Tag Archives: పద్యం
సంక్రాంతి శుభాకాంక్షలు
చిరుచలి గిలిగింతలు పెట్టే ధనుర్మాసపు ఉదయాన నీరెండలకు మంచుతెరలు కరిగిపోతుండగా ఆవిష్కృతమయ్యే సుందర దృశ్యాల నేపథ్యంలో సంక్రాంతిని ఉత్పలమాలలతో స్వాగతిస్తున్నారు శ్రీమతి పింగళి మోహిని. Continue reading
ఉపజాతి పద్యాలు – ౪
కందం — ముక్కు శ్రీరాఘవకిరణ్ మూడు ముఖ్యమైన ఉపజాతులు నేర్చుకున్నా మిప్పటి వరకూ, జాతులలో ముఖ్యమైన కందాన్ని నేర్చుకుందా మీ సారి. మామూలు మాటలు కూడా కందాల్లోనే చెప్తే బాగుంటుందేమోనని అనిపించేంతటి[1] నా కందానుబంధం ఈ వ్యాసపాఠానికి ఊపిరి పోయగలదని ఆశపడుతున్నాను. కందపద్యలక్షణం 1. కందపద్యాల్లో కేవలం చతుర్మాత్రా గణాలు మాత్రమే వాడుతారు. అంటే (ముందు … Continue reading
విజయదశమి పద్యకవితా సమ్మేళనం – చివరిభాగం
– రానారె [గతభాగం] {రాయలు}: భట్టుమూర్తీ, మీకో చక్కని చిక్కని సన్నివేశం చెబుతా {భట్టుమూర్తి} చెప్పండి ప్రభూ {రాయలు}: ఒక అయిదేళ్ళ పిల్లవాడు. వాళ్ళింటి పెరట్లో చెట్టు మీద పక్షి ఒకటి గూడు పెట్టింది. ఒకరోజు వీడు నిద్ర లేచేప్పటికి ఆ గూట్లోంచి రాత్రి పొదిగి బయటికొచ్చిన పిల్లల కీచు గొంతులు వినిపిస్తున్నై. ఆ సన్నివేశాన్ని … Continue reading
విజయదశమి పద్య కవితా సమ్మేళనం – రెండవ భాగం
[మొదటిభాగం] {రాయలు}: పెద్దన కవీంద్రా, అలనాడు వరూధిని ప్రేమ నివేదనని ఛాందసుడైన ప్రవరుడు నిరాకరించినట్లు చిత్రించారు. {పెద్దన} చెప్పండి రాయా! {రమణి}: ఆనతివ్వండి అనాలి పెద్దనగారూ. {పెద్దన} రమణిగారు, కవులు నిరంకుశులండీ! {రమణి}: పెద్దన గారు: హ హ నిజమే {రాయలు}: మా కోరిక చిత్తగించండి … వెండి కొండమీద శివుడు ధ్యానమగ్నుడై యున్నాడు. ఎదుట … Continue reading
అభినవ భువనవిజయ దశమి
గడచిన ఉగాది సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనానికి రసజ్ఞులు మాకందించిన ప్రోత్సాహంతో ఈ విజయదశమి నాడు మరో రసవత్తరమైన కవిసమ్మేళన అంతర్జాలసభా విశేషాలను విజయవంతంగా మీకు సమర్పిచ గలుగుతున్నందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం. Continue reading
ఉపజాతి పద్యాలు – ౩
సీసము –ముక్కు శ్రీరాఘవకిరణ్ సీసపద్యం ఉపజాతులో దొడ్డది, ముఖ్యమైనది, అందమైనది, గంభీరమైనది. శతకాలని ప్రక్కన పెడితే అసలు అసంఖ్యాకంగా సీసపద్యాల్లేని కావ్యమే లేదంటే అతిశయోక్తి కాదేమో. మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ గనకాంబర ప్రభఁ గ్రందుకొనఁగఁ … Continue reading
ఉపజాతి పద్యాలు – ౨
తేటగీతి — ముక్కు శ్రీరాఘవకిరణ్ మొన్నటి వ్యాసంలో ఆటవెలదులు ఎలా వ్రాయాలో చర్చించుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఆటవెలదుల్లోనే మాట్లాడుకుంటూ చర్చని కొనసాగిద్దామా? పూర్తిగా పద్యాల్లోనే ఎందుకు… నాకు గద్యం కూడా తెలుసంటారా? గద్యం కూడా వాడదాం.
ఉపజాతి పద్యాలు – ౧
ఆటవెలది — ముక్కు శ్రీరాఘవకిరణ్ నిరుడు నన్ను నేను పరిచయం చేసుకున్నాను కదా. పద్యరచనపై ప్రస్తుత వ్యాసం క్రొత్తగా వ్రాస్తున్నవారి మార్గాన్ని కొంతైనా కంటకరహితం చేసేలా, లోగడ ప్రయత్నించి విరమించినవారికి తిరిగి ప్రయత్నించడానికి తగినంత ఊతమిచ్చేలా ఉంటుందని ఆకాంక్షిస్తూ… మొదటే ఒక ముఖ్య ప్రకటన. నేను కేవలం పద్యాల గురించే చెప్పదలుచుకున్నానీ వ్యాసంలో. కాబట్టి వ్యాకరణశాస్త్రాన్నీ … Continue reading
అభినవ భువనవిజయము -9- సర్వధారికి సుస్వాగతము
(<< గత భాగము) ‹కొత్తపాళీ› విశ్వామిత్రా .. కొత్త సంవత్సరానికి స్వాగత పద్యం ఏమన్నా చెబుతారా? * రాఘవ సాహిత్యంలో చేరారు ‹విశ్వామిత్ర› చిత్తగించండి సీ. తెలుగింట తొలినాడు పలు రుచులను కల- గలపు పచ్చడందు పులుపు నాది! వనమంత తిరుగాడి తనగొంతు ఎలుగెత్తి బులుపించు పాటకోయిలయు నాది! మదికింపు గలిగించి మరులెన్నొ గురిపించి మన్మధు … Continue reading
అభినవ భువనవిజయము -8- దత్తపది పదకొండు
(<< గత భాగము) ‹కొత్తపాళీ› మరో దత్తపదికి వెళ్లే ముందు… చదువరి, మీరు దీన్నెత్తుకోండి … “మనుజుడై పుట్టి దేవుడు మాయజేసె” ‹చదువరి› తేటగీతి. వెరపు పుట్టించు ట్రాఫికు వెతల దీర్ప మనుజుడై పుట్టి దేవుడు మాయ జేసె భాగ్యనగరాన తన మాయ సాధ్యపడక దారులందు జిక్కి యచటె స్థాణువయ్యె ‹నాగరాజు› చదువరీ – శెభాష్. … Continue reading