-అభిశప్తుడు
పైట జారుతున్నా పట్టని పచ్చి వయ్యారాలు…
పిరుదులూపుకుంటూ చిలిపి పరవళ్లు…
…ప్రళయకావేరి
నాదా…?
పోనీ నీదా? Continue reading
-అభిశప్తుడు
పైట జారుతున్నా పట్టని పచ్చి వయ్యారాలు…
పిరుదులూపుకుంటూ చిలిపి పరవళ్లు…
…ప్రళయకావేరి
నాదా…?
పోనీ నీదా? Continue reading
– స్వాతీ శ్రీపాద
మామూలు గ్రామీణ వాతావరణంలో ప్రతిచిన్న విషయానికీ ప్రాముఖ్యత వుంది. గ్రామీణులు చిన్నచిన్న విషయాలలో కూడా ఎంత జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తారో; అది వారికి ఎందుకు అవసరమో ఇదే రచయిత తన చినుకుల సవ్వడి నవలలో అద్భుతంగా చూపాడు. Continue reading
— ఆత్రేయ కొండూరు.
నిశ్శబ్దపు అంచులమీదకు
జారిన నిప్పు కణికలు
ఆవిరై అలుపు రేపాయి !
రెప్ప బరువు లేపలేని ఆద
చీకట్లో కరిగి ఈకల్లోకింకుతూ..
ఎంత సమయం మింగిందో!
తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని
ఆకు సందులు చిలకరించే సరికి..
ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు
బద్ధకంగా పూశాయి..
అటుప్రక్క వాలు చూడని ఆశ,
వద్దన్నా.. నడినెత్తికెగబాకుతుంది.
—————–
బంధాలను సుదూర తీరాల్లో వదిలి, అనుబంధాలను రంగు కాగితాల కోసం తాకట్టుపెట్టి, ప్రవాసమో వనవాసమో తెలియని జీవనం గడుపుతున్న మామూలు తెలుగువాడు ఆత్రేయ కొండూరు. భావాలను భాషలోకి మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆచార్య ఆత్రేయంటే చాలా అభిమానం.
— కొడవటిగంటి రోహిణీప్రసాద్
మతాలూ, తాత్వికచింతనా మనుషులతోబాటుగా, ఇంకా చెప్పాలంటే మానవసమాజాలతోబాటుగా పరిణతి చెందినవే. అందుకే మతాల చరిత్ర తెలియాలంటే మానవసమాజాల చరిత్రను గురించి కూడా తెలుసుకోవాలి. Continue reading
– బొల్లోజు బాబా
“మువ్వలచేతికర్ర” తో తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మెరుపులా ప్రవేశించారు శిఖామణి. “చిలక్కొయ్య” ఆయన రెండవ కవితాసంపుటి. 1993 లో వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 33 కవితలున్నాయి. దేనికదే వస్తువైవిధ్యంతో, విలక్షణమైన అభివ్యక్తితో కనిపిస్తాయి. అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు. Continue reading
-కొడవటిగంటి కుటుంబరావు
“ఒక్కసారి చూడండి బాబూ, వాడి మొద్దు మొహం! కొయ్యదుంగ కెంత తెలివి ఉంటుందో వీడికీ అంతే! కాని అలా ఏదన్నా ఉంచారో, క్షణంలో కాజేస్తాడు! ఎందుకొచ్చావురా వెధవా, ఎందుకొచ్చావంట?” అంటూ ఆయన ఆగాడు. పోష్క కూడా మౌనంతోనే సమాధానం చెప్పాడు. Continue reading
స్వరూప్ కృష్ణ:
ఇప్పుడో నది కావాలి Continue reading
-కొడవటిగంటి కుటుంబరావు
అయితే ఒకప్పుడీ మనిషి ఎస్టేటును చాలా శ్రద్ధగా నిర్వహించినవాడు! ఆయనకు పెళ్ళి అయింది, పిల్లలున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఇంటికి అతిధులుగా వచ్చి ఎస్టేట్లను పొదుపుగా నిర్వహించే పద్ధతులు తెలుసుకునేవారు. పని అంతా చురుకుగా సాగిపోయేది. Continue reading
సౌష్ఠవ (సిమెట్రికల్) గడి కావాలని గతంలో కొందరు గడి ప్రియులు సూచించారు. అలా ఇవ్వడానికి బేసి సంఖ్య గళ్ళు అయితేనే బావుంటుందని భావించిన కామేశ్వరరావు గారు ఈ సారి చాలావరకూ (అంటే మొదటి 11 కాలమ్స్) సౌష్ఠవంగా ఉండేట్టు ఇచ్చారు. అంతేకాకుండా స్లిప్పువీరుల ఉత్సాహం గమనించి ఈసారి గడిలో ప్రత్యేకించి వారికోసమే అన్నట్లుగా టెంకాయలు రాశులు పోశారు. యథాశక్తి పగలగొట్టి పండగ చేసుకోండి. 🙂
2009 జూలై గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి.
– పొద్దు
కూర్పరి, భైరవభట్ల కామేశ్వరరావు మాట:
ఈనెల గడిలో ఒక కీలక పదం తక్కిన వాటితో సంబంధం లేనిది ఉంది. అది ఒక row అంతాను. దానికి ఆధారం కూడా విడిగా ఉంది. కాబట్టి అసలు గడి 11×12 అన్నమాట.
కీలక పదంలో ఒకో అక్షరమూ, ఆ columnలో ఏదో ఒక నిలువులోనో అడ్డంలోనో ఉన్న పదంలో లోపించిన అక్షరం అవుతుంది. నిలువు పదంలో అక్షరం లోపిస్తే అది ఆ పదంలో ఎన్నో అక్షరమైనా అయ్యుండవచ్చు. అడ్డంలో లోపిస్తే మాత్రం అది మొదటి అక్షరమే అవుతుంది (కొంత సులువుగా ఉండేందుకు).
ఉదాహరణకి కీలక పదం “గోరొంక గూటికే చేరావు చిలక” అయితే (ఇప్పుడిచ్చింది ఇది కాదనుకోండి :-)), మొదటి columnలో ఏదో ఒక నిలువులో క్లూకి “గోమేధికము” అనే పదం సమాధానం కావచ్చు. కాని అక్కడ నాలుగక్షరాలే ఉంటాయి. అంచేత “గో” అన్నది కీలక పదంలో మొదటి అక్షరంగా వేసుకొని, “మేధికము” అన్నది నిలువు పదంలో వేసుకోవాలి. అలాగే మిగతా అక్షరాలు.
కీలక పదానికి (42 అడ్డం)ఆధారం: హనుమంతుడంతటివాడు యుద్ధాసక్తితో సుందరంగా వర్ణించిన నగరాన్ని దర్శించాలని ఎందుకుండదు?
– రానారె
వాసకసజ్జిక (45 అడ్డం) చాలా మందికి చిక్కలేదు. కొందరు మకురం బదులు ముకురం అని పూరించారు. దాంతో డమరుకము డమురుకము అయింది. ఈ రెంటినీ కలిపి ఒకే తప్పుగా పరిగణించడమైనది. అలాగే మొదటి వరుస పదకొండో గడిలో ‘ర’కు దీర్ఘం లోపించడంతో రాధ కాస్తా రధ, రామ కాస్తా రమ అయ్యారు. రెంటినీ కలిపి ఒకే తప్పుగా పరిగణించడమయింది.
జూన్ నెల గడిని సరిగ్గా పూరించిన వారు కంది శంకరయ్య, కోడీహళ్ళి మురళీమోహన్. మురళీమోహన్ గారు ఈ గడిని పట్టువదలని విక్రమార్కునిలా పదే పదే పూరించి చాలాసార్లు పంపించారు. చివరికి అన్నీ సరిగ్గా పూరించగలిగారు. వారి పట్టుదలకు ‘పొద్దు’ అభినందనలు తెలియజేస్తోంది. Continue reading