Monthly Archives: November 2007

మందిమన్నియమ్ -1

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/) “మందిమన్నియం ” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది మొదటిది: … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

గడి నింపితే బహుమతి!

ఈసారి వికీ శీర్షికలో రవి వైజాసత్య వికీపీడియాతోబాటే వికీ సాఫ్టువేరుపై ఆధారపడి పనిచేసే ఇతర వికీమీడియా ప్రాజెక్టులైన విక్షనరీ, వికీసోర్స్, వికీవ్యాఖ్య (wikiquote), వికీబుక్స్ ల గురించి వివరిస్తున్నారు. ఈనెల గడికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఈ గడిని కూర్చినది భైరవభట్ల కామేశ్వరరావు గారు కావడం ఒక విశేషమైతే ఈ గడిని తప్పుల్లేకుండా పూరించినవారికి ఒక బహుమతిని … Continue reading

Posted in ఇతరత్రా | 1 Comment

అక్టోబరు గడి సమాధానాలు

అక్టోబరు గడి – వివరణలు:

అక్టోబరు గడికి సమాధానాలు పంపినవారు:

ఒక తప్పుతో: భైరవభట్ల కామేశ్వరరావు, కొత్తపాళీ, శ్రీరామ్.

నాలుగు తప్పులతో: జిజ్ఞాసి.

అందరికీ అభినందనలు!

సంపాదకీయంలో పేర్కొన్నట్లే ఈ నెల (నవంబర్) గడికి గడువు (భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 7వ తేదీ రాత్రి 12 గంటలు) లోపల సరైన సమాధానాలు పంపిన వారిలో ఒకరికి 500 రూపాయలు విలువచేసే పుస్తకం ఒకటి AVKF ద్వారా పంపిస్తాం. ఒకరికంటే ఎక్కువమంది సరైన సమాధానాలు పంపినట్లైతే బహుతి విజేతను లాటరీ ద్వారా నిర్ణయిస్తాం. పొద్దు పత్రిక నిర్వాహకులు, గడి కూర్పరి, వారి కుటుంబసభ్యులు బహుమతికి పరిగణించబడరు.

బహుమతి విజేత పుస్తకాన్ని అందుకున్న నాటినుంచి నెలరోజుల లోపల ఆ పుస్తకంపై సమీక్షరాసి పొద్దుకు పంపవలసి ఉంటుంది. Continue reading

Posted in గడి | Tagged | 3 Comments

నవంబరు గడిపై మీమాట

నవంబరు గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. అక్టోబరు గడి, సమాధానాలు 2. ఆగష్టు గడి, సమాధానాలు 3. జూలై గడి, సమాధానాలు 4. జూన్ గడి, సమాధానాలు 5. మే గడి, సమాధానాలు 6. ఏప్రిల్ గడి, సమాధానాలు 7. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 1 Comment

అక్టోబరులో వికీ ప్రాజెక్టుల ప్రగతి

[రవి వైజాసత్య] గత సంచికలో తెలుగు వికీపీడియాలోని అంతర్గత ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నాం. ఈ సంచికలో వికీపీడియా కాకుండా వికీ సాఫ్టువేరుపై ఆధారపడి పనిచేసే ఇతర వికీమీడియా ప్రాజెక్టులను గురించి తెలుసుకుందాం. తెలుగులో వికీపీడియా కాకుండా ఇంకా నాలుగు వికీ ఆధారిత ప్రాజెక్టులున్నాయి. ఇవి వికీపీడియా అంతగా ప్రాచుర్యం పొందకపోయినా తెలుగులో వికీపీడియా కంటే ముందే … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 3 Comments

రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు!!

పొద్దు పాఠకులందరికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. పొద్దులో ప్రారంభసంచిక నుంచి మూడు నెలలపాటు సినిమా శీర్షిక నిర్వహించిన సుగాత్రి ఈ నెల అతిథి. అతిథి వ్యాసంతోబాటు చందుపట్ల శ్రీధర్ గారి కార్పొరేట్ ఆ(కా)సుపత్రి కవిత కూడా అందిస్తున్నాం. ఈ నెల రచనలు: కౌంతేయులు (అతిథి) కార్పొరేట్ ఆ(కా)సుపత్రి! (కవిత) మరిన్ని విశేషాలు త్వరలో… … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు!!

కౌంతేయులు

-సుగాత్రి రామాయణంలోని పాత్రలతో పోలిస్తే మహాభారతంలోని పాత్రలు మరింత సంక్లిష్టమైనవి. అయినప్పటికీ అవే మనకు వాస్తవికంగా, సహజంగా, ఇప్పటి పరిస్థితులకు తగినవిగా తోస్తాయి. ఎందుకంటే రామాయణం ఏ పుణ్యకాలంలోనో నివసించిన ఆదర్శప్రాయమైన వ్యక్తులు, వారి జీవితాలను వర్ణిస్తే, మహాభారతం ఒక సంధికాలంలో ధర్మానికీ-అధర్మానికీ మధ్య గుంజాటనపడిన వ్యక్తుల గురించి వివరిస్తుంది. ఆ సంధికాలంలోని పరిస్థితులే కొంచెం … Continue reading

Posted in వ్యాసం | Tagged | 13 Comments

కార్పొరేట్ ఆ(కా)సుపత్రి!

-చందుపట్ల శ్రీధర్ ఆగండి! ఈ ఆవరణలో జాగ్రత్తగా అడుగులు వేయండి. భళ్ళుమని మృత్యు ఘోషలన్నీ అసరిగమల్తో మీ మీద దాడి చేస్తాయి. ఎవరెవరో ఈ గోడల్లోంచి గుండెలు బాదుకుంటున్నారు. ముక్కు మూసుకోండి. ఈ తెల్లని గోడల్లోంచి చావు కంపు కొడుతోంది. డాక్టర్లు చావు కబుర్లని మెళ్ళో వేసుకుని అటూ ఇటూ పరిగెడుతున్నారు. యిటు జరగండి. స్ట్రెచర్లోంచి … Continue reading

Posted in కవిత్వం | 5 Comments