Category Archives: వ్యాసం

వైశాఖ పూర్ణిమ

చిలకపలుకులు అంటూ మొదలుపెట్టి, చెత్తకుండీకి ఓ మనసుంటే అని ఆలోచింపచేసి, అంతలోనే అల్లరా-నేనా! అంటూ గొడవ చేసి, శ్రీవారే బదులిస్తే అంటూ మధురోహల్లో ఓలలాడించి, సూసైడ్ నోట్ అంటూ కంగారుపెట్టి…నెలపొడుపుగా ఉన్నా అక్షరాల్ని నిండుపున్నమిగా చేయడమే అంటూ తన ఊసులన్నింటినీ మనకి అందించిన పూర్ణిమకి పరిచయం అనవసరం!! తన గురించిన మరికొన్ని ఊసులు-ఊహలు… Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments

మృచ్ఛకటికం – రూపక పరిచయం

రవి (బ్లాగాడిస్తా) మృచ్ఛకటిక నాటకం భారతీయ నాటకమైనప్పటికీ, నాటకశాస్త్ర లక్షణాలను అక్కడక్కడా ఉల్లంఘిస్తూ వ్రాయబడిందని కవి, విమర్శకుల అభిప్రాయం. ఆ లక్షణమే ఈ నాటకానికి వైవిధ్యతను చేకూర్చింది. “కావ్యేషు నాటకం రమ్యం” అన్నది ఆర్యోక్తి. రూపకం, నాటకం అన్నవి ప్రస్తుత కాలంలో పర్యాయపదాలుగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ, ప్రాచీన కాలంలో రస, వస్తు, నాయకాది భేదాలను బట్టి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 12 Comments

రమాదేవి మళ్ళీ రమ్మంది

-సిముర్గ్ అక్కిరాజు భట్టిప్రోలు మంచి కథకుడుగా తెలుగు సాహితీలోకానికి సుపరిచితులు. ఏడాదికో కథకి మించి రాయకపోవడానికి తన బద్ధకమే కారణమని అంటారుగాని, కథలు రాయడం అంత తేలికకాదని గుర్తెరిగినవారు. అంటుకొమ్మ, నందిని, గేటెడ్ కమ్యూనిటీ కథలతో, మనకున్న కొద్దిమంది సమకాలీన ‘మంచి కథకుల’ లిస్టులో చేరిపోయిన అక్కిరాజు లేటెస్టు కథ “రమాదేవి ఎందుకు రమ్మంది” ఆంధ్రజ్యోతిలో … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

“రమాదేవి ఎందుకు రమ్మంది” – కథ వెనక కథ

“రమాదేవి ఎందుకు రమ్మంది” అనే కథ Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

వికృతి నామ ఉగాది కవి సమ్మేళనాలు

వికృతి నామ సంవత్సరాది సందర్భంగా పొద్దు రెండు కవిసమ్మేళనాలను నిర్వహించింది. ఒకటి వచన కవితా సదస్సు కాగా రెండోది ఛందోబద్ధ పద్యకవిత్వ సదస్సు. పూర్తిగా అంతర్జాల మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులలో కవులు ఎంతో ఆసక్తితో పాల్గొని కవిత్వ ధారలు కురిపించారు. వచన కవుల సమ్మేళనం: వచన కవుల సదస్సును పొద్దు సంపాదకవర్గ సభ్యులు స్వాతి … Continue reading

Posted in వ్యాసం | 7 Comments

శ్రీ రమణీయ చానెల్- రెండవ భాగం

ప్రతి మనిషికీ తను పుట్టి పెరిగిన ఊరు, బాల్యం లోని సంఘటనలు, వ్యక్తులు – వీటన్నిటి ప్రభావం తర్వాతి జీవితం లోని అభిరుచులూ, అలోచనా విధానం పై తప్పక ఉంటుంది. అదీ రచయితల విషయం లో ఐతే ఆ చిన్నతనపు జ్ఞాపకాలు ఎప్పటికీ తరిగిపోని ప్రేరణా, పెన్నిధీ కూడా. అటువంటి తమ పా’తలపోతల్ని’ మనతో కలబోసుకుని … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 14 Comments

శ్రీ రమణీయ చానెల్ – మొదటి భాగం

ఆయన కథలు… శ్రావణ మాసపు నోముల్లో ఆది దంపతులు పోటీలు పడి పంచుకు తిన్న తాలింపు శనగలంత కమ్మగా ఉంటాయి. కవితల్నీ వచనాల్నీ ఆత్మలోకంటా చదివేసి పారడీ చేస్తే అసలు రచయితలు పెన్నులు తడుముకునేలాగుంటాయి. కొంటెగా చమత్కార చమక్ తారల్ని నిశ్శబ్దపు చీకట్ల మీద చల్లితే, నవ్వుల వెన్నెల్ని ఆరబోయించే చెకుముకి పత్రికా ఫీచర్లూ నడిపారాయన. … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 17 Comments

మతాలకు పాలకుల మద్దతు

– కొడవటిగంటి రోహిణీప్రసాద్ నేటి పాశ్చాత్య దేశాల్లోని మతాధిపత్యం కేవలం కొన్ని సామాజిక సమస్యలకు పరిష్కారాలు సూచించడం తప్ప, ఏమీ చెయ్యటంలేదు. పైగా తమ మతాధికారుల్లోనే లైంగికహింసకూ, ఇతర నేరాలకూ పాల్పడేవారు పట్టుబడుతున్న నేపథ్యంలో మింగలేక, కక్కలేక అవస్థలు పడుతోంది. మతవిశ్వాసాలు కలిగినవారికి సామాన్యంగా వాటికి రాజకీయాలతో ప్రమేయం లేదని అనిపిస్తూ ఉంటుంది. స్వతహాగా మంచి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

పిల్లల్లో మానసిక ఒత్తిడి

– తుమ్మల వరూధిని ఒత్తిడి, స్ట్రెస్, ఈ రోజులలో పిన్నల నుండి పెద్దల దాకా అందరిని పట్టి పీడిస్తున్న సమస్య. ఒత్తిడికి ముఖ్యకారణం ఆందోళన. ఈ ఆందోళనకి ముఖ్య కారణం మనం చేయాలనుకునే దానికి, చేసేదానికి మధ్య పొంతన లేకపోవటం. ఏదైనా పని చేసే ముందు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆందోళనకు గురికావడం సహజం. … Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

తడి

-స్వాతీ శ్రీపాద రాయలసీమ ప్రాకృతిక లక్షణం కరవు. ఇక్కడి మనుషుల స్వాభావిక లక్షణం కరకుదనం. ఈ రెండింటి మధ్య గల కార్య కారణ సంబంధం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన “తడి” కథలో స్పష్టమౌతుంది. ఇది కొత్త దుప్పటి కథాసంపుటిలోని ఆరవ కథ. కుటుంబ కలహాలు, తిండి కోసం పాడి పశువుల అవస్థలు, ఎండిపోయి వానకు కుళ్ళి … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 8 Comments