Yearly Archives: 2011

మృతజీవులు – 33

“మూడునాలుగు రోజులు తాళి, అతను కమిటీకివెళ్ళి, డైరెక్టరునుచూసి, ‘తమరు నాకేం సహాయం చెయ్యబోతున్నారో తెలుసుకునేందుకు వచ్చాను, నాకు చేసిన జబ్బులూ, తగిలిన గాయాలూ మూలాన రక్తం ధారపోశానన్నమాట…” – పోస్టుమాస్టరు రసవత్తరంగా చెబుతున్న కెప్టెన్ కపేయ్కిన్ కథ మృతజీవులు పదో ప్రకరణంలో చదవండి. Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 33

శారదా విజయోల్లాసము – 2

శ్రీఖర విజయదశమికి పొద్దు నిర్వహించిన పద్యకవి సమ్మేళనం విశేషాలు – రెండవ భాగంలో బాపు బొమ్మను వర్ణిస్తూ కవులు చెప్పిన పద్యాలు చదవండి. అలాగే ఇంట్లో కరెంటు పోయినపుడు టీవీ సీరియల్ చూసే వనితల హృదయవిదారకమైన వేదన కూడా కవుల వర్ణనలో చదవండి. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

మీ కందం – పారిజాతాపహరణములోని యొకకందము

తెలుగుపద్యాలలో కందానికి ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. క్రొత్తగా కవితలు, పద్యాలు అల్లేవారిని కాస్తోకూస్తో బెంబేలెత్తించేటట్టు కనబడే లక్షణాలు కందానికి ఉన్నాయి. ఆ భయాన్ని వీడి ముందుకు సాగితే కందాల్ని సులభంగా అల్లుకుపోవచ్చు. – మీకు నచ్చిన కంద పద్యం వ్యాసాల వరుసలో లంక గిరిధర్ గారికి నచ్చిన కంద పద్యం గురించి చదవండి. Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

శారదా విజయోల్లాసము – 1

శ్రీఖర విజయదశమికి పొద్దు నిర్వహించిన పద్యకవి సమ్మేళనం విశేషాల మొదటి భాగమిది. ప్రార్థనతో పాటు మరో మూడు సమస్యల పూరణలను ఈ భాగంలో సమర్పిస్తున్నాము. అవధరించండి. Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on శారదా విజయోల్లాసము – 1

శారదా విజయోల్లాసము

శ్రీఖర సంవత్సర విజయదశమి సందర్భంగా పద్య కవుల సమ్మేళనం “శారదా విజయోల్లాసము” నిర్వహించాం. 12 మంది పద్యకవులు పాల్గొన్న కవితాగోష్ఠి సెప్టెంబరు 17 న మొదలై, అక్టోబరు 1 వ తేదీ శనివారం నాడు జరిగిన ప్రత్యక్ష సభతో విజయంతంగా ముగిసింది. అనేక గంటలపాటు రసోల్లాసంగా జరిగిన ఈ సభ విశేషాలను తెలిపే వ్యాసాలను ఈ వ్యాసంతో మొదలుపెడుతున్నాం. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 2 Comments

మీ కందం

కందం గురించి తెలుఁగు పద్యకవులకు చెప్పడమంటే తెలుగువాడికి గోంగూరపచ్చడి గురించి చెప్పడమన్నంత దోషం. తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన కందపద్యం ఒకదాని గురించి చెప్పి, ఆ పద్యం ఎందుకు నచ్చింది? ఆ వెనుక కథాక్రమంబెట్టిది? మొదలైన వివరాలను అందించండి. మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం చదవండి. Continue reading

Posted in వ్యాసం | Tagged , | 2 Comments

సత్యప్రభ – 1

“ఈ భ్రమ వల్ల వానికి కొత్త ఉత్సాహం పుట్టింది, వాని శిరసు మిన్నుని అంటింది, వాని భుజస్కంధాలు ఉబికాయి, వాని వక్షో దేశం విశాలమయింది. వాని కండ్లలో భావతరంగాలకు మితిలేక పోయింది. వాడు పూర్తిగా కామునికి వశమైపోయాడు. కాని ఆ సంగతిని వాడు గ్రహించి ఉండలేదు. తన ఎదుట నిలబడి ఉన్న సుందరి తనను ప్రేమిస్తోందనే భావం మాత్రమే వానికి గోచరిస్తూంది.” – సత్యప్రభ చారిత్రిక నవల మొదటి భాగం చదవండి. Continue reading

Posted in కథ | Tagged , | 6 Comments

థ్రిల్

“”వీడెప్పుడు ఇంతేరా, ఉత్త బోర్ గాడు.. ఎప్పుడూ నీతులు చెబుతూంటాడు. అరేయి! వినండిరా, మన యూత్ ఎప్పుడూ సరదాగా ఎంజాయి చేయాలి.అడ్వెంచర్స్ చేయాలి. కాస్త థ్రిల్ అనుభవించాలి. అప్పుడే లైఫ్ లో మజా ఉంటుంది”, అన్నాడు ఈజీ గోయింగ్ దామోదర్.” -శ్రీఖర ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ Continue reading

Posted in కథ | Tagged | 1 Comment

కథా కథనం – 4

“తమ మనోలోకంలో ఎన్నెన్నో సందేహాలకు సమాధానాలు దొరకక, దొరికినా, దొరికిన వాటిలో చిక్కుముడులు విడదీసుకోలేక, సాహిత్యంలో అలాంటి వాటికి జవాబులు దొరుకుతాయనీ, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అవి విడమరిచి ఉంటాయనీ విని అందుకు సాహిత్యాన్ని ఆశ్రయిస్తారు. సాహిత్యం, అందులో ఒక శాఖ అయిన కథా, ఆ పని చేయగలగాలి.” కథారచనపై కారామాస్టారి పాఠం చదవండి. Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 1 Comment

సత్యప్రభ -మున్నుడి

సత్యప్రభ ఆంధ్రవిష్ణు కాలంనాటి చారిత్రిక నవల. దీనికి మూలకథ వ్రాసినది వాసిష్ట కావ్యకంఠ గణపతి ముని. పూర్తి చేసినది వాసిష్ట. ‘భారతి’ సాహిత్య మాస పత్రికలో 1937లో ఇది ధారావాహికంగా ప్రచురింపబడింది. ఈ నవలను పొద్దులో ధారవాహికగా ప్రచురిస్తున్నాం. ఈ ధారావాహికకు ముందుమాట ఇది. Continue reading

Posted in కథ | Tagged , , | 1 Comment