Monthly Archives: June 2010

గాలి

-కెక్యూబ్ వర్మ వీస్తున్న గాలి వాసన ముక్కు పుటాలను తాకి ఎదలో రొద పెడుతోంది. ప్రశ్న వెన్నంటే ప్రశ్నల సాలె గూడులో౦చి బయట పడలేని తనం. తెగిపడిన శిరస్సుల ముందు ఖాళీ చేతులతో మోకరిల్లలేను కనుగుడ్ల ఖాళీ స్థలంలో ఇప్పుడు ఏదో విద్యుల్లత పద్మ వ్యూహం నుండి బయటపడే మార్గం ఉమ్మనీరులో ఈదిన నాడే నేర్చిన … Continue reading

Posted in కవిత్వం | Tagged | 4 Comments

తోలుబొమ్మలు

— స్వాతీ శ్రీపాద “ఎవరు? ” “………” “ఎవరది?” కళ్ళు బాగానే కనిపిస్తాయంటుంది కాని కనిపించడం లేదని అర్ధమవుతూనేవుంది. గొంతువిని గుర్తు పడుతుంది. లేదూ చాలా దగ్గరగావుంటే చూడగలదనుకుంటా.. “అమ్మా! బ్రేక్ ఫాస్ట్ తిన్నావా ?” “నువ్వా? ఇప్పుడా అడిగేది? అన్నాలవేళ కూడా అయినట్టుంది ” “ఏం చెయ్యను చెప్పు ? నీకు తెలీనిదేఁవుంది … … Continue reading

Posted in కథ | 12 Comments

శకలస్వరం

-డా. పులిపాటి గురుస్వామి ఎప్పటికీ ఏదో ఒక బాధ.. దానికి రూపం ఉండదు, నువ్వనుకుంటున్నట్టు సరిహద్దులు కూడా ఉండవు. నన్ను కాపాడుకోవటం కోసం అది ఆవహించుకు పోతుంది. వందశాతం వశీకరణ మంత్రమేదో ఉంది. నేను దాన్ని ప్రేమించినట్టే అది కూడా నన్ను.. కనికరింపుల కలత దుఃఖాన్ని సాదరంగా చేయి పట్టుకు తీసుకువచ్చి నిలబెడితే.. దాని దీనమైన … Continue reading

Posted in కవిత్వం | Tagged | 4 Comments

మృతజీవులు – 32

-కొడవటిగంటి కుటుంబరావు “నజ్ ద్ర్యోవా! నిజంగా?” “ఏం, అతని బుద్ధే అంత. తన తండ్రిని అమ్మటానికి చూశాడు తెలుసా, మరీ అన్యాయం పేకాటలో పణం పెట్టాడు.” “ఎంతచిత్రమైన విషయాలు చెబుతావమ్మా! నజ్ ద్ర్యోవ్ కు ఈ వ్యవహారంలో జోక్యం ఉంటుందని నేను చచ్చినా ఊహించి ఉండను.” “నేను మటుకు మొదటి నుంచీ అనుకుంటూనే ఉన్నాను.” “నిజంగా, … Continue reading

Posted in కథ | Tagged | 4 Comments

కవికృతి -౭

తిరిగే చేతుల్లో -ఎమ్.ఎస్.నాయిడు కొన్ని చీమల చేతుల కింద తిరుగుతున్నా వాటి నిద్రని తాకాలని నా తలకాయలో వాటి ప్రియురాళ్ళ ముఖాల్ని తుడిచేశాను నిద్రలో పాకి నా ప్రియురాళ్ళ ముఖాల్ని అవి తినేశాయి కొన్ని కలలు చీమల చేతుల్లో ఉంటాయి మరికొన్ని తలలు కలల చేతుల్లో చితుకుతాయి తిరిగే చేతుల్లో వంకర్లో కొంకర్లో పోయే కలలే … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 4 Comments

పొగమంచు

-ఆత్రేయ కొండూరు దగ్గరయ్యేకొద్దీ దారి చూపిస్తూ , మసక రూపాలకు మెల్లగా రంగులమరుస్తూ, మురిపిస్తూ, తేమతగిలిస్తూ.. కంటి వెనక దారి మూసేస్తూ, ముందు వెనకలను ఏకం చేస్తూ.. ఉదయమయ్యేదాకా సగం రంగుల పరిధినే ఆస్వాదించ మంటూ.. తాత మాటలు తవ్వి తీస్తూ..

Posted in కవిత్వం | Tagged | 2 Comments

పోతన కవిత్వ పటుత్వము

__ శ్రీ తాపీ ధర్మారావు (పరిశోధన, 1954) “ముక్కుతిమ్మనార్యు ముద్దుపలు”కన్నట్లే పోతన్నది సహజ పాండిత్యమనీ అతను రామభక్తి పరాయణుడనీ సహృదయులు తమ అభిప్రాయాన్ని ‘గుళిగారూపం’గా ప్రకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర పోతరాజూ, యెడ్ల రామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారంభించారు. సహజ పాండిత్యం కాబట్టి పోతన్న ఆంధ్ర శబ్దచింతామణిగానీ కనీసం చిన్నయసూరి … Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 4 Comments

నిర్మోహ వామనం

-అభిశప్తుడు మొదటి అడుగు: భూమి కమ్ముకున్న అదృశ్య ప్రణవాన్ని అరచేతి దోనెలతో పోస్తానన్నావు ప్రణయాణువులతో పిగిలిపోతున్న కాగితప్పొట్లాంలో కాస్తయినా ఖాళీలేదు మనోప్రస్తారం నుంచి మరే ప్రసారం వీలుకాదు ఈదురుగాలుల్ని ఉడికించిన గడ్డిపోచ నేను రికామీ తెమ్మెరై వంచిన, వంచించిన నీ నవ్వు రెండో అడుగు: ఆకాశం కంటిరెక్కలకి కట్టాను కంకరరాళ్ళు ఐనా లోన ఎండమావుల్ని రద్దు … Continue reading

Posted in కవిత్వం | Tagged | 6 Comments

పరిభూత సురత్రాణం

ఆ సంఘటన ఇప్పటికి 500 సంవత్సరాలు (1510 జనవరి 23) క్రిందట జరిగింది అయినా దాని నుంచి మనం ఈ నాటికీ పాఠాలు నేర్చుకొని మనుగడని ఎలా సాగించాలో చరిత్ర చెప్తోంది!!! Continue reading

Posted in కథ | Tagged | 8 Comments

రెండు

-అవ్వారి నాగరాజు ఏదో భయం ఉంటుంది వోరగ తెరచి ఉంచిన అపరిచిత ప్రపంచపు ఆహ్వానానికై ఎదురు చూసే పెరపెరా ఉంటుంది రాతిరి విచ్చుకున్న ఆకాశపు పందిరి కింద చేతులు చాచుకుని అగాథపు నీలిమ లోతులలో పవ్వళించే స్వాప్నికతా ఉంటుంది ఒక రోజు తొలగి ఇంకొక దానికి దారి చూపే వేకువలలో  తెలియని సంశాయాత్మతో తనలోకి తానై … Continue reading

Posted in కవిత్వం | Tagged | 10 Comments