Category Archives: వ్యాసం
కథా మాలతీయం – 1
నిడదవోలు మాలతి గారు ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ తూలిక సైటు తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలిగా చాలా మందికి పరిచయం. కానీ ఆవిడ గత శతాబ్ధి రెండవ భాగంలో ప్రింట్ మీడియాలో తనదైన చక్కటి శైలితో కధా రచయిత్రిగా జనంతో అనుబంధం ఉన్నవారే. ఈ మధ్యనే చాతక పక్షులు అనే తన కొత్త నవలను బ్లాగులోనే సొంతగా … Continue reading
జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం
పాఠకుల్లో తార్కిక వివేచనను, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించే పుస్తకాలు తెలుగులో చాలా తక్కువ. అలాంటి అరుదైన పుస్తకం డా||కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ రాసిన “జీవశాస్త్ర విజ్ఞానం – సమాజం”పై డి.హనుమంతరావు గారి సమీక్ష Continue reading
అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం
అతీంద్రియశక్తులకు సంబంధించిన నమ్మకాలు ఆటవికదశలో మానవుల్లో ఎలా రూపుదిద్దుకున్నాయో, అవి ఆ తర్వాత మతపరమైన తంతులు, తతంగాలకు ఎలా కారణమయ్యాయో డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం అనే వ్యాసంలో వివరిస్తున్నారు. Continue reading
‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ
–స్వాతీ శ్రీపాద. విస్తృతంగా కథలు రాస్తూ ఉన్నా తన్ను తాను అనుకరించుకోవాల్సిన అవసరంలేని వస్తువైవిధ్యం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. రాయలసీమను గురించీ, వ్యవసాయ జీవన పతనాన్ని గురించీ, దళిత జీవిత సమస్యలను గురించీ మళ్ళీ మళ్ళీ కథలు రాసినా అతని దృక్పథంలో ఉన్న కొత్తదనం ఆ కథలకు జీవం పోస్తుంది. బయటికి కనిపించని ఉద్విగ్నత … Continue reading
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కి ఘనంగా “చాసో స్ఫూర్తి” పురస్కార ప్రదానం
“సంగీత సాహిత్యాల సంగమంగా దేదీప్యమానంగా విరాజిల్లిన చారిత్రాత్మక కేంద్రం, విజయనగరం. ఈ నగరం తనలో నిలుపుకున్న ప్రత్యేకతలూ, ప్రతీకలూ అన్నీ ఇన్నీ కావు. విజయనగరం… గురజాడ ఆనవాళ్ళను తన పొత్తిళ్ళలో ఇముడ్చుకున్న సారస్వత కేంద్రం. కన్యాశుల్కంలోని గిరీశం, మధురవాణి, రామప్పంతులూ, బుచ్చమ్మ పాత్రలనూ, ఆ నాటకంలోని బొంకులదిబ్బ, అయ్యకోనేరు లాంటి స్మృతి చిహ్నాలను తనలో నిక్షిప్తం … Continue reading
కేతు విశ్వనాథరెడ్డితో ముఖాముఖి
— స్వాతీ శ్రీపాద సుప్రసిద్ధ కథకులు, సంపాదకులు, కవితాప్రేమికులు, సాహితీ విశ్లేషకులు, ప్రాచార్యులు, మరియు విద్యావేత్త అయిన శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారిని పరిచయంచేసేందుకు ఈ విశేషణాలు సశేషాలే. జీవితాన్ని ఒక తపస్సుగా సాధనచేసి సాహితీసేవకు అంకితం చేసిన ఆయనను అజో-విభొ-కందాళంవారు 2009వ సంవత్సరానికిగాను ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం వారిని వారు … Continue reading
“నేర్చుకో” కథపై విశ్లేషణ
-స్వాతీ శ్రీపాద “సన్నపురెడ్డి అనగానే మనకి చనుబాలు, కొత్తదుప్పటి, కన్నీటి కత్తి, పాటల బండి, ప్రతిమల మంచం వంటి కొన్ని మైలురాళ్ళు గుర్తుకొస్తాయి. ఈ సంపుటి చదివాక అన్పించింది అతడి ప్రతి కథా ఒక మైలురాయేనని.” – వి.ప్రతిమ, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కథాసాహిత్యంలో చేసిన కృషికి గాను కేతు కథాపురస్కారం -2006 గ్రహీత. కొత్తదుప్పటి … Continue reading
కొత్తదుప్పటి – విశ్లేషణ
-స్వాతీ శ్రీపాద ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ప్రస్తావన: సాధారణంగా ఏ కథాసంపుటిలో ఐనా చాలావరకు మంచి కథలు, కొన్ని సాదా సీదా కథలు, ఒకటో రెండో గొప్ప కథలు ఉంటాయి. కానీ కొత్త దుప్పటిలో మాత్రం అన్నీ గొప్ప కథలే. నా ఒక్కడికే ఇలా అనిపించిందా లేక నిజంగా ఇవన్నీ గొప్ప కథలేనా అని సందేహమొచ్చి ప్రతిమకు ఫోన్ … Continue reading
మట్టి వాసన కలిగిన మంచి కథల సంపుటి
సమీక్షకులు: స్వాతి కుమారి నాగుమణి నవ్వింది – కథాసంపుటి రచయిత – డి. రామచంద్ర రాజు ఈ సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. అన్నీ వివిధ పత్రికల్లో ప్రచురించబడినవే. ఈ కథల్లో, సగటు మనిషి బలహీనతలు, మధ్యతరగతి జీవితంలోని కష్టనష్టాలు, వానలు కురవక, బ్రతకటానికి చావటానికీ దిక్కు తోచని రైతుల దుస్థితి.. ఇలా చాలా వరకూ … Continue reading
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 4
–ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి మీ అభిమాన రచయిత ఎవరు? ‘చనుబాలు’ కథలో ప్రస్తావించినట్లు ‘కళాపూర్ణోదయం’ మీకు బాగా నచ్చిందనుకుంటాను, కారణాలు చెబ్తారా? ‘కళాపూర్ణోదయం’ నచ్చినమాట వాస్తవమే, ఉత్కంఠ కలిగించేలా కళాత్మకంగా ఎలా రచన చేయవచ్చో ‘కళాపూర్ణోదయాన్ని’ చూస్తే తెలుస్తుంది. కానీ, నాకు బాగా నచ్చిన రచయిత తిక్కన సోమయాజి. సంభాషణలుగానీ, సన్నివేశాల చిత్రీకరణలోగానీ … Continue reading