Monthly Archives: July 2007

నార్మన్ బోర్లాగ్, మంచి సినిమా, మృతజీవులు

హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ కు అమెరికా ప్రభుత్వం కాంగ్రెషనల్ బంగారుపతకం ఇచ్చిన సందర్భంగా బోర్లాగ్ పై వ్యవసాయార్థికరంగ ఆచార్యులు ప్రొఫెసర్ సత్యసాయి కొవ్వలి గారి ప్రత్యేక వ్యాసం “అన్నదాత బోర్లాగ్” అందిస్తున్నాం. సినిమా శీర్షికలో వెంకట్ గారు సినిమాలకు సంబంధించి ఎడిటింగ్, స్టేజింగ్ లాంటి సాంకేతిక అంశాలను అర్థవంతంగా, సమర్థవంతంగా ఉపయోగించుకున్న ప్రపంచ ప్రసిద్ధి … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on నార్మన్ బోర్లాగ్, మంచి సినిమా, మృతజీవులు

మంచి సినిమా

–వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in) సినిమా అంటే ఏంటి ? • దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? • ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా? • మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా? సినిమా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 9 Comments

అన్నదాత బోర్లాగ్

– సత్యసాయి కొవ్వలి (http://satyasodhana.blogspot.com/) “Norman Borlaug is the living embodiment of the human quest for a hunger free world. His life is his message.” – Professor M. S. Swaminathan, M.S. Swaminathan Research Foundation (India) అన్నం తినేటప్పుడు ఆ అన్నం మీ కంచంలోకి … Continue reading

Posted in వ్యాసం | 2 Comments

మృతజీవులు – 3

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | 1 Comment

TMAD, ఎర్రకోట, నవీన్, గడి

చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు…… ఏమిటో ఈ నెల అతిథి ఉప్పలపాటి ప్రశాంతి వివరిస్తున్నారు. వి.బి.సౌమ్య అంపశయ్య నవీన్ రచనల గురించి “నేను … Continue reading

Posted in ఇతరత్రా | 1 Comment

తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు

[రవి వైజాసత్య] (ఈ వ్యాసంలో నేను చేసిన వ్యాఖ్యలు, వ్యక్తపరచిన అభిప్రాయాలు, కేవలం తెలుగు వికీలో గత రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవముతో నేను గ్రహించినవి మాత్రమే. వీటికి వికీపీడియా కానీ, వికీమీడియా సంస్థ కానీ, పొద్దు పత్రిక కానీ ఎటువంటి బాధ్యతా వహించదు. – రవి వైజాసత్య) వికీపీడియా ఒక ప్రజా విజ్ఞాన సర్వస్వం. … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 5 Comments

సారంగపాణికి సామెతల సుమ మాల

[వలబోజు జ్యోతి] ————————————– ఆ తిరుమల వేంకటేశ్వరుడికి రోజూ పూలతో అలంకరించుకుని కాస్త విసుగెత్తిందేమో ..మనం సాహిత్యాభిషేకం చేద్దామా! తలా రెండు సామెతల సంపెంగలో, సన్నజాజులో సమర్పించండి. మాల చేసి స్వామిని అలంకరిద్దాం! -వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com) ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 1000 పైచిలుకు టపాలు రాసి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 16 Comments

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా – 2

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net) (ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఒకటవ తేదీన ప్రచురించబడింది.) వెనుకబాటుతనం – లోపం ఎక్కడుంది? ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో సామాజికాంశాల మీద తరాల తరబడి కృషి చేస్తున్నా ఆశించదగ్గ స్థాయిలో పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావడం లేదు? ఒక ఊరిని తీసుకుంటే, … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

మృతజీవులు – 2

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 2

నేను చదివిన నవీన్

-వి.బి.సౌమ్య (http://vbsowmya.wordpress.com) ఆధునిక తెలుగు సాహిత్యం లో నవీన్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ” అంపశయ్య ” తో మొదలై ఇప్పటికీ సాగుతూ నవల , కథ , విమర్శ ఇలా వేర్వేరు పాయలు గా చీలినా ఒకటే అంతరాత్మ తో ఇంకా గలగలమంటూ ప్రవహిస్తున్న నది నవీన్. నేను సాహిత్యం, అందునా … Continue reading

Posted in వ్యాసం | 3 Comments