Category Archives: వ్యాసం

నా చిన్నప్పుడు – సత్యజిత్ రాయ్

రాయ్ బాల్యం గురించి ఆయనే చెప్పిన కథ గురించి చదువరులతో పంచుకుంటూ, రాయ్ జ్ఞాపకాల దారుల్లో వదిలిన పాదాల ముద్రలని అనుసరించి ఆయన జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసారు వి.బి.సౌమ్య, సత్యజిత రాయ్ విరచిత చైల్డ్‌హుడ్ డేస్ పుస్తక సమీక్షలో. Continue reading

Posted in వ్యాసం | Tagged | 11 Comments

మా సాకలైవోరులు

సాకలైవోర్లు, కోమటి పంతుళ్ళు, పొలిమేర బళ్ళు,… ఇవన్నీ పోయాయి. ఇప్పుడన్నీ కాన్వెంటులూ, నేషనల్, ఇంటర్నేషనల్, Teknoa స్కూళ్ళే! ఏడో తరగతి నుండే ఎమ్‌సెట్లు, ఆరో తరగతి నుండి ఐఐటీలు.

రాయలసీమలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన ఓ రైతు.. ఆదినారాయణరెడ్డి తాను ఎలా చదువుకున్నారో చెబుతున్నారు. రండి, ఆదినారాయణరెడ్డి గారి సాకలైవోరు చదువెలా చెప్పారో తెలుసుకుందురుగాని. Continue reading

Posted in వ్యాసం | Tagged , | 9 Comments

పరివ్యాప్త (కవితా సంకలనం)

–జాన్ హైడ్ కనుమూరి పరివ్యాప్త, స్త్రీ సమస్యలను ఒకచోట కూర్చిన కవిత్వ ప్రయత్న సంకలనం. ఇందులో అనేక స్త్రీ సమస్యలు వున్నాయి. భ్రూణ హత్యలు, వరకట్న సమస్యలు, వంధ్యత్వ సమస్యలు, మానసిక క్షోభ – వీటన్నిటిపై స్పందించిన 100 మంది కవులు, కవయిత్రులు వున్నారు. వీరిలో లబ్ద ప్రతిష్టుల నుండి విద్యార్థుల వరకూ వున్నారు. కొత్త, … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 5 Comments

మౌఖిక సాహిత్యం, లిపుల ఆవిర్భావం

కొడవటిగంటి రోహిణీప్రసాదుగారు కాలంలో వెనక్కివెళ్ళి లిపి ఎలా పుట్టింది అనే సంగతిని వివరిస్తున్నారు. ఆశ్చర్యపరచే విషయమేంటంటే.. ఆ ప్రాచీన లిపులను నేరుగా రాసెయ్యొచ్చట, మన ఇన్‌స్క్రిప్టు లాగా! ముందు ఇంగ్లీషులో (రోమను లిపిలో) రాసి ఆపైన లిప్యంతరీకరణ చెయ్యనక్కరలేదు. మీరూ అవాక్కయ్యారా? కామూ మరి! ప్చ్, అవున్లెండి, పురాతన లిపులు కదా.. అంతగా అభివృద్ధి చెందినట్టు లేవు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 1 Comment

ఇంటర్నెట్లో తెలుగు కవిత్వం

జుట్టు ఊడుతోంది.. జుట్టు ఊడుతోంది
నా జుట్టు ఊడుతోంది, నీ జుట్టూ ఊడుతోంది
మన జుట్లు ఊడిపోతున్నాయ్!
ఐనా.. జుట్టు ఊడందెవరికి!!

ఇది ఇంటర్నెట్లో వచ్చిన తెలుగు కవిత. దీనిపై వచ్చిన వ్యాఖ్యలు కూడా ఇంతే భావస్ఫోరకంగా ఉన్నాయి.

వ్యాఖ్య 1. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.. ఇటీవలి కాలంలో ఇంత మంచి కవితను చదవలేదు.
వ్యాఖ్య 2. ఇంతకీ కవితేదీ? కవిత ప్రచురించబోయి ఈ బట్టతలవాడి గొడవేదో రాసేసారు.
వ్యాఖ్య 3. రేయ్, నోరు మూసుకోరా కుళ్ళు వెధవా! కవితా హృదయం లేని వాడికిది బట్టతల గొడవగానే ఉంటుందిరా!
వ్యాఖ్య 4. ర్రేయ్ …

-ఇంటర్నెట్టులో కొన్ని కవితలు, వాటిపై కొన్ని విమర్శలూ ఇలా ఉంటాయి!
ఇది కాదు కవిత, ఇలాక్కాదు విమర్శ ఉండవలసింది. కవిత ఎలా ఉండాలో చదవండి. విమర్శ ఎలా ఉండాలో భైరవభట్ల కామేశ్వరరావు చెబుతున్నారు, చూడండి. Continue reading

Posted in వ్యాసం | 8 Comments

రాఘవ వాగ్విలాసము – పరిచయము

గద్యం రాసే అలవాటే లేదాయనకు! ఆయన బ్లాగు నిండా కమ్మటి ఛందోబద్ధ పద్యాలే. పద్యాలకు చిరునామా ఆయన బ్లాగు. అలాంటి ముక్కు శ్రీరాఘవ కిరణ్ చేత పంతం పట్టి గద్యం రాయించాం. ఓ పూర్తి నిడివి వ్యాసమే రాయించాం. మొత్తానికి అనుకున్నది సాధించాం గదా అనుకుని వ్యాసం చూద్దుం గదా.. ఆయన పద్య రచనాప్రస్థానమే ఆ వ్యాసం! Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 5 Comments

అంతర్జాల పత్రికలు

సాటివారి సమీక్ష అని వికీలో ఓ ముఖ్యమైన అంశముంది. మనం రాసిన దాన్ని మన తోటివారు సమీక్షిస్తారన్నమాట! పొద్దు అలాంటిదే ఓ పని చేసింది. సాటి పత్రికల గురించి రాసింది. అయితే ఇది సమీక్ష కాదుగానీ, ఓ పరిచయం అంతే! పోటీ ప్రపంచమిది.. ఒకరిని మించి ఒకరు దూసుకు, తోసుకు పోవాలనే ధోరణులున్న రోజులు! అలాంటిది, సాటి పత్రికల గురించి ఓ పత్రిక బొమ్మలతో సహా పరిచయ వ్యాసం రాయడమా!?

అవును, రాయడమే!! Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments

అనువాద కథలు – నా అనుభవాలు

కతల్జెప్పినంత తేలిగ్గాదు కథలు అనువదించడం. మూలంలోని అర్థం పోకుండా, భావం చెడకుండా, “నేను మా ఆవిడ చేత కొట్టబడ్డాను” లాంటి అవకతవక మాటలు రానీకుండా ఇంపుగా సొంపుగా అనువాదం చెయ్యడమంటే మాటలు కాదు.అనువాదపు కిటుకులు తెలిసిన రచయిత కొల్లూరి సోమశంకర్. 44 అనువాద కథలు రచించిన అనుభవంతో అనువాదాలు చెయ్యడంలోని సాధక బాధకాలను వివరిస్తున్నారు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 8 Comments

అంజి, నేను at అమ్‌స్టర్‌డామ్

-ప్రసాదం (http://prasadm.wordpress.com/) గతంలో నేను ఉద్యోగం వెలగబెట్టిన ఒకానొక సంస్థలో నిప్పు అప్పలసామి లాంటి మా ప్రాజెక్టు మేనేజర్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో నేను కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అవడంతో నా పరిస్థితి తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా కనిపించినా, నేను పడింది పాముల పుట్టలో అని నాకు తొందరగానే అర్థమైంది. క్లయంట్ దగ్గర నుండి … Continue reading

Posted in వ్యాసం | 24 Comments

అహమ్!

-ఆదినారాయణరెడ్డి మనపెద్దలు మనకు పూజలు, సేవలు, జపాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, యోగాలు, ధ్యానాలు మొదలైన వెన్నో భగవత్ ప్రీత్యర్థం ఉపదేశించారు. కానీ భగవంతుడు ఏమిటి? ఆయనను ప్రసన్నం చేసుకునే మనం–అంటే వాటిని నిర్వహించే “నేను” అనుకొనే ఎవరికి వారైన మనమంతా ఏమిటి? అంటే మన సిసలైన ప్రామాణిక స్వరూపం ఏమిటి? ఈ”నేను”ను … Continue reading

Posted in వ్యాసం | Tagged | 18 Comments