Category Archives: కవిత్వం

జాడ

పదే పదే అదే మనుషుల్ని కలుస్తూ.. ప్రతిసారి కొత్త అర్ధాల కవిత్వాన్ని కలిసి సృజించుకుంటూ.. తప్పిపోయిన తన్మయత్వాల జాడల్ని వెతుక్కుంటున్న తపన నాగరాజు గారి కవితలో
 

Continue reading

Posted in కవిత్వం | 2 Comments

ఒక నిజ రేఖ మీద…..

“ఛాందసత్వపు సంకెళ్లని అలంకారాలని భ్రమించే తీరుని దాటించే అఫ్సర్ గారి నిజరేఖా కవిత్వం”
 

Continue reading

Posted in కవిత్వం | 9 Comments

నాకోసం నా ప్రియురాలు

అరుణ కిరణాల్లో, మిట్టమధ్యాహ్నాల్లో,అసురసంధ్యల్లో.. అన్నివేళల్లో తనకోసమే ఎదురుచూస్తూ ఆమె..భూషణ్ గారి ఈ కవితలో
 

Continue reading

Posted in కవిత్వం | 5 Comments

తమకరందం

ప్రాణాల్నిపంచభూతాలుగా విడగొట్టిన ఒకేఒక్క అంతు తెలియని ఆర్తి, ప్రతీక్షణపు ప్రతీక్షాఫలంగా చిలికిన తమకపు మకరందం ఈ కవితలో..

Continue reading

Posted in కవిత్వం | 2 Comments

గుప్పెడు మిణుగురులు

-మూలా సుబ్రహ్మణ్యం ఆ తీరంలో ఎంతటి మహాత్ముడి అడుగుజాడలైనా చెరిగిపోక తప్పదు నీకు నువ్వే ఓ దారి వెతుక్కోవాలి జీవితమూ సముద్రమే! * * * కలలెక్కడో అంతమవ్వాలి మళ్ళీ పుష్కరాల వేళకి ఈ నది ఉంటుందో లేదో ఒక్క క్షణమైనా నిన్ను విడిచిపెట్టి నదిలోకి.. నదిని నీలోకి.. కాలం ఎంత అర్ధరహితం! * * … Continue reading

Posted in కవిత్వం | Tagged | 28 Comments

కవికృతి-౧౨

౧. – చావా కిరణ్ ఆ రోజు ప్రభూ, నీ కోసం నన్ను సిద్దంగా ఉంచుకోలేదు. —- నేను పిలవకుండానే ఒక సామాన్యునిలా హృదయంలోకొచ్చి అశాశ్వత క్షణాలపై అమృత ముద్రవేశావు. —- ఈ రోజు అనుకోకుండా గతం నెమరు వేసుకుంటూ నీ రాజముద్రలు చూశాను. —- అవి ఆనంద విషాదాల్తో కలగలిసి మర్చిపోయిన మామూలు అనుభవాల్లో … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

కవికృతి – ౧౧

కవికృతి సమ్మేళనంలో సభ్యుల మధ్య చోటుచేసుకున్న కొన్నిసంభాణలు: స్వాతికుమారి: కవికృతి లో కొందరు కవులు తమ అనువాద కవితల్ని పంపారు. అసలు ఇతర భాషల కవితలను తెలుగులోకి అనువదించడం వల్ల కవులకు, పాఠకుడికి ఉపయోగాలేమిటని మీరు భావిస్తున్నారు? అనువాదాలు చేసేటప్పుడు తప్పక గుర్తుంచుకోవలసిన సూత్రాలు, నియమాలు ఏవైనా ఉన్నాయా? చావా కిరణ్, పెరుగు రామకృష్ణ గారు … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

కవికృతి-౧౦

౧. -చావా కిరణ్: ఉదయాన్నే గుసగుసలు మనిద్దరం కలిసి పడవపై కేవలం మనిద్దరమే సుమా, అలా అనంత తీరానికి ఆనంద లోకానికి వెళ్తామని ఉదయాన్నే గుసగుసలు. —- అంతే లేని సముద్రంపై నీ నగుమోము చూస్తూ అలల్లా పూర్ణస్వేచ్చతో బంధనాలు లేని పదాలతో నా పాటలు పరవశిస్తాయి. —- ఇంకా ఆ ఘడియ రాలేదా ఇంకా … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment

కవిత

-ఆత్రేయ కొండూరు తలపు తడుతూ నేల గంధం తలుపు తీస్తే, ఆకాశం కప్పుకున్న అస్థిరమయిన రూపాలు తేలిపోతూ, కరిగిపోతూ, అలజడిచేస్తూ, అక్షరాల జల్లు. నిలిచే సమయమేది ? పట్టే ఒడుపేది ? పల్లంలో దాగిన జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు. తడుపుదామనో కలిసి తరిద్దామనో! గుండె నిండేసరికి నిర్మలాకాశం వెచ్చగా మెరిసింది.

Posted in కవిత్వం | Tagged | 2 Comments

కవికృతి-౯

నో కాంప్రొమైజ్ ప్లీజ్ -స్వాతీ శ్రీపాద నేను రాజీ ఉరితీతకు సిద్దంగా లేను. కళ్లుమూసితెరిచేంత లిప్తలో ఉనికికీ ఊహకూ_ సజీవతకూ సమూల మరణానికీ ఉలిపిరి కాగితపు పరదా ఊగిసలాడుతున్న తైంతిక సుకుమార జీవనవనంలో విలువల గొంతునొక్కి కలల గుమ్మటానికి వేలాడేందుకు నేను సిద్దంగాలేను. నో కాంప్రొమైజ్ ప్లీజ్.. సువిశాలపు ఆకాశం పాల చెక్కిళ్ళపై పరుగులు పెడుతూ … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment