Category Archives: వ్యాసం
మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు
బ్లాగులపై సమీక్షలు చూసాం. కాని బ్లాగును సమీక్షిస్తూ బ్లాగరికి మరో బ్లాగరి రాసిన లేఖ చూసామా? ఇదిగో చూడండి.. ప్రముఖ బ్లాగరి రాధిక, “స్నేహమా” పేరిట గల తన బ్లాగులో (http://snehama.blogspot.com) కవితలు రాస్తూ ఉంటారు. ఆ కవితలకు స్పందించిన మరో ప్రముఖ బ్లాగరి, కవి జాన్ హైడ్ కనుమూరి, కవయిత్రికి రాసిన ఆత్మీయ లేఖ … Continue reading
మందిమన్నియమ్ -1
-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/) “మందిమన్నియం ” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు. ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు. ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది మొదటిది: … Continue reading
కౌంతేయులు
-సుగాత్రి రామాయణంలోని పాత్రలతో పోలిస్తే మహాభారతంలోని పాత్రలు మరింత సంక్లిష్టమైనవి. అయినప్పటికీ అవే మనకు వాస్తవికంగా, సహజంగా, ఇప్పటి పరిస్థితులకు తగినవిగా తోస్తాయి. ఎందుకంటే రామాయణం ఏ పుణ్యకాలంలోనో నివసించిన ఆదర్శప్రాయమైన వ్యక్తులు, వారి జీవితాలను వర్ణిస్తే, మహాభారతం ఒక సంధికాలంలో ధర్మానికీ-అధర్మానికీ మధ్య గుంజాటనపడిన వ్యక్తుల గురించి వివరిస్తుంది. ఆ సంధికాలంలోని పరిస్థితులే కొంచెం … Continue reading
జగజ్జేత ఆనంద్!
-రానారె (http://yarnar.blogspot.com) గతనెలలో మన క్రికెట్ జట్టు 20-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వారం రోజులకే క్రీడాప్రపంచంలో మరో చరిత్రాత్మక సంఘటన జరిగింది. భారతదేశానికే చెందిన క్రీడాకారుడు ఒకరు జగజ్జేతగా నిలవడమేగాక మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆ క్రీడ మనదేశంలో పుట్టి విశ్వవ్యాప్తమైన చదరంగం కాగా ఆ క్రీడాకారుడు… విశ్వనాథన్ ఆనంద్. ఎలాంటి … Continue reading
కుటుంబరావు కథల్లో వాస్తవికత
-శారద సాధారణంగా, ఒక్కొక్క రచయితకీ ఒక్కొక్క ప్రత్యేకతా, తమదైన సంతకంలాంటి శైలీ వుంటాయి. రంగనాయకమ్మ గారి సూటి దనం, మధురాంతకంగారి సున్నితమైన శైలీ, మనకు చదవగానే అదెవరి కథో పట్టి చెప్తాయి. క్రమం తప్పకుండా చదివే పాఠకుడు తన అభిమాన రచయితని పేరు లేకున్నా పోల్చుకోగలడు. ఇరవైయవ శతాబ్దపు నాలుగో దశకంలో ఆరంభమైన సాహిత్య ప్రస్థానంలో … Continue reading
క్రెడిట్ కార్డులు
[సుధాకర్] అప్పిచ్చువాడు, వైద్యుడు…అంటూ ఎప్పుడో చెప్పిన సుమతీ శతక కర్త ఇప్పుడు వుంటే కనక ఆ “అప్పిచ్చువాడు” అనే పదాన్ని పీకి పారేసేవాడు. లేకపోతే “అప్పంటగట్టే వాడు లేని” అని ఒక కొత్త పదాన్ని చేర్చేవాడు. అప్పు చెయ్యటం ఒక బలహీనత, ఒక ఆనందం. తీర్చటం ఒక చేదు అనుభవం, ఒక భారం. ఇది ప్రపంచంలో … Continue reading
నెజ్జనులకు సూచనలు
కొండొకచో ఆ అభివ్యక్తిలో అనుచితమయిన వ్యక్తీకరణలూ, అసంపూర్ణ భావాలూ కూడ వస్తూ ఉండవచ్చును. కాని ఆ అభ్యంతరాలను మించి చూడవలసిన విషయమేమంటే, ఇంతకుముందువరకూ రచన తమకు సంబంధలేని వ్యవహారమని అనుకున్న వర్గాల నుంచి హఠాత్తుగా రచయితలు పుట్టుకొస్తున్నారు. అవి పూర్తి రచనలు కాకపోవచ్చును, కాని రచనా ప్రయత్నాలు. Continue reading
పల్ప్ ఫిక్షన్
–వెంకట్ సిద్దారెడ్డి (http://24fps.co.in) ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం … Continue reading
అక్షర పద్యవిన్యాసాలు
గమనిక: ఈ వ్యాసానికి మూలం ఆచార్య తిరుమల రచించిన “నవ్వుటద్దాలు” పుస్తకంలోని అక్షరాలతో అద్భుతాలు అనే వ్యాసం. ఇక్కడ ఉదహరించిన పద్యాలన్నీ ఆ పుస్తకం నుండి సేకరించినవే. -వలబోజు జ్యోతి (http://vjyothi.wordpress.com) మన సంస్కృతాంధ్ర కవులు మాటలతోనే గాక అక్షరాలతో కూడా అందమైన ఆటలాడుకున్నారు. పద్యాలు, పదాలతో రకరకాల విన్యాసాలు చేసారు. పద్యంలో ఇంకో పద్యం, … Continue reading
రెండుకాళ్ల మీద మానవ ప్రస్థానం
రవాణా సౌకర్యాలు లేని యుగంలో ప్రయాణాలకు పనికొచ్చిన నడక శారీరకంగా ఇప్పటికీ మనకెంతో సహజమైనది. నడక అనేది ఒకప్పుడు మనుగడకు పనికొచ్చిన చర్య. రోజువారీ జీవితాల్లో అదొక భాగంగా ఉండేది. ఈ రోజుల్లో అది తగ్గిపోయి మనుషులు కదలనవసరం లేని జీవితాలకు అలవాటు పడుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనం నడుస్తున్నప్పుడు మెదడుకు ప్రాణవాయువును అందిస్తాం. ఊపిరి తీసే ప్రక్రియ మెరుగవుతుంది. గుండె వేగం హెచ్చుతుంది; మెదడులోని రక్తనాళాలు పెద్దవవుతాయి. శక్తి పెరిగి, వ్యర్థాలు ఎక్కువగా విసర్జించబడతాయి. ఈ రోజుల్లో మనుష్యుల ఆరోగ్యం అవగాహన బాగా మెరుగుపడింది. టెస్ట్‌ట్యూబుల్లో శిశువులు రూపొందే రోజులొచ్చాయి. మనిషి శరీరనిర్మాణం మాత్రం ఆనాటి ప్రత్యేక పరిస్థితుల్లో రూపుదిద్దుకుందనేది మరిచిపోరాదు. Continue reading