Category Archives: వ్యాసం

అలనాటి వ్యాసాలు

"గత కాలమే మేలు వచ్చు కాలము కంటే…" అని ఓ కవి గడచిపోయిన కాలం తాలూకుమధురమైన జ్ఞాపకాలలో తేలియాడాడు. గత రాత్రి కురిసిన నీహారికాబిందుసందోహాలనేగా బాలభానుడు కొత్తపొద్దున మెరిపించి, మురిపించి మంచుముత్యాలుగా మార్చేది! అలనాటి తెలుగు సాహిత్యవ్యాసంగాలలో మెరసిన కొన్నిరచనలను "పొద్దు" ఈ తరం పాఠకులకు పరిచయం చేయాలని సంకల్పిస్తున్నది.

Continue reading

Posted in వ్యాసం | 6 Comments

విమర్శ ప్రమాణము

"వజ్ర పరీక్ష ఎంత కష్ట సాధ్యమైనదో అంతకంటే సహస్రగుణము కావ్యపరీక్ష కష్టసాధ్యమైనది. వజ్రపరీక్షకు ఒక వజ్ర ప్రపంచము తెలిస్తే చాలును కానీ కావ్య విమర్శకు కావల్సిన సామాగ్రి అపరిమితమైనది." విమర్శ గురించి నోరి నరసింహశాస్త్రి గారు 1944 లో ఆంధ్ర పత్రికలో ప్రకటించిన వ్యాసంలో మరిన్ని విశేషాలు చదవండి.

Continue reading

Posted in వ్యాసం | 2 Comments

నాలుగు కవిత్వపు మెతుకులు – 2

"నేను చూసిన అన్ని మరణాలూ నాకు బాధ కలిగించాయి. ఏ మనిషి జీవితం సందేశం అవుతుందో లేదో తెలీదు గాని, ప్రతి మరణమూ నాకు వొక సందేశం, వొక సందేహం.", అని అంటున్నారు అఫ్సర్ తన ఇంటర్వ్యూ రెండో భాగంలో.

Continue reading

Posted in వ్యాసం | Tagged | 17 Comments

నాలుగు కవిత్వపు మెతుకులు – 1


ఆధునికాంధ్రకవితాలోకంలో పెద్దగా పరిచయమక్కరలేని పేరు అఫ్సర్…

 

"ఇన్ని భాషలూ
ఇన్ని వ్యాకరణాలూ
ఇన్ని నిఘంటువులు
అన్నీ వొంటి మీది బట్టల్లా కనిపిస్తాయి
అన్నిటి కిందా
ఒకే ఒక్క శరీరం ఘోష!"

అఫ్సర్ కవిత్వం వినిపించే తత్వం ఇదేకదా అనుకొని పలకరించాం…

Continue reading

Posted in వ్యాసం | Tagged | 42 Comments

మతాల స్వరూపాలు

మనకు కనబడే ప్రపంచం గురించి వాస్తవిక, భౌతికవాదదృక్పథం అలవరుచుకోవటానికి ఎవరూ వేదాంతులు కానవసరంలేదు. మనం బడిలో చదువుకున్న విజ్ఞానాన్ని సరిగా అవగాహన చేసుకుంటే చాలు.

Continue reading

Posted in వ్యాసం | Tagged | 21 Comments

చరిత్రలో రాయలసీమ

రాయలసీమ చరిత్ర గురించిన సంక్షిప్త వ్యాసాన్ని సమర్పిస్తున్నాం. భూమన్ రచించిన ఈ వ్యాసం  మొదట రాయలసీమ ముఖచిత్రం అనే భూమన్ గారి వ్యాసాల సంకలనం లో ప్రచురితం అయింది. భూమన్ గారి అనుమతితో ఆ వ్యాసాన్ని  "రాయలసీమ వైభవం"లో ప్రచురించారు. కె.ఎస్.రూరల్ మీడియా మరియు రాయలసీమ ఆర్ట్ థియేటర్స్ తరపున తవ్వా ఓబుల్ రెడ్డి సంపాదకత్వంలో 2008 లో వారు ప్రచురించిన గ్రంథమే రాయలసీమ వైభవం.

Continue reading

Posted in వ్యాసం | Tagged | 1 Comment

పోతన కవిత్వ పటుత్వము

__ శ్రీ తాపీ ధర్మారావు (పరిశోధన, 1954) “ముక్కుతిమ్మనార్యు ముద్దుపలు”కన్నట్లే పోతన్నది సహజ పాండిత్యమనీ అతను రామభక్తి పరాయణుడనీ సహృదయులు తమ అభిప్రాయాన్ని ‘గుళిగారూపం’గా ప్రకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర పోతరాజూ, యెడ్ల రామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారంభించారు. సహజ పాండిత్యం కాబట్టి పోతన్న ఆంధ్ర శబ్దచింతామణిగానీ కనీసం చిన్నయసూరి … Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 4 Comments

పుష్పగంధి

-డా. వేలూరి (వెలమకన్ని) సీతాలక్ష్మి కావ్యమాల – నన్నయ నుండి నిన్నటివరకూ తెలుగు సాహితీ నందనవనంలో విరబూసిన సుగంధభరిత పద్యసుమాల మాల. ప్రతీ యుగములోను కొందరు కవులనెంచుకుని వారి రచనల్లోని అద్భుతమైన కొన్ని పద్యాలను ఉటంకిస్తూ, కీ.శే. కాటూరి వెంకటేశ్వరరావుగారు మాలికగా కూర్చి, “కావ్యమాల” పేరుతో తెలుగువారికి కానుకగా సమర్పించారు. సాహిత్య అకాడమీ పనుపున అల్లిన … Continue reading

Posted in వ్యాసం | 4 Comments

సాలూరు చినగురువుగారు

సంగీత సాహిత్యరచన చేసి గాత్రజ్ఞుడై దానిని గానం చేసేవారు వాగ్గేయకారులు. మన తెలుగు సాహిత్యచరిత్రలో వాగ్గేయకారులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. క్షేత్రయ్య, అన్నమయ్య వంటి వారు శృంగార భక్తిరస ప్రధానములైన రచనలు చేసి గానం చేయడంలో ప్రసిద్ధులైన వారు. అలాగే జయదేవుడు, నారాయణ తీర్థులు, ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి వంటి వారెందరో మహానుభావులు మన సాహిత్యాన్ని,సంగీత శాస్త్రాన్ని ఉత్కృష్టమయిన స్థితిలో నిలిపిన వాగ్గేయకారులు.

ఇరవయ్యవ శతాబ్దపు ఉత్తరార్థానికి చెందిన సంగీత విద్వాంసుడు, రసవద్గాయకుడిగా ప్రజామోదం పొందిన పట్రాయని సీతారామశాస్త్రిగారు అటువంటి వాగ్గేయకారుల కోవకు చెందుతారు. Continue reading

Posted in వ్యాసం | 11 Comments

అంతర్జాలంలో తెలుగు నాటిక

అంతర్జాలంలో తెలుగు నాటిక ఇంత వరకు వెలువడలేదనే చెప్పాలి. Continue reading

Posted in వ్యాసం | 1 Comment