Yearly Archives: 2011
స్మ’రణం’
వచ్చి వున్న నువ్వు విచ్చుకుంటున్న తలపులలోకి వచ్చి చేరాలని తలపడుతూ ఒక పల్లెటూరూ, ఒక నదీ ఒక బాల్యమూ, ఒక వెన్నెలా! నేనిప్పుడు నీవై ఉన్నాను! మోహరించుకుంటున్న జ్ఞాపకాలని ఎన్నిసార్లని ఇలా మోహించుకుంటూ ఆ వెంటవెంటనే శోకించుకుంటూ! వెనక్కి తిరిగి చూడడం నాకు తెలియని విద్యేం కాదు తెలిసీ తెలియని రోజులనుంచే తలపులకొక కిటికీని తగిలించుకుని … Continue reading
విలక్షణ కథా రచయిత – త్రిపుర
త్రిపుర అసలు పేరు: రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (RVTK Rao). 2-9-1928 న గంజాం జిల్లా పురుషోత్తమపురంలో (ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది) జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీషు లిటరేచర్ చదువుకున్నారు…. విలక్షణ రచయిత త్రిపుర గురించిన చిరుపరిచయం చదవండి.
Continue reading
కథాకథనం – 3
కథ కానిది
కథలాగే వార్తా, వార్తాకథ, వ్యాసం కూడా వచనరూపాలే. నిడివిలో, నడకలో, పేరెట్టుకోడంలో ఈ నాల్గింటి మధ్యా ఇటీవల పెద్ద తేడాలు కనిపించవు. ఈ మధ్య ఇవి కూడా కథల్లా ఆరంభమై కథల్లా ముగుస్తున్నాయి.
కథ గురించిన మన అవగాహన మరింత స్పష్టం కావాలంటే – కథ పోలికలున్నా కథలుకాని – వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అందువల్ల వీటి నుండి కథ ఏవిధంగా భిన్నమో తెలుస్తుంది.
నారాయణ కల్పవృక్షమ్
ఆరుద్ర షష్ట్యబ్దిపూర్తి నాడు విశ్వనాథవారుండి ఆయన అభినందనలు తెల్పినట్లుగా శ్రీరమణ పేరడీ రాసారు. ’అందరూ బాగుందనడం ఒక ఎత్తు అయితే, ఆరుద్ర ప్రత్యేకంగా మెచ్చుకోవడం నాకు ఆనందం కలిగించిన ఒక ఎత్తు. అంతేకాదు, షష్టిపూర్తి సంచికలో ఆ పేరడీ తప్పక రావాలని ఆరుద్ర పట్టుబట్టడం మరో ఎత్తు.’ అని శ్రీరమణ అన్నారు.ఆ పేరడీని ఆస్వాదించండి. ఆరుద్ర పుట్టినరోజు (ఆగస్టు 31 ) సందర్భంగా, ఈ పద విన్యాసం మీకోసం. Continue reading
ఒక ఆరుద్ర
ఆరుద్ర పుట్టినరోజు (ఆగస్టు 31 ) సందర్భంగా, ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ప్రత్యేక వ్యాసం మీకోసం.
ఆరుద్ర నాటకం ‘కాటమరాజు కథ’ – ఒక పరిచయం
ఆగస్టు 31 ఆరుద్ర జయంతి. ఈ సందర్భంగా ఆయన రచించిన “కాటమరాజు కథ” నాటక పరిచయ వ్యాసాన్ని ఆస్వాదించండి.
జర్కన్
“ఇది పసుపూ కాదు, ఆకుపచ్చా కాదు. మిరిమిట్లు గొలపదు. అంగుళం పొడవు, నాలుగు ముఖాల అందం దీనివి. ఎన్ని వస్తువులు పారేశాను? ఇచ్చేశాను. ఇది మాత్రం ఇంకా ఇప్పటికీ నాదగ్గర ఉంది. ఉపయోగం లేదు. దీని ఖరీదు తెలీదు నాకు. విలువ?” -త్రిపుర కథ చదవండి.. Continue reading
చోరకళ
మనకున్న అరవైనాలుగు కళల్లో చోరకళ ఒకటి. మిగతా కళల్లో నాట్యం, శిల్పం, చిత్రలేఖనం తదితరమైనవి ఇంద్రియాలకు, తద్వారా మనసుకు ఆహ్లాదం చేకూరుస్తాయి కాబట్టి వాటిని కళలు అన్నందుకు మనకే తంటా లేదు. చౌర్యం అనగానే ఇదేమి కళ అనే ప్రశ్న రావాలి.
నీల గ్రహ నిదానము – 3
నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము ద్వితీయాంకము :: ద్వితీయ దృశ్యము
ఒక ఓదార్పు ఒక నిట్టూర్పు
శ్రీఖర ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ.