Author Archives: స్వాతికుమారి

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

తామస విరోధి – ఎనిమిదవ భాగం

ఇప్పుడో నది కావాలి
ఉప్పెనలా ఊళ్ళను తుడిచి పెట్టే నదికాదు
మూలం వేళ్ళను తడిసి
పచ్చదనం చిగురింపచేసే నది
నగరం నడి బొడ్డున
ఫౌంటెన్ లా ఎగజిమ్మి అందాలు పంచే నది కాదు
భూమి మొహాన ఇన్ని నీళ్ళు కొట్టి
అన్నం పంచే నది
ఎండిన చెట్లను అక్కున చేర్చుకునే నది… Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on తామస విరోధి – ఎనిమిదవ భాగం

సౌమ్య టాక్స్

-స్వాతి కుమారి తాను చదివిన పుస్తకాల వివరాలూ, రివ్యూలు, నచ్చిన సినిమా పాటల విశేషాలే కాకుండా ఇతర భాషా కథల అనువాదాలూ, సొంత రచనా ప్రయోగాలూ అన్నిటినీ Sowmya writes అంటూ తన బ్లాగులోనూ, వెబ్ పత్రికల్లోనూ కుమ్మరించే వి.బి.సౌమ్య ఇప్పుడు కొన్ని సరదా కబుర్లని కూడా మనతో పంచుకుంటుంది.

Posted in వ్యాసం | Tagged | 11 Comments

తామస విరోధి -ఏడవభాగం (తర్ ‘ కవిత ‘ర్కాలు)

ఒక కవిత రాశేశాక దానికి పేరు పెట్టే విషయం లో సమస్య వస్తుంది. అసలు శీర్షిక ఎలా ఉండాలి? కవితలోని సారం పేరు చూడగానే అర్ధమవ్వాలా లేదా ఆ శీర్షిక తో కలిపి చూస్తేనే కవిత పూర్తయినట్టు అనిపించాలా? అసలు శీర్షిక ఉండకపోతే నష్టమా.
సమకాలీన అంశాలపై రాసే కవితలు కొన్ని ఉంటాయి. వార్తా పత్రిక లో సంఘటనల హెడింగ్ లు చదివినట్టు ఉంటుంది. సంఘటనలని సూటిగా రిఫర్ చేస్తూ కవిత రాయటం ఎంతవరకూ బావుంటుంది. అసలలాంటి అంశాలను కవితా ప్రక్రియ లో చూపదలచుకుంటే యెలా రాయాలి. Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on తామస విరోధి -ఏడవభాగం (తర్ ‘ కవిత ‘ర్కాలు)

తామస విరోధి – ఆరవ భాగం

కిరణ్ కుమార్ చావా : ఆ ఒడ్డు నుండి నువ్ నన్ను, ఈ ఒడ్డు నుండి నే నిన్ను, పరికిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ, ఇన్ని వసంతాలూ అట్టే గడిపేశాం. ఎప్పుడో కుదుళ్లు వేరైపోయినా, ఎప్పటికప్పుడు గాయాల కాలవలకు పూడికలు తీస్తూ, గట్లు కడుతూ, ఇన్ని వసంతాలూ రక్తం పారించాం. నీ వైపు పూలు, నా వైపు … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

కథా మాలతీయం – 6

నిడదవోలు మాలతి ప్రముఖ రచయిత్రి మాత్రమే కాక, ప్రసిద్ధ బ్లాగరి కూడా. ఆమె తన బ్లాగానుభవాలను ఇక్కడ వివరిస్తున్నారు. అలాగే రచయితలు, సంపాదకుల హక్కులపై తన అభిప్రాయాలను కూడా తెలియజేసారు. పొద్దు సంపాదకవర్గ సభ్యురాలైన స్వాతికుమారి నిర్వహిచిన ఈ ఇంటర్వ్యూ ఈ భాగంతో ముగుస్తున్నది. తెలుగుబ్లాగుల్లో నన్ను ఆకట్టుకున్న అంశాలు తెలుగుబ్లాగులు నన్ను ఆకర్షించడానికి మరొక … Continue reading

Posted in వ్యాసం | Tagged | 17 Comments

తామస విరోధి- ఐదవ భాగం

సాహితీ మిత్రులకు నమస్కారం! తామస విరోధి కి ఒక కవిత పంపుతున్నాను.. చూడండి. -తవ్వా ఓబుల్ రెడ్డి ప్రభాతవేళ …..! పున్నమి వెన్నెలలో తడిచి,తడిచి ముద్దగా ముడుచుకుని ఉంటుంది పల్లె వేట కోసం లేచిన వేకువ పిట్టలు వేగుచుక్క దిశగా గాలిలో ఈదుతూ ఉంటాయి తరతరాల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నట్లుగా పల్లె నలు చెరుగులా కోడి … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

కథా మాలతీయం – 5

అమెరికా వచ్చినతరవాత తాను గ్రహించిన విశేషాలూ, తన వెబ్‌సైటు, బ్లాగుల ద్వారా పొందిన అనుభవాలూ, పెంపొందిన ఆత్మీయతలూ.. ఈ విషయాలమీద పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతికుమారి అడిగిన ప్రశ్నలకు ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతి అంతరంగ కథనం చదవండి. *పాఠకులతో ఏర్పడిన సాన్నిహిత్యం -బ్లాగు మొదలు పెట్టకముందూ, తరవాతా, తూలిక.నెట్ ద్వారా, రచయిత్రిగా.. ఇంగ్లీషు తూలిక.నెట్ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 12 Comments

తామస విరోధి – నాల్గవభాగం

తామస విరోధి నాల్గవ భాగం లో నిషిగంధ గారి పుష్ప విలాసమూ, దానిపై ఇతర కవుల విశ్లేషణా చదవండి. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 3 Comments

కథా మాలతీయం – 4

నిడదవోలు మాలతి గారితో కబుర్లు నాల్గవ భాగం. Continue reading

Posted in వ్యాసం | Tagged | 11 Comments

తామస విరోధి – మూడవ భాగం

“సీత వెదికిన రాముడు” అనే సమస్య కు వచన కవితా పూరణలు కొన్ని ఇక్కడ చదవండి. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment