గడి

పొద్దులో గళ్ళనుడికట్టు – గడిని సమర్పిస్తున్నాం. మీ సమాధానాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురుచూస్తాం.

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

20 Responses to గడి

  1. వార్త్తిక్ says:

    Wow! అద్భుతంగా ఉంది! ఈ ఇంటరాక్టివ్ గడికి అవసరమైన php కోడ్‌ని వ్రాసిన వారికి నా ప్రత్యేక అభినందనలు!!

    రిగార్డులతో,
    సురేశ్.

    తెలుగు టూల్‌బార్ IE లో పనిచేయడానికి నేను కొన్ని మార్పులు చేసి ఈమాటలో వాడుకున్నాను. కావాలనుకుంటే మీరు దాన్ని ఈమాట నుండి download చేసుకొని ఇక్కడ వాడుకోవచ్చు.

  2. ఆలస్యమైతేనేమి, అద్భుతంగా రూపొందించారు. బహుశా ఇది తెలుగు అంతర్జాలంలో మొట్టమొదటి పదబంధ నిర్వహణాప్రక్రియ. జయహో!! పొద్దు “గడి” మిగతా ఇంటర్నెట్టు పత్రికలకు ఒక మాదిరి. (ఇదేంటీ ఒక మాదిరిగా మాట్లాండుతున్నాడే అనిపించిన వారికోసం – మాదిరి అంటే నమూనా, ఉదాహరణ అని అర్థం. చిన్నప్పుడు తెలుగు లెక్కల పుస్తకంలో ‘మాదిరి లెక్కలు’ గుర్తుందా? అంటే Excercises లేదా Example Problems)

  3. Sowmya says:

    బాగుంది అండి. The UI is also very user friendly. Thanks fr that.

  4. కామేష్ says:

    ఆలస్యమైనా మొదటి భాగం అద్భుతం. చాలా బాగుంది. నేననాలనుకున్నవి రానారే అప్పుడే చేప్పాసారు. నేను కూడా డిటో డిటో. దీన్ని పైనుంచండి. అర్ధం కాలేదా. అదేనండి – Keep it up.

  5. నాగరాజు పప్పు says:

    చాలా బాగుందండీ. ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంది. ఆరుద్ర గడికట్లు గుర్తుకొచ్చేలా చేసేరు. దన్యవాదాలు.
    –నాగరాజు

  6. వాహ్ ఎవరు రాసారో గానీ కోడ్…చాలా పకడ్బందీగా వుంది. నాకు చాలా కష్టంగా వుంది పూర్తి చెయ్య్టటానికి. ఏదో ఈనాడు ఆదివారం పదకేళి లా వుంటుందనుకున్నా గానీ..అంత వీజీ కాదు 🙁

  7. చాలా బావుంది. అంత ఈజీ కాదు అంత కష్టం కాదు. కాని స్కూల్‍లో, కాలేజీలో చదివిన తెలుగును తిరగతోడుకుంటే సరి. ఇది పూర్తి చేయడం వ్యసనం అవుతుందేమో అని భయంగా ఉంది.

  8. పట్టుమని పదికూడా రాలేదు. నేను చేతులెత్తేసా.

  9. వామ్మో ఇది చాలా కష్టంగా ఉంది.

  10. అన్నట్టు ఫైర్ఫాక్స్ (windows XP, firefox 2.0.0.2) తో ఈ పేజీ లో వ్యాఖ్య రాస్తే error వస్తుంది.

    “Error: This file cannot be used on its own.”

  11. చాలా బావుంది. నాకు బాగా నచ్చిన ఆధారం
    అడ్డు 22 సగం కూల్‌డ్రింకు, సగం విషం కలిసి సృష్టించిన కలకలం (4)

  12. మాధవ్ says:

    ఎనభై శాతం పూర్తి చేసి, ఎలా save చేయాలో తెలీక, పొరపాటున reload నొక్కి మళ్ళీ మొదటి కొచ్చాను. Unicode input still has glitches. Sorry, but needs more work and fine tuning.

    ఒకటే సిట్టింగ్ లో పూర్తి చేయలేని వారేమి చేయచ్చో చెప్పండి.

    త్రివిక్రమ్ గారూ! A fine job indeed!

  13. మాధవ్ says:

    కనపడ్డది ఎలా save చేసుకోవాలో! ఈ-మెయిల్ తో రిజిస్టర్ చేసుకోవాలని ఒక మాటంటే సరి. చాలా చురుగ్గా పని చేస్తున్నారు మీరు. ఇలానే ఉండండి 🙂

    ఇక నేను కింద “పంపించు” నొక్కేటప్పటికల్లా యూనికోడ్ ఇన్పుట్ ని కూడా సవరిస్తే ….

  14. 85% పూర్తిచేసి ‘పంపించు’ మీటనొక్కగానే, ఈ పేజీకి లింకున్న ఒక పెజీ కనబడింది. కానీ, అందులోని అక్షరాలు అర్ధంకాని లిపిలో కనబడ్డాయి.

  15. కూర్పరి త్రివిక్రం బహు నేర్పరి మరియూ మిక్కిలి ‘గడు(డి)’సరి అని తేలింది.

  16. అమ్మో! నా వల్ల కాలేదండి.
    ఈనాడు లో ఎప్పుడు తప్పు లేకుండా పెడుతూ ఉంటాను (దాదాపుగా).
    ఇది మాత్రం నా స్థాయి కాదని తేలిపోయింది.
    సమాధానం కోసం ఎదురు చూడ్డం మినహా ఏమీ చెయ్యలేను 🙂

  17. radhika says:

    చిన్ని చిన్ని పదబంధాలు పూరించేసి కనుబొమ్మలెగరేసేదానిని.ఇప్పుడు ఈ గడి చూసి ఒక దణ్ణం పెట్టడం తప్పించి ఏమి చేయలేకపోతున్నాను.

  18. దీనిని రూపొందినవారెవరో కానీ జనాల చేత హాహాకారాలు చేయిస్తున్నరే…..

  19. ఇది నావల్ల కాదు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  20. సమాధానాలు రెండురోజులు ముందే లీకైనాయోచ్! 🙂

Comments are closed.