Author Archives: స్వాతికుమారి
తామస విరోధి – రెండవ భాగం
ఉగాది వచన కవి సమ్మేళనం రెండవ భాగంలో చావా కిరణ్ గారి కవితపై సరదా చర్చ, సీరియస్ విశ్లేషణ: Continue reading
కథా మాలతీయం – 3
తూలిక సైటు, తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలు నిడదవోలు మాలతి గారితో ఇంటర్వ్యూ మూడవ భాగం. Continue reading
తామస విరోధి- మొదటి భాగం
విరోధి నామ సంవత్సర ఉగాది సందర్భం గా పొద్దు పత్రిక నిర్వహించిన ఆన్లైన్ వచన కవి సమ్మేళనం “తామస విరోధి” కి స్వాగతం. సాధారణం గా సమ్మేళనాల్లో కవులు తమ స్వీయ కవితల్ని చదివి వినిపిస్తారు. ఈ కార్యక్రమం లో దానికి పొడిగింపుగా ఆ కవితలపై అనుభవజ్ఞుల విశ్లేషణలు, సూచనలూ కూడా చేర్చటం వల్ల నవ కవులకి మార్గదర్శకం గా ఉంటుందని భావించాము. ఇంతే కాకుండా “తర్ కవిత ర్కాలు” పేరు తో కవిత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిపేందుకు దీన్నొక వేదిక గా చేశాము.
తామస విరోధి మొదటి భాగం లో ఉగాది పై వసంతస కవితల్ని అందిస్తున్నాము. తర్వాతి అంకాల్లో మిగతా కవితలు, చర్చలను ప్రచురిస్తాము. Continue reading
కథా మాలతీయం – 2
స్వాతి: మిమ్మల్నిప్రభావితం చేసిన వ్యక్తులు, సన్నిహితులు, సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమయిన సంఘటనలు, అబిమాన రచయితలు, వారి రచనల్లో మీకు నచ్చిన అంశాలు. మాలతి: నేను లైబ్రరీసైన్స్ డిప్లొమా చేస్తున్నరోజుల్లోనే, అంటే 1961లో నరసింహరాజుగారు కేవలం రచయిత్రులకథలు సంకలనంగా వేయడానికి పూనుకున్నారు “కల్పన” అన్నపేరుతో ‘62లో ప్రచురించారు. తెలుగు సాహిత్యచరిత్రలో రచయిత్రులకథా సంకలనాల్లో తొలిసంకలనం ఇదే. నాకథ … Continue reading
కథా మాలతీయం – 1
నిడదవోలు మాలతి గారు ఇంటర్నెట్ లో ఇంగ్లీష్ తూలిక సైటు తెలుగు తూలిక బ్లాగుల నిర్వాహకురాలిగా చాలా మందికి పరిచయం. కానీ ఆవిడ గత శతాబ్ధి రెండవ భాగంలో ప్రింట్ మీడియాలో తనదైన చక్కటి శైలితో కధా రచయిత్రిగా జనంతో అనుబంధం ఉన్నవారే. ఈ మధ్యనే చాతక పక్షులు అనే తన కొత్త నవలను బ్లాగులోనే సొంతగా … Continue reading
చదువది యెంత గల్గిన..
-స్వాతి కుమారి విద్య అంటే ఆనందించే శక్తిని వృద్ధిచేయడం, సౌందర్యానికి కళ్ళు తెరవడం, బాధల్నించీ, కష్టాల్నించీ తప్పించుకునే నేర్పునివ్వడం, ఇతరుల స్వేచ్ఛను అడ్డగించే స్వార్థపరత్వం నించీ, అంతా తనకే కావాలని దాచుకునే కాపీనం నుంచీ, భయాల నించీ తప్పించడం. – చలం చదువు పరమార్థం విదేశీ ఉద్యోగాలు మాత్రమే అని మనసులో నాటుకున్నాక కరెన్సీ లో … Continue reading
మట్టి వాసన కలిగిన మంచి కథల సంపుటి
సమీక్షకులు: స్వాతి కుమారి నాగుమణి నవ్వింది – కథాసంపుటి రచయిత – డి. రామచంద్ర రాజు ఈ సంపుటిలో మొత్తం పది కథలున్నాయి. అన్నీ వివిధ పత్రికల్లో ప్రచురించబడినవే. ఈ కథల్లో, సగటు మనిషి బలహీనతలు, మధ్యతరగతి జీవితంలోని కష్టనష్టాలు, వానలు కురవక, బ్రతకటానికి చావటానికీ దిక్కు తోచని రైతుల దుస్థితి.. ఇలా చాలా వరకూ … Continue reading
ఊ’కందం’పుడు
“వీడా? నన్ను పట్టేదని పెన్నేడిస్తే కన్నీరు కాగితం మీద పడి .. ఊకదంపుడు!” అని చమత్కారంగా తనని తాను తక్కువ చేసుకున్నా, “ఊక దంచేశారు, ఇక్కడంతా గట్టి గింజలే” అని రసజ్ఞుల చేత అనిపించుకున్న బ్లాగు ఇది. -అంటున్నారు, స్వాతి కుమారి ఈ బ్లాగు సమీక్షలో. Continue reading
ఏటి ఒడ్డున కొన్ని మాటలు – మూలా సుబ్రహ్మణ్యంతో స్వాతి కుమారి కబుర్లు
-స్వాతి కుమారి కవిత్వమంటే ఏమిటి, అది నిర్వచనాలకు, సమీకరణాలకు కట్టుబడి ఉండేదేనా? పద్యమైనా వచనమైనా, అందులో ఎన్ని మార్పులు, కొత్త పద్ధతులూ వచ్చి చేరినా.. మూల పదార్ధాలైన రసమూ, ధ్వనీ – మరోలా చెప్పాలంటే భావమూ, భాష – వీటి ప్రాముఖ్యత ఎంత వరకూ నిలబడి ఉంది? కొద్దో గొప్పో కవిత్వం రాయటం మొదలెట్టిన వాళ్ళకి … Continue reading
ఉగాది సంపాదకీయం
-స్వాతికుమారి “ఈ నెలలో ఐదు శుక్రవారాలొచ్చాయి.” “ఈ మంత్ లో ఫయివ్ ఫ్రైడేస్ ఉన్నాయి” అని కాకుండా పై విధంగా ఏ చదువుకున్న తెలుగువాడైనా అంటే ఆశ్చర్య పోవటమో, ముసిముసిగా నవ్వటమో, అలా అన్న వ్యక్తితో కొంచం చనువుంటే “are you alright?” అని మేలమాడ్డమో వీటిల్లో ఏదో ఒకటి తోటి తెలుగువాడి ప్రతిస్పందనగా ఎదురయ్యే … Continue reading