Category Archives: వ్యాసం
భరతనాట్యం – ఒక సంభాషణ
తెలుగు బ్లాగరుల్లో బహుముఖ ప్రతిభాశాలి కొత్తపాళీ. ఆయన చాలాకాలంగా అంతర్జాలంలో కథలు, కవితలు, పద్యాలు రాస్తున్నారు. ఇంకోవైపు తెలుగుకావ్యాలను ఆంగ్లంలోకి అనువదిస్తున్నారు. మరోవైపు సినిమాలు, లలితకళల పట్ల తరగని ఆసక్తిని, అభినివేశాన్ని కనబరుస్తున్నారు. అంతేకాదు, ఆయన దశాబ్దంపైగా భరతనాట్య సాధన చేస్తున్నారు. నాట్యశిక్షణకు సంబంధించి ఆయన తన స్మృతులు – అనుభూతులను పొద్దు సంపాదకుడు రానారెతో … Continue reading
మందిమన్నియమ్ -3
-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/) “మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది మూడోది: సూత్రము … Continue reading
మనుషులూ, మాటలూ
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ తక్కిన ప్రాణులను “నోరులేని జీవాలుగా” పరిగణించడం మనకు అలవాటు. భౌభౌలూ, కావుకావులూ మన వాక్పటిమకు సాటిరావు. కుక్కలనూ, పిల్లులనూ పెంచుతున్నవారు వాటితో మాట్లాడతారుగాని ఆ సంభాషణ అంతా ఏకపక్షమే. అందుకే తమకున్న రోగ లక్షలాణెటువంటివో వివరించలేనివారు పశువుల డాక్టర్‌వద్దకు వెళ్ళాలనేది ఒక జోక్. చిలక పలుకులు నిజమైన మాటలు కావు. మాటలంటే … Continue reading
ఒక నవయువకుని నవద్వీప విజయం
చాంద్రమానం ప్రకారం, ఈ సంవత్సరం డిసెంబరు రెండోతారీఖు కావ్యకంఠ గణపతిముని జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని – సమర్పిస్తున్న ప్రత్యేక వ్యాసం. -పప్పు నాగరాజు (http://www.canopusconsulting.com/salabanjhikalu/) ———- కావ్యకంఠ గణపతి ముని (1878-1936) అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతిసంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న … Continue reading
పులికంటికి ‘నాలుగ్గాళ్ళ మండపం’ నివాళి
-రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (గమనిక: ఇటీవల మరణించిన ప్రముఖ రచయిత పులికంటి కృష్ణారెడ్డి గారి రచనల గురించి రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు రాసిన ఈ వ్యాసం ఈభూమి వారపత్రిక 6 డిసెంబర్, 2007 సంచికలోనిది) కథానిక ప్రక్రియలో ఒక ప్రయోగం ఒకే పాత్ర చుట్టూ అనేక కథలు రాయడం. చింతా దీక్షితులు రాసిన వటీరావు కథలు, శ్రీశ్రీ … Continue reading
తెలుగు కలాలు
ఆరుద్ర భాషా సాహిత్యాలు లేని జాతి ఇవాళ ప్రపంచంలో ఎంత వెతికినా ఎక్కడా కనబడదు. క్రీస్తు శకం ప్రారంభానికి ముందుగా ఎన్నో శతాబ్దాలనుంచే తెలుగువారు వివిధ ప్రాంతాలలో జీవించిన దాఖలాలు వున్నాయి. శాతవాహనులు సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని వందల ఏళ్ళు పాలించారు. వీరు తెలుగువారే. వీళ్ళ కుదురు తెలుగు ఏకగణాలలోనే ఉంది. రాజులు ప్రాకృత సంస్కృత … Continue reading
ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం
–వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in) ప్రపంచంలోని అత్యుత్తమ సినీ విశ్లేషకుల్లో Andre Bazin పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సు దేశంలో 1918లో జన్మించిన Bazin ఆఖరి శ్వాస వదిలే వరకూ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసాడు. ఒక్క సినిమా అయినా తియ్యకుండానే, కేవలం తన రాతల ద్వారా ఒక సినీ ఉద్యమానికే కారకుడయ్యాడీయన. ఈయన స్థాపించిన … Continue reading
మందిమన్నియమ్ -2
-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/) “మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది రెండోది: సూత్రము … Continue reading
కథానిలయం
-వివిన మూర్తి మనకు గ్రంధాలయ ఉద్యమాలు వచ్చాయి. అవి అనేక ఊళ్లలో గ్రంధాలయాలు తెచ్చాయి. ప్రభుత్వాలు సైతం పౌరుల గ్రంధపఠనం వారి అక్షరాస్యత, విద్యావ్యాప్తిలలో భాగంగా భావించి గ్రంధాలయాలకు నిధులు కేటాయించాయి. అవి గ్రంధ సేకరణ, భద్రతలకు ప్రయత్నించాయి. స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టాయి. దాతలు విరాళాలు అందించారు. ఈ గ్రంధాలయాలు ఆరంభ లక్ష్యాలను చాలావరకు … Continue reading
విశ్వంలో మనిషి స్థానం
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ మనిషిని ప్రపంచంలో అత్యున్నతజాతికి చెందిన ప్రాణిగా భావిస్తారు. తక్కిన ప్రాణుల్లో కొన్ని “ఉన్నతమైనవీ”, కొన్ని తక్కువజాతివీ అనే భావన ఉంది. నిజానికి ఈ హెచ్చుతగ్గులకు ఆధారా లున్నాయని చెప్పలేము. ఎందుకంటే పోల్చటానికి మన భూగ్రహంమీద తప్ప మరెక్కడా ప్రాణులున్న దాఖలాలే లేవు. తాత్వికధోరణిని అవలంబిస్తామనుకునేవాళ్ళు సామాన్యంగా ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఏ … Continue reading