Monthly Archives: October 2007

కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి

ఈరోజు ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి సందర్భంగా ఆయన కథల్లోని వాస్తవికత గురించి ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్, అనువాదకురాలు శారదగారి వ్యాసం అందిస్తున్నాం. దాంతోబాటే యథావిధిగా కొ.కు. గారి అనువాదరచన మృతజీవులు తొమ్మిదో భాగంతోబాటు హృశీకేశ్ పండా రాసిన ఒరియా కథ Bonsai కి ప్రముఖ అనువాదకుడు, తెలుగుబ్లాగరి అయిన కొల్లూరి సోమశంకర్ గారి … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on కొడవటిగంటి కుటుంబరావుగారి జయంతి

జగజ్జేత ఆనంద్!

-రానారె (http://yarnar.blogspot.com) గతనెలలో మన క్రికెట్ జట్టు 20-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వారం రోజులకే క్రీడాప్రపంచంలో మరో చరిత్రాత్మక సంఘటన జరిగింది. భారతదేశానికే చెందిన క్రీడాకారుడు ఒకరు జగజ్జేతగా నిలవడమేగాక మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ క్రీడ మనదేశంలో పుట్టి విశ్వవ్యాప్తమైన చదరంగం కాగా ఆ క్రీడాకారుడు… విశ్వనాథన్ ఆనంద్. ఎలాంటి … Continue reading

Posted in వ్యాసం | 1 Comment

నేనూ మీ లాంటి వాడినే

కొల్లూరి సోమశంకర్ గారి ఈ అనువాద కథకు ఒరియా మూలం హృషీకేశ్ పండా రచన. ఆంగ్లానువాదం లిపి పుష్పనాయక్. Continue reading

Posted in కథ | Tagged , | 6 Comments

కుటుంబరావు కథల్లో వాస్తవికత

-శారద సాధారణంగా, ఒక్కొక్క రచయితకీ ఒక్కొక్క ప్రత్యేకతా, తమదైన సంతకంలాంటి శైలీ వుంటాయి. రంగనాయకమ్మ గారి సూటి దనం, మధురాంతకంగారి సున్నితమైన శైలీ, మనకు చదవగానే అదెవరి కథో పట్టి చెప్తాయి. క్రమం తప్పకుండా చదివే పాఠకుడు తన అభిమాన రచయితని పేరు లేకున్నా పోల్చుకోగలడు. ఇరవైయవ శతాబ్దపు నాలుగో దశకంలో ఆరంభమైన సాహిత్య ప్రస్థానంలో … Continue reading

Posted in వ్యాసం | Comments Off on కుటుంబరావు కథల్లో వాస్తవికత

మృతజీవులు – 9

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 9

ఈ సంచికలో

పొద్దులో గడికోసం ఆసక్తిగా ఎదురుచూసే పాఠకులు ఈసారి ఎక్కువరోజులు వేచి ఉండవలసి వచ్చినా ఈనెల గడి వారిని సంతృప్తిపరచగలదని ఆశిస్తున్నాం. గళ్లనుడికట్లంటే విపరీతమైన ఆసక్తిచూపే ప్రముఖ రచయిత్రి లలితాముఖర్జీ గారు సంగీతంతో ముడిపడి ఉన్న ఆధారాలు కొన్నింటిని పొద్దుకు పంపారు. వాటిని ఈ గడిలో ఉపయోగించడం జరిగింది. వీలువెంబడి బ్లాగు గడి, వికీ గడి, సినిమా … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on ఈ సంచికలో

చిన్ని చిన్ని బాధలు

నిశ్శబ్దంగావున్న కాలేజి లైబ్రరీలో గట్టిగా తుమ్మి దొరికిపోయి ఇబ్బందిగా ఎక్స్‌క్యూజ్‌మీ అని మనసులోనే అనుకునే ఒక యువకుని ఆలోచనాస్రవంతి. సింగిల్ పేజీ కథల్లోని తమాషా ఇదీ అనిపించే ఈ రచన వీ.బీ. సౌమ్య గారిది. Continue reading

Posted in కథ | Tagged , | 15 Comments

క్రెడిట్ కార్డులు

[సుధాకర్] అప్పిచ్చువాడు, వైద్యుడు…అంటూ ఎప్పుడో చెప్పిన సుమతీ శతక కర్త ఇప్పుడు వుంటే కనక ఆ “అప్పిచ్చువాడు” అనే పదాన్ని పీకి పారేసేవాడు. లేకపోతే “అప్పంటగట్టే వాడు లేని” అని ఒక కొత్త పదాన్ని చేర్చేవాడు. అప్పు చెయ్యటం ఒక బలహీనత, ఒక ఆనందం. తీర్చటం ఒక చేదు అనుభవం, ఒక భారం. ఇది ప్రపంచంలో … Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

మృతజీవులు – 8

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | 2 Comments

సెప్టెంబరు వికీపీడియా విశేషాలు

[రవి వైజాసత్య] తెవికీలో నిర్వహిస్తున్న ప్రాజెక్టులు మరియు నిర్వహణా దళాలు తెలుగు వికీపీడియాలో వివిధ విషయాలకు చెందిన వ్యాసాలను అభివృద్ధి చేసి, విస్తృతపరచటానికి, ఆ వ్యాసాలను నిర్వహించడానికీ కొన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రాజెక్టులలో, ఒక విషయానికి చెందిన ఉన్న వ్యాసాలన్నీ ఒక ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. (ఉదాహరణకు, రామాయణము, గరుత్మంతుడు, క్షీరసాగర మథనం, … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 7 Comments