Category Archives: కథ

తోలుబొమ్మలు

— స్వాతీ శ్రీపాద “ఎవరు? ” “………” “ఎవరది?” కళ్ళు బాగానే కనిపిస్తాయంటుంది కాని కనిపించడం లేదని అర్ధమవుతూనేవుంది. గొంతువిని గుర్తు పడుతుంది. లేదూ చాలా దగ్గరగావుంటే చూడగలదనుకుంటా.. “అమ్మా! బ్రేక్ ఫాస్ట్ తిన్నావా ?” “నువ్వా? ఇప్పుడా అడిగేది? అన్నాలవేళ కూడా అయినట్టుంది ” “ఏం చెయ్యను చెప్పు ? నీకు తెలీనిదేఁవుంది … … Continue reading

Posted in కథ | 12 Comments

మృతజీవులు – 32

-కొడవటిగంటి కుటుంబరావు “నజ్ ద్ర్యోవా! నిజంగా?” “ఏం, అతని బుద్ధే అంత. తన తండ్రిని అమ్మటానికి చూశాడు తెలుసా, మరీ అన్యాయం పేకాటలో పణం పెట్టాడు.” “ఎంతచిత్రమైన విషయాలు చెబుతావమ్మా! నజ్ ద్ర్యోవ్ కు ఈ వ్యవహారంలో జోక్యం ఉంటుందని నేను చచ్చినా ఊహించి ఉండను.” “నేను మటుకు మొదటి నుంచీ అనుకుంటూనే ఉన్నాను.” “నిజంగా, … Continue reading

Posted in కథ | Tagged | 4 Comments

పరిభూత సురత్రాణం

ఆ సంఘటన ఇప్పటికి 500 సంవత్సరాలు (1510 జనవరి 23) క్రిందట జరిగింది అయినా దాని నుంచి మనం ఈ నాటికీ పాఠాలు నేర్చుకొని మనుగడని ఎలా సాగించాలో చరిత్ర చెప్తోంది!!! Continue reading

Posted in కథ | Tagged | 8 Comments

ఓపెన్ టైప్

-అరిపిరాల సత్యప్రసాద్ కొంచెం దూరంగా తన కొలీగ్స్‌తో భోజనం చేస్తూ కనపడిందామె. చటుక్కున తల తిప్పుకున్నాను. “ఉష లాగా వుందే..!! లాగా వుండటం ఏమిటి ఉషే.. కొంచెం వొళ్ళు చేసినట్లుంది..!! నన్ను చూసిందా? గుర్తు పట్టిందా? ఏమో.. గుర్తు పట్టకపోతే బాగుండు..!!” అనుకుంటూ, మళ్ళీ అటు చూడకుండా భోజనం వడ్డించుకున్నాను. నాకు ఆ కంపెనీలో అదే … Continue reading

Posted in కథ | 8 Comments

కేక

-వి.బి.సౌమ్య “ఓహ్..నో!” దిక్కులదిరేలా వినడ్డదో కేక. అది నోటినుండి వెలువడ్డట్లు లేదు. అరికాలు నుండి మస్తిష్కం దాకా శరీరం లోని ప్రత్యంగమూ గొంతుకను సృష్టించుకుని, అన్ని గొంతుకలూ మౌనాన్ని పెగుల్చుకుంటూ, తమ గొంతు చించుకుని అరిచినట్లు ఉంది. ఆవేదనా, ఆక్రోశం, నిరాశా, నిస్సహాయతా కలగలిసి ఉన్నాయా కేకలో. ఎవరి మీదా చూపించలేని ఆగ్రహానికి గొంతుక కలిగితే … Continue reading

Posted in కథ | Tagged , | 2 Comments

చీకటి చకోరాలు (రహస్య రోమాంచ ఏకాంక నాటిక)

శ్రీధర్ పాత్రలు : బావ, బావమరిది, స్వామి, ఆమె. ప్రదర్శన సమయం: ఒక గంట మాత్రమే (దృశ్యం కోరికలు తీర్చే బాబాగారి సమాధి. సమాధిపైన వేలాడుతూ ఒక గంట! దానిని బయటి నుంచి కూడ మ్రోగించేందుకు వీలుగా ఒక తాడు. వింగ్ వరకు) (ప్రవేశం బావ, బావమరిది) బావమరిది: బావా! ఇదే బాబాగారి సమాధి! బావ: … Continue reading

Posted in కథ | 5 Comments

ఓ కథ చచ్చిపోయింది!

ఓ కథ చచ్చిపోయింది. ఇదో, ఇప్పుడే, ఇక్కడే, నా సమక్షంలోనే! అంతా నా చేతుల్లోనే ఉందనిపిస్తూ, ఏదో ఒకటి చెయ్యాలని నేననుకుంటూ ఉండగానే చేయిదాటిపోయింది. చచ్చిపోయింది. Continue reading

Posted in కథ | 14 Comments

రమాదేవి ఎందుకు రమ్మంది (Author’s cut)

-అక్కిరాజుభట్టిప్రోలు “రమాదేవి ఎందుకు రమ్మంది?” మరోసారి అలోచనలోకి జారిపోబోయాడు రాజారావు. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కున్నాడో తనకే తెలీదు. సికిందరాబాదు ఇంకో పావుగంట దూరంలోకి వచ్చేసింది. కంపార్ట్ మెంట్ లో అందరూ మిడిల్ బెర్తులు మడిచేసి, సూట్ కేసులు బయటకు పెట్టి, పిల్లల కాళ్ళకి చెప్పులు లెక్క చూసుకుంటున్నారు. ఈ గొడవలో తన … Continue reading

Posted in కథ | 6 Comments

అరెస్ట్ వారెంట్

– శ్రీనివాసరావు. గొర్లి మా మేనేజర్ మొఖం అంత దిగులుగా వుండటం నేను గత నాలుగేళ్ళ కాలంలో ఎప్పుడూ చూడలేదు. ఆయనే కాదు, అంతకు ముందు నా సర్వీసు లో నలుగురు మేనేజర్లను చూశాను గాని ఎవరినీ మొఖాలు ఇంత దిగులుగా ఉండే ఇటువంటి పరిస్థితులలో చూడలేదు. అసలు అది దిగులు కాదు. అంత కంటే … Continue reading

Posted in కథ | 13 Comments

ఉత్పరివర్తనం

“ఆకస్మికముగా సంభవించే గుణాత్మక వైవిధ్యములను ఉత్పరివర్తనములు అందురు..” నిశ్శబ్దంగా ఉన్న క్లాసు రూములో ఖంగుమంటోంది మధు సార్ గా పిలవబడే రాజా మధుసూదన వరప్రసాద రావు గొంతు. పల్లెకి ఎక్కువ, పట్టణానికి తక్కువగా ఉన్న ఆ ఊరి ఎయిడెడ్ స్కూల్లో ఏడో తరగతి లోకి అడుగు పెట్టబోతున్న పిల్లలంతా తల వంచుకుని శ్రద్ధగా నోట్సు రాసుకుంటున్నారు. … Continue reading

Posted in కథ | 20 Comments