మృతజీవులు – 15

నాలుగవ ప్రకరణం

భోజనశాల వద్దకు వచ్చేసరికి చిచీకవ్, గుర్రాలకు విశ్రాంతి అయినట్టు అవుతుందనీ, తాను ఏదైనా పలహారం చెయ్యవచ్చుననీ ఆలోచించి, సేలిఫాన్ తో చెప్పి బండి ఆపించాడు. ఇలాంటి వాళ్ళ జఠరశక్తి, ఆకలీ చూసి కథకుడు అసూయ చెందుతాడంటే, అందులో అసత్యం లేదు. పీటర్స్‌బర్గ్ లోనూ, మాస్కోలోనూ ఉండే ఘరానా మనుషులు అస్తమానమూ ‘రేపు ఏం తిందామా, ఎల్లుండి మధ్యాహ్నం ఏం తిందామా’ అని ఆలోచించటంతో కాలం వెళ్ళబుచ్చుతూ, భోజనం ఆరంభించబోతూ మాత్రలు మింగుతారు; ఆ తరువాత ఆయిస్టర్లూ, లాబ్‌స్టర్లూ, ఇతర వింత ఆహారాలూ తిని, ఆ తరువాత ఆరోగ్యం బాగు చేసుకునేటందుకు కారల్స్‌బాదో, కాకససో పోతారు. అలాటివాళ్ళంటే కథకుడికి అభిప్రాయం లేదు, అసూయా లేదు. నిజంగా అసూయ పడదగిన ఘనమైన అదృష్టం గలవాళ్ళు మధ్యరకానికి చెందినవాళ్ళు. వాళ్ళు ఒక మజిలీలో తుంటిమాంసం తింటారు, ఇంకో మజిలీలో వండిన పంది పిల్లను తింటారు.

ముసలావిడ తనకు సబాకవిచ్ మాత్రమేగాక, మానిలవ్ కూడా తెలుసుననీ, సబాకవిచ్ కంటే మానిలవ్ పెద్దమనిషి అనీ, మానిలవ్ వస్తూనే కోడినీ, దూడమాంసాన్నీ, ఉంటే గొర్రె కార్జాన్నీ తెమ్మని అన్నిటినీ కొంచమే రుచి చూసి వదిలేస్తాడనీ, సబాకవిచ్ ఏదో ఒక్కటే అడిగి, తెచ్చినదంతా తుడిచేసి తినడమేగాక, ఒక ప్లేటు ఖరీదుకే మారువడ్డన కూడా కావాలంటాడనీ చెప్పింది.

మరోదానిలో ఉల్లిపాయలతో సాసేజి వేపుడు తింటారు. ఆ తరువాత మీరెప్పుడు కోరితే అప్పుడు భోజనానికి కూచుని , ఏమీ జరగనట్టుగా చేపల ‘సూప్’ జుర్రేసి, చేపల ‘పాటీ’లు కూడా తినేస్తారు. వాళ్లను చూస్తుంటేనే ఆకలి పుట్టుకొస్తుంది. ఇలాటి మధ్యతరగతి పెద్దమనిషికుండే జీర్ణశక్తికోసం ఎందరో ఘరానా మనుషులు తీసుకొన్న కమతగాళ్ళలోనూ, ఎస్టేట్లలోను సగంభాగం,-తాకట్లున్నవయేది, లేనివయేది- దేశీయ పద్ధతిలోనూ, విదేశీ పద్ధతిలోనూ చేసిన అభివృద్ధులతో సహా, ఏ క్షణాన అయినా ధార పోసేస్తారు. కాని చిక్కేమిటంటే ఈ మధ్యతరగతివాడి జీర్ణశక్తి డబ్బుతోగానీ, ఎస్టేట్లను అమ్మితే గాని వచ్చేది కాదు -ఆ ఎస్టేట్లు అభివృద్ధి పొందినవయేది, పొందనివయేది.

వయసుచేత నలుపెక్కిన ఆ చెక్కల భోజనశాల తాలూకు వసారా ఇరుకుగా ఉన్నా ఆగంతకులను ఆకర్షించజాలి ఉన్నది; అది పాతకాలపు చర్చి కొవ్వొత్తుల పంపిణీలో మలచిన కర్రస్థంభాల మీదనిలిచి ఉన్నది. మొత్తం ఇల్లంతా రష్యను సేద్యగాళ్ళ గుడిసెల పంపిణీలోనే తయారయింది. అయితే ఆ గుడిసెల కన్న పెద్దది. కిటికీల చుట్టూనూ, చూరుకిందా కొత్తగా కర్రనగిషీలు అమర్చారు, నల్లటిగోడలమీద ఇవి కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. కిటికీ రెక్కలపైన పూలతొట్టెల బొమ్మలు వేశారు.

చిచీకవ్ ఇరుకైన మెట్లమీదుగా ముందు గదిలోకి వెళ్ళేటపుడు తలుపు కిర్రున తెరుచుకున్నది; నదరైన రంగుగల చీటీగౌను ధరించిన లావుపాటి ఆడమనిషి ఎదురువచ్చి, “ఇలా దయచేయండి!” అన్నది. లోపలిగదిలో మామూలు మిత్రబృందం ఉన్నది. రహదారి పొడుగునా ఎన్నో భోజనశాలలున్నాయి, ప్రతి ఒక్క భోజనశాలలోనూ ఈ మిత్రబృందం విధిగా ఉంటుంది – అది ఏమిటంటే, మురికి పట్టిన సమొవార్, నున్నటి జాజిచెక్క గోడలూ, ఒక మూల త్రికోణాకారం గల అలమారులో కప్పులూ, టీ పాట్‌లూ, పూజా విగ్రహాల ముందు ఎర్రని, నీలం రంగుపట్టీలకు వేళ్ళాడే పాదరసం బుడ్లూ, ఇటీవలనే కూనలను పెట్టిన ఒక పిల్లీ, రెండు కళ్ళను నాలుగుగానూ, ముఖాలను బన్‌లలాగానూ చూపే అద్దమూ, దేవుడి విగ్రహాల ముందుంచిన సువాసనగల ఆకులూ, పూలూ – అవి ఎంతగా వాడిపోయి ఉంటాయంటే వాటిని వాసనచూస్తే తుమ్ములు పట్టుకుంటాయి.

“వండిన పందిపిల్ల ఉన్నదా?” అని చిచీకవ్ ఆడమనిషిని అడిగాడు.
“ఉన్నది”
“ముల్లంగీ, పుల్ల మీగడా వేసినదేనా?”
“ముల్లంగీ, పుల్లమీగడా వేసినదే”
“అయితే పట్టుకురా”

ఆడమనిషి వెళ్ళి ఒక ప్లేటూ, ఒక నాప్కిన్ తెచ్చింది. ఆ నాప్కిన్ బాగా గంజిపెట్టి అట్టలాగా ఉండి పరిస్తే పరుచుకోవటంలేదు. తరువాత ఒక కత్తీ – దాని ఎముకపిడి పాతబడి పసుపు పచ్చగా ఉన్నది. కోసేభాగం పెనసళ్ళు చెక్కుకునే చాకులాగా ఉన్నది – రండే పళ్ళుగల ముళ్ళచంచా, బల్లమీద పెడితే పక్కకు ఒరిగబడే ఉప్పుతొట్టీ వచ్చాయి.

మన కథానాయకుడు తన అలవాటు ప్రకారం ఆవిడతో సంభాషణ ప్రారంభించి ఆ భోజనశాలను ఆమె స్వయంగా నడుపుతున్నదో లేక యజమాని వేరే ఉన్నాడో, ఈ భోజనశాల మీద ఏమాత్రం రాబడి వస్తున్నదో, వాళ్ళ కొడుకులు వాళ్ళతో కలిసి ఉంటున్నారో, విడిగా ఉంటున్నారో, పెద్దవాడికి పెళ్ళయిందో, బ్రహ్మచారో, వాడి భార్య మంచి కట్నం తెచ్చిందో, లేదో, పెళ్ళికూతురి తండ్రి ఈ సంబంధం చూసి తృప్తిపడ్డాడో లేక పెళ్ళికి కట్నకానుకలు సరిగా ఇవ్వలేదని కినిశాడో – అంతా ఆరా తీశాడు. ఆ చుట్టుపక్కల మంచి భూస్వాములున్నారా అని అతను అడిగాడని వేరే చెప్పనవసరము లేదు. రకరకాల భూస్వాములున్నట్టు తెలుసుకున్నాడు: బ్లహీన్, సచికాయెవ్, మిల్నోయ్, చిప్రాకవ్, కర్నలూ, సబాకవిచ్.

“ఓహో, నీకు సబాకవిచ్ తెలుసన్నమాట!” అన్నాడతను. ముసలావిడ తనకు సబాకవిచ్ మాత్రమేగాక, మానిలవ్ కూడా తెలుసుననీ, సబాకవిచ్ కంటే మానిలవ్ పెద్దమనిషి అనీ, మానిలవ్ వస్తూనే కోడినీ, దూడమాంసాన్నీ, ఉంటే గొర్రె కార్జాన్నీ తెమ్మని అన్నిటినీ కొంచమే రుచి చూసి వదిలేస్తాడనీ, సబాకవిచ్ ఏదో ఒక్కటే అడిగి, తెచ్చినదంతా తుడిచేసి తినడమేగాక, ఒక ప్లేటు ఖరీదుకే మారువడ్డన కూడా కావాలంటాడనీ చెప్పింది.

అతను ఆ విధంగా కబుర్లు వింటూ పందిపిల్లను పూర్తిచెయ్యబోతున్న సమయంలో బయట బండి చక్రాలు సమీపించే చప్పుడు వినబడింది. కిటికీలోనుంచి బయటికి తొంగి చూసేసరికి ఒక తేలిక రంగుబండి, మూడు మంచి గుర్రాలతో వచ్చి భోజనశాల వెలుపల ఆగటం కనిపించింది. అందులోనుంచి ఇద్దరు దిగారు: ఒకడు పొడగరి, తేలిక రంగు జుట్టు కలవాడు; రెండోవాడు కొంచెం పొట్టి, అతని జుట్టు నల్లగా ఉన్నది. పొడుగువాడు ముదురు నీలం రంగు జాకెట్, అంచుల వెంబడి నగిషీ కుట్టుకలది ధరించాడు. పొట్టివాడు సాదాగా జెర్కిన్ వేసుకుని ఉన్నాడు. దూరాన మరొక చచ్చురకం బండి కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నది. అందులో ఎవరూ లేరు. దాన్ని నాలుగు గుర్రపు తట్లు ఈడ్చుకు వస్తున్నాయి; వాటి మెడపట్టీలు చినిగి ఉన్నాయి, పగ్గాలకు తాళ్ళున్నాయి. పొడుగువాడు వెంటనే మెట్లెక్కి పైకి వచ్చాడు, కాని పొట్టివాడు వెనకనే ఉండిపోయి, బండిలోపల దేనికోసమో తడుముతూ, నౌకరుతో ఏదో మాట్లాడుతూ, దూరాన ఉన్న బండిని చెయ్యి ఊపి పిలిచాడు. అతనిది ఎక్కడ విన్న గొంతులాగా చిచీకవ్ కు వినిపించింది. అతన్ని చిచీకవ్ మరింత శ్రద్ధగా పరికించేటంతలో పొడుగాటివాడు తలుపు తెరుచుకొని లోపలికి వచ్చాడు. అతను చాలా ఎత్తున్నాడు, మొహం చిక్కిపోయినట్టుగా ఉన్నది. అతని మీసాలు ఎర్రగా ఉన్నాయి. అతని మొగం చూస్తే తుపాకీ మందుతో కాకపోతే కనీసం పొగాకు పొగతో పరిచయం ఉన్నవాడులాగా ఉన్నాడు. అతను చిచీకవ్‌ను చూసి సగౌరవంగా వంగాడు. అంత గౌరవంగానే చిచీకవ్ కూడా వంగాడు.

“నా దగ్గర ఇంకొక్క ఇరవై రూబుళ్ళుంటేనా! ఇరవై రూబుళ్ళే ఉంటే పోయినదంతా గెలిచేసుకునేవాణ్ణే. నాది గెలిచేసుకోవటమేమిటి, ముప్ఫైవేలు జేబులో పెట్టేసుకుని ఉందును, ఒట్టు” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“అప్పుడు ఇలాగే అన్నావు. యాభై రూబుళ్ళిస్తే అది కాస్తా పోగొట్టుకున్నావు.” అన్నాడు పొడుగాటివాడు.

“అది పోవలసింది కాదు, నిజానికి. ఆ వెధవపని చెయ్యకపోతే పోయి ఉండవు. ఆ దిక్కుమాలిన ఏడుపైన పందాలు రెట్టింపయినాక కూడా నేను రెండింతలు కాయకుండా ఉంటే, బ్యాంకును దివాలా తీయించి ఉందును.”

వాళ్ళు వెంటనే ఒకేసారి సంభాషణ ప్రారంభించి కిందటిరోజు వానకురిసి రోడ్డుమీది దుమ్ము అణగారి పోవటం చాలా మంచిదయిందనీ, ప్రయాణం చల్లగానూ, ప్రాణానికి సుఖంగానూ ఉన్నదని ఒకరికొకరు తెలుపుకుని ఇంకా ఆప్యాయంగా మాట్లాడుకుని ఒకరినొకరు పరిచయం చేసుకునే యత్నంలో ఉండగా నల్లజుట్టువాడు ప్రవేశించి, టోపీ తిసి బల్లమీద విసిరివేసి, దర్జాగా వేళ్ళతో జుట్టు కెలుక్కున్నాడు. అతను మంచి కుదిమట్టమైన మనిషి, చెక్కిళ్ళు ఎర్రగానూ, దంతాలు మంచు తెలుపుగానూ, పుస్తీలు నల్లగానూ ఉన్నాయి. అతన్ని చూస్తే పాలూ, గులాబీలూ స్ఫురిస్తున్నాయి. అతని ముఖంలో ఆరోగ్యం తాండవిస్తున్నది.

అతను చిచీకవ్‌ను చూసి చేతులు ప్రక్కకు చాస్తూ, “హా,హా,హా! నువ్విక్కడ ఎలా వెలిసావు?” అన్నాడు ఆశ్చర్యంతో.

చిచీకవ్ నజ్‌ద్ర్యోవ్ ను గుర్తించాడు. ఇతను మన కథానాయకుడికి పబ్లిక్ ప్రాసిక్యూటరు ఇంట తటస్థపడి, కొద్ది నిముషాల్లోనే భాయి భాయి అయిపోయి, ప్రోత్సాహం ఏమీ అవసరం లేకుండానే “నువు, నువు” అని మాట్లాడాడు.

అతనిప్పుడు “ఎక్కడికి పోతున్నావు?” అని అడిగి సమాధానం కోసం ఆగకుండానే, “ఇప్పుడే సంతనుంచి వస్తున్నానోయ్; అభినందించు, నన్ను దోచేశారు. నమ్ముతావో లేదోగాని ఇంత నిలువుదోపిడీ నా కెన్నడూ జరగలేదు, నేనిక్కడికి బాడుగ గురాలతో వచ్చానంటే నమ్ము. వాటిని ఒకసారి చూడు!” అన్నాడు.

ఇలా అంటూ అతను చిచీకవ్ తలను కిటికీవైపు వంచేసరికి కిటికీ చట్రం కొట్టుకున్నంత పని అయింది.

“ఆ గుర్రపు తట్లను చూశావా? దిక్కుమాలినవి, ఇక్కడికి పాకి వచ్చాయనుకో. నేను అతని బండిలో ఎక్కవలసి వచ్చింది.”

ఈ మాట అంటూ నజ్‌ద్ర్యోవ్ తన అనుచరుణ్ణి చూపాడు.

“మీ ఇద్దరికీ పరిచయం అయిందా ఏం? మా బావ, మిఝాయెవ్! ఉదయమల్లా నీసంగతే మాట్లాడుకున్నాం. మనకు చిచీకవ్ కనిపిస్తాడు, అన్నాను. ఏమోయ్ నన్ను ఎలా గొరిగారో నీకెలా తెలుస్తుంది! ఏమనుకున్నావో, నా నాలుగు గుర్రాలనూ పోగొట్టుకోవడమే కాక సమస్తమూ ఒడ్డేశాను. చూడు నా గడియారమూ గొలుసూ కూడా పోయాయి.”

చిచీకవ్ అతనికేసి చూసి గడియారమూ, గొలుసూ లేకపోవడం గమనించాడు. అతని పుస్తీలలో కూడా ఒకటి రెండో దాని కన్న కొంచెం తరిగిపోయినట్టుగా అనుమానం వేసింది.

“నా దగ్గర ఇంకొక్క ఇరవై రూబుళ్ళుంటేనా! ఇరవై రూబుళ్ళే ఉంటే పోయినదంతా గెలిచేసుకునేవాణ్ణే. నాది గెలిచేసుకోవటమేమిటి, ముప్ఫైవేలు జేబులో పెట్టేసుకుని ఉందును, ఒట్టు” అన్నాడు నజ్‌ద్ర్యోవ్.

“అప్పుడు ఇలాగే అన్నావు. యాభై రూబుళ్ళిస్తే అది కాస్తా పోగొట్టుకున్నావు.” అన్నాడు పొడుగాటివాడు.

“అది పోవలసింది కాదు, నిజానికి. ఆ వెధవపని చెయ్యకపోతే పోయి ఉండవు. ఆ దిక్కుమాలిన ఏడుపైన పందాలు రెట్టింపయినాక కూడా నేను రెండింతలు కాయకుండా ఉంటే, బ్యాంకును దివాలా తీయించి ఉందును.”

“దివాలా తీయించలేదుగా” అన్నాడు పొడుగువాడు.

“దివాలా తీయించలేదంటే మరి, కూడని సమయంలో ఏడు మీద రెట్టింపు కాశాను. మీ మేజరు గొప్ప ఆటగాడనుకున్నావు గామాలు!”

“ఆటగాడో కాదో నిన్ను గెలిచాడూ!”

“అదోలెక్కా? అతన్ని గెలుస్తానుండు. పందెం రెట్టించడూ, అప్పుడు చెబుతాను ఆయన సంగతి. ఆయన ఏపాటి ఆటగాడో అప్పుడు తెలుస్తుంది. కాని మొదటిరోజు ఎంత బాగుందనుకున్నావు, చిచీకవ్ మిత్రమా! సంత చాల అద్భుతంగా ఉందిలే. అంతజనం ఎన్నడూ రాలేదని వర్తకులే అన్నారు. నేను గ్రామం నుంచి తెచ్చిన సరుకంతా భలే ధరకు అమ్ముడయింది. అబ్బాయ్, ఎంత వేడుకనుకున్నావ్! ఇప్పుడు కూడా తలుచుకుంటే… తస్సదియ్య. నువుకూడా ఉండవలసింది! ఏమిటనుకున్నావ్, పట్నానికి రెండు మైళ్ళలో అశ్వదళం విడిసి ఉంది. దాని తాలూకు నలభైమంది ఆఫీసర్లూ, ఒక్కడు బీరుపోకుండా, పట్నంలోనే ఉన్నారంటే నమ్ము. ఇక తాగాం చూసుకో… స్టాఫ్ కాప్టెన్ పత్స్యేలుయెవ్… భలేమనిషి… భలే పుస్తీలోయ్! అతను బోర్దో (ద్రాక్ష సారాయి) అనటానికి బర్దాష్క అంటాడు. వెయిటర్ కొంచెం బర్దాష్క పట్టుకురా అంటాడు. లెఫ్టినెంట్ కువ్షిన్నికోవ్… ఆహా ఎంత మంచివాడోయ్! అంతసేపూ మేమిద్దరమే కలిసే ఉన్నాం. పనోమరెవ్ మాకు ఎంతమంచి ద్రాక్ష సారా ఇచ్చాడనుకున్నావ్! భలే మోసగాడు తెలుసా? వాడి దుకాణంలో ఏమీ కొనగూడదు. వాడు ద్రాక్షసారాలో మంచి గంధం చెక్కా, బిరడాచెక్క నుసీ వేస్తాడు, పళ్ళరంగు కూడా కలుపుతాడు, ఛండాలుడు. కాని, వాళ్ళకు స్పెషల్ గది ఒకటున్నది. అందులోనుంచి ఒక ప్రత్యేకమైన సీసా తెచ్చాడో, స్వర్గానికి బెత్తెడులో ఉన్నామన్నమాటే. షాంపేన్ తాగాం… దానిముందు గవర్నరెందుకు?- పళ్ళనుంచి తీసిన సారావతు. ఉత్త క్లికో షాంపేను కాదు, క్లికో – మత్రాదురా, అంటే క్లికోకు రెండింతలన్నమాట. ఫ్రెంచి ద్రాక్ష సారా కూడా తెచ్చాడు. దానిపేరు బాన్-బాన్. మంచి వాసన- గులాబీల వాసనా, ఇంకా అన్ని వాసనలున్నూ. భలే సరదాగా ఉందిలే. మా తరవాత వచ్చిన ఒక జమీందారు షాంపేన్ కావాలని దుకాణానికి మనిషిని పంపాడు. ఊరంతా గాలించినా ఒక్క బుడ్డీ లేదు. సైన్యానికి చెందిన ఆఫీసర్లు అంతా తాగేశారు. నేనొక్కణ్ణే భోజనాల దగ్గర పదిహేడు బుడ్లు తాగేశాను తెలుసా?”

అతనితో కలిసి దాదాపు డాన్సు పార్టీలన్నిటికీ వెళ్ళాం. ఒక అమ్మాయి డ్రెస్సు వేసుకున్నది చూసుకో; కుచ్చులూ, కూర్పులూ ఇంకేమేమిటో ఉన్నాయి. నేను చూసి తస్సదియ్యా!” అనుకున్నాను. కువ్షిన్నికోవ్ మటుకు, గడుసువెధవ;

“చాల్లే, పదిహేడు బుడ్లు తాగటం నీ తరం కాదు”? అన్నాడు పొడుగువాడు.
“నిజంగా తాగానంటే!”
“ఏమన్నా అనుగాక, పదిబుడ్లు కూడా తాగలేవని నేనంటాను”
“పందెం ఏమైనా వేస్తావా?”
“దేన్ని పందెం వెయ్యమన్నావు?”
“పట్నంలో కొన్న తుపాకీ పందెం వెయ్యి”
“వెయ్యను”
“కాస్త వేద్దూ”
“నా కిష్టం లేదు”
“పందెం వేశావో తుపాకీ కాస్తా పోతుంది, నీ టోపీ పోయినట్టే. చిచీకవ్ మిత్రమా, నువ్వక్కడ లేకపోతివికదా! లెఫ్టినెంట్ కువ్షిన్నికోవ్‌ను వదిలిపెట్టి ఉండే వాడివి కావని చెప్పగలను. మీ కిద్దరికీ అంత బాగా అతికిపొయ్యేది. అతను పబ్లిక్ ప్రాసిక్యూటరు లాగానూ, పట్నంలో ఉన్న ఇతర పిసినార్ల లాగానూ ఠోలీ ఖర్చయినప్పుడల్లా గజగజలాడే రకం కాదు. ఏ ఆట ఆడదామన్నా అతను సిద్ధమే. అయ్యో, చిచీకవ్! నువ్వు వచ్చి ఉండకూడదూ? పంది లాగా ఎందుకు రాకపోవాలీ, పశువుల వ్యాపారీ! ఒక్క ముద్దుపెట్టు బంగారు నాయనా, నువ్వంటే నాకెంత ఇష్టం! మిఝాయెవ్, అదృష్టం మమ్మల్ని ఒకచోటికి తీసుకువచ్చింది చూసుకో! నిజానికి అతనెవరు, నేనెవర్ని? ఎక్కణ్ణుంచో వచ్చినవాడు అతను; ఇక్కడ ఉంటున్నవాణ్ణి నేను… అన్నట్టు, ఏమోయ్! ఎన్ని బళ్ళనుకున్నావ్? నేను జూదమాడి రెండు పొమేడ్ బుడ్లూ, ఒక పింగాణీ కప్పూ, ఒక గిటారూ గెలుచుకున్నాను. మళ్ళీ ఆడేసరికి, ఆరు రూబుళ్ళకు పైగా పోయాయి. దాందుంపతెగ! ఆ కువ్షిన్నికోవ్ ఏం రసికుడనుకున్నావు. అతనితో కలిసి దాదాపు డాన్సు పార్టీలన్నిటికీ వెళ్ళాం. ఒక అమ్మాయి డ్రెస్సు వేసుకున్నది చూసుకో; కుచ్చులూ, కూర్పులూ ఇంకేమేమిటో ఉన్నాయి. నేను చూసి తస్సదియ్యా!” అనుకున్నాను. కువ్షిన్నికోవ్ మటుకు, గడుసువెధవ; ఆమె పక్కన చేరి ఫ్రెంచిలో ఆమెను తెగ మెచ్చుకున్నాడు… వాడు పనిపాట్లు చేసుకునే ఆడవాళ్ళను మాత్రం ఊరికే పోనిచ్చాడనుకున్నావా? అదంతా పువ్వులేరటంట, మంచి మంచి చేపలూ, ఎండు స్టర్జిన్ చేపలూ అమ్మాయి. ఒకటి కొన్నాను కూడాను. ఇంకా నయం, డబ్బుండగానే కొనబుద్ధి పుట్టింది. ఇంతకూ నీ ప్రయాణం ఎక్కడికీ?”

“ఎవరినో చూడబోతున్నాను” అన్నాడు చిచీకవ్.
“ఎవరినో చూడకపోతే ఏం ముణిగిపోయింది? నాతో మా ఇంటికి వచ్చెయ్యి”
“ఎలా రాను? నాకు పని ఉన్నది”
“ఓయబ్బ పనిట! ఇంకేం లేదూ? కుంకుడుకాయ నురుగు ఇవానిచ్ గాడా?”
“నాకు నిజంగా పని ఉన్నది; అవసరమైనది కూడానూ”
“అబద్ధమాడుతున్నావు, పందెం! నువు చూడబోతున్నది ఎవరినో చెప్పు చూస్తాం!”
“సబాకవిచ్ ని”
ఈ మాట వినగానే నజ్‌ద్ర్యోవ్ పెద్దపెట్టున నవ్వసాగాడు. మంచి ఆరోగ్యం కలవాడే అంత బలంగా నవ్వగలడు. ఆ నవ్వుకు పళ్ళన్నీ బయటపడి, దవడలు ఆడిపోతాయి. ఆ నవ్వుకు మూడు గదుల అవతల నిద్రపోతున్నవాడు కాస్తా అదిరిపడి లేచి, కళ్ళు పెద్దవి చేసి “ఇంకేం? మంచి ఊపులో ఉన్నాడు!” అనుకుంటాడు.

ఈ నవ్వు చిచీకవ్ ను కంగారు పెట్టింది. “ఇందులో నవ్వటానికేముందీ?” అన్నాడతను.

-కొడవటిగంటి కుటుంబరావు

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.