Monthly Archives: November 2007

ఆంద్రె బాజిన్, మందిమన్నియమ్ -2, కవితలు

ప్రసిద్ధ సినిమా విశ్లేషకుడు ఆంద్రె బాజిన్ గురించి వెంకట్ సిద్ధారెడ్డి గారు తెలియజేస్తున్నారు. తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారి పుస్తకం లోని భాగం, “మందిమన్నియమ్-2” కూడా సమర్పిస్తున్నాం. అలాగే అసూర్యంపశ్య గారి కవిత, కల, కొత్త ఝాన్సీ లక్ష్మి గారి కవిత, పాట ను కూడా సమర్పిస్తున్నాం. మధురాంతకం రాజారామ్ రచనల సమీక్ష త్వరలో మీకందించబోతున్నాం. … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on ఆంద్రె బాజిన్, మందిమన్నియమ్ -2, కవితలు

కల

కనులు మూస్తే – చుట్టూ వెలుతురున్నా నన్నలుముకున్న చీకటి నా చీకట్లోనే ఎన్నో వెలుగులూ ఆ నలుపు లోనే ఎన్నో రంగులు! కళ్ళు తెరిస్తే – ఆ రంగులకీ, వెలుగులకీ చీకటి! నాకు మిగిలినవి కలిగిన కలల అస్థిపంజరాలు! -అసూర్యంపశ్య “ఆధునిక తెలుగు సాహిత్యపు లోతులను తరచి చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు నెటిజెన్ ని” … Continue reading

Posted in కవిత్వం | 6 Comments

ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం

–వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in) ప్రపంచంలోని అత్యుత్తమ సినీ విశ్లేషకుల్లో Andre Bazin పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సు దేశంలో 1918లో జన్మించిన Bazin ఆఖరి శ్వాస వదిలే వరకూ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసాడు. ఒక్క సినిమా అయినా తియ్యకుండానే, కేవలం తన రాతల ద్వారా ఒక సినీ ఉద్యమానికే కారకుడయ్యాడీయన. ఈయన స్థాపించిన … Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

పాట

-ఝాన్సీలక్ష్మి కొత్త ఎక్కడో దూరాన గంధర్వ గానంలా శింజినీరవంలా అందెలరవళిలా ఓ పాట ఉదయాలు దాటుకుని హృదయాలు దోచుకొని ఆది నాదంలా అనంత కావ్యంలా సాగుతూ ఈ పాట పడవ సరంగుల తెరచాప వాలులో పల్లకీ బోయీల పదగమనం లో రోలు రోకళ్ల దంపుళ్ల లో కూలి పడుచుల గొంతుల లో కొనసాగే ఈ పాట … Continue reading

Posted in కవిత్వం | 6 Comments

మందిమన్నియమ్ -2

-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/) “మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది రెండోది: సూత్రము … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

మందిమన్నియమ్ ప్రారంభం

ప్రజాస్వామ్యంలోని గుణదోషాలను చర్చిస్తూ ప్రముఖ తెలుగు బ్లాగరి తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన గ్రంథం “మందిమన్నియమ్” లోని ఆరవ ప్రకరణం ఇప్పటికే తెలుగు నెజ్జనుల్లో కొందరు చదివారు. ఆ గ్రంథంలోని అంశాలపై విస్తృత చర్చ జరగడానికి వీలుగా దాన్ని మరింత మందికి అందుబాటులోకి తేవడానికి పొద్దు సంకల్పించింది. నేటి నుంచి ఆ గ్రంథంలోని ప్రకరణాలతో, … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on మందిమన్నియమ్ ప్రారంభం

కథానిలయం

-వివిన మూర్తి మనకు గ్రంధాలయ ఉద్యమాలు వచ్చాయి. అవి అనేక ఊళ్లలో గ్రంధాలయాలు తెచ్చాయి. ప్రభుత్వాలు సైతం పౌరుల గ్రంధపఠనం వారి అక్షరాస్యత, విద్యావ్యాప్తిలలో భాగంగా భావించి గ్రంధాలయాలకు నిధులు కేటాయించాయి. అవి గ్రంధ సేకరణ, భద్రతలకు ప్రయత్నించాయి. స్వచ్ఛంద సంస్థలు నడుం కట్టాయి. దాతలు విరాళాలు అందించారు. ఈ గ్రంధాలయాలు ఆరంభ లక్ష్యాలను చాలావరకు … Continue reading

Posted in వ్యాసం | 3 Comments

మృతజీవులు – 10

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 10

విశ్వంలో మనిషి స్థానం

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ మనిషిని ప్రపంచంలో అత్యున్నతజాతికి చెందిన ప్రాణిగా భావిస్తారు. తక్కిన ప్రాణుల్లో కొన్ని “ఉన్నతమైనవీ”, కొన్ని తక్కువజాతివీ అనే భావన ఉంది. నిజానికి ఈ హెచ్చుతగ్గులకు ఆధారా లున్నాయని చెప్పలేము. ఎందుకంటే పోల్చటానికి మన భూగ్రహంమీద తప్ప మరెక్కడా ప్రాణులున్న దాఖలాలే లేవు. తాత్వికధోరణిని అవలంబిస్తామనుకునేవాళ్ళు సామాన్యంగా ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఏ … Continue reading

Posted in వ్యాసం | 9 Comments

మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు

బ్లాగులపై సమీక్షలు చూసాం. కాని బ్లాగును సమీక్షిస్తూ బ్లాగరికి మరో బ్లాగరి రాసిన లేఖ చూసామా? ఇదిగో చూడండి.. ప్రముఖ బ్లాగరి రాధిక, “స్నేహమా” పేరిట గల తన బ్లాగులో (http://snehama.blogspot.com) కవితలు రాస్తూ ఉంటారు. ఆ కవితలకు స్పందించిన మరో ప్రముఖ బ్లాగరి, కవి జాన్ హైడ్ కనుమూరి, కవయిత్రికి రాసిన ఆత్మీయ లేఖ … Continue reading

Posted in వ్యాసం | 9 Comments