గడి నింపితే బహుమతి!

ఈసారి వికీ శీర్షికలో రవి వైజాసత్య వికీపీడియాతోబాటే వికీ సాఫ్టువేరుపై ఆధారపడి పనిచేసే ఇతర వికీమీడియా ప్రాజెక్టులైన విక్షనరీ, వికీసోర్స్, వికీవ్యాఖ్య (wikiquote), వికీబుక్స్ ల గురించి వివరిస్తున్నారు.

ఈనెల గడికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఈ గడిని కూర్చినది భైరవభట్ల కామేశ్వరరావు గారు కావడం ఒక విశేషమైతే ఈ గడిని తప్పుల్లేకుండా పూరించినవారికి ఒక బహుమతిని ఇవ్వాలని నిశ్చయించడం ఇంకొక విశేషం. గడువు (భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 6వ తేదీ రాత్రి 12 గంటలు) లోపల సరైన సమాధానాలు పంపిన వారిలో ఒకరికి 500 రూపాయలు విలువచేసే పుస్తకం ఒకటి AVKF ద్వారా పంపిస్తాం. ఒకరికంటే ఎక్కువ మంది సరైన సమాధానాలు పంపినట్లైతే బహుమతి విజేతను లాటరీ ద్వారా నిర్ణయిస్తాం. పొద్దు పత్రిక నిర్వాహకులు, గడి కూర్పరి, వారి కుటుంబసభ్యులు బహుమతికి పరిగణించబడరు.

షరా: బహుమతి విజేత పుస్తకాన్ని అందుకున్న నాటినుంచి నెలరోజుల లోపల ఆ పుస్తకంపై సమీక్ష రాసి, పొద్దుకు పంపవలసి ఉంటుంది.

ఈ నెల రచనలు:

అక్టోబరులో వికీ ప్రాజెక్టుల ప్రగతి
అక్టోబరు గడి సమాధానాలు
నవంబరు గడిపై మీమాట
కౌంతేయులు (అతిథి)
కార్పొరేట్ ఆ(కా)సుపత్రి! (కవిత)

మరిన్ని విశేషాలు త్వరలో…

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.

One Response to గడి నింపితే బహుమతి!

  1. బహుమతి గా పుస్తకంగా ఇవ్వడమే కాక, గెల్చిన వాళ్ళు ఆపుస్తకంపై సమీక్ష వ్రాసి పొద్దుకు పంపాలనడం వినూత్నఆలోచన. బాగుంది.

Comments are closed.