శారదా విజయోల్లాసము

సరస్వతి - పొద్దు పత్రిక

శారద

పద్యకవుల విజయదశమి సమ్మేళనం “శారదా విజయోల్లాసము” సెప్టెంబరు 17 న మొదలై 12 మంది పద్యకవులతో అక్టోబరు 1 వ తేదీన శనివారం నాడు జరిగిన ప్రత్యక్ష సభతో విజయంతంగా ముగిసింది. అనేక గంటలపాటు రసోల్లాసంగా జరిగిన ఈ సభలో కింది కవులు, రసజ్ఞులు పాల్గొన్నారు.

సంచాలకుడు: రవి

పాల్గొన్న కవులు:

1.     భైరవభట్ల కామేశ్వరరావు

2.     లంకా గిరిధర్

3.     రాఘవ

4.     సనత్‌శ్రీపతి

5.     కంది శంకరయ్య

6.     నచకి

9.     గన్నవరపు నరసింహమూర్తి

10.   చదువరి

11.  చింతా రామకృష్ణారావు గారు

12.   విజయాదిత్య

 

ఇతరులు :-

1.  కొత్తపాళి

2.  కోడిహళ్ళి మురళీమోహన్

 

ఈ కవిసమ్మేళనంలో సంధించిన  సమస్యలు ఇవి:-

 

సమస్యాపూరణము:

  • భువనవిజేతలీభువనపూర్ణ విజేతలు జాల సత్కవుల్.
  • దార్ఢ్యము కల్గినన్ జయము తప్పక శత్రు వశంబు చేతుమే!
  • వైరిఁ గీర్తించె పతిమెచ్చ వారిజాక్షి.
  • దమ్మును లాగుచుంటి గద తాళగరాదె క్షణమ్ము నీవికన్.
  • రంభా హృదయాబ్జ భృంగ! రామయనంగా!
  • సాక్ష్యంబేదని త్రోసిపుచ్చెను హరిశ్చంద్రుండు నక్షత్రకున్ .
  • శపియింతును బ్రతుకఁగ శతసంవత్సరముల్.
  • శ్రీపరమేశ్వరా! కనగ శ్రీహరి వాణికిఁ గాంతుఁడౌను! హా!
  • కౌఁగిలింత దెచ్చెఁ గష్టములను.
  • చిగురులకున్ నమస్సులిడ చేతులురా విదియేమి కాలమో!
  • భీముఁడు దుర్నీతుఁడు నవివేకియు నిజమే.
  • దర్పముకన్న లేదుగద దైవికమౌ గుణమీ జగంబునన్.
  • సూర్యుఁ డుదయించెఁ జీకట్లు చుట్టుముట్టె.
  • కోకిలమ్మ మెచ్చె కాకిగోల.
  • యతులన్ వీడిన తెల్గుపద్యమదియే భాసించు దా హృద్యమై
  • గారెలు బొబ్బట్లరిసెలు గరళసమమ్ముల్.

దత్తపదులు:

  1. తూరుపు/తూర్పు – పడమర – ఉత్తరం – దక్షిణం – దిక్కులనే అర్థాలలో వాడకుండా ఈ కాలంలో వార్తా ఛానళ్ళ గురించి.
  2. బిట్టు – చిప్పు – మెమరీ – బైటు – పద్య ప్రాశస్త్యం
  3. ద్రౌపది – భీముఁడు – కృష్ణుఁడు – కంసుఁడు  – రామాయణ ఇతివృత్తంతో ఐచ్ఛిక వృత్తంలో  పూరించండి.

కొత్త ఛందస్సు

పంచచామరము:
శివున్ స్మరించ పాపముల్ నశించునా? యబద్ధమే. (విష్ణు భక్తి వర్ణనము.)

వర్ణనలు

  1. బుల్లితెర నటవిఖ్యాతులు వేసిన కృష్ణునివేషం ఎన్.టీ.ఆర్ చూడడం తటస్థించితే ఆయన (ఎన్.టీ.ఆర్) మనోభావాలు ఎలా ఉంటాయి?
  2. టీవీ సీరియల్ మధ్యలో కరెంటు పోతే గృహిణులు పొందే వేదనను కరుణరసాత్మకంగా వర్ణించండి.
  3. ఈ క్రింది “బాపు బొమ్మ” ను కానీ, ఆ బొమ్మకు తగిన ఊహను కానీ వర్ణించండి.

బాపు బొమ్మ - శారదా విజయోల్లాసం, పొద్దు

బాపు బొమ్మ

4.  కింది రవివర్మ చిత్రానికి తగిన కథ/ఉదంతం పద్యరూపంలో ఐచ్ఛిక ఛందస్సులో వ్రాయండి.

రాజారవివర్న చిత్రం - శారదా విజయోల్లాసం, పొద్దు

రాజారవివర్మ చిత్రం

చిత్రకవిత

శ్రీ చక్ర బంధములో వీణా పాణిని స్తుతించండి.

అనువాదం
ఈ క్రింది శ్లోకాన్ని తెనుఁగులో అనువదించండి. యథాతథంగా కాకపోయినా, ఆ అర్థం వచ్చేటట్లు అనుసరించినా సమ్మతమే.

జ్యోత్స్నాంశాకర్షపాణ్డుద్యుతి తిమిరమషీశేషకల్మాషమీష
జ్జృంభోద్భూతేన పింగం సరసిజరజసా సంధ్యయా శోణశోచిః |
ప్రాతః ప్రారంభకాలే సకలమివ జగచ్చిత్రమున్మీలయన్తీ
కాన్తిస్తీక్ష్ణత్విషో2క్ష్ణాం ముదముపనయతాత్తూలికే వాతులాం వః ||

(అదుగో! పొన్నపువ్వు ఛాయలో పొద్దుపొడుస్తూంటే చల్లని వెన్నెల తెల్లదనం వ్యాపిస్తూంది. తిమిరరమణి మషీశేషపు నల్లదనం ఆమె పట్టు వల్లెవాటు చెరగు వలె భాసిస్తున్నది. అరవిందసుమాలు పుప్పొడి విరజిమ్ముతూ పచ్చగా మెరుస్తున్నాయి. పుడమితల్లి ఉభయసంధ్యల్లోని ఎఱుపు రంగు గ్రహించి శోభనంగా వెలిగిపోతున్నది. చిత్రభానుని కుంచె నుండి ప్రపంచచిత్రం అందంగా రూపుదిద్దుకుంటూంది)
– కవితాకన్యక కర్ణాభరణం మయూరకవి సూర్యశతకం – ౨౬

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

2 Responses to శారదా విజయోల్లాసము

  1. అమ్మంటే ఎవరో తెలుసా..!
    **

    ‘అమ్మా! ఆకలీ’ అని నోరారా పిలవాలే కానీ,
    అమ్మ కైనా, గుడిలో బొమ్మకైనా గుండె కదలి పోదూ!
    నువ్వు వాకిట నిలబడి చేతుల జోలె సాచి అర్థిస్తే
    వచ్చింది శివుడైనా, శిశువైనా..గడప దాటి పరుగున రాదూ!

    ఆలయం లో అఖిల భువన సాక్షి
    నీ ఆకలెరిగి అన్నపూర్ణ గా మారింది
    ముల్లోకాల తల్లి – నీ ముంగిట్లో అమ్మయి నిలిచింది.

    ఆమ్మంటే ఆది శక్తి..
    ఆమ్మంటే అమృతమయి.
    గుళ్ళోనే కాదు, ఇంట్లోనూ అని చెప్పింది.

    -ఆర్.దమయంతి

Comments are closed.