Tag Archives: అతిథి

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా

-ప్రశాంతి ఉప్పలపాటి (http://tomakeadifference.net) చిన్నప్పటి నుంచి సంఘసేవ చేయాలని, సమాజానికి మేలు కలిగించే మంచి పనులు చేయాలని ఉన్నా సంకోచాలు, అపోహల వల్ల ఏమీ చేయలేకపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఓ మంచి మార్పు రావడానికి వెనుక గల కథా కమామీషు……ఏమిటో ఆమె మాటల్లోనే: నాకు ప్రతి ఆదివారం ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళాలని ఉండేది. … Continue reading

Posted in వ్యాసం | Tagged | 19 Comments

చరిత్ర, విజ్ఞానశాస్త్రం

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు సంగీతమ్మీద ఆసక్తితో హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని, కర్ణాటక సంగీతాన్ని మథించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలివ్వడమేగాక ఎన్నో ప్రదర్శనలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి (కొడవటిగంటి కుటుంబరావు) గారి వద్దనుంచి వారసత్వంగా వచ్చిన రచనాసక్తితో సైన్సు గురించి, సంగీతం గురించి తెలుగులో సరళమైన రచనలెన్నో చేశారు. కొన్ని పత్రికల్లో శీర్షికలు కూడా నిర్వహించారు. … Continue reading

Posted in వ్యాసం | Tagged | 17 Comments

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం

గమనిక: ఈమాట సంపాదకులు సురేశ్ కొలిచాల గారు రాసిన ఈ వ్యాసం యొక్క మొదటి భాగం అతిథి శీర్షికన ఈ నెల ఏడవ తేదీన ప్రచురించబడింది. —————————— హల్లులలో ప్రయత్న భేదాలు గాలిని నిరోధించడంలో ఉండే ప్రయత్న భేదాలను బట్టి హల్లులను ఇంకా సూక్ష్మంగా విభజించవచ్చు. స్పర్శాలు (stops/plosives): గాలిని క్షణకాలం పూర్తిగా నిరోధించి విడవడం … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 13 Comments

తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం

ఈమాసపు అతిథి సురేశ్ కొలిచాల భాషాశాస్త్రం, చరిత్ర, సాహిత్యాలపై ఆసక్తి ఉన్న సురేశ్ కొలిచాల ఈమాట సంపాదకుడుగా నెట్లో తెలుగువారికి సుపరిచితులే. ఊపిరి సలపని పనులతో తీరికలేకుండా ఉన్నా, పొద్దు అహ్వానాన్ని మన్నించి అడిగినవెంటనే ఈ వ్యాసం రాసి ఇచ్చిన సురేశ్ గారికి కృతజ్ఞతలతో వ్యాసంలోని మొదటిభాగాన్ని సమర్పిస్తున్నాం. ——————- తెలంగాణాలో పుట్టి పెరిగిన నేను … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 23 Comments

ఖైదీ నంబరు 300

విహారి ఈ నెల మా అతిథి – బ్లాగు విహాయస విహారి, దోనిపర్తి భూపతి విహారి. ఈయన బ్లాగు చిక్కటి హాస్యానికి ఓ చక్కటి మజిలీ. కొలరాడో తెలుగు సంఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బుడిబుడి అడుగుల నుండి వడివడి నడకల దాకా తన బ్లాగు ప్రస్థానం ఎలా సాగిందో చెబుతున్నారీ ఆత్మకథా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 18 Comments

నా దృష్టిలో ఈ-తెలుగు సంఘం

తెలుగుబ్లాగర్ల గుంపులో క్రియాశీల సభ్యుడు. లేఖిని మరియు కూడలి సృష్టికర్త మరియు నిర్వాహకుడు. ఇవి రెండూ లేకపోతే చాలామంది తెలుగుబ్లాగరులకు పొద్దు గడవదు. తెలుగువికీపీడియాలో నిర్వాహకుడు, ఆంగ్ల వికీపీడియాలో కూడా సభ్యుడు. ఈ మితభాషి మాటలను పొదుపుగా వాడుతూ e-తెలుగు సంఘం గురించి ఇలా వివరిస్తున్నారు: ————————- ఈ-తెలుగు సంఘం యొక్క ప్రాథమిక ధ్యేయం: కంప్యూటర్లు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 9 Comments

శాస్త్రీయసంగీతం – నేను

PVSS శ్రీహర్ష గత కొన్ని నెలలుగా హైదరాబాదు తెలుగుబ్లాగరుల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్న ఉత్సాహవంతుడు. భాషాభిమానం, సాహిత్యాభిమానం మెండుగా గల శ్రీహర్షకు శాస్త్రీయసంగీతమన్నా, కళలన్నా ప్రత్యేకమైన ఆసక్తి. ఈయన బ్లాగు కిన్నెరసాని – పేరుకు తగినట్లే ఆహ్లాదకరంగా సాగిపోతూ ఉంటుంది. ఈ వ్యాసంలో శాస్త్రీయసంగీతం, కళల పట్ల తనకు ఆసక్తి ఎప్పుడు, ఎలా మొదలైందో వివరిస్తున్నారు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments

అలిగెడె – అమితాబ్ బచ్చన్

రవి వైజాసత్య నెజ్జనులకు సుపరిచితుడే! తెలుగు వికీపీడియాలో అధికారి. భారతీయ భాషలన్నిటి లోకీ తెలుగు వికీపీడియాను ముందు నిలపడంలో కీలక పాత్ర పోషించారు. సాఫ్టువేరు నిపుణుడు కానప్పటికీ ఆసక్తి కొద్దీ నేర్చుకుని, వికీలో కొన్ని మార్పులు చేపట్టారు. ఆయన చురుకైన బ్లాగరి. ఆయన రాసే అమెరికా నుండి ఉత్తరం ముక్క బ్లాగు పాఠకుల అభిమానం పొందింది. … Continue reading

Posted in వ్యాసం | Tagged | 14 Comments

అతిథి

యర్రపురెడ్డి రామనాథరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తెలుగు బ్లాగుల్లో అత్యుత్తమ బ్లాగులను ఎంచవలసి వస్తే మొదటి మూడు స్థానాల్లో యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. తన … Continue reading

Posted in వ్యాసం | Tagged | 5 Comments