Monthly Archives: October 2007

అక్టోబరు గడిపై మీమాట

అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. ఆగష్టు గడి, సమాధానాలు 2. జూలై గడి, సమాధానాలు 3. జూన్ గడి, సమాధానాలు 4. మే గడి, సమాధానాలు 5. ఏప్రిల్ గడి, సమాధానాలు 6. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 1 Comment

ఆగస్టు గడి సమాధానాలు

గతనెల అనివార్య కారణాల వల్ల గడిని వెలువరించలేకపోయాం. ఐతే ఆ కారణం వల్లే గడి పరిష్కారాలు పూరించి పంపుతున్నవారే కాకుండా మరికొందరు పాఠకులు కూడా గడి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలియవచ్చింది. 🙂

ఈసారి గడి పూరించి పంపింది కొత్తపాళీ గారొక్కరే! మొదట్నుంచి ఎక్కువమంది పాఠకులకు కష్టసాధ్యంగా అనిపించిన గడిని సుబోధకం చెయ్యడానికి ఆయన తన బ్లాగులో “గడి పాఠాలు” కూడా చెప్పారు. కొత్తపాళీగారికి అభినందనలు. Continue reading

Posted in గడి | Tagged | 1 Comment

ఈనెల రచనలు

ప్రసిద్ధ పాత్రికేయుడు, నెల్లుట్ల వేణుగోపాలరావు ఈనెల పొద్దు అతిథి. సమకాలీన సామాజిక రాజకీయ విషయాలపై విమర్శనాత్మక వ్యాసాలు రాసే వేణుగోపాల్, నెజ్జనులు చెయ్యగలిగిన పనులను సూచిస్తున్నారు. ఆయన కడలితరగ పేరుతో బ్లాగును నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో “వర్తమానం” శీర్షికన వ్యాసాలు రాస్తున్నారు. అతిథి వ్యాసం రాసేందుకు పొద్దు అభ్యర్ధనను మన్నించి ఈ వ్యాసాన్ని రాసి … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on ఈనెల రచనలు

నెజ్జనులకు సూచనలు

కొండొకచో ఆ అభివ్యక్తిలో అనుచితమయిన వ్యక్తీకరణలూ, అసంపూర్ణ భావాలూ కూడ వస్తూ ఉండవచ్చును. కాని ఆ అభ్యంతరాలను మించి చూడవలసిన విషయమేమంటే, ఇంతకుముందువరకూ రచన తమకు సంబంధలేని వ్యవహారమని అనుకున్న వర్గాల నుంచి హఠాత్తుగా రచయితలు పుట్టుకొస్తున్నారు. అవి పూర్తి రచనలు కాకపోవచ్చును, కాని రచనా ప్రయత్నాలు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments