషణలూ, అవి జరిగిన తీరుతెన్నులూ, చెప్పుకుపోయినా – ఒక ప్రదేశమూ, అక్కడి పరిస్థితులూ, ఆ మధ్య పాత్రలూ, అవి చేసిన పనులూ, వాటికి సంబంధించిన కష్టనష్టాలూ చెప్పేసినా – వేనికి వానిగా చూసినప్పుడు అవన్నీ కొత్తగానో, రమ్యంగానో, చమత్కారంగానో కనిపించినా – వాటన్నింటినీ సవ్యంగా క్రమపరిచే అంతస్సూత్రం లోపించినప్పుడు, వాటి సమాహారాలు (కలబోసిన రాసులు) ఏమీ కావు. అర్ధం పర్థంలేని రచనలౌతాయి.

పైచెప్పిన గీతలూ మొదలైనవి ఒక క్రమంలో ఉంటూ, అలా ఉండటం ద్వారా ఓ వస్తువుదో, జంతువుదో లేక మరోదానిదో ఆకృతిని గుర్తింపజేస్తే అది బొమ్మ అవుతుంది.
 

అలానే – రచనలో సంఘటనలూ, వర్ణనలూ, పాత్రల ప్రవర్తనా, వాటి సంభాషణలూ ఇలాంటివన్నీ వాటి వాటి మితులకు లోబడి, ఒకానొక అంతస్సూత్రానికి కట్టుబడి ఉంటే తద్వారా ఒక వృత్తాంతం తెలుస్తుంది. అంతకుమించి తెలియవచ్చేది అందులో లేకపోతే అప్పటికది వృత్తాంతం అవుతుంది.

ఒక బొమ్మే చిత్రం కానట్టు ఓ వృత్తాంతమే కథ కాలేదు. బొమ్మ, చిత్రం పర్యాయపదాల్లా అర్ధమౌతాయి. కాని కావు. ఒక ఆకృతి – మాటవరసకు పులిది అనుకోండి. ఆ ఆకృతి కళ్ళల్లో దాని జాతికి సహజమైన క్రౌర్యమో, మండీమీద కూర్చున్నప్పుడు ఒకానొక పులి ఠీవో, జంతువును వేసేటప్పటి లేదా మరో క్రూరమృగంతో తలపడేటప్పటి దాని భీషణ స్వరూపమో వ్యక్తమౌతున్నప్పుడు అలాంటి ఆకృతిని చిత్రమంటాము. పటంకట్టించి గోడకు పెట్టుకుంటాము.


చక్కటి రేఖల్లో ఎంత సహజంగా గీసినా, మంచి మంచి రంగుల్లో ఎంత అందంగా లిఖించినా, అది పులి ఆకృతిని మించి ఇంకేమీ చూపలేనప్పుడు, అది ఒట్టి బొమ్మ. కాకపోతే అందమైన బొమ్మ, సహజమైన బొమ్మ. బొమ్మకూ, చిత్రానికీ ఉండే కొంత తేడా, కొంత సారూప్యతా వంటివే వృత్తాంతానికీ కథకీ ఉన్నాయి.
 

ఎప్పుడో, ఎక్కడో జరిగిన సంఘటననో, సన్నివేశాన్నీ కల్పించి రాయొచ్చు. ఎలా రాసినా ఆ సంఘటనకు సంబంధించిన వృత్తాంతంలో ఆసక్తికరమైన ఒక విశేషం ఉండాలి. చిత్రంలో అందలి బొమ్మ ద్వారానే దానిలో విశేషం వ్యక్తమైనట్టు రచనలో అందలి వృత్తాంతం ద్వారానే ఆ విశేషం వ్యక్తం కావాలి. అలా అంతర్గర్భిత విశేషాన్ని వ్యక్తీకరించే వృత్తాంతమే కథ కాగలదు. వ్యక్తీకరించడానికి ఏ విశేషమూ లేని వృత్తాంతం ఒత్తి వృత్తాంతంగానే మిగిలిపోతుంది.

పై విషయాలను మరింత విశదంగా తెలుసుకోడానికి ఆర్.కే పబ్లికేషన్సు వారి ’నేటికథ’ అనే సంపుటంలోని ఒక ఉదాహరణ తీసుకుందాం.

’కృతజ్ఞత’ అన్న రచన ఉంది. అందలి సన్నివేశం, పాత్రలూ, వాటి సంభాషణలూ, ప్రధాన పాత్ర గౌరి పరిస్థితీ, ఆమె సమస్యా, దాని పరిష్కారం వీటన్నిటిద్వారా మనకి తెలియవచ్చే వృత్తాంతం ఏమిటి?


అదొక బస్తీ. ఓ ప్రభుత్వ కార్యాలయం దగ్గర లారీల్లోంచి కేర్ గోధుమనూక బస్తాలను ఆఫీస్ గోడౌన్లలోకి తరలిస్తున్నారు. చిరిగిన బస్తాల్లో నూక నేల పాలవుతోంది. పేదవాళ్ల పిల్లలు డబ్బాల్లోకీ, పాత్రల్లోకీ ఆ నూక ఎత్తుకుంటున్నారు. గౌరి ఇంట్లో ఆ పూట తినడానిక్కూడా లేదు. అరువు అడగబోతే షావుకారు తిట్టి తగలీశాడు. తిరిగొస్తూ ఈ దృశ్యం చూసి ఆగిపోతుంది. నూక ఎత్తుకోవడానికి పాత్ర అడిగితే ఎవరూ ఇవ్వరు. ఇంటి దగ్గర్నుండి తేవాలంటే తిరిగొచ్చేసరికి బుగ్గి కూడా మిగల్దు. ఒడికెత్తుకోబోతుంది. మోకాళ్ళు దిగని పొట్టి స్కర్టు బాగా మడుద్దామంటే లోపల చెడ్డీ లేదు.కొంచం మడిస్తే నూక నిలవడం లేదు. ఆమె అవస్థ గమనించిన ఓ గుమస్తా, ఆరోజు న్యూస్ పేపర్ ఆమె ముందు పడేస్తాడు. కృతజ్ఞతతో ఆమె నూక ఎత్తుకుంటుంది.


ఈ వృత్తాంతంలో ఇమిడి ఉన్న విశేషం ఏమిటి?
గౌరి వయసు పదమూడేళ్ళు. చిన్నదైతే ఆకలి సంగతి పట్టకపోను. పట్టితే సిగ్గు అడ్డురాదు. స్కర్టు విప్పేసి అందులోకి నూక ఎత్తేసుకునేది. లేదా పాత్ర కోసం ఇంటికి పరిగెత్తేది. తిరిగొచ్చేసరికి మిగల్దేమో అన్న ఊహ ఆమెకి రాదు. గౌరి పదమూడేళ్లది కావడం వల్ల అటు ఆకలి, ఇటు సిగ్గు, క్షణక్షణానికీ సమయం మించిపోతుందన్న స్పృహ, వీటన్నిటివల్లా ఉపాయం తోచకపోవడం – ఇదీ ఆమె అవస్థ. అలా వచ్చీరాని ఈడులో ఉన్న ఈ పిల్ల అవస్థా, దానికి చలించి ఎవరో ఆమెను బయటపడేసే తీరూ, ఇందులో ఇమిడి ఉన్న విశేషం.

ఇలా ఒక విశేషాన్ని ఇమిడ్చుకున్న వృత్తాంతం అవడం వల్లే ఒకటి రెండు ఇతర లోపాలు ఉన్నా ఈ వృత్తాంతం కథ అయింది. ఇదే సన్నివేశాన్ని రచయిత ఇంకొకలా రాసేరనుకుందాం.

మట్టిపాలౌతున్న నూకను తక్కినవారెత్తుకుంటుండగా, గౌరి అన్న అమ్మాయి అక్కడకు వస్తుంది. ఈ గౌరి వయసు పదమూడేళ్ళు కాదు, ఏడో, ఎనిమిదో, అమ్మ పనిలోకెళ్లగా గౌరికంతా ఆటవిడుపే ఎక్కడెక్కడో తిరుగుతూ అటుగా వస్తుంది. నూకట్టుకెళ్ళి షావుకారుకమ్మితే కొబ్బరుండలో, జీళ్ళో పెడతాడు. అందరూ డబ్బాల్లోకి ఎత్తుకుంటున్నారు. ఎత్తుకోదానికి గౌరి దగ్గర ఏమీ లేదు. బస్తాలెత్తే కూలీ ఒకడు తన కొడుక్కి కాబోలు – గుమాస్తా దగ్గిర పేపరు తీసుకుని ఇస్తాడు. గౌరి అటూ ఇటూ చూస్తుంది. ఎండిపోయిన ఎంగిలి విస్తరాకు కనబడుతుంది. దాన్నే తిరగేసి అందులోకి గబగబా నూకెత్తుకుంటుంది.


ముగింపులో ఎంగిలి విస్తరాకును పాత్రగా తేవడం తప్పిస్తే ఇందులో ఇంకే విశేషం లేదు. సన్నివేశం సహజమైనది కావడంవల్లో, గౌరి పేదింటి చిన్న పిల్ల కావడంవల్లో కొసకొచ్చిన పులివిస్తరాకుల్లో దీనికి ’ఎంగిలికూడ’న్న పేరు పెడితే ఆ పేరు వల్లో, ఒకప్పుడది కథగా చలామణీ కాగలిగినా – ముందటి వృత్తాంతంలోలా హృదయాన్ని తాకే విశేషం ఇందులో లేదు. కాబట్టి కథ కాలేదు.


జరిగిన సంఘటన ఒక దానిని కథగా రాయదలిస్తే పైవిధంగా కథకు ప్రాణతుల్యమైనది ఆ సంఘటనలో ఉన్నదా లేదా? ఉంటే ఏదీ? తేల్చుకున్నాకే కథ రాయాలి. కల్పితమైన కథను రాస్తే ఒక విశేషం వ్యక్తం చెయ్యడానికి ఈ వృత్తాంతం కల్పిస్తాం. అయినా అందలి వృత్తాంతం, విశేషం విడివిడిగా కనిపించరాదు. ప్రాణీ ప్రాణంలా ఒకటిగా కనిపించాలి. పరిశీలించినప్పుడు ప్రాణిలో ప్రాణంలా వ్యక్తం కావాలి.

కొత్తలో ఈ రెండిటినీ ఎవరికి వారుగా చూడాలంటే ఒక కొండ గుర్తుంది. కథగా చెప్పదగ్గ ఈ సంఘటన జరిగినప్పుడు మనం అక్కడ ఉంటే – మన కళ్లకూ, చెవులకూ, తదితర ఇంద్రియాలకూ తెలియవచ్చేది కొంతా, ఆ సంఘతనతో ప్రమేయం ఉండే వ్యక్తుల గురించీ, పరిస్థితుల గురించీ ఊహించగలది కొంతా ఉంటాయి.

ఈ భోగట్టా, ఈ ఊహా కలిస్తే తెలియవచ్చేది ఈ సంఘటనకు సంబంధించిన వృత్తాంతం. ఈ వృత్తాంతంలో మనని కదిలించేది ఉంటే దానిని కథగా చెప్పాలనుకుంటాం. అలా కదిలించేదేతైతే ఉందో అదే విశేషం. వృత్తాంతంలా ఇది ఇంద్రియాలకూ, ఊహకీ తెలిసేది కాదు. హృదయాన్ని తాకేది. వివేచనకు మాత్రమే వ్యక్తమయ్యేది.

ఇలా కథను గుర్తించడానికి తెలియవలసిన అంశాలన్నీ క్రోడీకరిస్తే –
ప్రదేశాలూ, వాటి వర్ణనలూ, సంఘటనలూ పాత్రల చర్యలూ, వాటి సంభాషణలూ మొదలైనవన్నీ ఉన్నంత మాత్రాన ఓ రచన కథ కాదు.

పై కథా సామాగ్రి అంతా క్రమబద్ధంగా అమరి ఉంటే వాటివల్ల ఒక వృత్తాంతం తెలుస్తుంది. అదైనా వృత్తాంతమే కాని అదే కథ కాదు. వృత్తాంతంలో ఒక ఆసక్తికరమైన విశేషం ఇమిడి ఉండాలి. ఆ వృత్తాంతం ద్వారానే ఆ విశేషం వ్యక్తమవ్వాలి. అలా ఈ వృత్తాంతంలో ఒక విశేషం ఇమిడి ఉండి ఆ విశేషాన్ని ఆ వృత్తాంతమే వ్యక్తం చెయ్యగలిగినప్పుడు –

అదే కథ అవుతుంది.

Posted in వ్యాసం | Tagged , , | Comments Off on కథాకథనం – 2

’రమల్’ ప్రశ్నశాస్త్రం – 6

‘రమల్’లో పంక్తి భేధాలు ఉన్నాయి. ఇంత వరకు మనం చూసిన మూర్తుల క్రమాన్ని, ‘శకున పంక్తి’ అంటారు. ఇది చాల ప్రధానమైన పంక్తి.  లహ్యాన్ (వాగ్మి);  కబ్జుల్ దాఖిల్ (తీక్ష్ణాంశు); కబ్జుల్ ఖారీజ్ (పాత్);  జమాత్ (సౌమ్య్);  ఫరహా (దైత్యగురు); ఉకలా (మందగ్);  అంకీశ్ (సౌరి); హుమరా (లోహిత్) ; బయాజ్ (విధు); నుసృతుల్ ఖారీజ్ (ఉష్ణగు); నుసృతుల్ దాఖిల్ (సూరి); అతవే ఖారీజ్ (చక్ర); నకీ (ఆర్); అతవే దాఖిల్ (కవి); ఇజ్జతమా (బోధన్); తరీక్ (శీతాంశు). ఈ పదహారు మూర్తుల వరుస క్రమాన్నే ‘శకున పంక్తి’ అంటారు.దీనినే స్థాయీ పంక్తి అని అంటారు.


తక్కిన  పంక్తి  బేధాలు  ఈ  విధంగా  చెప్పబడ్డాయి.
1. శకున పంక్తి., 2. అ,వ,ద,హ పంకి, 3. వి,జ,ద,హ పంక్తి, 4. అ,వ,జ.ద పంక్తి, 5.  మిజాజ్  పంక్తి, 6. హరఫా పంక్తి, 7. అస్సద్ పంక్తి.


వీటిలో రెండవదైన అ,వ,ద,హ పంక్తిని  బిందు శోధన ప్రశ్న పధ్ధతిలో  చాలా  క్లిష్టమైన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేందుకు  ఉపయోగిస్తారు. ఆధునిక కాలం లోని అన్ని ప్రశ్నలకి ఈ పంక్తిలోని మూర్తుల ద్వారా జవాబులు చెప్పవచ్చు. వి,జ,ద,హ పంక్తిని  అవధిని (ప్రశ్న ఫలింఛే కాలాన్ని) తెలుసుకొనేందుకు వినియోగిస్తారు. అ,వ,ద,జ పంక్తిని దొంగల పేర్ల లోని అక్షరాలు, పట్నాలలోని అక్షరాలు, వగైరా తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. మిజాజ్ పంక్తిని సూర్యాది  గ్రహాలకి  ప్రాతినిధ్యం  వహించే  మూర్తుల క్రమంలో పేర్చి, వాటి శుభాశుభ దృష్టులని  తెలుసుకొనేందుకు వినియోగిస్తారు. చివరి  రెండు పంక్తుల ఉపయోగం రమలఙ్ఞుల అనుభవం మీద ఆధార పడుతుంది.


ఈ పంక్తుల లోని మూర్తుల క్రమం దిగువ నిచ్చిన  పట్టిక ఆధారంగా   తెలుసుకోవచ్చు.
 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
1 శకున

పంక్తి

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
2 అవ

దహ

పంక్తి

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
3 విజ

దహ

పంక్తి

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
4 అవ

జద

పంక్తి

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
5 మి

జా

జ్

పంక్తి

_

_

_

__

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

_

__

__

__

__

__

__

__

__

__

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
6

రఫా

పంక్తి

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

 

నెం పంక్తి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
7 అస్స

ద్

పంక్తి

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__

__


పదహారు మూర్తులను ఏడు విభిన్న రకాల  పంక్తులలో  పేర్చి ‘రమల్ ’శాస్త్రఙ్ఞులు, ప్రశ్న శాస్తాన్ని కూలంకషంగా విశదీకరించారు.


అ,వ,ద,హ పంక్తి: ఇది చాలా ముఖ్యమైన పంక్తి. దీనిలోని మూర్తుల క్రమం తత్వాలని బట్టి వర్గీకరించ బడింది. రమల్ లోని తత్వాలుముఖ్యంగా నాలుగని చెప్పుకొన్నాం కదా ! అవి వరుసగా, 1.అగ్ని, 2 వాయు, 3 జల, 4 పృథ్వి. ఈ తత్వాలలో  ప్రకటితమైనవి కొన్ని, గుప్తమైనవి కొన్నీ ఉంటాయి. బిందువుని ప్రకటితమైనదని, రేఖని గుప్తమైనదనీ అంటారు. ఈ విద్యలోని అసలైన మూర్తి, శీతాంశు అంటే  నాలుగు బిందువులు ఒకదాని క్రింద మరొకటి నిలువుగా వ్రాస్తే వచ్చేది. ఇందులో అన్ని తత్వాలూ ప్రకటితమైనవే! అగ్నితత్వానికి ఒక అంశ, వాయుతత్వానికి రెండు అంశలు , జలతత్వానికి నాలుగు అంశలు, పృథ్వితత్వానికి ఎనిమిది అంశలు ఇవ్వడం జరిగింది. ఈ అంశల లెక్క ప్రకారమే అవదహ పంక్తి లోని మూర్తుల క్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఇది ఎలాగయిందో పరిశీలిద్దాం !


అవదహ లోని మెదటి మూర్తి, లహ్యాన్ లేదా వాగ్మి దీనిలోని మెదటి వరసలో బిందువు ఉంది  అంటే అగ్ని తత్వం తెరచుకొని ఉంది. అంటే ఒక అంశ తప్ప తక్కిన తత్వాలన్నీ మూసుకొనే ఉన్నాయి కదా? ఇక రెండవ వరసలో మూర్తి హుమరా లేదా లోహిత్, అంటే (రేఖ, బిందువు, రేఖ, రేఖ ) ఈ హుమరాలో రెండవ వరుసలో బిందువు ఉండడం వల్ల, రెండు అంశలు అంటే వాయుతత్వం తెరచుకొని ఉంది కదా ! ఇక మూడవ వరసలోని మూర్తి నుస్రుతుల్ ఖారీజ్ లేదా ఉష్ణగు (బిందువు, బిందువు, రేఖ, రేఖ) దీనిలో మొదటి బిందువుకి ఒక అంశ, రెండవ బిందువుకి  రెండు అంశలు అంటే మొత్తం మూడు అంశలు వచ్చాయి, కనుక ఇది మూడవ మూర్తి అయింది! అలాగే  నాలుగవ మూర్తి బయాజ్ లేదా విధు (రేఖ , రేఖ, బిందువు, రేఖ) అంటే నాలుగు అంశలు, జలతత్వం తెరచుకొని ఉంది. ఇదే విధంగా పదిహేనవ మూర్తి శీతాంశు, లేదా తరీఖ్ (బిందు, బిందు, బిందు, బిందు) అంటే 1+ 2+ 8 = 15 అంశలు అయ్యాయి.ఆఖరి మూర్తి జమాత్ లేదా సౌమ్య (రేఖ, రేఖ, రేఖ, రేఖ) దీనిలో  ఏ తత్వమూ తెరచుకొని లేదు గనుక అంశలు లేవు. అందుకే ఇది ఆఖరి మూర్తి  అయింది. ఈ పంక్తి లోనే మూర్తుల గురించి సందర్భం వచ్చినప్పుడు వివరంగా చర్చించు కోవచ్చు. అలాగే తక్కిన పంక్తుల  వివరాలు కూడా సమయాన్ని బట్టి  చర్చించుకొందాం !


ఇక ప్రశ్న విషయానికి వద్దాం. ప్రశ్నని రమలఙ్ఞులు ఇలా విశదీకరించారు. 1. ప్రశ్న కర్త యొక్క మనసు లోని అభిప్రాయం. 2 దానికి కారణం 3. ప్రశ్న భేధము 4. కార్య సిధ్ధి లేదా అసిధ్ధి.


శకున పంక్తి లోని ఒకటి, నాలుగు , ఏడు, పది ఖానాలని కేంద్రాలని అంటారు.వీటికి సాక్షి క్రింద  ప్రస్తారం లోని సాక్షి పంక్తి లోని  పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు ఖానాలని పిలుస్తారు.వీటిని క్రమానుసారంగా గుణించి నాలుగు మూర్తులని తయారు చేసుకోవాలి.


ఇలా వచ్చిన నాలుగు షకల్ లలో మొదటి మూడింటిని , శకున పంక్తి లోని  మూర్తుల  ప్రకారం శుభా శుభ ఫలితాలు తెలుస్తాయి. అంటే మొదటి షకల్ ద్వారా ప్రశ్నకర్త అభిప్రాయం, రెండవ షకల్ ద్వారా కారణం, మూడవ షకల్ ద్వారా ప్రశ్న భేధము తెలుసుకోవాలి. ఈ మూడు మూర్తుల లోని  శుభా శుభ స్వభావాన్ని బట్టి  ఫలితం చెప్పాలి. ఇక నాలుగవ  షకల్ ని  సహాయక  ఉపకరణంగా వాడుకోవాలి.


దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం. (ప్రశ్న కర్త అభిప్రాయం తెలుసుకోవడం ఏమిటి అని సందేహం కలుగ వచ్చు. ఈ అబిప్రాయ సాధన మూక ప్రశ్నలలో అవసరం అవుతుంది.అంతే కాదు, ప్రశ్న కర్త నిజంగానే ఆ ప్రశ్నని అడుగుతున్నాడా, లేక తమాషాకి అడుగుతున్నాడా అనే విషయం కూడ తెలుసుకోవచ్చు)


ఒక పృచ్చకుడు వచ్చి, "హే రమలఙ్ఞ్ ! మీరు నా మనసు లోని అభిప్రాయము, కారణము, భేధము, సిధ్ధి అసిధ్ధి ఫలము చెప్పండి"  అని అడిగాడనుకొందాం. అతనిచ్చిన మాతృ పంక్తి  (ఉమాహంత్) లోని షకల్లు వరుసగా, ఫరహా, జమాత్, మూడు నాలుగు స్థానాలలో కబ్జుల్ ఖారీజ్ ఉన్నాయి. దీనిని బట్టి ప్రస్తార్ లేదా జాయచా వేసాం. అది ఇలా ఉంది.

ఈ విధంగా తయారయిన  ప్రస్తారాన్ని గమనించారు కదా ! దీని ద్వారా పృఛ్చకుని అభిప్రాయాన్ని తెలుసుకొందాం !

అభిప్రాయాన్ని తెలుసు కొనేందుకు, శకున పంక్తిలోని మొదటి ఖానాలోని లహ్యాన్ని, ప్రస్తారం లోని పదమూడవ ఖానా లోని ఫరహాని  గుణకారిస్తే (బిందు, రేఖ, రేఖ, రేఖ ) ( బిందు, బిందు, రేఖ, బిందు ) =  (కబ్జుల్ దాఖిల్ ) = (రేఖ, బిందు, రేఖ, బిందు ) వచ్చింది.


ఇప్పుడు ప్రస్తారం లోని మొదటి ఖానా లోని ఫరహాని, దాని సాక్షి రూపం లోని పంచమ ఖానా లోని ( ప్రస్తారంలో ) నకీని గుణకారిస్తే ఇజ్జతమా.( బిందు, బిందు, రేఖ, బిందు ) ( బిందు, రేఖ, బిందు, బిందు ) = ( రేఖ, బిందు, బిందు ,రేఖ ) వచ్చింది. ఈ విధంగా  రెండవ షకల్ వచ్చింది.

ఇప్పుడు ముందు వచ్చిన మొదటి షకల్ని,( ( రేఖ, బిందు, రేఖ, బిందు ) రెండవ షకల్ని ( రేఖ, బిందు, రేఖ, బిందు ) గుణకారిస్తే నుశ్రుతుల్ దాఖిల్ ( రేఖ, రేఖ, బిందు , బిందు ) వచ్చింది. ఈ నుసృతుల్ దాఖిల్ , శకున పంక్తిలో పదకొండవ స్థానంలో  ఉంది. అందువల్ల  ,పృఛ్చకుని అభిప్రాయాన్ని లాభం  గురించి అని తెలియ జేస్తోంది. పదకొండావ స్థానం లాభస్థానం కాబట్టి !

కారణం గురించి తెలుసుకొందాం.

శకున పంక్తిలోని  నాలుగవ స్థానం కారణ స్థానం ! అందులో  ఎప్పుడూ  ‘జమాత్’ ఉంటుంది. దాని సాక్షి ప్రస్తారం  లోని పద్నాలుగువ ఖానా , అందులో ‘లహ్యాన్’ ఉంది. వీటిని గుణకారిస్తే  తిరిగి లహ్యాన్’ వచ్చింది. అదే విధంగా ప్రస్తారంలో  నాలుగవ స్థానంలో  ‘కబ్జుల్ ఖారీజ్’ ఉంది. దానికి  సాక్షి  ప్రస్తారంలోని  ఎనిమిదవ ఖానా, అందులో ‘లహ్యాన్’  ఉంది.


ఇప్పుడు  ఈ  రెండింటినీ  గుణకారిస్తే  బయాజ్ ’ వస్తుంది. ఈ రెండింటినీ అంటే లహ్యాన్నీ, బయాజ్నీ ,గుణకారిస్తే  ‘కబ్జుల ఖారీజ్’ వచ్చింది. ఇది శకున పంక్తిలో మూడవ  స్థానంలో ఉంటుంది. అందువల్ల  మూడవ స్తానం కారణాన్ని తెలుపుతుంది. మూడవ  సోదరులు, సమీపస్థ యాత్ర లని సూచిస్తుంది. అందువల్ల పృఛ్చకుని  ప్రశ్న కారణం ఈ రెండింటిలో  ఒకటి అవుతుంది.


ప్రశ్న  భేధం గురించి తెలుసుకొందాం.

శకున పంక్తిలో ప్రశ్న భేదాన్ని  తెలిపే ఖానా  ఏడవది. అది ‘హుమరా’ ! దీని సాక్షి ప్రస్తారంలోని పదిహేనవ స్తానం, అందులో ‘కబ్జుల్ దాఖిల్’ ఉంది. ఈ రెండింటినీ గుణిస్తే ‘ అంకీశ్’ వస్తుంది. ప్రస్తారంలోని ఏడవ స్థానంలోని షకల్ ‘నుసృతుల్ దాఖిల్ ’. దీని సాక్షి  ప్రస్తారంలోని పదకొండవ ఖానా, అందులో కూడా ‘నుసృతుల్ దాఖిల్ ’.ఉంది ! వీటిని గుణిస్తే ‘జమాత్’ వస్తుంది. ఇప్పుడు మొదట వచ్చిన అంకీశ్నీ తరువాత వచ్చిన జమాత్నీ గుణిస్తే ‘అంకీశ్ ’ వచ్చింది. ఇది శకున పంక్తి లోని ఏడవ స్థానంలో ఉంటుంది అందువల్ల భార్య లేక భాగస్వామ్యము లేక దూర ప్రయాణము అని అనుకోవచ్చు. లభించిన  వాటిని బట్టి పరిశీలిస్తే  పశ్న కర్త భాగస్వామ్యం గురించిన లాభం గురించి అడుగుతున్నాడని  తెలుసుకోవచ్చు.


కార్య సిధ్ధి,లేక అసిధ్ధి

కార్య సిద్ధి  శకున పంక్తిలోని పదవ ఖానా అందులో ‘నుసృతుల్ ఖారీజ్’ ఉంటుంది. దాని సాక్షి ప్రస్తారంలోని పద్నాలుగవ ఖానాలోని  ‘లహ్యాన్ ’ వీటిని గుణిస్తే ‘హుమరా ’ వచ్చింది. ప్రస్తారంలోని పదవ స్థానంలో ‘జమాత్’ ఉంది దాని సాక్షి ప్రస్తారంలోని పద్నాలుగవ ఖానా లోని లహ్యాన్ వీటిని గుణిస్తే తిరిగి లహ్యాన్ వచ్చింది. ఇప్పుడు హుమరాని లహ్యాన్నీ గుణిస్తే  నుసృతుల్ ఖారీజ్ వచ్చింది. ఇది శకున పంక్తి లోని

పదవ స్తానంలో ఉంది .ఇది మంచిది పదవ స్థానం రాజ్య స్థానం మంచిదే !


అందువల్ల  అతని మనసులోని ప్రశ్నకి జవాబు  రాజు  గాని సరి సమానుడైన వ్యక్తి  సహాయం వల్ల  గాని  సోదరునితో వచ్చిన భాగస్వామ్య  ,తగాదాలో  లాభం కలుగుతుంది అని చెప్పడం జరిగింది.


కొసమెరుపు :

ఒక తిండిపోతు వచ్చి రమలఙ్ఞుని “ నేను భోజనం చేసానా లేదా ?” అని అడిగాడు.

అతను పాచికలతో ప్రస్తారం వేసి, ఆ ప్రస్తారంలోని పదవ స్థానాన్ని ( దశమం కర్మ స్థానం) ఆరవ స్థానాన్నీ ( షష్టమం రోగ ఋణ, శత్రు స్థానం అయినా భోజనం చేయడం అనేది ఋణం ఉంటేనే జరుగుతుంది ) అందులోని షకల్లనీ పరిశీలించాడు.ఆ యా స్థానాలలో శుభ మూర్తులు ఉంటే భోజనం  చేసినట్లు, అశుభ మూర్తులు  ఉంటే  చేయనట్లు గ్రహించాలి.


తరువాత సహజంగానే ఏయే పదార్థాలు తిన్నాను? అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా! దానికి జవాబు ఇవ్వడానికి , పదవ స్థానంలో అగ్ని తత్వ షకల్,  అగ్ని తత్వ ఖానాలోనే పడితే ,‘మృష్టాన్నంతో  పాటు, చక్కెర  బెల్లంతో తయారయిన తినుబండారాలు, భుజించాడనీ, వాయుతత్వ షకల్ వాయుతత్వ ఖానాలో పడితే, మృష్టాన్నంతో పాటు, తియ్యని  పాలు, పెరుగు, నేతితో  చేసిన  తినుబండారాలు  జలతత్వమయితే, మృష్టాన్నాలతో సహా ఫలాలని కూడా భుజింఛినట్లు, పృథ్వీ తత్వమయితే, మృష్టాన్నాలతో  పాటు,  చూర్ణము, రోటి, అటుకులు మొదలయినవి భుజించాడనీ  తెలుస్తుంది.

*****************

Posted in వ్యాసం | Tagged | Comments Off on ’రమల్’ ప్రశ్నశాస్త్రం – 6

చండశాసనుడు రా.రా

రాచమల్లు రామచంద్రారెడ్డి గారు 1959-63 మధ్య ఒకే సమయంలో రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా వృద్ధిచెందారు. ఆయన – పైన తెలిపిన కాలంలో 'సవ్యసాచి' అనే పక్షపత్రిక నడిపారు. ఆ పత్రిక నిర్వహణ ఖర్చు కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ భరించేది. ఎడిటరేమో రా.రా గారు. 'ఎదురు తిరిగిన కథానాయకుడు' అనే కథానిక తప్ప ఆయన రాసిన కథలన్నీ సవ్యసాచిలోనే అచ్చయ్యాయి. ఆ పత్రిక్కు కొడవటిగంటి కుటుంబరావు, కె.వి. రమణారెడ్డి లాటివారు వ్యాసాలు అవీ పంపేవారు. ముఖ్యంగా ప్రత్యేక సంచికలకు వారిద్దరు తప్పకుండా పంపేవారు. అప్పుడప్పుడు సొదుం జయరాం కథలు, బంగోరె సమీక్షలు, నేను గేయాలూ రాసేవాళ్లం. 'సవ్యసాచి'లో వచ్చిన ప్రతి రచనపైనా ప్రతి ఆదివారం గోష్ఠిలాటిది జరిగేది. ఈ గోష్ఠుల్లో కేతు విశ్వనాథరెడ్డి, నల్లపాటి రామప్పనాయుడు, బంగోరె, నేను తప్పకుండా పాల్గొనేవాళ్లం. రా.రా. ఎంత సౌమ్యంగా మాట్లాడేవారో బంగోరె అంత దబాయించేవాడు. బంగోరె సహకార బ్యాంకిలో ఉద్యోగం చేసేవాడు. బుచ్చిబాబును ఎవరేమన్నా సహించేవాడు కాదు. ముఖ్యంగా 'చివరకు మిగిలేది' అంటే చచ్చేంత అభిమానం. చాలా తరుచుగా కథాశిల్పంపై చర్చలు సాగేవి. చర్చల్లో రా.రా., బంగోరె – వీరిద్దరి డామినేషన్ స్పష్టంగా కనిపించేది. కవిత్వం మీద జరిగే ప్రతి గోష్ఠికి గజ్జల మల్లారెడ్డి తప్పకుండా హాజరయ్యేవాడు. చర్చలు చాలా లైవ్లీగా సాగేవి. చర్చల సారాన్ని సవ్యసాచిలో ప్రచురించేవారు కూడా. ఆ రిపోర్టింగ్ బాధ్యత కేతు విశ్వనాథరెడ్డి, రామప్పనాయుడు చూసుకునేవారు. రా.రా. గారు కావలిలో ఉన్న కె.వి. రమణారెడ్డి గారినుంచి పుస్తకాలు తెప్పించి మాకు సర్క్యులేట్ చేసేవారు. ఇటాలియన్ రచయిత పిరాండెలో రాసిన Six Characters in search of an author అనే నాటకంపైన ఒకసారి చాలా సీరియస్ గా చర్చలు సాగినట్లు గుర్తు. ఇది 1961లో కావచ్చు. అంతవరకు నేను పిరాండెలో పేరు ఎరుగను. అలాగే ఒకసారి (నాజీ బాధితురాలు) 'అన్నా ఫ్రాంక్ డైరీ' మీద కూడా రసవత్తరంగా చర్చ సాగింది. దేనిమీదనైనా సరే చర్చ మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో సాగేది. ఒక్క బంగోరె (లిబరల్ డెమోక్రాట్) తప్ప మిగతావారంతా కమ్యూనిస్టులు లేదా సానుభూతిపరులు.

చర్చల్లో కొ.కు. ప్రస్తావన వస్తే 'అంత గొప్ప రియలిస్టు ఇప్పట్లో పుట్టడు' అనేవారు రా.రా. రొమాంటిక్ రచయితలకూ, రియలిస్టు రచయితలకూ ఉండే భేదం గురించి మేమంతా ఆయన ద్వారానే తెలుసుకున్నాం. గోపీచంద్ ప్రస్తావన వస్తే, ఆయన మంచి రచయితే కానీ కొ.కు. మీదున్నట్లు ఆయన మీద నాకు 'గురుత్వం' లేదు అనేవారు. గోపీచంద్ గారి 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా' ఏదో పత్రికలో సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే కొ.కు. గారి "ఎండమావులు" విశాలాంధ్రలో సీరియల్ గా వచ్చినట్లు గుర్తు. వారిద్దరిపైనా ఒకటి రెండుసార్లు చర్చలు జరిపాం కానీ ఒక అంశం మాత్రమే గుర్తుంది. గోపీచంద్ గారి ఇంటలెక్చువల్ ఆనెస్టీ మీద తనకు నమ్మకం లేదు అన్నారు రారా. ఇంటలెక్చువల్ ఆనెస్టీ అంటే ఏమిటి? అన్నాన్నేను. ఆయనేదో పొడిమాటల్లో చెప్పారు కాని అది 'అందీ అందని చేలాంచలము' లాగా నా అవగాహనా పరిధిలోకి రాకుండా తప్పించుకుంది. రా.రా. మంచి స్పీకర్ కాదు. నట్లు నట్లుగా మాట్లాడేవారు. తనకు స్పష్టమైన అవగాహన లేని అంశంపై రాయడానికి కానీ, మాట్లాడేదానికి కానీ సాహసించేవారు కాదు. 1962 ఎన్నికల్లో ఒకసారి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కడప వచ్చారు. ఆ సందర్భంగా రా.రా. గారు 'సవ్యసాచి'లో 'నెహ్రూ వస్తున్నాడు అడగండి!' శీర్షికలో చక్కటి వ్యాసం రాశారు. చాలా శక్తిమంతంగా రాశారది. దాన్ని'విశాలాంధ్ర' పునర్ముద్రించింది. అయితే వాళ్లు చివరన 'సవ్యసాచి నుంచి' అని అకనాలెడ్జి చేయడం మరచారు. ఆ అంశంపై కూడా అయిదారు నిమిషాలు చర్చించాం. 'నిరసన లేఖ పంపండి సార్' అంటూ బంగోరె సూచించినట్లు గుర్తు. రా.రా. గారు నవ్వుతూ ఆయన సూచనను కొట్టిపారేశారు. రా.రా. గారు 'సవ్యసాచి' దశలో సాహితీ చర్చల్లో శిల్పానికీ, సాహిత్య ప్రయోజనానికీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. నేనోసారి చాలా ఉత్సాహంగా 'కాలాతీత వ్యక్తులు' (డాక్టర్ శ్రీదేవి) ఎంత గొప్పగా ఉందో! అన్నాను. 'గొప్పగా కాదు ఇంటరెస్టింగ్ గా ఉందను. ఇంటరెస్టింగ్ గా ఉండడం కంటె – సాహిత్యానికి ప్రయోజనమే ఎక్కువ ముఖ్యం' అన్నారాయన. కథకానీ నవలకానీ కవితకానీ ఏదైనా పాఠకుని సంస్కారాన్ని తీర్చిదిద్దడానికీ సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపించడానికీ ఉపయోగపడాలి అనేవారు. అయితే అదే సమయంలో రచన విధిగా కళాత్మకంగా వుండాలనేవారు. సాహిత్యంలో చౌకబారు ప్రచారాన్ని ఆయన ఏవగించుకునేవారు. నేను రెండు మూడుసార్లు వర్ధిష్ణువులవి రచనలు ఇచ్చి కాస్త దిద్ది 'సవ్యసాచి'లో వేయండి అన్నాను. ఆయన వేశారు కానీ, అవి అచ్చయ్యాక ఒక మాట అన్నారు. 'మనం దిద్ది వేస్తే ఓస్ రచన అంటే ఇంతే కదా అనుకుంటారు బిగినర్స్. అలా అనుకోవటం మన పత్రిక కంటే వాళ్లకే ఎక్కువ హాని' అన్నారాయన. ఆ మాట నిజమే మరి.
 


 

గరిమెళ్ళ నారాయణఆయన నడిపిన 'సవ్యసాచి'కీ 'సంవేదన'కూ చాలా తేడా వుంది. సవ్యసాచి 'రాజకీయ, సాంస్కృతిక' పక్షపత్రిక. సంవేదనేమో ఫక్తు సాహిత్య త్రైమాసిక. మొదటి దాని ఖర్చు కమ్యూనిస్టు పార్టీ భరిస్తే రెండోదాని ఖర్చు యుగసాహితి అనే సాహిత్య సంస్థ భరించేది. 'సంవేదన'కు వచ్చిన ప్రతి రచననూ విధిగా రా.రా.తో పాటు ఆర్వియార్, నల్లపాటి రామప్పనాయుడు కూడా పరిశీలించేవారు. రచన స్వీకారానికి కానీ తిరస్కారానికి కానీ ఉమ్మడి నిర్ణయాన్నే అమలు పరిచేవారు. ఎల్.పి.రావు అనే రచయిత 'ఓ బూతు కథ' పేరుతో సంవేదనకు ఓ కథానిక పంపారు. పేరులోనే వుంది తప్ప కథలో బూతే లేదు. చాలా చక్కటి కథ అది. ఎల్.పి.రావు అనే ఎల్. పుల్లోజీరావు ఇప్పుడు తెలంగాణాలో ఎక్కడున్నారో కానీ ఆయన తర్వాత కథలు గట్రా రాసినట్లు లేదు. సంవేదనలో అచ్చయిన ఆ కథ మాత్రం ఫెంటాస్టిక్. 'సంవేదన' అక్షరాలు రాసిస్తానని బాపు హామీ ఇచ్చాడు కానీ రాయలేకపోయారు. తర్వాత ఆ అక్షరాలు చలసాని ప్రసాదరావు (ఈనాడు) రాశాడు. సంవేదన, సంపాదకుడు, రాచమల్లు రామచంద్రారెడ్డి ఈ మూడూ ఆయనే రాశాడు. సంవేదన తొలిసంచికకు వేగుంట మోహన్ ప్రసాద్ గేయం పంపితే అది అస్పష్టంగా ఉంది, ఇంకొంచెం స్పష్టంగా రాసి పంపండి అంటూ రా.రా. ఉత్తరం రాసినట్లు గుర్తు. ఆయన రా.రా. మాట మన్నించి ఆ గేయాన్ని తిరగరాసి పంపాడు. రచనా ప్రమాణం విషయంలో చాలా కచ్చితంగా వుండేవారాయన. మంచి రచనలు రాకపోతే ఆయనే వ్యాసమో, సమీక్షో రాసేవారు. 'నాకు తెలుసు. వన్ మాన్ షో అనే విమర్శ వస్తుందని. అయినా ప్రమాణం విషయంలో రాజీ పడదల్చుకోలేదు' అనేవారు. ప్రతి రచనా ఒకటికి రెండుసార్లు ప్రూఫులు చూసేవారు.1968లో విశాలాంధ్ర వారు చాసో కథలు వేశారు. ఒక కాపీ సంవేదనకు సమీక్ష కొచ్చింది. రా.రా. గారు దాన్ని వెంటనే సమీక్ష కోసం కొ.కు. గారికి పంపారు. 'కథలు చాలా బాగున్నాయి కానీ ఇంతవరకు ఆయన పేరే నేను విన్లేదు' అన్నారు రా.రా. నాతో. వెనకబడిన ప్రాంతం వాళ్లం కదా ఎలా వింటాం అన్నాన్నేను. ఆయన నిండుగా నవ్వారు.
 

రా.రా. గారు కథలో ఇతివృత్తానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చేవారో, శిల్పానికి అంతే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఒకసారి 'సృజన'లో ఆర్. వసుంధర గారి కథ ఒకటి (మాతృదేవోభవ) అచ్చయింది. అందులోని ఇతివృత్తంలో విశేషమేమీ లేదుగానీ గొప్ప శిల్పం వుందంటూ మురిసిపోయారు ఆయన. ఆ కథ విశిష్టతపైన ఒక సాహితీ మిత్రుడికి ఆ రోజుల్లో ఆయన ఉత్తరం రాశారు. అది 'రా.రా. లేఖల్లో' వుంది. మనం రా.రా. వ్యాసాలు ప్రచురిస్తే బాగుంటుందని విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకుడు ఏటుకూరి బలరామమూర్తి గారికి సూచించింది నేనే. ఆయన వెంటనే ఒప్పుకుని వ్యాసాలు తెప్పించే బాధ్యత కూడా నాకే అప్పగించారు. ఆ వ్యాసాలే 'సారస్వత వివేచన'. ఆ పుస్తకానికి పేరు పెట్టింది కూడా నేనే. తర్వాత కొన్నేళ్లకి త్రిపురనేని మధుసూదనరావు ఆ పేరుపై దాడిచేసి ఆ పేరులోనే ప్రతీప ధోరణి వుందన్నారు. (sic) ఉత్తరం రాసి రా.రా. నుంచి వ్యాసాలు తెప్పించాను. అందులో వున్న దిగంబరకవులపై సమీక్ష తీసేసి వరవరరావు 'చలినెగళ్ళు' (జీవనాడి?)పై సమీక్ష ప్రచురిస్తే బాగుంటుందని నేను సూచిస్తే ఆయన విన్లేదు.దిగంబర కవులపై సమీక్ష వుండి తీరాల్సిందే అన్నారు. నేను మళ్లీ రాస్తూ దిగంబరకవుల్లో బూతే కాదు సామాజిక నిరసన కూడా వుంది కదా, దాన్ని మీరు విస్మరిస్తే ఎలా అంటూ కాస్త అతిగా వాగినా చివాట్లేమీ పెట్టలేదు. 'సారస్వత వివేచన'కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన వెలువడగానే ఆ విషయం తెలుపుతూ నాకు ఉత్తరం రాశారాయన.

Posted in వ్యాసం | 3 Comments

ఎటు వైపు…?

నిర్మాణాలను స్వప్నించే వారిని,

ఉన్నతానికై ఉద్యుక్తులయ్యే వాళ్ళనీ

‘ధ్వంసాన్ని తలపోయని, నేలకు కూలిపోని’

దృఢమైన దృక్పధం వెన్నంటి నడిపిస్తూ ఉండాలి.

కానీ,
 

లేశమాత్రపు వికృతం చాలు ,

నిర్మలమైన కలల పాలు కల్లలై విరిగిపోవడానికి ,

ధ్వంస విధ్వంసాలై కూలిపోడానికి,

పగిలి రగిలి తగలబడడానికి.


గుజ్జన-గూడైన చిన్నారి అంకితభావాన్ని

అబ్బురపడి హత్తుకునే లోపలే,

ఆకతాయి అసూయ అడుగులకింద

శిధిలమై వెక్కిరిస్తానంటుంది.


సింహం కోపాన్ని నిలువరించిన

చిట్టెలుక ప్రాణమంతటి ఆలోచనా నిర్మాణమే,

వలను ధ్వంసం చేసి మరీ

మృగరాజునే కాపాడిన ఎలుక బుద్ధికీ సాయపడింది.

ఎప్పుడు ఎవరు ఎందుకు ఎదురు తిరుగి కత్తులు దూస్తారో తెలియని

నిత్య జీవిత పద్మ వ్యూహం లో కూడా

నిర్మాణాలను స్వప్నించి ప్రయాణించడమే ఒక అసలు సిసలైన మహత్తర కార్యం.


ఇప్పుడు మనకి,

ధ్వంసాన్ని సైతం నిర్మాణంగా తలకెత్తుకున్న చిట్టెలుకల కధలూ,

గుజ్జన గూళ్ళు కట్టిన చిరుప్రాయపు దీక్షా సందేశాలు,

ఎడారుల నుండి పట్టుదలతో మొలకెత్త గలిగిన అడవుల కబుర్లూ కావాలి.

వెయ్యి ధ్వంసాల గురించిన విస్పోటనపు ప్రయత్నం కన్నా

ఒక్క నిర్మాణపు అలోచన చెయ్యడానికే కొండంత సాహసం కావాలి.

Posted in కవిత్వం | Comments Off on ఎటు వైపు…?

’రమల్’ ప్రశ్నశాస్త్రం – 5

రమల్ మూర్తుల  మధ్య  మైత్రీ  సంబంధాలు, దృష్టి  సంపర్కాలు, స్త్రీ  పురుష  నపుంసక  సంఙ్ఞలు, వర్ణాలు, బలాబలాలు , ప్రశ్న  భేధనకి  సహకరించే  ఉపకరణాలు ఉన్నాయి. ముందుగా  వాటిని  గురించి  తెలుసుకోనిదే, ఈ ప్రశ్న  శాస్త్ర  అధ్యయనం  కష్టం.


మైత్రీ సంబంధాలు : మిత్ర , శతృ , సమ  అని  మూడు రకాల సంబంధాలు ,ఈ రమల్  మూర్తుల మధ్య ఉన్నాయి. అవి వాటి  తత్వాన్ని  బట్టి  ఏర్పడ్డాయి. తత్వాలు ఈ విధంగా చెప్పడం జరిగింది

 

1 . అగ్నితత్వ మూర్తులు ( షకల్ లు ): నాలుగు : లహ్యాన్ / వాగ్మి ; అతవే ఖారీజ్ / చక్ర ; నుస్రుతుల్ ఖారీజ్ / ఉష్ణగు ; కబ్జుల్ ఖారీజ్ / పాత్.  ఇవి తూర్పు  దిశలో  బలీయమవుతాయి, పీత వర్ణాన్ని  కలిగి ఉంటాయి.

2 .వాయు తత్వ మూర్తులు ( షకల్ లు ): నాలుగు : హుమరా / లోహిత్ ; అతవే దాఖిల్ / కవి ; ఫరహా / దైత్యగురు ; ఇజ్జతమా / బోధన్. ఇవి పశ్చిమ దిశలో బలీయమవుతాయి, రక్త వర్ణాన్ని కలిగి ఉంటాయి.

3 . జల తత్వ మూర్తులు ( షకల్ లు ): నాలుగు : తరీఖా / శీతాంశు ; బయాజ్ / విధు ; నకీ / ఆర్ ; నుసృతుల్ దాఖిల్ /సూరి. ఇవి ఉత్తర దిశలో బలీయమైనవి, శ్వేత వర్ణాన్ని కలిగి ఉంటాయి.

4 . పృథ్వీ తత్వ మూర్తులు ( షకల్ లు ): నాలుగు : కబ్జుల్ దాఖిల్ / తీక్ష్ణాంశు; అంకీశ్ /శౌరి ; ఉకలా / మందగ్ ; జమాత్ / సౌమ్య్ .ఇవి దక్షిణ దిశలో బలీయమైనవి, శ్యామ వర్ణాన్ని క్లిగి ఉంటాయి.


వీటిని  ఈ దిగువన  ఇచ్చిన ఛార్టు  ద్వారా సులువుగా  అర్థం  చేసుకోవచ్చు.

౦      లహ్యాన్ లేదా          
___  వాగ్మి.తూర్పు దిశ

__     పీత వర్ణము.

__

౦  అతవే ఖారీజ్  లేదా

౦  చక్ర. తూర్పు దిశ

౦   పీత వర్ణము.

__

౦ నుసృతుల్ ఖారీజ్

౦ లేదా  ఉష్ణగు. తూర్పు

__ దిశ. పీత వర్ణము.

__

౦   కబ్జల్ ఖారీజ్ లేదా

__  పాత్. తూర్పు

౦   దిశ. పీత వర్ణము.

__

__  హుమరా లేదా

౦   లోహిత్  పశ్చిమ .

___ దిశ .రక్త వర్ణము

__

__ అతవేదాఖిల్ లేదా

౦   కవి, పశ్చిమ దిశ

౦   రక్త వర్ణము

౦   ఫరహా లేదా

౦  దైత్య గురు. పశ్చిమ

__ దిశ, రక్త వర్ణము

__  ఇజ్జతమా  లేదా

౦   బోధన్ .పశ్చిమదిశ.

౦   రక్త వర్ణము.

__

౦  తరీఖా లేదా

0   శీతాంశు. ఉత్తర

౦ దిశ. శ్వేత వర్ణము

0

__  బయాజ్ లేదా విధు.

__  ఉత్తర  దిశ . శ్వేత

౦     వర్ణము

__

౦   నకీ  లేదా  ఆర్

__  ఉత్తర దిశ. శ్వేత

౦  వర్ణము.

౦  నుసృతుల్ ఖారీజ్

౦  లేదా  ఉష్ణగు. శ్వేత

__ వర్ణము

__

__  కబ్జుల్  దాఖిల్

౦  లేదా తీక్ష్ణాంశు.

__ దక్షిణ  దిశ , శ్యామ

౦ వర్ణము.

__  అంకీశ్  లేదా సౌరి.

__  దక్షిణ దిశ.

__  శ్యామ వర్ణము.

౦   ఉకలా  లేదా

__  మందగ్ దక్షిణ  దిశ.

__  శ్యామ  వర్ణము.

__  జమాత్ లేదా

__   సౌమ్య. దక్షిణ

__   దిశ. శ్యామ

__   వర్ణము.


ఇప్పుడు ఈ తత్వాల  మధ్య  మైత్రీ  సంబంధాలు  తెలుసుకొందాం.
 

సంబంధము తత్వము తత్వము
మిత్రులు అగ్ని, వాయువు జలము, పృథ్వి
శతృవులు అగ్ని, జలము వాయువు, పృథ్వి
సములు అగ్ని, పృథ్వి జలము, వాయువు


స్త్రీ , పురుష , నపుంసక  సంఙ్ఞలు , శుభా  శుభ  సామయిక  బలాలు :


లహ్యాన్, అతవే ఖారీజ్, నుసృతుల్ ఖారీజ్, కబ్జుల్ ఖారీజ్  యీ  నాలుగు ‘ఖారీజ్ ’మూర్తులు  పగలు బలం గలవి, పురుష  సంఙ్ఞ  గలవి. (వీటి  సంస్కృతం పేర్లు వరుస  క్రమంగా  వాగ్మి, చక్ర, పాత్ , తీక్ష్ణాంశు,) వీటిలో  లహ్యాన్, నుసృతుల్ ఖారిజ్  శుభమైనవి. తక్కిన రెండూ  అంటే అతవే ఖారీజ్ ,కబ్జుల్ ఖారీజ్  అశుభ మైనవి.


అంకీశ్, అతవే  దాఖిల్, కబ్జుల్ దాఖిల్, నుసృతుల్ దాఖిల్ యీ  నాలుగు ‘ దాఖిల్ ’మూర్తులు రాత్రి  బలం గలవి, స్త్రీ సంఙ్ఞ గలవి. (వీటి  సంస్కృతం పేర్లు  వరుసగా సౌరి, కవి, తీక్ష్ణాంశు, సూరి,)   వీటిలో  అంకీశ్ మాత్రమే శుభమైనది. తక్కిన  అతవే దాఖిల్, కబ్జుల దాఖిల్, నుసృతుల్ దాఖిల్ అశుభమైనవి.


జమాత్, ఇజ్జతమా, హుమరా, బయాజ్  యీ  నాలుగు‘ సాబిత్ ’  మూర్తులు  సంధ్యా సమయంలో బలమైనవి. వీటిలో  మొదటి రెండు అంటే జమాత్, ఇజ్జతమా  నపుంసక  సంఙ్ఞ గలవి మరియు  మద్యమ బలం గలవి. హుమరా  అశుభ మైనది, బయాజ్  శుభ మైనది. (వీటి సంస్కృత శబ్దాలు వరుసగా సౌమ్య, లోహిత్, విధు, బోధన్ )


తరీఖా, ఫరహా, ఉకలా, నకీ, యీ నాలుగు, ‘ మున్కలీబ్’ మూర్తులు కూడా సంధ్యా సమయంలో  బలమైనవి. (వీటి సంస్కృత శబ్దాలు వరుసగా శీతాంశు, దైత్య గురు, మందగ్, ఆర్,) ఇవి కూడా సంధ్యా సమయం లోనే బలీయమైనవి. వీటిలో తరీఖా, ఫరహా శుభమైనవి. తక్కిన  రెండూ  ఉకలా, నకీ అశుభమైనవి. ఇందులో ఫరహా  పురుష సంఙ్ఞ కలది, మరియు  స్వల్ప బలమైనది. తరీఖా, ఉకలా, నకీ యీ మూడూ  నపుంసకలే  సంఙ్ఞలే అయినా  స్త్రీ స్వభావం గలవి. ! ఈ విధంగా ఆరు పురుష, అయిదు స్త్రీ, అయిదు నపుంసక  సంఙ్ఞలు  కలవి. వాటిని ఈ దిగువ పట్టికద్వారా  సులువుగా  అర్థం చేసుకోవచ్చు.
 

పురుష సంఙ్ఞ  మూర్తులు. స్త్రీ సంఙ్ఞ  మూర్తులు. నపుంసక  సంఙ్ఞ  మూర్తులు.
౦     ౦     ౦     ___       ౦          ౦

__   ___    ౦     ౦        ౦         ౦

__    ౦    __    __     __       __     ౦     __    ౦    ___     __      __

__    __    ___       ___        ___

౦    ___   ___      ___          ౦

__   ___     ౦        ౦           ౦

౦    ౦      ___       ౦             ౦

___   ౦      ౦   ___    ౦

___   ___   ___    ౦     ౦

___   ___    ౦     ౦      ౦

___     ౦     ౦    ___     ౦


మూర్తుల  గ్రహ సంబంధములు, వాటి స్థానములు, అవధి గురించి యీ దిగువ పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.
 

నెంబరు మూర్తుల పేర్లు స్వామి గ్రహం స్వస్థానము పగటి  అవధి రాత్రి  అవధి
1 ఉష్ణగు+తీక్ష్ణాంశు సూర్యుడు నాల్గవ స్థానం రవి వారం గురువారం
2 దైత్యగురు+కవి శుక్రుడు రెండవ స్థానం శుక్ర వారం మంగళ వారం
3 సౌమ్య + బోధన్ బుధుడు మూడవ స్థానం బుధ వారం రవి వారం
4 విధు + శీతాంశు చంద్రుడు మొదటి స్థానం సోమవారం శుక్ర వారందీ
5 మందగ్ +సౌరి శని ఏడవ స్థానం శని వారం బుధవారం
6 వాగ్మి +సూరి బృహస్పతి ఆరవ స్థానం గురువారం సోమవారం
7 లోహిత్+ఆర్ మంగళ్ (కుజుడు) అయిదవ స్థానం మంగళవారం రవివారం
8 పాత్ +చక్ర రాహు, కేతు స్థానం లేదు శనివారం మంగళవారం


ప్రశ్న భేదనకి ఉపయోగపడే ఉపకరణాలు:
ప్రశ్న చెప్పడానికి ఉపయోగపడే ఉపకరాణాలు ఆరు రకాలు. 1. ఇన్కిలాబ్ 2. బలాబల్  3. మరతీబ్ 4 ఇమ్తిజాజ్, 5 తసీర్, 6. తకరార్. వీటిలో  రెండవదైన, ‘బలాబలములు’ గురించి సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది. సందర్భాన్ని బట్టి, వివరంగా చెప్పుకోవచ్చు. పోతే ఇన్కిలాబ్ గురించి తెలుసుకొందాం.


ఇన్కిలాబ్ : పాచికల ద్వారా గాని, లేదా తదితర ప్రత్నామ్యాయాల ద్వారా గాని, ’ప్రస్తారం’ లేదా ’జాయచా’ వేసుకొన్నాక ఆ ప్రస్తారం నుండి ‘ఇన్కిలాబ్’ని తయారు చేసుకోవాలి. ఇన్కిలాబ్  వేయనిదే ప్రశ్నకి జవాబు సరిగా చెప్పడం కుదరదు ! దీనిని తయారు చేసుకొనే విధానం ఏమిటంటే ? ప్రస్తారంలోని  మెదటి, ఖానాలోని మూర్తిని అయిదవ ఖానా లోని మూర్తితోను, రెండవ ఖానా లోని మూర్తిని ఆరవ ఖానా లోని మూర్తితోను, మూడవ ఖానా లోని మూర్తిని ఏడవ ఖానా లోని మూర్తితోను, నాలుగవ ఖానా లోని మూర్తిని ఎనిమిదవ ఖానా లోని మూర్తితోను గుణకారించి, (1 ఇంటు 5, 2 ఇంటూ 6,  3 ఇంటూ 7, 4 ఇంటూ 8)  అలా వచ్చే నాలుగు మూర్తులని, ‘మాతృ పంక్తి ( ఉమాహంత్ )’ లోని మూర్తులుగా భావించి, మరొక ప్రస్తారం తయారు చేసుకోవాలి. దీనినే  ఇన్కిలాబ్ అంటారు. ప్రశ్నకి జవాబు చెప్పేటప్పుడు, మూల ప్రస్తారాన్నీ, దాని ఇన్కిలాబ్ ప్రస్తారాన్నీ విడివిడిగా శోధించి రెండింటి ద్వారా లభించిన జవాబుని విశ్లేషించిన తరువాతనే ఫలితం చెప్పాలి.


ఇన్కిలాబ్ వెయ్యకుండా చెప్తే, సరి అయిన ఫలితాన్ని చెప్పినట్లు అవదు ! అయితే ఎంతో అనుభవం సంపాదించిన ‘రమలఙ్ఞులకి’ ఇన్కిలాబ్ వెయ్యవలసిన  అవసరం లేదు. ఇంకా మూక ప్రశ్నలకీ, ముష్టిగత వస్తు ప్రశ్నలకీ, అవధి గురించి వేసే ప్రశ్నలకీ ,దొంగ పేరు  తెలుసు కోవాలని అడిగే ప్రశ్నలకీ,‘ ఇన్కిలాబ్’ వెయ్య వలసిన అవసరం లేదు. ఇన్కిలాబులో పదిహేనవ ఖానాలోని మూర్తి  ఎప్పుడూ ,‘జమాత్’ మాత్రమే వస్తుంది. (జమాత్  నాలుగు  రేఖలతో ఏర్పడే  మూర్తి). ఈ జమాత్  శుభ మూర్తుల గుణకారం వల్ల ఏర్పడితే  శుభ ఫలితాన్నీ, ఆశుభ మూర్తులని గుణించగా ఏర్పడినట్లయితే, అశుభ ఫలితాన్నీ  సూచిస్తుంది. మిశ్రమ  మూర్తులతో  ఏర్పడితే మిశ్రమ ఫలితాన్నీ చెప్పాలి.


మరాతివ్ : మరాతివ్ ఉపకరణంలో  అయిదు బేధాలు చెప్పబడ్డాయి. 1. నాలుగు బిందువులు  ఉండే మూర్తులని ‘ ‘రువాయీ’ లని అంటారు. 2. అయిదు బిందువులుండే మూర్తులని ‘ ఖుమాసీ’ లని అంటారు. 3. ఆరు బిందువులుండే మూర్తులని, ‘ సుదాసీ’ అని అంటారు. 4. ఏడు బిందువులుండే మూర్తులని ,’ సువాయీ’ అని అంటారు. 5.ఎనిమిది బిందువులుండే మూర్తులని, ‘ సమానీ’ లని అంటారు. వీటి  పేర్లలోనే  వీటి శుభాశుభ ఫలితాలు దాగి ఉన్నాయి. వీటిలో సుదాసీ, సువాయూలు శుభ ఫలితాలనీ, సమానీ మిశ్రమ ఫలితాన్నీ.రువాయూ, ఖుమాసీలు అశుభ ఫలితాల్నీ  ఇస్తాయి..


ఈ వివరణ విన్నాక, సహజంగానే సందేహం కలుగుతుంది. ఒకే  ఒక మూర్తిలో నాలుగు బిందువులు ఉన్నాయి కదా, మరి 5, 6, 7, 8 బిందువులు ఎక్కడినుంచి వచ్చాయి ? అని. దీనికి ‘రమల్’ ఇచ్చే సమాధానం ఏమిటంటే ‘ రేఖ’ రెండు బిందువులద్వారా  ఏర్పడుతుందని ! అందు వల్ల  5, 6, 7, 8 బిందువులుండే  మూర్తులు కూడా ఉంటాయి అని.


దీనిని పట్టిక ద్వారా తెలుసుకొందాం. 5, 6, 7, 8 బిందువులండే మూర్తులు, వరుసగా చూపబడ్డాయి.

__      ౦      ౦        ౦

౦      __      ౦        ౦

౦       ౦     __        ౦

౦       ౦      ౦       __

__     ౦        ___      ౦

__     ౦         ౦      ___

౦     ___        ౦      ___

౦     ___       ___      ౦

__     ౦         ___    ___

__     ___         ౦    ___

__     ___       ___     ౦

౦     ___        ___    __

___

___

___

___


ఇమ్తిజాజ్: రెండు మూర్తుల గుణకారం చేత ఏర్పడిన మూర్తినే ‘ఇమ్తిజాజ్ ’ అంటారు. ఈ ఇమ్తిజాజ్  శుభ మూర్తుల గుణకారం వల్ల ఏర్పడితే  శుభ ఫలితాన్నీ, ఆశుభ మూర్తులని గుణించగా ఏర్పడినట్లయితే, అశుభ ఫలితాన్నీ

సూచిస్తుంది. మిశ్రమ  మూర్తులతో  ఏర్పడితే మిశ్రమ ఫలితాన్నీ చెప్పాలి

 

తసీర్: ఇది ఉపకరణాలన్నిటి లోనూ  ప్రధానమైనది. దీనిని తెలుసుకొంటేనే గాని ప్రశ్న ఫలితాన్ని చెప్పలేము. ప్రస్తారంలో మెదటీ ఖానా ఎప్పుడు  ప్రశ్న కర్త ( పృఛ్చకుణ్ని) సూచిస్తూంది. అతని  వ్యక్తిగత ప్రశ్నలన్నింటికే దానినే ప్రధానంగా అంటే లగ్నంగా  భావించి ఫలితాలు చెప్పాలి. అతని బంధు వర్గానికి సంబంధించిన ప్రశ్నల  కోసం లగ్నం మారి పోతుంది.

ఉదాహరణకి ఒక  వ్యక్తి  వచ్చి, తన కుమారుని బావమరిదికి ధన లాభం కలుగుతుందా లేదా , అని అడిగాడని అనుకొందాం.

మెదటి ఖానా ప్రశ్న కర్తని, అక్కడినుండి పంచమ స్థానం అతని కుమారుణ్నీ, అక్కడినుండి  ఏడవ స్థానం పుత్ర వధువునీ, అక్కడినుండి తృతీయ  స్ఠానం  ఆమె తమ్ముణ్నీ (బావమరిదిని) సూచిస్తుంది. అంటే 13 వ ఖానా బావమరది అయింది (1నుండి 5 అంటే 5 అక్కడ నుండి 7 అంటే 11 అక్కడనుండి 3 అంటే  13) బావమరిది యొక్క ధన స్థానం  13 నుండి 2 అంటే  14 వ ఖానా అవుతుంది ! ఈ విధంగా మానవ  సంబంధాలనీ, అవసరాలనీ ప్రశ్నకి అనుకూలంగా మార్చుకోవడమే ‘తసీర్’.

 

తకరార్: ఒక ఖానా లోని మూర్తి మరొక స్థానంలో  తిరిగి రావచ్చు. అలా  ఎన్ని సార్లైనా రావచ్చు. దీనినే  తకరార్ అంటారు. శుభ ఫలితాన్ని ఇచ్చే మూర్తి  ఎన్ని సార్లు  పునరుక్తి (తకరార్) అవుతే అంత మంచిది అని భావించాలి. ఆశుభ మూర్తుల విషయానికి వస్తే తకరార్ మంచిది కాదు !


కొస మెరుపు: ఒక రమలఙ్ఞుడు  నదిలో స్నానం చేసి, ఒడ్డున ఇసుకలో  ఎండ కాగుతూ, ఆ రోజు తన దగ్గరకు  ఎంత మంది  ప్రశ్నకర్తలు (పృఛ్ఛకులు ) వస్తారో  తెలుసుకొందామని, చేతిలో  పాచికలు లేని కారణంగా, ఆ ఇసక మీదనే, నూరులో  నాలుగు సంఖ్యలు తలచుకొని వాటిని పదహారు చేత భాగించి వచ్చిన  శేష సంఖ్యలతో  జాయచా (ప్రస్తారం) వేసాడు !


ఆ ప్రస్తారంలో ఎన్ని మూర్తులు స్వగృహంలో  ఉన్నాయో  అంత మంది వస్తారనీ, వాటిలో స్త్రీ పురుష సంఙ్ఞలను బట్టి  వచ్చేవారి లింగ భేదాన్ని తెలుసుకొన్నాడు. ఈ ప్రశ్నకి ఉదాహరణ అవసరం లేదు, కేవలం స్థానం, సంఙ్ఞల గుర్తింపు కోసం చెప్పడం జరిగింది. పాఠకులు స్వయంగా పరిశీలించ వచ్చు. (దీనికి  ఇన్కిలాబ్ వేయాల్సిన అవసరం లేదు)

Posted in వ్యాసం | Tagged | Comments Off on ’రమల్’ ప్రశ్నశాస్త్రం – 5

విజయంలో ఒక్కో మెట్టూ .. రెండవ భాగం

వీరేంద్రనాథ్ గారితో పొద్దు జరిపిన పిచ్చాపాటీ రెండవ/తుది  భాగం ఇది.

—————

మీ కాకినాడ బడి సరస్వతీ విద్యాపీఠం గురించి చెప్పండి.

పేదపిల్లలకు స్టేజి ఫియరు, సంకోచం, మాట్లాడలేకపోవడం ఉంటుంది కదా, వారు ఈ బడికి వస్తారు. వారు నాతో మాట్లాడి, పగలంతా నాతో ఉండి, రకరకాల వ్యాపకాల్లో ఎంగేజ్ అయి ఆ భయం పోగొట్టుకుంటారు.


స్కూలు మీరే నిర్వహిస్తున్నారు కదా?

నాదే. నేను వెళితేనే ఓపెన్ అవుతుంది. అక్కడ పర్మనెంట్ గా పిల్లలుండరు. నేనెళ్ళే ముందర ఫోనొస్తుంది. అప్పుడు పిల్లలను రప్పించడం జరుగుతుంది. ఒకసారి వచ్చిన బ్యాచ్ మళ్ళీ రారు. నెలకు వారం రోజులక్కడ ఉంటాను. రోజుకు నలభై మంది పిల్లలు చొప్పున ట్రైన్ అవుతారు.


ఈ ఆలోచన ఎక్కడినుంచి వచ్చింది మీకు?

కర్ణాటకలో వీరేంద్ర హెగ్గడే అన్జెప్పి ఒకాయనున్నాడండి. పద్మవిభూషణ్. ఆయన కొన్ని కోట్లు పెట్టి ఇలాంటిది చేశాడండి. ఆయన వందమందిని అక్కడే ఉంచేసుకుని మంచి యువకులుగా తీర్చిదిద్దుతాడు. పొలందున్నటం దగ్గర్నించీ, కూరగాయలమ్మటం వరకూ వాళ్ళే చేయాలి. చాలా మంచి ఆలోచన. అందుకే పద్మవిభూషణ్ వచ్చిందాయనకు. అంత చేయలేం కాబట్టి చిన్నగా ఇలా.


నేటి తరం ముఖ్యంగా పిల్లలు చదవాల్సిన పుస్తకాలు – ఒక పది – చెప్పగలరా?

చందమామ.


యువతీ యువకులకైతే?

ఫిక్షనా?


ఏదైనా పర్లేదండి. ఓ పది తెలుగు పుస్తకాలు. పోనీ, ఫిక్షన్ లో ఐదు, నాన్ ఫిక్షన్ లో ఓ ఐదు..

చాలా కష్టమండి. సైంటిఫిక్ ఫిక్షన్ వేరు, ఫిక్షన్ వేరు, వ్యక్తిత్వ వికాసం వేరు, రష్యన్ సాహిత్యం వేరు…రష్యన్ లో సెమీ ఫిక్షన్ – పెరిస్తోవా అనుకుంటాను, పుస్తకాలకు మంచి అనువాదాలున్నట్టున్నాయ్. వాళ్ళ వాళ్ళ ఇంటరెస్టు బట్టి ఉంటుందండి. ఫిక్షన్ – నేను మిగతా రచయితల పుస్తకాలు ఎక్కువగా చదవలేదు. సులోచనారాణి గారి విజేత చదివాను. బావుంది. అయితే చదువుకోడానికి తప్ప, వేరే ఉపయోగముండదు. మల్లాది వెంకట కృష్ణమూర్తి పుస్తకాలు బానే ఉంటాయి. అయితే ఇవన్నీ టైమ్ పాస్. నాన్ ఫిక్షన్ లో … చాలా ఉన్నాయండి..చెంఘిజ్ ఖాన్ ఒకటి బావుంటుంది, విజయ రహస్యాలని నేనో పుస్తకం రాశాను. అది బానే ఉంటుంది. మహాత్మా గాంధీ చరిత్ర బావుంటుంది. కాంతమ్మ వంటల పుస్తకం – వంటల మీద అభిరుచి ఉన్నవారికి బావుంటుంది. చరిత్రలో నిలిచిపోయే పదిపుస్తకాలు చెప్పడం చాలా కష్టం.


మీరు మీ నవలకోసం రీసెర్చి పరంగా తప్ప మామూలుగా పుస్తకాలు చదవరని విన్నాను

రెగ్యులర్ గా అంటే ట్రైన్ లో వెళుతున్నప్పుడు , పల్ప్ సాహిత్యం అన్నారుగా అలాంటివి చదువుతాను. జేమ్స్ హాడ్లీ చేజ్, డెస్మండ్ బ్రాగ్లీ, అంటే వచ్చాడు, మర్డర్ చేశాడు, డిటెక్టివెళ్ళి పట్టుకున్నాడు. అయిపోతుంది. ట్రైన్ దిగితే పాత్రల పేర్లు కూడా గుర్తుండవు. అలాంటివి చదువుతాను.


ఏకబిగిన చదువుతారా?

ఏకబిగినే. ట్రయిన్ లోనే. ఇక్కడెందుకలాంటి పుస్తకాలు?


రచయితలు, రచయిత్రుల్లో మీ ఫ్రెండ్సెవరైనా ఉన్నారా?

నాకసలు ఫ్రెండ్సే ఎవరూ లేరండి. పరిచయస్తులే ఉన్నారు. ఫ్రెండ్సంటే మీ ఉద్దేశ్యమేంటి?


Acquaintance?

సాయంత్రం ఓ వన్ అవరు గాసిపింగ్ అవరు – బయటకొచ్చి ఓ నలుగురం ఏవో చెప్పుకుంటాం. నేను పొద్దుట్నుండీ ఒక్కణ్ణే ఉంటా కాబట్టి సాయంత్రం ఎవరో ఒకళ్ళు వస్తూంటారు, కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. త్రీ డేస్ పర్ వీక్ ఇలా. ఇవాళ రాసుకోవలసిన పని ఉండి కలవలేదు. పొద్దున నుండి క్రికెట్ టెస్టుమేచ్ వస్తూందిగా, ఇప్పుడు రాసుకోవాలి.


క్రికెట్ బాగా ఇంటరెస్టా మీకు?

ఆ. ఒకప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు ఓ మోస్తరుగా.


టెస్టు మేచులు కూడా చూస్తారా?

మన బాటింగ్ అయితే. అంటే – మేచ్ అలా జరుగుతుంటుందండి. నా మానాన నేను రాసుకుంటూ ఉంటాను.


మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే ఎలా పరిచయం చేసుకుంటారు?

చెప్పాగా. చార్టర్డ్ అకౌంటంట్ గా పరిచయం చేసుకుంటాను.


మీ గురించి అసలేమీ తెలియని, మీ పేరే వినని వారికి?

నన్నెవరు గుర్తుపడతారండి. టీవీలో వస్తా కాబట్టి గుర్తు పట్టచ్చేమో.


సినిమాల్లో పనిచేసినపుడు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సంఘటనలు, అనుభవాలు, చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా?

నా నవల్స్ సినిమాలుగా తీయవచ్చని గుర్తించిన వాడు కే. ఎస్. రామారావు. రిస్క్ పెట్టి ముత్యమంత ముద్దు అనే ఫిల్మ్ తీశాడు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు..కొన్ని డివిడెండ్ ఇచ్చినయ్, కొన్ని ఇవ్వలేదు.


మీరు చెప్పిన మూడూ బానే ఆడాయి. (నవ్వులు)

తర్వాత రెండు చెప్పలేదుగా. (నవ్వులు) స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ – నా దర్శకత్వంలో వచ్చింది. డైరెక్టర్ కావాలంటే చాలా ఓపికుండాలండి. నాకు లేదు. ఆ తర్వాత తెలిసింది నాకా విషయం. చాలా ఓపిగ్గా, ఏభై, అరవై రోజులు తీయాలి. రవితేజ అసిస్టంట్ డైరెక్టర్ గా పని చేసే రోజుల్లో దొంగ మొగుడనే సినిమా తీసేవాళ్ళం. నల్లంచు తెల్లచీర నవల. అందులో హీరో పేరు రవితేజ. అంచేత అతను హీరో అయిన తర్వాత ఆ పేరు పెట్టుకున్నాడు. అతని అసలు పేరు ఏదో ఉంది. ఇంకా కోట శ్రీనివాసరావు గారిని సినిమా ఫీల్డ్ కు ఇంట్రొడ్యూస్ చేసింది మేమే. కుక్క అని ఓ సినిమా తీశాం. అందులో తెలంగాణా శకుంతల, కోటా శ్రీనివాస రావు ఫస్ట్ టైమ్ ఏక్ట్ చేశారు. రాజశేఖర్ కు కూడా మొదటి సినిమాయే. కాష్మోరా సినిమాలో. ఇవి సినిమా విశేషాలండి. చిరంజీవికి అభిలాష తీసే టైములో అనుకుంటాను చరణ్ తేజ పుట్టాడు.


చిరంజీవితో చాలా సినిమాలలో పని చేశారు కదా. మీ experience ఎలా ఉండేది?

Professional. మంచి రిలేషన్. ఆ తర్వాత కలవలేదు. అంచేతనే ఇందాక ఫ్రెండ్ షిప్పంటే ఏంటని అడిగింది.


సోషియల్ గా కలవరా?

నేను ఏ ఫంక్షన్స్ కెళ్ళనండి. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నానండి. జూనియర్ ఎన్టీయారు సినిమా శక్తి అని. అది కూడా అశ్వినీ దత్ నాకు బాగా తెలుసు కాబట్టి. కథ వినమన్నాడు. కథ విని రెండు మూడు పాయింట్లు చెబితే చాలా బావున్నాయని రెండ్రోజులు, తర్వాత పదిహేను రోజులు రమ్మన్నాడు. అంతే. ఆ తర్వాత క్లోజ్ చేశేసాను.


ఆ మధ్య విలేజ్ లో వినాయకుడు లో నటించారుగా.

అందుకు రీజనేంటంటే – అందులో టిపికల్ కేరక్టర్ ప్లస్ రాజోలు నేను పుట్టిన ఊరు. అక్కడ షూటింగు. సరదాగా వారం రోజులు బావుంటుందని అక్కడికెళ్ళాను. అలా వెళతాను తప్ప, ఇప్పుడు నేను గుమ్మడి గారి వేషాలవీ వేయలేను.


వంట మీద మీకు మంచి అభిరుచి ఉందనుకుంటాను? టీవీల్లో కూడా అప్పుడప్పుడు వస్తుంటారు.

వంట బాగా ఇంటరెస్టు.


చేస్తూంటారా ఇంట్లో ఎప్పుడైనా?

ఎప్పుడైనా నాకు బాగా మూడున్నప్పుడు చేస్తుంటాను.


చిన్నప్పటి నుండీ ఉందాండి ఈ అభిరుచి?

రూములో వండుకునే వాణ్ణి. నవల రాయటం కన్నా మంచి వంట వండటమే కష్టమండి, సైంటిఫిక్ గా.


ఒకసారి మీరు రీసెర్చి అంతా అయిపోయిందంటే, నవల ఒక ఫ్లో లో రాసేస్తారా?

అలా ఏమీ ఉండదండి. ఏదో అప్పుడికప్పుడు రాయడమే. ఏదో చిన్న ప్రాబ్లెం వచ్చింది, అందుకే ఆగాను పొద్దున్నుండి. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్యుపై చేసింతర్వాత నాశనమయ్యిందా? అంతకు ముందే అయ్యిందా అన్న వివరం సరిగా దొరకట్లేదు. చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స దగ్గర ఆగిపోతుందండి అప్పుడప్పుడు. ఇలాంటి నవల్సయితే.


నెట్ బాగా యూస్ చేస్తారాండి?

ఈ మధ్య. ఈ నవల కోసం. (ప్రస్తుతం రాస్తున్నది)


వికీపీడియాలో మీ గురించి ఓ పేజీ ఉందండి చూశారా?

వికీపీడియా??


వికీపీడియా అంటే ఆన్లైను ఎన్సైక్లోపీడియాలాంటిది.

ఇంగ్లీషులోనా తెలుగులోనా?


ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ఉందండి. తెలుగులో మీగురించి ఓ పేజీయే ఉందండి.

అందరి గురించి ఉంటుందిగా? స్పెషాలిటీ ఏముందందులో?


అంటే – చూశారా అసలు అని?

చూసినట్టు గుర్తండి. మీరు చెప్పేది, నేను చూసేది ఒకటో కాదో తెలియదు. ఏముందండి రాజాలా పుట్టాడు.రచనలు చేశాడు! అంతేగా!


రీసెర్చ్ కంటెంట్ బానే దొరుకుతుందండి ఇంటర్నెట్లో.

ఇలాంటి నవల్సయితే దొరుకుతుందండి. ఆఫ్ఘనిస్తాను అదీ. మామూలువాటికి దొరకవు. హ్యూమన్
రిలేషన్సూ అవీ కష్టం. వాటికి అక్కర్లేదు కూడా.


You rely more on books. ఆ సిచువేషన్లో.

హ్యూమన్ రిలేషన్స్ కీ వాటికీ పుస్తకాలేముంటాయండి? మనమేమనుకుంటే అది రాయటమే. చరిత్ర
కావలసి వచ్చినప్పుడే కావాలి.


నెట్లో తెలుగు సైట్లు చూస్తుంటారా రెగ్యులర్ గా? కౌముది?

కౌముది బుక్కు ప్రతినెలా పంపిస్తారండి. నా సీరియల్ పడిందందులో. అందుకని చూస్తాను. అసలు
తెలుగులో సైట్సున్నాయని తెలీదు నాకు, మీరు చెప్పేవరకూ. ఏముంటాయి సైట్సులో? పొద్దుంటుంది అఫ్కోర్సు.


ఈమాట, ప్రాణహిత వగైరా

ఏముంటాయందులో, కథలు కవిత్వాలు అంతేగా?


ఆన్లైన్ మాగజైన్సు…

నాకు చాలా మాగజైన్సు పోస్టులో వస్తాయి. అవి చదవడానికే సమయం లేదండి. ఈ మధ్య చిత్రం,
చినుకు…ఇలా చాలా వచ్చాయి.


బిరుదులు, అవార్డులు..వాటి గురించి మీ అభిప్రాయం?

బిరుదులు, అవార్డులు బానే ఉంటాయండి. రచయితకు ఇన్స్పిరేషనిస్తాయి. ఆ మధ్య సాహిత్య అకాడెమీ అవార్డిచ్చారు.


రఘుపతి రాఘవ రాజారాం.. వస్తే బావుండునని మీరనుకునే అవార్డేదైనా ఉందాండి?

ఏముంటాయండి? వస్తే ఓకే. రాకపోతే సరే.. గొప్ప అవార్డంటే జ్ఞానపీఠ్..నాకు జ్ఞానపీఠ్ అవార్డు రావాలంటే, కనీసం 1500 మంది ఉన్నారండి, నాకన్నా మంచాళ్ళు, గొప్పవాళ్ళు, మహానుభావులూ.


జ్ఞానపీఠ్ అంటే రచన కాదు రచయిత…

రచయితకివ్వాలి అనుకొని, అతనికి సంబంధించిన రచనకిస్తారు. బట్.. 1500 మినిమం ఉండుంటారు, నాకన్నా బాగా రాసేవాళ్ళు.:-)


ఓ సారి జాలంలో చర్చ జరిగింది. తర్వాతి జ్ఞానపీఠ్ ఎవరికి అని..వచ్చిన కొన్ని పేర్లు చూస్తే .. ముళ్ళపూడి వెంకటరమణ, సోమసుందరం, మీ పేరూ..ఇలా ఉన్నాయండి.

(కాస్త చిరాకుగా) నాకు జ్ఞానపీఠ్ ఏంటసలు?


ఎవరికి అవకాశం ఉందంటారు?

జ్ఞానపీఠ్ అవార్డు..బాగ రాసేవారెవరున్నారీ మధ్య? చనిపోయినవారికివ్వరుగా? దాశరథి రంగాచార్య గారున్నారుగా, ఆయనకివ్వచ్చేమో! దానికో కొలమానం లేదండి. ఎవరికివ్వాలి అని.ఏదో రూపంలో మనిషిని ఎంచుకుని, రచనకిస్తారండి..నాకూ అంతేగా సాహిత్య అకాడెమీ, నాకిద్దామనుకుని రఘుపతి రాఘవ రాజారాం కిచ్చారు.


మళ్ళీ అలాంటి స్థాయికి తగ్గ రచనేదైనా వచ్చే అవకాశం ఉందాండి?

నేను రాసిన ప్రతీదీ అలాంటి స్థాయేనండి. కానీ జనం గుర్తించరంతే.


దానిక్కూడా కొలమానాలేవైనా ఉంటాయండీ? సాహిత్య అకాడెమీకి?

నాటకానికిచ్చారుగా..నవలకైతే, బూతుండకూడదు, ఎక్కువగా రొమాన్సుండకూదదు, సమకాలీన పరిస్థితులు ప్రతిబింబించాలి, ఒక ఫీలింగు, చరిత్రా…ప్లస్ చాలా ఉన్నాయండి. అప్పుడేదో ఇచ్చారు కానీ ఇప్పుడెందుకిస్తారు?Because, I am a popular commercial writer. చిరంజీవికి బెస్టు ఏక్టర్ అవార్డు రావాలంటే చాలా కష్టం. అతన్నిజంగా పూనుకుని, రుద్రవీణ లాంటి సినిమా తీసినా కష్టమే రావడం.


అంటే, మీరు పాపులర్ రైటరు అవడం వల్ల జ్ఞానపీఠం వచ్చే అవకాశం తక్కువైందంటారా?

జ్ఞానపీఠ్ అవార్డు రావటానికి పది అర్హతలుంటే, నాకు ఒక్క అర్హత కూడా లేదండి. నాకు సాహిత్యం మీద పట్టులేదు. చరిత్ర తెలీదు. నేనేమీ సమసమాజ నిర్మాణం కోసం నవలలు రాయలేదు.సమకాలీన పరిస్థితులు ప్రతిబింబించే రచనలు చేయలేదు. నాకెలా వస్తుందసలు? అసలా ఊహే తప్పు ఊహ. అమితాబ్ బచ్చన్ కు బెస్టు ఫైటర్ అవార్డెందుకు రాలేదన్నట్టు ఉంటుంది.


మీది ప్రత్యేకమైన, విలక్షణమైన శైలి. ఆ శైలికోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారా?

నేను ఒక్కొక్క పేజి నాలుగైది సార్లు రాస్తానండి వర్షన్సు. అందుకే ఆ శైలి.


ఓ నవలకు కనీసం నాలుగు వర్షన్సుంటాయాండి?

ఓ పేజీ. ఓ పేజీ రాయగానే, మళ్ళీ దాన్ని తిరగ రాస్తాను. మళ్ళీ తిరగరాస్తాను. కొట్టేసి బ్రాకెట్లో రాయటం అవన్నీ కాక, అలా రాసి ఓకే అనుకుంటే – మీ టేబుల్ దాటి పక్కకెళ్ళడానికి ముందే మూణ్ణాలుగు వర్షన్సుంటాయ్. అలా మూణ్ణాలుగు ఫిల్టర్సు పడిపోతాయండి. తరువాత కూడా ఉంటాయండి. చివరకు పంపబోయే ముందు కూడా ఏరో మార్కులవీ ఉంటాయి. శైలి పర్ఫెక్టుగా ఉంటే తప్ప…"అతను అక్కడికి వెళ్ళాడు","అక్కడికతను వెళ్ళాడు" ..ఈ రెంటికీ చాలా తేడా ఉంది.


మాపాఠకుల కోసం ఓ పేజీ తాలూకు వర్షన్సు ఇవ్వగలరా?

ఇదుగోండి, అయితే ఈ పేజీ తాలూకు ఫైనలు వర్షన్ వెళ్ళిపోయింది. ఫైనల్ అయింతర్వాత కూడా మార్పులుండవచ్చు.


ఒకేసారి రెండుమూడు రాస్తున్నారనుకోండి?

రాయనండి. ఇప్పుడు అస్సలు రాయను.


ఇప్పుడు ఎన్నివారాల ప్రాజెక్టు చేస్తున్నారండి?

25వీక్స్ రాద్దామనుకున్నానండి, బావుంది, కంటిన్యూ చెయ్యమని ఎడిటరంటే. మరో పదిహేను రోజులకు చెబుతాడు. చెబితే మరో పదివారాలు పెంచుతాను. అదన్నా, నాకు తృప్తి కలిగితేనే. లేకపోతే ముగింపు.


తర్వాత ఏమి రాయాలన్న ఐడియా ఉందాండి?

లేదండి. ఇదే చాలా రోజుల తర్వాత రాశాను.


ఇంత గాపెందుకు తీసుకున్నారండసలు?

నాకు పర్సనాలిటీ డెవలెప్ మెంట్ స్టూడెంట్స్ కు చెప్పడం బావుందనిపించింది. I am more engaged with resort.టైముండాలి.


మొత్తం ఆంధ్రా అంతా తిరుగుతారా?

ఆంధ్రా, కర్ణాటకా. బళ్ళారి ఉందిగా..


బళ్ళారి అంటే గుర్తొచ్చింది. కన్నడలో మీకు ప్రవేశం…

నాకు లేదండి.


మీ రచనలు బాగా కన్నడలో అనువాదం అయాయి కదండి. మొదట్లో వచ్చిన రచనలు, మీకు క్రెడిట్ ఇవ్వకుండా…అంటే చెప్పకుండా అనువదించుకున్నారని..

ఏ విషయం చెబుతున్నారు? నాకూ సులోచనారాణికి గొడవ.. అదా? మీరు చెప్పేదేదో కానీ, ఎవరో సులోచనారాణి గారి నవల్సు నాపేరుబెట్టి ట్రాన్సులేట్ చేసి రిలీజ్ చేసారు. దానిమీద సులోచనారాణి గారు హర్టయారు. అదీ గొడవ మా ఇద్దరికీ. మా ఇద్దరికీ అంటే.. నాకు ఏం లేదు. నేనంటాను – నేనేం జెయ్యను, ఎవరో ట్రాన్సిలేటు చేసుకుని ఏదో చేసుకుంటే నేనేం చెయ్యాలి? నాకు వాళ్ళెవరో చెప్పాలంటారు ఆమె. నాకు తెలిస్తే కదా చెప్పడానికి?


కార్పోరేట్స్ కూ, కాలేజీ వాళ్ళకూ మీ ప్రోగ్రాం ఉంది కదండి?

అవును jbit కాలేజీ.


ఇది ఫుల్ డే ప్రోగ్రామ్ కదండి?

3 అవర్సే. మామూలుగా అయితే 10 to 25 అవర్స్.


అంటే వర్క్ షాపులా కండక్ట్ చేస్తారాండీ స్టూడెంట్స్ కి?

అవును. స్టూడెంట్స్ వర్క్ షాప్.


ఎన్నాళ్ళముందు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుందండి?

దేనికి?


ఏదైనా ప్రోగ్రాంకోసం కాంటాక్ట్ చేయాలంటే – కార్పోరేట్స్ కు?

డేట్స్ బట్టీ అండి. అక్కడేదైనా ఖాళీడేటుంటే ఒకరోజు ముందు చెప్పినా పర్లేదు.


పబ్లిష్ అయిన రచనల మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయా? మెయిన్ టెయిన్ చేస్తారా వీటిని మీరు?

ఉంటాయ్, ఎక్కడో ఉన్నాయండి. చూడాలి.


ఇప్పుడు కూడా మీ అభిమానులనుండీ మీకు బాగా ఉత్తరాలు అవీ వస్తుంటాయాండి?

లేవండి. ఇప్పుడసలు ఉత్తరాలు రావు.


అప్పుడు వచ్చినప్పుడు మీరు సమాధానాలు ఇచ్చేవాళ్ళాండి?

ఆహా. అన్నిటికీ ఇచ్చేవాణ్ణి.


మేన్యుస్క్రిప్ట్స్ పత్రిక్కి పంపిన తర్వాత మీకు వెనక్కి పంపేవాళ్ళాండి? వారిదగ్గర అట్టిపెట్టుకునే వాళ్ళా?

కొన్నిపత్రికలు క్లోజయిన తర్వాత వాళ్లదగ్గర ఇప్పించుకున్నానండి.


మీరు చెప్పిన మీకిష్టమైన కోట్స్? Quotable quotes of Yandamuri?

చాలా ఉన్నాయండి. "రేపు ఆనందంగా ఉంటాననే నమ్మకంతో ఈ రోజు ఆనందంగా ఉండు"
"జీవితమంటే, ఇంతకన్నా బాగా ఆనందంగా ఉంటం కోసం ఈ రోజు పని చెయ్యటం" కాకపోతే ఈ quotes అన్నీ ఆనందం గురించి.


మీ Quotes అన్నీ ఎక్కడైనా సంకలనం చేశారా?

మంచిముత్యాలు – ఇలా రెండుమూడు పుస్తకాలు వచ్చినయ్.


కొత్తకొత్తపేర్లు పెడుతుంటారు, హేమంత సంధ్య, ప్రహసిత్ ఇలాగ. మీరేమైనా రీసెర్చి లాగా చేస్తారా?

లేదు,లేదు. అప్పుడెప్పుడో నేనో పేరుబెడితే, ఎవరో వాళ్ళబ్బాయికి ఆ పేరు పెట్టారు. ఇదేదో బావుందని, కొత్తపేర్లు ప్రయత్నించడం మొదలెట్టాను.


రేవంత్ అలా వచ్చిందేనా?

రేవంత్ – అవును, అలా వచ్చింది.


ఆ పేరు నవల వచ్చిన తర్వాత చాలామంది పెట్టుకున్నట్టున్నారు.

పెట్టుకున్నారండి, actual గా ఆ పేరుకర్థం గుర్రాలు తోలే అతనని.


ఓ ప్రముఖ తెలుగుదేశం నాయకుడున్నాడండి.

రేవంత్ రెడ్డి! దానికన్నా, అనూష ఎక్కువమంది పెట్టుకున్నారు.


ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు – ముఖ్యంగా నైట్ క్లబ్బులు, జీవితాల్లో డబ్బు ప్రాముఖ్యత పెరగటం, వీటిమీద మీ అభిప్రాయాలేమిటి?
తప్పేముంది?


సంస్కృతి పట్ల..

నాకంత broad ideas లేవండి. నాదంతా వ్యక్తిత్వ వాదం. ప్రతిమనిషి ఆనందంగా ఉండాలి. సమాజం పాడైపోతోంది,  TV9 లో రోజూ చూసినవే చూపిస్తున్నారు, పేపరులో న్యూసు – ఇవాన్నీ నాకు పట్టవండి. ఒకరు జీవితంలో బావుండాలి. అంతే.


ఏదినచ్చితే అది చేయాలి అంటారా?

ఇంకొకళ్ళకు నష్టం లేకండా. మర్డరు చేసి నేనిలానే అంటే కుదరదు కదండీ. ఇందులో రెండున్నాయి. బలహీనతలు, తప్పు. బలహీనతలంటే – ఓ పని చేయటం వల్ల మీకు నష్టం కలిగించేవి. – సిగరెట్లు, తాగుడు, పేకాట, రేసులు – ఇవి నాకు సరిపడవు. తప్పు అంటే నావల్ల మీకు నష్టం కలిగించేది. – మర్డరు, చీటింగు,వగైరా. ఈ రెండూ కాకండా, ఈ రోజెంత ఆనందంగా ఉన్నామో, రేపు ఆనందంగా ఉండాలన్న ధీమా సంపాదించుకోవాలి. ఈ రోజు ఆనందంగా ఉంటం ఈజీ. కానీ రేపు ఆనందంగా ఉండాలంటే ఈ రోజు డబ్బు సంపాదించాలిగా.నా ఆలోచనలు అంతవరకే. అంతేతప్ప, సమాజం పాడైపోతోంది, యువతీయువకులు పబ్బులకెళ్ళిపోతున్నారు, నైతికవిలువలు తగ్గిపోయినై …అంత ఆలోచించనండి. ఎందుకంటే, యాభై యేళ్ళ ముందు కూడా పొడుగ్గా ఆరడుగుల ఆసామీ అంగవస్త్రం వేసుకుని సాయంత్రం ఆరింటికి సెకండ్ సెటప్పు దగ్గరికెళ్ళిపోయేవాడు. ఇంట్లో ఆవిడొక్కతే పాపం వంటచేసుకుని, పిల్లలను చూసుకుని మునగదీసుకునేది. అప్పుడూ ఉన్నాయి, ఇప్పుడూ ఉన్నాయీ బాధలు. బాధలెప్పుడూ ఉంటాయి, ఏడ్చేవాళ్ళెప్పుడూ ఏడుస్తూనే ఉంటారు, ఇథియోపియా ఇథియోపియాలానే ఉంటది, సౌదీ అరేబియా, సౌదీ అరేబియాలానే.అంచేత వ్యక్తిగతంగా మనం ఎలా ఆనందంగా ఉన్నాము? ఉన్నంతలో చుట్టూ ఉన్నవాళ్ళను ఎలా ఆనందంగా ఉంచగలుగుతున్నాము. అదే వ్యక్తిత్వవికాసం.single man identity.సమాజం ఎలా ఉంది అనేదానికన్నా, నువ్వెలా ఉన్నావనేదే నా నవలల్లో చెప్పడానికి ప్రయత్నించాను.


రచనలు, సినిమాలు, క్లాసులు, సరస్వతీ పీఠం.. తర్వాతి ప్రస్థానమెటువైపు?

(నవ్వు) తెలీదండి. ప్రస్తుతానికేమీ ఆలోచనలు లేవు.


ఇంతటితో మా ప్రశ్నలు ముగిశాయండి. పొద్దు పాఠకులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా?

ఏవీ లేదండి.


మీ కథేదైనా పొద్దు పాఠకులకోసం ఇవ్వగలరా?

తీసుకోండి.

(యండమూరి వీరేంద్రనాథ్ గారి కథ నిశ్చల యాత్ర పొద్దు పాఠకులకోసం త్వరలో)

Posted in వ్యాసం | Tagged | Comments Off on విజయంలో ఒక్కో మెట్టూ .. రెండవ భాగం

ఇన్‌ఫార్మర్

ఇన్‌ఫార్మర్లందరిని వెతికి పట్టుకుని చంపుతున్నారనే పుకార్లతో ఊరంతా అలజడిగా ఉంది.  గత యాభై ఏళ్ళలో లోయలో ఎప్పుడూ ఇటువంటి మరణాలు లేవు, కానీ ఇప్పుడిక్కడ రోజుకో నాలుగు లేదా అయిదు చావులు మామూలయిపోయింది.

ప్రతి ఒక్కరి ముఖంలో భయం, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. తమ నీడని కూడా నమ్మలేని పరిస్థితి. "జాబితాలో నా పేరు ఉందా? రక్షణ బలగాలతో నాకు సంబంధం ఉందని వాళ్ళు అనుమానిస్తున్నారా? లేదంటే రక్షణ సిబ్బందితో నేను మాట్లాడడం ఎవరైనా చూసారా?"  ఇలా ప్రతి ఒక్కరు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు.

ఇలా తమకి తాము వేసుకున్న ఒక్కో ప్రశ్నకి వారిలో ఆందోళన మరింత పెరిగిపోతోంది. "నా రాజకీయ విధేయతల గురించి ఎవరికైనా తెలుసా?" అని ఏ వ్యక్తి అయినా అనుకుంటే అతని గుండె కలవరంతో వేగంగా కొట్టుకుంటోంది.  "ఈనాటి సంఘటనలలో ప్రమేయం ఉన్న ఎవరితోను నాకు సంబంధాలు లేవు, మరి నన్ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారు?". అతని రక్త పోటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. మరునాడు అతను స్థానిక దినపత్రికలో – తనకి ఏ రాజకీయ పార్టీతో గానీ లేదా ఏ గూఢచార వ్యవస్థతో గాని ఎటువంటి సంబంధాలు లేవని – తాటికాయంత అక్షరాలతో ఓ వివరణాత్మక ప్రకటన ఇస్తాడు.


చావు అనే ఆలోచనకి భయపడినంతగా, నిజంగా మరణానికి ఎవరు భయపడరేమో.  లోయలోని ప్రతి ఒక్కరు అనివార్యమైన మృత్యువుని ఎదుర్కోడం కోసం రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.  కొంతమంది పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పారు, మరికొందరు తమ పరిస్థితులను వివరించారు, ఇంకొందరు లోయని విడిచిపెట్టి వెళ్ళిపోయారు.

అయితే నీలకంఠ ఇటువంటి పనులేవీ చేయలేదు. తన అరవై అయిదేళ్ళ జీవితాన్ని ఇక్కడే ఈ లోయలోనే ఎంతో నిజాయితీతో, ధర్మబద్ధంగా గడిపాడు. ఇప్పుడు కూడా తన చుట్టూ ఉన్న ఉద్విగ్న వాతావరణంలో సైతం ఆయన ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు.

నీలకంఠ ఇల్లు మహరాజా ఇటుకలతో….. అంటే ఈ కాలం నాటి టైల్స్‌తో నిర్మితమైంది, ప్లాస్టరింగ్ బంకమట్టితో చేసారు. ఇంటి పైకప్పుకి పెంకులు వేసారు. ఆయన ఇల్లు జీలం నది ఒడ్డున ఉంది. ఆ నది ఎన్నో ఏళ్ళుగా రాజసంతో ప్రవహిస్తోంది.  ఆయనుండే ప్రాంతం పేరు హబ్బాకదల్. వేకువ జామున తొలి కోడి కూతకే సందడి నెలకొనే ఏకైక ప్రాంతం శ్రీనగర్‌లో ఇదొక్కటే. ఒకవైపు గుడి గంటలు మరోవైపు ముస్లింల ప్రార్థనలు వినిపిస్తుంటాయి. తోపుడు బళ్ళ మీద వస్తువులు అమ్ముకునేవారు తెల్లారకట్టే హబ్బాకదల్ వంతెనపై చేరుతారు, తమ తమ సంబారాలతో కొనుగోలుదారులని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. కూరగాయలు అమ్మేవాళ్ళు గంత్ గోబీ, తామర తూడ్లు, కాశ్మీరీ ఆకుకూరలని అమ్ముకుంటుంటే; చేపలమ్మే ఆడవాళ్ళు తమ తమ చేపలని అమ్ముకోడానికి చిన్న చిన్న నెపాలకే ఒట్లు పెట్టేసుకుంటున్నారు. మరో వైపు  బేకరి నుంచి నోరూరించే సువాసనలు; ఇంకో మూల నుంచి మిఠాయి కొట్లోంచి మరుగుతున్న పాల వాసన!  ఓ హిందువు చేపలు కొంటూ గాయత్రి మంత్రం మననం చేసుకోడం; ఓ ముస్లిం తామర తూడ్లను కొంటూ పవిత్ర ఖురాన్‌ లోని రెండవ అధ్యాయం పఠించడం గమనించవచ్చు. గుర్రపు గిట్టల చప్పుడుతోను, సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళు జనాల నుంచి తప్పుకోడం కోసం కొట్టే బెల్ శబ్దంతోను, ఆటోరిక్షాల చప్పుడుతోను ఆ రోడ్డంతా నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ శబ్దాలు అర్ధరాత్రి వరకూ కొనసాగుతాయి. అబ్బాయిలు, అమ్మాయిలు స్కూళ్ళకి, కాలేజిలకి వెళ్ళే సమయంలో ఈ రోడ్డు అత్యంత కోలాహలంగా ఉంటుంది. తెల్లటి సల్వార్ కమీజ్ దుస్తులలో సీతాకోకచిలుకల్లాంటి అందమైన అమ్మాయిలు వెడుతుంటే, కొంటె వ్యాఖ్యలు చేస్తూ కుర్రాళ్ళు వాళ్ళని అనుసరిస్తూంటారు. ఆ వ్యాఖ్యలు నచ్చితే అమ్మాయిల బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కేవి. వాళ్ళకది వినోదంగా ఉండేది.

కాని నేడంతా విభిన్నం! వాతావరణంలో హఠాత్తుగా ఏదో మార్పు! నీలకంఠ ఎందుకలా తీవ్రమైన ఆలోచనల్లో నిమగ్నమైపోయాడో దేవుడికే తెలియాలి. వృద్ధురాలైన ఆయన భార్య ఆయన హుక్కా గొట్టాన్ని శుభ్రం చేసి, దాన్లోని నీటిని మార్చింది.  ఆయన చిలుములో పొగాకు నింపి బొగ్గుతో నిప్పు చేసి దాన్ని వెలిగించి ఒక పీల్పు పీల్చాడు. గాలి బయటకు వదలగానే ఆయన నోట్లోంచి రింగులు రింగులుగా పొగ వెలువడింది. ఓ క్షణం పాటు ఏ ఆలోచన లేకుండా శూన్యంలోకి చూస్తుండిపోయాడు.  కాసేపయ్యాక చిన్నగా దగ్గి, మళ్ళీ ఆలోచనల్లో కూరుకుపోయాడు.

ఆయన తన పెళ్ళైన రోజుని గుర్తు చేసుకున్నాడు.  ఆ రోజు ఆయన అరుంధతి వాళ్ళింటికి వెళ్ళడానికి హబ్బాకదల్ వంతెన దాటాడు . ఎందుకంటే ఆవిడ ఇల్లు నదికి ఆవలి ఒడ్డున ఉండేది. తన ఇంటి కిటికిలోంచి ఆయన అరుంధతి గారి పుట్టింటిని చూసేవాడు. ఆవిడ కూడ కిటికి దగ్గరే నిలుచుని ఉండేది. వారి ఇళ్ళను విడదీసింది గంభీరమైన జీలం నదే.

రోజూవారి పనులను పూర్తి చేసుకుని అరుంధతి వచ్చి ఆయన పక్కన కూర్చుంది. సమయం ఎలా గడుస్తుందో ఎవరికీ తెలియదు. " మన పెళ్ళయి నలభై అయిదు సంవత్సరాలు గడచిపోయాయి……" అన్నాడు నీలకంఠ, అరుంధతి ముఖంలోకి చూస్తూ. ఆయనకి ఈ విషయం నమ్మశక్యంగా లేదు.

"ఏంటి హుషారుగా ఉన్నట్లున్నారు? ఇన్ని ఏళ్ళ తర్వాత మీరు పెళ్ళి రోజుని గుర్తు చేసుకున్నారు? ఏంటి సంగతి?" అంటూ ఆవిడ ఆశ్చర్యపోయింది .

"ఏం లేదు. ఊరికే.  ఈ రోజు ఏం తారీఖో తెలుసా?"

" హు‍(. ఈ వయసులో తేదీలు, సమయాలు ఎవరికి గుర్తుంటాయి? మన జీవితం – గడచిపోయిన సంవత్సరాన్ని సూచించే కాలెండర్ లాంటిది   – అన్న సంగతి మీకు తెలియదూ? దాని మీద దేవుడి బొమ్మ ఉంది కాబట్టి ఇంకా గోడ మీద ఉంది లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బయట పడేసేవాళ్ళు. మనం కూడా కాలమనే దారంతో వేలాడుతూ ఉన్నాం, వాళ్ళింకా మనల్ని గౌరవిస్తున్నారు కాబట్టి మనల్ని చెత్తబుట్టలోకి తోసేయలేదు….మనం కూడా ఆ కాలెండర్ మీది దేవుళ్ళలా వాడిపోడానికి సిద్ధంగా ఉన్నాం కదూ?"

"నిజమే… మనం ఆ గోడ మీది కాలెండర్ పైన ఉన్న దేవుళ్ళలా రాలిపోడానికి సిద్ధంగా ఉన్నాం, విధివిలాసం కోసం ఎదురుచూస్తున్నాం…."

టీ కోసం నీళ్ళు మరగబెట్టడం కోసం గిన్నె హీటర్‌పై పెట్టిన సంగతి గుర్తొచ్చి "ఈ పాటికి నీళ్ళు మరిగి ఉంటాయి" అనుకుంటూ గోడని ఆసరాగా చేసుకుని లేచి నిలబడిందావిడ. అలమారలోంచి టీ కెటిల్, రెండు ఇత్తడి కప్పులు బయటకి తీసింది.  నీలకంఠ హుక్కా గొట్టాన్ని పక్కకి పెట్టి , దానిపై మూతబెట్టి మరో చెత్తో ఓ కప్పు అందుకున్నాడు. అరుంధతి వచ్చి ఆయన కప్పులో టీ పోసింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మరో కప్పులో తనకి కూడా పోసుకుని వచ్చి ఆయన పక్కన కూర్చుంది.

"నీకు గుర్తుందా? నేను మా ఇంట్లోంచి నిన్ను గంటల సేపు చూసేవాడిని"

"ఏమైంది మీకీ రోజు? వింతగా ఉన్నారు? " అంటూ భర్త మాటలకి అడ్డుతగిలింది. ఆ తర్వాత ఆవిడ కూడా బాల్య స్మృతులలోకి జారుకుంది.  అరుంధతి నీలకంఠ కన్నా అయిదేళ్ళు చిన్నది, కాని తీవ్రమైన ఆర్థ్‌రైటిస్ వ్యాధి వలన ఆమె చేతి వేళ్ళు బిర్రబిగుసుకు పోయాయి, వాచిపోయాయి. చలికాలం ఆవిడ నొప్పులని మరింత పెంచింది. కీళ్ళ నొప్పులు ఆవిడ కాళ్ళు చేతులను కట్టేసినా మరో మార్గం లేదు….. ఇంటి పనులు చేసుకోవాల్సిందే… ఈ వృద్ధాప్యంలో సాయం చేయడానికి ఆవిడకి ఎవరూ లేరు మరి. ఆవిడకి పిల్లలు లేక కాదు, కానీ వాళ్ళిద్దరూ చెరో చోట… ఒకరు అమెరికాలో, మరొకరు ముంబయిలో తమ తమ కుటుంబాలతో ఉంటున్నారు .

"చాలా రోజుల నుంచి నా కుడి కన్ను అదురుతోంది.  ఏదో కీడు జరగబోతోంది.  ఏమవుతుందో ఆ దేవుడికే తెలియాలి" అంటూ అరుంధతి నేల మీది చాపలోంచి చిన్న ముక్కని తెంపి కొద్దిగా ఉమ్ము అంటించి కంటి వణుకుని ఆపేందుకు కంటి రెప్పపై ఉంచుకుంది.

"మన తలరాత ఎక్కడో స్వర్గంలో రాయబడింది . జరిగేది జరగక మానదు……" అన్నాడాయన.  ఆయన కంఠంలో అంత నిర్వేదం, అంత దిగులు  మునుపెప్పుడూ లేవు.

విధి గురించి భర్త ఇలా మాట్లాడడం అరుంధతికి వింతగా ఉంది. గతంలో ఎన్నడూ ఇలా మాట్లాడలేదాయన. తను వేసే ప్రశ్నలకి భర్త నుంచి జవాబులు రాకపోతే ఆవిడకి చికాకు కలుగుతోంది. నీలకంఠ గత కొన్ని రోజుల నుంచి నిద్రించే ముందు ప్రతి తలుపుని కిటికిని జాగ్రత్తగా మూయడం ఆవిడ గమనిస్తోంది. ప్రతి గొళ్ళెం, గడియ సరిగ్గా పట్టాయో లేదో పరిశీలించేవాడు. ఒక్కోరోజు హఠాత్తుగా అర్ధరాత్రి పూట నిద్ర లేచి కిటికి పరదాలను పక్కకి జరిపి బయటి చీకటిలోకి తొంగి చూసేవాడు. సైనిక వాహనాల ధ్వని, సైనికులు రాత్రిళ్ళు చేసే కవాతు చప్పుడు తప్ప మరే శబ్దాలు వినిపించేవి కావు.  భయం, ఆందోళన నిండిన వదనంతో తిరిగి మంచం మీద వాలేవాడు.

Posted in కథ | Tagged | Comments Off on ఇన్‌ఫార్మర్

కథాకథనం – ముందుమాట

ముందుమాట

కళలన్నవి పుట్టుకతో రావలసిందేగాని నేర్పితే వచ్చేవి కావంటారు. ఆమాటకొస్తే విద్యలైనా, చివరకు మాట్లాడడం, నడవడం, సైకిలు తొక్కడం వంటి చర్యలైనా నేర్పితే వచ్చేవి కావు. నేర్వవలసే వారికి ఇచ్ఛ ఉండాలి. నేర్చే ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నంలో నేర్పడానికి సిద్ధమైన వారి సహాయాన్ని వారు అంగీకరించాలి. అప్పుడే నేర్చుకోడం, నేర్పడం జరుగుతాయి.


ప్రయత్నమూ నేర్చేవారిదే. ఫలితమూ నేర్చేవారిదే. ప్రయాస మాత్రం నేర్పేవారిది.
నేర్పేవారు లేకపోయినా నేర్చేవార నేరుస్తూనే ఉంటారు.
ఇవన్నీ నేర్చేవారికి తెలియవు. నేర్పగలవారికి ఇవన్నీ తెలిసే ఉంటాయి.
అయినా నేర్చేవారుంటే నేర్పగలవారు నేర్పుతూనే ఉంటారు.

విద్యలు సరే. కళలో?


అశ్వారోహణం, గజారోహణం దగ్గర్నంచి పువ్వుల్ని దండలుగా కూర్చడం, దొంగతనం చెయ్యడం వరకూ అన్నీ కళలే. అరవైనాలుగున్నాయి మనకి. ఇవన్నీ పుట్టుకతో వచ్చేవేనా?


కళలు వేరు, లలిత కళలు వేరు.

సంగీతం, చిత్రలేఖనం కూడా లలితకళలే. అభిరుచీ, ఆసక్తీ, ప్రతిభా ఉన్నవారు నేర్చుకుంటారు. కొందరు వారికి నేర్పుతారు.
ఎందుకూ?

మానవ కృషిలో ప్రయాస తగ్గించుకోడానికీ, ఒకరు సాధించిన దానినే ఎవరికి వారు సాధించుకోవాలంటే మానవులంతా ఒక మెట్టు దగ్గరే ఆగిపోతారు.

కాట్టి సాహిత్యం ఒక లలితకళే అయినా కథారచన ఆ లలిత కళలలో భాగమే అయినా దాని గురించి ఇంకొకరి నుండి తెలుసుకోవడం తప్పుకాదు. తెలియజెప్పడమూ తప్పు కాదు.

ఎటొచ్చీ ఒక్క హెచ్చరిక మాత్రం అవసరం.

ఆదినే చెప్పినట్టు ఏదైనా ఒకరు నేర్పితే వచ్చేది కాదు. రావడం ప్రధానంగా నేర్చుకునేవారి మీదే ఆధారపడి ఉంటుంది. కథలు రాయడమైనా అంతే.


అయితే ఈ వ్యాసాలెందుకూ?
ఇవి జన్మతః మహారచయితలైన అసహాయశూరుల కోసం మాత్రం కాదు.

మామూలుగా కథలు రాయాలన్న సరదా ఉండి, తీరా రాయబోతే అడుగడుగునా సందేహాలొచ్చి, అడగబోతే ఆదుకునేవారు లేక, ఉన్నా వారిముందు తమ అజ్ఞానాన్ని అంగీకరించడానికి మొహమాటపడే సాధారణ రచయితలుంటే – వారు ఏకాంతంలో చదువుకోడానికి.

చదువుకొని ఇందులో వారికి పనికివచ్చేదేమైనా ఉంటే గుర్తు పెట్టుకుంటారు. లేకపోతే ఒక పక్కన పడేస్తారు.

కథల గురించి నేననుకునేది తెలియజెప్పడానికే ఈ వ్యాసాలుగాని కథలు రాయడం నేర్పడానికి కాదు.

అలాటి ప్రయత్నం ఈ పేజీలలో ఎక్కడేనా కనిపిస్తే దానిని నా ప్రతిజ్ఞా భంగ దోషంగానే గ్రహించాలిగాని అదే నా ఉద్దేశంగా భావించద్దని మనవి.

వ్యాసాలు రాయడంలో నాకు బొత్తిగా అనుభవం లేదు. ఇదే నా మొదటి ప్రయత్నం అని కూడా మనవి.

జనవరి 1990 – కాళీపట్నం రామారావు

———————————————————————————-


క్షమాపణ

ఈ పని చేవలసింది నేను కాదు. తగిన వారింకెవ్వరూ పూనుకోనందువల్లే నాకు చేతనైన విధంగా దీన్ని చేయబోయాను.


వైద్యం కొందరు విద్యంటారు. కొందరు శాస్త్రమంటారు. అదేదైనా మానవ జీవితంలో దానికి ప్రమేయం ఉంది. కాబట్టి వైద్యం చేయబోయే వారికి ముందుగా సుదీర్ఘమైన శిక్షణ ఉంటుంది. అందుకు కళాశాలలూ, బోలెడన్ని ఏర్పాట్లూ ఉన్నాయి.


నృత్యం, సంగీతం, చిత్రలేఖనం కళలంటారు. కళాసాధనకు ప్రధానంగా కావలసింది ప్రతిభే! అయినా విద్యార్థులు ఏండ్ల తరబడి గురువు సాన్నిధయంలో శిక్షణ పొందుతారు. శిక్షణ ఇవ్వడానికి కళాశాలలూ ఏర్పడ్డాయి.


పత్రికా రచన, నాటక దర్శకత్వం, నాటక రచన -వీటికి కూడా కోర్సులున్నాయి. నేర్పడానికి విశ్వవిద్యాలయాల్లో శాఖలున్నాయి.

శిల్పం, వాస్తు, వడ్రంగం, కమ్మరం నుండి నర్సింగ్, టీచింగ్, మిడ్‍వైఫరీ దాకా సహస్ర వృత్తులూ చివరికి దూదిలోంచి దారం తీయడానికి కూడా ట్రైనింగ్‍లున్నాయి.


పత్రికా సంపాదకత్వం, నవలా రచన, కథలు రాయడం, కవిత్వం చెప్పదం పైవాటిలో ఏ కోవకూ చెందవనో, మానవ జీవితంతో వీటికి ఏ ప్రమేయం లేదనో ముందుగాని, రాస్తున్న దశలో గాని ఏ శిక్షణా పొందటానికి ఏర్పాట్లు లేవు – కావాలనుకున్నవారికైనా. రచన చేయడంలో మెళకువలనూ, ఆ విద్యలో లోతుపాతులనూ పడుతూ లేచే పద్ధతిలో ఎవరికి వారుగా తెలుసుకోవాలంటే చాలాకాలం పడుతుంది. ఏభై యేళ్ళల్లో పాతిక కథపైనా రాయలేకపోయాను. ఈ విషయంలో నాదిస్వానుభవం.


అయితే ప్రతిభావంతులు తీరిక చిక్కని పరిశ్రమలో ఉంటారు. కాబట్టి వారు కరదీపికలు వెలిగించరు. కళ్ళున్నవారికి మసకచూపువారి కష్టం తెలీదు. తీరిక చిక్కీ తెలిసీ అలాంటి పెద్దలు ముందుకొచ్చేదాకా చీకటిలో తడుములాడేవారికి గుడ్డివాడైనా సాయం చేయబోవడం తప్పుకాదనుకున్నాను. తప్పైనా దురుద్దేశంతో చేసింది కాదు.


రచనాకాలం 1987. వీట్లో మొదటి పదకొండు వ్యాసాలు 1988 లో ఆంధ్ర భూమి దినపత్రికలో అక్షర భూమిలో వచ్చాయి. కృతజ్జ్ఞతలు.
————————————————-


ఈ వ్యాసాలెందుకు?

వరసగా రెండేళ్ళ పాటు ’నేటికథ’ కొచ్చిన కథలన్నీ చదివితే మనవాళ్ళలో కథలు రాయాలనే కోరికా, లేదా ప్రయత్నం ఈమధ్య చాలా విస్తృతమవుతోందనిపించింది.

ఆ కోరిక వ్యాప్తీ, విస్తరణా ఏ ధోరణిలో పెరుగుతున్నాయంటే – కథా వ్యాసంగానికి కావలసి విద్యా, సంస్కారం, సాహిత్య పరిచయం, జీవితానుభవం, యుక్తవయస్సూ లేకపోవడం ఏ ఒక్కటీ వీటికి ప్రతిబంధకంగా నిలవడం లేదు.

దేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న అక్రమాలూ, అన్యాయాలూ, ఏ క్రమంలో పెరుగుతున్నాయో, వాటి నెదుర్కోవలసిన రాజకీయ పక్షాల వైఫల్యాలు జనంలో నిరాశను ఏ క్రమంలో పెంచుతున్నాయో, అదే క్రమంలో కొత్తవాళ్ళు రచనకు పూనుకుంటున్నారా? – అనిపిస్తుంది.


పల్లెల్లో హైస్కూలు విద్యార్థులూ అయ్యవార్లూ దగ్గర్నుంచి; అరకొరా చదివిన అవివాహితులూ గృహిణులూ, పొలాలు చూసుకొనేవారూ, చిన్న చిన్న బస్తీల్లో కిళ్ళీ బడ్డీలూ, సైకిలు షాపులూ నడుపుకునేవారూ, బస్తీల్లోనూ, పట్టణాల్లోనూ కాలేజీ చదువులవారూ, నిరుద్యోగులూ, మహానగరాల్లో డాక్టర్లూ యాక్టర్లూ పట్టభద్ర నిరుద్యోగులూ వంటి వెయ్యిన్నొక్క వర్గాల దాకా – చివరికి పదవీ విరమణ చేసిన పండు ముదుసళ్ళ దాకా ఎందరెందరో కథలు రాయడానికి కొత్తగా పూనుకుంటున్నారు.


వీళ్లలో గుణింతాలు రానివారున్నారు. బాగా పండితులున్నారు. తెలుగులోనో, ఇంగ్లీష్ లోనో డాక్టరేట్లు తీసుకున్నవారున్నారు. తీసుకోగల వారున్నారు. వివిధ భాషల్లో వచ్చిన వస్తున్న సాహిత్యంలో ఎంతోకొంత పరిచయం ఉన్నవారున్నారు. ఏ సాహిత్యంతోనూ ఎవ్విధమైన పరిచయాలూ లేనివారున్నారు. వెనక కవిత్వమో కవితలో నాటకాలో వ్యాసాలో రాసినవారున్నారు. బాల సాహిత్యం, పత్తేదారు సాహిత్యం, తప్పితే ఇంకేవీ అందని వారున్నారు.వీరూ వారూ అన్న తేడా లేకుండా అందరూ కథ రాయడానికి ప్రత్నిస్తున్నారు.


కథారచనపట్ల ఇంతగా విస్తరిస్తున్న ఈ కోరిక తీవ్రత ఏ మేరకంటే-
కొందరు కథను పత్రికకు పంపిన ప్రతిసారి ఎంతో వినయంగా చాలా ప్రాధేయపడుతూ సంపాదకులకు ఉత్తరాలు రాస్తారు. కొందరు పెద్దలలా బేలగా తేలిపోరు. వారి పద్ధతులు వేరుగా ఉంటాయి. కథ పడ్డాకా ఆశించిన గుర్తింపు రాకపోయినా, ఏ ఒక్క కథా వేసుకోకపోయినా ఏడాదిలో పాతిక నుండి యాభైదాకా అదే పత్రికకు కథలు పంపే పట్టువదలని విక్రమార్కులున్నారు.


ఇలా కథలు రాయాలనే కోరిక కొత్తవారిలో ఇంతగా వ్యాప్తి చెందడానికీ, ఇన్ని వర్గాల్లో విస్తరించడానికీ, రాసిన కథలు పడాలనే తహతహ వారిలో ఇంత తీవ్రంగా ఉందడానికీ, హేతువులు ఒకటి కన్నా ఎక్కువే ఉండొచ్చు.అయినా ఆదిని సూచించినదే వాటిలో ప్రధానమైనదనుకుంటాను. ఎంతో కొంత శాతం మినహాయిస్తే మిగిలిన వారంతా ఏం రాసినా తమ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల అసంతృప్తితో, అసహనంలో, అసహ్యంతో ఆవేశపడీ, ఆగ్రహించీ రాస్తున్నట్టే కనిపిస్తుంది.


రోడ్లమీదా, బస్సుల్లోనూ, రైళ్లలోనూ జరిగే మోసాలను బట్తబయలు చేస్తున్నా, బజార్లలోనూ, బస్తీలలోనూ, రొడీలకూ, దాదాలకూ తలవంచే ప్రజల అసహాయతను చూపిస్తున్నా, పల్లెల్లో బలవంతులకు చెల్లిపోతున్న అత్యాచారాల గూర్చి చెపుతున్నా, ప్రజలవల్ల పదవులకెక్కి – ప్రజాద్రోహానికి ఒడికట్టే బూటకపు సన్యాసులు గుట్టు రట్టుచేస్తున్నా, ప్రజా సేవకులమంటూనే ప్రజలపై కొందరు చేసే పెత్తందారీని నిరసించినా, పథకాలపేర, ఉద్యోగావకాశాల పేర జరగగల దగాలను ముందే గ్రహించి ఈసడించుకున్నా, డబ్బుకి మూతబడే నోళ్ల గురించీ, అధికారానికి కట్టడిపోయే కళ్ల గురించి కటకటపడ్డా, వారి రచనల్లో వ్యక్తం చేయదలచింది ఈ వ్యవస్థలో పెరిగిపోతున్న పై దుర్లక్షణాల పట్ల కసి, అసహ్యం, రోత.


కుటుంబాలలోనూ, సమాజంలోనూ అబలలకూ, బలహీన వర్గాలకూ జరుగుతున్న అన్యాయాల గురించీ, కులమత వివక్షవల్ల వర్గాల మధ్య పెరుగుతున్న వైషమ్యాల గురించీ, బరితెగించిన నేతల బంధుమిత్రుల గురించీ, పేదరికం కోరల్లో నశిస్తున్న మానవత్వం గురించీ, వారు పడుతున్న కలవరం కూదా వారి వారి కథల్లో చూడొచ్చు.


చేయి తిరిగిన రచయితలు చెప్పే కథల వరవడి ఈనాడు ఇంకో విధంగా ఉన్నా, ఇంతమంది కొత్త రచయితలు సాహిత్యాన్ని ఇంకా మంచికే ఆశ్రయించడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొనఊపిరితో ఉన్న ఆశకి జీవం పోస్తుంది.

అయితే-

కారణాలు ఏవైనా కావచ్చు- ఈ రచయితల్లో నూటికి డెబ్భైమందికి కథంటే ఏమిటో తెలియదు. తెలిసిన ముప్ఫైమందిలో ఇరవైమందికి కథ సరిగా కట్టడం రాదు. కట్టడం వచ్చిన పదిమందిలో ఒకళ్ళిద్దరికి తప్పితే కథల మంచిచెడ్దల గురించి తెలియదు. ఆ తెలిసిన వారికైనా ఏ గుణాలవల్ల ఒక కథ మంచిదౌతుందో, వేనివల్ల ఇంకొకటి చెడ్దదవుతుందో – స్పష్టమైన అభిప్రాయాలున్నట్టు లేదు.

ఇందువల్ల, కొత్త రచయితల్లో కథలపట్ల ఇంతగా పెరుగుతున్న ఈ తపనా, అందుగురించి వాళ్లకవుతున్న వ్యయ ప్రయాసలూ – ఇవన్నీ వారికి గాని, మనకిగాని ఈయవలసిన సత్ఫలితాలను ఈయడం లేదు కదా అనుకున్నాను.


వాళ్ళ చొరవా, ప్రయత్నం, శ్రమా సత్ఫలితాలివ్వాలంటే వారంతట వారుగా గాని, ఇతరులు తెలియచెప్పడంవల్లగాని కథను గురించి తెలుసుకోవడానికి కొంతకాలం, శ్రమా అవసరముతాయి.అందుకని అలాటివారికోసం ఎవరేనా ఏదైనా చెయ్యడం అవసరమనిపించింది.

చెదురు మదురుగా వచ్చిన కొన్ని వ్యాసాల్లో అటువంటి ప్రయత్నం లోగడ కొంత జరిగింది. ఈలోగా ఇంకెవరో ఎక్కడో ఇలాంటి ప్రయత్నం చేయవచ్చు.

* ఇవి సరికొత్త రచయితల కోసం, వారి సమస్యలనూ, సందేహాలనూ, లోటుపాట్లనూ దృష్టిలో ఉంచుకుని కథను గూర్చి వారి అవగాహనను పెంచుకోవడంలో వారికి సహాయపడేందుకు రాసిన వ్యాసాలు, కథలు రాయడం నేర్పడానికి కాదు.
*రాయడం ఎవరికి వారు నేర్వవల్సిందేగాని ఒకరు నేర్పితే వచ్చేది కాదు.
 

Posted in వ్యాసం | Tagged , , | Comments Off on కథాకథనం – ముందుమాట

తడి


ఇప్పుడేదో అంతా
ఎడారి పరుచుకున్నట్లు
పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో తడి
ఆరినతనం..
 

దేనిని తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..


కనుల లోయలో
పరచుకున్న
ఎండమావులు….
గాజు కళ్ళుగా
మారిపోయాయన్నట్టు
ఏదీ ఇంకనితనం..


అంతా రంగు రుచి లేని
కషాయంలా గొంతులో
ఏదో విషం దిగుతున్నా
బాధ తెలియని
శిలాజంలా…


ఒంటరితనంవైపు
మొగ్గుతూ బాహ్యాంతరాలలో
ఏదో నిషేధ ఘోష


చుట్టూరా కమ్ముకున్న
ఈ సమ్మె వాతావరణంలో
నాలుక పిడచకట్టి
గొంతెండిన వేసవితనం
వెంటాడుతోంది…


ఎక్కడో దాగిన కాసింత
కన్నీటి ఊట
నన్నింకా ఇలా
మనిషిలా(?)
నీముందు…

Posted in కవిత్వం | Comments Off on తడి