Monthly Archives: September 2008

అగష్టు గడి ఫలితాలు, వివరణ.

భైరవభట్ల కామేశ్వరరావు. 1 తప్పుతో,
శ్రీరాఘవ కిరణ్ 2 తప్పులతో,
ఆదిత్య 4 తప్పులతో,
మల్లంపల్లి 6 తప్పులతో పూరించారు. ఆరు కంటే ఎక్కువ తప్పులతో నలుగురు పూరించారు. – కొవ్వలి సత్యసాయి Continue reading

Posted in గడి | Tagged | Comments Off on అగష్టు గడి ఫలితాలు, వివరణ.

కైవల్యం

తనలోని సగాన్ని ప్రపంచమంతా వెతుక్కునే మనసు కి ఆ ఆత్మ బంధువు దొరికటం సాధ్యమయ్యే పనేనా?తనని తాను పూర్తిగా పొందలేక లోకం లోనే ఉంటూ దూరం గా మసలే ఒక ఆరాటం శ్రీవల్లీ రాధిక గారి ఈ కవితలో తెలుసుకోండి. Continue reading

Posted in కవిత్వం | Tagged | 22 Comments

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ

చిన్న వయసులోనే సాహితీప్రస్థానం ప్రారంభించిన ఆయన తన సుదీర్ఘ ప్రయాణంలో మలుపులెన్నో తిరిగినవాడు, మెట్లెన్నో ఎక్కిన వాడు. ఎన్ని సాహితీప్రక్రియలు చేపట్టినా అన్నిటిలో తన విశిష్టతను విస్పష్టంగా చాటినవాడు. కరువు పల్లెల బడుగుజీవుల వెతల్ని తన కళ్లలో నింపుకొన్నవాడు, “మట్టి రుచి తెలిసిన జీవితాల సారాంశమే నా సాహిత్యంగా రూపుదిద్దుకొంద”న్నవాడు, కవిత మర్మం తెలిసినవాడు, తెలుగు … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ

ఉపజాతి పద్యాలు – ౨

తేటగీతి — ముక్కు శ్రీరాఘవకిరణ్ మొన్నటి వ్యాసంలో ఆటవెలదులు ఎలా వ్రాయాలో చర్చించుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఆటవెలదుల్లోనే మాట్లాడుకుంటూ చర్చని కొనసాగిద్దామా? పూర్తిగా పద్యాల్లోనే ఎందుకు… నాకు గద్యం కూడా తెలుసంటారా? గద్యం కూడా వాడదాం.

Posted in వ్యాసం | Tagged | 6 Comments

మృతజీవులు – 21

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ అంతగా పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 21

ఉపజాతి పద్యాలు – ౧

ఆటవెలది — ముక్కు శ్రీరాఘవకిరణ్ నిరుడు నన్ను నేను పరిచయం చేసుకున్నాను కదా. పద్యరచనపై ప్రస్తుత వ్యాసం క్రొత్తగా వ్రాస్తున్నవారి మార్గాన్ని కొంతైనా కంటకరహితం చేసేలా, లోగడ ప్రయత్నించి విరమించినవారికి తిరిగి ప్రయత్నించడానికి తగినంత ఊతమిచ్చేలా ఉంటుందని ఆకాంక్షిస్తూ… మొదటే ఒక ముఖ్య ప్రకటన. నేను కేవలం పద్యాల గురించే చెప్పదలుచుకున్నానీ వ్యాసంలో. కాబట్టి వ్యాకరణశాస్త్రాన్నీ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 9 Comments

ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం

“బ్లాగుల్లో చర్చలు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా మారాయి. లైంగికతపై జరిగిన చర్చలో చాలామంది బ్లాగరులు హుందాగా స్పందించినప్పటికీ, ఒకటిరెండు చోట్ల ఇది బూతు స్థాయికి దిగజారింది”, అంటోంది ఆగస్టు బ్లాగు వీక్షణం. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 17 Comments