Monthly Archives: May 2010

ఎదురు చూపు

-రవి వీరెల్లి నీ తలపు ఎక్కడో పచ్చికబయల్లో పారేసుకున్న మన పాత గురుతులని ఎదకు ఎరగా వేసి పద పదమని పరుగు పెట్టిస్తుంది నీ ద్యాస స్మృతుల శ్రుతిలో స్వరాలాపన చేస్తున్న నా హృదయ లయను గమకాల అంచుల్లో తమకాల ఉయ్యాలలూపుతుంది నీ ఊహ మొగ్గలాముడుచుకున్న జ్ఞాపకాలని బుగ్గరించి విరబూయించి అనుభవాల రెక్కల చిరుజల్లుగా చిలకరిస్తుంది … Continue reading

Posted in కవిత్వం | Tagged | 9 Comments

యుద్ధం

-వైదేహి శశిధర్ విరిగిన కొమ్మలా వాలిన తండ్రి చేతిని తన గుప్పెటలో బంధించి ఘనీభవించిన కన్నీళ్ళ నావై వేదనల తెరచాపలెత్తి ఆ వైపు నిశ్శబ్దంగా నిలచిన ఆమె   కదిలే కారుణ్య వీచికనై చార్టులో రిపోర్టులను మధించి కరిగిపోతున్న కాలంతో ఏకదీక్షగా పోరాడుతూ ఈ వైపు కర్తవ్య నిమగ్ననై నేను   నివురు గప్పిన గాండీవాలై … Continue reading

Posted in కవిత్వం | Tagged | 9 Comments

పుష్పగంధి

-డా. వేలూరి (వెలమకన్ని) సీతాలక్ష్మి కావ్యమాల – నన్నయ నుండి నిన్నటివరకూ తెలుగు సాహితీ నందనవనంలో విరబూసిన సుగంధభరిత పద్యసుమాల మాల. ప్రతీ యుగములోను కొందరు కవులనెంచుకుని వారి రచనల్లోని అద్భుతమైన కొన్ని పద్యాలను ఉటంకిస్తూ, కీ.శే. కాటూరి వెంకటేశ్వరరావుగారు మాలికగా కూర్చి, “కావ్యమాల” పేరుతో తెలుగువారికి కానుకగా సమర్పించారు. సాహిత్య అకాడమీ పనుపున అల్లిన … Continue reading

Posted in వ్యాసం | 4 Comments

కవికృతి – ౬

దామోదర్ అంకం: నేనెవర్ని…?! ఎంత తప్పించుకుందామనుకున్నా.. నాకు నేను ఒంటరిగా దొరికిపోయినపుడు… అమ్మ ఒడికి దూరంగా.. కానీ అంతే గారాబంగా.. నాకు నేను జోల పాడుకున్నపుడు… ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. నాకు నేను అద్దంలో విన్నవించుకున్నపుడు… చిరుగాలి పరుగెడుతుంటే.. ఆ శబ్దం నను భయపెడుతుంటే.. నాకు నేను ధైర్యం చెప్పుకున్నపుడు… సమయం నను తిరస్కరిస్తుంటే.. “ఏంకాదు” … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 5 Comments

ఓపెన్ టైప్

-అరిపిరాల సత్యప్రసాద్ కొంచెం దూరంగా తన కొలీగ్స్‌తో భోజనం చేస్తూ కనపడిందామె. చటుక్కున తల తిప్పుకున్నాను. “ఉష లాగా వుందే..!! లాగా వుండటం ఏమిటి ఉషే.. కొంచెం వొళ్ళు చేసినట్లుంది..!! నన్ను చూసిందా? గుర్తు పట్టిందా? ఏమో.. గుర్తు పట్టకపోతే బాగుండు..!!” అనుకుంటూ, మళ్ళీ అటు చూడకుండా భోజనం వడ్డించుకున్నాను. నాకు ఆ కంపెనీలో అదే … Continue reading

Posted in కథ | 8 Comments

నాలుగు మెతుకులు

– అఫ్సర్ బయట విరగ్గాస్తున్న ఎండకి లోపటి చీకటి తెలుస్తుందో లేదో! కాసేపు గొంతుక వాహ్యాళికెళ్తుంది మౌనంలోకి. గాలి కోసం కాసింత వూపిరి కోసం. 2 బిగికౌగిలి చెట్ల మధ్య వొక తెల్ల చార సన్నగా తెరుచుకొని ఎటో తీసుకెళ్తుంది. దాని భాష నాకెప్పుడూ అందంగా వినిపిస్తుంది. 3 అడివి కన్న చిక్కగ పెనవేసుకుపోయిన ఇళ్ళ … Continue reading

Posted in కవిత్వం | Tagged | 8 Comments

రొద

– హెచ్చార్కే రెండుగా చీలిన ఒక వేదన ముట్టడించిన మసక వెన్నెల చిట్టచివరి విందులో ఇద్దరు ద్రోహం ద్రోహం అలలెత్తి అరిచిన దుర్బల సముద్రం! ఎన్ని ఎండలల్లో ఇంకెన్ని వెన్నెలల్లో తగలెట్టుకోగలరు తమను తాము? ఎవరినెవరు పంపారు శిలువకు? వారిలో క్షమార్హు లెవరో చెప్పలేని సందేహ సముద్రం!! ఒక్కో రాత్రిగా ఒక్కొక్క పగలుగా పుట్ట లోంచి … Continue reading

Posted in కవిత్వం | Tagged | 7 Comments

కేక

-వి.బి.సౌమ్య “ఓహ్..నో!” దిక్కులదిరేలా వినడ్డదో కేక. అది నోటినుండి వెలువడ్డట్లు లేదు. అరికాలు నుండి మస్తిష్కం దాకా శరీరం లోని ప్రత్యంగమూ గొంతుకను సృష్టించుకుని, అన్ని గొంతుకలూ మౌనాన్ని పెగుల్చుకుంటూ, తమ గొంతు చించుకుని అరిచినట్లు ఉంది. ఆవేదనా, ఆక్రోశం, నిరాశా, నిస్సహాయతా కలగలిసి ఉన్నాయా కేకలో. ఎవరి మీదా చూపించలేని ఆగ్రహానికి గొంతుక కలిగితే … Continue reading

Posted in కథ | Tagged , | 2 Comments