Monthly Archives: August 2009

“ఒక్కలా”తీతం

— సౌమ్య వి.బి సముద్రాన్ని చూస్తే నాలో ఏవో అలజడులు, అలల్లాగే చెలరేగిపోతూ, తన్నుకువస్తూ ఉంటాయి. “నీళ్ళంటే నీకుండే భయంవల్ల అలా అనిపిస్తుంది” అంటుంది అమ్మ.

Posted in కథ | Tagged , , , | 10 Comments

2009 ఆగస్టు గడిపై మీమాట

2009 ఆగస్టు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-

Posted in గడి | Tagged | 6 Comments

2009 జూలై గడి పరిష్కారాలు – ఫలితాలు

ఈసారి గడి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. మొత్తం పంపిన వారు ఎనిమిది మంది. స్లిప్పుల సర్వీసులో పాల్గొనే వీరులెవరూ పంపకపోవడం అన్యాయం! స్లిప్పులు అందుకొని,అందించే ఉత్సాహం గడి నింపి, పంపడంలో కూడా చూపిస్తే బాగుంటుంది. అన్నీ వస్తేనే పంపించాలని ఏమీ లేదు కదా.

Posted in గడి | Tagged | 6 Comments

ఒక అనేకానేక నది… రెండవ మైథునం!

-అభిశప్తుడు పైట జారుతున్నా పట్టని పచ్చి వయ్యారాలు… పిరుదులూపుకుంటూ చిలిపి పరవళ్లు… …ప్రళయకావేరి నాదా…? పోనీ నీదా?

Posted in కథ | Tagged , , , , | 17 Comments

రాలిన చింతపండు – కొత్త దుప్పటి

– స్వాతీ శ్రీపాద మామూలు గ్రామీణ వాతావరణంలో ప్రతిచిన్న విషయానికీ ప్రాముఖ్యత వుంది. గ్రామీణులు చిన్నచిన్న విషయాలలో కూడా ఎంత జాగ్రత్త, పొదుపరితనం పాటిస్తారో; అది వారికి ఎందుకు అవసరమో ఇదే రచయిత తన చినుకుల సవ్వడి నవలలో అద్భుతంగా చూపాడు.

Posted in వ్యాసం | Tagged | Comments Off on రాలిన చింతపండు – కొత్త దుప్పటి

ఉదయం

— ఆత్రేయ కొండూరు. నిశ్శబ్దపు అంచులమీదకు జారిన నిప్పు కణికలు ఆవిరై అలుపు రేపాయి ! రెప్ప బరువు లేపలేని ఆద చీకట్లో కరిగి ఈకల్లోకింకుతూ.. ఎంత సమయం మింగిందో! తూర్పు కొండలు కృంగిన శబ్దాన్ని ఆకు సందులు చిలకరించే సరికి.. ముళ్ళకంప మీద ఎర్ర గులాబీలు బద్ధకంగా పూశాయి.. అటుప్రక్క వాలు చూడని ఆశ, … Continue reading

Posted in కవిత్వం | 2 Comments

మానవసమాజాల అధ్యయనం

సిరిసంపదలకూ, హోదాలకూ, అధికారాలకూ అప్పటిదాకా ఉండిన అర్థాలన్నీ తారుమారు కావడం, సమాజంలో ఏది గొప్ప, ఎవరు గొప్ప, గౌరవ మర్యాదలంటే అర్థమేమిటి మొదలైన ప్రశ్నలూ పరిశీలకులకు సవాళ్ళు అయికూర్చున్నాయి. గతంలో జరిగిన పరిణామాల గురించి చింతకులు వితర్కించుకోసాగారు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

శిఖామణి – చిలక్కొయ్య

– బొల్లోజు బాబా “మువ్వలచేతికర్ర” తో తెలుగు సాహిత్యలోకంలోకి ఒక మెరుపులా ప్రవేశించారు శిఖామణి. “చిలక్కొయ్య” ఆయన రెండవ కవితాసంపుటి. 1993 లో వెలువరించిన ఈ సంపుటిలో మొత్తం 33 కవితలున్నాయి. దేనికదే వస్తువైవిధ్యంతో, విలక్షణమైన అభివ్యక్తితో కనిపిస్తాయి. అనుభూతికి భాషనివ్వటం అంత తేలికేమీ కాదు.

Posted in వ్యాసం | Tagged | 2 Comments

మృతజీవులు – 26

-కొడవటిగంటి కుటుంబరావు “ఒక్కసారి చూడండి బాబూ, వాడి మొద్దు మొహం! కొయ్యదుంగ కెంత తెలివి ఉంటుందో వీడికీ అంతే! కాని అలా ఏదన్నా ఉంచారో, క్షణంలో కాజేస్తాడు! ఎందుకొచ్చావురా వెధవా, ఎందుకొచ్చావంట?” అంటూ ఆయన ఆగాడు. పోష్క కూడా మౌనంతోనే సమాధానం చెప్పాడు.

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 26