Monthly Archives: February 2008

అంతర్జాల పత్రికలు

సాటివారి సమీక్ష అని వికీలో ఓ ముఖ్యమైన అంశముంది. మనం రాసిన దాన్ని మన తోటివారు సమీక్షిస్తారన్నమాట! పొద్దు అలాంటిదే ఓ పని చేసింది. సాటి పత్రికల గురించి రాసింది. అయితే ఇది సమీక్ష కాదుగానీ, ఓ పరిచయం అంతే! పోటీ ప్రపంచమిది.. ఒకరిని మించి ఒకరు దూసుకు, తోసుకు పోవాలనే ధోరణులున్న రోజులు! అలాంటిది, సాటి పత్రికల గురించి ఓ పత్రిక బొమ్మలతో సహా పరిచయ వ్యాసం రాయడమా!?

అవును, రాయడమే!! Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments

మృతజీవులు – 15

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 15

సంపాదకీయం

ఉగాది వస్తోందని, కోయిల ముందే కూస్తోంది. రాబోయే ఉగాది సాహితీ సందడికి గాను తమ తమ పాళీలు నూరమని బ్లాగరులకు, ఇతర రచయితలకు చెబుతున్నారు పొద్దు సంపాదకుడు దేవరపల్లి రాజేంద్ర కుమార్, తమ సంపాదకీయంలో. Continue reading

Posted in సంపాదకీయం | 1 Comment

ఒక్క చుక్క నీళ్ళు లేకపాయె!

చినుకు కోసం రైతు చూసే ఎదురుచూపుల వ్యథను వివరిస్తున్నారు జోగధేను స్వరూప్ కృష్ణ తమ “ఒక్క చుక్క నీళ్ళు లేకపాయె” కవితలో. Continue reading

Posted in కవిత్వం | 11 Comments

అంతశ్శోధకుడు – రానారె

అక్షరాలను దూసి

మలచి మాలగ జేసి

తెలుగుతల్లికి వేసి

ధన్యుడయ్యెను మనిషి!

(ఏంటో.. రానారెను తలిస్తేనే పద్యాలొస్తున్నాయి! పాదాలూ మాత్రలూ కూడా పెరిగిపోతున్నాయి.)

వచనమైనా నిర్వచనమైనా అలవోకగా రాసుకెళ్ళిపోయే రానారె, లాగులు తొడుక్కునే టప్పటి నుండీ రాస్తున్నాడు. లాగుల నాడైనా, బ్లాగుల నాడైనా అందరిలోకీ ఆతడే ముందు! పొద్దులో అతడి బ్లాగులపై సమీక్ష చూడండి! Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 15 Comments

అనువాద కథలు – నా అనుభవాలు

కతల్జెప్పినంత తేలిగ్గాదు కథలు అనువదించడం. మూలంలోని అర్థం పోకుండా, భావం చెడకుండా, “నేను మా ఆవిడ చేత కొట్టబడ్డాను” లాంటి అవకతవక మాటలు రానీకుండా ఇంపుగా సొంపుగా అనువాదం చెయ్యడమంటే మాటలు కాదు.అనువాదపు కిటుకులు తెలిసిన రచయిత కొల్లూరి సోమశంకర్. 44 అనువాద కథలు రచించిన అనుభవంతో అనువాదాలు చెయ్యడంలోని సాధక బాధకాలను వివరిస్తున్నారు. Continue reading

Posted in వ్యాసం | Tagged | 8 Comments

ఫిబ్రవరి గడిపై మీమాట

డిసెంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. డిసెంబరు గడి, సమాధానాలు 2. నవంబరు గడి, సమాధానాలు 3. అక్టోబరు గడి, సమాధానాలు 4. ఆగష్టు గడి, సమాధానాలు 5. జూలై గడి, సమాధానాలు 6. జూన్ గడి, సమాధానాలు 7. మే గడి, సమాధానాలు 8. ఏప్రిల్ గడి, … Continue reading

Posted in గడి | Tagged | 14 Comments

2007 డిసెంబరు గడి సమాధానాలు

పరిష్కారాలు పంపినవారు:
బి.కామేశ్వరరావు – దాదాపు తప్పుల్లేకుండా Continue reading

Posted in గడి | Tagged | Comments Off on 2007 డిసెంబరు గడి సమాధానాలు

జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ!

బ్లాగులోకంలో జనవరిలో ఏమెం జరిగాయో గమనించారా? ఎవరెవ రేమేం రాసారో చదివారా? చదవలేదా! పోన్లెండి, ఏం పర్లేదు.. ఆ విషయం తెలుసుకునే అవకాశం పొద్దు మీకిస్తోంది. జనవరి బ్లాగుల ప్రస్థానపు నివేదిక ఇది. ప్రతీ ఒక్క బ్లాగునూ ఆ వ్యాసంలో పొందుపరచలేకపోయినప్పటికీ, ముఖ్యమైన విషయాలపై జాబులు వెలువరించిన బ్లాగులను అక్కడ ఉంచాము. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 14 Comments

ఆ దారి

-అసూర్యంపశ్య . నువ్వూ నేనూ అప్పుడెప్పుడో కలిసెళ్ళిన దారి ఒంటరిగా వెళితే కొత్తగా తోచింది పాత గుర్తులు మాయమైతే నువ్వు తీసుకెళ్ళావనుకున్నాను నేస్తం! అక్కడి గాలుల్లో చిక్కుకున్న అప్పటి మాటలు ఒక్కొక్కటే వచ్చి పలకరించినప్పుడు తెలిసింది నాకు ఇది ఆ దారేనని…. మట్టిలో కలిసిన అప్పటి అడుగులు నేలని పెగుల్చుకుని వచ్చి రోడ్డుపై వేసిన అచ్చులు … Continue reading

Posted in కవిత్వం | 8 Comments