Monthly Archives: April 2008

నీ రాక కోసం..

వసంత ఋతువు కదండీ, ప్రకృతికి వసంతం చైత్రంతోనే వచ్చేసింది. కొన్ని రోజులు గడిచి ఎండలు ముదిరి గ్రీష్మం ఆర్భాటంగా ఫెళ ఫెళమని అడుగిడుతుంటే కొంచెం దిగులుగా ఉండే మాట నిజం. ఐతే మళ్ళీ సరికొత్త వసంత సౌరభాన్ని ఇప్పుడూ అస్వాదించాలనుకుంటే …. నిషిగంధ తాజా కవితను చదవాల్సిందే. Continue reading

Posted in కవిత్వం | 9 Comments

నా మదిలో … లిరిల్ తాజాదనం!

వేసవి కదండీ, ఉక్కపోతగానే వుంటుంది. ఈ ఎండల్లో లిరిల్ తాజాదనం మంచి రిలీఫ్ కదా! అయితే ఏమిటంటారా? కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ తాజాగా వుండే ఒక బ్లాగుంది. ఈ నెల బ్లాగుసమీక్షలో ఆ తాజాదనాన్ని ఆస్వాదించండి. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 8 Comments

మృతజీవులు – 17

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ అంతగా పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 17

ఏప్రిల్ గడిపై మీమాట

మార్చి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 మార్చి గడి, సమాధానాలు 2. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు 3. 2007 డిసెంబరు గడి, సమాధానాలు 4. 2007 నవంబరు గడి, సమాధానాలు 5. 2007 అక్టోబరు గడి, సమాధానాలు 6. 2007 ఆగష్టు గడి, సమాధానాలు 7. … Continue reading

Posted in గడి | Tagged | 6 Comments

మార్చి గడి వివరణలు

మార్చి నెల గడి కష్టంగా ఉందని చాలామంది అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ అభిప్రాయానికి ఒక కారణం చాలా పదాలు jumble అవడం (కొత్తపాళీ గారి ఉవాచ). మొత్తం తొమ్మిది పూరణలు వచ్చాయి. ఎవ్వరూ పూర్తిగా సరిగా నింపలేదు. కేవలం 3 తప్పులతో నింపిన వారు కొత్తపాళీ గారు, శ్రీకాంత్ గార్లు. నింపిన వారందరికీ అభినందనలు. Continue reading

Posted in గడి | Tagged | 3 Comments

మురళి ఊదే పాపడు

“రాతిగుండెల మనుషుల మధ్య ఎన్నో దేశాలు తిరిగాను. ఎటు చూసినా రాతిగోడలు లేవడం చూశాను. ఎవరూ కూల్చలేని గొప్ప గొప్ప రాతిగోడలు. మనుషులకూ మనుషులకూ మధ్య రాతి గోడలు. కొట్టుకు చావడంలో కొందరు, డబ్బు సంపాయించడంలో కొందరు మునిగి తేలుతున్నారు. ప్రకృతిని ప్రేమించలేనివాళ్ల మధ్య నాకూ, నా మురళికీ చోటు లేదు.” అంటూ మురళి ఊదే పాపడు ఎక్కడికి చేరుకున్నాడు? అతడి పాటల కోసం బెంగపెట్టుకున్న అమ్మాయి ఏమైంది? Continue reading

Posted in కథ | Tagged , , | 8 Comments

జీవితం

అందమైన ఊహల్లో కాసేపు ఉనికి ని మరచి విహరిస్తుంటే వాస్తవ జీవితం సరికొత్తగా పరిచయమవటం స్వాతీ శ్రీపాద గారి “జీవితం” కవితలో చదవండి. Continue reading

Posted in కవిత్వం | 10 Comments

అభినవ భువనవిజయము -9- సర్వధారికి సుస్వాగతము

(<< గత భాగము) ‹కొత్తపాళీ› విశ్వామిత్రా .. కొత్త సంవత్సరానికి స్వాగత పద్యం ఏమన్నా చెబుతారా? * రాఘవ సాహిత్యంలో చేరారు ‹విశ్వామిత్ర› చిత్తగించండి సీ. తెలుగింట తొలినాడు పలు రుచులను కల- గలపు పచ్చడందు పులుపు నాది! వనమంత తిరుగాడి తనగొంతు ఎలుగెత్తి బులుపించు పాటకోయిలయు నాది! మదికింపు గలిగించి మరులెన్నొ గురిపించి మన్మధు … Continue reading

Posted in కవిత్వం | Tagged | 10 Comments

అభినవ భువనవిజయము -8- దత్తపది పదకొండు

(<< గత భాగము) ‹కొత్తపాళీ› మరో దత్తపదికి వెళ్లే ముందు… చదువరి, మీరు దీన్నెత్తుకోండి … “మనుజుడై పుట్టి దేవుడు మాయజేసె” ‹చదువరి› తేటగీతి. వెరపు పుట్టించు ట్రాఫికు వెతల దీర్ప మనుజుడై పుట్టి దేవుడు మాయ జేసె భాగ్యనగరాన తన మాయ సాధ్యపడక దారులందు జిక్కి యచటె స్థాణువయ్యె ‹నాగరాజు› చదువరీ – శెభాష్. … Continue reading

Posted in కవిత్వం | Tagged | 3 Comments

అభినవ భువనవిజయము -7- గూగులమ్మ పదాలు

(<< గత భాగము) ‹కొత్తపాళీ› ఇప్పుడు మన భట్టు కవిగారు కొన్ని గూగులమ్మ పదాల్ని రాలుస్తారు. దత్తపదులు ఇవీ: స్పార్కు మార్కు డార్కు డేటు బూటు పాటు తీర్పు నేర్పు కూర్పు మాల్సు కాల్సు ఫాల్సు టెక్కు నిక్కు లుక్కు చెంత చింత వింత ‹కొత్తపాళీ› భట్టుకవి సిద్ధమేనా? ‹భట్టుమూర్తి› ఉర్విజనులకు స్పార్కు నూత్న వర్షపు … Continue reading

Posted in కవిత్వం | Tagged | 5 Comments