Author Archives: gadi
జూలై గడి సమాధానాలు
తప్పుల్లేకుండా పూరించినవారు:
బి. కామేశ్వరరావు, స్వాతికుమారి.
అసంపూర్తిగా:
శ్రీరామ్.
ప్రయత్నించినవారందరికీ అభినందనలు!!
జూన్ గడి సమాధానాలు
మా మాటః
ఈసారి గడికి అనూహ్యమైన స్పందన లభించింది. మొదటి నుంచి గడిని పూరిస్తున్నవారే కాకుండా ఈసారి కొత్తపాఠకులు కూడా ఎక్కువ ఉత్సాహంగా పాల్గొనడం సంతోషించదగ్గ పరిణామం. ఇది గడికి ఆదరణ క్రమంగా పెరుగుతోందనడానికి నిదర్శనం. ఐతే కొత్త పాఠకుల గురించి వారి పేర్లు, ఈమెయిళ్ళు తప్ప ఇతర వివరాలు తెలియకపోవడం వెలితిగానే ఉంది. వారికి సంబంధించిన వెబ్సైట్లు గానీ, బ్లాగులు గానీ ఉన్నట్లైతే వాటి URLs ఇవ్వవలసిందిగా కోరుతున్నాం.
ఆల్ కరెక్టు సమాధానాలు పంపినవారుః
సిముర్గ్, బి. కామేశ్వరరావు, రాకేశ్, జ్యోతి, స్వాతి, చిట్టెళ్ళ కామేశ్, ఫణికుమార్, రాజ్యలక్ష్మి
ఒకటి రెండు తప్పులతో:
చిట్టెళ్ళ శ్రీకాంత్, శ్ర్రీరామ్, రవి వైజాసత్య, డా.ఇస్మాయిల్ పెనుగొండ
మూడునాలుగు తప్పులతో:
ఎందుకులెండి, అరుణ, రాధిక
అందరికీ అభినందనలు!!!
జూలై గడిపై మీ మాట
జూలై గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. జూన్ గడి, సమాధానాలు 2. మే గడి, సమాధానాలు 3. ఏప్రిల్ గడి, సమాధానాలు 4. మార్చి గడి, సమాధానాలు
జూన్ గడిపై మీ మాట
జూన్ గడిపై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. మే గడి, సమాధానాలు 2. ఏప్రిల్ గడి, సమాధానాలు 3. మార్చి గడి, సమాధానాలు
మే గడి సమాధానాలు
సరైన సమాధానాలు పంపినవారు:
తప్పుల్లేకుండా: బి. కామేశ్వర రావు
ఒకటి రెండు తప్పులతో: సత్యసాయి, స్వాతి కుమారి
మూడు నాలుగు తప్పులతో: కొత్తపాళీ, శ్రీరామ్
అసంపూర్తిగా పంపిన వారుః చిట్టెళ్ల కామేష్, చరసాల ప్రసాద్
ప్రయత్నించినవారందరికీ అభినందనలు!
మే గడిపై మీమాట
మే గడి గురించి మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. పాత గడులు 1. ఏప్రిల్ గడి, సమాధానాలు 2. మార్చి గడి, సమాధానాలు
ఏప్రిల్ గడి – వివరణ
ఏప్రిల్ గడికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇంతగా అభిమానించి, ఆదరించిన పాఠకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. గడిని ఎంతగానో అభిమానించి, అందరినీ ప్రోత్సహించిన కొత్తపాళీగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గడిమీద చాలా పెద్ద ఎత్తులో చర్చలు జరిగాయి. కొన్ని చర్చలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యంతోను, ఆనందంతోను ఒళ్ళు పులకరించింది. ఈ గడి మూలంగా – వరూధిని కథ, పుష్ప లావికలు, అనిరుద్ధుని కథ, మాంధాత గురించి కొన్ని చర్చలు జరగడం – గడి కూర్పర్లగా మాకు చాలా ఆనందానిచ్చింది.
మూడురోజుల పాటు అహోరాత్రాలు కష్టపడి గడి తయారుచేస్తే గంటలో పూరించి పంపించారు సత్యసాయిగారు. సుమారుగా అన్ని కరెక్టుగా పంపినవారు కూడా చాలామందే ఉన్నారు. మీ సత్తా చూస్తూంటే, అసలు ఆధారాలే అవసరం లేనట్లుంది!!
గడి తయారుచేయడంలో ఇంకా తప్పటడుగులేస్తున్న మమల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు, జరిగిన ఒక పొరపాటుని సహృదయంతో అర్ధం చేసుకొన్నందుకు కూడా మేం మీకందరికీ ఋణపడి ఉంటాం. మీ ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తాం – మీ అంచనాలకి తగ్గకుండా గడి స్థాయిని ఇలాగే ఉంచడానికి కూడా మా శాయశక్తులా కృషి చేస్తాం.
ఏప్రిల్ గడిపై మీ మాట
ఏప్రిల్ గడి గురించి మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. మార్చి గడి, సమాధానాలు
మార్చి గడి సమాధానాలు – వివరణ
ముందుమాట: తెలుగులో గతంలో ఆరుద్ర, శ్రీశ్రీ లాంటి మహామహులు గళ్ళనుడికట్లు తయారుచేసేవాళ్ళు. అవి కట్టుదిట్టంగా, చాలా చమత్కారాలతో నిండి ఉండేవి. ఆ స్థాయిలో తయారుచేసేవాళ్ళు లేకనో, పత్రికల అనాదరం వల్లో తర్వాత ఆ తరహా గళ్ళనుడికట్లు కనుమరుగైపోయాయి. ఒక్క రచన పత్రికలో మాత్రం దాదాపు పదేళ్ళ కిందట నేను ఆ పత్రిక చదవడం మొదలుపెట్టినప్పుడు ఆరుద్ర, … Continue reading
గడి
పొద్దులో గళ్ళనుడికట్టు – గడిని సమర్పిస్తున్నాం. మీ సమాధానాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురుచూస్తాం.