కవికృతి – ౬

దామోదర్ అంకం:

నేనెవర్ని…?!

ఎంత తప్పించుకుందామనుకున్నా..
నాకు నేను ఒంటరిగా దొరికిపోయినపుడు…
అమ్మ ఒడికి దూరంగా..
కానీ అంతే గారాబంగా..
నాకు నేను జోల పాడుకున్నపుడు…

ఎవరికి చెప్పుకోవాలో తెలియక..
నాకు నేను అద్దంలో విన్నవించుకున్నపుడు…
చిరుగాలి పరుగెడుతుంటే..
ఆ శబ్దం నను భయపెడుతుంటే..
నాకు నేను ధైర్యం చెప్పుకున్నపుడు…

సమయం నను తిరస్కరిస్తుంటే..
“ఏంకాదు” అని నన్ను నేను హత్తుకున్నపుడు…
తొందర పడుతున్న కాలానికంటే..
అపుడపుడూ నే ముందు పొతుంటే..
నన్ను నేను సంతోషంతో ఎత్తుకున్నపుడు…

ఒంటరిగా ఉంటే గంటలు గంటలు..
నన్ను నేను తుంటరిగా మట్లాడించినపుడు…
రాత్రి ఆకలౌతుందంటూ..
ఈ ఒక్క బుక్కా తినమంటూ..
నన్ను నేను బుజ్జగించుకున్నపుడు…

నాకు నేను ఎమౌతాను..?
నన్ను నేను ఎటు తీసుకుపొతాను..?
అసలు,,…నాకు “నేనెవర్ని”…?

*************

పవన్ కుమార్: కవిత చాలా బాగుంది, భావ క్రమం ఎంతో హృద్యంగా ఉంది. చాలా మంచి కవిత. నాకు నేను ఎమౌతాను..? అని ఆపితే ముగింపు శిల్పం అందగిస్తుంది. ఈ కింది పంక్తులిక అనవసరం.

నన్ను నేను ఎటు తీసుకుపొతాను..?
అసలు,,…నాకు “నేనెవర్ని”…?

***************************

చావా కిరణ్:

ప్రియా, వారందరి వెనక,

నీడల్లో ఎక్కడున్నావు?

నిన్నల్లరి పెడుతూ, నెడుతూ

మట్టిరోడ్డులో నడుస్తున్నారు.

అనంతంగా ఎదురు చూస్తున్నాను,

నీ కోసం పూలను సమర్పిస్తూ,

నడిచే వారంతా అందుకుంటున్నారు

ఒక్కొక్కటిగా పూలన్నీ,

నా బుట్ట రమారమి ఖాళీ అయింది.

ఉదయం వెళ్లి పోయింది,

మధ్యాహ్నం కూడా.

సాయంత్రపు నీడల్లో,

నా కళ్లు నిద్రతో మత్తెక్కాయి.

ఇంటికి మరలే వారు చూసి

నవ్వి సిగ్గుతో నన్ను నింపుతున్నారు.

బిచ్చగత్తెలా మొహంపై

బట్ట కప్పుకోని కూర్చున్నాను.

నీకేంకావాలి అంటూ వారడిగితే

కళ్లు నేలచూపి జవాబివ్వకున్నాను.

ఓహ్, వారికి నేనెలా చెప్పగలను

నీ కోసం ఎదురు చూస్తున్నానని.

నువ్వు వస్తానన్నావని.

కట్నం కోసం ఈ పేదరికాన్ని

కౌగిలించుకున్నానని ఎలా చెప్పను.

ఈ రహస్యాన్ని గర్వంగా దాచుకున్నాను.

గడ్డిపై కూర్చోని ఆకాశం వంకచూస్తూ కలగంటున్నా

నీ అద్భుత అకస్మాత్తాగమనానందక్షణాన్ని

స్వర్ణ ధ్వజాలు ఎగురుతున్న రథంలోని

నీ సింహాసనం నుండి దిగి వచ్చి,

ఎండా కాలపు లతలా వాడిన

ఈ పేదింటి అమ్మాయిని పిలిచి

నీ పక్కకు తీసుకోవటం చూసి

వీరంతా అవాక్కయినట్టు కలగంటున్నాను.

—-

కాలం దొర్లి పోతోంది, కాని

నీ రథ చక్రాల సవ్వడి లేదు.

ఎన్నో ఊరేగింపులు

సంరంభంగా వెళ్తున్నాయి.

కేవలం నువ్వే-

వాటన్నింటికీ వెనకమాల-

నీడల్లో నిశబ్దంగా నిల్చున్నావు.

కేవలం నేనే-

అవిశ్రాంతంగా వేచి రోదించి-

కరిగి విషాదంలో మునుగుతున్నాను.

గీతాంజలి 41

Where dost thou stand behind them all, my lover, hiding thyself in the
shadows? They push thee and pass thee by on the dusty road, taking thee for
naught. I wait here weary hours spreading my fierings for thee, while
passers-by come and take my flowers, one by one, and my basket is nearly
empty.

The morning time is past, and the noon. In the shade of evening my eyes are
drowsy with sleep. Men going home glance at me and smile and fill me with
shame. I sit like a beggar maid, drawing my skirt over my face, and when
they ask me, what it is I want, I drop my eyes and answer them not.

Oh, how, indeed, could I tell them that for thee I wait, and that thou hast
promised to come. How could I utter for shame that I keep for my dowry this
poverty. Ah, I hug this pride in the secret of my heart.

I sit on the grass and gaze upon the sky and dream of the sudden splendor of
thy coming all the lights ablaze, golden pennons flying over thy car, and
they at the roadside standing agape, when they see thee come down from thy
seat to raise me from the dust, and set at thy side this ragged beggar girl
a-tremble with shame and pride, like a creeper in a summer breeze.

But time glides on and still no sound of the wheels of thy chariot. Many a
procession passes by with noise and shouts and glamour of glory. Is it only
thou who wouldst stand in the shadow silent and behind them all? And only I
who would wait and weep and wear out my heart in vain longing?

గీతాంజలి – 4o

వాన చినుకు లేదు,

రోజుల తరబడి,

నా బీడు గుండెలో

అయ్యో ప్రభూ.

ఉపరితలమంతా శూన్యం,

ఒక్క చిట్టి మేఘం లేదు,

సుదూర వర్ష చిన్నెలూ లేవు.

సరిలేని, భయంకరమైన

నీ క్రోధ తుఫానులు పంపు

అదే నీ ఆలోచనైతే,

ఇంకా ఆకాశం ఆ కొస నుండి

ఈ కొసకు సాగు మెరుపుల కొరడాలు

కానీ, నా ప్రభూ.

వెనక్కి పిలువు వెంటనే

హృదయాన్ని నిలువునా దహిస్తున్న

ఈ నిశబ్ద సూటి

క్రూర భయంకర సెగలను

ఆకాశపు అనంత కొస నుండి

దయా మేఘాన్ని దిగువకు పంపు

కన్నతల్లి కన్నీటి దీవెనలా

కన్నతండ్రి కోమల కౌగిలింతలా

The rain has held back for days and days,
my God, in my arid heart.
The hori­zon is fiercely naked-
not the thinnest cover of a soft cloud,
not the vaguest hint of a dis­tant cool shower.
Send thy angry storm, dark with death,
if it is thy wish, and with lashes of light­ning
star­tle the sky from end to end.
But call back, my lord,
call back this per­vad­ing silent heat,
still and keen and cruel,
burn­ing the heart with dire despair.
Let the cloud of grace bend low from above
like the tear­ful look of the mother on the day of
the father’s wrath

పవన్ కుమార్: భావోద్వేగం ఉన్న కవిత. కట్నం, పేదరికం అంటూ కృత్రిమతను అంటించే పంక్తులు లాగేస్తే శోభనిస్తుంది.
ఈ కింది చరణం పూర్తిగా తీసెయ్యొచ్చు.

“కట్నం కోసం ఈ పేదరికాన్ని
కౌగిలించుకున్నానని ఎలా చెప్పను.
ఈ రహస్యాన్ని గర్వంగా దాచుకున్నాను”.

గీతాంజలి 40

అనువాదం చెయ్యడానికి కావాల్సింది కొండంత సహనం. మూలం ఏ భాష అయినా కనీస పరిజ్ఞానం మూల భాషలో ఉండి తీరాల్సిందే (కవిత్వానికి మరీ ముఖ్యం). మూలాన్ని చూడకుండా అనువాదానికి పూనుకోవడం తప్పు. గీతాంజలి మన భారతీయ భాషలలోనిది, దానిని ఇంగ్లీషు నుంచి చెయ్యాల్సిన ఖర్మ ఎందుకు? కొంత కష్టపడితే బెంగాలీ చదవడం రాయడం నేర్చుకోవచ్చు, తప్పకుండా ఇంగ్లీషులో చదివి ముందుగా సారాంశం అర్థం చేసుకున్నా వెన్నుదన్నుగా మూలాన్ని చదవడమో, చదివించుకొని వినడమో చెయ్యాలి అనువాదకుడు. బెంగాలీ నుంచి నేరుగా కాకపోయినా బెంగాలీ కొంత పరిజ్ఞానం తప్పదు. మన తెలుగులో ఈసరికే ఉన్న గీతాంజలి అనువాదాలను పరిశీలించడం అవసరం.

కింది ఈమాట లింకులో గీతాంజలి అనువాదాల మీద సమీక్ష ఉంది.

http://www.eemaata.com/em/issues/200605/67.html

బెంగాలీలో ఇది పూర్తి వచన కవిత్వం కాదు అని మూలాన్ని పరిశీలిస్తే తప్పక అర్థం అవుతుంది. రూప శ్రద్ధ అనువాదకుడికి చాలా ముఖ్యం.

బెంగాలీ మూలం (కొన్ని పంక్తులు) తెలుగులో కింద :

దీర్ఘకాల్, అనావృష్టి, అతి దీర్ఘకాల్

హే ఇంద్ర్, హోదయే మం, దిక్చక్రబాల్

భయంకర్ శూన్య హెరి, నాయ్ కూనూఖానే

సరస్ సజల్ రేఖ కెహ్ నాహి ఆనే

నవ్ బారి బర్షనేర్ శ్యామల్ సంవాద్

జొది ఇచ్చా హొయ్ దేవ్, అను బజ్రనాథ్

ప్రలయముఖేర్ హింశ్రార్ ఝటికార్ సాథే

పలే పలే బిద్యుతేర్ బక్ర కశాఘాతె

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

5 Responses to కవికృతి – ౬

  1. “తప్పకుండా ఇంగ్లీషులో చదివి ముందుగా సారాంశం అర్థం చేసుకున్నా వెన్నుదన్నుగా మూలాన్ని చదవడమో, చదివించుకొని వినడమో చెయ్యాలి అనువాదకుడు.”

    ఏ అనువాదమైనా మూల భాషలో చదివి/చదివంచుకుని అనువాదం చెయ్యాలనే నియమాన్ని పెట్టుకోవాలి ప్రతి అనువాదకుడూ.

  2. మెహెర్ says:

    WOW! “నేనెవర్ని…?!” కవిత బాగుంది. చాలా బాగుంది! ఎందుకు బాగుందో చెప్పలేనంత బాగుంది!! అందరి విషయంలోనూ కొన్ని ఒంటరిక్షణాలకూ, కొందరి విషయంలో దురదృష్టవశాత్తూ పూర్తి జీవితాలకూ భాష్యాలీ పంక్తులు. ఈ క్షణంలో చాలా నచ్చింది. ఎందుకో పిసరంత ధైర్యాన్ని కూడా ఇచ్చింది. నాకు నేను ఏమీ కానక్కర్లేదు; అసలు ఏ నేను ఈ నేనో తెలియదు గనుక, నేనూ నేనూ మనమే అనుకోగలిగితే, ఆ “మనం” అన్న ఒక్క పదం కలిగించే ధైర్యమనుకుంటా! వాహ్, నేను కషాయాన్ని వడగట్టి సపోటారసం త్రాగగలను! 🙂

  3. chavakiran says:

    Hi Pavan,

    Thanks for your time and feeback.
    >> Not reading Bengali
    >> Not reading Existing translations.

    These two bugs are by design 🙂

    I am simply having some fun. When I started this I haven’t read any other Telugu translations of Gitanjali (at least I don’t remember reading). I tried very hard on internet to get some Roman/Hindi scripted Bengali Gitanjali but couldn’t get hands on one. As I am 50% done now, don’t want to read Bengali now. Let this effort be english Gitanjali to Telugu only.

    And I intentionally kept away from other translations. I want to understand as is and put in my own words. More over the english translation here is also from same author. If something is different in english may be that is what Kavi meant. If rythem is what missing, OK I am poor at it.

  4. పవన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు….
    మీ సూచనలకి కృతజ్ఞతలు…

Comments are closed.