Category Archives: వ్యాసం
తెలుగు – పిల్లలు
-లలిత “తెలుగు నేర్పడం ఎలా?” అన్న పేరుతో రంగనాయకమ్మ గారు కొన్ని తెలుగు పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, కొన్ని సూచనలనూ జోడించి ఒక పుస్తకం వ్రాశారు. రంగనాయకమ్మగారే ఒక పాఠ్య పుస్తకం కూడా రాశారు. చదివిందీ, నేర్పిందీ మర్చిపోయిన తర్వాత మిగిలినదే విద్య అని ఆంగ్లంలో ఒక నానుడి. అది వాడుకుని, ఆ పుస్తకం చదివిన … Continue reading
స్వేచ్ఛా మృదుసామగ్రి — పరిచయం
-వీవెన్ మీరు కొన్న వస్తువును ఎందుకోసమైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉన్నట్టే, మీ కంప్యూటర్ ఉపకరణాలని కూడా ఏ ఉద్దేశంతోనైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ మీకు ఉండాలి. వాణిజ్యపరంగా లభించే చాలా ఉపకరణాలలో అవి ఏయే ఉద్దేశాలకు ఉపయోగించవచ్చో కొన్ని సార్లు నియంత్రణలు పెడతారు. మీరు స్వేచ్ఛా మరియు ఓపెన్ సోర్స్ మృదుసామగ్రి (free and open … Continue reading
అస్తమించిన “ఏడో చంద్రుడు”
– సుధారాణి రాచకొండ విశ్వనాథశాస్త్రిని రావిశాస్త్రి అని పిలుస్తారని తెలుగు సాహితీ లోకంలో అందరికీ తెలుసు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా కూడా న్యాయం పక్షాన నిలబడి తన రచనల ద్వారా సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నించారు. డబ్బు, పలుకుబడి, అధికారమదంతో కొందరు ఇంకొందరికి చేసే దురన్యాయాలను ఎండకడ్తూ ఎన్నో కథలు, నవలలు, కొన్ని నాటకాలు వ్రాశారు. … Continue reading
రాసినది చదవడం
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఇప్పటి తెలుగు ఉచ్చరించే పద్ధతిలో ఫోనెటిక్‌గా ఉంటుంది కనక మనకు అంత ఇబ్బందిగా ఉండదు. అయినా మామ, చీమ, దోమ వగైరా పదాలను కోస్తావారిలాగా తక్కిన తెలుగువారు మాఁవ, చీఁవ, దోఁవ అనకపోవడం చూస్తూనే ఉంటాం. అక్షరాలకు ప్రాణం ఉండదు. అవి శబ్దాలకు కేవలం సూచకాలు మాత్రమే; ఉచ్చారణకు కొంతవరకే తోడ్పడతాయి … Continue reading
మునికన్నడి సేద్యం -సమీక్ష
-రానారె మునికన్నమ నాయుడు ఇరవైరెండేడ్ల యువకుడు. సంసారం పట్ల చాలా అపేక్ష కలవాడు. అతనికంటే రెండేళ్లు చిన్నవాడయిన తమ్ముడు ధర్మానాయుడు, ఎనిమిదీతొమ్మిదేళ్లు చిన్నదైన చెల్లెలు, ఆరేడేళ్ల వయసున్న తమ్ముడు, మరో చిన్న చెల్లెలు, తల్లి యెంగటమ్మ, అప్పుడప్పుడే ముసలిమోపును తలకెత్తుకుంటున్న తండ్రి – ఇదీ మునికన్నడి కుటుంబం. ఈ కథలోని ప్రతి పాత్రకూ ఒక వ్యక్తిత్వం … Continue reading
సామాన్య జీవితాలను అసామాన్యంగా చిత్రించిన “దహేజ్”
-త్రివిక్రమ్ కథలకు, ఆ మాటకొస్తే సాహిత్యానికి, ముడిసరుకు జీవితమే. జీవితాన్ని ఎంత నిశితంగా పరిశీలిస్తే అంత గొప్ప కథావస్తువులు దొరుకుతాయి. ఆ కథాంశాలకు చక్కటి కథారూపమివ్వాలంటే రచయితకు గొప్ప శిల్పదృష్టి, రాతపై అదుపు ఉండడం అత్యవసరం. తాము నిత్యం గమనించే జీవితాలు, పరిస్థితుల నుంచి విలక్షణమైన మంచి కథాంశాలను ఏరుకోగలిగే నేర్పు కొందరికే ఉంటుంది. అలా … Continue reading
ఏటి ఒడ్డున కొన్ని మాటలు – మూలా సుబ్రహ్మణ్యంతో స్వాతి కుమారి కబుర్లు
-స్వాతి కుమారి కవిత్వమంటే ఏమిటి, అది నిర్వచనాలకు, సమీకరణాలకు కట్టుబడి ఉండేదేనా? పద్యమైనా వచనమైనా, అందులో ఎన్ని మార్పులు, కొత్త పద్ధతులూ వచ్చి చేరినా.. మూల పదార్ధాలైన రసమూ, ధ్వనీ – మరోలా చెప్పాలంటే భావమూ, భాష – వీటి ప్రాముఖ్యత ఎంత వరకూ నిలబడి ఉంది? కొద్దో గొప్పో కవిత్వం రాయటం మొదలెట్టిన వాళ్ళకి … Continue reading
అంతర్జాలంలో వ్యాపారీకరణ
వెబ్‌సైటులు, బ్లాగులతో డబ్బులు సంపాదించడం ఎలా అనే అంశంపై ఒక దృష్టి Continue reading
బ్లాగరుల నుండి బ్లాగరులకో లేఖ!
బ్లాగు పేర్లతో కూర్చి బ్లాగరులకు ఒక బ్లాగరి రాసిన లేఖ! Continue reading
ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధికరంగం
ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఒక మునుజూపు Continue reading