Category Archives: కవిత్వం
మందు పాతరల జీవితం
-ద్వీపరాగ మందు పాతరల జీవితం అడుగడుగునా పొంచి ఉన్న మందు పాతరలు.. ఎప్పుడు ఏ విస్ఫోటనం జరుగుతుందో! ఏ ప్రశాంతత ఎలా ముగిసిపోతుందో! ఊపిరి బిగబట్టి ఆచి తూచి వేసే అడుగులు. చావు లాంటి బ్రతుకు చావులోనే బ్రతుకు మళ్లీ మళ్లీ అలా చావకపోతేనేం? చస్తూ బ్రతక్కపోతేనేం? ఎవరో నాటి, మరెవరి స్పర్శకో పేలిన మందు పాతర నిన్ను ముక్కలు చేసి ఆకాశంలోకి విరజిమ్మితే.. అక్కడే అలా చుక్కల్లో మిగిలిపోక మళ్లీ భూమ్మీదకు జారి ఒక్కటవుతావేం? మరొక్కసారి ఛిద్రమయి ఎగసిపోయే అనుభవాన్ని సొంతం చేసుకోవడానికా? శిధిలమయింది బ్రతుకయితే ముక్కలయింది మనసయితే అతుకులేయగలిగే ఆశ ఏది? నువ్వంటే! మర్చిపోవాలన్న పట్టుదలలో మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటాను. తరిమెయ్యాలన్న ప్రయత్నంలో అనుకోకుండానే ఆహ్వానిస్తుంటాను. నీ నుంచి దూరంగా పారిపోవాలన్న నా పరుగు తిరిగి తిరిగి నిన్నే చేరుకుంటుoది. జ్ఞాపకంతో పోరాటం, మనసుతో భీకర యుద్ధం, నా పై నేనే చేసుకునే విధ్వంస రచన. ఇదీ నువ్వంటే…
గాలి
-కెక్యూబ్ వర్మ వీస్తున్న గాలి వాసన ముక్కు పుటాలను తాకి ఎదలో రొద పెడుతోంది. ప్రశ్న వెన్నంటే ప్రశ్నల సాలె గూడులో౦చి బయట పడలేని తనం. తెగిపడిన శిరస్సుల ముందు ఖాళీ చేతులతో మోకరిల్లలేను కనుగుడ్ల ఖాళీ స్థలంలో ఇప్పుడు ఏదో విద్యుల్లత పద్మ వ్యూహం నుండి బయటపడే మార్గం ఉమ్మనీరులో ఈదిన నాడే నేర్చిన … Continue reading
శకలస్వరం
-డా. పులిపాటి గురుస్వామి ఎప్పటికీ ఏదో ఒక బాధ.. దానికి రూపం ఉండదు, నువ్వనుకుంటున్నట్టు సరిహద్దులు కూడా ఉండవు. నన్ను కాపాడుకోవటం కోసం అది ఆవహించుకు పోతుంది. వందశాతం వశీకరణ మంత్రమేదో ఉంది. నేను దాన్ని ప్రేమించినట్టే అది కూడా నన్ను.. కనికరింపుల కలత దుఃఖాన్ని సాదరంగా చేయి పట్టుకు తీసుకువచ్చి నిలబెడితే.. దాని దీనమైన … Continue reading
కవికృతి -౭
తిరిగే చేతుల్లో -ఎమ్.ఎస్.నాయిడు కొన్ని చీమల చేతుల కింద తిరుగుతున్నా వాటి నిద్రని తాకాలని నా తలకాయలో వాటి ప్రియురాళ్ళ ముఖాల్ని తుడిచేశాను నిద్రలో పాకి నా ప్రియురాళ్ళ ముఖాల్ని అవి తినేశాయి కొన్ని కలలు చీమల చేతుల్లో ఉంటాయి మరికొన్ని తలలు కలల చేతుల్లో చితుకుతాయి తిరిగే చేతుల్లో వంకర్లో కొంకర్లో పోయే కలలే … Continue reading
పొగమంచు
-ఆత్రేయ కొండూరు దగ్గరయ్యేకొద్దీ దారి చూపిస్తూ , మసక రూపాలకు మెల్లగా రంగులమరుస్తూ, మురిపిస్తూ, తేమతగిలిస్తూ.. కంటి వెనక దారి మూసేస్తూ, ముందు వెనకలను ఏకం చేస్తూ.. ఉదయమయ్యేదాకా సగం రంగుల పరిధినే ఆస్వాదించ మంటూ.. తాత మాటలు తవ్వి తీస్తూ..
నిర్మోహ వామనం
-అభిశప్తుడు మొదటి అడుగు: భూమి కమ్ముకున్న అదృశ్య ప్రణవాన్ని అరచేతి దోనెలతో పోస్తానన్నావు ప్రణయాణువులతో పిగిలిపోతున్న కాగితప్పొట్లాంలో కాస్తయినా ఖాళీలేదు మనోప్రస్తారం నుంచి మరే ప్రసారం వీలుకాదు ఈదురుగాలుల్ని ఉడికించిన గడ్డిపోచ నేను రికామీ తెమ్మెరై వంచిన, వంచించిన నీ నవ్వు రెండో అడుగు: ఆకాశం కంటిరెక్కలకి కట్టాను కంకరరాళ్ళు ఐనా లోన ఎండమావుల్ని రద్దు … Continue reading
రెండు
-అవ్వారి నాగరాజు ఏదో భయం ఉంటుంది వోరగ తెరచి ఉంచిన అపరిచిత ప్రపంచపు ఆహ్వానానికై ఎదురు చూసే పెరపెరా ఉంటుంది రాతిరి విచ్చుకున్న ఆకాశపు పందిరి కింద చేతులు చాచుకుని అగాథపు నీలిమ లోతులలో పవ్వళించే స్వాప్నికతా ఉంటుంది ఒక రోజు తొలగి ఇంకొక దానికి దారి చూపే వేకువలలో తెలియని సంశాయాత్మతో తనలోకి తానై … Continue reading
ఎదురు చూపు
-రవి వీరెల్లి నీ తలపు ఎక్కడో పచ్చికబయల్లో పారేసుకున్న మన పాత గురుతులని ఎదకు ఎరగా వేసి పద పదమని పరుగు పెట్టిస్తుంది నీ ద్యాస స్మృతుల శ్రుతిలో స్వరాలాపన చేస్తున్న నా హృదయ లయను గమకాల అంచుల్లో తమకాల ఉయ్యాలలూపుతుంది నీ ఊహ మొగ్గలాముడుచుకున్న జ్ఞాపకాలని బుగ్గరించి విరబూయించి అనుభవాల రెక్కల చిరుజల్లుగా చిలకరిస్తుంది … Continue reading
యుద్ధం
-వైదేహి శశిధర్ విరిగిన కొమ్మలా వాలిన తండ్రి చేతిని తన గుప్పెటలో బంధించి ఘనీభవించిన కన్నీళ్ళ నావై వేదనల తెరచాపలెత్తి ఆ వైపు నిశ్శబ్దంగా నిలచిన ఆమె కదిలే కారుణ్య వీచికనై చార్టులో రిపోర్టులను మధించి కరిగిపోతున్న కాలంతో ఏకదీక్షగా పోరాడుతూ ఈ వైపు కర్తవ్య నిమగ్ననై నేను నివురు గప్పిన గాండీవాలై … Continue reading
కవికృతి – ౬
దామోదర్ అంకం: నేనెవర్ని…?! ఎంత తప్పించుకుందామనుకున్నా.. నాకు నేను ఒంటరిగా దొరికిపోయినపుడు… అమ్మ ఒడికి దూరంగా.. కానీ అంతే గారాబంగా.. నాకు నేను జోల పాడుకున్నపుడు… ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. నాకు నేను అద్దంలో విన్నవించుకున్నపుడు… చిరుగాలి పరుగెడుతుంటే.. ఆ శబ్దం నను భయపెడుతుంటే.. నాకు నేను ధైర్యం చెప్పుకున్నపుడు… సమయం నను తిరస్కరిస్తుంటే.. “ఏంకాదు” … Continue reading